Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
రాత్రంతా నిద్రలోనే తెల్లవారుఘామునే వెళ్లి బుజ్జిదేవకన్యను చూడాలి బుజ్జిదేవకన్యను చూడాలి - ఫ్రెండ్స్ అందరినీ గ్రౌండ్ కు జాగింగ్ కు మరల్చి బామ్మ ఇంటిముందే తిష్ట వేసుకుని కూర్చోవాలి అని తలుచుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ కళ్ళ సౌందర్యానికి ఊహల్లో తేలిపోతున్నాను .
కిటికీలోనుండి వెలుతురు కళ్లపై పడుతున్నా బుజ్జిదేవకన్య ఊహల్లోనుండి బయటకు రావడం ఇష్టం లేక - జాగింగ్ టైం అయితే ఫ్రెండ్స్ కాల్ చేస్తారులే అనుకుని ముడుచుకుని పడుకున్నాను .

మహేష్ మహేష్ ........ టిఫిన్ తీసుకొచ్చాను అని పనిమనిషి అక్కయ్య పిలుపు వినిపించడంతో సడెన్ గా లేచి కూర్చున్నాను . గడియారం వైపు చూస్తే అప్పుడే 8 గంటలు అయ్యింది . అయ్యో ....... ఏంటి ఇలా జరిగింది - అక్కా ....... ఒక్క నిమిషం అని బుజ్జిదేవకన్య ఫోటోలను పెద్దమ్మ పేపర్ వెనుక దాచేసి డోర్ తెరిచాను.
అక్క : ఏంటి మహేష్ ....... రెండు రోజులు సెలవులు రావడం వలన ఆడుకుని ఆడుకుని బాగా అలసిపోయినట్లున్నారు - మురళి కూడా ఇప్పుడే లేచాడు - తొందరగా స్నానం - టిఫిన్ చేసి స్కూల్ కు రెడీ అయ్యి వచ్చెయ్యి లేకపోతే బస్ లో వెళ్ళాల్సివస్తుంది .

ప్చ్ ....... నిన్న మిస్ - ఇప్పుడూ మిస్ అవుతున్నాను , దున్నపోతులా నిద్రపోయావు కదరా ........ మంచి ఛాన్స్ కూడా మిస్ అయ్యింది - మురళి జాగింగ్ కు కూడా వచ్చేవాడు కాదు కాబట్టి నేరుగా బామ్మ ఇంటికి వెళ్ళిపోయి ఉండచ్చు దున్నపోతా దున్నపోతా అని మొట్టికాయలు వేసుకున్నాను - ఇప్పుడు వెళితే ఇక అంతే ........ అయితే ఇక సాయంత్రo వరకూ దివి నుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్యను చూడలేను . పెద్దమ్మా ....... మీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా దున్నపోతులా నిద్రపోతున్న నన్ను కొట్టయినా లేపి ఉండొచ్చు కదా ........
మెసేజ్ : హ హ హ ........ తెలుసు తెలుసు .
తెలిసినా లేపలేదంటే ........ ఇంతకుమించిన సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమోలే .........
మెసేజ్ : ఘటికుడివే మహేష్ ........ , నాపై చాలా నమ్మకంగా ఉన్నావు - చూద్దాము ఆ సర్ప్రైజ్ ఏమిటో - నా ప్రియమైన భక్తుడితోపాటు నేనూ ఆశతో ఎదురుచూస్తున్నాను .
చాలా చాలా నమ్మకం పెద్దమ్మా ........ , ఫోటోలను అందుకుని పెద్దమ్మా ........ నాకు తోడుగా ఉండకపోయినా పర్లేదు ఈ బుజ్జిదేవకన్య మరియు బామ్మకు ....... అవ్వలు - పిల్లల లానే ఎల్లప్పుడూ తోడుగా ఉండి సంతోషంగా ఉండేలా చూసుకోండి అని ప్రార్థించి ఫోటోలను పెద్దమ్మ ముందు ఉంచి స్నానం చేసివచ్చి - టిఫిన్ చేసి - స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను . పెద్దమ్మా ...... బుజ్జిదేవకన్యను చూడకుండా ఉండలేను ఫోటోలను స్కూల్ కు తీసుకెళతాను అని సిగ్గుపడుతూనే అందుకుని బ్యాగులో ఉంచుకుని కారు దగ్గరకు చేరుకున్నాను . మురళి మొదలుకుని ఫ్రెండ్స్ అందరూ వారి వారి కార్లలో రావడంతో బామ్మ ఇంటివైపు చూస్తూ స్కూల్ చేరుకున్నాము .

