Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంత ఎండ - సిటీ పొల్యూషన్ లో ఎంత నడిచినా costly ఏరియా కనిపించకపోవడంతో నీరసం - మైకం కమ్మి ఒకానొక క్షణంలో ఇంటికి వెళ్లిపోదాము అనిపించింది . నేను లేకపోవడం వలన పిల్లలకు స్పేస్ మరియు ఫుడ్ మరికొన్నిరోజులకు సరిపోతుంది , వెనక్కు వెళ్లి ఆ డ్రీమ్ ను వాళ్లనుండి దూరం చెయ్యడం మంచిదికాదు అని నీళ్లు తాగి దైవాన్ని తలుచుకుని మరికొంత దూరం నడిచాను . 
కొద్దిదూరంలో ఆ అన్న చెప్పిన పెద్దపెద్ద బిల్డింగ్స్ కనిపించగానే , పని దొరకనీ దొరకకపోనీ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు పెదాలపై చిరునవ్వులు - హుషారుదనం వచ్చేసింది . బిల్డింగ్స్ వైపు ఏకంగా పరుగుపెట్టాను ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్లు ..........
బిల్డింగ్స్ నలువైపులా పెద్ద కాంపౌండ్ గోడ , గోడ వెంబడి పరుగుపెట్టి కేవలం ఖరీదైన కార్స్ మాత్రమే వచ్చి వెళుతున్న ప్రవేశద్వారాన్ని చేరుకున్నాను . నాకు పని దొరికే చోటు అని దండం పెట్టి లోపలికి అడుగులువేశాను .

సెక్యురిటి ఆపి నా వాలకం - నా మూటను చూసి , నీలాంటి వాళ్లకు లోపలికి ప్రవేశం లేదు అని తోసేశాడు . 
అన్నా అన్నా ........ పనికోసం వచ్చానన్నా , ఏపనైనా చేస్తానన్న లోపలికి వదలండన్నా అని ప్రాధేయపడ్డాను . 
సెక్యురిటి : రేయ్ బాబూ ........ నిన్ను లోపలికివదిలితే మా జాబ్ పోతుందిరా , ఇలా ఉన్న నిన్ను ఇక్కడచూసినా మమ్మల్ని తిడతారు ఈ బలిసినవాళ్ళు , మేమే సంవత్సరాలుగా పనిచేస్తున్నా గేట్ దాటి లోపలికివెళ్లలేదు , వెళ్లరా బాబూ వెళ్లు తొందరగా వెళ్లు , మా జాబ్ కే ఎసరుపెట్టేలా ఉన్నావు .

ఎంత బ్రతిమాలినా లోపలికి పంపించకపోవడం - లోపలికి వెలితేనే కానీ పని దొరకదు కాబట్టి ఇలాకాదు అని గోడ వెంబడి వెళ్లి టర్నింగ్ లో ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కడం ద్వారా గోడమీదకు చేరుకున్నాను . గోడ ప్రక్కనే పెద్ద గ్రౌండ్ - గ్రౌండ్ లో నా వయసున్న పిల్లలు నాకిష్టమైన - నేను బాగా ఆడే క్రికెట్ ఆడుతుండటం చూసి చెట్టునీడలో గోడపై కూర్చుని చూస్తున్నాను . చెట్టుపై నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతుండటం - గోడపైనుండే చేతికందేంతలా ఉండటంతో మాగినవాటిని తీసుకుని తింటుంటే ప్రాణం లేచొచ్చింది .
బ్యాటింగ్ టీం క్లాస్ గా ఒకేరకమైన జెర్సీ వేసుకున్నారు - ఫీల్డింగ్ టీమ్ మాస్ గా నాలాంటి పిల్లలు . 
మాస్ పిల్లలు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ వేస్తుంటే జెర్సీ వేసుకున్న పిల్లలకు ఉచ్చపడుతున్నట్లు వొళ్ళంతా దెబ్బలు తగిలించుకుంటున్నారు , చిన్న చిన్న దెబ్బలకే అమ్మా హబ్బా అంటూ రిటైర్డ్ హార్ట్ అయ్యి కూర్చుంటున్నారు . ఫీల్డింగ్ టీమ్ నవ్వుకుంటున్నారు - వాళ్ళ ఆట చూసి నాకూ తెగ నవ్వు వచ్చేస్తోంది . ఆడటం రాకపోగా డబ్బుందనే అహంకారం చూయించి తప్పుబడుతున్నారు . ఫీల్డింగ్ టీమ్ తప్పులా నాకైతే అనిపించడం లేదు - ఫాస్ట్ బౌలింగ్ మైంటైన్ చేస్తున్నారు అంతే ........
