Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
గోవర్ధన్ ....... ఈ సెక్యూరిటీ బౌలింగ్ లోనే వినయ్ తనేంటో తెలుసుకున్నాడు .
గోవర్ధన్ : yes yes అంటూ స్ట్రైక్ కు వెళ్లి తొలి బాల్ ఫోర్ తో కలిపి ఏకంగా 16 రన్స్ స్కోర్ చేసి ఆనందం పట్టలేక డాన్స్ చెయ్యడం చూసి , మా టీం మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు .
సూపర్ గోవర్ధన్ అని ఛాతీలు గుద్దుకున్నాము .13th ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టగానే ఫ్రెండ్స్ అందరూ లేచి హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ అని ఏరియా మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలు వేయడంతో ........
గోవర్ధన్ వచ్చి కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నాడు . 
ఆ ఓవర్లో కూడా 12 రన్స్ వచ్చాయి . 14th ఓవర్ మొత్తం గోవర్ధన్ ఆడి 4 - 2 - 2 - 0 - 4 - 2 ....... ఏకంగా 14 రన్స్ ....... add చేసాడు . 

చివరి ఓవర్ లో కేవలం 7 రన్స్ మాత్రమే అవసరమవడంతో మా టీం మేట్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . 
కాల్ చేసి చెప్పినట్లు మురళి చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చాడు . ఫ్రెండ్స్ గెలవబోతున్నామా ........ ? .
ఫ్రెండ్స్ : అవును మురళీ ....... వినయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు . 
వినయ్ : మొత్తం క్రెడిట్ మహేష్ దే రా ....... , మాలో కాన్ఫిడెంట్ నింపి హాఫ్ సెంచరీతో ముందుండి నడిపిస్తున్నాడు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా పొగడటం విని తట్టుకోలేకపోతున్నాడు - లోలోపలే ఉడికిపోతున్నాడు . 

ఇక మ్యాచ్ పోయినట్లే అని ఒకదగ్గరకు చేరిన సెక్యూరిటీ టీంలో కంగారు భయాన్ని చూసి మా టీం కేరింతలు కొడుతున్నారు .
15th ఓవర్ ఫస్ట్ బాల్ టాస్ వేసినప్పటికీ సింగిల్ తీసి గోవర్ధన్ కు స్ట్రైక్ ఇచ్చాను .
గోవర్ధన్ : మహేష్ ....... నీకు చెప్పేటంతవాణ్ణి కాదు , టాస్ బాల్ సిక్స్ కొట్టచ్చుకదా.........
ఆ విన్నింగ్ షాట్ సిక్స్ నా ఫ్రెండ్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తే మరింత ఆనందిస్తాను - ఫోర్స్ తప్ప సిక్సులు కొట్టనేలేదు నువ్వు అందుకే ........
గోవర్ధన్ : థాంక్యూ మహేష్ ....... , నా పవర్ అంతా ఉపయోగించి కొడతాను వీలుకాకపోతే సింగిల్ తీస్తాను నువ్వే ఫినిష్ చెయ్యాలి .
చిరునవ్వు నవ్వాను .
లెంగ్త్ బాల్ వెయ్యడంతో లాంగ్ ఆన్ ఫీల్డర్ దగ్గరికి వన్ పిచ్ చేరేలా కొట్టి మహేష్ మహేష్ ........ అంటూ పావు వంతు దూరం వచ్చేశాడు .
నో నో అంటూ బ్యాట్ పట్టుకుని కూర్చున్నాను . బాల్ కీపర్ ను చేరేంతలో క్రీజ్ చేరాడు . మహేష్ ........ ? .
నువ్వు కొడతావు - 15 ఓవర్స్ పూర్తిచేస్తే చాలు అన్నావు , ఇప్పుడు ఏకంగా విజయ తీరానికి ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాము , భయం వదిలేసి కొట్టి గెలిపిస్తావో లేక .........
గోవర్ధన్ : నో నో నో ....... అంటూ కాన్ఫిడెంట్ గా వెళ్లి మిస్ హిట్ చేసి సింగిల్ తియ్యబోతే నేను కదలకుండా ఉండిపోయాను .
మా టీం లో కంగారు - ఫీల్డింగ్ టీం లో ఆశ్చర్యం .........
బౌలర్ ఫోర్త్ బాల్ వేయడానికి వస్తుంటే గోవర్ధన్ దేవుడిని ప్రార్థించి పెదాలపై చిరునవ్వుతో బాల్ ను చూసి ఫ్రంట్ వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా లాంగెస్ట్ సిక్స్ కొట్టి , గెంతులేస్తూ వచ్చి నామీదకు జంప్ చేసాడు . 
మురళి తప్ప మా టీం అంతా పరుగునవచ్చి మా ఇద్దరినీ అమాంతం ఎత్తేసి సంబరాలు చేసుకున్నారు . 184 టార్గెట్ ను ఛేజ్ చేసాము థాంక్యూ థాంక్యూ మహేష్ నీవల్లనే ....... ఇక డబ్బులన్నీ మనవే ......

