Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
వదినమ్మ ఇంటి వెనుకకు చేరుకుని గోడమీదకు జంప్ చేసి నిచ్చెన ద్వారా కిందకుదిగాను .
కంగ్రాట్స్ బేబీ ....... అతి తక్కువ కాలంలోనే మన కంపెనీని టాప్ 5 లోకి తీసుకొచ్చావు అంటూ హత్తుకుని స్వాగతం పలికారు వదినమ్మ - చిన్న వదిన ......
తీసుకొచ్చావు కాదు దేవతలూ ....... తీసుకొచ్చాము - ఈ సంబరాన్ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలి ....... మొదట వదినమ్మను ఎత్తుకోవాలా లేక చిన్న వదినను ఎత్తుకోవాలా ? .
వదినమ్మ : మా చెల్లిని - మా బేబీ బుజ్జివదినను ...... అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు .
చిన్న వదిన : మనందరి ప్రాణమైన మా అక్కయ్యను - మా బేబీ అమ్మను అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టారు . 

ఇలా కాదుకానీ డబల్ సంబరం పొందుతాను అని ఇద్దరినీ ఒక్కొక్క చేతితో ఎత్తి ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ తిరిగి కిందకుదింపాను . నా దేవతల విజయం అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాను .
దేవతలు : నిజానికి మేమే మా బేబీ ని ఎత్తి సంబరం చేసుకోవాలి అని ఎత్తబోయి వీలుకాక ఆగిపోయారు . తియ్యనైన కోపాలతో నా గుండెలపై కొట్టి ముసిముసినవ్వులతో చుట్టేశారు . 
అమ్మ కంటే ముందుగా ఎత్తుకున్నది నా వదినమ్మే కదా .........
వదినమ్మ : నా గుండెలపైననే పడుకోబెట్టుకునేదానిని ఎంత ఎదిగిపోయావు బేబీ ......... లవ్ యు అంటూ చిన్నవదినతోపాటు ముద్దులుపెట్టి పరవశించిపోతున్నారు . నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి హత్తుకుని కూర్చున్నారు .

దేవతలు : బేబీ ........ బుజ్జాయిలను కలవబోతున్నాను అన్న ఆనందంలో టిఫిన్ లంచ్ తినిపించలేదు అమ్మ - ఇప్పుడు కలవలేదు అన్న బాధతో డిన్నర్ కూడా .....
అవును దేవతలూ ....... అయినా నాకు తినిపించడానికి దేవతలు ఉన్నారుకదా - అమ్మ ........ తింటుందో లేదో ఇంటికి కూడా వెళ్లను అంది .
దేవతలిద్దరూ నవ్వుతున్నారు . బేబీ ........ మా బుజ్జిచెల్లి ఇల్లు ఓపెన్ కదా అక్కడకు వెళ్ళింది అమ్మ - బాగా ఆకలి వేసినట్లుందేమో చెల్లెళ్లు తినిపిస్తామన్నా వద్దని మొండిపట్టు పెట్టి బుజ్జిచెల్లి తినిపించగానే ప్లేట్ ప్లేట్లు ఖాళీ చేసేసింది అని వీడియో చూయించారు .
థాంక్స్ హిమగారూ ........ అని సంతోషంతో దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టాను . వీడియో చూస్తూనే దేవతలూ ....... మీ బుజ్జితల్లులు సగం ఆకలి మాత్రమే తీర్చి అమ్మల దగ్గరికి వెళ్ళండి అని తోసేశారు .

దేవతలు నవ్వుకుని బుగ్గలపై ముద్దులుపెట్టి లేచారు .
వదినమ్మ : చెల్లీ ....... రాత్రంతా బేబీ బేబీ అని కలవరిస్తావు , నేను వడ్డించుకునివస్తాను కానీ నీ బేబీ చేతిని వదలకుండా పెట్టుకో ........
చిన్న వదిన : నేను రాత్రి మాత్రమే అక్కయ్యా ........ , మీరు రాత్రీ పగలూ ........
