Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నొప్పివలన సరిగ్గా చూడలేదు కానీ స్ట్రీట్ కు ఇరువైపులా ఒకటి మించిన మరొక బిల్డింగ్స్ అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించినట్లు ఒక విలాసవంతమైన లోకంలోకి అడుగుపెట్టాను అనిమాత్రం తెలిస్తోంది . 
నన్ను ఎవరి ఔట్ హౌస్ లో ఉంచుకోవాలి అని పోటీపడుతున్నారు ఎందుకంటే వారి అబ్బాయికి దగ్గరగా ఉంటాను అని . 
చివరికి కెప్టెన్ మురళి అమ్మగారు విజయం సాధించినట్లు , మహేష్ అన్నావుకదా ....... మహేష్ రా వెళదాము అని వారి ఇంటికి పిలుచుకునివెళ్లారు . 
సెక్యురిటి పెద్ద గేట్ తెరవగానే బిల్డింగ్ మరియు పూలమొక్కలతో గల పెద్ద కాంపౌండ్ ను అలా చూస్తూ ఉండిపోయాను .

మేడం : సెక్యురిటి ........ ఈ పిల్లాడి పేరు మహేష్ , ఈ రోజు నుండీ ఔట్ హౌస్ లో ఉంటాడు - ఎప్పుడు వచ్చినా లోపలకివదలండి . మహేష్ ....... అదిగో అదే ఈరోజు నుండి నువ్వు ఉండబోయే చోటు . భోజనం చేశావా అని అడిగారు .
తలను అడ్డంగా - నిలువునా ఊపాను .
మేడం : చూస్తుంటేనే తెలుస్తుంది . ఔట్ హౌస్ లోపలే బాత్రూం ఉంది ఫ్రెష్ అవ్వు - కట్టుకు నీళ్లు తగలనివ్వకు - పనిమనిషితో ఫుడ్ పంపిస్తాను అని కీస్ అందించారు.
థాంక్యూ soooooo మచ్ మేడం . 
మేడం : మహేష్ ....... పొరబాటున గానీ ఇంట్లోకి రావద్దు , మీ సర్ మరియు మురళికి నీలాంటివాళ్ళు అంటే ఏమాత్రం ఇష్టం లేదు , మీ సర్ ఎప్పుడు కనిపించినా తలదించుకుని వెళ్ళాలి సరేనా ........
అలాగే మేడం , మీరు ఎలా అంటే అలా .........
మేడం : రేపు ఒక్కటే స్కూల్ ఉంది నెక్స్ట్ రోజు నుండి వారం రోజులు పండగ సెలవులు - రేపు కూడా వెళ్లకూడదు అని పిల్లలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి నో ప్రాబ్లమ్ , ఈ వారంలో నీ ఎముక కూడా జాయింట్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు , వీలుచూసుకుని చెబితే డ్రైవర్ ను తోడుగా పంపిస్తాను govt స్కూల్ కు వెళ్లి TC తీసుకురావచ్చు . 
TC సంగతి నేను చూసుకుంటాను మేడం , అంత పెద్ద స్కూల్లో చదివే అవకాశం అదే అదే నా మొదటి కర్తవ్యం మురళీ వాళ్ళకు తోడుగా ఉండే పని దొరికినందుకు చాలా హ్యాపీ ........
