Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిచేతులు ఛాతీపై స్పృశిస్తుండటం మధ్యమధ్యలో బుగ్గలపై బుజ్జిపెదాల ముద్దుల మాధుర్యానికి మెలకువవచ్చి కళ్ళుతెరిచాను .
నాకు రెండువైపులా పిల్లలిద్దరూ జోకొడుతూ ముద్దులుపెడుతున్నారు - ముద్దులుపెట్టబోయి నన్ను చూసి గుడ్ మార్నింగ్ మావయ్యా - మావయ్యా అని బుజ్జిబుజ్జిగా విష్ చేశారు .
మావయ్య ....... ఆ తియ్యనైన పిలుపులు హృదయం పులకించిపోయినట్లు పెదాలపై చిరునవ్వులతో లేచికూర్చుని ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని గుడ్ మార్నింగ్ పిల్లలూ ....... అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టాను . ఉమ్మా ఉమ్మా ....... నేను మావయ్యను అని ఎవరుచెప్పారు ? .
నిన్న ఉదయం లేచిన దగ్గరి నుండీ అమ్మ ఎప్పుడూ లేనంతగా ఆనందిస్తూనే ఉన్నారు . అమ్మా ........ ఏదైనా పండుగనా అని ఆడిగాము .
అవును ఏంజెల్స్ , నాకు ....... అన్నయ్య - మీకు ....... మావయ్య రాబోతున్న గొప్ప పండుగ అని మీ గురించే మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు రోజంతా ........ 
లవ్ యు చెల్లెమ్మా అని పిల్లలిద్దరి బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టాను .

మావయ్యా మావయ్యా ........ టెడ్డి బేర్ మీరు ఇచ్చినదే కదా ? - చాలా బాగున్నాయి .
కింద ఈ రూమ్ కు సరిపడినన్ని గిఫ్ట్స్ ఉన్నాయి . 
రూమ్ కు సరిపడినన్ని అని ఆశ్చర్యపోతున్నారు . 
గిఫ్ట్స్ మాత్రమే కాదు పిల్లలూ ....... మీతో స్నేహం చెయ్యడానికి మీలానే ఇద్దరు బుజ్జాయిలు కూడా ఉన్నారు కాస్త దూరం లో ఉన్నారు - ప్రస్తుతానికి వీడియో కాల్ లో ఫ్రెండ్స్ అవ్వండి త్వరలోనే మీ నలుగురూ ఒకదగ్గర ఆడుకోవచ్చు అని కన్నీటిని తుడుచుకున్నాను .
ఫ్రెండ్స్ ....... అంటూ ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తూనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మరిన్ని గిఫ్ట్స్ - ఆటబొమ్మలతో తో ఆడుకోవాలని ఉందా ....... ? .
పిల్లలు : అంతకంటే ముందు మా ఫ్రెండ్స్ ను చూడాలని ఉంది మావయ్యా ........
Wow లవ్ టు లవ్ టు పిల్లలూ అని మొబైల్ కోసం చూస్తే లేదు , కొన్ని గంటల ముందు వదినమ్మతో మాట్లాడటం కోసం చెల్లెమ్మకు ఇవ్వడం గుర్తుకువచ్చింది . పిల్లలూ ....... మొబైల్ మీ అమదగ్గర ఉంది కిందకువెళదామా ? .
పిల్లలు : oh yes మావయ్యా ........ 