బ్యాటింగ్ టీం డబ్బుతో మాటలు గెలిచినట్లు ఫాస్ట్ బౌలింగ్ నుండి స్పిన్ మాత్రమే వేసేలా రెస్ట్రిక్ట్ చేసినట్లు అనిపించింది . స్పిన్ బౌలింగ్ లో కూడా తడబడుతోంది బ్యాటింగ్ జట్టు - ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యేంతవరకూ స్పిన్ బౌలింగ్ మాత్రమే ...... - ఫాస్ట్ బౌలర్లను స్పిన్ వెయ్యమంటే ఎలా వేస్తారో అంత సులభంగా వేస్తున్నా ఓవర్ కు 6 రన్స్ కొట్టడానికి తెగ కష్టపడుతున్నారు . ఎలాగోలా 15 ఓవర్లు కంప్లీట్ గా ఆడి 60 రన్స్ కొట్టి సూపర్ స్కోర్ అంటూ చంకలు గుద్దుకోవడం చూసి నాకైతే నవ్వు ఆగడం లేదు . 
ఇలాంటి గ్రౌండ్ ఉంటే 5 - 6 ఓవర్లలో ఫినిష్ చేసేస్తాను . అదేవిషయం ఇప్పటివరకూ ఫీల్డింగ్ చేసిన పిల్లలలో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది .

Expect చేసినట్లుగానే నాలాంటి మాస్ పిల్లలు మొదలుపెట్టడమే మొదలుపెట్టడం ఫస్ట్ బాల్ కే నా మీదుగా గోడ బయటకు వెళ్ళిపడేలా సిక్స్ కొట్టి ఈజి బౌలింగ్ అంటూ బ్యాట్స్ తో హైఫై కొట్టుకున్నారు - పెవిలియన్ లో ఉన్న మాస్ పిల్లలందరూ ఈలలు కేకలు వేస్తున్నారు . రేయ్ ....... 5 ఓవర్స్ లో ఫినిష్ చేసేస్తారా ఏమిటి , ఈ బుచికి బౌలింగ్ లో ఒక్క బాల్ అయినా మాకూ ఛాన్స్ ఇవ్వండిరా ఏకంగా మన బస్తీలో పడేలా కొడతాము అని కవ్విస్తున్నారు .
క్లాస్ కెప్టెన్ : ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఉడికిపోతూ బ్యాట్స్ మన్ దగ్గరికివెళ్లి ఇంకొక్కసారి బాల్ బయటకు కొడితే మీరు ఒడిపోయినట్లే .........
బ్యాట్స్ మన్ : మా బాల్ మా ఇష్టం , ఇలా కొట్టి ఎంజాయ్ చెయ్యాలనే 4 - 5 బాల్స్ తెచ్చుకున్నాము . మీ బౌలింగ్ లో పస లేదు అని ఒప్పుకోక , బాల్ బయటకు వెళితే ఓడిపోయినట్లే అంటే ఎలా , ఇలా అయితే సిక్స్ ఫోర్ కొట్టినా ఓడినట్లే అనేలా ఉన్నారే అని మరొక బాల్ అందించి నవ్వుకుంటున్నారు . 

క్లాస్ కెప్టెన్ : కోపంతో ఊగిపోతూనే బాల్ బౌలర్ కు అందించి యార్కర్ వెయ్యమని సైగలుచేశాడు .
మాస్ టీం : వీళ్ళు యార్కర్ ఎప్పుడు వెయ్యాలి రేయ్ గెట్ రెడీ బ్యాట్ పిచ్ బాల్ అని గట్టిగా కేకలువేసి నవ్వుకుంటున్నారు .
