Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
క్యాబ్ ను ఇంటికి కాస్తదూరంలోనే ఆపించి పే చేసి పంపించేసాను . మెయిన్ గేట్ కు ఇరువైపులా ఇద్దరు సెక్యూరిటీ నిద్రమత్తులో ఉన్నట్లు కళ్ళు మూతలుపడుతున్నాయి - అన్నయ్యలంతా పార్టీలో ఫుల్ గా తాగి అక్కడే పడిపోయిఉంటారు కాబట్టి వాళ్ళ వలన ఎటువంటి ప్రాబ్లమ్ లేదు - ప్రభావతి , వరలక్ష్మి గారికి కాల్ చేసి ప్రక్కనే నిద్రపోతున్న దేవతలూ - బుజ్జాయిల నిద్రను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మొన్న రాత్రి ఎలా లోపలికివెళ్ళానో అలానే కాంపౌండ్ దూకాను , ఆశ్చర్యంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది , సౌండ్ చెయ్యకుండా వెళ్లి లోపలకు తొంగిచూసాను .
డాడీ డాడీ డాడీ డాడీ ........ అంటూ బుజ్జాయిలు - బుజ్జితల్లులు నలుగురూ బయటకువచ్చి పాదాలను - నడుమును చుట్టేశారు .
బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ అంటూ లోపలికివచ్చి డోర్ వేసేసి , మోకాళ్లపై కూర్చుని నలుగురినీ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నాను . నిద్రపోలేదా అని ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జితల్లులు : వస్తానని మాటిచ్చిన మా డాడీ ని చూడకుండా , ఇలా ముద్దులు స్వీకరించకుండా మాకు నిద్రపడుతుందా అని గట్టిగా హత్తుకుని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు లవ్ యు ........ కాస్త కాదు చాలా చాలా ఆలస్యం అయ్యింది అని ప్రాణంలా హత్తుకుని అమ్మావాళ్ళు ఎక్కడ అని అడిగాను .
గుండెలపై దెబ్బలు - బుగ్గలపై గిల్లుళ్లు .......
హబ్బా అమ్మా స్స్స్ ..... ok ok మీ పిన్నమ్మలు ఎక్కడ ? అని నవ్వుకున్నాను .
వైష్ణవి : ప్రాణంలా చూసుకునే అంటీ వాళ్ళను బాడీగార్డ్స్ గా సెట్ చేశారుకదా వాళ్ళతో మాట్లాడుతుంటారు అని పైకి చూయించారు .

అమ్మో ........ ఇంత చీకటిలో ఈ సమయంలో నా బుజ్జితల్లులు బుజ్జాయిలు నాకోసం ఇక్కడే వేచిచూస్తున్నారు అన్నమాట - భయం వెయ్యలేదా బుజ్జి ఏంజెల్స్?.
బుజ్జాయిలు : మా డాడీ వస్తారు అన్న ఆనందంలో భయం మా దరి చేరనేలేదు .
మీ పిన్నమ్మలకు కనిపించి మీ ప్రాణమైన అమ్మల దగ్గరికివెళ్లాలి .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ....... ముందు అమ్మలదగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకువచ్చారు అని గిల్లేసారు తియ్యనిబుజ్జికోపాలతో ........
లవ్ యు ఇదిగో ఇందుకే మీరు ఈ డాడీ కోసం నిద్రమానుకుని ఎదురుచూస్తుంటారని ముందు ఇక్కడికే వచ్చేసాను - అలాకాకుండా ముందు అక్కడికి వెళ్లి ఉంటే మీ అమ్మలు నా అంతు చూసేవాళ్ళు - అక్కడ మా బుజ్జాయిలు బుజ్జితల్లులు మీకోసం ఎదురుచూస్తుంటారు మొదట అక్కడకువెళ్ళకుండా ఇక్కడకు ఎందుకువచ్చావని .........
బుజ్జితల్లులు : లవ్ యు అమ్మలూ ....... అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకున్నారు . 
అందుకే మొదట ఇక్కడికివచ్చాను అని ముద్దులుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకుని పైన గదిలోకివెళ్ళాను .