వదినమ్మ : లేకపోతే ఈ గుండె చప్పుడు ఆగిపోతుంది చెల్లీ ....... అని కళ్ళల్లో చెమ్మతో చిన్న వదిన నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లబోతే .........
అమ్మా ....... అంటూ ఆపి ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చుని చేతులను అందుకున్నాను . ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ........ అని చేతులపై ముద్దులుపెట్టి ఉద్వేగానికి లోనయ్యాను . దేవతలూ ....... మీరు దేవతల్లా దర్జాగా కూర్చోండి నేను వెళ్లి వడ్డించుకునివస్తాను . 
దేవతలు : బేబీ బేబీ ........
ష్ ష్ అంటూ వేళ్ళతో దేవతల పెదాలను మూసి బుగ్గలపై చెరొకముద్దుపెట్టి తలతో సున్నితంగా మొట్టికాయలు వేసి వంట గదిలోకివెళ్ళాను .
వదినమ్మ : బేబీ ....... స్టవ్ పై పప్పు ఉంది ప్రక్కనే రైస్ ఉంది .

5 నిమిషాలు 10 నిమిషాలైనా రాకపోయేసరికి దేవతలిద్దరూ కంగారుపడుతూ వంట గదిలోకివచ్చి చూసి సంతోషంతో గుమ్మం దగ్గర నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
రిధమిక్ గా స్టెప్స్ వేస్తూ లండన్ స్పెషల్ ఆమ్లెట్ వేస్తుండటం చూసి చిలిపినవ్వులతోవచ్చి వెనుక నుండి హత్తుకున్నారు . బేబీ ....... ఏమి చేస్తున్నావు అని ప్రేమతో ముద్దులుపెట్టి అడిగారు . 
నా దేవతలకోసం వేడివేడిగా స్పెషల్ డిష్ చేస్తున్నాను ఓన్లీ 2 మినిట్స్ , ఆలస్యం అయినందుకు లవ్ యు ....... , వదినమ్మా ....... మీరు అలా హత్తుకుంటే చాలా బాగుంది జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉంది .
చిన్నవదిన : మాకు కూడా అని ఇద్దరూ ముందుకువచ్చి గుండెలపైకి చేరారు . బేబీ ........ నీకు ఇప్పుడు అనిపించిందా అలా అని చిరుకోపంతో కొట్టి గట్టిగా హత్తుకున్నారు . 
వదినమ్మ : చెల్లీ ........ నేనున్నానుకదా అని నుదుటిపై ముద్దుపెట్టారు .
చిన్నవదిన : జలదరించి , వదినమ్మ చేతిని హృదయం పైకి చేర్చుకుని మురిసిపోతోంది . బేబీ ........ ఆకలివేస్తోంది .
లవ్ యు లవ్ యు దేవతలూ ....... అయిపోయింది అంటూ మరొక ప్లేటులో వడ్డించుకుని సోఫా దగ్గరికి చేరుకున్నాము . ముందు నేను అని అన్నం పప్పు కలిపి తినిపించబోతే ...... ఇద్దరూ ఊహూ ఊహూ ఆమ్లెట్ మొత్తం మాకే కావాలి - మా బేబీ మాకోసం ప్రేమతో చేసినది .
లవ్ టు లవ్ టు దేవతలూ ....... అని అందుకుని కాలడంతో ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ....... అంటూ ఊది తినిపించడం చూసి అందమైన నవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టి తిన్నారు .
మ్మ్మ్ మ్మ్మ్ ......ఆఅహ్హ్హ్ wow సూపర్ అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాధిస్తున్నారు . 
లేదులే దేవతలూ ........ నా సంతోషం కోసం అలా చెబుతున్నారు .
అంతే ఇద్దరూ తియ్యనైన కోపాలతో బుగ్గలపై ఘాడమైన ముద్దులుపెట్టి ఎలా ఉంది అన్నారు .
