Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిపాపాయికి ఎండ వేడి తగలకుండా ఏర్పాట్లుచేసుకుని ఎత్తుకున్నాను - డ్రైవర్ కు పైకివెల్లమని చెప్పాను .
చెల్లి : అన్నయ్యా ....... సూర్యరశ్మి తగలడం మంచిదేలే , ఇంత ప్రాణంలా చూసుకునే మావయ్య ఉండటం దాని అదృష్టం అని ఆనందించారు .
బుజ్జిపాపాయీ ....... మీ అమ్మలు - అమ్మమ్మ చెప్పినట్లు నీకు ఎండ ఇష్టమేనా ? - బుజ్జిబుజ్జినవ్వులతో కాళ్ళూచేతులు కదిలించడం చూసి చెల్లెమ్మలూ ఇష్టమేనట అంటూ ముద్దుచేసాను - కొండల్లో జంతువులు చాలానే ఉన్నాయి - ఎంజాయ్ చేస్తూ వెళదాము - పాలు కావాల్సివచ్చినప్పుడు నా వెంట్రుకలను గట్టిగా లాగేయ్యి సరేనా .........
లవ్ యు అన్నయ్యా - అన్నయ్యా అంటూ అమ్మతోపాటు తొలిమెట్టును తాకి మొక్కుకోవడం చూసి , మా కోరిక తీరాలని మొక్కుకుని బుజ్జిపాపాయి బుజ్జిచేతిని మెట్టుకు తాకించి కాలినడక ప్రారంభించాము .

అక్కడ స్కూల్ పిల్లలతోపాటు ఎంజాయ్ చేస్తూ బుజ్జాయిలు బాబు పిల్లలు బుజ్జితల్లులు జూ చేరుకున్నారు - మా బుస్సులోనుండి కేవలం కృష్ణగాడు మాత్రమే దిగి ఫాలో అవుతుండటం చూసి అనుమానం కలిగి నేరుగా వెళ్లి అడిగారు .
కృష్ణగాడు : బస్సులో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు .
బుజ్జితల్లి : అమ్మమ్మా - అమ్మలు కూడానా ....... అంకుల్ ? .
కృష్ణ : అదీ అదీ ..........
బుజ్జితల్లి : అంటే ఏదో కష్టమైన పనిమీదనే వెళ్లారు ........
కృష్ణ : కష్టమైనది కాదు బుజ్జితల్లులూ ....... , ఇష్టమైన మొక్కు తీర్చుకోవడానికి ఏడుకొండలూ కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు .
బుజ్జితల్లులు : అంకుల్ ....... మేమూ ఇష్టంతో మా అమ్మలకోసం డాడీ తోపాటు ....... - అప్పుడు ఆ దేవుడు మరింత త్వరగా కరుణించేవారు కదా ........
కృష్ణ : నిజమే బుజ్జితల్లులూ ........ , మీ డాడీ ....... మీరు చెప్పినట్లుగా కూడా ఆలోచించారు - మీరుకూడా కాలినడక సాగిస్తే సాయంత్రానికి బుజ్జిపాదాలు నొప్పివేస్తాయి , ఆ వెనుకే జ్వరం వస్తుంది , అప్పుడు అమ్మలందరూ బాధపడతారు మరియు మీరు మీ క్లాస్మేట్స్ తోపాటు ఇలా ఎంజాయ్ చేయలేరని ముందుగానే ఆలోచించి తప్పని పరిస్థితులలో ఇలా చేశారు - అయినా మీ డాడీ మొక్కు తీర్చుకుంటే మీరు తీర్చుకున్నట్లు కాదా చెప్పండి - మీ బుజ్జిమనసు మీ డాడీ తోకూడా ఉంటుందిలే నాకు తెలుసు - మీరు టూర్ ఎంత ఎంజాయ్ చేస్తే మీ డాడీ , అమ్మలు అంత సంతోషిస్తారు కదా .......
బుజ్జితల్లులు : సరే అంకుల్ ........ , అంకుల్ మనం బస్సులో కొండపైకి చేరుకునేసరికి డాడీ వాళ్ళు ........
కృష్ణ : మనకంటే ముందుగానే ఉంటారు బుజ్జితల్లులూ ........ , బుజ్జిపాపాయి ఈ జంతువులను చూసి ఆనందించేది అని ఫీల్ అవుతారేమో - కాలినడక స్టెప్స్ కు ఇరువైపులా ఇక్కడున్న జంతువులన్నీ వస్తూ పోతూ ఉంటాయి - మీరు ఇక్కడున్న జంతువులకు ఫుడ్ వెయ్యండి , మన బుజ్జిపాపాయి అక్కడ కనిపించే జంతువులకు ఫుడ్ అందిస్తుంది .
అందరూ : wow సూపర్ అంకుల్ ....... అంటూ సంతోషంతో తమ తమ ఫ్రెండ్స్ ను చేరుకుని జంతువులను వీక్షిస్తూ , కృష్ణగాడు తెచ్చిఇస్తున్న ఫుడ్ వేస్తూ తినగానే చిందులువేస్తున్నారు .