మేడం : thats గుడ్ బాయ్ ....... , వెళ్లు వెళ్లి ఫ్రెష్ అవ్వు - బట్టలుకూడా చిరిగిపోయాయి , ఫుడ్ తోపాటు మురళి పాత బట్టలు పంపిస్తాను వేసుకో .......
థాంక్స్ మేడం - థాంక్స్ మురళి .........
మురళి : మురళి కాదు మురళి సర్ అని పిలవాలి గుర్తుపెట్టుకో అని పొగరుబోతులా చెప్పాడు .
మేడం : చెప్పానుకదా మహేష్ , మురళికి అన్నీ వాళ్ళ డాడీ పొలికలే వచ్చాయి - వాళ్ళు ఎలా అంటే అలా ........
అలాగే మేడం , థాంక్యూ మురళి సర్ ........ 
మురళి : నన్ను ఎప్పుడూ తాకడానికి ప్రయత్నించకు , నన్నే కాదు నా ఫ్రెండ్స్ ఎవ్వరినీ నువ్వు తాకడం వాళ్లకు గానీ - వాళ్ళ పేరెంట్స్ కు గానీ ఇష్టం లేదు అని చెప్పి మేడం తోపాటు లోపలికివెళ్లాడు .
వీళ్ళు ఎలా ఉంటేనేమి , చిన్న పని దొరికితే చాలు అనుకున్నాను కానీ ఏకంగా విలాసవంతమైన ఏరియా లో ఇష్టమైన పని దొరికింది అని మనసులో అనుకుని వెళ్లి ఔట్ హౌస్ తాళం తెరిచి డోర్ ఓపెన్ చేసి లోపలికివెళ్లి చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ తిరిగి తిరిగి పదే పదే చూస్తూ ఉండిపోయాను - బహుశా ఫైవ్ స్టార్ హోటల్ లో గదులు ఇలానే ఉంటాయేమోనని నన్ను నేను మరిచిపోయాను . 
ఇంతవరకూ ఉన్న ఇంటికంటే పెద్దదైన హాల్ - హాల్ మధ్యలో బెడ్ - ఫ్రిడ్జ్ - AC - టేబుల్ చైర్ - షెల్ఫ్ - కప్ బోర్డ్స్ ......... అవసరానికి మించినవన్నీ ఉండటం చూసి నిజంగా ఇక్కడ ఉన్నానా లేక కలగంటున్నానా అని నన్ను నేను గిల్లుకుని పొందిని ఆనందానుభూతిని మాటల్లో వర్ణించనేలేను . 
మేడం గారు భోజనం పంపించేలోపు ఫ్రెష్ అవ్వాలి బాత్రూం ఎక్కడ అని చుట్టూ చూసి ఒక మూలన ఉన్న డోర్ తెరిచాను . బాత్రూమ్స్ ఇలాకూడా ఉంటాయా అని ఆశ్చర్యానికి లోనయ్యాను . షవర్ - గీజర్ - బాత్ టబ్ - మిర్రర్స్ కూడా ఉండటం చూసి కొత్త లోకంలోకే వచ్చాను . ఈ విలాసం అవ్వలకు పిల్లలకు పాపాయిలకు కూడా లభించాలి అని ప్రార్థించి , స్నానం చేయాలి అని ఉన్నా కట్టు తడవకూడదు కాబట్టి ఫేస్ వాష్ చేసుకుని హాల్ లోకివచ్చాను . 

