Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
క్లాస్సెస్ జరుగుతుండగా నేరుగా హెడ్ మాస్టర్ రూమ్ కు వెళ్లి విషయం చెప్పాను . ఆఫీస్ రూంలో అప్లై చెయ్యమనిచెప్పారు . థాంక్స్ సర్ అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ రాసి ఆఫీస్ రూంలోని సర్ కు ఇచ్చాను . 
సర్ : ఏ స్కూల్లో జాయిన్ అవుతున్నావు .
******** ఇంటర్నేషనల్ స్కూల్లో సర్ .........
సర్ : మంచి ఛాన్స్ కొట్టావు .
నాకు govt స్కూల్లోనే చదవాలని ఇష్టం సర్ కానీ పరిస్థితుల ప్రభావం వలన ట్రాన్స్ఫర్ అవ్వాల్సివస్తోంది . అక్కడ విద్యను మాత్రమే నేర్చుకోగలం కానీ ఇక్కడ జీవితాన్ని నేర్చుకోవచ్చు .
సర్ : కరెక్ట్ గా చెప్పావు ......... లెటర్ చూసి ఆ మహేష్ అని అభినందించారు . TC ప్రిపేర్ చెయ్యడానికి సమయం పడుతుంది సాయంత్రం స్కూల్ క్లోజ్ చేసేలోపు వచ్చి తీసుకో అంతవరకూ క్లాస్సెస్ అటెండ్ అవ్వు .........
థాంక్యూ సర్ ........ , ( క్లాస్సెస్ కంటే ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ) అని పెదాలపై చిరునవ్వుతో బయటకువచ్చి సిటీ సెంటర్ చేరుకున్నాను .

బేకరీకి వెళ్లి కేజీ కేజీ 5 cakes ఆర్డర్ ఇచ్చాను , అక్కడే ఉన్న అన్నయ్యను ఫేమస్ బిరియానీ పాయింట్ ఎక్కడో కనుక్కుని 10 ప్యాకెట్స్ బిరియానీ చికెన్ ఫ్రై తీసుకున్నాను - ప్రక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాపులో పిల్లలందరికీ రెండు రెండు చెప్పున ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకుని బేకరీకివెళ్లి ఆర్డర్ చేసిన cakes తీసుకుని ఒకచేతితో పట్టుకోవడం కష్టమై ఆటోలో మా ఇంటికి చేరుకున్నాను .
ఆశ్చర్యం ......... రెండు చిన్న ఇల్లులూ రంగులువెయ్యబడి కొత్తగా మారిపోయాయి - చుట్టూ ఉన్న ముళ్లపొదలు మురికి మొత్తం శుభ్రన్గా మారిపోయింది - పిల్లలు సంతోషంగా బయట ఆడుకుంటున్నారు . 
నన్నుచూసి అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ పరుగునవచ్చారు . సంతోషపు ఆశ్చర్యంతోనే పిల్లలకు cakes - ఐస్ క్రీమ్స్ అందించాను . 
పిల్లలు మరింత సంతోషంతో అవ్వలూ అవ్వలూ ........ అంటూ లోపలికి పరుగులుతీశారు . 
ఆటో డబ్బులు ఇచ్చేసి బిరియానీ పార్సిల్స్ అందుకుని లోపలికివెళ్ళాను . మరింత ఆశ్చర్యం కరెంట్ లేక క్యాండిల్స్ ఒక్కొక్కరాత్రి అవీ లేక చీకటిలోనే ....... కానీఇప్పుడు ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది - పెద్ద ఫ్రిడ్జ్ - ఒకటి కాదు హాల్ లో ఏకంగా ఒక AC ఒక కూలర్ - వాషింగ్ మెషీన్ - కొత్త బెడ్స్ ........ ఇలా అన్నీ కొత్తకొత్తగా ఉన్నాయి - బుజ్జిపాపాయిలు అందమైన కొత్త ఊయలలో హాయిగా నిద్రపోతున్నారు , వెళ్లి నెమ్మదిగా ఊపి ఆనందించి ముద్దులుపెట్టాను - నా పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు , నేను అక్కడ ఔట్ హౌస్ లో ఏ ఏ వసతులైతే పొందానో అవన్నీ ఇక్కడ ఉండటం చూసి నా ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . ఇల్లు సగభాగం ఆటవస్తువులతో నిండిపోయింది - నాలుగు గోడలపై govt స్కూల్ క్లాస్సెస్ గోడలపై ఉండేలా అనిమల్స్ ఆల్ఫాబెట్స్ రంగురంగుల పెయింట్స్ ఉన్నాయి .

