Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#4
రెండవ తరం టైటనులు

[Image: hecat.jpg]

హెకటాంకీర్‌లు
పురుషుని సహాయం లేకుండా గాయా, ఆకాశానికి అధిపతి అయిన యూరెనస్‌కి (Uranus) జన్మనిచ్చింది, అప్పుడు అతను ఆమెని ఫలవంతురాలిని చేశాడు. వారి కలయిక నుండి మొదట టైటనులు (కాసింత రాక్షస అంశ ఉన్నవారులా అనిపిస్తారు కానీ వీరిని ‘టైటన్ దేవగణాలు’ అనే అంటారు) జన్మించారు. తరువాత ఒంటికన్నుతో ఉండే సైక్లాపులు (Cyclops) ముగ్గురు పుట్టేరు. తరువాత అందవికారంగా, ఏభయ్ తలలు, వందేసి చేతులతో, హెకటాంకీర్‌లు (Hecatonchieres) అనే శతబాహులు ముగ్గురు పుట్టేరు. వారి పేర్లు ప్రస్తుతానికి అనవసరం.
అందవికారంగా ఒంటికన్నుతో ఉన్న సైక్లాపులని, వందేసి చేతులు ఉన్న హెకటాంకీర్‌లని చూసి యూరెనస్ అసహ్యించుకుని వారిని తిరిగి తల్లి గాయా (అనగా భూదేవి) గర్భకుహరం లోకి (అనగా పాతాళం లోకి) తోసేసేడు. ఈ అమానుషచర్యకి కడు దుఃఖపడి ప్రతీకారం కోసం గాయా ఒక కొడవలిని తయారు చేసి, అదను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సైక్లాపులు, హెకటాంకీర్‌లు జన్మించిన తరువాత ఇంక రాక్షస ఆకారాలు ఉన్న పిల్లలు పుట్టకుండా గాయా-యూరెనస్‌లు విడిపోయారు.

యూరెనస్-గాయాల కలయిక వల్ల పుట్టిన పన్నెండుమంది టైటనులలో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ.
మగవారు: 1. ఓషనస్ (Oceanus-సముద్రాలకి అధిపతి), 2. హైపిరియన్ (Hyperion-కాంతికి అధిపతి), 3. కీయస్ లేదా కోయస్ (Coeus-బుద్ధి, దూరదృష్టికి అధిపతి), 4. క్రియస్ (Creus-గగన వీధిలోని నక్షత్ర రాసులకి అధిపతి), 5. క్రోనస్ (Cronus-కాలానికి అధిపతి), 6. ఇయపిటస్ (Iapitus-నీతికి అధిపతి).

ఆడవారు: 1. టెథిస్ (Tethys-మంచినీటికి అధిపత్ని), 2. థియా (Theia-దృష్టికి అధిపత్ని), 3. నెమోసీన్ (Mnemosyne-జ్ఞాపక శక్తికి అధిపత్ని), 4. ఫీబీ (Phoebe-వర్చస్సుకి అధిపత్ని), 5. రెయా (Rhea-మాతృత్వానికి అధిపత్ని), 6. థెమిస్ (Themis-ధర్మదేవత లేదా చట్టబద్ధతకి అధిపత్ని).

ఈ టైటన్ దేవతల గురించి తరువాత సావధానంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కొన్ని ఆసక్తికరమైన చిల్లర విషయాలని చూద్దాం. (ఇక్కడ ఏకోదరుల మధ్య వివాహాలు గమనించండి.)
-సముద్రపు జంట అయిన ఓషనస్‌కీ టెథిస్‌కీ అనేకమంది జలదేవతలు పుట్టేరు.
-ఆకాశపు జంట అయిన హైపిరియన్‌కీ థియాకీ పుట్టిన పిల్లలలో హీలియోస్ (Helios-సూర్యుడు), సెలీన్ (Celine-చంద్రుడు) ముఖ్యులు.
-భూ జంట అయిన క్రోనస్‌కీ రేయాకీ పుట్టిన పిల్లలే టైటనులు.

-ఇయపిటస్‌కి పుట్టిన పిల్లలలో చాలా మందిని మనం గుర్తించగలం: 1. ఏట్లస్ (Atlas) నిరంతరం భూమిని భుజాల మీద మోసే శాల్తీ; 2. ప్రొమిథియస్ (Prometheus) మనుష్యుల పుట్టుకకి కారకుడు; 3. ఎపిమిథియస్ (Epimetheus) మొట్టమొదటి మానవ స్త్రీ పెండోరాని (Pandora) జూస్ (Zeus) ఆజ్ఞానుసారం తయారు చేసేడు.
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:18 PM



Users browsing this thread: 2 Guest(s)