క్లాస్ బౌలర్ పరుగునవచ్చి యార్కర్ వెయ్యాలనుకున్నా అనుభవం లేనట్లు టాస్ బాల్ వేసాడు . 
అంతే ఆ బంతి కూడా బయటకువెళ్లేదే జస్ట్ మిస్ , గోడ చివరన తాకి గ్రౌండ్ లోనే పడిపోయింది .
మాస్ పిల్లలు : యార్కర్ అంట యార్కర్ , కనీసం బ్యాట్ పిచ్ కూడా కాదు బుజ్జిపిల్లలకు వేసినట్లు టాస్ బాల్ వేసాడు అని కేరింతలు కొడుతున్నారు .

అంతే క్లాస్ కెప్టెన్ కు తోడుగా వాళ్ళ టీం అంతా ఒకదగ్గరిచేరి , బాల్ బయటకు వెళ్లి ఉంటే మనమే గెలిచేవాళ్ళము రేయ్ మరింత టాస్ వెయ్యాల్సింది అని కన్నింగ్ స్మైల్ నవ్వుకుంటున్నారు .
బ్యాట్స్ మన్ : రేయ్ రేయ్ ....... అలా అని మేము ఒప్పుకోలేదు . 
మా గ్రౌండ్ మా ఇష్టం రా ఇప్పుడే రూల్స్ మార్చాము - మీ బెట్టింగ్ డబ్బులు మాకు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి - ఇంకొక్కసారి బయటకు కొడితే మీరు ఓడిపోయినట్లే , డబ్బులు మాకే ........
బ్యాట్స్ మన్ : డబ్బులు మీకేమి తక్కువరా , ఒక్కొక్కడూ బాగా బలిసినోళ్లు కదా ...........
క్లాస్ కెప్టెన్ : అవును మేము రిచ్ మీరు పూర్ - ఇక్కడ డబ్బు మ్యాటరే కాదు , మా costly ఏరియాలోకి అడుగుపెట్టడానికి కూడా మీకు అర్హత లేదు - అయినాకూడా ఏకంగా గ్రౌండ్ లోకి రప్పించాము ఎందుకు మాకు ఓడిపోయే ఒక టీం కావాలి కాబట్టి - ఓడిపోయిన తరువాత మీ ముఖాలను చూసి మేము ఎంజాయ్ చెయ్యాలని - ఈ బెట్ మాకు స్కూల్ ఇంటర్వెల్ బిల్ తో కూడా సమానం కాదురా అని హేళన చేస్తున్నారు .
బ్యాట్స్ మన్ : ఇందుకోసమారా మమ్మల్ని లోపలికి పిలిపించినది సెక్యూరిటీని పంపిమరీ ........ , ఫ్రెండ్షిప్ కొద్దీ పిలిచారని సంతోషంతో వచ్చాము కదరా ........ 
క్లాస్ కెప్టెన్ : ఇంకొక్కసారి రా అన్నావంటే మా సెక్యూరిటీని పిలిపించి కొట్టిస్తా ......
మరొక బ్యాట్స్ మన్ : రేయ్ ........
బ్యాట్స్ మన్ : ఆపి , రేయ్ మనం అడుగగానే బెట్ మొత్తం వాళ్లకు కలిపి తప్పుచేసామురా ....... , మనకు డబ్బు ముఖ్టం - ok ok బాల్ బయటకు కొట్టకుండా గెలిస్తే డబ్బులు ఇస్తారా ..... ? .
క్లాస్ కెప్టెన్ : ఇలా దారికి రండి , మీవాళ్ళు ఒక్కడు కూడా విజిల్స్ కేకలు వేయకూడదు .
బ్యాట్స్ మన్ : కరెంట్ బిల్ , వాటర్ బిల్ , రేషన్ డబ్బులు కడతామని తీసుకొచ్చిన డబ్బులు - అవి పే చెయ్యకపోతే మా ఇళ్లల్లో మమ్మల్ని గొడ్డును కొట్టినట్లు కొడతారు - మేము బయటకు కొట్టము , మావాళ్ళు విజిల్స్ వెయ్యరు మ్యాచ్ కంటిన్యూ చేద్దాము .

