Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణా ........ చిన్నన్నయ్య ఇంటికి పోనివ్వు .
కృష్ణ : మహేష్ ........ అంతంత మాటలు అన్నాక కూడా , నిన్ను మనిషిగా కూడా చూడని వాళ్ళను అన్నయ్యలూ అని ఇంకా ప్రేమతో పిలవడం అవసరమా - తప్పుగా మాట్లాడితే క్షమించు ........ , నా ఫ్రెండ్ ను అలా అంటే నేను తట్టుకోలేను - ఈ విషయం అంటీవాళ్లకు తెలిస్తే మరింత బాధపడతారు .
బుజ్జితల్లులకు - బుజ్జాయిలకు ....... తండ్రి అవసరం ఎప్పటికైనా ఉంటుంది కదా , దానికోసం ఎన్ని మాటలైనా పడటానికి నేను సిద్ధం .
కృష్ణ : ఈ మాటలు వింటే మాత్రం నలుగురు పిల్లలూ మరింత బాధపడతారు - వాళ్ళు తమ నాన్నలను నాన్నలుగా ఎప్పుడో మరిచిపోయారు - వింటే బాధపడటం కాదు బుజ్జికన్నీళ్ళతో మా డాడీ మీరే కదా అని ప్రాణంలా కొట్టినా కొడతారని నీకూ తెలుసు కదా మహేష్ ..........
తప్పదు కృష్ణా ........ ఒక్క అన్నయ్య అయినా మారుతాడని చిన్న ఆశ . చిన్నప్పటి నుండీ అన్నయ్యలు ద్వేషంతోనే చూసారు - కనీసం ఒక్కసారైనా తమ్ముడూ అని పిలిస్తే ఆనందించాలని ..........
కృష్ణ : కలిసి ఉన్నప్పుడే జరుగలేదు ఇప్పుడు అత్యాశే అవుతుంది మహేష్ .......
నువ్వు చెప్పేదీ నిజమే , ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే ముందు అమ్మ కోరిక ఎలా తేర్చాలో అర్థం కావడం లేదు కృష్ణా .........
కృష్ణ : నువ్వు ఊ అను మీ అన్నయ్యను కిడ్నప్ చేసి తీసుకెళ్లిపోతాను . 
మరి సెక్యూరిటీ .........
కృష్ణ : oh shit వాళ్ళు ఏకంగా ఇద్దరు ఉన్నారుకదూ ....... , మొన్న ఏమో .... డాక్టర్ అనిచెప్పి వసుంధర అంటీతోపాటు సులభంగా లోపలికివెళ్లాము . మహేష్ అటుచూడు ఒక సెక్యూరిటీ ....... మీ అన్నయ్య కాళ్లపై పది ఏదో ఆర్థిస్తున్నట్లున్నాడు . విండోస్ క్లోజ్ చేసి ప్రక్కగా పార్క్ చేద్దాము నువ్వు కాస్త తలదించుకో ....... అని దగ్గరగా తీసుకెళ్లాడు .

సెక్యూరిటీ : సార్ ........ మీరే ఎలాగైనా కాపాడాలి నా మనవరాలు హాస్పిటల్లో చావుబ్రతుకుల్లో ఉంది , మిమ్మల్నే నమ్ముకున్నాను , సహాయం చేస్తారని మాటిచ్చారు . 
చిన్నన్నయ్య : నేనా ..... అలాంటి మాట ఎప్పుడూ చెప్పను . 3 లక్షలు ...... నా ఒకరోజు జల్సాలకు సరిపోతుంది - ఆ డబ్బుని నీకు ఇచ్చి ఈరోజంతా బార్ కు వెళ్లకుండా జపం చెయ్యమంటావా జపం , వధులుతావా లేక నిన్ను జాబ్ నుండి పీకేయ్యాలా........ ? .
రెండవ సెక్యూరిటీ : సర్ ....... వారం ముందు సహాయం చేస్తానని మీరే మాటిచ్చారు సర్ ........
చిన్నన్నయ్య : రేయ్ నువ్వు మూసుకో నిన్నూ పీకేయ్యాలా ? , ఏదో తాగిన మత్తులో మీ నసను వదిలించుకోవడానికి అని ఉంటాను . మాటపై నిలబడటానికి నేనేమైనా మీ పెద్ద సర్ అనుకున్నారా ...... ? , అందుకే కదా వాడి నుండి ఆస్తిమొత్తాన్ని లాగేసుకుని కుమిలిపోయేలా మాట్లాడి అమెరికా పారిపోయేలా చేసింది . అయినా మీ జీతం ఎంత మీరు అడిగేది ఎంత ........ చేస్తే చావనీ భూమికి భారం అయినా తగ్గుతుంది .