అంతలో అన్నయ్యా - మహేష్ సర్ .......... అని వొళ్ళు గగుర్పాటుకు లోనయ్యేలా కేకలు వినిపించడంతో వొళ్ళంతా చెమటలు పట్టేసాయి - భూమి స్తంభించినంత పని అయ్యింది .
చెల్లెమ్మా ........ అంటూ పిల్లలను ఎత్తుకుని రూమ్ బయటకువచ్చి కిందకు చూస్తే , ఎవడో అమ్మ గొంతు పట్టుకున్నాడు - ప్రక్కనే పంకజం గారిని నలుగురు కదలకుండా పట్టేసుకున్నారు - అమ్మ గొంతు పట్టుకున్న వాడి చేతిని వదులు వదులు అంటూ కొడుతూనే అన్నయ్యా కృష్ణా ....... అంటూ కేకలువేస్తోంది - అమ్మకు ఊపిరాడనట్లు కళ్ళు మూతలు పడటం చూసి చెల్లెమ్మ వాడి చేతిని కొరికేసింది .
వాడు అమ్మను సోఫాలోకి తోసేసి నన్నే కోరుకుతావే అంటూ చెయ్యెత్తాడు . 
ఏడుస్తున్న పిల్లలను కిందకుదించి , పిల్లలూ ....... ఇక్కడే ఉండండి అంటూ పైనుండి కిందకు జంప్ చేసి ఎత్తిన చెయ్యి చెల్లిని తాకేంతలో పట్టుకుని , ఆ చేతిని విరిచేశాను . 
ఎముకలు విరిగిన చప్పుడు వాడి కేకలలో కనుమరుగైనట్లు చెయ్యి వాడి ఆధీనం కోల్పోయి వ్రేలాడుతోంది . నొప్పికి విలవిలలాడిపోతున్నట్లు ధడేల్ మంటూ కిందకుపడిపోయాడు .
వాడి ఆర్థనాధాలకు పంకజం గారిని పట్టుకున్నవాళ్ళు వదిలేశారు . కేకలకు కృష్ణగాడు పరుగునవచ్చి అంటీ ....... అంటూ కంగారుపడ్డాడు . రేయ్ ....... ఎవర్రా మీరు ఇంతమంది లోపలికివచ్చారు .
కృష్ణా ........ ఒక్కడూ ఉండకూడదు .
కృష్ణ - పంకజం గారు కలిసి కిందపడి కొట్టుకుంటున్న వాడితోపాటు అందరినీ బయటకు గెంటేశారు . 

అమ్మా - చెల్లెమ్మా ....... ఏమీకాలేదు కదా అని కంగారుపడుతూ సోఫాలో కూర్చోబెట్టాను . అమ్మ గొంతుపై వేలి గుర్తులను చూసి , వెంటనే టీపాయి పై ఉన్న మొబైల్ అందుకుని డాక్టర్ అంటీకి కాల్ చేసాను . 
చెల్లెమ్మ : అమ్మా అమ్మా ...... అంటూ వంట గదిలోకివెళ్లి వెన్న తీసుకొచ్చి మెడకు రాసింది .
అమ్మ : నెమ్మదిగా కళ్ళుతెరిచి , తల్లీ ........ నీకేమీ కాలేదుకదా అని కంగారుపడింది.
చెల్లెమ్మ : అమ్మా ........ నాగురించి వదిలెయ్యండి నాకేమీ కాలేదు . నొప్పిగా ఉందా అని కన్నీళ్ళతో ప్రక్కనే కూర్చుని గుండెలపైకి చేర్చుకుంది .
అమ్మ : కొద్దిగా నొప్పివేస్తోంది .
రేయ్ ........ ఎవర్రా మీరు ? , కృష్ణా ........ వాళ్ళను ఊరికే వదలద్దు అని కోపంతో ఊగిపోతున్నాను .
చెల్లెమ్మ : అమ్మా ........ మరికొంత వెన్న రాస్తాను .
అమ్మ : చల్లగా ఉంది తల్లీ .........
అమ్మా ....... అంటీకి కాల్ చేసాను వచ్చేస్తున్నారు . చెల్లెమ్మా ........ నీకేమీ కాలేదు కదా ........ 
చెల్లెమ్మ : లేదు అన్నయ్యా అని కన్నీళ్లు కార్చడం చూసి గుండె తరుక్కుపోయింది .
 చెల్లెమ్మను ఏలోటూ లేకుండా చూసుకుంటాను అని మాటిచ్చిన కొన్ని గంటల్లోనే కన్నీళ్లను చూసాను అని తట్టుకోలేకపోతున్నాను . పంకజం గారూ ....... పిల్లలు , పిల్లలు పైనున్నారు ........
పరుగునవెళ్లి కిందకు పిలుచుకునివచ్చారు - ఏమీ కాలేదు ఏమీకాలేదు అని కన్నీళ్లను తుడిచి హత్తుకుని ఓదారుస్తున్నారు .