పిల్లలే అయినా బలుపు చాలానే ఉంది వీళ్లకు ఇలాంటి రూల్స్ నేనెక్కడా వినలేదు చూడలేదు అని ఆశ్చర్యపోయాను . 

నెక్స్ట్ త్రీ బాల్స్ వరుసగా నేలను తాకుతూనే మూడువైపులా మూడు ఫోర్లు వెళ్లేలా కొట్టాడు . 
పెవిలియన్ లో ఉన్న పిల్లలు విజిల్స్ - కేకలు వెయ్యబోయి రేయ్ రేయ్ ...... కరెంట్ బిల్ రా అని నోటికి తాళం వేసుకున్నారు . 
బ్యాట్స్ మన్ ఆడిన విధానం ( సులభంగా సిక్స్ కొట్టే బంతిని కూడా చాకచక్యంగా ఫోర్ గా మలిచిన ) భలే కిక్కిచ్చినట్లు నేరేడు పళ్ళ ఎనర్జీతో విజిల్ వేసాను .
బ్యాట్స్ మన్ కంగారుపడుతూ - ఫీల్డింగ్ క్లాస్ టీం కోపంతో విజిల్ సౌండ్ వైపు చూస్తున్నారు . 
నేనెలా కనిపిస్తాను చెట్టు ఆకుల మధ్యన దాక్కున్నాను కదా , నోటిని చేతులతో మూసుకుని నవ్వుకున్నాను .
బ్యాట్స్ మన్ : రోడ్డుపై వెళుతున్న కార్ విజిల్ అయి ఉంటుంది అని చెప్పడంతో అందరూ కూల్ అయ్యారు .
అప్పటికే 5 బంతులు 24 రన్స్ రావడంతో ఇలా అయితే రెండు ఓవర్ లలో మ్యాచ్ గెలిచేలా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ బయటవెళ్ళిపడేలా , హైట్ నోబాల్ హైట్ లో బంతిని బలంగా విసరమని కన్నింగ్ స్మైల్ తో చెప్పాడు - బ్యాట్ బంతిని తాకగానే గోడ బయటకు వెళ్ళిపడాలి .
బౌలర్ : అర్థమైంది కెప్టెన్ ఇక గెలుపు మనదే అని మరిన్ని అడుగులు వెనక్కువెళ్లాడు రేయ్ మీ పని అయిపోయినట్లే ......... అనుకున్నట్లుగానే హైట్ నోబాల్ వెయ్యడం ఎక్కడ తగులుతుందేమోనని బ్యాట్ ఊపడంతో ఆ స్ట్రోక్ కు బంతి మొదటి సిక్స్ కంటే దూరంగా గోడ అవతల పడింది .
బ్యాట్స్ మన్ అయ్యో అంటూ నెత్తిపై చేతినివేసుకుని వెంటనే రేయ్ రేయ్ రేయ్ నో బాల్ నో బాల్ అంపైర్ నో బాల్ అంటూ గెలుపు సంబరాలలో ఉన్న కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు .
క్లాస్ కెప్టెన్ : గుడ్ బాల్ నో బాల్ ....... ఏ బాల్ అయితేనేమి గోడను దాటితే మేము గెలిచినట్లే అని చెప్పామా లేదా ....... , సో గు** నోరు మూసుకుని బయటకు దేంగేయ్యండి .
బ్యాట్స్ మన్ : రేయ్ రేయ్ ....... ఎలాగైనా తిట్టుకో మా డబ్బునైనా ఇవ్వు , బిల్స్ కట్టకపోతే ఇంట్లో మమ్మల్ని కొడతారు .
క్లాస్ కెప్టెన్ : సావ కొట్టడం కూడా మేము కళ్లారా చూసే అదృష్టం లభిస్తే భలే ఉంటుంది ప్చ్ ........ మిస్ అవుతున్నాము . అయినా ఓడిపోయినవాళ్లకు బెట్ డబ్బులు వెనక్కు ఇవ్వరు - మీరే వెళతారా లేక సెక్యూరిటీని పిలిపించి బయటకు తోసేయ్యమంటారా ........ తినడానికి తిండి లేదు కానీ మ్యాచ్ గెలవడానికి వచ్చారు ముష్టి వెధవలు ........