చూడండి అన్నయ్యా ......... మీరు వచ్చారంటే అవ్వలు నమ్మడం లేదు అని ఐస్ క్రీమ్స్ తింటూ పిలుచుకునివచ్చారు .
అవ్వలు : బాబూ మహేష్ అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకోబోయి భుజం పై కట్టుని చూసి సంతోషం స్థానంలో కన్నీళ్లు వచ్చేసాయి . మహేష్ మహేష్ ...... ఏమైంది అని కంగారుపడుతూ అడిగారు .
అవ్వా అవ్వా ........ కంగారుపడాల్సిన అవసరమేలేదు అని బెడ్ పై కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చున్నాను . ఈ కట్టు వల్లనే నాకు పని దొరికింది అని జరిగినదంతా వివరించాను - వారంలో నాయమైపోతుందని డాక్టర్ చెప్పారు , ఇంటిప్రక్కనే డాక్టర్ రోజూ చెక్ చెయ్యాలి రమ్మనికూడా చెప్పాడు అని కన్నీళ్లను తుడిచాను - అవ్వలూ ......... వారంలో పెద్ద స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు .
చిన్నగా చిరునవ్వులు విరిసాయి . హమ్మయ్యా ....... అని ఇద్దరినీ కౌగిలించుకున్నాను . 
పిల్లలందరూ సంతోషంతో చిందులువేస్తూ షర్ట్స్ పైకి కార్చుకుంటూ ఐస్ క్రీమ్స్ తినడం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము . 
అవ్వలు : నువ్వు ఎలా ఉన్నావోనని వెళ్లిన క్షణం నుండీ ఒకటే బెంగ , నీ గమ్యాన్ని చేరుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అని నుదుటిపై ముద్దుపెట్టారు . 
లవ్ యు అవ్వలూ ...... , అంతా మీ ఆశీర్వాదం అని పాదాలను స్పృశించాను .
అవ్వలు : కన్నీళ్లను తుడుచుకుని ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావు మహేష్ అని దీవించారు . 
పెదాలపై చిరునవ్వులతో పిల్లలూ ........ మీకోసం బిరియనీతీసుకొచ్చాను .
పిల్లలు : ఈరోజు కూడా బిరియానీ ........ , భలే భలే ........
అవ్వ : అవును మహేష్ ........ నిన్న జీవితంలో తొలిసారి బిరియానీ తిన్నాము . వీటన్నింటినతోపాటు మాకోసం వంట మనిషిని కూడా ఏర్పాటుచేసింది - వంటలన్నీ ఆమెనే చేస్తోంది .
అవునవును మా అవ్వలను చూసిన ఆనందంలో అడగడమే మరిచిపోయాను , ఇలా అద్భుతంగా ఎలా మారింది అవ్వలూ........
అవ్వ : నువ్వు వెళ్లిన మరుసటిరోజు నువ్వు పంపించావు అని ఒక తల్లి వచ్చి ఒక్కరోజులో మొత్తం ఇలా మార్చేసింది - మీకు ఏ అవసరం వచ్చినా నేను వచ్చేస్తాను అని అదిగో ఈ అమ్మాయిని మాకు తోడుగా ఉంచి వెళ్ళిపోయింది .
నేనా ....... ? అంటూ షాక్ లో ఉండిపోయాను . తేరుకుని లేదు అవ్వలూ నేను పంపనేలేదు .
అవ్వ : నువ్వు ఇలా చెబుతావని కూడా చెప్పింది . 
లే ....... లేదు 
అవ్వ : నీకు పెద్దమ్మ అవుతుందట , నిన్ను బుజ్జాయిగా మా దగ్గరికి చేర్చింది తనేనట - ఇక నుండీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పెద్దమ్మనే అని కోరిన కోర్కెలన్ని తీర్చేసింది చూశావుకదా ఎన్ని బొమ్మలున్నాయో ........ , బిరియానీ చికెన్ ఫ్రై కూడా స్వయంగా చేసింది - నీకు కూడా చేరేలా చేస్తాను అని తీసుకెళ్లింది. నీ అడ్వాన్స్ డబ్బులతో గిఫ్ట్స్ తీసుకొస్తావని చెప్పింది , మిగిలిన డబ్బులు మాకు ఇస్తావనికూడా చెప్పింది .