కృష్ణ : లోపలికివచ్చి అంటీ ....... మీకేమీ కాలేదు కదా , మహేష్ ....... అడ్డుపడిన సెక్యూరిటీని కొట్టి గేట్ బద్ధలుకొట్టిమరీ లోపలికివచ్చారు , ఎవరు వాళ్ళు ? .
చెల్లెమ్మా ........ ఏమిజరిగింది ? అని బుగ్గపై చేతినివేసి అడిగాను .
చెల్లెమ్మ : కన్నీళ్ళతోనే , ఏమో అన్నయ్యా ........ మీరు కిందకువచ్చేలోపు వంట చెయ్యాలని పనిమనిషిని ఆపి వంట గదిలోకి వెళుతుండగా , అంతమందీ ఒకేసారి వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యాలి అని విలువైన వస్తువులను పగలగొట్టారు - అమ్మ కోపంతో ఎవరని ఆడిగేలోపు గొంతుపట్టేసుకున్నాడు , అడ్డుపడిన పంకజం అక్కయ్యను పట్టేసుకున్నారు . 
ఇల్లు ఖాళీ చెయ్యమన్నారా ....... ? .

అవును ఖాళీ చేయాల్సిందే అని మాటలు వినిపించడంతో డోర్ వైపు చూస్తే ఇద్దరు షేట్లు లాయర్ చుట్టూ మనుషులతో లోపలికివచ్చారు .
ఈ క్షణం నుండీ ఈ రాజభవనం మా సొంతం , ఇంటి ఓనర్స్ 50 కోట్లకు అమ్మేశారు , లాయర్ చూయించండి .........
కృష్ణ అందుకుని మా దగ్గరకు తీసుకొచ్చాడు . 
చూస్తే అన్నయ్యలు ఇంటిని 50 కోట్లకు అమ్మినట్లు సంతకాలు చేసేసారు .
అమ్మ : ఈ ఇల్లు తరతరాల ఆస్తి , అమ్మడానికి వాళ్ళెవరు - కొనడానికి మీరెవరు అని కోపంతో చెప్పి స్స్స్ ...... నొప్పికి ఆగిపోయారు .

లాయర్ : ఈ ఇల్లు ఖాళీ చెయ్యమని మీకు కోర్ట్ ద్వారా పంపించిన నోటీసులు ......
నోటీసులా ........ అమ్మా నాకు చెప్పనేలేదు .
అమ్మ : నేనూ చూడలేదు కన్నయ్యా ........, మనకెప్పుడు పంపించారు .
లాయర్ : ఒకటొసారి రెండోసారి మూడోసారి , ఒకటీ అర కాదు మూడు నోటీసులు మీ సమాధానం లేదు కాబట్టి ఇది మా సొంతమని కోర్టు ద్వారా కూడా వచ్చేసాము - మీరు అడ్డుపడతారని మీ కొడుకులే ఇలా ప్లాన్ చేయించారు - మీరు రోడ్డున పడటం చూడాలని బయట AC కార్లలో వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు .
సేట్ : లాయర్ గారూ ....... అంతలా చెప్పాల్సిన అవసరం లేదు , క్లియర్ కదా ఇక నా మనుషులు చూసుకుంటారు క్షణాల్లో అందరినీ గెంటేస్తారు . సిటీ సెంటర్ ...... ఈ బిల్డింగ్ పడగొట్టి fab city నిర్మించాలని ఆశ ........ , రేయ్ త్వరగా కానివ్వండ్రా ఇంకా బోలెడు పనులున్నాయి .
అలాగే అయ్యా ......  ముందు పిల్లలతో మొదలుపెడదాము శకునం బాగుంటుంది అని ఇద్దరు వచ్చారు .
పిల్లల్ని తాకేంతలో ఇద్దరూ భూమికి హతుక్కుపోయారు కృష్ణ - నేను కొట్టినా ఓకేఒక్కదెబ్బతో ....... ఆ వెనుకే మరొక నలుగురు రావడంతో ఒక్కొక్కడి చేతిని వెనక్కువిరిచి ఆ వెనుకే వచ్చిన వాడి ముక్కూ ముఖం ఏకమయ్యేలా ....... పిడిగుద్దులు గుద్ది చేతులను పట్టుకున్న వాళ్ళ వీపులపై కాళ్లతో కొట్టడంతో కేకలువేస్తూ బయటకుపడ్డారు .
సేట్స్ మరియు లాయర్ భయపడుతూనే ఏంటీ దౌర్జన్యం కోర్టు జడ్జిమెంటునే ధిక్కరిస్తున్నారా ...... ? , సెక్యూరిటీ ఆఫీసర్లతో వస్తే మాకు అడ్డుపడుతున్నందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారు .

లాయర్ ........ మరి సెక్యూరిటీ ఆఫీసర్లతో రాకుండా రౌడీలతో వచ్చారే - అంటే ఇది న్యాయబద్ధమైనది కాదు అన్నమాట - ఆ సేట్స్ కు ఎలానో తెలియదు మీకైనా బుద్ధి ఉండక్కర్లా ........ , 10 రోజుల్లో మూడు నోటీసులు ఏ కోర్ట్ అయినా ఇస్తుందా ? , నోటీసుల తరువాత నెలరోజుల గ్యాప్ అయినా ఉండాలికదా ....... , రౌడీలతో పనికానిచ్చేద్దాము అనుకున్నారా ఏంటి - అంత బలహీనులు ఎవరూ లేరిక్కడ - మా లాయర్ కు మెసేజ్ పెట్టాను వచ్చేస్తున్నారు - ఏ ఏ లొసుగులతో వచ్చారో అన్నీ భయటపడతాయి కాస్త ఓపికపట్టండి - నేను సరిగ్గా concentrate చేస్తే నీ లాయర్ కోట్ కూడా చిరిగిపోద్ది .......
ఒరేయ్ సేట్స్ గా ........ ఎన్ని కొని ఉంటారు - అమ్మి ఉంటారు , తరతరాల ఆస్తిని అమ్మాలంటే ఇంట్లో ఉన్న అందరి సంతకాలూ ఉండాలని తెలియదా ? .
లాయర్ : భయపడిపోయి , సర్ ....... మీరు చెప్పినవన్నీ చెప్పాను - ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనదగ్గర ఉన్నాయి , చాలనంత మనుషులు ఉన్నారు అని పిలుచుకునివచ్చారు .
మా లాయర్ గారు వచ్చేన్తవరకూ ముష్టి ఎత్తుకునేవాళ్ళల్లా ........ గేట్ బయట నిలబడండి . ఏంటి ఇక్కడే ఉన్నారు - మీకూ మీ మనుషులకు ఇచ్చిన ట్రీట్మెంట్ కావాలా ఏమిటి పర్లేదు చెప్పండి . కృష్ణా........ అనేంతలో పరుగున బయటకు తుర్రుమన్నారు .

