14-03-2021, 10:42 AM
(This post was last modified: 14-03-2021, 10:51 AM by LLuciferMorningstar. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-03-2021, 02:29 AM)mikevan Wrote: Hello Lucifer gaaru....chaala kaalaniki mee darshanam kalpincharu ........
Avunu andi meeru paina cheppinadhi 100% correct. Alage naaku inkokati kuda anipisthundhi..............okappati andham......mukham lo kala anedhi ee tharam vallaki raavatledhu ani...........Jhaanvi kaani Ananya kaani aakariki Kiara kuda em andhagathelu kadhu kaani unna vallalo edho vellu bagunnaru ani kontha mandhi like Alia, Shraddha ani chusesthunnam.........Background lekunda sonthamga vachinavallalo kuda(almost anni industries lo) appatiki polisthe chala thaggipoyindhi andham anedhi ...........Inka meeru paina cheppinattu vache ee star kids kuda overload chesi vasthunnaru.............vachaka kuda ekkada padithe akkada kanipisthune untunnaru...........ala chusi chusi kuda bore kottesthundhi vellani...............Andham anedhi entha dachipedithe chupinchi nappudu antha mazaa vasthundhi anedhi naa abhiprayam.
ధన్యవాదాలు mikevan మిత్రమా. ఏదో బాధ్యతల వల్ల దూరంగా ఉన్నానే తప్ప మరొక కారణం కాదు.
ముందుగా ఇంత పెద్ద పోస్ట్ పెడుతున్నందుకు milf rider గారికి క్షమాపణలు తెలుపుతూ..
ఇక మీరు చెప్పిన దానికి వస్తే మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. చివరది జనరల్ రీసన్ అని నేను చెప్పలేదు అంతే. అంటే stardom అనేది నేటి కాలంలో డైల్యూట్ అయిపోయింది. ఇది ఈ తరానికి ఉన్న ఒక disadvantage. ఒకప్పుడు మన అభిమాన హీరోని చూడటానికి బండ్లు కట్టుకొని వెళ్లాము అని గొప్పగా చెప్పుకునేవారు. అలాగే ఒక్క హీరోయిన్ ఫోటో కోసం జ్యోతి చిత్ర లాంటి మాస పత్రికల వెంట పడి వెతికే వాళ్ళు. ఆ రకంగా తారలు అనేవాళ్ళు నింగిలో ఉండే తారల మాదిరి అనిపించేవాళ్లు. అందుకే వాళ్ళని అందుకోవాలనే ఆశ మనకి ఉండేది , ఆ ప్రయాణంలో ఒక అందం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అల్మోస్ట్ అందరూ అందుబాటులోకి వచ్చేశారు. దానికి తోడు ఒకప్పుడు తారల వ్యక్తిగత విషయాలు సామాన్య ప్రజానీకానికి తెలియడానికి చాలా సమయం పట్టేది. అందువల్ల వాళ్ళ మీద మనకుండే భావం అంత తొందరగా మారేది కాదు. విజయశాంతి లాంటి అందగత్తె పెళ్లి చేసుకుందా లేదా అనే విషయమే దశాబ్ద కాలం పాటు ఎవరికీ క్లారీటి లేదు. అలాగే షకీలా గారు కూడా పెళ్లి చేసుకొని సొంత మొగుడితో సినిమాలు తీస్తుంది అని అపోహలు ఉండేవి. అసలైన నిజం తెలియనప్పుడు ప్రతి ఒక్కరి అబద్ధం నిజాంలాగే ఉంటుంది. ఆ రకంగా ఉండేది కాస్తా ఇప్పుడు ఇలా అనుకున్న వెంటనే తెలిసిపోయే స్థాయికి వచ్చింది. ఇదే విషయం ఒక ఇంటర్వ్యూ లో డైరెక్టర్ తేజ గారు కూడా చెప్తారు.