అవునవును అవ్వలూ ........ అంటూ మిగిలిన పదివేలను అవ్వలకు అందించాను షాక్ లోనే .........
అవ్వ : సగం తీసుకుని సగం ఖర్చులకు ఇవ్వమని చూపింది అని నా జేబులో ఉంచారు .
అవ్వలూ ........ నాకు ఖర్చులేమి ఉంటాయి , ఉండటానికి ఇలాంటి వసతులు గల చోటుని ఇచ్చారు - ఫ్రీ గా పెద్ద స్కూల్ కు వెళ్లబోతున్నాను - మూడుపూటలా భోజనం పెడుతున్నారు అని డబ్బుని మొత్తం ఇవ్వబోతే ........
అవ్వలు : మహేష్ ........ మీ పెద్దమ్మ సంవత్సరానికి సరిపడే వసతులను సమకూర్చేశారు , అవసరమైనప్పుడు వచ్చివెళతాను అనిచెప్పారు కాబట్టి ఇకనుండీ మా గురించి మాత్రమే ఆలోచించకుండా నువ్వు గొప్ప స్థాయిని చేరుకోవాలి అని నుదుటిపై ముద్దులుపెట్టారు .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో ........ , మీరు పిల్లలే నాజీవితం అవ్వలూ - మీ సంతోషమే నా సంతోషం - మీరు లేకపోతే నేను ఉండేవాడినా అని హత్తుకున్నాను.
అవ్వలు : లవ్ యు మహేష్ , నువ్వు బాగా చదువుకుంటే మేము సంతోషంగా ఉంటాము .
అలాగే అవ్వలూ ....... అని కన్నీళ్లను తుడుచుకుందాము . అవ్వలూ ........ ఇంత సంతోషమైన సందర్భంలో కేక్ కోసి సెలెబ్రేషన్స్ చేసుకుందాము అని పిల్లలతో కోయించి బిరియానీ తిని ఎంజాయ్ చేసాము - పాపాయిలకు పాలు తాగించాము .
అవ్వలు : మహేష్ ........ నిన్న తిన్న బిరియానీ దీనికంటే రుచిగా ఉంది అని మైమరిచిపోతూ చెప్పారు .
అవును నేను తిన్న బిరియానీ కూడా అవ్వలు ఫీల్ అయినట్లుగానే ఉంది అని మనసులో అనుకుని , సంతోషాలన్నింటినీ నా మొబైల్ లో చిత్రీకరించాను రోజూ చూసి ఆనందించడానికి . పెద్దమ్మా ........ మీరెవరో తెలియదు కానీ ఏ సంతోషాలనైతే చూడాలని అనుకున్నానో ఆ కోరిక తీర్చారు - ఈరోజు నుండీ మిమ్మల్నే దేవతలా కొలుచుకుంటాను అని గుండెలపై చేతినివేసుకున్నాను . 

సంతోషాలను హృదయమంతా నింపుకుని ఇంటి బయటకువచ్చి , మురళికి కాల్ చేసాను TC ఆలస్యం అవుతుందని ........
మురళి : మళ్లీ గుడ్ మహేష్ అని పొంగిపోతున్నట్లు అనిపించింది .
మురళీ సర్ ........ ఒకవిషయం అడుగుతాను ఏమీ అనుకోరు కదా .......
మురళి : సంతోషంలో ఉన్నాను అడుగు మహేష్ ........
మురళి సర్ ....... నిన్న మధ్యాహ్నం నాన్ వెజ్ ........ తిన్నా.......
మురళి : నో నో నో స్టాప్ స్టాప్ సండే మాఇంటిరోజు , సండే ఎప్పుడూ నాన్ వెజ్ గురించి ఆలోచించకు . మంగళవారం కుమ్మేస్తాము - రేపు మమ్మీ బిరియానీ చేస్తుంది నీకూ పంపిస్తానులే ..........