డాక్టర్ అంటీ కంగారుపడుతూ లోపలికివచ్చారు . అక్కయ్యా - తల్లీ ....... అంటూ చూసి నొప్పివేస్తోందా ఇంజక్షన్ వెయ్యనా ...... ? .
అమ్మ : వసుంధరా ........ మన కన్నయ్య వాళ్లకు ఇచ్చిన వార్నింగ్ కే నొప్పి మాయమైపోయింది అని గర్వపడుతూ చెప్పింది .
అమ్మా ....... డాక్టర్ మీరా అంటీనా ? , అంటీ మీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యండి - వాడు చెల్లెమ్మ చేతిని కూడా పట్టుకున్నాడు నలిగిందేమో చూడండి . కృష్ణా ........ సెక్యూరిటీ అన్నయ్యల పరిస్థితి ఏమిటి ? .
కృష్ణ : దెబ్బలు తగిలాయి పిలుచుకునివస్తాను .
నేనూ వస్తాను అని గేట్ వరకూ వెళ్ళాను . కార్లలో ఉన్న అన్నయ్యలతో మాట్లాడుతున్న సేట్స్ భయపడి అటువైపుకు వెళ్లారు . సెక్యూరిటీ అన్నయ్యలిద్దరినీ లోపలికి తీసుకొచ్చాము . అంటీ ట్రీట్ చేశారు .
కృష్ణగాడితోపాటు బయటకువచ్చి పెద్దన్నయ్య దగ్గరికివెళ్ళాను . నేను రావడం చూసి విండో క్లోజ్ చేసాడు . అన్నయ్యలూ ........ మీకు వినిపిస్తుంది అని తెలుసు ఈ ఇల్లు మన గౌరవం - తాతయ్యగారు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించారు అని dad ఎప్పుడూ చెప్పి గర్వపడుతుండేవారు . వాళ్లకు అమ్మితే పడగొట్టి షాపింగ్ మాల్ కడతారు . 
అన్నయ్య : కట్టించిన తాతయ్య లేడు , నాన్న అమెరికాకు పారిపోయాడు - వాళ్లే లేనప్పుడు ఈ ఇల్లు ఉంటే ఎంత లేకపోతే ఎంతరా బాస్టర్డ్ ...... , అయినా మా ఆస్తి మా ఇష్టం నువ్వెవడివిరా అడగడానికి .......
ఆ మాటకు కృష్ణగాడు తట్టుకోలేక కోపంతో పిడికిలిని బిగించాడు .
చేతిని పట్టుకుని ఆపాను . అన్నయ్యలూ .........
అన్నయ్య : అలా ఎప్పటికీ పిలవకు , బాస్టర్డ్ రా నువ్వు - రేయ్ విను ఇంటిని అమ్మేసి 10 రోజులయ్యింది మేము ఐగుగురమూ సమానంగా పంచేసుకున్నాము అప్పుడే ఖర్చు కూడా చేసేసాము . అంతగా ఈ ఇంటిపై మమకారం ఉంటే వాళ్లకు 50 కోట్లు ఇచ్చేసి నువ్వే ఉంచుకో ఎవరు కాదన్నారు .
50 కోట్లా ........ ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడ నుండి తేవాలి అన్నయ్యా , ప్రస్తుతానికి 15 ప్లస్ 8 కోట్లు ఉన్నాయి అంతే ........
చిన్న అన్నయ్య : అన్నయ్యా ........ వీడికి ఇంత డబ్బు ఎక్కడిది ? , మన ఆస్తుల లిస్ట్ ఏమైనా మరిచిపోయామా ...... ? .
అన్నయ్యలూ ........ మిగతా డబ్బు రెండు మూడు నెలల్లో ఎలాగో సర్దుతాను ఇంటిని మాత్రం వాళ్లకు అమ్మకండి .

మహేష్ ......... రెండు మూడు నెలలు కాదు కోర్ట్ నుండే 6 నెలల సమయం తీసుకోవచ్చు వాళ్ళను ఎందుకు ప్రాధేయపడతావు అని మా లాయర్ గారు సేట్ లాయర్ తో మాట్లాడి వాడిని తిట్టాడు లా కూడా తెలియకుండా నోటీసులు ఎలా పంపిస్తావు అని ........
సేట్స్ : ఇదేదో పెద్ద తిరకాసులా ఉంది రేయ్ ........ మీ ఇల్లూ వద్దూ ఏమీ వద్దు , వారం రోజుల్లో మేము ఇచ్చిన డబ్బు ఇవ్వకపోతే నా మనుషులంతా మీ ఇళ్లకు వస్తారు గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తుండగానే , నా వైపు కోపంతో చూస్తూ వేగంగా వెళ్లిపోయారు అన్నయ్యలు - సేట్స్ మరియు వాడి లాయర్ కూడా తుర్రుమన్నారు అక్కడ నుండి .

