Thread Rating:
  • 43 Vote(s) - 3.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
సరిత్ గారూ,

సిరిపురపు గారూ,
      మీ బాకీ చెల్లించలేకపోయినందుకు మన్నించండి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోమని మనవి. నేను రచయితను కాను. రచయితలు కానివారు చాలామందిని గాసిప్ సైటు రచయితలుగా చేసింది.
      ఒకవేళ నేను రచయితనైతే నాచర్ల సూర్యనారాయణగారిలాగా రాయగలనా అనే ఆలోచనతో రివర్స్‌గేర్ రాయడం ప్రారంభించాను. నాచర్లవారిని యిప్పటి పాఠకులకు పరిచయం చేయాలనే కోరిక కూడా నాచేత ఆ కథ మొదలు పెట్టించింది.
        అయితే కథ రాయడం ఇక్కడ టపా పెట్టినంత సులభం కాదని అనుభవం మీదగానీ తెలిసిరాలేదు. నేన ఆ కథ మొదలుపెట్టింది ఒకవిధంగా అయితే అది తయారైంది వేరొకవిధంగా. నేను అనుకున్న విధంగా అది రానేలేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు సాగిపోయింది వ్యవహారం. కథ ఎక్కడా పట్టు చిక్కలేదు. మొదలు పెట్టిన చోటికి కథ తిరిగొచ్చే పరిస్థితి కనబడలేదు.
          చాలామంది రైటర్లు కథ మధ్యలోనే ఎందుకు ఆపేసి తిరిగి చూడకుండా పరారైపోతున్నారో అర్థమైంది. ఎంత ఉత్సాహంగా కథ మొదలు పెట్టినా పట్టాలు తప్పిన రైలుబండిని ఎవరు ముందుకు నడిపించగలరు?
          ఏది ఏమైనా నా కోరిక మాత్రం నెరవేరింది. నాచర్ల సూర్యనారాయణగారిని కొత్త పాఠకులకు పరిచయం చేయగలిగాను. నాచర్ల సూర్యనారాయణే ఎన్నెస్ కుసుమ అనే నా నమ్మకం కూడా లింగం గారు ప్రూవ్ చేశారు. ప్రసాద్ గారూ, మీరూ, లింగం గారూ చేసిన కృషివల్ల ఇప్పుడు నాచర్ల సూర్యనారాయణగారే కాదు - విజయబాపినీడు, మిస్టర్ గిరీశం, రేఖాకృష్ణ, ఎస్.ఎం.తుల, జయకర్ వంటి గొప్ప రచయితలు పాఠకులకు మళ్ళీ పరిచయమయ్యారు.
          ఆ కథలు హడావిడిగా చదివే కథలు కావు. నిదానంగా ఒక్కో కథ చదవండి నా బాకీ అవే తీర్చేస్తాయి.
          మీకు మరోసారి నమస్సులు.     Namaskar Namaskar Namaskar
 
 
[+] 5 users Like lotuseater's post
Like Reply


Messages In This Thread
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by lotuseater - 15-07-2021, 01:01 AM
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 12 Guest(s)