సూపర్ ....... హాయిగా ఉంది .
దేవతలు : మా బేబీ స్వయంగా వండి తినిపించడం కూడా మాకు అంతే మధురంగా ఉంది చెప్పాముకదా మొత్తం మాకే కావాలి అని ప్రేమతో గోరుముద్దలు నాకు తినిపించారు . 

దేవతలు : మ్మ్మ్ మ్మ్మ్ ....... లవ్ యు బేబీ రోజూ తినాలని ఉంది .
అంతకంటే అదృష్టమా దేవతలూ ........ లండన్ లో నేర్చుకున్న వంటలు ఒక్కొక్కటే చేస్తాను .
చిన్నవదిన : మా బేబీ వంట చేస్తున్నప్పుడు మేము గట్టిగా హత్తుకుంటాము .
ఆ ....... ఇప్పుడు అర్థమైంది దేవతలూ ....... , ఆ రుచికి కారణం మీరు వచ్చి హత్తుకోవడం వల్లనే ........ , హత్తుకున్నంతసేపూ అలా అలా గాలిలో తెలిపోయాననుకోండి .
దేవతలిద్దరూ సిగ్గుపడి , బేబీ ....... నిన్ను పొగిడితే ఆ క్రెడిట్ కూడా మాకే ఇచ్చేసావన్నమాట అని బుగ్గలపై కొరికేసి ముద్దులుపెట్టారు . బుజ్జాయిలు - బుజ్జితల్లులతో ....... నువ్వు మాత్రమే ఎంజాయ్ చెయ్యడం ఏమీ బాగోలేదు , అమ్మ ..........
మరి మీకు లేదా ........ , దేవతల కన్నీళ్లను తుడిచి వచ్చినదే ఆ విషయం చెప్పడానికి , మీరు కంగ్రాట్స్ సంబరాలలో నన్ను నేనే మైమరిచిపోయేలా చేసేసారు అని రేపటి టూర్ సర్ప్రైజ్ గురించి వివరించాను .
అంతే వదినల కంటే ఎక్కువ సంతోషంతో కేకలువేసి లవ్ యు లవ్ యు బేబీ అంటూ ముద్దులవర్షం కురిపించి గట్టిగా హత్తుకున్నారు . బేబీ ........ ఆ మాన్స్టర్స్ సంగతి ..........
రేపు ఫేక్ CRC ఆఫీసర్స్ ను రంగంలోకి దింపి ఆ మాన్స్టర్స్ గజగజా వణికిపోయి తమకు తామే ఒప్పుకుని టూర్ కు పంపించేలా మేడం గారు - కృష్ణతోపాటు పర్ఫెక్ట్ ప్లాన్ వెయ్యాలి దేవతలూ ........ 
అయితే వెంటనే వెళ్ళాలి అంటూ నా చేతిని కడిగి , నోటిని చీరకొంగులతో తుడిచి , నీళ్లు తాగించి వెనుక గుమ్మం వరకూ లాక్కునివెళ్లారు . 
దేవతలూ ........ వెళ్ళాల్సిందేనా ? .
వదినమ్మ : తప్పదు , రేపు అమ్మ కళ్ళల్లో స్వచ్ఛమైన ఆనందం చూడాలి .
ఆ ఆనందం చూడాలంటే బుజ్జాయిలు - బుజ్జితల్లులతోపాటు తన బిడ్డలందరూ అమ్మ గుండెలపైకి చేరాలి చేరుస్తాను దేవతలూ నాపై నమ్మకం ఉంచండి .
దేవతలు : మా ప్రాణం కంటే ఎక్కువగా అని ముద్దులుపెట్టారు .
లవ్ యు దేవతలూ ....... జాగ్రత్త , అవునూ ఇంతకూ మల్లీశ్వరి వాళ్ళు ఎక్కడ కనిపించనేలేదు .
దేవతలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . మనల్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక నిచ్చెన సౌండ్ వినిపించగానే పైన గదిలోకి వెళ్లారు .