బ్యాగ్ భుజంపై వేసుకుని కిందకు దిగగానే మొబైల్ రింగ్ అయ్యింది , చూస్తే బామ్మ నుండి .........
కాస్త దూరంగా బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గరకువెళ్లి hi బామ్మా ....... గుడ్ మార్నింగ్ .
బామ్మ : బుజ్జిహీరో గుడ్ మార్నింగ్ , కానీ నీపై చాలా చాలా కోపంగా ఉన్నాను .
బామ్మా ....... ఏమైనా తప్పు చేశానా ..... ? , అయితే sorry sorry sorry ...... బోలెడన్ని sorry లు ........
బామ్మ : నవ్వుతున్నారు . ఇంత మంచోడివి కాబట్టే ఒక్కరోజులోనే అంత ఇష్టం నువ్వంటే ........ , కోపం ఎందుకో తెలుసుకోకుండానే అన్ని sorry లు ...... soooo క్యూట్ బుజ్జిహీరో ........ , కోపం ఎందుకంటే నువ్వు వస్తావని సూర్యోదయం ముందు నుండే తలుపులను పూర్తిగా తెరిచి వేచిచూస్తూ ఉన్నాను తెలుసా ........ , రాకపోగా ఒక్క కాల్ మెసేజ్ కూడా లేదు అందుకే చాలా చాలా కోపం అంటూ ముసిముసినవ్వులు వినిపిస్తున్నాయి .
అవునా బామ్మా ........ అయ్యో sorry sorry బామ్మా ........ ఎందుకు రాలేకపోయాను అంటే అదీ అదీ అదీ ........
బామ్మ : అర్థమైంది అర్థమైంది బుజ్జిహీరో ........ , నీ సిగ్గు ఇక్కడికి తెలుస్తోంది - నా బుజ్జితల్లి పరికిణీ ఫోటోతోపాటు " లంగావోణీ - బుజ్జిచీరలోని " ఫోటోలను చూసి రాత్రి ఊహల్లోకి వెళ్లిపోయావన్నమాట ....... ఆ మధురాతిమధురమైన మైకం నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది అని మళ్ళీ నవ్వుకుంటున్నారు .
Sorry బామ్మా ........ మీ బుజ్జితల్లిని ఊహల్లోకి తీసుకున్నానని కోపమా - నేను ఉదయం రాలేదని కోపమా .......
బామ్మ : ఉదయం రాలేనందుకు మహా కోపం .........
అంటే .........
బామ్మ : నిన్న రాత్రి స్వీట్ డ్రీమ్స్ అని విష్ చేసినదే నేనైతే , ఆ విషయం పై నాకిష్టమైన బుజ్జిహీరోను ఎందుకు కోప్పడతాను - నాకు ఇష్టమే ........
బామ్మా ....... ఒక్కరోజులోనే మీ ప్రాణమైన బుజ్జితల్లిని ......... నేను ..... ? ఎందుకు ? .
బామ్మ : వయసుమళ్లిన నేను కష్టపడుతుంటే చూసి చలించిపోయి సహాయం చేసావు - మా గురించి ఆలోచించి సరైన సమయానికి ఫుడ్ పంపి ఆకలి తీర్చావు - ప్రక్కనే ఉన్న బంగ్లా గురించి చెప్పడంలో మా కేరింగ్ గురించి బాధ్యత తీసుకున్నావు ....... ఇవి చాలదా నీకు ....... మేమంటే ఎంత ఇష్టమో చెప్పడానికి - నిన్ననే చెప్పాను కదా బుజ్జిహీరో సమయం వచ్చినప్పుడు మొదట నీకే చెబుతానని - నా ప్రాణమైన బుజ్జితల్లి కంటే ముందుగా నీకే ........ - అయినా పైన చెప్పినవన్నీ నాకోసం చేశావో లేక .........
బామ్మా ....... 
బామ్మ : ok ok ........ అప్పటికి నా బుజ్జితల్లి గురించి బుజ్జిహీరోకు తెలియదు కాబట్టి ఈ బామ్మ కోసమే అయితే ........ కానీ పిజ్జా మాత్రం ఖచ్చితంగా ........