థాంక్స్ మురళి సర్ అని ఆశ్చర్యపోతూనే కట్ చేసాను . అంటే ....... నిన్న నేను తిన్న బిరియానీ పెద్దమ్మ ........ అంటే పెద్దమ్మ నాదగ్గరికి వచ్చారన్నమాట అని ఆనందం ఆగడం లేదు . పెద్దమ్మా ....... నాకు దర్శనం ఇవ్వకుండానే వెళ్ళిపోయారా ఆ అదృష్టం ఎప్పుడు ....... డిమాండ్ కాదు రిక్వెస్ట్ మాత్రమే ఇప్పటికి ఈ సంతోషాలు చాలు అని లోపలకు వెళ్లి సాయంత్రం వరకూ సరదాగా గడిపాను .

3 గంటలకు అవ్వలూ ......... స్కూల్ వదిలే సమయం కావస్తోంది నేను వెళ్లివస్తాను  , ఎటువంటి అవసరం ఉన్నా ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి - పెద్దన్న సహాయగుణం వలన మీరు , పిల్లలు ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి . అవ్వలూ ........ మీరు ఎలాఉన్నారోనని కాస్త కంగారుపడుతూనే వచ్చాను - వెళ్ళేటప్పుడు మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో వెళుతున్నాను అని ఆశీర్వాదం తీసుకుని , పిల్లలకు టాటా చెప్పి స్కూల్ కు బయలుదేరాను . 
పెద్దమ్మా ........ మీరు నాకోసం వచ్చారు అని అవ్వలు చెప్పారు - నా గురించి ఆలోచించకండి , ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా ముందుకువెళతాను - ఏ చిన్న సహాయం అయినా అవ్వలు , పిల్లలకేచెయ్యండి అని గుండెపై చేతినివేసుకుని మనసులో అనుకున్నాను - మీరే మా దేవత కాబట్టి ప్రార్థిస్తున్నాను కూడా అని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ సగం సంతోషo , సగం భారంగా అడుగులువేస్తున్నాను .

సరైన సమయానికే స్కూల్ చేరుకున్నాను . ఆఫీస్ రూమ్ కు వెళ్లి TC పొందాను . సర్ ........ నా భవిష్యత్తుకు all the best చెప్పడంతో థాంక్స్ చెప్పేసి చిరునవ్వులు చిందిస్తూ నడుచుకుంటూనే సంతోషంగా కొత్త ప్రపంచం వైపు అడుగులువేశాను - అవ్వలు , పిల్లల సంతోషం చూశాక భారమంతా హుష్ కాకి అయిపోయింది . 
ఏరియా మై గేట్ సెక్యురిటి : ఏంటి మహేష్ ........ ఉదయం కంటే ఉత్సాహంగా ఉన్నావు .
అవును అన్నలూ ........ ఈరోజు చాలా సంతోషంగా ఉంది , కొందరిని ఎలా అయితే చూడాలని ఆశపడ్డానో అలా చూసేసాను నా దేవత ( పెద్దమ్మ ) వలన అని లోపలికి వెళ్ళాను . 

మహేష్ ....... TC తెచ్చావా అని చిన్న గ్రౌండ్ దగ్గర ఆడుకుంటున్న గోవర్ధన్ వినయ్ అడిగాడు .
మేడమ్స్ ........ కోరినట్లుగానే తీసుకొచ్చాను .
మురళి : అయితే TC ఇంట్లో పెట్టేసి వచ్చేయ్ ........
నిమిషంలో వచ్చేస్తాను మురళి సర్ , ( ఇక నా జీవితం ఇక్కడి నుండే మొదలు మీతో ఎంత అనకువగా ఉంటే అంత మంచిది నాకు ) పరుగుతీసాను .
పిల్లలు : రేయ్ మురళీ ....... నువ్వంటే మహేష్ కు చాలా భయం .
మురళి : కంట్రోల్ లో పెట్టాను మరి అమ్మ సహాయంతో అని నవ్వుకున్నారు .
ఇంటికి చేరుకుని సెక్యురిటి అన్నకు hi చెప్పి లోపలకువెళ్ళాను  - ఆ వెనుకే మేడం వాళ్ళు అప్పుడే ఫంక్షన్ నుండి వచ్చినట్లు కారులో లోపలికివచ్చారు . 
మేడం : కారు దిగి మహేష్ TC .......
తీసుకొచ్చాను మేడం అని వినయంతో చూయించాను .
