Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నేరుగా కారు కాంపౌండ్ లోపలికివెళ్లి ఆగింది . గోవర్ధన్ - వినయ్ వాళ్ళతోపాటు మేడం వాళ్లంతా కారు దగ్గరికి చేరుకున్నారు .
బుక్స్ పట్టుకుని కిందకుదిగగానే , మహేష్ మహేష్ ........ మా నమ్మకాన్ని నిలబెట్టావు . వారం ముందు గ్రౌండ్ లో - ఈరోజు స్కూల్లో మా సర్వస్వమైన బిడ్డలను కాపాడావు అని థాంక్స్ చెప్పారు .
మేడమ్స్ ........ నా డ్యూటీ చేసాను అంతే అని బుక్స్ బెంచ్ పై ఉంచాను .
వినయ్ : మమ్మీ మమ్మీ ........ 8 మంది పైనే వచ్చారు మమ్మల్ని కొట్టడానికి , మహేష్ ను చూసి వెనక్కు తిరిగిచూడకుండా పరుగో పరుగు అని నవ్వుతూ చెప్పారు .
మేడమ్స్ : మహేష్ ........ ఇలానే మా పిల్లల ప్రక్కనే ఉండాలి .
అలాగే మేడం ....... , నన్ను అంతపెద్ద స్కూల్లో జాయిన్ చేశారు - అనుక్షణం ప్రక్కనే ఉండి చూసుకుంటాను .

మురళి : మమ్మీ ........ మమ్మల్ని కొట్టడానికి వచ్చినవాళ్లను కొట్టకుండా వదిలేసాడు . 
మేడం : మహేష్ .........
క్షమించండి , పట్టుకుని కొట్టడం ఎంతసేపు మురళి సర్ ........ , అలాచేస్తే మనపై మరింత పగతో రగిలిపోతారు - టైం కోసం ఎదురుచూసి ఏదో ఓకేసమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు దాడిచేస్తారు - అలాకాకుండా వదిలెయ్యడం వలన ఈ భయంతో మన జోలికి రావడమనే ఆలోచనే రాదు - మేడమ్స్ ....... మీరు ఆర్డర్ వెయ్యండి ఇప్పుడేవెళ్లి ఆ బస్తీ పిల్లలు ఎక్కడ ఉన్నా కట్టేసి మీముందు పడేస్తాను - మీకోసం ఏమైనా చేస్తాను .
మేడమ్స్ : నో నో నో ....... మంచిపనిచేశావు మహేష్ . మనమంటే ఉన్న భయమే వాళ్ళు మరొకసారి ఇలా చెయ్యడానికి సాహసం చెయ్యరు . మురళీ ......... మహేష్ చేసినదే కరెక్ట్ అని మరొకసారి థాంక్స్ చెప్పి డబ్బుని అందించారు .
వద్దు వద్దు మేడమ్స్ ....... చోటు - ఫుడ్ - సాలరీ ఇస్తున్నారు కదా ........
మేడమ్స్ : ఇష్టంతో ఇస్తున్నాము తీసుకో , చాలా బుక్స్ కొన్నట్లు ఉన్నావు . ఇంకా చాలా అవసరమవుతాయి అని అందించి వెళ్లిపోయారు . 
మేడం : అందరూ చెప్పినట్లు ఆ పిల్లలను భయపెట్టి మంచిపనిచేశావు అని భుజం తట్టారు .
అధిచూసి మురళి కోపంతో లోపలికివెళ్లిపోయాడు . 

