Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవత : so స్వీట్ ఆఫ్ యు చిల్డ్రన్స్ బై బై ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తూ వెనుకే బయటకు వెళ్లిపోతున్నారు .
ఆ ఫ్లైయింగ్ కిస్సెస్ క్యాచ్ పట్టుకుని , మేడం ........ నాకు బై చెప్పరా ? , ok ok sorry sorry మేడం -మనం ఇంకా మన స్టాప్ వరకూ బస్ లో కూడా ప్రయాణించబోతున్నాము కదా , అందుకే బై చెప్పలేదన్నమాట ..........
దేవత : నిన్నూ ........ ప్చ్ మళ్ళీనా అంటూ కోపంతో బయటకు నేరుగా స్టాఫ్ రూంలోకి వెళ్లి , బుక్స్ - లంచ్ బ్యాగ్ అందుకుని మేడమ్స్ తోపాటు మాట్లాడుకుంటూ బయటకు నడిచారు . 
దేవత వెనుకే నడుస్తూ ........ అవునూ ఇంతకూ నాలానే ఉండే నా దేవత లంచ్ బ్యాగ్ ఎక్కడ ? , పెద్దమ్మా ....... మీకేమైనా తెలుసా ? అని మొబైల్ తీసాను - నాకైతే హెడ్ మాస్టర్ మీదనే డౌట్ ......

మెసేజ్ రావడంతో చూసాను - " మహేష్ ....... కొద్దిసేపటి ముందు నువ్వు చూశావు బాగా ఆలోచించు - నాకు తెలుసు నువ్వు కనిపెడతావు - సమయం లేదు త్వరగా నీ దేవత బస్ స్టాప్ కు వెళ్లిపోతోంది - అయినా నువ్వు బస్ స్టాప్ కు వచ్చేన్తవరకూ బస్ రాదులే ......... హ హ హ " .
Wow థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ........ , లంచ్ బ్యాగుని నేను చూశానా? ఎక్కడ ఎక్కడ అంటూ కళ్ళుమూసుకుని ఎక్కెక్కడికి వెల్లానో నెమరువేసుకున్నాను . స్టాఫ్రూమ్ - క్లాస్సెస్ - లైబ్రరీ ........ హెడ్ మాస్టర్ రూమ్ yes yes చాక్ పీస్ తీసుకునేటప్పుడు వాటి వెనుక నా దేవత లంచ్ బ్యాగును చూసాను అని పరుగునవెళ్ళాను .
చుట్టూ మరియు లోపల ఎవ్వరూ లేకపోవడం ( అయినా ఎలా ఉంటారు పెద్దమ్మ మేనేజ్ చేసి ఉంటారు ) చూసి వెళ్లి , హెడ్ మాస్టర్ మూలన దాచిన లంచ్ బ్యాగుని అందుకుని నా దేవతకు చెప్పడానికి వెళ్లబోయి ఆగిపోయాను - ఈ విషయం తెలిస్తే నన్నుకొట్టారని బాధపడతారు , దేవత బాధపడితే నేను - పెద్దమ్మ కూడా తట్టుకోలేము కాబట్టి ఈ రహస్యం నాలోనే దాచేసుకుంటాను అని లంచ్ బ్యాగును నా స్కూల్ బ్యాగులో ఉంచేసుకుని , నా దేవత లంచ్ బ్యాగ్ దొంగతనం చేసినందుకు గానూ హెడ్ మాస్టర్ పై కోపంతో టేబుల్ పై ఉన్నవన్నింటినీ కంప్యూటర్ తో సహా కిందకు పడేసి ఎవ్వరూ చూడకుండా బయట రెండువైపులా చూసి నవ్వుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకున్నాను .