మేడం : ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లి తీసుకొచ్చావు అంటే , మా పిల్లల బాడీగార్డ్ గా నువ్వు పర్ఫెక్ట్ ....... , నెక్స్ట్ సోమవారం స్కూల్ కు తీసుకెళ్లాలి అని సంతోషంతో లోపలికివెళ్లారు .
దానికి నేనే మీకు ఋణపడిఉంటాను మేడం , ఎక్కడో ఉండాల్సినవాడిని ....... అని నమస్కరించి ఔట్ హౌస్ లోకివెళ్లి TC జాగ్రత్తగాఉంచాను . ఫ్రెష్ అయ్యి పరుగున చిన్న గ్రౌండ్ కు చేరుకున్నాను . 
వినయ్ : మురళీ ....... నువ్వు చెప్పినట్లుగానే 15 నిమిషాలలో వచ్చేశాడు , నువ్వేగెలిచావురా ......... 
గెలిపించావు మహేష్ అన్నట్లు నావైపు గర్వపడుతూ చూసాడు మురళి .......
ఒక్క నిమిషం ఆలస్యమైనా , అమ్మో ........ మురళి దగ్గర
జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది జరగకపోతే ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది , మురళి మాటే మేడం మాట కూడా .......... 
చీకటి పడేంతవరకూ ఆడుకున్నారు . 

గోవర్ధన్ : మురళీ ....... కట్టు చెక్ చెయ్యాలని మహేష్ ను డాడీ పిలుచుకునిరమ్మన్నారు .
నాకే కాదు ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ మురళి అంటే భయమే అనుకుని లోలోపలే నవ్వుకున్నాను . 
మురళి కళ్ళతోనే సైగచెయ్యడంతో గోవర్ధన్ క్లినిక్ కు పిలుచుకునివెళ్లాడు .
డాక్టర్ గారు చెక్ చేసి , చెప్పానుకదా భుజానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని మరొకసారి ఇలానే చేస్తే అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది , నా ఫీజ్ కేవలం వారం వరకు మాత్రమే ఇచ్చారు అని కోపంగానే చెప్పారు - ఇలా జరిగినా నవ్వుతూ వచ్చావు అంటే నీది ఐరన్ బాడీ అయి ఉంటుంది - గోవర్ధన్ ...... స్కూల్లో మీతోపాటు మహేష్ ఉంటే ఇక మాకు భయం లేదు .
( అంతా ఆ బస్తీ పిల్లల వలనే ) అలాగే డాక్టర్ గారూ ....... ఇకపై అలా జరగకుండా జాగ్రత్తపడతాను , ( ఎలాగో వారం రోజులు బయటకువెళ్లను కదా ....... ) 
డాక్టర్ గారు : టాబ్లెట్స్ మూడుపూటలా వేసుకో త్వరగా ఫిక్స్ అయిపోతాయి , ఇక వెళ్లు ........
గోవర్ధన్ కు గుడ్ నైట్ చెప్పి ఔట్ హౌస్ చేరుకున్నాను . లోపల ఫుడ్ రెడీగా ఉండటంతో తినేసి నేలపై పడుకోగానే అలసిపోవడం వలన హాయిగా నిద్రపట్టేసింది.

ఉదయం బెడ్ పై లేచాను - AC కూడా వేసి ఉంది . బెడ్ పైకి ఎలాచేరాను అని ఆశ్చర్యపోయాను . చేతిలో పేపర్ నోట్ ఉండటం చూసి చదివాను .
" నేలపై పడుకుంటే భుజంపై స్ట్రెస్ ఎక్కువపడి నొప్పివేస్తుంది , రేపటి నుండీ బెడ్ పైనే పడుకో మహేష్ ....... please - నీకు నొప్పివేస్తే నేను తట్టుకోలేను " .
అలాగే అంటూ తలఊపాను - ఎవరై ఉంటారు ....... పెద్దమ్మనా అంటూ చుట్టూ చూసి పరుగున బయటకువచ్చిచూస్తే సెక్యూరిటీ తప్ప ఎవరూ లేరు . 
అన్నా ........ రాత్రి ఎవరైనా లోపలికివచ్చారా ...... ? .