థాంక్స్ థాంక్స్ అంటూ ఎంజాయ్ చేస్తూనే ....... , సెక్యూరిటీ అన్నయ్యలవైపు చూసాను . నెల అంతా కష్టపడిన డబ్బు ఒడిపోయామని కన్నీళ్ళతో బాధపడుతున్నారు - వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లలు - ప్రాణమైన వాళ్ళు కనిపించి హృదయం చలించిపోయింది - ఇలాంటి గెలుపునా నేను ఎంజాయ్ చేస్తున్నది అని నామీద నాకే కోపం వచ్చింది . 
కిందకుదిగి మనసులోని మాటను మా కెప్టెన్ వినయ్ కు ఎలా చెప్పాలో అని బాధపడుతున్నాను .
వినయ్ వచ్చి మహేష్ ఏంటి అలా ఉన్నావు ఈ డబ్బంతా నీవల్లనే వచ్చింది - నెక్స్ట్ వీకెండ్ బయటకువెళ్లి ఎంజాయ్ చేద్దాము - మురళీ రారా ....... 

వినయ్ - గోవర్ధన్ - మురళీ సర్ - ఫ్రెండ్స్ ....... తప్పుగా మాట్లాడితే క్షమించండి , మనతో కాదు కాదు మీతో చాలానే డబ్బులు ఉన్నాయికదా ....... , పాపం మన సెక్యూరిటీ అన్నయ్యలు ...... ఇంటికి తీసుకెళ్ళాల్సిన డబ్బును మొత్తం ఓడిపోయారు - అలా ఆడటం కూడా తప్పే ...... - వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజ్ లు , ఫుడ్ , బాడుగ ....... ఇలా చాలా అవసరాలు ఈ డబ్బుపైనే ఆధారపడి ఉంటారు . కాబట్టి కాబట్టి ........ వాళ్ళ బెట్టింగ్ డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తే ...... అని తలదించుకున్నాను .
అందరూ బాధపడుతున్న సెక్యూరిటీ వాళ్ళవైపు చూసి , ఒకరినొకరు చూసుకుని yes yes yes అని ఒక నిర్ణయానికి వచ్చారు . సెక్యూరిటీ అని పిలిచి మేము నిజాయితీతో మ్యాచ్ గెలిచాము ఈ డబ్బు కంటే ఆ సంతోషం చాలు మాకు ...... , మీ బెట్టింగ్ డబ్బుతోపాటు మా డబ్బుకూడా తీసుకోండి ....... , మహేష్ ....... నువ్వు చెప్పావు కాబట్టి నువ్వే ఇవ్వు .
నో నో నో వినయ్ ....... కెప్టెన్ ఎప్పుడూ ముందు ఉండాలి అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాను అందరికీ .........
మురళి : మ్యాచ్ మనం గెలిచి వాళ్లకు ఎందుకు డబ్బు ఇవ్వాలి .
గోవర్ధన్ : మురళీ ...... నువ్వు వెళ్లిపోకుండా మ్యాచ్ చూసి ఉంటే మాలానే ఎంత ఎంజాయ్ చేసేవాడివో తెలిసేది - ఆ సంతోషంతో పోలిస్తే ఈ డబ్బు నథింగ్ మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము .
మురళి : నా డబ్బు నాకు ఇచ్చేసి మీఇష్టం . 
వినయ్ ....... 10వేలు లెక్కపెట్టి ఇవ్వడంతో , మ్యాచ్ గెలిచాము మ్యాచ్ గెలిచాము అని కేకలువేస్తూ వెళ్ళిపోయాడు .
వినయ్ : సెక్యూరిటీ ....... తీసుకోండి అని అందించాడు . వాళ్ళ ముఖాలలో ఆనందం చూసి మహేష్ మళ్లీ కిక్కు ఇచ్చావు అని అమాంతం ఎత్తి సంతోషాలను పంచుకున్నారు .
పైనుండి సెక్యూరిటీ అన్నయ్యల ఆనందం చూసి ఆ క్షణం ఆ క్షణం ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను - నా దైవం పెద్దమ్మా ....... నేనూ ఒక మంచిపని చేసాను తెలుసా అని తియ్యదనపు గర్వంతో చెప్పి నవ్వుకున్నాను .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........ అంటూ కిందకుదిగాను . 
మహేష్ ....... ఈరోజులా ఎప్పుడూ శ్రమించలేదు చాలా ఆకలివేస్తోంది , ఇంట్లో నాన్ వెజ్ వండి ఉంటారు వెళ్లి కుమ్మేయ్యాలి అనిచెప్పి సంతోషంతో వెళ్లారు .