మహేష్ మహేష్ ........ అంటూ బుజ్జాయిలను లాగి బెడ్ పైకి విసిరేసి నన్ను చుట్టేశారు - నా తలకు తగిలిన గాయాన్ని చూసి కన్నీళ్ళతో కాస్త మానింది అని గుండెలపై వాలారు .
కాస్త ఏమిటి దేవతలూ ......... మీ ప్రాణమైన ముద్దులకు పూర్తిగా మాయమైపోయింది ఇక చర్మం ఒక్కటే రావాలి అంతే , చెరొకముద్దు పెట్టా ........
అంతే బుగ్గలపై ముద్దులవర్షమే కురిసింది .
రేపు మనం కలిసే సమయానికి గాయం గుర్తులే ఉండవు వదినలూ అంటూ ప్రాణంలా నుదుటిపై ముద్దులుపెట్టాను .

బుజ్జాయిలు బుజ్జితల్లులు : అక్కయ్యలూ - బుజ్జాయిలూ ....... మనం గాయం గురించి అడగలేదు - మానిపోవాలని ముద్దులూపెట్టలేదు ప్చ్ ప్చ్ ........ పిన్నమ్మలు చూడు ఎలా ప్రేమ కురిపిస్తున్నారో అని అసూయ చెందుతున్నారు .
వదినలు : మీకు , మీ డాడీ నుండి గిఫ్ట్స్ మాత్రమే కావాలి ....... , ఎంతైనా మీ డాడీ ని చూసుకోవాల్సినది మేము మాత్రమే అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
నలుగురు : లవ్ యు లవ్ యు డాడీ ....... అంటూ వదినలను నా నుండి ప్రక్కకు లాగేస్తున్నారు .
వదినలు : ఊహూ ........ కింద నుండి ఇక్కడకు వచ్చేన్తవరకూ మేము అడ్డువచ్చామా లేదుకదా , మాకు తనివితీరేంతవరకూ మీ డాడీ ని వదిలేది లేదు అని మరింత గట్టిగా చుట్టేసి నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ........ నన్ను గట్టిగా బంధించేశారు నా దేవతలు లవ్ యు లవ్ యు నేను ఏమీచెయ్యలేని నిర్భాగ్యుణ్ణి .........
బుజ్జాయిలు : మాకు తెలుసు డాడీ అని దేవతలను బుజ్జిచేతులతో కొడుతున్నారు.

వదినలు నవ్వుకుని , మహేష్ మహేష్ ....... మావయ్యగారిని కలిశారా ? .
కళ్ళల్లో చెమ్మతో బుజ్జాయిలు బుజ్జితల్లులను దూరం తీసుకెళ్లమని ప్రభావతి - వరలక్ష్మి గారికి సైగచేసాను . 
వరలక్ష్మి : బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ మీ డాడీకోసం వండిన ఫుడ్ వేడిచేసి తీసుకొద్దాము రండి అని పిలుచుకునివెళ్లారు .
వదినలూ ........ మీరు బాధపడకూడదు అని ఇద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టి వారిముందు నేలపై మోకాళ్లపై కూర్చుని ఒక్కొక్కచేతిని అందుకుని అమెరికాలో జరిగినది వివరించాను .
వదినలు : కన్నీళ్ళతో , అమ్మా అమ్మా ....... , అమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంది - ఈ సమయంలో మీ ప్రక్కన లేకపోయాము లవ్ యు లవ్ యు అమ్మా .........
ఇదిగో ఇలా బాధపడతారనే అమ్మ చెప్పద్దు అనిచెప్పారు . ఇకనుండీ తన కూతుర్లు బుజ్జాయిలే సర్వస్వం అని బాధను వారి హృదయంలోని దాచేసుకున్నారు .
వదినల బాధ పెరుగుతూనే ఉంది .
దేవతలూ ........ మనం గుర్తుచేసి .......
వదినలు : లేదు లేదు లేదు అమ్మ సంతోషమే మా సంతోషం - వీడియో కాల్ లోకూడా ఈ బాధను తెలియచెయ్యము . 
ఇందులో డాడీ తప్పుకూడా లేదనేది నా అభిప్రాయం - అన్నయ్యల .........
నా చెంపలు చెళ్లుమన్నాయి .
ఆ మూర్ఖుల వలన మనఇంటిలో ఏరోజు సంతోషం ఉంది గనుక , ఆ సంతోషాలను అక్కడ వెతుక్కున్నారు అంతే .........

డోర్ ఓపెన్ అవ్వడంతో కన్నీళ్లు తుడుచుకున్నాను . పిన్నమ్మలు వదిలేసారా అని నన్ను చుట్టేసి డాడీ గాయం మానిపోవాలి , డాడీ గాయం మానిపోవాలి అని ముద్దులతో ముంచెత్తారు .
దేవతలూ .........
వదినలు : తమ కన్నీళ్లను తుడుచుకుని లోలోపలే బాధపడుతూ పైకి నవ్వుతున్నారు .

వదినలూ - బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ......... ఆకలివేస్తోంది ? .
అంతే ఆతృతతో బాడీగార్డ్స్ నుండి ప్లేట్ అందుకుని వడ్డించి రెండు దేవతల చేతిముద్దలు - నాలుగు బుజ్జిదెయ్యాలు గోరుముద్దలు తిని బుజ్జితల్లులు బుజ్జాయిలకు తినిపించాను .
ప్రభావతి : మహేష్ సర్ ....... మేడం వాళ్ళుకూడా తినలేదు . 
దేవతలూ మిమ్మల్నీ ........ అంటూ తినిపించాను . నా దేవతలు తినలేదంటే మీరూ తిని ఉండరు మొదట తినండి తరువాత మాట్లాడుదాము . 
దేవతలు : ఆనందబాస్పాలతో తిని , మహేష్  ....... అమ్మ తిన్నారా ? .
చిట్టి తల్లి చిట్టి తల్లి అని మీ చెల్లి కృష్ణ దగ్గరికి వెళ్ళింది , చెల్లెమ్మ తినిపించి ఉంటుంది నాకు తెలుసు అని గుండెలపై చేతినివేసుకున్నాను .
దేవతలు : లవ్ యు చెల్లీ ........ , మహేష్ ....... కాస్త పెద్ద ముద్దలు పెట్టొచ్చుకదా ........ 
లవ్ యు లవ్ యు దేవతలూ ........ , దేవతలకు పెద్ద పెద్ద గోరుముద్దలు - బుజ్జాయిలకు బుజ్జిముద్దలు ........
మా డాడీకి కూడా సేమ్ అని తినిపించి నవ్వుకున్నాము .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ........ తిన్నది చాలులే ఇక వెళ్ళండి , అక్కడ మా అమ్మలు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటారు .
వదినలు : అవునవును మా ప్రియాతిప్రియమైన అక్కయ్య - చెల్లి ఎదురుచూస్తుంటారు వెళ్ళండి వెళ్ళండి అని నా నోటిని తుడిచి నీరు తాగించి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
మీరు కడుపునిండా తింటాము అంటేనే వెళతాను .
మా మహేష్ ను - మా డాడీ ని చూసాము కదా నువ్వు కోరినట్లుగానే తింటాము వెళ్లు వెళ్లు వెళ్లు అని బయటకు చేతులను చూయించారు .
చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి బాడీగార్డ్స్ కు జాగ్రత్త అనిచెప్పి ఎలా లోపలికివెళ్ళానో అలానే రోడ్డుమీదకువచ్చాను .

