Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
మనం ముందు వీళ్ళను కలపాలి ఆ తర్వాత మధు ఇక్కడే వుంటాడు, ఏదో ఒకటి చేద్దాం అమ్మ, నేను ప్లాన్ చేస్తున్న అవసరం వుంటే కాల్ చేస్తాను అని ఉష అంది, సరే అమ్మగారు అని ఇంకా వెళ్తా అంది, హా వేళ్ళు ఏదో పరిచయం చెప్పమంటే నీ బాగోతం చెప్పావు నాకు ఏదోలా వుంది అనగానే మంగ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

స్వీటీ ఇంకా లేవలేదు అమ్మమ్మ స్వీటీ కి టిఫిన్ చేసి రెఢీ గా వుంది లేవగానే పెట్టటానికి, ఉష కూడా రెఢీ అయి స్వీటీ కోసం ఎదురుచూస్తుంది, లేపటం ఇష్టం లేక అలా కొంచంసేపు చూసి లేట్ అవుతుంది మళ్ళీ ఆకలి వేస్తుంది అని అమ్మమ్మ స్వీటీ నీ లేపి రెఢీ అవ్వటానికి వాష్ రూం కి పంపింది, ఎప్పుడు లేనిది ఉష నాన్న కూడ స్వీటీ తో టిఫిన్ చేద్దాం అని ఎదురుచూస్తున్నారు, స్వీటీ రాగానే అమ్మమ్మ టిఫిన్ వడ్డించింది ఇడ్లీ చూడగానే స్వీటీ మొహం మాడి పోయింది, ఎందుకన్న మంచిది అని దోశ కూడా వేసింది, అది కూడా వద్గు అంది, ఏమీ కావాలి అని అడిగితే బజ్జీ అంది, ఇప్పుడు వెయ్యటం కుదరదు రా రేపు వేస్తాను అని అమ్మమ్మ చెప్పింది, సరే అమ్మమ్మ ఒక దోశ తింటాను అంది, సరే రా ఒక దోశ బూస్ట్ తాగు అని ఉష అంది, ఉష నాన్న స్వీటీ నికు దోశ ఇష్టం లేదు అన్నవుగా ఎలా తింటావు, నువు అన్నాక నాకు కూడా బజ్జీ తినాలని వుంది మన ఇద్దరమూ సిటీ కి వెళ్లి టిఫిన్ చేసి వద్దాము అంటే, పర్వాలేదులే తాతయ్య నేను తింటాను అమ్మమ్మ రేపు వేస్తాను అంది గా రేపు తిందాము లే తాతయ్య అనగానే ఆయన నువు ఇంకేం మాట్లాడకు పద వెళ్లి పోధం అని అలాగే కార్ లో హుషారుగా సిటీ కి బయలుదేరారు, ఇక్కడ ఉష అమ్మ థాంక్స్ రా స్వీటీ నీ తీసుకువచ్చినందుకు రోజు ఇల్లంతా బోసి గా ఉండేది, ఇప్పుడు చూడు మీ నాన్న కూడా చిన్న పిల్లాడిలా ఎలా మనవరాలితో గడుపుతున్నాడు చూడు అని ఇద్దరు మురిసిపోయి మరీ నవ్వుకున్నారు, సిటీ కి వెళ్ళిన తాత మనవరాలు టిఫిన్ చేసి స్వీటీ వద్దన్న తాతయ్య స్వీటీ కి బట్టలు , బొమ్మలు, తినటానికి స్వీటీ కి నచ్చినవి, ఫుల్ గా షాపింగ్ చేసి మధ్యానం అయ్యేసరికి బిర్యానీ కూడా లగిచ్చి ఇద్దరు ఇంటికి బయలుదేరారు, కబుర్లు చెప్పుకుంటూ ఇంటి కి చేరారు, వీళ్లకోసం ఎదురుచూస్తున్న అమ్మ కూతుర్లు స్వీటీ రాగానే హత్తుకొని ముద్దులు పెట్టి రా బొజనం చేద్దాం అంటే, స్వీటీ తాత మొహం చూసి నవ్వుతూ మేము బిర్యానీ తిన్నాము అమ్మమ్మ అంటుంది, మీకు కూడా తెచ్చాం అని పాకెట్స్ ఇస్తుంది వాళ్ళు కూడా తినేసి, ఉష స్వీటీ ఒక రూం లోకి వెళ్ళారు, ఉష స్వీటీ తో నువు ఆ రెండు ఇల్లులు కూడా కవర్ చెయ్యాలి, లోపలకి వెళ్ళిపో చిన్న పిల్ల వి కదా నిన్ను ఎవరు ఆపరు, నాకు తెలిసి మీ అమ్మమ్మ మా అమ్మ లాగా కచ్చితంగా గుర్తు పడుతుంది, అడిగితే చెప్పు నేను వర్ష మధు కూతురుని అని, నేను మంగ కి చెప్తాను, మంగ ఎవరు అని స్వీటీ అడిగితే ఆ ఇంట్లో పనిమనిషి అని చెబుతుంది ఉష, ఉష మంగ కి కాల్ చేస్తే మంగ ఉష దగ్గరకి వచ్చింది, చూడు మంగ స్వీటీ మధు కూతురు వల్ల ఇంటికి తీసుకెళ్లి నువు చెప్పకు వాళ్ళు గుర్తు పడితే అప్పుడు చెప్పు అంటుంది, మంగ మధు కూతురు అనగానే అబ్బా ఎంత ముద్దుగా వుంది వర్ష అమ్మ గారిలా అని దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకొని, వాళ్ళు ఊరకనే గుర్తు పడతారు అమ్మగారు అని పద స్వీటీ వెళ్దాం అని మధు ఇంటికి తీసుకొని వెళ్తుంది, 

మంగ స్వీటీ తో నేను ముందు వెళ్తాను నువు నా వెనక రా అంటుంది, మంగ ముందు మధు ఇంట్లోకి వెళ్ళిపోయింది, అక్కడ మధు నాన్న గారు పెద్ద వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు, స్వీటీ మధు ఇంట్లో కి వెళ్ళగానే పక్కనే పెరట్లో కొన్ని రకాల పక్షులు చిన్న చిన్న గుడిసెలో వున్నాయి వాటి అరుపులకి స్వీటీ ఒక్కసారి గా పరిగెత్తు కుంటు అటు వెళ్లి పక్షులు వున్న చోటికి వెళ్లి అందం గ మురిసిపోతూ కేరింతలు తో ఆడుకుంటుంది, మధు నాన్న గారి కీ ఇష్టం వుండదు ఎవరైనా అక్కడికి వెళ్తే, వెంటనే మంగ నీ పిలిచి ఎవరో పాప అటువైపు వెళ్ళింది బయటకి పంపించు అని గట్టిగా చెప్పాడు, మధు నాన్నగారికి కోపం ఎక్కువ అందరూ భయపడతారు, మంగ అలాగే అయ్యగారు అని స్వీటీ దగ్గరికి వెళ్ళి, అందంగా నవ్వుతూ పక్షులతో ఆడుతున్న స్వీటీ నీ చూసి మంగ స్వీటీ తల మీద చెయ్యి వేసి బాగున్నాయా ఇవి మీ నాన్న తన ముద్దుల చెల్లెలు కోసం ఎక్కడెక్కడ నుండో తెప్పించాడు అంట, మీ అత్త కి ఇష్టమైన ప్లేస్ ఇది నచ్చిందా అంటుంది, చాలా బాగుంది అని స్వీటీ అంటుంది, సరే కానీ మీ తాతయ్య కి ఇటు వైపు బయట వాళ్ళు రావటం ఇష్టం వుండదు నిన్ను బయటకి పంపించమని నన్ను పంపారు నేను నువు వెలాట్లేదు అని చెప్తాను మీ తాతయ్య వస్తారు ఇంకా మీరు ఇద్దరు చూసుకోండి అని అంటే అలాగే ఆంటీ అని స్వీటీ అంటుంది, మంగ స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని మధు నాన్నగారు దగ్గరకి వెళ్లి, అయ్యగారు ఆ పాప వెళ్ళాను అంటే వెళ్ళాను అంటుంది, పాయిగా నువు ఎవ్వరూ చెప్పటానికి అంటుంది, మధు నాన్నగారికి కోపం వచ్చి ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి అంత మాట అంటుందా, పక్కన వున్న ఊరు పెద్దవాళ్ళు మధు నాన్నగారి కోపం చూసి అయ్య చిన్న పాప ఎదో పక్షుల్ని చూసి ఆనంద పడి వుంటుంది అన్నారు, మధు నాన్న గారికి కోపం వచ్చి చిన్న పాప లేదు ఏమి లేదు మీరు వుండండి ఆ పాపని పంపించి వస్తాను అని లోపలకి వెళ్తారు, లోపలకి వెళ్ళగానే పాప పక్షులతో ఆడుకుంటుంది ఆయన గట్టిగా వోయి పాప ఎవరు నువు ఆడుకుంది చాలు ఇంక బయటకి వెళ్ళు అని గట్టిగా అనగానే స్వీటీ ఉలిక్కి పడి ఆయన వైపు చూస్తుంది, స్వీటీ నీ చూడగానే అప్పటి వరకు గంభీరంగా వున్న ఆయన ఒక్కసారిగ నీరు కారిపోయాడు, స్వీటీ దగ్గరకి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని మొహాన్ని చేతులతో తడుతూ ఎవరమ్మ నువు అంటాడు, వెంటనే స్వీటీ నేను ఎవరైతే మీకు ఎందుకు చిన్న పిల్లల దగ్గర ఇల అరుస్తరా ఎవరైనా, చూడండి ఇంకా వోనుకు తగ్గలేదు, సారీ అమ్మా నువు బయపడతావు అనుకోలేదు అని ఆయన అంటే, సారి చెప్పారుగా తాతయ్య, పక్షులకు ఆకలి వేస్తుంది నీళ్ళు కూడా లేవు అని స్వీటీ అంటే, తాతయ్య అన్నందుకు మురిసిపోయి వెంటనే గట్టి గా మంగ అని పిలిచి, అదిగో తాతయ్య మళ్ళీ గట్టిగా అరుస్తున్నారు అని స్వీటీ అంటుంది, ఆయన నోరు మూసుకొని సారీ అమ్మా అని అంటారు, స్వీటీ నవ్వుతూ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య తొడ మీద కూర్చొని, తాతయ్య మిమ్మలని ఎక్కడో చూసాను అని ఆలోచించి హా తాతయ్య మా ఇంట్లో ఫోటో ఒకటి వుంది ఫోటో లో మా తాతయ్య అంట అచ్చు  మీకు లాగా వుంటారు మా తాతయ్య కూడా, అవునా ఎక్కడ వున్నారు మీ తాతయ్య ఏమో తెలీదు తాతయ్య అనగానే, తాతయ్య అన్నావు మరి మీ తాతయ్య ఎక్కడున్నా డో మీ నాన్న చెప్పలేదా, హా చెప్పారు మా తాతయ్య ఏదో తప్పు చేశారట అందుకొని మా నాన్న మా తాతయ్యని ఇంట్లోనుండి బయటకి పంపించరంట అని మూడి గా చెప్తుంది, ఆయన ఓహ్ మీ తాత తప్పు చేస్తే ఇంట్లో నుండి పంపించడా మీ నాన్న, బాగా చెప్పాడు మీ నాన్న, ఇంతలో మంగ ఏమీ అయ్యిందో అని కంగారు గా లోపలకి వెళ్తే పాప నీ దగ్గరకి తీసుకున్న అయన్ని చూసి సంతోషిస్తూ ఎంటి అయ్యగారు పిలిచారు అంది మంగ, మంగ వాటికి నీళ్ళు గింజలు తీసుకోని రా అని చెప్పి , అవును నీ పేరు ఎంటి అమ్మ అంటే స్వీటీ అంటుంది, సరే పద స్వీటీ బయటకి వెళ్దాం మళ్ళీ వచ్చి అడుకుందువు కానీ, అని ఎత్తుకొని బయటకి  తీసుకు వెళ్తారు, అక్కడున్న ఊరు పెద్దవాళ్ళు లోపల ఏమీ జరుగుతుందో అని అత్రం గా ఎదురుచూస్తున్న వారికి ఎత్తుకొని వస్తున్న పాపని చూసి ఆశ్చర్యపోయారు, పాప నీ తీసుకొని వచ్చి కుర్చీలో తన పక్కనే కూర్చోపెట్టి, అక్కడున్న పెద్ద వాళ్ళతో సరే దీనిగురించి రేపు మాట్లాడుకుందాం అంటారు, పెద్దవాళ్ళు నసుగుతూ వుంటారు, ఇంతలో స్వీటీ తాతయ్య నేను అడుకుంటాను మీరు మాట్లాడండి అంటూ వెళ్లిపోతుంటే, పాప తెలివి తేటలు వినయం చూసి సరిగ్గా పాప నీ గమనించన పెద్ద వాళ్ళకి పాప ఎవరో ఇట్టే అర్థమవుతుంది, పాప నువు తాతయ్య తో అడుకో అమ్మ మేము రేపు మాట్లాడుకుంటాం లే అని వెళ్లి పోతారు, తాతయ్య మురిసిపోతూ స్వీటీ తో మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తూ వుంటాడు