సెక్యూరిటీ అన్నయ్యలు : మహేష్ ....... ఈరోజు నువ్వు చేసిన సహాయం , సహాయం కాదు కొన్నిరోజుల మా కుటుంబాల సంతోషపు జీవితం - ఈ రుణం తీర్చుకోలేనిది అని ఉద్వేగానికి లోనౌతున్నారు .
అన్నయ్యలూ ....... మనమంతా ఒక్కటే - మన జీవితాల గురించి నాకూ తెలుసు - మన మధ్య ఈ రుణాలు ఎందుకు చెప్పండి - వెళ్ళండి వెళ్లి మీ ప్రియమైన వాళ్ళతోపాటు హాయిగా భోజనం చెయ్యండి - నాకు కూడా భలే ఆకలిగా ఉంది అని ఫ్రెండ్స్ దగ్గరికి పరుగుతీసాను .
సెక్యురిటి కెప్టెన్ : తమ్ముడూ మహేష్ ....... నీ బౌలింగ్ - బ్యాటింగ్ సూపర్ . అపొజిట్ ఆడటం వలన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాము - ఈసారి వేరేవాళ్ళతో ఆడేటప్పుడు నీ allround ప్రదర్శనను చూస్తాము .
చిరునవ్వులతో ఫ్రెండ్స్ వెనుకే నడిచాను .

