Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్లి అక్కడ కార్ ఆపాను, అక్కడే ఇద్దరు వున్నారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా దగ్గర వున్న మొబైల్స్ లాక్కున్నారు, ఎస్పీ గారు దగ్గర గన్ తీసుకున్నారు, మమ్మలని ఒక కార్ లో ఎక్కుంచుకొని ఒక 20km దూరం లో సిటీ చివర్లో అడవి లాగా వుంది అక్కడ ఒక షేడ్ లాంటిది వుంది, దాని లోపలకి తీసుకొని వెళ్ళారు, లోపలకి వెళ్ళగానే అక్కడే పక్కన కావ్య స్పృహ లేకుండా పడి వుంది, పక్కనే కావ్య టీమ్ కూడా స్పృహ లో లేరు, అక్కడికి ఒక నలుగురు వచ్చి నన్ను ఎస్పీ గారిని ముగ్గురు పట్టుకొని ఇంకొకడు హోం మినిస్టర్ నీ లోపల ఒక చిన్న రూం వుంది దానిలోకి తీసుకొని వెళ్ళారు, అక్కడ వున్నారు ఇందాక ఫోన్ లో మాట్లాడిన వాడు, వాళ్ల మాటలు చాలా క్లియర్ గా వినపడుతున్నాయి, నేను వీళ్ళని కొట్టి లోపలకి వెళ్దాం అని అనుకున్న కానీ అసలు వాడు ఏమీ మాటలు మాట్లాడతాడో అని చూస్తున్న ఇంతలో  హోం మినిస్టర్ లోపలకి వెళ్ళగానే నీ కొడుకు ఎక్కడ అని వాడు గట్టిగా అడిగాడు, నువు ఎవరో నాకు తెలీదా మా వల్ల మీద ఎందుకు పగ పట్టవో కూడా తెలీదు, నికు డబ్బు కావాలి, చెప్పు నికు ఎంత కావాలో నేను ఇస్తాను నా కొడుకు కి నాకు ఇవ్వు అని దినం గా అడుగుతున్నారు, దానికి వాడు కోపం గా నేను నికొడుకు ఎక్కడ అని అడిగితే నువు నన్ను అడుగుతున్నావు ఎంత డబ్బు ఇస్తావు, జనల డబ్బే కదా ఎంతెంటి ఎంత అయిన ఇస్తారు, నాకు కూడా డబ్బే కావాలి నీ కొడుకుతో ఒకసారి మాట్లాడి డబ్బు తీసుకొని వదిలి పెడతాను అని వాడు అన్నాడు, నాకు జనం డబ్బులు ఇచ్చి మా వాడిని కాపాడాల్సిన పని లేదు మాకు వంశ పాంపర్యంగా మాకు చాలా అస్తి వుంది నా కొడుకు ఎక్కడ వున్నాడు చెప్పు అని ఆయన అరుస్తున్నారు, ఆయన అరిచినందుకు వాడికి కోపం వచ్చి హోం మినిస్టర్ గారిని చెంప మీద గట్టిగా కొట్టాడు ఆయన అమ్మ అని అరుస్తూ కింద పడిపోయాడు, అది విన్న నాకు నా చేతులు పట్టుకున్న ఇద్దరినీ గట్టిగా చేతులు ఇదిర్చను ఇద్దరు ఒక్కసారిగా నా ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన ఇద్దర్నీ నా కాలుతో పొట్టలో తన్న గానే ఇద్దరు పడిపోయారు వెంటనే ఎస్పీ గారిని పట్టుకున్న అతను నన్ను కొట్టడానికి వచ్చాడు వాడిని చేత్తో కొట్టి వెనకాల కాలితో గుద్దగనే వెళ్లి గోడకు కార్చుకున్నాడు, ఇంతలో వాల్ల ఇద్దరు,లోపల వున్న వాడు కూడా మళ్ళీ వచ్చారు,  వాళ్ళని మళ్ళీ కొట్టాను ముగ్గురు పడిపోయారు ఇంకా లేచెల లేరు, వీళ్ళ సౌండ్స్ విని లోపల నుండి గన్ తీసుకొని వాడు వచ్చాడు హోం మినిస్టర్ వాడిని అపుతు మా వాళ్ళని ఏమీ చేయొద్దు అని మమ్మలని పిలిచి పరిపోండి అని మమ్మలని హెచ్చరిస్తున్నారు నేను అవి ఏమీ పట్టుచ్చు కోకుండా వాడి మీదకి వెళ్ళటానికి చూస్తున్న కానీ మధ్యలో హోం మినిస్టర్ గారు వున్నారు వాడికి అడ్డుపడుతూ, ఇంత లో వాడు హోం మినిస్టర్ గారిని ఒక్కతోపు తోచాడు, నేను ఒక్కసారిగా దుకి హోం మినిస్టర్ గారిని పడిపోకుండా పట్టుకున్నాను, ఆయనకి ఏమీ కాలేదని చూసి అరే నిన్ను అని వెనక్కి తిరిగాను వాడిని అలానే చూస్తూ నిలబడ్డా, వాడి చేతిలో నుండి గన్ కింద పడి పోయింది, ఇప్పటిదాకా