ఈసమయంలో క్యాబ్స్ ..........
సర్ ...... సర్ సర్ అని పిలుపులు వినిపించడంతో చూస్తే ఇంతకుముందు ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడకు తీసుకొచ్చిన డ్రైవర్ ........
నా దగ్గరకువచ్చి ముందూ వెనుక మరియు జేబులవైపు చూసాడు . ప్చ్ ....... ఏంటి సార్ ఇంటిని మొత్తం దోచుకునివస్తారు అనుకుంటే ఉత్తచేతులతో వచ్చారు - మీరు గోడ దూకడం చూసి దోచుకుని వచ్చిన తరువాత క్యాబ్ అవసరమని మీకోసం ఇక్కడే wait చేస్తున్నాను .
థాంక్ గాడ్ అని నవ్వుకున్నాను . ఎక్కడ బ్రో ....... డెబిట్ - క్రెడిట్ - ఆన్లైన్ transactions వచ్చిన తరువాత ఇంటిలో ఎవ్వరూ డబ్బు ఉంచుకోవడం లేదు , ఇల్లు మొత్తం వెతికినా లాభం లేకపోయింది .
డ్రైవర్ : అవును నిజమీ సర్ , మరి గోల్డ్ , జ్యూవెలరీ ........
నిన్ననే బ్యాంకుల్లో ....... అదే అదే " ఇంటనే ఉండగా బంగారం ఎందుకీ విచారం " అని వెంకీ మామ ad ఇచ్చాక అన్నీ ఇళ్లల్లోని బంగారం మొత్తం ఫైనాన్స్ లలోనే ఉంటోంది ........
డ్రైవర్ : అవసరం పడితే నేను కూడా నా ఉంగరాన్ని ఫైనాన్స్ లో ఉంచాను సర్ 20 వేల దాకా వచ్చింది . ఇప్పుడెలా సర్ ఖాళీ చేతులలో ఇంటికి వెళతారా ....... ? .
అయినా నువ్వెంటి ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నావు ? .
డ్రైవర్ : నా వంతు సహాయం చేస్తే నాకు ఏమైనా అని తల గోక్కున్నాడు . 
నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్లున్నావు మరొక పెద్ద ఇంటికీ వెళదామా ...... ? .
డ్రైవర్ : హుషారుగా yes సర్ అంటూ క్యాబ్ డోర్ తెరిచాడు .
****** ఏరియా కు వెళ్లు బ్రో ........
Wow costly ఏరియా అని ఉత్సాహంతో పోనిచ్చాడు .
************

కృష్ణ ........ అమ్మను ఎయిర్పోర్ట్ నుండి తన ఇంటికి తీసుకెళ్లాడు - అమ్మా ఇదే ఇల్లు ..........
అమ్మ : కృష్ణా ....... నా తల్లి - బుజ్జాయిలు ఇంత చిన్న ఇంటిలో ఉంటున్నారా ....? అని బాధతో అడిగింది .
కృష్ణ : sorry అమ్మా ....... నా సంపాదనకు తగ్గ రెంట్ కు ఇల్లు దొరకడం చాలా కష్టం .
మన ఇంటికి వెళ్లిపోతున్నాము - అంటీ ఆ ఈ అన్నావో ........
కృష్ణ : మీ కూతురు మీ ఇష్టం అంటీ ....... , ఈ ఇంటినిగానీ మహేష్ చూసి ఉంటే నన్ను కొట్టేవాడే .........
అమ్మ : నిజమే అని నవ్వుకుంది . ఫ్లైట్ లో ఏమిజరిగిందో తెలుసా ....... నీకు మాత్రమే కాదు ఉదయం నా తల్లికి కూడా చెబుతాను . అవునూ లోపల ఇంకా లైట్స్ వెళుతూనే ఉన్నాయి . 
కృష్ణ : చెప్పానుకదా అంటీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి జాగ్రత్తగా చేర్చానని చెబితేకానీ .........
అమ్మ : లవ్ యు తల్లీ అని ఆనందించి , కృష్ణా ....... ష్ ష్ అని స్లిప్పర్స్ కారులోనే వదిలి చప్పుడు చెయ్యకుండా కిటికీలోనుండి లోపలికి చూసింది - పిల్లలను ఒడిలో చెరొకవైపు పడుకోబెట్టుకుని జోకొడుతోంది - నా చిట్టి తల్లి అని మురిసిపోయి లోపలికివెళ్ళమని సైగచేసింది .