బామ్మతోపాటు నేనూ నవ్వుకున్నాను .
స్కూల్ బెల్ మ్రోగడంతో బామ్మా ....... ప్రేయర్ టైం ....... వెళ్ళాలి - అడగొచ్చో లేదో .......... మీ మీ ........ బుజ్జితల్లి ఏమిచేస్తోంది ? .
బామ్మ : నీకు మాత్రమే ఆ అర్హత ఉంది - బాధ్యత కూడా ఉంది ....... ఈ ముసలి ప్రాణం ఎంతవరకూ ఉంటుందో తెలియదు కదా ...... 
బామ్మా ........ ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి - నా కళ్లల్లో నీళ్లు .........
బామ్మ : sorry బుజ్జిహీరో ........ , నేను మాట్లాడకపోయినా అదే నిజం బుజ్జిహీరో ....... అయినా బుజ్జిహీరో ఉండగా ఉన్నన్నాళ్ళూ దైర్యంగా ఉంటాను . Ok ok ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు నువ్వు - నా బుజ్జితల్లి బాధపడితే ఈ వయసులో తట్టుకోలేను అని నవ్వారు . బుజ్జిహీరో ........ నేనూ ఇలా అడగొచ్చో లేదో ....... నా బుజ్జితల్లిని ఎప్పుడో నీ " బుజ్జి హృదయంలో " పూర్తిగా నింపేసుకుని ఉంటావు .....
మీకెలా తెలుసు బామ్మా ....... అయ్యో ఆడిగేశానే అని నాలుక కరుచుకున్నాను .
బామ్మ : సంతోషంతో నవ్వుకుని , నా జీవితకాల అనుభవంలో ప్రపంచాన్నే అవగతం చేసుకున్నాను , నా ప్రాణమైన బుజ్జితల్లి - నాకిష్టమైన బుజ్జిహీరో గురించి తెలుసుకోలేనా ......... - ఇంత చిన్నవయసులో అంత మంచి గొప్ప మనసు అని నా బుజ్జితల్లి కూడా నా ఓడిలోనే పడుకుని రాత్రంతా నీ గురించే కలవరించింది తెలుసా ........
నిజమా బామ్మా ....... యాహూ యాహూ అంటూ స్కూల్ మొత్తం వినిపించేలా సంతోషం పట్టలేక కేకలువేశాను - ప్రేయర్ కు పిల్లలందరూ నావైపుకు తిరిగిచూసి నవ్వుతున్నారు .
బామ్మ కూడా నవ్వుతూనే , బుజ్జిహీరో ....... ఆడిగేస్తున్నాను - నా బుజ్జితల్లిని ...... నీ బుజ్జి హృదయంలో ఏ పేరుతో నింపేసుకున్నావు ........
పోండి బామ్మా ........ నాకు సిగ్గు , నేను చెప్పాను ........
బామ్మ : please please బుజ్జిహీరో ........ , నేనేమైనా కోప్పడతానా చెప్పు - సంతోషంగా సహాయం చేస్తున్నాను కదా ......... please please .
నిజమే ........ " బుజ్జిదేవకన్య " బై బామ్మా ....... అని కట్ చేసి ప్రేయర్ లో వెళ్లి నిలబడ్డాను .
మెసేజ్ సౌండ్ - " బ్యూటిఫుల్ లవ్లీ ........ " బుజ్జిహీరో - బుజ్జిదేవకన్య " soooooo happy బై బై సాయంత్రం కలుద్దాము , నేరుగా నా గుండెలపై ...... ok నా ...... " 
డబల్ ok బామ్మా అని రిప్లై పంపాను . బ్యాగును నా పాదాల దగ్గర ఉంచి బుజ్జిదేవకన్య ఫోటోలు అందుకుని చూస్తూ పులకించిపోతున్నాను - అవునూ బుజ్జిదేవకన్య ఇప్పుడు ఏమిచేస్తోందో అడిగితే చెప్పనేలేదు బామ్మ ప్చ్ ........ - బ్రేక్ టైం లో మళ్లీ కాల్ చూద్దాములే ....... అని ఫోటోలు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాను .

గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ........ హెడ్ మాస్టర్ వాయిస్ - ప్రేయర్ స్టార్ట్ చేసేముందు ఒక అనౌన్స్మెంట్ ....... మన స్కూల్ టీచింగ్ స్టాఫ్ లో కొత్తగా జాయిన్ అయ్యారు - మిస్ అవంతిక please come to the stage ........ , టీచర్ అవంతిక - ఈరోజు నుండీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేస్తుంది అని స్టూడెంట్స్ కు పరిచయం చేసారు .
అంటే ముసలి ఇంగ్లీష్ టీచర్స్ వెళ్లిపోయారన్నమాట - పీరియడ్ మొత్తం చాలా చాలా బోర్ కొట్టేది - ఈరోజు నుండీ మేడం అన్నమాట అల్లరే అల్లరి ఇష్టమొచ్చినట్లు చెయ్యవచ్చు అయినా మేడమ్స్ కు మనం భయపడతామా ఏంటి చూస్తుంటే ఇంకా చిన్న వయసు అని గుసగుసలాడుకుంటున్నారు ఇరువైపులా ........

ఇంగ్లీష్ టీచర్ ఇంట్రడక్షన్ తరువాత మేడం అవంతిక గారు నేరుగా వచ్చి మా క్లాస్ వెనుకే నిలబడ్డారని తెలియక ప్రేయర్ హమ్ చేస్తూనే ఫోటోలు చూస్తున్నాను .
స్టూడెంట్ స్టూడెంట్ ......... స్వీటెస్ట్ వాయిస్ - ప్రేయర్ జరుగుతుంటే ఏమిచేస్తున్నావు అని అతినెమ్మదిగా భుజం తట్టారు .
ఎవరబ్బా అంటూ తల మాత్రమే వెనుకకు తిప్పి చూసాను . కళ్ళు పెద్దవిగా - నోరు పూర్తిగా తెరుచుకున్నాయి , కళ్ళు ఒక మహాద్భుతాన్ని చూస్తున్నట్లు కనురెప్ప వెయ్యడం లేదు - హృదయపారవశ్యంలో నన్ను నేను మరిచిపోయాను - నా బాడీ నా కంట్రోల్ ఎప్పుడో తప్పిపోయింది - నా చేతులలోని బుజ్జిదేవకన్య ఫోటోలు ఎప్పుడో నా వేళ్ళ నుండి జాలువ్రాలి బ్యాగులోకి చేరిపోయాయి .
మేడం : sorry sorry ....... స్టూడెంట్ , ప్రేయర్ సమయంలో మొబైల్ చూస్తున్నావేమో అనుకున్నాను . Sorry అంటూ అమాయకంగా సుతిమెత్తగా లెంపలేసుకోవడం చూసి ........
నా చేతులు ఆటోమేటిక్ గా బుజ్జి హృదయం మీదకు చేరడమే కాకుండా పూర్తిగా మేడం వైపు కాదు కాదు దివినుండి దిగివచ్చిన దేవకన్య వైపుకు తిరిగాను - దేవకన్యను చూస్తున్నంతసేపూ బుజ్జిమనసులో బటర్ ఫ్లైస్ ఫీల్ ........ 

మేడం ( దేవకన్య ) : ముత్యాలు రాల్చున్నట్లు అందమైన నవ్వులు నవ్వుతూనే , స్టూడెంట్ ....... ప్రేయర్ అటువైపు అని సైగలు చేస్తున్నారు .
ఊహూ ఊహూ ........ ఆనందం ఇటువైపు అన్నట్లు తలఊపాను .
దేవకన్య తియ్యనైన నవ్వులను అలా జీవితాంతం చూస్తూ ఉండాలనిపించింది - నాపై పూల వర్షం కురుస్తోందా , కొత్తలోకంలో ఉన్నానా ........ 
దేవకన్య : నవ్వులను కంట్రోల్ చేసుకుని చిరుకోపంతో turn that side స్టూడెంట్ అంటూ నా దగ్గరికివచ్చి తిప్పడానికి భుజంపై చేతినివేశారు .
అదేసమయానికి " National Anthem " start అవ్వడంతో నేను అటెన్షన్ అయిపోయి కదలకుండా ఉండిపోయాను - మేడం గారు కూడా ఏమీ చెయ్యడానికి వీలులేనట్లు నా భుజం పై చేతిని అలానే ఉంచి కదలకుండా నిలబడిపోయారు .