కోపం తో సింహం లాగా మీద పడినివాడు ఒక్కసారి గా వొంట్లో శక్తి లెనివడిల అయిపోయాడు, నెమ్మదిగా కళ్ళ నుండి నీరు కార్చుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక్కసారి గా కుల బడిపోయాడు, అన్నయ్య అని నా కాళ్ళు పట్టుకొని ఎప్పటి నుండి అపుకున్నాడో కన్నీళ్లు వరదలా పారుతూ, చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, అరే విక్కి నువు ఏంట్రా ఇలా, అసలు ఎం జరుగుతుంది రా ఇక్కడ, తమ్ముడు చెల్లి ఏరి, మీరేనా వాళ్ళని చంపింది అని వాడిని పైకి లేపి నాకున్న కోపం తో వాడిని నాలుగు దెబ్బలు కొట్టి ఒక్కసారిగా వాటేసుకున్నాను, 


ఎస్పీ గారు హోం మినిస్టర్ గారు ఆశ్చర్యం తో చూస్తున్నారు, మధు నికు వీళ్ళు తెలుసా వీళ్ళని నమ్మ వద్దు నా కొడుకుని కాపాడు అని హోం మినిస్టర్ గారు అన్నారు, సార్ వీడి గురుంచి నాకు బాగా తెలుసు వాళ్ళని చంపారు అంటే వీడి సైడ్ న్యాయం కచ్చితంగా వుంటుంది, వీడి గురుంచి నాకు బాగా తెలుసు, నేను కనుక్కొని చెప్తాను సార్, విక్కి అసలు ఏడుపు అపట్లెద్గు ఏదో బలమైన బాధ కలిగితే తప్ప వీడు అసలు ఇలా వుండడు,

నేను కాలేజ్ చదివే రోజుల్లో,
మా తాతయ్య బాగా పలుకు బడి వున్న వ్యక్తి నేను అంటే చుట్టూ పక్కల గ్రామాలలో అందరికీ తెలుసు, కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలు నా వెంట పడుతున్న నేను వెంటపడే ది ఒకే అమ్మాయి నా ప్రియమైన శత్రువు, మరదలు వర్షా తో, కాలేజ్ లో ఎప్పుడు దానిని ఏడిపిస్తూ వుంటాను, మా ఇద్దరికీ అస్సలు పడదు నాకు అదంటే ఇష్టం అయిన దానికి మాత్రం కోపం నేను అంటే. ఆ రోజు దానికి ఒకడు ప్రపోజ్ చేసాడు నేను గమనిస్తూనే వున్నాను, అది వాడిని కొట్టిద్దేమో అనుకున్నాను,వాడితో నవ్వుతూ మాట్లాడుతుంది నాకు లోపల తగలబడెలా వుంది, చూస్తున్న కొద్దీ నాకు కోపం ఎక్కువ అయ్యింది నేను తట్టుకోలేక వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఎంటే ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది కాలేజ్ ల్.ఎవరితోనూ మాట్లాడవద్దు అన్ననా,బయం లేకుండా నా ముందే నవ్వుతూ మాట్లాడతా వా అన్నాను, నా ఇష్టం రా నువు చెప్పేది ఎంటి ఎవరితో అయినా మాట్లాడతా ఎం చేస్తావు రా అని మీద మీద కి వస్తుంది, ఎం చేస్తానా అని వర్ష పెదాలు నా పెదాలతో మూసేశాను, అంతే చుస్తున్నవారు ఎక్కడి కక్కడే ఆగిపోయారు, అందరూ నోళ్ళు తెరిచారు, దానికి నేను పెట్టిన ఫస్ట్ ముద్దు కాకపోయినా ఇంత మందిలో పెట్టే సరికి వర్ష కూడా షాక్ లో వుండి, నాకు లాగి పెట్టు ఒకటి ఇచ్చి అక్కడి నుండి పారిపోయింది, నేను కోపం లో దానికి ప్రపోజ్ చేసిన వాడిని కాలేజ్ మొత్తం పరిగెట్టిచ్చి కొట్టాను, అప్పుడప్పుడు మందు తాగటం నా అలవాటు, చిరాకు లో ఫ్రెండ్స్ తో కూర్చొని కొంచం ఎక్కువ తాగాను, ఇంకా అందరికీ బై చెప్పి బయలుదేరాను, దారి మధ్యలో ఎక్కడో పడిపోయాను, తెల్లవారుజామున మెళుకువ వచ్చి లేగిస్తే ఎక్కడో ఒక తెలియని ఇంట్లో వున్నాను ఎదురుగా నవుతు అందమైన మొహం తో చందమామ లా గా వుంది, ఆ మొహాన్ని చూస్తే ఎన్ని బాధలు వున్నా ఇట్టే మర్చిపోతాం అంత అందం గా వుంది, తనని చూస్తే నా చెల్లి స్వాతి గుర్తుకు వచ్చింది, నేను లేవటం