బయట నుండి లాక్ వేసుకెళ్లినట్లు కృష్ణా వచ్చేసాను అని ఓపెన్ చేసి లోపలికివెళ్లాడు - పిల్లలు నిద్రపోయినట్లున్నారే ........, తిన్నారా లేక నీలానే అమ్మమ్మకోసం ........
చెల్లెమ్మ : తినిపించాను కృష్ణా ....... , అమ్మమ్మా అమ్మమ్మా అని కలవరిస్తూనే కొద్దిసేపటిముందు నిద్రపోయారు , ముందు అమ్మ ఎలా ఉన్నారో చెప్పు - అక్కయ్యలందరితో మాట్లాడిన ఆనందంలో ఉన్నారా ...... ? - జాగ్రత్తగా ఇంటికి చేర్చారుకదా ? - అన్నయ్య ఎలా ఉన్నారు ? , తలకు మోచేతులపై గాయాలు మానిపోయాయా చెప్పు చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించింది .
కృష్ణ : శ్రీమతీ ....... మీ అమ్మగారు ఎలా ఉన్నారో నువ్వే చూసుకో అని డోర్ వైపు సైగచేశాడు .
చెల్లెమ్మ : అమ్మా ...... 
అమ్మ : తల్లీ కృష్ణా ....... పిల్లలు అంటూ లోపలికివెళ్లి ఆపి ప్రక్కనే కూర్చుని , బాబుని ప్రేమతో గుండెలపైకి తీసుకుంది . తల్లీ ....... ఆ దుర్గమ్మ తల్లి ఇప్పటికి మనల్ని కలిపింది అని బుగ్గపై ప్రాణంలా స్పృశించింది .
చెల్లెమ్మ : " అమ్మా ...... " అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒడిలో తలవాల్చి కన్నీళ్ళతోనే తన ఫీల్ ను తెలియజేస్తోంది . అమ్మా ....... అన్న పిలుపు పిలవడం కోసం అని ఆనందబాస్పాలతో తన బుగ్గపై ఉన్న చేతికి ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకుని సున్నితంగా హత్తుకుని మైమరిచిపోతోంది .
అమ్మ : తల్లీ ....... నాకోసం ఇలా తినకుండా ఉంటే ఎలా , అంటే నేను కూడా తినలేదనుకో , ఫ్లైట్ లో మీ అన్నయ్య భుజంపై ఆదమరిచి నిద్రపోయాను .
చెల్లెమ్మ : కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుని , అమ్మా ........ క్షణంలో వేడిచేసుకునివస్తాను అని లేవబోతే ........
అమ్మ ఆపి లవ్ యు తల్లీ ....... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఆ ముద్దుతో ఇన్ని సంవత్సరాల అమ్మ లేని లోటుని మరిచిపోయినట్లు ఆనందబాస్పాలతో అమ్మా అమ్మా అమ్మా ........ అంటూ తియ్యనైన ఉద్వేగంతో అమ్మ గుండెలపైకి చేరిపోయింది .
ఒక్క ముద్దుకే - నా ఒక్క ముద్దుకే ఇలా అయిపోతే ఎలా తల్లీ ........ , మీ ఐదుగురు అక్కయ్యల ముద్దులు - ఇద్దరు బుజ్జితల్లులు , ఇద్దరు బుజ్జాయిల ముద్దులు - ఎవరి వల్లనైతే నా తల్లి నా గుండెలపైకి చేరిందో ........ ఎవరో తెలుసా తల్లీ ........
చెల్లెమ్మ : అమ్మా ....... మా అన్నయ్య .
అమ్మ : ప్చ్ ........ మీ ఆక్కయ్యలు అందరికీ వాడంటేనే ఇష్టం , ఇప్పుడు నీకు కూడా మీ అన్నయ్య అంటేనే ప్రాణం ........