ఇక్కడ అమ్మా - చెల్లెమ్మలు ....... మా అందరి ఏకైక స్వచ్ఛమైన కోరిక తీరాలని ప్రార్థిస్తూ ఒక్కొక్క మెట్టే భక్తితో ఎక్కుతున్నారు , భక్తితో మొక్కును ఎంత త్వరగా  తీర్చుకుంటే అంత త్వరగా మా కోరిక తీరుతుందని అమ్మా - చెల్లెమ్మలు ఒక్కదగ్గర కూడా ఆగి రెస్ట్ తీసుకోకుండా మెత్తుమెత్తుకూ మరింత ఉత్సాహం - భక్తితో ముందుకువెళుతున్నారు . 
వెనుకే బుజ్జిపాపాయికి జింకలను చూయిస్తూ బుజ్జిచేతితో తాకించి నవ్విస్తూ ఫుడ్ వేస్తూ ....... , మధ్యమధ్యలో అమ్మా - చెల్లెమ్మలకు వాటర్ బాటిల్స్ తెచ్చి అందిస్తూ లంచ్ సమయానికి ఏడుకొండల పైకి చేరుకున్నాము .

అక్కడ మేడం గారు - టీచర్స్ ....... జూ తోపాటు మరికొన్ని ప్రదేశాలను పిల్లలకు చూయించాలని ప్లాన్స్ వేసుకున్నా , పిల్లలు తమకిష్టమైన జూ వదిలి వస్తారా చెప్పండి - దర్శన సమయం దగ్గరపడటంతో పిల్లలను జూ నుండి బయటకు తీసుకురావడానికి తలప్రాణం దిగివచ్చి మేడం - స్టాఫ్ నవ్వుకున్నారు . 
మేడం గారు : కృష్ణా ....... వంటవాళ్లకు వంట చెయ్యడానికి సమయం సరిపోదంటున్నారు .
కృష్ణ : మేడం ....... ఎలానో పిల్లలు ఫ్రెష్ అవ్వాలికదా , హోటల్ కు వెళ్లి అక్కడే డిన్నర్ చేసేసి కొండపైకి చేరుకుందాము .
మేడం గారు :థాంక్యూ sooooo మచ్ కృష్ణా ........
కృష్ణ : అక్కడితో ఆపేయ్యండి మేడం గారూ ....... , మీరు థాంక్స్ చెప్పారని మహేష్ కు తెలిస్తే నా వీపు విమానం మ్రోగుతుంది , సమయానికి చేరికోవాలి కదా పిల్లలూ కమాన్ కమాన్ బస్సెస్ ఎక్కండి .
పిల్లలతోపాటు బుజ్జితల్లులు బుజ్జాయిలు ఎక్కారు .
మేడం గారు : మేము చెయ్యాల్సినవన్నీ మీరే చేసేస్తున్నారు .......థాంక్ 
కృష్ణ : మళ్ళీనా అమ్మో ఎలాగో మహేష్ లేడు కాబట్టి సరిపోయింది అని వీపు తడుముకున్నాడు .
మేడం గారు : నవ్వుకున్నారు - కృష్ణా ....... మనం వెళ్ళేటప్పటికి మహేష్ - అమ్మ - చెల్లెమ్మలు అక్కడ ఉంటారుకదూ ......
కృష్ణ : ఖచ్చితంగా ఉంటారు మేడం ....... వెళదాము అంటూ హోటల్ చేరుకుని పిల్లలు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేశాక బస్సులో బయలుదేరారు . 
టీచర్స్ ....... కొండకు ఇరువైపులా చూయిస్తూ గొప్పతనాన్ని - భక్తిని వివరిస్తుంటే పిల్లలందరూ శ్రద్ధగా వింటూ పచ్చదనాన్ని అక్కడక్కడా దూరంగా కనిపిస్తున్న జంతువులను చూసి సంతోషంతో కేకలివేస్తూ పైకి చేరుకున్నారు .