సెక్యురిటి : కోపం వచ్చినా తప్పదన్నట్లు సర్ అలా అనకండి మిమ్మల్నే నమ్ముకున్నాను మీ పాదాలు పట్టుకుంటాను .
వదలరా వదులు మీ అలగాజనం తాకితేనే వొళ్ళు కంపరం నాకు అని విధిల్చడమే కాకుండా కాలితో తన్ని లోపలికివెళ్లిపోయాడు .
కిందపడి రోధిస్తున్న సెక్యూరిటీని బాధపడుతూనే లేపి చెట్టుకింద నీడలో కూర్చోబెట్టాడు .

కృష్ణ : విన్నావా మహేష్ ........ అంకుల్ ను ........ , అప్పటికే నేను బాధపడుతుండటం చూసి భుజం పై చేతినివేశాడు .
కృష్ణా ........ ఏ హాస్పిటలో వెళ్లి కనుక్కో ........ 
కృష్ణ : సూపర్ మహేష్ అని వాటర్ బాటిల్ తీసుకుని కిందకుదిగివెళ్లి , ఓదారుస్తున్న సెక్యూరిటీతో మాట్లాడి -  పెద్దయ్యా ....... దేవుడు ఉన్నాడు మీ మనవరాలికి ఏమీకాదు దైర్యంగా ఉండండి - అన్నా ....... చూసుకోండి అని వాటర్ అందించి వచ్చి , పాప పేరు సితార మహేష్ కారుని వేగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపాడు.

ఇద్దరమూ పరుగున లోపలికివెళ్లాము . కృష్ణ వెళ్లి రిసెప్షన్ లో పాప సితార గురించి అడిగాడు - ఎక్కడ ICU లో ఉందా ...... ? .
రిసెప్షనిస్ట్ : నిన్నటితోనే వాళ్ళు కట్టిన బిల్ అయిపోయింది సర్ అందుకే అక్కడ వెయిటింగ్ ప్లేస్ లో కూర్చున్నారు - డబ్బు కడితే బెడ్ ఇస్తాము . 
జనాలమధ్యన చిన్న పాప ...... తన తల్లి ఒడిలో కొనఊపిరితో ఉండటం - ఆ తల్లి పడుతున్న బాధ కన్నీళ్లను మరియు తండ్రి కన్నీళ్ళతో వస్తూ వెళుతున్న డాక్టర్స్ నర్సులను బ్రతిమాలుతూ ఉండటం చూసి , కృష్ణ కోపంతో ఛి ఛి ...... మీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పటికి మారతారురా .........
ఆ చిన్నపాపను చూసినా జాలి వెయ్యడం లేదా ? , మీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మానవత్వం కంటే డబ్బుకే ........ , ఆ పాపకు ఏమైనా అయ్యిందో మీ అంతు చూస్తాము . కృష్ణా ....... పేదవాళ్ల రక్తం ఎంత తాగుతారో అంత మొత్తాన్ని పే చెయ్యి అని కార్డ్ అందించాను . 
కృష్ణ : ఇంకా అలా చూస్తూ ఉన్నారు . డబ్బు కట్టిన రిసిప్ట్ చూయిస్తేకానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరా ........ ,
Sorry సర్ ....... అని పాపను ICU కు తీసుకెళ్లారు .
ఆపరేషన్ అమౌంట్ కూడా కట్టేస్తున్నాము వెంటనే ఆపరేషన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి - ఆ మాట మీదనే మీ హాస్పిటల్ భవిష్యత్తు ఆధారపడింది అని కోపంతో చెప్పాను .

నర్సులు : డాక్టర్స్ డాక్టర్స్ అంటూ పరుగునవెళ్లి తీసుకొచ్చారు . 
డాక్టర్స్ ICU లోపలికివెళ్లినా కూడా రిసిప్ట్ చూస్తేనేకానీ ఆపరేషన్ మొదలెట్టలేదు .
కృష్ణగాడు పిడికిలి బిగించి కొట్టడానికి అడుగువేశాడు - ఆపరేషన్ పూర్తయ్యిన తరువాత ఆపను కృష్ణా అని ఆపాను .
పాప తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు .
ఆపి , పాపకు ఏమీకాదు అని ధైర్యం చెప్పి , వారితోపాటు మేమిద్దరం కూడా దుర్గమ్మ తల్లిని ప్రార్థించాము .
పాప తల్లిదండ్రులు ఎప్పుడు తిన్నారో ఏమిటో మహేష్ అని కృష్ణ వెళ్లి ఫుడ్ తీసుకొచ్చి అందించాడు . 
మా ప్రాణాలపై మాకు ఆశ లేదు సర్ ....... , పాప ...... అంటూ కన్నీటిపర్యంతమయ్యారు .
ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం - ఎవ్వరికీ అలాంటి పరిస్థితి రానే కూడదు , మన ప్రాణమైనవాళ్ల ప్రాణం మీదకు వస్తే ఆ బాధ ...... ఊహించనేరాదు .

దాదాపు రెండు గంటల తరువాత డాక్టర్స్ బయటకువచ్చి పాప సేఫ్ కొద్దిసేపటి తరువాత వెళ్ళిచూడొచ్చు అనిచెప్పారు .
పాప తల్లిదండ్రులు అమితమైన ఆనందంతో కన్నీళ్లను తుడుచుకుని మా ఇద్దరి పాదాలను తాకబోయారు .
ఆపి , డాక్టర్స్ ........ ఒకప్పుడు ఇలా దేవుళ్ళలా మీ పాదాలను తాకేవారు - మీకు డబ్బు మాత్రమే ముఖ్యం అయినప్పటి నుండీ మిమ్మల్ని పేదవాళ్ళు ఎలా చూస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఆలోచించుకోండి వెళ్ళండి , పాప సేఫ్ అని సంతోషమైన విషయం చెప్పారు కాబట్టి నా ఫ్రెండ్ కోపం చల్లారింది - మీరు బ్రతికిపోయారు . మీ అంతుచూసి జైల్ కు సంతోషంగా వెళ్ళేవాళ్ళము .
డాక్టర్స్ తలదించుకుని వెళ్లిపోయారు .
పాప తండ్రి : సర్ సమయానికి దేవుళ్ళలా వచ్చారు - పాపకు ఏమైనా అయిఉంటే మరొక మూడు ప్రాణాలు ఆగిపోయేవి - మీ రుణం జీవితంలో కూడా తీర్చుకోలేనిది.
అన్నయ్యా ....... మీ నాన్నగారు , మాకు ఎంతో సేవచేశారు చేస్తూనే ఉన్నారు . ఆ రుణం తీర్చుకోవడం మా బాధ్యత . ఇప్పుడైనా తినండి - కొద్దిసేపట్లో కళ్ళుతెరిచే పాప తన తల్లిదండ్రులు తనకోసం ఇలా ఉన్నారని బాధపడకూడదు . అలాగే మీ నాన్నగారికి విషయం తెలపండి అని సంతోషంతో వెనుతిరిగాము .
తల్లి : అన్నయ్యలూ ....... పాపను చూసి వెళ్ళండి .
అన్నయ్య ....... ఈ పిలుపంటే నాకు చాలా ఇష్టం . చాలా సంతోషం చెల్లీ ....... , కానీ పాపకు హీరోలుగా తండ్రి తాతయ్యే అవ్వాలి . అవసరానికి ఈ డబ్బు ఉంచండి అని పర్సులోనిది మొత్తం ఇచ్చాను . పాపను త్వరలోనే వచ్చి కలుస్తాము మీ బాధపడకండి అని బయటకువచ్చాము .

కృష్ణా ....... ఎందుకో చాలా ఆనందం వేస్తోంది .
కృష్ణ : చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా మహేష్ , మనం ఏకంగా బుజ్జిదేవత ప్రాణాలు కాపాడాము - ఇకనుండీ అన్నీ శుభాలే జరుగుతాయి .
మెసేజ్ రావడంతో చూస్తే లాయర్ నుండి , నిజమే కృష్ణా ....... ఇంతలోనే గుడ్ న్యూస్ - లాయర్ గారు స్టే తీసుకున్నారు - 6 నెలల సమయం దొరికింది మనకు .......
ఆ వెంటనే మరొక మెసేజ్ - JIM కంపెనీ నుండి తొలగించబడిన మేనేజర్స్ , ఆఫీసర్స్ , వర్కర్స్ లిస్ట్ .
