Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#5
క్రోనస్ పతనం


మొదటి తరం టైటనులలో క్రోనస్ కడసారం. క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు. అలా పుట్టుకొచ్చిన వారిలో ఏఫ్రడిటి (Aphrodite) ఒకామె. ఈ సౌందర్యవతి లైంగిక ప్రేమకి చిహ్నం.

[Image: kronus.jpg]

క్రోనస్
అంగవిహీనుడైన యూరెనస్ భూమిని వదలిపోతూ తనకి చేసిన అవమానానికి క్రోనస్ ప్రతిఫలం అనుభవిస్తాడనిన్నీ, తనకి జరిగినట్లే క్రోనస్‌కి అతని పిల్లల చేతిలోనే ప్రతీకారం జరుగుతుందనిన్నీ శపిస్తాడు. తండ్రిని పదవీభ్రష్టుడిని చేసి రాజ్యం నుండి బహిష్కరించిన తరువాత క్రోనస్ సైక్లాపులని, హెకటాంకీర్‌లని టార్టరస్‌లో బంధిస్తాడు. క్రోనస్ తన తండ్రిని తరిమేసిన తరువాత తన యొక్క సోదరి అయిన రియాని జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు. క్రోనస్-రియాలకి పుట్టిన సంతానంలో ముగ్గురు మగ, ముగ్గురు ఆడ.
మగ వారు: హేడెస్ (Haydes), పొసైడన్ (Poseidon), జూస్ (Zeus).
ఆడ వారు: హెస్టియా (Hestia), డిమిటర్ (Demeter), హేరా (Hera).

హేడెస్ పాతాళానికి, పొసైడన్ సముద్రాలకి, జూస్ ఆకాశానికి అధిపతులు అవుతారు. జూస్ దేవలోకానికి అంతటికి పాలకుడుగా చెలామణి అవుతాడు. ఇతర టైటనులు అతని సభికులుగా అవుతారు. తండ్రి యూరెనస్ ఇచ్చిన శాపం పదేపదే గుర్తుకి రాగా, రియాకి పుట్టిన పిల్లల్ని పుట్టిన వెంటనే క్రోనస్ కబళించడం మొదలు పెడతాడు. అప్పుడు రియా తన కడసారపు కొడుకు జూస్‌ని ఒక పన్నాగం పన్ని రక్షిస్తుంది.
చాలమంది స్త్రీలతో సంపర్కం ఉండడం వల్ల క్రోనస్‌కి చాలమంది పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి క్రోనస్‌కి సముద్రపు జలకన్య ఫిలిరాకి పుట్టిన కుమారుడు ఖైరన్ (Chiron). బొమ్మలలో ఖైరన్‌ని నరాశ్వంగా (centaur) చిత్రిస్తారు; అనగా ముందు భాగం మనిషి ఆకారంలోను, పృష్ఠ భాగం గుర్రం ఆకారంలోనూ ఉండే నాలుగు కాళ్ళ శాల్తీ.
(సశేషం)

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:19 PM



Users browsing this thread: 2 Guest(s)