బ్యాట్స్ మన్ : రేయ్ మమ్మల్నే అంతమాట అంటావా అని క్లాస్ కెప్టెన్ కాలర్ పట్టుకున్నాడు .
క్లాస్ కెప్టెన్ : ఎంత ధైర్యం రా నీకు నన్ను టచ్ చేయడానికే మీలాంటి వాళ్లకు అర్హత లేదు అలాంటిది ఏకంగా నా కాలర్ పెట్టుకుంటావా అని తోసేసి కాళ్లతో తన్నాడు .
రేయ్ మావాడినే కొడతారా అని వచ్చిన మరొక బ్యాట్స్ మన్ ను కూడా కిందపడేసి ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు , చేతులలో బ్యాట్లు లేవు కానీ వాటితోనూ కొట్టేవాళ్లే ..........

రేయ్ రేయ్ మావాళ్లనే కొడతారా అని బ్యాట్స్ - వికెట్స్ చేతపట్టుకుని కోపంతో పరుగునవచ్చారు మాస్ టీం అంతా ..........
వారిని చూడగానే క్లాస్ టీం భయపడిపోయినట్లు dad mom సెక్యురిటీ అంటూ గట్టిగా కేకలువేస్తూ వారి నుండి తప్పించుకోవడానికి నావైపుకు పరుగులు తీస్తున్నారు ఉచ్చపడినట్లు .........
గాలివాన చినికి చినికి తుఫానులా మారినట్లు చూస్తుంటే ఇక్కడ రక్తం చిందేలా ఉందని - బ్యాట్ , వికెట్ తో బలంగా కొడితే తలలు పగిలినా పగులుతాయి - అభం శుభం తెలియని అమాయకమైన వయసు చూస్తూ ఊరుకోలేను అని అంతెత్తు గోడను జంప్ చేసి పరుగునవెళ్ళాను . 
మరొకవైపు నుండి సెక్యూరిటీ పిల్లలూ పిల్లలూ ఆగండి ఆగండి అని పరుగునవస్తున్నారు . 

దొరికావురా కెప్టెన్ గా అంటూ వాళ్ళవైపుకు తిప్పుకుని అంతెత్తుకు బ్యాటుని - వికెట్స్ ఎత్తి నెత్తిపై కొట్టేంతలో ........
మధ్యలోకివెళ్లి బ్యాటు - ఒక వికెట్ ను చేతితో ఆపగలిగాను కానీ మరొక వికెట్ నా భుజంపై పెద్ద దెబ్బనే రుచి చూయించింది . 
అవ్వా ........ అంటూ నేను - భయంతో మమ్మీ అంటూ క్లాస్ కెప్టెన్ కళ్ళుమూసుకున్నాడు నన్ను పట్టుకుని - బాబూ మురళీ అంటూ దూరం నుండి పేరెంట్స్ మరికొంతమంది - సెక్యూరిటీ కంగారుపడుతూ రేయ్ రేయ్ అంటూ వచ్చి చూసి హమ్మయ్యా ........ బ్రతికిపోయాము అంటూ పిల్లల నుండి బ్యాట్స్ వికెట్స్ లాక్కుని దూరంగా పడేసి , ఎంత ధైర్యం రా మీకు కొద్దిలో ఉంటే చంపేసేవాళ్ళు , మిమ్మల్ని ఊరికే వదిలేవాళ్ళు కాదు వీళ్ళు అంటూ దూరం తీసుకెళ్లి చేతిలోని కర్రలతో కొట్టి ........ , మేడం సర్స్ ........ బాబుకు ఏమీకాలేదు అని క్లాస్ పిల్లలందరినీ సేఫ్ గా వారి పేరెంట్స్ దగ్గరికి చేర్చారు .
పేరెంట్స్ : మై బాయ్ , నాన్నా , బాబూ ........ మీకేమీ కాలేదుకదా .......
సెక్యురిటీ : ఏమీకాలేదు మేడం , ఎవరోకానీ ఆ అబ్బాయి గోడ పైనుండి కిందకు దుంకిమరీ సరైన సమయంలో అడ్డుపడ్డాడు - ఒక్క క్షణం ఆలస్యమైనా ఊహించని సంఘటన జరిగిపోయేది - ఆ అబ్బాయికి గట్టి దెబ్బే పడినట్లుంది మేడం .......