ఫ్రెండ్స్ అందరూ మురళివైపు ఒకరకంగా చూస్తున్నారు . 
మురళికి విషయం అర్థమై అవునురా నా సగం హోమ్ వర్క్ మహేష్ గాడే చేస్తున్నాడు - ఇక ఈ విషయం గురించి మాట్లాడకూడదంటే నేనేమి చెయ్యాలి చెప్పండి - ఇకనుండీ నా హోమ్ వర్క్ మొత్తం నేనే చేసుకుంటాను .
ఫ్రెండ్స్ : ఏ విషయాలైనా మా పేరెంట్స్ కు చెబుతానని మమ్మల్ని బెదిరించకూడదు - వారు అడిగినా అంతా ok అని చెప్పాలి - మనం మనం ఫ్రెండ్స్ మనమధ్యలో ఏమిజరిగినా మనమే పరిష్కరించుకోవాలి - దానికి ok అంటే హోమ్ వర్క్ గురించి మాట్లాడము .
మురళి : ఇక్కడే కాదు మన ఇంటి దగ్గరకూడా మాట్లాడకూడదు . 
ఫ్రెండ్స్ : డన్ డన్ ....... , యాహూ ...... అంటూ మురళిని ఆ వెంటనే నన్ను కౌగిలించుకుని , ఇక మన ఇష్టం అని సంతోషించారు .
మురళి కోపంతో వచ్చి నాలా రాయమంటే రెండింటిలో నీలా రాశావు - అటూ ఇటూ అయి ఉంటే క్లాస్ లో నా పరువు పోయేది - దొరికినందుకు గానూ ఈరోజు కూడా బస్ లోనే రమ్మని చెప్పాడు .
ఫ్రెండ్స్ : మురళీ .........
ఫ్రెండ్స్ - మురళీ సర్ ........ బస్ లో రావడం నాకు ఇష్టమే , మీరు హ్యాపీగా వెళ్ళండి - అన్నయ్యా ....... జాగ్రత్తగా తీసుకెళ్లండి డ్రైవర్స్ కు చెప్పాను .
వినయ్ : మహేష్ ....... కనీసం బ్యాగ్ అయినా ఇవ్వు తీసుకొస్తాము .
మురళి : నో నో నో బ్యాగును మోస్తూ రావాలి అదే పనిష్మెంట్ అని కారులో కూర్చున్నాడు .
ఫ్రెండ్స్ చెప్పానుకదా soooo హ్యాపీ అని మీరు వెళ్ళండి వెళ్ళండి , బస్ సమయానికి వస్తే మీకంటే ముందుగా చేరుతానేమో అని నవ్వించి పంపించాను . మురళి శిక్ష విధించినా నాకు వరంలా మారుతుంది అని మరొకసారి ప్రూవ్ అయ్యింది అంటూ నవ్వుకుంటూ బస్ స్టాప్ చేరుకున్నాను . 

నా దేవతతోపాటు కొంతమంది 15 నిమిషాలకు పైనే వేచి చూస్తున్నట్లు రోడ్ వైపు బస్ కోసం ఆశతో చూస్తున్నారు .
Sorry మేడం ......... , అంటీ అంకుల్స్ ........ నేను వచ్చేసాను కదా 5 లెక్కపెట్టేంతలోపు మన బస్ వచ్చేస్తుంది అని దేవత ప్రక్కన చేరాను .
దేవత : నో వే ........
అయితే మీరే లెక్కపెట్టండి మేడం .........
దేవత : నో .........
అయితే మీరు లెక్కపెట్టేంతవరకూ బస్ రానే రాదు - చీకటి పడినా రాదు , అర్ధరాత్రైనా రాదు . మా మేడం మీరు ఉండగా నాకేమీ భయం లేదు ఇక్కడే కూర్చుంటాను అని బస్ స్టాప్ బెంచ్ పై కూర్చున్నాను .

చుట్టూ ఉన్న వారంతా నవ్వుకున్నారు - మరొక నిమిషంలో కౌంట్ చేయకపోయినా బస్ వస్తుంది . 
నా దేవత మాత్రం నావైపు కన్నింగ్ గా చూస్తున్నారు - కాన్ఫిడెంట్ కనిపిస్తోంది కానీ ఓవర్ కాన్ఫిడెంట్ కనిపించడం లేదే అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తూనే ఉంది .
మేడం ....... త్వరగా కౌంట్ చేశారంటే బస్ వచ్చేస్తుంది ఇంటికి వెళ్లిపోవచ్చు మీ ఇష్టం ..........
పిల్లకాకి - బచ్చా - పిల్లాడి ........ మాటలు వినడం ఏమిటి ఎవ్వరూ కౌంట్ చెయ్యకండి కొద్దిసేపట్లో బస్ వచ్చేస్తుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క నామకరణం చేశారు . 