అలా ఎందుకు దేవతలూ .........
వదినమ్మ : సిగ్గుపడుతున్న చిన్నవదినను చూసి , ఎందుకో త్వరలోనే తెలుస్తుందిలే బేబీ , ముందు నువ్వు ఇంటికివెల్లు అని ఇద్దరూ ఏకమయ్యేలా హత్తుకున్నారు .
ఎందుకో తెలియదు హగ్స్ కొత్తగా అనిపించాయి , కొద్దిసేపు కదలకుండా నిలబడిపోయాను - దేవతల వెచ్చదనం , నవ్వులు మాత్రమే తెలుస్తున్నాయి .
దేవతలు : వదిలి ఈరోజుకు చాలులే వెళ్లు బేబీ అని బుగ్గలపై ముద్దులుపెట్టి గోడ జంప్ చేసేంతవరకూ ముచ్చటేసేలా నవ్వుతూనే ఉన్నారు .
సైలెంట్ గా వెళ్లి కారులో కూర్చున్నాను . ఏదో తెలియని కొత్త మాధుర్యం ఒక జలదరింతకు లోనయ్యాను అది ఇంకా బాగుంది . చాలాపనులున్నాయి అని కాంపౌండ్ గోడవైపు చూసి జాగ్రత్త దేవతలూ అని మనసులో తలుచుకుని ఇంటికి చేరుకున్నాను .

దేవతలు అందించిన ఫీల్ తో అడుగుకొకసారి జలదరిస్తూ మెయిన్ డోర్ చేరుకున్నాను - పిల్లలూ ........ మీ బుజ్జిఅమ్మ దగ్గరనుండి ఎప్పుడు వచ్చారు అని లోపలికి అడుగు ........
పిల్లలు : స్టాప్ మావయ్యా స్టాప్ , లవ్ యు లవ్ యు మావయ్యా ........ జస్ట్ ఇప్పుడే వచ్చాము అదికూడా మీకోసమే ఇలా ఆపడానికి వచ్చారు అమ్మమ్మ లేకపోతే అక్కడే ఉండిపోయేవారు ఉదయం వరకూ , అమ్మమ్మ ఆర్డర్స్ ........, అమ్మమ్మా ....... మావయ్య వచ్చారు లోపలికి ........
అమ్మ : నో ....... 
చెల్లెళ్లు : అమ్మా అమ్మా ........
అమ్మ : నో అంటే నో ........ , మీరే చూశారుకదా బుజ్జాయిలు బుజ్జితల్లులతో ఎలా తైతక్కలు ఆడి ఎంజాయ్ చేసాడో ....... , అమ్మ కలవలేదు అని కొద్దిగానైనా బాధపడ్డాడా ........ ? , అయినా మీకు కూడా ఎలా తెలుస్తుంది మధ్యాహ్నం 2 గంటల నుండీ స్కూల్ వదిలేంతవరకూ బాగా వాళ్ళ ప్రేమను పొందారుకదా ........ - మీరు కూడా పిల్లలూ మీ ఫ్రెండ్స్ తో .........
అంతే చెల్లెళ్ళిద్దరూ - పిల్లలు ........ నోటికి తాళం వేసేశారు .
నవ్వుకుని , కంట్రోల్ చేసుకున్నాను .
ఇంట్లో అమ్మ ఉంది ఒక కోరిక కోరింది ఆ మాన్స్టర్స్ ను కొట్టి అయినా తీరుద్దాము అని ఏమాత్రం ఆలోచన లేదు , ఆ కోరిక తీరేంతవరకూ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీలు లేదు అంతే ........ నా మాటే శాసనం అని నవ్వులను లోలోపలే ఆపేసుకుంటూ చెల్లెమ్మ వైపు తిరిగింది - చెల్లెమ్మ నవ్వబోతే చేతితో నోటిని మూసేసింది .

చెల్లెళ్లు : నవ్వుని ఆపుకుని , అమ్మా ........ మరి భోజనం ? .