అప్పటికే ఒకామె వచ్చింది - ఇంటి పనిమనిషి అయి ఉంటుందని అనుకున్నాను . 
మహేష్ ........ మేడం పంపించారు - ఈ పాత్రలలో ఫుడ్ ఉంది - ఈ బ్యాగులో బట్టలు ఉన్నాయి . డ్రెస్ చేంజ్ చేసుకుని చిరిగిన బట్టలను చెత్త బిన్ లో పడేయాలని చెప్పారు . భోజనం చేసి పాత్రలన్నింటినీ బయట ఉంచు నేను తీసుకెళతాను అనిచెప్పి వెళ్లబోయి ఆగారు . ఆ ....... మరిచిపోయాను పిల్లలందరినీ రక్షించినందుకు మరియు వాళ్లకు తోడుగా ఉండే పనికోసం అందరు మేడమ్స్ అడ్వాన్స్ ఇచ్చారు - అనుక్షణం అందుబాటులో ఉండటం కోసం స్మార్ట్ మొబైల్ అని టేబుల్ పై ఉంచి వెళ్ళిపోయింది .
కన్నార్పకుండా చూస్తూనే టేబుల్ దగ్గరికివెళ్లి వణుకుతున్న చేతులతో డబ్బుని అందుకున్నాను . అన్నీ 500 రూపాయల నోట్లు - చేతులు మరింత వణుకుతూనే 1 2 3 ........ 10 11 12 ........ 21 22 23 ........ 28 29 30 మొత్తం ముప్పై 500 నోట్లు అంటే పదిహేను వేలు అని కొన్ని క్షణాలపాటు అలా కదలకుండా ఉండిపోయాను . 
మొబైల్ సౌండ్ చేయడంతో తేరుకున్నాను . జీవితంలో ఇప్పటివరకూ ఒక్క 500 నోటు చూడనేలేదు - ఇప్పుడు ఏకంగా 30 నోట్లు నా చేతిలో అదికూడా నిజాయితీగా వచ్చినవి . అవ్వా ....... మీ పెంపకం వల్లనే ఇది సాధ్యమయ్యింది అని గర్వపడ్డాను .
మొబైల్ అందుకుని ఎలా use చెయ్యాలోకూడా తెలియక స్క్రీన్ పై టచ్ చేసాను మెసేజ్ ఓపెన్ అవ్వడం - స్క్రీన్ పై మేడమ్స్ నెంబర్స్ అన్నీ మెసేజ్ రూపంలో వచ్చాయి . 

ఆకలి దంచేస్తుండటంతో పాత్రలను ప్లేట్ ను వాటర్ బాటిల్ ను నేలపై ఉంచి , నేలపై కూర్చుని మూతలు తెరిచాను . ఒక పాత్రలో చికెన్ బిరియానీ - మరొక పాత్రలో చికెన్ ఫ్రై ఉండటం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి . ఇప్పటివరకూ స్కూల్ లో స్టోర్ బియ్యంతో వడ్డించే భోజనం తప్ప ....... ఇలా పొడవైన అన్నం మెతుకుల ....... ఈ రైస్ ను ఏమో ఏమో ఆ ఆ ...... బాసుమతి రైస్ తో ఏకంగా చికెన్ బిరియానీ తినే అదృష్టం దొరుకుతుందని కలలోకూడా ఊహించలేదు అని చేతినిండా తీసుకుని తినబోయి మళ్లీ కళ్ళల్లో చెమ్మతో అవ్వా - పిల్లలూ ........ 
పదిహేను వేలు ఉందికదా రేపు TC తీసుకురావడానికి వెళతాను కదా స్కూల్లో పని పూర్తవగానే అందరికీ పెద్ద హోటల్ నుండి బిరియానీ , చికెన్ ఫ్రై మరియు పిల్లలకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తీసుకునివెళదాము అని కన్నీళ్లను తుడుచుకుని తిని మ్మ్మ్ ....... సూపర్ అంటూ పాత్రలలో ఒక్క మెతుకు - చికెన్ ముక్క లేకుండా తృప్తిగా తినేసాను . 
ఆవ్ ........ అంటూ తృప్తిగా లేచి ఒకచేతితో కష్టమైనా పాత్రలను శుభ్రం చేసి బయట ఉంచాను - డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం లో చూసుకుని మురిసిపోయాను - మూటలో ఉన్న బట్టలతోపాటు వదిలిన బట్టలను తీసుకెళ్లి మెయిన్ గేట్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేసి సెక్యూరిటీ దగ్గరకువెళ్లి తెలుసుకోవలసిన విషయాల గురించి ప్రశ్నల వర్షం కురిపించాను .