థాంక్స్ లాయర్ గారూ ........
లాయర్ : కేవలం 6 నెలలు స్టే తీసుకురావచ్చు మహేష్ , ఒరిజినల్ పత్రాలు వాళ్లదగ్గర ఉన్నాయి - కోర్టుకు వెళితే మనం గెలవడం కష్టం - కోర్టు సమయం అయ్యింది నేను వెళ్లి స్టే తీసుకుని కాల్ చేస్తాను అని వెళ్లిపోయారు .

ఇంటివైపుకు తిరిగి తాతయ్యగారు - dad ........ నా ప్రాణం ఉన్నంతవరకూ ఈ నిలయాన్ని పరుల పరం కానివ్వను . రేయ్ కృష్ణా ........ 6 నెలల్లో ఎలా అయినా ఎంత కష్టపడైనా మిగతా అమౌంట్ సమకూర్చాలి .
కృష్ణ : ఏమిచేద్దామో చెప్పు మహేష్ , నేను నీ వెనుకే నడుస్తాను .
వెనుక కాదురా నువ్వెప్పుడూ నా ప్రక్కనే అని భుజం చుట్టూ చేతినివేశాను . నన్ను ........ అన్నయ్యలు తిట్టగానే అంత కోపం వచ్చిందా ? .
కృష్ణ : మీ అన్నయ్యల నిజస్వరూపం తెలిసింది . నువ్వన్నా - అంటీ అన్నా ఏమాత్రం ప్రేమ లేదు . లోపల అంటీకి అలా జరిగింది అని చెప్పకుండా మంచిపనిచేశావు . 
అవును కృష్ణా ......... తాతయ్యగారు - dad లను అన్నట్లుగానే అమ్మ గురించి ...... ఆ మాటలు విని నేనైతే తట్టుకునేవాడిని కాదు . అమ్మ - చెల్లెమ్మ ఎలా ఉన్నారో చూద్దాము పదా ........
కృష్ణ : మెయిన్ గేట్ పాడవడం చూసి సాయంత్రం లోపు మార్పించేస్తాను మహేష్ .

లోపలకువెళ్లి కట్లతో ఉన్న సెక్యూరిటీ అన్నయ్యలను పరామర్శించాను . అన్నయ్యలూ ....... కోలుకునేంతవరకూ రెస్ట్ తీసుకోండి అని పర్సులోనుండి అమౌంట్ తీసి ఇద్దరి జేబులలో ఉంచాను - మా డ్రైవర్ ను పిలిచి ఇద్దరినీ ఇంటిదగ్గరకు వదిలిరమ్మని చెప్పాను . 
సెక్యురిటి : మహేష్ సర్ ......... పెద్దగా దెబ్బలేమీ తగులలేదు , మా డ్యూటీ మేము చేస్తాము .
మీ అభిమానం అన్నయ్యలూ ....... మీపై కూడా మాకూ అంతే బాధ్యత ఉంటుంది ఎల్లప్పుడూ ........ , మీరు బాగుంటేనే మేము సేఫ్టీ గా ఉంటాము అది గుర్తుపెట్టుకోండి - నా మాటను గౌరవించి ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి - డ్రైవర్ ...... అన్నయ్యల ఇంట్లోవాళ్లకు నా తరుపున క్షమాపణలు తెలుపు ........
సెక్యురిటి : మహేష్ సర్ ........ మీరు నాన్నగారి కంటే మంచివారు .
అన్నయ్యలూ ......... నేను నేర్చుకున్నదే అమ్మా నాన్నగారినుండి , మనల్ని నమ్ముకున్నవాళ్లను చూసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని అమ్మ - వదినమ్మ మాటలను నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను అని కృష్ణ సహాయంతో ఇద్దరినీ కారులో కూర్చోబెట్టి పంపించి లోపాలకువచ్చాము .