బస్సు దిగగానే ఎదురుగా కనిపించడంతో డాడీ - అమ్మలూ - అమ్మమ్మా ........ అంటూ పరుగునవచ్చి గుండెలపైకి చేరారు .
బుజ్జితల్లులు : అమ్మమ్మ బుంగమూతిపెట్టేలోపు మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టేస్తాము అని నవ్వుకున్నాము .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ........ , మీ కోపం చల్లారేదాకా మీ ఇష్టం అంటూ చేతులను విశాలంగా చాపాను .
బుజ్జితల్లులు : మా డాడీ మొక్కు తీర్చుకుంటే మేము తీర్చుకున్నట్లే కదా డాడీ అంటూ నా చేతులను వారి చుట్టూ వేసుకుని ముద్దులుపెట్టారు .
కృష్ణగాడివైపు చూసి లవ్ యు రా అంటూ సైగలుచేసాను .
కృష్ణ : గుండెలపై చేతినివేసుకుని నవ్వుకున్నాడు .
అమ్మ : బుజ్జితల్లులూ ....... నా పర్మిషన్ లేకుండా ........
బుజ్జితల్లులు : డాడీ నే వదలడం లేదు అమ్మమ్మా చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నారో కౌగిలిలో ....... , డాడీ వదులుతారా లేదా అంటూ బుగ్గలపై కొరికేసి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి చెల్లెమ్మల కౌగిలిలోకి చేరారు . 

కృష్ణ : కమాన్ కమాన్ పిల్లలూ ...... అందరూ ఒక్కదగ్గరే ఉండండి దర్శనానికి వరుసలో వెళ్ళాలి .
రేయ్ ఇంకా సమయం ఉందికదరా ........
కృష్ణ : నాకోసం please please ఎందుకన్నది తరువాత చెబుతాను రేయ్ - మేడం గారూ వెళదాము .........
సరే అంటూ పిల్లలందరినీ జాగ్రత్తగా కంపార్టుమెంట్ కు తీసుకెళ్లాము . మా టికెట్స్ - చిన్న చిన్న పిల్లలను చూసి రష్ తక్కువగా ఉండటం వలన నేరుగా లోపలికివదిలారు .

అందరమూ భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ వెళ్లి కనులారా స్వామివారి దర్శనం చేసుకున్నాము - ఆ క్షణం ఎంత సంతోషం వేసిందో చెప్పలేం - అమ్మ , చెల్లెమ్మలు , బుజ్జితల్లులు ....... అందరమూ అందరమూ కళ్ళుమూసుకుని ఒకే ఒక కోరిక కోరుకున్నాము . 
పిల్లల వలన ఎవ్వరికీ కలుగని అదృష్టం మాకు కలిగింది - సుమారు కొన్ని నిమిషాలపాటు స్వామివారి దర్శనంతో పరవశించిపోయాము . గోవిందా గోవింద అని జపిస్తూ బయటకువచ్చాము - పిల్లలందరూ ఇంటికి తీసుకెళ్లడానికి లడ్డూలు తీసుకున్నారు - దగ్గరుండి అందించాము .