నెక్స్ట్ 15 మినిట్స్ అయినా బస్ జాడ లేకపోవడంతో నిజమేనా అన్నట్లు అందరూ నావైపు చూస్తున్నారు .
నే చెప్పలే ...... చెప్పలే ...... అన్నట్లు expression ఇచ్చాను . అంకుల్స్ ........ మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత ఆలస్యం అవుతుంది మీ ఇష్టం ........ - మేడం ...... మీరు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి , పాపం మీ ప్రాణమైన బామ్మగారు ఎదురుచూస్తుంటారు.
మరొక 5 మినిట్స్ అయినా బస్ రాకపోవడంతో ........ మేడం మేడం పిల్లాడి మాటలు నిజమైనా కాకపోయినా కౌంట్ చేస్తే పోయేదేముంది please please అంటూ బ్రతిమాలుతున్నారు .
వద్దు అని బెట్టు చేసినవాళ్లే బ్రతిమాలుకోవడం చూసి నా దేవత ముసిముసినవ్వులు నవ్వుకుని , ok ok నాకు కూడా ఇంటికి చేరాలని ఆశగా ఉంది 5 4 3 2 1 ......... 
బస్ హార్న్ వినిపించడంతో అందరూ షాక్ చెందినట్లు నావైపు చూస్తున్నారు - బస్ వచ్చినా కదలకుండా ఉండిపోయారు .
మేడం ....... మొదట ఎక్కి ఇష్టమైన సీట్లో దర్జాగా కూర్చోండి వెళ్ళండి వెళ్ళండి ....
మేడం : ఎలా అన్నట్లు నాకొక దండం పెట్టి షాక్ లోనే బస్ ఎక్కారు .
నవ్వుకుని అంటీ - అంకుల్స్ - బ్రదర్స్ ....... ఇంకా ఎంతసేపు షాక్ లో ఉంటారు బస్ వెళ్లిపోయేలా ఉంది .
అంతే హడావిడిగా బస్ ఎక్కారు . చివరగా నేను ఎక్కాను .
నువ్వు చెప్పినదే జరిగింది బాబూ - ముందే విని ఉంటే బాగుండేది అని దారిని వదిలారు . నవ్వుకుంటూ వెళ్లి కూర్చున్న మేడం ప్రక్కనే నిలబడి రైట్ రైట్ అనడంతో బస్ కదలడం చూసి మళ్లీ ఆశ్చర్యంగా చూసారు నా దేవత .........

ఒక అంటీ : బాబూ ....... మీ మేడం ప్రక్కన సీట్ ఖాలీనే కదా కూర్చో , బ్యాగు ఎంత బరువుందో ఏమో ........
అంటీ అదీ లేడీస్ సీ ........
మేడం : హలో హలో హీరోగారూ ........ మీ హ్యుమానిటీ మళ్లీ మొదటి నుండి మొదలెట్టకండి - నన్ను అందరూ తిట్టుకోకముందే కూర్చోండి అదే దగ్గరకు జరిగే కూర్చోండి అని చివరకు జరిగారు .
Yes యాహూ ....... అంటూ లోలోపలే ఆనందంతో మురిసిపోతూ కూర్చున్నాను .
మేడం : దెబ్బలు కొట్టాను - పనిష్మెంట్ ఇచ్చాను అయినా ఈ అల్లరి తగ్గించవా .......
Sorry మేడం మళ్లీ చెయ్యను .
మేడం : సరిపోయింది ఉదయం నుండీ sorry అంటూ ఇదే చెబుతున్నావు , నెక్స్ట్ మినిట్ నుండీ మళ్లీ అదే అల్లరి చేస్తున్నావు - ఎంత కోపం వేసిందోతెలుసా ఇక లైబ్రరీ దగ్గర అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను , వెళ్లిపోయావు కాబట్టి కూల్ అయ్యాను లేకపోతే పెద్ద పనిష్మెంట్ ఇచ్చేదానిని .........
ప్చ్ ........ పెద్ద పనిష్మెంట్ మిస్ అయ్యానే , బుద్ధిలేదురా నీకు మహేష్ గా ,దెబ్బలు పడాలి నీకు అంటూ లెంపలేసుకున్నాను .
మేడం : ఇదిగో ఇలానే కోపం తెప్పిస్తావు - స్టాప్ వచ్చేన్తవరకూ నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంటూ అటువైపుకు తిరిగారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-09-2021, 09:54 AM



Users browsing this thread: 2 Guest(s)