సెక్యూరిటీ : నాకు తెలిసి లేదు తమ్ముడూ ........ , ఎందుకు అలా అడుగుతున్నావు ? , రాత్రి ఎందుకో తెలియదు కొద్దిసేపు మైకం వచ్చినట్లు వాటంతట అవే కళ్ళుమూతలుపడ్డాయి - ఎవరైనా వచ్చినట్లు అలికిడి వినిపించిందా చెప్పు మహేష్ - సర్ వాళ్లకు తెలిస్తే నన్ను పీకేస్తారు .
లేదు లేదు అన్నా ........ ఊరికే అడిగాను అని లోపలికివెళ్ళాను . అంటే సెక్యురిటి మైకం కమ్మినప్పుడు ........ పెద్దమ్మ ........ , ఖచ్చితంగా ఎవరో వచ్చారు కాబట్టే నన్ను బెడ్ పై పడుకోబెట్టారు - మా దేవత పెద్దమ్మ అనే నమ్ముతున్నాను థాంక్స్ పెద్దమ్మా ........ మీరు చెప్పారుకదా బెడ్ పైనే పడుకుంటాను అని AC ఆఫ్ చేసి కాలకృత్యాలు తీర్చుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటకువచ్చాను - మురళి కాల్ రావడంతో జాగింగ్ బయలుదేరాము .
ఆరోజు నుండీ తెల్లవారుఘామున జాగింగ్ - బ్రేక్ఫాస్ట్ - ఉదయం పెద్ద గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే చూడటం - లంచ్ - మధ్యాహ్నం రెస్ట్ - సాయంత్రం చిన్న గ్రౌండ్ లేదా ఇండోర్ ఆడిటోరియం లో గేమ్స్ - డాక్టర్ గారి చెకప్ - బిగ్గెస్ట్ బిల్డింగ్ చూస్తూ ఇంటికి చేరడం - డిన్నర్ - పెద్దమ్మ కోరిక ప్రకారం బెడ్ పై పడుకోవడం - ఉదయం లేచి చూస్తే AC on చేసి ఉండటం ......... ఇలా వారం రోజులు అలా అలా గడిచిపోయాయి . 

ఆదివారం ఉదయం డాక్టర్ గారు పిలిపించి చెక్ చేశారు - స్కాన్ చేశారు . మహేష్ ....... నీది ఐరన్ బాడీ అని చెప్పానుకదా భుజం సెట్ అయిపోయింది అని కట్టు వేరుచేసి చేతిని విదిల్చమన్నారు - ఊపమన్నారు - రౌండ్స్ వెయ్యమన్నారు ....... 
నొప్పివేస్తోందా మహేష్ ........
లేదు డాక్టర్ గారు - లేనేలేదు గోవర్ధన్ ........
డాక్టర్ గారు : హమ్మయ్యా ........ ఈరోజుతో ఫీజ్ డబ్బులు కూడా సరిపోయాయి వెళ్లు వెళ్లి రోజంతా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు , వారం రోజులు అయ్యిందికదా స్నానం చేసి ........
థాంక్స్ డాక్టర్ గారూ అని చేతిని ఊపుకుంటూ ఇంటికి పరుగుతీసాను . నా అదృష్టం అప్పుడే బయటకు వెళ్ళడానికి వచ్చిన మేడం - మురళికి నయమైపోయింది అని చూయించాను .
మేడం : గుడ్ మహేష్ ........ , రేపు ఉదయం 7 గంటలకు రెడీగా ఉండు స్కూల్లో జాయిన్ చేస్తాను అనిచెప్పి కారులో బయటకువెళ్లారు . 
రేపటి నుండి మళ్లీ స్కూల్ అదికూడా పెద్ద స్కూల్ అని సంతోషంతో వెళ్లి సుమారు రెండు గంటలపాటు షవర్ కిందనే ఉండిపోయాను . తలంటు స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకు రాగానే వొళ్ళంతా తేలికగా అనిపించింది . డ్రెస్ వేసుకుని ఆరోజంతా సంతోషంగా గడిపేసాను ఆరోజు అందరితో కలిసి బ్యాటింగ్ చేసాను ఫీల్డింగ్ చేసాను బౌలింగ్ చేసాను . సోమవారం తెల్లవారుఘామునే లేచి ఫ్రెష్ అయ్యి ఇస్త్రీ చేసిన మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటే వేచిచూస్తూ ఉన్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 11-07-2021, 10:46 AM



Users browsing this thread: 3 Guest(s)