మేడం ......... మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను .
మేడం : ఆలోచించి చెప్పు అన్నారు .
మేడం ......... మురళి అనుమతి తీసుకుని , బస్తీపిల్లల బెట్టింగ్ డబ్బు మరియు బ్యాట్స్ తిరిగిఇచ్చేస్తే మరింత మంచిది అనుకుంటున్నాను అని తలదించుకున్నాను . 
మేడం : పిల్లలను ఒప్పించడం కష్టమే అయినా ఒకసారి మీ మేడమ్స్ అందరితో మాట్లాడుతాను అని లోపలికివెళ్లారు .
బుక్స్ - కొత్త బ్యాగ్ అందుకుని ఔట్ హౌస్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యాను . గంట సమయం అయినా మురళి పిలవకపోవడంతో టెక్స్ట్ బుక్స్ కు నీట్ గా కవర్స్ వేసుకున్నాను - మేడం వాళ్ళు ఇచ్చిన డబ్బుని లెక్కవేస్తే 5 వేల దాకా ఉంది - ఈ డబ్బుని ఇలాగే ఉంచుకుని సాలరీతోపాటు మొత్తం డబ్బులతో పిల్లలకు ఏమైనా తీసుకెళ్లాలి అని ఆనందించాను .
నైట్ భోజనం చేసి బెడ్ పైకి చేరాను - జీవితంలో మొదటిసారి కార్ లో ప్రయాణించాను అని మురిసిపోతున్నాను , ఇలానే అవ్వలు - పిల్లలు కూడా కారులో చిరునవ్వులు చిందిస్తూ వైజాగ్ మొత్తం చుట్టేయ్యడం చూడాలి అని నెరవేరని కోరిక తలుచుకుంటూ నిద్రలోకిజారుకున్నాను . 

తరువాతిరోజు బ్రేక్ఫాస్ట్ తోపాటు మురళి పాత స్కూల్ డ్రెస్ ను మేడం పంపించారని పనిమనిషి అక్క అందించారు . 
స్కూల్ డ్రెస్ వేసుకుని , బ్యాగులో బుక్స్ పెట్టుకుని మెయిన్ గేట్ దగ్గరికివచ్చాను . 
మురళి స్కూల్ బ్యాగుపట్టుకుని వెనుకే వచ్చారు మేడం . మహేష్ ....... నువ్వు ఇచ్చిన ఐడియా అందరికీ నచ్చింది . సెక్యూరిటీతో బెట్టింగ్ డబ్బు - బ్యాట్స్ ...... బస్తీ పిల్లలకు అందేలా చూస్తాము .
థాంక్స్ మేడం అనిచెప్పి కారు వెనుక డోర్ తెరిచాను . మురళి దర్జాగా ఎక్కి కూర్చున్నాడు - మేడం నుండి బ్యాగు - లంచ్ బాక్సస్ అందుకుని లోపల ఉంచి ముందు కూర్చున్నాను . డ్రైవర్ ...... స్కూల్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు . 
నిన్నటిలానే అర్థం కాని ఇంగ్లీష్ టీచింగ్ - బోర్ కొట్టే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్స్ క్లాస్ లతో పనిష్మెంట్ లా మూడు వారాలపాటు meaning less గా గడిచిపోయాయి ( evenings మరియు sundays ఆటలతో ) .

ఒక friday స్కూల్ నుండి ఇంటికిరాగానే , మహేష్ ....... ఈరోజుతో నెలరోజులు గడిచాయి - ఈ నెలరోజులూ ........ మేము చెప్పినట్లుగానే మా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నావు - ఇదిగో నీ సాలరీ అని కవర్ అందించారు .
మేడం ....... అడ్వాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లుంది . 
మేడం : నీ మేడమ్స్ అందరూ సంతోషంగా ఇచ్చారుమరి అని లోపలికివెళ్లారు .

ఔట్ హౌస్ లోకి చేరి చూసుకున్నాను . అంత డబ్బును చూసి నోటివెంట మాటరాలేదు . ప్చ్ ....... రేపే ఆదివారం అయితే ఎంతబాగుణ్ణు అంటూ పెదాలపై చిరునవ్వుతోనే డబ్బుని జాగ్రత్తగా దాచాను . ఫ్రెష్ అయ్యి చదువుకుందామంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉండటం వలన ఓపెన్ చేసేందుకు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు .
అంతలోనే మురళి నుండి కాల్ రావడంతో సంతోషంగా చిన్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్ళిపోయాను . రాత్రంతా కూడా saturday అలా స్కిప్ అయిపోతే ఎంత బాగుంటుందో అని తలుచుకుంటూనే నిద్రపోయాను .

ఉదయం రోజూలానే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ డ్రెస్ లో గేట్ దగ్గరికి చేరుకున్నాను .
మురళి బాల్ బ్యాట్ తీసుకుని కలర్ డ్రెస్ లో బయటకువచ్చి , స్కూల్ బ్యాగ్ - స్కూల్ డ్రెస్ లో ఉన్న నన్నుచూసి నవ్వుతున్నాడు . బయట నుండి సేమ్ గెటప్స్ లో గోవర్ధన్ వాళ్ళు వచ్చి మహేష్ మహేష్ ........ అంటూ నవ్వుకుంటున్నారు .
మురళి సర్ , గోవర్ధన్ ........ ఈరోజు స్కూల్ కు వెళ్లడం లేదా ? .
గోవర్ధన్ : ఈరోజు స్కూలే లేదు మహేష్ ........
ఆశ్చర్యంగా చూస్తున్నాను .
వినయ్ : మహేష్ ....... ఈరోజు సెకండ్ సాటర్డే మరిచిపోయావా ? .
కదా అంటూ సిగ్గుపడ్డాను . అందరితోపాటు నవ్వుతూనే ఔట్ హౌస్ లోకి పరుగుతీసాను . రాత్రి స్కిప్ చెయ్యమని కోరితే ఇలా కోరిక తీర్చారా దేవతలూ ....... నా దేవత పెద్దమ్మ కదా , పెద్దమ్మా ........ థాంక్యూ soooooo మచ్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను . అవ్వల దగ్గరికి వెళ్ళాలి , మురళి వాళ్లేమో బ్యాట్స్ తో రెడీగా ఉన్నారు ఇప్పుడెలా ఎలాగైనా వెళ్ళాలి అని డబ్బును - మొబైల్ ను జేబులో పెట్టుకున్నాను . 

బయటకువచ్చి మురళి దగ్గరికివెళ్ళాను . మురళీ ........ ఇంగ్లీష్ టీచర్ చెప్పారు సోమవారం స్కూల్ కు వచ్చేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకురమ్మని వెళ్లి తీసుకువస్తాను .
మురళి : రేపు వెళ్ళొచ్చులే , మ్యాచ్ ఆడాలని రెడీ అయిపోయాము .
గోవర్ధన్ : రేపు ఎలా కుదురుతుంది , రేపు సెక్యూరిటీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాము కదా ........ 
మురళి : మరిచేపోయాను ....... , మహేష్ ....... ఒక్క బుక్ కదా తొందరగా వెళ్లి తీసుకొచ్చేయ్ ........
( ఈ కొద్దిసమయం సరిపోదు - సాయంత్రం వరకూ నా ప్రాణమైన వాళ్ళతో సరదాగా గడపాలి - చూసి మూడు వారాలవుతోంది ) ఇప్పుడెలా , మురళి సర్ .... ఇప్పటివరకూ జూ చూడలేదు , బుక్ కొనుక్కొని చూసి రావాలని చిన్నప్పటి నుండి ఆశ ...... please please నన్ను వెళ్ళనివ్వండి .