అమ్మ : వాడి దేవతలు ఉన్నారుకదా కుమ్మేసే ఉంటాడు . ఒక ఇంట్లో అయితే లండన్ స్పెషల్ ఆమ్లెట్ స్వయంగా వేసాడు వీడియో చూడలేదా ? .
అంతలోనే ఎలా తెలిసిందబ్బా , వీడియో ఇప్పుడు తీశారు ........ ? .
చెల్లెళ్లు : వెల్లమంటే అన్నయ్య ఎక్కడికి వెళతారు అమ్మా ....... కావాలంటే తెల్లవారగానే బయటకు తోసేద్దాము .
అవునవును అమ్మా ....... చెల్లెళ్లు చెప్పినట్లు , బయట చలి ఎక్కువగా ఉంది .
అమ్మ : ఈ అమ్మ కంటే ప్రాణంలా చూసుకునే దేవత లాంటి అమ్మ వదినమ్మ ఉందికదా వెళ్లి ఆ దేవతల ఒడిలో తలవాల్చి హాయిగా పడుకోమను - అదే నేను వేసే శిక్ష .........
చెల్లెమ్మ : అది శిక్షలా లేదమ్మా ........ వరం .....
అమ్మ : ష్ ష్ ........ , వెళ్లు కన్నయ్యా వెళ్లు , ఇలా అయితేనే మమ్మల్ని తొందరగా కలుపుతావు .
ఇదే ఫైనల్ మాటనా మమ్మీ ........
అమ్మ : శివగామీ రేంజ్ లో నా మాటే శాసనం .........
లవ్ యు అమ్మా , గుడ్ నైట్ ....... , పంకజం గారూ జాగ్రత్త , రేయ్ రారా పని ఉంది అని సైగచేసి కారులో బయలుదేరాము .

కృష్ణ : మహేష్ ....... ఆ మాన్స్టర్స్ రేపు కూడా స్కూల్ కు వస్తారు , అంటీ ....... కలవడం వీలుపడుతుందా ? .
మీరు బయలుదేరగానే మేడం గారిని కలవడంతో ఒక అద్భుతం జరిగింది అని టూర్ ఎలా ఆర్రేంజ్ చేశామో మొత్తం వివరించాను . 
కృష్ణ : wow సూపర్ మహేష్ సర్ప్రైజ్ అన్నమాట అంటూ హైఫై కొట్టాడు .
అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే కొన్ని పనులు పూర్తిచేయాలి ప్రస్తుతానికి టూర్ కు అందరమూ వెళుతున్నాము కాబట్టి న్యూ లగ్జరీ బస్ ను ఎంత ఖర్చైనా సరే రేపు సాయంత్రం లోపు ఇలా మార్చాలి అని మొబైల్ లోని స్కెచ్ షేర్ చేసాను .
కృష్ణ : wow అధిరిపోయిందిరా ......... 
ఇది ఒకరోజు నా దేవతలు కలిసి క్రియేట్ చేసి లండన్ లో ఉన్న నాకు పంపించారు .  ఇప్పుడు ఇలా ఉపయోగపడుతోంది . 
కృష్ణ : తెలిసినవాళ్ళు ఉన్నారు మహేష్ , మనం బస్ సెలెక్ట్ చేస్తే చాలు అని కొన్ని కాల్స్ చేసి , గుడ్ న్యూస్ ........ 
What రా ........
కృష్ణ : నువ్వే చూస్తావుకదా అని పోర్ట్ కు తీసుకెళ్లాడు . 
ఒక వ్యక్తి కలిసాడు . పెద్ద గోడౌన్ లోకి తీసుకెళ్లి మెయిన్ స్విచ్ on చేసాడు . లోపల పదిదాకా కొత్త బస్సులు .
కృష్ణ : మహేష్ ......... ఈరోజు ఉదయమే కోల్కతా నుండి వచ్చాయి . మనకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు తెప్పించారు . ఆలస్యం ఏమిటి సెలెక్ట్ చెయ్యి ? .