చెల్లెమ్మ : ప్రాణం కంటే ఎక్కువ అమ్మా ........
అమ్మ : చూడకుండానే ఎలా చెప్పగలవు తల్లీ ....... అని తియ్యనికోపంతో బుగ్గపై సున్నితంగా తాకేతాకనట్లు కొరికేసింది .
చెల్లెమ్మ : స్స్స్........
అమ్మ : తల్లీ ....... నొప్పివేసిందా ? .
చెల్లెమ్మ : తియ్యనైన నవ్వులతో , తియ్యగా ఉందమ్మా ........ , మా అమ్మ ఇప్పుడు ఇలా నన్ను గుండెలపైకి తీసుకుందంటే - నిన్న ముగ్గురు అక్కయ్యలను కలిశాను అంటే అన్నయ్య వల్లనే కదమ్మా ........
అమ్మ : నిజమే అనుకో ....... , చూడకుండానే ప్రాణం కంటే ఎక్కువ అయిపోయాడు ఇక ముద్దుపెడితే ఏమంటావో .........
చెల్లెమ్మ : ఆ ముద్దే నా జీవితానికి the best moment అవుతుందేమో అమ్మా ......... , అన్నయ్యను కలవగానే మీరే ఎలాగైనా ఆ మధురమైన ముద్దుని పెట్టించాలి .
అమ్మ : తల్లీ కృష్ణా ....... నన్ను మన్నించాలి నువ్వు , ఫ్లైట్ లో నాకు ఐదుగురే తల్లులు అన్నాను అంతే మొట్టికాయలు వర్షం కురిపించి నా నోటితోనే నా బుజ్జితల్లి కృష్ణకూడా ఉందికదా అని తెలియజేశాడు - ఆరుగురు కూతుర్లు అని చెబితేగానీ మొట్టికాయలు ఆగలేదు - చెల్లెమ్మ లేదని నాపై అప్పుడప్పుడూ కోప్పడేవాడు , స్కూల్ లో అన్నాచెల్లెళ్ల ప్రేమలను చూసినప్పుడు - మూవీస్ లో సిస్టర్ సెంటిమెంట్ చూసినప్పుడు అయితే తిండి కూడా తినేవాడు కాదు - మీ పెద్ద అక్కయ్య ఇందు ఇలానే ఒడిలో పడుకోబెట్టుకుని ప్రాణంలా తినిపించేది , నువ్వంటే మీ అన్నయ్యకు ఎంత ప్రాణమో అర్థమయ్యిందా ..........
చెల్లెమ్మ : కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ఆగడం లేదు . అమ్మా ........ అన్నయ్య ? .
అమ్మ : అన్నయ్యను వెంటనే చూడాలని , గుండెలపైకి చేరాలని , నుదుటిపై ప్రాణమైన ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉందికదూ ......... 
చెల్లెమ్మ : వెంటనే అంటే కుదరదులే అమ్మా ........ , అన్నయ్య ........ వారి దేవతల - బుజ్జితల్లుల దగ్గరికి వెళ్ళాడు కదా ........
అమ్మ : అమ్మో ....... అన్నయ్య అంటే ఇంత ప్రేమనా ...... ? , అన్నయ్యను కలిసాక ఈ అమ్మ గుర్తొస్తుందో లేదో ........ 
చెల్లెమ్మ : అమ్మ తరువాతనే అన్నయ్య .........
అమ్మ : మీ ఆక్కయ్యలు కూడా ముందు ఇలా అన్నవాళ్లే , కన్నయ్య ప్రేమకు దాసోహం అయిపోయి బేబీ తరువాతనే అమ్మ అయిపోయింది .
చెల్లెమ్మ : తియ్యదనంతో నవ్వుతూనే ఉంది . 
అమ్మ : నా చిన్న తల్లి ఎప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