పేరెంట్స్ : థాంక్స్ బాబూ ........ దేవుడిలా వచ్చి రక్షించావు .
స్స్స్ ........ అంటూ నొప్పితో చేతిని విదిల్చాను .
ఒక పేరెంట్ : నో నో నో అలా చెయ్యకు అంటూ షర్ట్ తొలగించి చెక్ చేసి , భుజం ఎముక విరిగినట్లుగా ఉంది తొందరగా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకో బాబూ ........ వెళ్లు వెళ్లు లేకపోతే నొప్పి మరింత పెరుగుతుంది .
మేడం : మీరు డాక్టర్ కదా మన పిల్లలను ఇందులో మీ పిల్లాడు కూడా ఉన్నాడు కాపాడిన ఈ పిల్లాడికి మీరే ట్రీట్మెంట్ చెయ్యొచ్చుకదా .......
డాక్టర్ : చెయ్యొచ్చు కానీ జీవితంలో ఇప్పటివరకూ ఫ్రీ గా ట్రీట్మెంట్ చెయ్యనేలేదే ......... 
మేడం : ఇప్పుడు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా ...... , మీ ఫీజ్ మేము భరిస్తాము .
డాక్టర్ : అయితే ok నాకేమీ అభ్యంతరం లేదు . నాకు కావాల్సింది ఫీజ్ ఎవరు ఇస్తే ఏమిటి .
గుంపులో : తరాలు కూర్చుని తిన్నా కరగని ఆస్తిని సంపాదించావు - సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ ......... సొంత కొడుకు ప్రాణాలు కాపాడిన పిల్లాడికి ట్రీట్ చెయ్యడానికి కూడా ఫీజ్ అడుగుతున్నాడు మినిషా లేక .........
డాక్టర్ : ఇలాంటివన్నీ పట్టించుకునే వాడిని అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు - మీ మొగుల్లేమీ తక్కువ వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో నాలానే ఉన్నారు . అయినా ఈ అలగాజనం పిల్లలను లోపలికి ఎవరు రానిచ్చింది - సెక్యూరిటీ ........ నిద్రపోతున్నారా ? .
సెక్యురిటి : మేము వద్దనే అన్నాము సర్ , పిల్లలే మ్యాచ్ కోసం రప్పించుకున్నారు .
డాక్టర్ : సరే సరే ముందు వాళ్ళను బయటకు గెంటెయ్యండి .
మాస్ పిల్లలు : మ్యాచ్ మేమే గెలిచేవాళ్ళము మా బెట్టింగ్ డబ్బు - వీళ్లిద్దరి ట్రీట్మెంట్ డబ్బు ఇస్తే వెళతాము లేకపోతే మీ పిల్లలను ఊరికే వదిలేది లేదు .
క్లాస్ కెప్టెన్ మురళి : డబ్బులే కాదు మమ్మల్నే కొట్టడానికి ఎత్తిన బ్యాట్స్ కూడా ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి - సెక్యురిటి అందరినీ బయటకు లాగి పడేయ్యండి . 
డాక్టర్ : మా పిల్లలనే కొడతారా కొట్టిమరీ బయటకు తోసేయ్యండి . ఇంకెప్పుడూ లోపలకు వదలకండి .
ఐదారుమంది సెక్యూరిటీ వచ్చి కర్రలతో బయటకు తోసేస్తున్నారు .

మాస్ పిల్లలు : రేయ్ మురళీ అండ్ గ్యాంగ్ ....... డబ్బుతో గుద్దబలిసి కొట్టుకుంటున్నారు . ఇప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ సెక్యూరిటీ మరియు మా అందరినీ నుండి ఒక్కడై ఆ పిల్లాడు అడ్డుపడ్డాడు - ఈ గేట్ దాటి బయటకు రారా అప్పుడు చెబుతాము మీ సంగతి , అడ్డుకోవడానికి వాడు కూడా ఉండడు - స్కూల్ లో మీరొక్కరే ఉంటారుకదా , స్కూల్ గేట్ జంప్ చేసిమరీ మీ అంతు చూస్తాము . డబ్బు పోయిందని చెబితే మా నాన్నలు ఎన్ని దెబ్బలు కొడతారో అంతకు రెట్టింపు మిమ్మల్ని సావ కొడతాము ఇదే మా ఛాలెంజ్ ........