లవ్ యు రా అంటూ కౌగిలించుకునివదిలి వదినమ్మకు - వదినకు కాల్ చేసి విషయం చెప్పాను . 
దేవతలు : ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఒక్కొక్క బస్ చూసి అందరూ రెడ్ కలర్ బస్ నే సెలెక్ట్ చేశారు . 
లవ్ యు దేవతలూ ........ , నా దేవతల మనసు ఒక్కటే అని నాకు తెలియదా ? గుడ్ నైట్ హాయిగా పడుకోండి అని కట్ చేసాను .

రేయ్ కృష్ణా ........ ఇద్దరు నమ్మకస్థులైన డ్రైవర్స్ కావాలి .
కృష్ణ : బస్ అప్డేట్ గురించి నేను చూసుకుంటానులే , డ్రైవర్స్ అంటావా మన కంపెనీ డ్రైవర్స్ ఉండనే ఉన్నారు - నెక్స్ట్ ఏమిటి ? .
ఫేక్ CRC ఆఫీసర్స్ .........
కృష్ణ : ok ok ముందు ఆ మాన్స్టర్స్ ను ఒప్పించాలికదా ......... , దానికోసం మన న్యూ టాలెంటెడ్ మేనేజర్స్ ఆఫీసర్స్ ఉండనే ఉన్నారులే ....... , స్కూల్ సమయానికి కోట్ - టై లతో టిప్ టాప్ రెడీగా ఉంటారు , నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి తీసుకొచ్చేస్తాను . 
రేయ్ ........ నువ్వు లేకపోతే ఆ ఊహే భయంకరంగా ఉందిరా అంటూ కౌగిలించుకున్నాను . 
కృష్ణ : నువ్వు లేనిదే ఈ సంతోషమే లేదు మహేష్ ...... , నీ చెల్లెమ్మను - పిల్లలను ఇంత సంతోషంగా ఉంచగలను అని నేనెప్పుడూ అనుకోలేదు .
సరిపోయింది నేను ....... నిన్ను - నువ్వు ....... నన్ను అని నవ్వుకున్నాము . రేయ్ ........ ఇక చిన్న చిన్న పనులున్నాయి రేపు పూర్తిచేసేద్దాము - నువ్వు ఇంటికివెల్లు నేను క్యాబ్ లో వదినమ్మ ఇంటికి వెళతాను .
కృష్ణ : పర్లేదులే వదిలే వెళతాను - అక్కడ పంకజం గారు ఉన్నారుకదా భయమేల ........ , ఒక్క నిమిషం అని కాల్ చెయ్యడంతో వచ్చిన బస్ మెకానిక్ తో బస్ ను రేపు సాయంత్రం లోపు వీలైతే అంతలోపు ఇలా మార్చాలి అని స్కెచెస్ షేర్ చేసాడు . ఎంత ఖర్చు అయినా ఎంతమంది పనివాళ్లను పెట్టుకుని అయినా రెడీ అయిపోవాలి అని కోరినంత అమౌంట్ కంటే ఎక్కువగానే ట్రాన్స్ఫర్ చేసాడు .
మెకానిక్ : డబ్బు ఉంటే ఏదైనా అయిపోతుంది సర్ , బస్ రెడీ అయ్యేంతవరకూ నిద్ర కూడా పోము . బస్ అమౌంట్ పే చేయబోతే ........
వ్యక్తి : సర్ ....... ఆఫీస్ కు వచ్చి కలుస్తాను మీరు వెళ్ళండి . మన మధ్యన డబ్బు ఎక్కడికి పోతుంది - మహేష్ సర్ దయ ఉంటే చాలు ........ 
థాంక్స్ చెప్పి చేతులుకలిపి వదినమ్మ ఇంటి బ్యాక్ రోడ్డులో దిగి కృష్ణగాడిని పంపించాను .