నేలపై పడుకున్న పాప , అమ్మమ్మా అమ్మమ్మా ....... ఎప్పుడు వస్తారు అని నిద్రలోనే కలవరిస్తోంది .
అమ్మ : పాప ....... వచ్చేసాను తల్లీ , మీకోసం వచ్చేసాను అని మరొకచేతితో ఎత్తుకుని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని మురిసిపోతోంది - పాప బాబు ఇకనుండీ మనమంతా కలిసే ఉండబోతున్నాము , మన ఇంటికి వెళ్లిపోతున్నాము అని ముద్దులవర్షం కురిపిస్తోంది .
చెల్లెమ్మ : అమ్మా ........ 
కృష్ణ : ష్ ష్ ........
అమ్మ : ఏంటి తల్లీ ......... కోపం .
చెల్లెమ్మ : అర్థమైనట్లు లేదు ఏమిలేదమ్మా , పట్టరాని ఆనందంతో అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి వంట గదిలోకి తుర్రుమంది .
అమ్మ : కృష్ణా ....... బ్రతికిపోయారు . ముఖ్యమైనవి మాత్రమే కారులో ఉంచు తినగానే వెళ్లిపోతున్నాము .
కృష్ణ : అలాగే అంటీ ......... 

చెల్లెమ్మ ...... ప్లేట్ లో వడ్డించుకునివచ్చి అమ్మకు తినిపించింది . అమ్మ ...... పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని ఒకచేతితో జోకొడుతూనే చెల్లెమ్మకు తినిపించింది .
చెల్లెమ్మ : మ్మ్మ్ ....... అమ్మచేతి గోరుముద్ద ఇంత రుచిగా ఉంటుందా , ఎక్కువ పొందాలని ఫాస్ట్ ఫాస్ట్ గా తింటోంది .
అమ్మ : తల్లీ ....... బాగా నమిలి తిను లేకపోతే అరగదు , ఇకనుండీ రోజూ మీ అన్నయ్యతోపాటు నీకూ తినిపిస్తాను కదా .......
చెల్లెమ్మ : అన్నయ్యతోపాటు , ఆ ముద్ద రుచి ఇంకెంత బాగుంటుందో ....... అని ఊహల్లోకి వెళ్ళిపోయింది .
అమ్మ : దానికే అంత మురిసిపోతే ఎలా ....... , మరికొన్నిరోజులకు మీ ఐదుగురు అక్కయ్యలూ - బుజ్జితల్లుల గోరు ముద్దలు కూడా .........
సంతోషం పట్టలేక పెదాలపై తియ్యదనంతో చెల్లెమ్మ ........ అమ్మఒడిలోకి వాలిపోయింది .
అమ్మ నవ్వుకుని ప్రేమతో తినిపించి ఆనందించింది .

తల్లీ ........ మీ అన్నయ్యను చూడాలని ఉందా ...... ?  , అయితే పద మ...... రి .... అనేంతలో పాపను ఎత్తుకుని బయటకువెళ్లి కారులో కూర్చుంది . అమ్మ తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకుని , బాబుని కృష్ణ ఎత్తుకోబోతే ఆపి గుండెలపై ఎత్తుకునివచ్చి చెల్లెమ్మ ప్రక్కనే కూర్చుంది - అందరికీ వాడంటేనే కన్నయ్య అంటేనే ఇష్టం ...... అని గుసగుసలాడుతోంది .
చెల్లెమ్మ : నవ్వుకుని , sorry అమ్మా sorry అమ్మా ....... , ఉదయం అక్కయ్యల ఆప్యాయత - ఇప్పుడు అమ్మ ప్రేమను రుచి చూసాను , అన్నయ్య ప్రేమ ........ అని కోపం చల్లారేంతవరకూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
అమ్మ : ఒక్కసారిగా నవ్వుకుని , ఒక చెల్లెమ్మ తన ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్యను చూడనేలేదు కానీ తన భర్త మాత్రం ప్రాణస్నేహితుడు అయిపోయాడు  . ఈ మధురమైన విడ్డూరం ఎక్కడా చూడనిదీ విననిది .........
చెల్లెమ్మ : తియ్యనైన కోపంతో కృష్ణగాడి భుజం పై గిల్లేసింది . ( స్స్స్ ....... ) , నవ్వుకుని తొందరగా మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లు ........
కృష్ణ : రుద్దుకుంటూనే అలాగే మేడం గారూ అని ఇంటికి పోనిచ్చాడు .
అమ్మ : నవ్వుకుని , చెల్లెమ్మ కురులపై - బాబు బుగ్గలపై ముద్దులుపెట్టింది .
************
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:45 AM



Users browsing this thread: 52 Guest(s)