చూసి అన్నయ్య లెచరా, కాఫీ టీ మిల్క్ ఎం తాగుతారు అని అడిగింది, నేను ఎక్కడ వున్నాను అని అడిగాను, మీకు రాత్రి బాగా ఎక్కువ అయింది మా ఇంటికి కొంచం దూరం లో పడిపోయి వున్నారు మేము బొంచేసి కొంచం సేపు వాకింగ్ చేద్దాం అని నడుచుకుంటూ అటు వైపు వెళ్తుండగా మిమ్మలని చూసాము, అప్పటికే మీరు బాగా నిద్ర లో వున్నారు చేతికి దెబ్బలు తగిలాయి ఫస్ట్ అయిడ్ చేశాను, నొప్పి ఏమైనా వుందా అని అడిగింది, థాంక్స్ అమ్మ నీ పేరు అడిగాను, అంత లో తను విక్కి, చక్రి అని పిలిచింది, వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా నన్ను చూసి బాగున్నారా అన్నయ్య దెబ్బ నొప్పి ఎం లేదు కదా అని అడిగారు. ఇంత లో తను నా పేరు ప్రియ అన్నయ్య, వీళ్ళు ఇద్దరు మా అన్నలు, రోజు కంచాలు కంచాలు తిని, చదువు కోకుండ, పని పాట లేకుండా ఇద్దరు గౌడు గేదల లాగా వురున పడి తిరుగుతారు, తను ఆ మాట అనగానే ఇద్దరు నిన్ను అని ప్రియా వెంట పడ్డారు, ప్రియ వాళ్ళకి దొరకకుండా పరిగెడుతుంది, అంతలో ప్రియ కాలు జారీ పడిపోయింది, ప్రియ దొరక కూడదు అని చిన్న గా పరెగుడుతున్న వీళ్ళు ప్రియ పడిపోగనే వేగంగా ప్రియ దగ్గరికి వెళ్లి, కంగారు గా ఇద్దరు తల్లి ఏమీ అయినా అయ్యిందా అని ఇద్దరు చెరో పక్క కూర్చొని పడ్డ చోట రుద్దుతూ కూర్చున్నారు, వల్ల ముగ్గురిని చూస్తే చాలా ఆనందంగా వుంది, నాకేం కాలేదు లేరా పదండి అన్నయ్య కి టిఫిన్ చేద్దాం పదండి అని నా దగ్గరకి వచ్చారు. అన్నయ్య ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, బజ్జీ, అన్ని హోటల్ మెను నికు ఏమో ఇష్టం చెప్పు చిటికెలో చేసేస్తాను అని గబ గబా చెప్పింది, తను చెప్తుంటే తను చెప్పే స్పీడ్ కి నేను నోరు తెరచి మరీ చూస్తున్న, విక్కి చెక్రి నా వైపు చూసి నవ్వుతున్నారు, చెప్పు అన్నయ్య త్వరగా అని అవేశపడుతు నా పక్కన కూర్చుంది, నికు ఎది   తినాలని వుంటే అది చేయి అని నేను అన్నాను, సరే మీకు ఎం తినాలని వుంది చెప్పండి రా అని విక్కి నీ చక్రి నీ అడిగింది, నాకి దోశ అని విక్కి, పూరి అని చక్రి అన్నారు, సరే 50 గుంజిళ్ళు ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళకి నచ్చింది చేస్తాను, వాళ్ళు అవేశం గా తీస్తున్నారు ప్రియ నా చెవిలో అన్నయ్య నాకు బజ్జీ తినాలని వుంది అదే చేస్తాను మరీ నికు ఓకె కథ అనగానే నాకు ఓకె అని నేను ప్రియ వంక చూసి మరీ వాళ్ళని ఎందుకు ఇలా అని అన్నాను, ప్రియ లైట్ లే అన్నయ్య మనకి వంట లో అంత సీన్ లేదు ఇప్పుడు కష్టపడ్డారు అంటే అవి సేల్ చేస్తారు అని నా వైపు చూసి నవ్వింది నేను కూడా నవ్వాను, ఇద్దరు పోటీ మరీ తీస్తున్నారు 40కి వచ్చాక ఇద్దరు స్లో అయ్యారు నేను అనుమానంగా చూసాను, ప్రియ మళ్లీ చెవిలో వాడి గెలవాలని వీడు, వీడు గెలవాలని వాడు అందుకే అలా తీస్తున్నారు అని చెప్పింది, సరే అన్నయ్య మీరు ఫ్రెష్ అవ్వండి నేను బజ్జీ వేస్తాను ఓకె నా అని ప్రియ అరే మీరు అయ్యాక ఎవరు గెలిచారు చెప్పండి అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది, 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 31-05-2021, 12:41 PM



Users browsing this thread: 3 Guest(s)