కృష్ణా ........ మన కంపెనీ ఆఫీస్ కోసం ఒక పెద్ద బిల్డింగ్ కావాలి ప్రస్తుతానికి రెంట్ తీసుకుందాము - అలాంటి బిల్డింగ్స్ నీకేమైనా తెలుసా ...... ? .
కృష్ణ : రోజూ సిటీ మొత్తం తిరిగే క్యాబ్ డ్రైవర్స్ కు తెలియనిది ఏమైనా ఉంటుందా ........ ? - సిటీ సెంటర్ లో కావాలా లేదా ఔట్ స్కర్ట్స్ లో కావాలా ...... ? .
సిటీ సెంటర్ అంటే బిల్డింగ్ రెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి అంత ఖర్చు పెట్టలేము - ఔట్ స్కర్ట్ అయితే జనాలకు దూరమైపోతాము కాబట్టి ఈ రెండింటి మధ్యలో అయితే బెట్టర్ .........
కృష్ణ : sure మహేష్ అంటూ సిటీ సెంటర్ కు అనుకూలమైన దూరంలోని బిల్డింగ్స్ ఒక్కొక్కటే చూయిస్తున్నాడు .
నో కృష్ణా నో కృష్ణా నో కృష్ణా ....... అన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నాను - వీటిని శుభ్రం చేయడానికే చాలాసమయం పడుతుంది అని మరికొంత దూరం వెళ్ళాము . 
కృష్ణ : మహేష్ ........ అటుచూడు .
పెయింట్ వేస్తున్న మూడంతస్తుల బిల్డింగ్ చూసి పెదాలపై చిరునవ్వు చిందించడం చూసి అక్కడికి పోనిచ్చాడు .
కృష్ణ : రెంట్ for షాపింగ్ మాల్ - ఆఫీస్ - గార్మెంట్స్ ....... అని టులెట్ బోర్డ్ ఉండటం చూసి థాంక్యూ soooo మచ్ గాడ్ అని ప్రార్థించి కిందకుదిగి బోర్డ్ పై నెంబర్ కు కాల్ చేసాడు . మహేష్ ....... ఓనర్ వచ్చేస్తున్నారు .
అంతలోపు లోపలికివెళ్ళిచూద్దాము అని మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికివెళ్లాము . పార్కింగ్ కు అనుకూలంగా పెద్ద కాంపౌండ్ - లోపలికివెళ్ళిచూస్తే బయట పెయింట్ వర్క్ తప్ప దాదాపుగా బిల్డింగ్ రెడీగా ఉండటం చూసి ఆనందించాము . బిల్డింగ్ ఫోటోలను తీసి వదినమ్మ - వదినలు - దేవత - చెల్లెమ్మ - అమ్మ - అంటీ లకు సెండ్ చేసాను . 
సూపర్ అంటూ అందరినుండీ రిప్లై రావడంతో , కృష్ణా ...... ఈ బిల్డింగ్ మొత్తం కావాలి అంతే ........

హలో ........ ఇక్కడ ఎవరో కాల్ చేశారు బిల్డింగ్ రెంట్ కోసం అని కేకలు వినిపించడం అంతలోనే కృష్ణాగాడి మొబైల్ రింగ్ అవ్వడంతో కిందకువచ్చాము . ఆయన చెప్పిన అమౌంట్ మంత్లీ 5 లక్షల రెంట్ కు అగ్రిమెంట్ చేసుకుని చేతులుకలిపాము .
ఓనర్ : ఈరోజు నుండీ మీ సొంతం నెలనెలా రెంట్ వచ్చేయ్యాలి అని కీస్ అందించి వెళ్ళిపోయాడు .
యాహూ ....... కృష్ణా , విజయం కోసం తొలి అడుగు సక్సెస్ఫుల్ గా పడింది అని సంతోషంతో కౌగిలించుకున్నాము . కృష్ణా ....... సమయం తక్కువగా రేపు శుభగడియల లోపు వనరులన్నీ సమకూర్చుకోవాలి .
కృష్ణ : ఒక్క కాల్ చేస్తే పనిపూర్తిచేసేవాళ్ళు ఉన్నారు అని కాల్ చేసి రప్పించాడు . 
Three ఫ్లోర్స్ కు తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో - రేపు ప్రారంభోత్సవం కోసం ఎలా డెకరేట్ చెయ్యాలో వివరించాము . 
డన్ సర్ ........ అర్ధరాత్రిలోపు అద్దం లా రెడీ చేస్తాము .
కృష్ణా ........