ఆ చిరుస్పర్శకే నాలో సరిగమలు జలదరింపులు ........ పెదాలపై చిరునవ్వులతోనే National Anthem పాడుతూ మేడం గారి కళ్ళల్లోకి కన్నార్పకుండా చూస్తున్నాను.
మేడం : నా అల్లరిని ఒకవైపు నవ్వు మరొకవైపు కోపంతో చూస్తున్నారు . Anthem పూర్తవగానే జైహింద్ అని పాడుతూనే నా భుజం పై గిల్లేసారు . క్రేజీ స్టూడెంట్ ...... ఇంకొక్కసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయి అని లేడీ స్టాఫ్ తోపాటు స్కూల్ లోపలికి అడుగులువేశారు .
పాదాలకు తగులుతున్న బ్యాగును అందుకుని మంత్రం వేసినట్లుగా దేవకన్య వెనకాలే ఫాలో అయ్యాను .
నన్ను అర్థం చేసుకున్నట్లు - తప్పకుండా ఫాలో అవుతానని తెలిసినట్లు ....... వెనుకకు తిరిగిచూసి , అందరితోపాటు లైన్లో రమ్మని కాస్త కోపంతోనే వేలిని చూయించారు .
ఆగి తలదించుకున్నాను - మేడం గారు కదిలి లేడీ స్టాఫ్ వాళ్ళతో పరిచయం చేసుకుంటూ లేడీ స్టాఫ్ రూమ్ వైపు వెళ్లడం చూసి ఫాలో అయ్యి బయటే నిలబడి లోపలికి తొంగి తొంగి చూస్తున్నాను - ఏమిచెయ్యడం మరి అంత అందమైన దేవకన్యను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను మరి ....... పక్వానికి వస్తున్న బుజ్జిమనసు మరి ..........

హెడ్ మాస్టర్ ఎప్పుడు వచ్చారో ఏమిటో స్టూడెంట్ ఇక్కడ ఏమిచేస్తున్నావు ......
దొరికిపోయాను అని కంగారుపడుతున్నాను .
హెడ్ మాస్టర్ : you are మహేష్ రైట్ ....... క్లాస్ కు వెళ్లకుండా ఇక్కడ ఏమిచేస్తున్నావు .
Yes సర్ ........
హెడ్ మాస్టర్ : ఇంతకూ నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యిందా లేదా ...... ? .
ఐడియా ........ yes yes సర్ ...... , అదేపనిలో ఉన్నాను - కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ మేడం కోసం వెయిటింగ్ - మేడం గారు ....... ఏ క్లాస్ లోకి వెళితే ఆ క్లాస్ కు వెళదామని .........
హెడ్ మాస్టర్ : very good , నేను చెప్పినది శ్రద్ధగా పాటిస్తున్నావు అన్నమాట ........... 
Yes సర్ , థాంక్యూ sooooo మచ్ సర్ ....... ( " అప్పుడు పనిష్మెంట్ అనుకున్నాను ఇప్పుడు the biggest రివార్డ్ - వరం లా మారబోతోంది " ) అని నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను .
హెడ్ మాస్టర్ : ఇంగ్లీష్ టీచర్ - మిస్ అవంతిక ....... ఏమి సౌందర్యం , మిస్ ఇండియా అవ్వాల్సిన కన్నె అమ్మాయి ...... మన కాదు కాదు నా అదృష్టం కొద్దీ నా స్కూల్ కే వచ్చింది అని గుసగుసలాడుతూనే తొంగిచూసి ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోయాడు .
అప్పుడు హెడ్ మాస్టర్ పై నాకు వచ్చిన కోపానికి కొలత లేనే లేదు - చెప్పిన థాంక్స్ కూడా వెనక్కు తీసేసుకున్నాను - ఈ వయసులో ఇలాంటి బుద్ధి ........ దేవకన్యపై మరొక్కసారి మీ ....... ఇంకా మీ ఏమిటి నీ చూపు పడిందో అప్పుడు చూస్తాను ....... కంట్రోల్ మహేష్ కంట్రోల్ ........ హెడ్ మాస్టర్ టర్న్ అయ్యేంతవరకూ నా కోపం తగ్గనేలేదు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-08-2021, 10:32 AM



Users browsing this thread: 24 Guest(s)