కృష్ణ : స్వామి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ - పిల్లలూ - బాబు ........ ఆకలేస్తూ ఉంటుంది స్వామి ప్రసాధమైన ఈ లడ్డూలు తినండి .
అమ్మ : కృష్ణా ....... బుజ్జాయిలు లంచ్ చెయ్యలేదు కదూ ........
బుజ్జితల్లులూ ........
జాహ్నవి : అమ్మమ్మా - డాడీ మీరు చేశారా ? , మొక్కు తీర్చుకునేంతవరకూ మీరు తిని ఉండరని మాకు తెలుసు ........
కృష్ణ : అవును మహేష్ ....... , మొక్కు తీర్చుకుని దర్శనం చేసుకునేంతవరకూ డాడీ తోపాటు మేము కూడా తినము అన్నారు నాకేమి చెయ్యాలో తోచక అందుకే సమయానికి ముందే దర్శనానికి తీసుకెళ్ళాను .
లవ్ యు కృష్ణా అంటూ కౌగిలించుకున్నాను - అమ్మావాళ్ళు ........ బుజ్జాయిలందరికీ లడ్డూ తినిపించారు .
కృష్ణ : మహేష్ ........ , మన కోరిక తీరాలని మేడం గారు కూడా భోజనం చెయ్యలేదు .
మేడం గారూ - తల్లీ - అక్కయ్యా ..........
మేడం : ఈ పిలుపుల వలన నేనూ ...... మీలో ఒకరిని కదా , మా ఆక్కయ్యలు సంతోషంగా ఉండాలని నేనూ కోరుకుంటున్నాను - మొక్కు విషయం జూ వెళ్ళాక తెలిసింది లేకపోయుంటే నేనూ కాలినడకన వచ్చేదానిని - స్వామీ ....... నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మొక్కు తీర్చుకుంటాను - మా అక్కయ్యలను ...... అమ్మ , మహేష్ , పిల్లల దగ్గరికి చేర్చండి అని ప్రార్థించారు .
అమ్మా - చెల్లెమ్మలు ఆనందబాస్పాలతో వెళ్లి కౌగిలించుకుని లడ్డూ తినిపించారు . మేడం ....... అమ్మావాళ్లకు తినిపించారు - బుజ్జితల్లులు ...... నాకు - కృష్ణగాడికి తినిపించారు . 
చుట్టూ పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు .

టీచర్స్ : పిల్లలూ ....... చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటూ సాయంత్రం వరకూ మ్యూజియం - ఆకాశగంగా - పాపవినాశనం - టీటీడీ గార్డెన్స్ ........ చూయించి చీకటిపడేలోపు కిందకు తీసుకెళ్లారు . 
కింద తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ - ఇస్కాన్ చూసి హోటల్లో డిన్నర్ చేసి 10 గంటలకు బెంగళూరు ప్రయాణానికి చెక్ ఔట్ అయ్యి బయటకువచ్చాము .

పిల్లలందరూ తమ తమ బస్సెస్ ఎక్కి కూర్చున్నారు . అందరూ ఉన్నారని నిర్ధారించుకున్న తరువాత స్టూడెంట్స్ కు గుడ్ నైట్ చెప్పేసి మేడం గారు వారి పిల్లలతోపాటు మా దగ్గరికివచ్చారు . మహేష్ ....... మాతోపాటు మీరుకూడా పిల్లలను చూసుకుంటున్నారు కాబట్టి ఈ స్పెషల్ బస్ లో ఈ రాత్రికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను .
మనసారా స్వాగతం పలుకుతున్నాము మేడం .......
బుజ్జాయిలు - పిల్లలు - బాబు ........ సంతోషంతో తమ ఫ్రెండ్స్ అయిన మేడం పిల్లల చేతులను అందుకుని బస్ లోపలికి పిలుచుకునివెళ్లారు .
తల్లీ - అక్కయ్యా ....... రండి అంటూ అమ్మా - చెల్లెమ్మలు ప్రేమతో ఆహ్వానించారు .
మేడం మీరు స్టూడెంట్స్ గురించి ఏమాత్రం ఆలోచించకండి నేను - కృష్ణ వెళ్లి వాళ్లకు తోడుగా ఉంటాము - హ్యాపీగా జర్నీ చెయ్యండి .
కృష్ణ : మహేష్ ....... ఇద్దరం ఎందుకు ? , అయినా ఇక్కడ ఒక్కరైనా లేకపోతే ఎలా , నేను వెళతాను - నువ్వు బుజ్జాయిల దగ్గర ఉండు .
అయితే నేను వెళతానులే నువ్వు చెల్లెమ్మతో ఉండు - రేయ్ అధికాదురా నిన్న కూడా మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసి పాపం చేసాను ........
కృష్ణ : ఓహ్ దానిగురించి బాధపడుతున్నావా ...... ? , నేను చెప్పేది విను ఆ ప్లాన్ కూడా ఎప్పుడో లైన్లో ఉంది - బెంగళూరుకు 4 గంటల్లో చేరిపోతాము అంటే 2 గంటలకు బెంగళూరులోని లగ్జరీయస్ హోటల్లో నేను - నా దేవత అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాడు .
పక్కా ప్లాన్ లోనే ఉన్నావన్నమాట నవ్వుకుని ఒక్కొక్క బస్ లో ఎక్కాము - బస్సెస్ బయలుదేరాయి .