మురళి నాన్నగారు బిజినెస్ మ్యాన్ చాలా అహంకారి అని డబ్బే సర్వస్వం అనుకునేవారు అని , మురళి నాన్నగారితోపాటు ఇక్కడ ఉన్నవారంతా బిజినెస్ మెన్స్ , డాక్టర్స్ , హై govt ఆఫీసర్స్ ....... అందరూ దాదాపు ఒకేరకమైన వారేనని వారితో జాగ్రత్తగా మసులుకోవాలని లేకపోతే నిర్దాక్షన్యంగా పనిలోనుండి తీసేసి పంపించేస్తారని చెప్పారు . 
అందరి గురించి తెలుసుకుని అక్కడే కూర్చున్నాను .
సెక్యూరిటీ : బాబూ ....... ఇది మా డ్యూటీ నువ్వు లోపలికివెళ్లి హాయిగా రెస్ట్ తీసుకో ........
పర్లేదు అన్నా ....... ఇదంతా మనకు అలవాటే , రెస్ట్ అన్నది మన జీవితంలో ఉంటుందా చెప్పండి .
సెక్యురిటి : నిజం చెప్పావు తమ్ముడూ ........ 

అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్క్రీన్ పై మురళి సర్ అని పడింది . మురళి సర్ అని సేవ్ చేసే మొబైల్ పంపించాడన్నమాట అని నవ్వుకున్నాను . ఎంత వొత్తినా రింగ్ అవుతూనే ఉంది .......
సెక్యూరిటీ : తమ్ముడూ ........ స్మార్ట్ ఫోన్ వాడటం ఇదే తొలిసారి కదూ అని స్వైప్ చేసాడు .
మురళి : రేయ్ ........ ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ? అని కోపం తెలుస్తోంది .
మురళీ ....... మురళీ సర్ ....... స్మార్ట్ ఫోన్ చూడటం ఇదే తొలిసారి , ఎలా వాడాలో తెలియదు సెక్యురిటి అన్న .........
మురళి : ok ok , అదీ అలా సర్ అని పిలవాలి , గ్రౌండ్ ప్రక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కు వెళ్ళాలి గేట్ దగ్గరే ఉండు .
మురళి సర్ అక్కడే ఉన్నాను .
మురళి : గుడ్ , wait చెయ్యి .........

15 నినిషాలలో ఇళ్ళల్లోనుండి పిల్లలందరూ బ్యాట్స్ బాల్ తో వచ్చిన తరువాత మురళి దర్జాగా బయటకువచ్చాడు . ఫ్రెండ్స్ ........ ఇక నుండీ వేరే ఎవ్వరితో ఆదుకునేది లేదు , మనం మనమే ఆడుకుందాము .
క్రికెట్ అంటే చాలు పిల్లల్లో ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తుంది , నేనూ ఆపుకోలేక మురళి సర్ ........ అంత పెద్ద గ్రౌండ్ లో సగం సగం ఆడటానికి ప్లేయర్స్ తక్కువపడతారు , నేనూ ఆడవచ్చా ........ ? .
మురళి ఫ్రెండ్ గోవర్ధన్ : మార్నింగ్ , మధ్యాహ్నం మాత్రమే పెద్ద గ్రౌండ్ లో మహేష్ , evenings మాత్రం బిల్డింగ్స్ చివరన గల చిన్న గ్రౌండ్ లో లగాన్ ఆడుతాము అని అక్కడికే పిలుచుకునివెళ్లారు . అయినాకూడా నిన్ను ఆడించడం కుదరదు నాన్నగారు ( డాక్టర్ ) చెప్పారుకదా చేతిని కదిలించకూడదు అని - వారం లో స్కూల్ ...... మాకు బాడీగార్డ్ గా ఉండాలంటే నువ్వు ఫిట్నెస్ సాధించాలి కాబట్టి అక్కడ కూర్చో చాలు .

మురళి మరియు గోవర్ధన్ కెప్టెన్స్ లా మారి వారి ఫ్రెండ్స్ ను సగం సగం కోరుకుని టాస్ వేశారు . గోవర్ధన్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 11-07-2021, 10:45 AM



Users browsing this thread: 5 Guest(s)