వినయ్ : బాగా అలసిపోయాము బిరియానీ తినేసి నిద్రపోవడమే , మరిచిపోకండి సాయంత్రం మినీ గ్రౌండ్ దగ్గర కలుద్దాము , లగాన్ ఆడుకుందాము - రేపు మళ్లీ స్కూల్ కు వెళ్లాలి - ఫ్రెండ్స్ మీకూ స్కూల్ నుండి మెసేజ్ వచ్చి ఉంటుంది మన ఇంగ్లీష్ సర్ డబల్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారట - రేపు న్యూ ఇంగ్లీష్ టీచర్ రాబోతున్నారట ...... ఎవరో ఏమిటో అని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .
ఔట్ హౌస్ చేరుకుని , వొళ్ళంతా చెమటలు పట్టి ఉండటం వలన బట్టలన్నీ విప్పేసి షవర్ కింద నిలబడి చన్నీళ్ళతో స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చేటప్పటికి , టేబుల్ పై భోజనం ఉంది - ఆకలి దంచేస్తోంది అని టవల్ పైననే కూర్చుని పాత్ర మూతను తీసిచూస్తే బిరియానీ ........ , సండే ....... మురళీ వాళ్ళు నాన్ వెజ్ చెయ్యారుకదా ........ అంటే పెద్దమ్మ , పెద్దమ్మా పెద్దమ్మా ....... అంటూ టవల్ పైననే బయరకువచ్చి చుట్టూ చూసాను ఎవ్వరూ లేరు , మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి బయటకు తొంగిచూస్తే మధ్యాహ్నం ఎండకు రెండువైపులా దారిలో ఒక్కరూ లేరు - ఎవరైనా లోపలికి వచ్చారా అని సెక్యూరిటీని అడుగుదామంటే వాళ్ళూ భోజనానికి వెళ్లారుకదా ........ , చేసేదేమీ లేక నిరాశతో లోపలికివచ్చాను .
బిరియానీ - చికెన్ కబాబ్ చూడగానే నోరూరిపోతోంది - వెంటనే కూర్చుని టేస్ట్ చేసాను , మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ....... సేమ్ టేస్ట్ అంటే పెద్దమ్మనే , థాంక్స్ పెద్దమ్మా ...... మేమంటే మీకు ఎంత ఇష్టం అని కుమ్మేస్తున్నాను . 
ఇంతకీ ఉల్లిపాయలు - నిమ్మకాయ ఎక్కడ ? , రేయ్ ....... మహేష్ గా ప్రక్కనే బాక్స్ పెట్టుకుని ....... , పెద్దమ్మ ........ అవి లేకుండా తీసుకొస్తారా అని బాక్స్ ఓపెన్ చేసాను - వాటితోపాటు లెటర్ ఉంది .
" నా ప్రియాతిపియమైన బుజ్జి భక్తుడు ...... నా సహాయం లేకుండా మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించి గర్వపు నవ్వుతో నవ్వినందుకు నేనే స్వయంగా బిరియానీ వండి తీసుకొచ్చాను ఎంజాయ్ " 
" నా ప్రియాతిప్రియమైన భక్తుడు " ఈ మాట చాలు పెద్దమ్మా నా దైవమా ....... అని ఆనందబాస్పాలతో అతి మధురమైన బిరియానీని మోతాదుకంటే ఎక్కువగా తినేసి లేవడం వళ్ళకూడా కానట్లు బెడ్ పై వాలిపోయాను .

ఉదయం లా ఆలస్యం కాకుండా 4 గంటలకు ముందే మినీ గ్రౌండ్ లో ఉండాలి అని అలారం పెట్టడానికి మొబైల్ అందుకున్నాను .
వాట్సాప్ అప్ గుర్తుపై 99 ఉండటం చూసి , 99 మెసేజెస్ పంపించిన వారు ఎవరబ్బా అనిచూస్తే ........ పిక్స్ - అవ్వ , పిల్లలు వైజాగ్ ఎయిర్పోర్ట్ - తొలిసారి  ఫ్లైట్ ఎక్కినప్పటి ఆనందాలు - ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మరియు ఢిల్లీలో స్టే చేసిన 5 స్టార్ హోటల్ పిక్స్ ........ wow అనుకునేంతలో ఇండియా గేట్ దగ్గర తీసుకున్న పిక్స్ వస్తూనే ఉన్నాయి - అమితమైన ఆనందంతో చూస్తున్నాను . పెద్దమ్మ పెద్దమ్మ ....... పెద్దమ్మ ఏ ఒక్క ఫోటోలోనైనా ఉందేమో అని చూసి నిరాశ చెందాను - రేయ్ మహేష్ గా కొద్దిసేపటిముందు నీకోసం బిరియానీ తీసుకొచ్చిన పెద్దమ్మ ఈ పిక్స్ లలో ఎలా ఉంటారు అన్న జ్ఞానం కూడా లేదు అని మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను . ఫీల్డింగ్ - హాఫ్ సెంచరీ కొట్టడం - ఫుల్ గా తినడం వలన మత్తుగా కళ్ళు మూతలుపడ్డాయి .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-08-2021, 10:29 AM



Users browsing this thread: 23 Guest(s)