నామాటలు మేడం విన్నట్లు , నాన్నా మురళీ ........ పంపించు పాపం అన్నారు .
మురళి : మమ్మీ చెప్పింది కాబట్టి ఈసారికి ok వెళ్లు ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మురళి సర్ అని చేతిని అందుకోబోతే విధిలించాడు .
వినయ్ : మురళీ ....... మనం కూడా మహేష్ తో పాటు వెళితే ఎలా ఉంటుంది .
ఇప్పుడెలా ......... , ఒప్పుకోనే ఒప్పుకోడులే అని కాన్ఫిడెంట్ గా 3 2 1 .......
మురళి : మహేష్ గాడితోపాటు వెళ్లడం ఏమిటి , వాడు బస్ లో మనం కారులో వెళదాము కొత్తబట్టలు వేసుకుని రెడీ అయ్యి ........ మహేష్ నువ్వు వెళ్లు .
హమ్మయ్యా ........ థాంక్ గాడ్ నో నో నో థాంక్ పెద్దమ్మ అని మనసులోనే నవ్వుకుని ఏరియా బయటకువచ్చాను . బస్తీ గుండా వెళుతుంటే మళ్లీ ఎవర్ ఫాలో అవుతున్నట్లు అంతలోనే బస్తీ పిల్లలు నా ముందుకువచ్చి , మహేష్ ....... థాంక్యూ మా డబ్బులు వడ్డీతోసహా చేరాయి - మా బ్యాట్స్ ఇచ్చేసారు నువ్వే చెప్పావట కదా సెక్యూరిటీ అన్నలు చెప్పారు ఇకనుండీ మీజోలికి రాము వెళ్లు అని దారిని వదిలారు .
అయితే ఇకనుండీ మనం ఫ్రెండ్స్ , వీలైతే కలసి క్రికెట్ ఆడుదాము అని చేతులుకలిపి బయలుదేరాను .
సిటీ సెంటర్ చేరుకుని పిల్లలకోసం రెండు బుజ్జి సైకిళ్ళు - పాపాయిలకోసం ఆటవస్తువులు తీసుకుని లగేజీ ఆటోలో ఇంటికిచేరుకున్నాను .