కృష్ణ : కారులోనుండి ఒక బ్యాగు తీసుకొచ్చి అవసరమైన డబ్బును అందించాడు . అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పాడు .
కృష్ణా ....... ఆకలి దంచేస్తోంది ఇంటికివెళదాము . బిల్డింగ్ వైపు మురిసిపోతూ చూసి కారులో బయలుదేరాము . వదినమ్మకు ( మల్లీశ్వరికి మొదట మెసేజ్ పెట్టడంతో , అన్నయ్య లేకపోవడంతో వారే కాల్ చేశారు ) వదినమ్మా - వదినా ...... ఈరోజు ఒక బుజ్జి ప్రాణాన్ని నిలబెట్టాము అని పాప గురించి వివరించాను - పాప సేఫ్ అని డాక్టర్ చెప్పగానే ఆ తల్లిదండ్రుల ఆనందం చూసి ఎంత ఆనందం కలిగిందో మొదటగా నా దేవతలతోనే పంచుకోవాలని కాల్ చేసాను .
వదినమ్మ - చిన్నవదిన : బేబీ ....... చాలా చాలా గర్వపడుతున్నాము . కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు - లవ్ యు లవ్ యు sooooo మచ్ - నా బేబీ దేవుడని మాకు తెలుసుకదా - ఇప్పుడే వెంటనే మా బేబీ గుండెలపై చేరి సంతోషాన్ని పంచుకోవాలని ఉంది .
నిమిషాల్లో అక్కడ ఉంటాను అమ్మా ........
వదినమ్మ : నో నో నో వాళ్ళు కిందనే ఉన్నారు - ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. సాయంత్రం వరకూ ఈ విరహం తప్పదు .
లవ్ యు అమ్మా - వదినా ........ మీ చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేకపోతున్నాను అని బాధపడ్డాను .
వదినమ్మ : ఇంకెన్ని రోజులులే , బేబీ ....... కొత్త ఆఫీస్ అద్భుతంగా ఉంది .
రేపే మా వదినమ్మ - వదినల చేతులమీదుగా ప్రారంభోత్సవం . సాయంత్రం వస్తానుకదా మా అమ్మ ఒడిలో వాలి మొత్తం చెబుతాము .
వదినమ్మ : లవ్ యు sooooo మచ్ బేబీ ........ పైకి వస్తున్నారట బై ......
జాగ్రత్త వదినమ్మా - వదినా అని కట్ చేసాను . నెక్స్ట్ బుజ్జితల్లులకు కాల్ చేసి ఆనందాన్ని పంచుకున్నాను .
ప్రాణం కంటే ఎక్కువైన దేవతలతో ఇలా ఫోనులో ........ అని బాధపడ్డాను . ఇంటికి కాల్ చేసి అమ్మా - చెల్లెమ్మా ........ ఒక సంతోషమైన విషయం చెప్పాలి 10 నిమిషాలలో అక్కడ ఉంటాము .
అమ్మ : కన్నయ్యా ....... ఇక్కడికి వస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు - ఈ విషయం చెబుదామని చాలాసేపటినుండి కాల్ చేస్తుంటే కంటిన్యూ గా ఎంగేజ్ వస్తోంది - అంటే ఆ సంతోషమైన వార్తను ముందుగా నీ దేవతలతో పంచుకున్నావన్నమాట - చెప్పానుకదా తల్లీ ....... మీ అన్నయ్యకు మనకంటే మీ అక్కయ్యలంటేనే ఎక్కువ ప్రాణం .
చెల్లెమ్మ : అందమైన నవ్వులు వినిపించాయి .
చెల్లెమ్మా ........ నీ నవ్వులు వింటుంటేనే కడుపు నిడిపోతోంది .
కృష్ణ : మహేష్ ....... ఆకలి దంచేస్తోంది , ఇలాకానీ చెబితే ఫుడ్ పెడతారో లేదో ........
చెల్లెమ్మా ........ ఎలుకలు బోలెడన్ని తిరుగుతున్నాయి గుమ్మంలోనే ఫుడ్ తో రెడీగా ఉండు .
చెల్లెమ్మ : లవ్ టు అన్నయ్యా ....... , మా అన్నయ్యకు నా చేతులతో తినిపించి పులకించిపోతాను .
లవ్ యు చెల్లెమ్మా ....... అని ముద్దుపెట్టి కట్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:49 AM



Users browsing this thread: 55 Guest(s)