క్లాస్ పిల్లలు : mummy - dad ........ భయమేస్తోంది . వాళ్ళు చెప్పినట్లు స్కూల్లో ........ 
మేడమ్స్ : ఇప్పుడెలా ....... , అనుక్షణం పిల్లలతో ఉండటం కుదరదు - ఈ సెక్యూరిటీ వాళ్ళను నమ్మడానికి వీల్లేదు - స్కూల్ కు పంపించకుండా ఉండలేము . 
గుంపులో ఒకరు : ఈ పిల్లాడిని మన పిల్లలతోపాటు స్కూల్ కు పంపిస్తే సరి ......
మేడమ్స్ : అవునవును , ఎవరో తెలియకుండానే ప్రాణాలకు తెగించి మన పిల్లలను కాపాడాడు . బాబూ ....... నీ పేరేంటి ? నువ్వెవరు ? మీ పేరెంట్స్ ఎవరు ? ఏమి చేస్తుంటావు ?
నా పేరు మహేష్ - అనాధను మేడం - govt స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను , చదువుకుంటూనే ఇక్కడకు పనికోసం .........
సెక్యూరిటీ : ఆ గుర్తొచ్చింది మేడమ్స్ పనికోసమని గేట్ దగ్గరకు వస్తే మేమే పంపించేసాము , లోపలికి రావడానికి గోడ ఎక్కినట్లున్నాడు .
మేడమ్స్ : 10th క్లాస్ అన్నావుకదూ ఎక్కడ govt స్కూల్ కదా , మా పిల్లలు కూడా 10th 9th 8th ....... చదువుతున్నారు . వీళ్ళతోపాటు నువ్వుకూడా చదువుకోవచ్చు , నీ ఫీజ్ మొత్తం మేమే భరిస్తాము , govt స్కూల్ నుండి మా పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ కు మార్పిస్తాము , నువ్వు చెయ్యాల్సినదల్లా మా పిల్లలు ఎక్కడకువెళ్లినా తోడుగా ఉండి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి . అనాధ అన్నావు కాబట్టి ఉండటానికి చోటు ఇస్తాము - మూడు పూటలా భోజనం పెడతాము - నెల నెలా పనికితగ్గ డబ్బు ఇస్తాము .

మూడుపూటలా భోజనం అని వినగానే నా కళ్లల్లో కన్నీళ్లు ధారలా కారిపోతున్నాయి .
పిల్లలు : మమ్మీ మమ్మీ ........ వీడెవడో ఇష్టం లేదు కానీ , వీడు ప్రక్కనే ఉంటే కాస్త దైర్యంగా ఉంది మమ్మీ ........ , మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు అని గట్టిగా చెప్పండి లేకపోతే స్కూల్ కు వెళ్ళము .
మేడమ్స్ : బాబూ ........ నీకు ఇష్టమే కదా ......
ఇష్టం ఇష్టం అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
మేడమ్స్ : ఏంటీ కన్నీళ్లు నొప్పివేస్తోందా ?  , డాక్టర్ ....... కాస్త తొందరగా ........
డాక్టర్ : ఇక్కడే ఎలా ట్రీట్ చెయ్యను , ఇంటి బయట ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లాలి , రేయ్ ....... ఫాలో అవ్వరా అని తన కొడుకు చేతిని పట్టుకుని నడిచాడు . 
వెనుకే వెళ్లడంతో స్కాన్ చేసి భుజపు ఎముకను సరిచేసి భుజం నుండి చేతివరకూ పుత్తూరు కట్టును కట్టాడు . వారం వరకూ ఎడమ చేతిని కదిలించకు అని చెప్పి ఇంజక్షన్ టాబ్లెట్స్ ఇచ్చి అందరి నుండి ఫీజ్ తీసుకుని కానీ నన్ను బయటకు వదలలేదు మహానుభావుడు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 11-07-2021, 10:44 AM



Users browsing this thread: 4 Guest(s)