అమ్మా - చెల్లెమ్మా ....... అంటూ వెళ్లి ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని చేతులను అందుకున్నాను . అంటీ ........ హాస్పిటల్ కు వెళదామా ? .
అంటీ : మా తల్లి కృష్ణ ప్రాణంలా వెన్న రాసి నొప్పిని ఎప్పుడో మాయం చేసింది కదా కంగారుపడాల్సిన అవసరం లేదు అని నా కన్నీళ్లను తుడిచారు .
లవ్ యు చెల్లెమ్మా ........ అని చేతులపై ముద్దులుపెట్టాను . 
చెల్లెమ్మ : అన్నయ్యా ....... నాకేమీ కాలేదు , మీరు బాధపడకండి - ఈ కన్నీళ్లు ఎందుకో నాకు తెలుసు అన్నయ్యా ....... , మా అన్నయ్య సంతోషం నా సంతోషం - అలానే మా అన్నయ్య కష్టసుఖాలు కూడా .........
చెల్లెమ్మా ........ అంటూ ఒడిలో తలవాల్చాను . తోబుట్టువుతో కష్టాలను పంచుకునే అన్నయ్య ఒక ........
చెల్లెమ్మ : అన్నయ్యా ....... అంటూ నా నోటిని మూసేసింది . అన్నయ్యా ....... ఈ కష్టాలు కొన్నిరోజులే అని నాకు అమ్మ చెప్పారు అన్నయ్యా ........ , నేనూ డిగ్రీ పూర్తిచేసాను మీకు చేతనంత సహాయం నేనూ చేస్తాను .
ఖచ్చితంగా ఖచ్చితంగా చెల్లెమ్మా ........ నా చివరి రక్తపుబొట్టువరకూ కష్టపడైనా నా చెల్లెమ్మ మరియు నా దేవతల కన్నీళ్లకు సమాధానం ఈ కోటకు రాణి - యువరాణులను చేసి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చేతిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ....... , మా అన్నయ్య అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసే సమయం వచ్చింది అని నా కురులపై ముద్దుపెట్టింది . అమ్మ కురులను ప్రాణంలా స్పృశిస్తోంది .
చెల్లెమ్మా ........ నీ మాటలకే తెగ ఉత్సాహం వచ్చేస్తోంది . అమ్మ - వదినమ్మ వదినల ఆశీర్వాదంతో ......... అమ్మా రేపే .........

జానకీ మేడం జానకీ మేడం మహేష్ మహేష్ ......... అంటూ చాలామంది లోపలికివచ్చారు . కృష్ణ - పంకజం అలర్ట్ అయ్యి అడ్డుపడబోతే ........
కృష్ణా ........ its alright వీరంతా మన కంపెనీని శిఖరానికి చేరడంలో కస్టపడినవాళ్ళు కంపెనీ మేనేజర్లు - చీఫ్ ఆఫీసర్స్ , నాన్నగారికి ప్రీతిపాత్రమైనవారు నమ్మదగినవారు అని లేచివెళ్లి చేతులుకలిపాను .
మేనేజర్లు : మేడం - మహేష్ ....... ఇలా జరుగుతుందని కలలోకూడా ఊహించలేదు . మీరు సర్ ....... కష్టపడి ఒక్కొక్క ఇటుకా పేర్చి నిర్మించి శిఖరాన నిలిపిన కంపెనీని చేజిక్కించుకున్న కొన్నిరోజుల్లోనే సర్వ నాశనం చేస్తున్నారు . కంపెనీని ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్లిన ప్రాడక్ట్స్ ను ఆపేసి కంపెనీకి ఉన్న గొప్ప పేరుని ఉపయోగించుకుని గుట్కా - టొబాకో - ఆల్కహాల్ ........ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు . భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బిజినెస్ మొదలెట్టినా మొదలెడతారు - ఆ వైపుగా అడుగులుకూడా వేస్తున్నారని కొంతమంది నమ్మకస్థుల ద్వారా సమాచారం అందుతోంది మేడం - మీ అబ్బాయిలకు మీరైనా చెప్పాలి మేడం దానివలన కంపెనీ భవిష్యత్తు ప్రశ్నర్థకం అవుతుంది - ఇప్పటికే కంపెనీని మూడు ముక్కలు చేసేసారు , అడ్డుపడిన వారందరినీ జాబ్ నుండి నిర్ధాక్షన్యంగా తొలగించివేస్తున్నారు - కంపెనీ బిల్డింగ్స్ అన్నింటినీ జల్సాలకోసం అమ్మేస్తున్నారు - మనతో పోటీపడి ఒడిపోయినవారంతా గుంటకాడ నక్కల్లా మన పతనం కోసం ఎదురుచూస్తున్నారు - ఇలానే అయితే అతిత్వరలోనే ఆ రోజు వచ్చేస్తుంది .
అమ్మ : ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్లైపోయారు మేనేజర్స్ , పెద్దవాళ్లను కూడా లెక్కచెయ్యనంత మూర్ఖులుగా మారిపోతున్నారు . ఇచ్చిన కోట్ల డబ్బును జూదాలలో ఊడిపోయి ఉంటారు అందుకే ఇప్పుడు కంపెనీ ఆస్తులను సర్వనాశనం చెయ్యడం మొదలెట్టారు .
మేనేజర్లు : మేడం - మహేష్ ........ ఇలాగే అమ్ముకుంటూ పోతే కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది . మేము వెంటనే అందరమూ కలిసి స్ట్రైక్ మొదలుపెడతాము - రిజైన్ చేస్తాము - మహేష్ ను MD చెయ్యమని డిమాండ్ చేస్తాము .
అమ్మ : సాఫీగా జరిగి ఉంటే ఈపాటికి నా కన్నయ్యను ఆ స్థానంలో చూసేవాళ్ళము అని అమ్మ కన్నీటిపర్యంతమవుతున్నారు - dad గుర్తుకొచ్చినట్లు ఫ్యామిలీ ఫోటో వైపు చూస్తున్నారు.