అప్పటికే మా బస్ ఎక్కిన మేడం గారు ఇది బస్సేనా లేక రోడ్ మీద వెళ్లే స్వర్గమా అంటూ మొత్తం రౌండ్ వేసివచ్చి అమ్మా - చెల్లెమ్మలూ ....... సూపర్ .......
చెల్లెమ్మలు : అక్కయ్యా ....... బస్ నచ్చిందన్నమాట .......
మేడం గారు : పిచ్చపిచ్చగా చెల్లెళ్ళూ ........ 
చెల్లెమ్మ : అక్కయ్యా ....... బస్ మనదే , ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యండి మరుక్షణంలో ఇంటి ముందు ఉంటుంది.
మేడం గారు : wow నిజమా మహేష్ .......
ఒక్కసారి కాదు మేడం గారూ ........ ఎన్నిసార్లైనా ఎక్కడికి వెళ్లాలన్నా at your సర్వీస్ ....... అని గుండెలపై చేతినివేసి చెప్పాను .
మేడం గారు : ఎందుకు మహేష్ , చేసిన చిన్న సహాయానికి నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు .
మీకిరువైపులా ఉన్న అమ్మ - చెల్లెమ్మలు - బుజ్జాయిల పెదాలపై ఇంత సంతోషమైన చిరునవ్వులు చూడటానికి ఎన్నాళ్ళు పడుతుందోనని లోలోపలే బాధపడేవాళ్ళం - మీ మంచి మనస్సు వలన అనతి కాలంలోనే చూడగలిగాను - ఇదిచాలదా మేము జీవితాంతం మీకు ఋణపడిపోయాము అని చెప్పడానికి ........
మేడం గారు ఉద్వేగానికి లోనయ్యి అమ్మ - చెల్లెమ్మలను కౌగిలించుకున్నారు .
చెల్లెమ్మ : అక్కయ్యా ....... మీ ఫెవరేట్ సీరియల్స్ ఉంటే చూద్దాము - నిద్రపోవాలంటే లోపలపడుకుందాము .
మేడం గారు : మన రెండు స్టేట్స్ లో ఫేవరేట్ సీరియల్ 7:30pm సీరియల్ కదా అని నవ్వుకున్నారు . నిన్నటిది - ఈరోజుది మొబైల్లో చూసి నిద్రపోదాము .
చెల్లెమ్మ : బస్సుల్లో The ఫాస్టెస్ట్ వైఫై సౌకర్యం ఉంది అక్కయ్యా ....... రండి కలిసి చూద్దాము అని వెనుక సోఫాలో కూర్చున్నారు . 
హమ్మయ్యా ....... బుజ్జితల్లులతో కూర్చోవచ్చు అని పిల్లిలా వెళ్లి మధ్యలో కూర్చున్నాను .
వెనకనుండి అమ్మ చూసి నవ్వుకున్నారు - బుజ్జాయిలు బాబు పిల్లలు కార్టూన్స్ చూస్తున్నారు - డాడీ డాడీ ....... అమ్మలు , పిన్నమ్మలకు గ్రూప్ వీడియో కాల్ చేద్దాము అని చెరొకవైపు నా చేతులను చుట్టేసారు - హిమగారిని కూడా తీసుకోబోతే బుజ్జితల్లులూ ప్రస్తుతానికి వద్దు అమ్మ ...... నన్ను తోసేసాక కాల్ లోకి తీసుకోండి .
బుజ్జితల్లులు : ఎందుకు డాడీ మా బుజ్జి అమ్మను దూరం పెడతారు - ఇబ్బంది పడతారు , అమ్మమ్మ చెప్పారుకదా బుజ్జిఅమ్మ కూడా మీ దేవతల్లో ఒకరు అని , సరే సరే మీ ఇష్టం ...... దేవతలు కనిపించగానే మనసు పులకించిపోతోంది - చిన్న వదిన మాత్రం కనిపించడం లేదు .
అడిగితే నిద్రపోతున్నారని చెప్పారు వదినమ్మ - వదినమ్మ కూడా అసౌకర్యంగా  నిమిషానికొకసారి కన్నీళ్లను తుడుచుకుంటున్నారు మాకు కనిపించకుండా ........
బుజ్జితల్లులు : అమ్మా ...... ఏమైంది - డాడీ ...... అమ్మ ఎందుకో బాధపడుతున్నారు అని నావైపు చూస్తే ఎప్పుడో నా కళ్ళల్లోనుండి కన్నీళ్లు కారుతుండటం చూసి డాడీ డాడీ అంటూ బుజ్జిచేతులతో తుడిచి ముద్దులుపెట్టారు.
బుజ్జితల్లుల మాటలకు అమ్మా - చెల్లెమ్మలు - మేడం గారు - పంకజం గారు కంగారుపడుతూ వచ్చి చూసి తల్లీ - అక్కయ్యా ....... ఏమైంది ఏమైంది అని కన్నీళ్ళతో అడిగారు .
అమ్మకు ముద్దులుపెట్టి ఓదార్చడానికి మనం లేము బుజ్జితల్లులూ ....... అని బుజ్జితల్లులను ప్రాణంలా హత్తుకున్నాను - మల్లీశ్వరి గారూ ...... ఏమైంది ? , ఆ మూర్ఖులు ఏమైనా .........
అదీ అదీ ........ అంటూ మల్లీశ్వరి గారి మాటలు వినిపించాయి - వీడియో కాల్ లో వదినలు కూడా బాధ - కంగారు పడుతున్నారు .
వదినమ్మ : మల్లీశ్వరీ ...... అలాంటిదేమీ బేబీ - బుజ్జితల్లులూ - చెల్లెళ్ళూ - అమ్మా ....... కళ్ళల్లో నలుసు పడింది , మల్లీశ్వరి తీస్తున్న సమయంలో కాల్ వచ్చింది అంతే అంతే చెప్పు మల్లీశ్వరీ చెప్పు ........
మల్లీశ్వరి గారు : అదీ మహేష్ సర్ ....... కొన్ని క్షణాల తరువాత అంతే అంతే మహేష్ సర్ ....... నలుసును గాలి ఉబుతూ తీస్తున్నానా ? - అందుకే కళ్ళల్లో కన్నీళ్లు ........
బుజ్జితల్లులు : అంటీ ....... నలుసును తీసేసారు కదా .......
మల్లీశ్వరి గారు : ఆ ఆ ఇప్పుడే తీసేసాను బుజ్జితల్లులూ ....... , ఇందూ మేడం గారికి - అధిచూసి సునీత మేడం గారికి చాలా నొప్పి కలిగింది అందుకే ఈ కన్నీళ్లు .........
వదినమ్మ : బుజ్జితల్లులూ ....... బేబీ ని - మిమ్మల్ని చూసానుకదా ఇప్పుడు నొప్పి పూర్తిగా మాయమైపోయింది అని చిరునవ్వులతో టూర్ విశేషాలు చెప్పమని టాపిక్ డైవర్ట్ చేసారు .