ఆశ్చర్యం కాదు కాదు షాక్ ........ , క్రికెట్ గ్రౌండ్ కంటే పెద్దదైన కాంపౌండ్ గోడ నిర్మించినట్లు , సెక్యురిటి గల మెయిన్ గేట్ పై " అవ్వ అనాధశరణాలయం " బోర్డ్ తో స్వాగతం పలకడం చూసి షాక్ ఆ వెంటనే అమితమైన ఆనందం కలుగుతోంది .
సైకిళ్ళు - బొమ్మలు కిందకుదించి ఆటో కు పే చేసి పంపించి , లోపలికి వెళ్లబోతే సెక్యూరిటీ ఆపాడు .
అంతలోనే లోపల ఆడుకుంటున్న పిల్లలు చూసి , అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ అందరూ పరుగునవచ్చి నన్ను లోపలికి పిలుచుకునివెళ్లారు . సెక్యూరిటీ అన్నా ........ మా అన్నయ్య ఎప్పుడు వచ్చినా వదలాలి అని ఆర్డర్ వేశారు .
లోపల చూస్తే మరింత ఆశ్చర్యం .........
పిల్లలు : అవ్వలూ అవ్వలూ ....... అన్నయ్యలు వచ్చారు . సైకిళ్ళు బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని కేకలువేశారు . అన్నయ్యా ....... ఏంటి అలా చూస్తున్నారు మన పెద్దమ్మే ఇలా చిన్న ఇళ్లను ఇంతపెద్ద అనాధ శరణాలయం లా మార్చేశారు . అదిగో అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ( అప్పుడే బేస్మెంట్ వరకూ పనులు పూర్తయ్యాయి ) - అన్నయ్యా ........ అదిగో అక్కడ ఉన్న కార్లు కూడా మనవే పెద్దమ్మ మనకోసం ఎక్కడికైనా వెళ్ళడానికి ........ కార్లలోనే జూ - వండర్ లా - మూవీస్ ........ ఇలా రోజూ ఒకచోటకు వెళ్ళాము తెలుసా భలే ఎంజాయ్ చేసాము - మీరు కూడా ఉండి ఉంటే బాగుండేది .
రాత్రి కోరుకున్న కోరికను ఎప్పుడో తీర్చేసారా పెద్దమ్మా ...... మా దేవతా ....... , చుట్టూ చూసి మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలుగుతున్నట్లు పరవశించిపోతున్నాను . పిల్లలూ ........ మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్లు కాదా ....... చెప్పండి .
అంతలో అవ్వలు వచ్చి మహేష్ మహేష్ వచ్చావా నాయనా అంటూ కౌగిలించుకున్నారు . 
అవ్వల ఆనందం చూస్తే ఇక ఈ జీవితానికి ఈ సంతోషం చాలు అని అవ్వా అవ్వా ........ చాలా చాలా ఆనందం వేస్తోంది . మిమ్మల్ని ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూస్తున్నాను అని చేతులను అందుకుని శరణాలయం మొత్తం చిరునవ్వులు చిందిస్తూ రౌండ్ వేశాము .
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇదంతా నీవల్లనే మహేష్ , నువ్వు కోరుకున్నావని చిన్న ఇళ్లను ఇలా మార్చేసింది పెద్దమ్మ - మేము కారులో తిరగాలని కోరుకున్నావని వెంటనే కార్లు తీసుకొచ్చేసారా .
అయ్యో ........ అలా అయితే ఈ విషయం తెలిసి ఉంటే నా అవ్వలు - పిల్లలు పాపాయిలు ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో విహరించాలని కోరుకునేవాన్ని నాకు బుద్ధే లేదు.
అందరూ నవ్వుకున్నారు . అంతలో కొరియర్ బాయ్ వచ్చి మహేష్ కు కొరియర్ అంటూ కవర్ అందించి సంతకం చేయించుకుని వెళ్ళిపోయాడు .
ఆశ్చర్యపోయి ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే " ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్స్ " అవ్వలూ ....... అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాను - పిల్లలూ ....... ఇవి ఏమిటో తెలుసా రేపు మీరందరూ విమానం ఎక్కబోతున్నారు అని ఇద్దరిని ఎత్తుకుని ముద్దులుపెట్టాను . 
పిల్లల సంతోషాలకు అవధులు లేవు . అన్నయ్యా అన్నయ్యా ....... మరి మీరు ? .
మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేసినట్లే కదా ........ , రేపు నేను బయటకు రావడం కుదరదు - ఈరోజుకూడా అపద్దo చెప్పి వచ్చాను మిమ్మల్ని చూడటం కోసం - ఇక్కడకు వచ్చాక మరింత ఆనందం ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ఇలా కోరుకోగానే తీర్చేశారు మీరు నిజంగా దేవతే అని ప్రార్థించాను - కానీ నాకుమాత్రం కనిపించడం లేదు పర్లేదు పర్లేదు ....... పిల్లల సంతోషాలలో మిమ్మల్ని చూసుకుంటానుగా ........
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇక నువ్వుకూడా ఇక్కడికే వచ్చేయ్యొచ్చు కదా , ఇంత విశాలమైన శరణాలయం ........
అంతకంటే అదృష్టమా అవ్వలూ ....... కానీ అక్కడ మాట ఇచ్చేసాను . మాట తప్పడం అంటే ప్రాణాలు వదలడమే - కష్టంలో ఉన్నప్పుడు వారే సహాయం చేసారు ఇప్పుడు వదిలి రావడం తప్పు . మీరు ఇక్కడ సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని భోజనం చేసి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళ్ళొస్తానని చెప్పాను .
అవ్వ : నాయనా మహేష్ ........ చెప్పడం మరిచిపోయాము . పెద్దమ్మ మరొక మాటకూడా చెప్పారు - అతిత్వరలో నీ జీవితంలోకి " నువ్వు ప్రాణమిచ్చే , నీకోసం ప్రాణమిచ్చే ఆత్మీయులు " రాబోతున్నారట .........
అవునా అవ్వలూ ........ మన దేవత పెద్దమ్మ చెబితే ok అని ఆశీర్వాదం తీసుకుని తిరుగుప్రయాణమయ్యాను . " నేను ప్రాణమిచ్చే - నన్ను ప్రాణంలా చూసుకునే ఆత్మీయులు ఎవరై ఉంటారబ్బా " ..................
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 11-07-2021, 10:48 AM



Users browsing this thread: 26 Guest(s)