ఇంతలో గింజలు నీళ్ళు పెట్టిన మంగ లోపలకి వెళ్తుంది, లోపల కూతురు స్వాతి తో ఫోన్ లో మాట్లాడుతూ వున్నా మధు అమ్మ గారు మంగ నీ పిలిచి మంగ వల్ల కి ఏమీ అయిన కావాలో చూడవే అంటుంది, వాళ్ళు ఎక్కడ వున్నారు అమ్మగారు వెళ్ళిపోయారు అంటే అదేంటే అప్పుడే వెళ్ళిపోయారు మీ అయ్యగారు ఎం చేస్తున్నారు అంటే అయ్యగారు అక్కడ పాప తో బిజీగా వున్నారు, ఎవరు పాప అని ఆశ్చర్యంగా అడుగుతుంది, ఏమో అమ్మగారు పక్షుల శబ్దం కి ఒక పాప లోపలకి పరిగెత్తు కుంటు వాస్తే నన్నే మో ఇంట్లో నుండి బయటకి పంపమని నా మీద అరిచారు, నేను పాప దగ్గరికి వెళ్ళి బయటికి పో అంటే నువు ఎవరు నాకు చెప్పటానికి అంది, నేను అయ్యగారికి చెప్తే ఆయన కోపంతో వుగిపోయి లోపలకి వెళ్లి పాప నీ చంక లో వేసుకొని బయటకి వచ్చి పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు, పాయిగ వాళ్ళని పంపించేసి మరీను అని మంగ చెప్తుంటే మధు అమ్మగారు ఫోన్ లో స్వాతి ఇద్దరు ఆశ్చర్యం గా వింటున్నారు, ఇంకా మధు అమ్మగారు నువు వుండవయ్ స్వాతి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆ పాప ఎవరో చూద్దాం, అని బయటకి వెళ్లి పక్కనే ఇంకో కుర్చీలో కూర్చొని ఆశ్చర్యంగా స్వీటీ వైపు చూస్తుంది, చెమ్మ గిల్లిన కాళ్ళతో వల్ల ఆయన వైపు చూస్తే, మధు నాన్న ఈ పాప పేరు స్వీటీ, స్వీటీ వల్ల తాత తప్పు చేస్తే ఇంట్లో నుండి బయటకి పంపారంట అనగానే మధు అమ్మగారు నవ్వుతూ పాప నీ దగ్గరకి తీసుకొని ముద్దు లూ పెట్టుకుంటు, మీ అమ్మ నాన్న ఎక్కడమ్మా అని అడుగుతారు, మా వూళ్ళో వున్నారు అని సమాధానం చెప్తుంది స్వీటీ, నువు ఎలా వచ్చావు అని అడిగితే ఉష పిన్నితో అని చెప్తుంది, ఇద్దరు విని విన్నట్టుగా సరే పద తల్లి ఏమన్నా తిందువు కానీ అని లోపలకి తీసుకెళ్తుంది, మధు నాన్నగారు పొలం లో పని చేసే వాళ్ళకి ఫోన్ చేసి కాయలు ఏమీ వుంటే అవి ఫ్రెష్ వి పంపియ్యమని చెప్తారు, 


మధు అమ్మగారు ఏడుస్తూనే స్వీటీ నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి వొళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులు పెడుతూ కళ్ళ ముందు పెరగ వలసిన పిళ్ళవి ఇన్నాళ్లు పట్టింది తల్లి నిన్ను చూడటానికి, బంగారు బొమ్మలా వున్నావు, ఎంత దిష్టి తగిలింది ఏమో వుండు తల్లి అని శుభ్రం గా దిష్టి తీసి వొళ్ళో కూర్చో పెట్టుకొని ఏడుస్తుంది, స్వీటీ కళ్ళు తుడుస్తూ ఎందుకు నానమ్మ అలా ఏడుస్తున్నావు, బంగారు తల్లి నికు నేను తెలుసా నానమ్మ ను అవుతాను అనీ, తెలుసు నానమ్మ నాన్న అమ్మ చూపిస్తారు మీ ఫొటోస్ అని ముద్దు ముద్దు గా చెప్తుంది. నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని మీ అత్త తెలుసా నికు హా తెలుసు ఫోటో చూసాను, నాన్నకు బాగా ఇష్టం అత్త అంటే అనగానే మాట్లాడతా వా తల్లి అత్తతో హా మాట్లాడతాను అంటుంది, మధు అమ్మగారు స్వాతి కి వీడియో కాల్ చేస్తుంది, స్వాతి ఫోన్ ఎత్తగానే మధు అమ్మగారు సంతోషం తో స్వాతి నికు ఒకల్ని చూపిస్తా ఎవరో చెప్పుకో అని స్వీటీ నీ చూపిస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 15-05-2021, 08:16 PM



Users browsing this thread: 4 Guest(s)