దేవతలతో మాట్లాడుతూ మాట్లాడుతూనే మొదట బుజ్జాయిలు - బుజ్జితల్లులు మా ఒడిలో - మేము సోఫాలలోనే నిద్రపోయాము .
మళ్లీ మెలకువ వచ్చినది కృష్ణ వచ్చి లేపి బెంగళూరు హోటల్ చేరుకున్నామని చెప్పడంతో ........ - నాతోపాటు బుజ్జితల్లులు కళ్ళుతెరిచి డాడీ డాడీ ....... అంటూ మరింత హత్తుకున్నారు - మాకు ....... మా డాడీ దగ్గరే నిద్రపోవాలని ఉంది .
అమ్మను మాయచేసైనా ........
కన్నయ్యా ....... వినిపించిందిలే , తథాస్తు అని వెనుక నుండి వెంట్రుకలపై ముద్దుపెట్టి , నవ్వుతూ బుజ్జాయిలను ఒక్కొక్కరిని ఎత్తుకుని కిందకుదిగారు .
బుజ్జితల్లులూ ....... మీ అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది మీరు లోపలికివెళ్లి మీ కిష్టమైన గదిని సెలెక్ట్ చేసుకోండి బుజ్జాయిలను మీ అమ్మల దగ్గరికి చేర్చి వచ్చేస్తాను అని మిగిలిన బుజ్జాయిలను ఎత్తుకుని అమ్మ గదిలోకి చేర్చాను .