గోడ ఎక్కి కిందకుదిగిచూస్తే డోర్ లోపలనుండి లాక్ చేసి ఉంది . దేవతలను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక పైకి ఎక్కడానికి పోల్ పట్టుకున్నాను .
అంతలోనే డోర్ ఓపెన్ అవ్వడం - దేవతలిద్దరూ బయటకు వచ్చి తియ్యనైన కోపాలతో కొట్టి గుండెలపైకి చెరొకవైపు చేరారు .
దేవతలూ దేవతలూ ........ ఇప్పుడేమైంది ? .
మల్లీశ్వరి గారు : ఫస్ట్ టైం ఇలానే కదా ఎక్కి గాయాలతో వచ్చారు . మళ్లీ అంటే మీ దేవతలు తట్టుకోగలరా చెప్పండి - మీరిలాంటిదేదో చేస్తారనే ఇంటి నుండి కాల్ వచ్చినా టెస్ట్ చేద్దాము అని డోర్ వెనుక దాక్కున్నారు మేడమ్స్ ........ , రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు అని నవ్వుతూ లోపలికివెళ్లారు .

దేవతలు : నలుగురం ఉన్నాము ఒక కాల్ చెయ్యొచ్చు కదా ........
లవ్ యు లవ్ యు దేవతలూ ....... సమయం చూడండి , 11 గంటలు కావస్తోంది , దేవతలను ....... ఏ భక్తుడైనా డిస్టర్బ్ చేస్తాడా మీరే చెప్పండి .
దేవతలు : భక్తులు డిస్టర్బ్ చేస్తే తప్పు - దేవుడు చేస్తే అది అనుగ్రహం .........
అమ్మో ........ నేను దేవుడిని కానే కాదు - నా దేవతలకు ఆజన్మాoతం సేవించుకునే భక్తుడిని .........
దేవతలు : అలా అయితే మేము మాత్రం మా భక్తుడిని సేవించుకునే దేవతలం - మాకు అదే ఇష్టం అని చలికి వణుకుతూ ముద్దులుపెట్టి మరింత గట్టిగా హత్తుకున్నారు .
దేవతలూ ........ చలి ఎక్కువగా ఉంది లోపలికివెళదాము అని హత్తుకునే ఎంటర్ అయ్యాము . దేవతలూ ........ విషయం ఎలా తెలిసింది ? .
దేవతలు : ఇంట్లో మా ప్రియమైన చెల్లెళ్లు లేరా ఏమిటి ? - వాళ్ళు తెలపడం ఒక్క క్షణం ఆలస్యమైనా అమ్మనే స్వయంగా కాల్ చేసేది .
లవ్ యు చెల్లెళ్ళూ - లవ్ యు అమ్మా , వదినమ్మా ........ ఎన్నిరోజులయ్యింది మీ ఒడిలో పడుకుని ........
చిన్న వదిన : నేను ప్రాణంలా జోకొట్టి ........
Wow ......... మరి నా దేవతల నిద్ర ? .
దేవతలు : ప్రాణం కంటే ఎక్కువైన దేవుడు - భక్తుడి సంతోషం కంటే నిద్రపోవడం ముఖ్యమా మాకు ....... , కావాలంటే మీరు టూర్ నుండి వచ్చేన్తవరకూ నిద్రలోనే ఉంటాము లక్ష్మణుడి భార్య ఊర్మిళ దేవిలా ...... , అదృష్టం మమ్మల్నే వెతుకుతూ వచ్చింది వధులుకోగలమా అని బెడ్ రూమ్ కు పిలుచుకునివెళ్లి ఒడిలో తల ఉంచుకుని ప్రాణంలా కురులను స్పృశిస్తూ ముద్దులుపెడుతూ జోకొడుతూ నిద్రపుచ్చారు .
దేవతల చేతిస్పర్శకు క్షణాలలో హాయిగా నిద్రపట్టేసింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:04 PM



Users browsing this thread: Depukk, 4 Guest(s)