చూసి హృదయం చలించిపోయింది - చెల్లెమ్మ ........ అమ్మను గుండెలపైకి తీసుకుని ఓదారుస్తోంది .
ఇవన్నీ తరువాత మాట్లాడుకుందాము వదిలెయ్యండి మీరంటే మాకు చాలా గౌరవం వక్తికోసం వ్యవస్థను సాటి మనిషికోసం సంస్థను పాడుచెయ్యకూడదు .
మేనేజర్లు : అలా అని వదిలేస్తే మొత్తం నాశనం చేసేస్తారు . ఆల్రెడీ చైర్మన్ గారు వర్కర్స్ కోసం ఆలాట్ చేసిన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారు .
అన్నీ సమస్యలూ అవే సర్దుకుంటాయి , చెల్లెమ్మా - అంటీ ........ అమ్మను లోపలికి తీసుకెళ్లండి . మేనేజర్ గారూ ....... మీరు కూడా వాళ్ళతోపాటు లేకపోతే వాళ్ళు మరింత రెచ్చిపోతారు - ప్రక్కనే ఉండి నెమ్మదిగా వాళ్లకు అర్థమయ్యేలా తెలియజేయ్యండి . మీరు ఎదురువెలితే నష్టపోయేది మీరే సొంత ఫ్యామిలీనే ఇబ్బందులకు గురిచేసినవాళ్లకు మిమ్మల్ని పంపించెయ్యడానికి ఏమాత్రం ఆలోచించరు - మీ కుటుంబాలు ఇబ్బందులకు గురికావడం మాకు బాధాకరం - మీరు ఇక్కడికి వచ్చారని తెలిసినా కూడా అలానే జరుగుతుంది వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోండి . 
మేనేజర్లు : నాన్నగారు కూడా ఎల్లప్పుడూ మా గురించే ఆలోచించేవారు - నువ్వే నిజమైన వారసుడివి మహేష్ ........ , నీకు తోడుగా నీ వెనుక నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మాత్రం మరిచిపోకు , నువ్వు చెబుతున్నావు కాబట్టి వెళ్లిపోతున్నాము .
సర్స్ ........ ఇప్పటివరకూ మన కంపెనీ నుండి తొలగించిన వారి లిస్ట్ ఇవ్వగలరా ?.
మేనేజర్లు : ఆఫీస్ కు వెళ్లి మెసేజ్ చేస్తాము మహేష్ అనిచెప్పి వెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:46 AM



Users browsing this thread: 45 Guest(s)