మేడం గారు: మహేష్ ...... కొంతమంది పిల్లలు పాపం హాయిగా నిద్రపోతున్నారు - లేపడానికి మనసు రావడం లేదు . 
వన్ మినిట్ మేడం అంటూ కిందకువచ్చి కృష్ణ - డ్రైవర్స్ సహాయంతో ఇద్దరిద్దరినీ నెమ్మదిగా ఎత్తుకునివెళ్లి ఒక్కొక్క గదిలో ముగ్గురు నలుగురిని పడుకోబెట్టాము - చివరగా మేడం గారి పిల్లలను ఎత్తుకునివెళ్లి వారి గదిలో బెడ్ పై పడుకోబెట్టాను .
గుడ్ నైట్ చిల్డ్రన్స్ అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి వెనక్కు తిరిగాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ అంటూ మేడం గారు ఆనందబాస్పాలతో ఆరాధనతో చూస్తూ ఎందుకో తెలియదు దేనికో కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు గట్టిగా బిగించారు .
మేడం గారూ ....... ఇంకొక్కసారి థాంక్స్ చెబితే నాకు నేను లెంపలేసుకుంటాను అంతే ........
మేడం గారు ఒక్కసారిగా నవ్వేశారు .
మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి - అక్కడ బుజ్జితల్లులు వెయిటింగ్ ఆలస్యమైన ఒక్కక్క సెకనుకు ఒక్కొక్క దెబ్బ పెరుగుతుంది గుడ్ నైట్ ..........
మేడం గారు : గుడ్ నైట్ మహేష్ ....... అని సంతోషంతో చెప్పారు .

పరుగున బుజ్జితల్లుల గదిలోకి చేరుకున్నాను .
హమ్మయ్యా ......... వచ్చావా రెండు రోజులుగా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను అంటూ బుజ్జితల్లతోపాటు సోఫాలో కూర్చుని మాట్లాడుతున్న చెల్లిని అమాంతం ఎత్తుకుని సిగ్గుపడుతున్న చెల్లెమ్మ బుగ్గను కొరికేస్తూ బయటకు వెళ్ళిపోయాడు . 
బయట నుండి ఇద్దరి గుడ్ నైట్ లు వినిపించాయి .
బుజ్జితల్లులు ముసిముసినవ్వులతో లేచి నన్ను హత్తుకున్నారు . బెడ్ పైకి చేరి ఇద్దరి నుదుటిపై ముద్దులుపెడుతూ - వారి బుజ్జిచేతుల లాలనను ఆస్వాదిస్తూ ......
బుజ్జితల్లి : డాడీ ....... , అమ్మలకు మీరంటే - మీకు అమ్మలంటే అదే అదే మీ దేవతలంటే ఎందుకంత ఇష్టం ప్రేమ ప్రాణం ........ , ఇప్పటివరకూ మాకు చెప్పనేలేదు .
వదినమ్మ - వదినలు ...... నా దేవతలు అంటూ ఉత్సాహం తారాస్థాయికి చేరిపోయింది . వద్దులే నేను చెప్పినా - మీ అమ్మలు పిన్నమ్మలు చెప్పినా కాస్త ఓవర్ - బిల్డప్ అని అనుకోవచ్చు , మీ అమ్మమ్మ ఉందికదా దగ్గరుండి చూసింది - మీ అమ్మలు ....... నన్ను తనకంటే ప్రాణంలా చూసుకునేవాళ్ళని అసూయ చెందని రోజంటూ లేదు , రోజూ అలకలే ....... మీ అమ్మమ్మ చెబితేనే పసందుగా ఉంటుంది - మొదలెడితే రోజులైనా సరిపోవు , రేపు - మర్నాడు రెండు రోజులు బెంగళూరు మొత్తం తిరిగెయ్యాలంటే మీకు రెస్ట్ అవసరం సో హాయిగా నిద్రపోండి . మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యగా ఏదైనా సమయం మిగిలితే మీ అమ్మమ్మను చుట్టేయ్యండి - నాకు తెలిసి మీరు కోరిక కొరగానే నావైపు గుర్రుగా చూస్తారు .......
బుజ్జితల్లులు సంతోషంగా నవ్వుతూనే గుడ్ నైట్ చెప్పి నా గుండెలపై జోకొడుతూ నిద్రలోకి జారుకున్నారు .
గుడ్ నైట్ మై లవ్లీ ఏంజెల్స్ అంటూ ముద్దులుపెడుతున్న సెల్ఫీలు తీసుకుని దేవతలకు పంపించి నిద్రపోయాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:10 PM



Users browsing this thread: 8 Guest(s)