సరే పైన ఉన్నది సినిమా డిస్కషన్. ఇప్పుడు మన సైట్ డిస్కషన్ దగ్గరికి వద్దాము. మీరు చెప్పిన మొదటి విషయం దగ్గరికి వద్దాము. అదేనండీ అందం దగ్గరికి. ఇది కొంచం controversial అయినా పర్లేదు, కానీ మన పాఠకులకి విషయం తెలిస్తే చాలు. మీరు చెప్పినట్టు నిజంగానే అందం అనేది లేదు నేటి తారలలో. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. అందం అనేది ఆడవారి సొత్తు. వాళ్ళు పుట్టడమే తమలో ఎంతో కొంత అందాన్ని దాచుకొని పుడతారు. వయసుని బట్టి ఆ అందం మెల్లగా రెక్కలు విప్పుతుంది. మరి అలాంటిది ఈ తారాలలో ఆ అందం ఎక్కడికి మాయం ఔతున్నట్టు? ఇది కూడా మన ప్రారబ్ధమే. శ్రీదేవి గారి వారసురాళ్ళ దగ్గరికే వద్దాము. పెద్దమ్మాయి మరియు చిన్నమ్మాయి ఇద్దరికీ వాళ్ళ తండ్రి పోలికలు కొన్ని కలిశాయి. వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు చూస్తే అర్ధం ఔతుంది. ఎత్తు పళ్ళు, మొహం యొక్క రంగు ఇలా చాలా ఉండేవి. కానీ ఎలాగో వీళ్ళని బాలీవుడ్ అనే పెద్ద రంగస్థలం మీదకి పంపాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళకి సర్జరి చేసి వేరే వేరే రకాలుగా మార్చి ప్రపంచం ముందుకి తెచ్చారు. శ్రీదేవి గారు కూడా తన ముక్కుకి సర్జరి చేయించిన మాట వాస్తవమే అయినప్పటికీ మనం అందరం కనీసం ఆమె యవ్వనంలోని అందాలని చూడగలిగాము, అటు పైన వచ్చిన మార్పుని కూడా అంగీకరించగలిగాము. కాబట్టి ఇలా సర్జరి చేయించుకొని నాశనం చేసుకోవడం ఒక రకం.
రెండవ రకం మరీ అన్యాయం అనిపిస్తుంది. సర్జరి అంటే సరే లే తప్పదు అనుకున్నారు కాబట్టి అంత డబ్బులు పెట్టి చేయించుకున్నారు అనిపిస్తుంది. కానీ రెండవ రకం వాళ్ళు చేసేది ఏంటి అంటే వయసుతో నిమిత్తం లేకుండా వర్కౌట్ అని, జీరో సైజ్ అని తమలో వయసుతో వచ్చే మార్పులని అన్నిటినీ కనిపించకుండా చేయాలి అని చూడటం. సారా మరియు సోనాక్షి లాంటి వాళ్ళు నిజంగానే చాలా ఊబకాయంతో ఉండేవాళ్లు, కాబట్టి వాళ్ళ విషయంలో తప్పు పట్టలేము. వాళ్ళు కష్టపడి వొళ్ళు తగ్గించుకున్నారు. అదే ఫిగర్ maintain చేస్తూ వస్తున్నారు. కానీ కీయరా మరియు అనన్య విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో 18 యేళ్ళ వయసులోనే అలా ఉండాలి అని నానా కష్టాలు పడ్డారు. ఈ రకంగా అయితే వీళ్ళ వొంటిలో మార్పులు ఇంక తల్లులు అయ్యాక కనిపిస్తాయి తప్ప ఇప్పట్లో కాదు.
ఇలా అసలైన ప్రకృతి ప్రసాదించిన అందాన్ని కాదనుకునేవారు కొంత మంది. ఈ కారణం చేతనే మనం అటువంటి అందాన్ని చూడాలి అంటే ఒకప్పుడు మీనా గారిని చూడాలి, శ్రీదేవి గారిని చూడాలి. నేటి తరంలో కూడా సినిమాలలో కన్నా సీరియల్ నటులలో ఈ అందాన్ని చూడొచ్చు. ప్రణవి అనే అమ్మాయి ఉంటుంది, అనీ అనే అమ్మాయి ఉంటుంది టివి షో లలో. ఇలా వీళ్ళు అందరూ తమని చిన్న పిల్లలుగా చూసిన అదే ప్రేక్షక జనానికి తమలో వచ్చిన మార్పులని చూపిస్తూనే తమలో ఉండే కళని కూడా చూపించి మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వాళ్ళకి కూడా ఆదరణ ఉంటుంది అనే మాట వాస్తవం. అప్పటి శ్రీదేవి గారు ఐనా, మీనా గారు ఐనా, కలర్స్ స్వాతి ఐనా, నిన్న వచ్చిన ఫారియా అబ్దుల్లా ఐనా ... వీళ్ళందరూ మనం కోరుకునే లాంటి ఆడవాళ్ళు . అందం మరియు అభినయం తో పాటుగా ఒక పరిపూర్ణమైన స్త్రీ అని మన చేత చెప్పించుకోగలిగే వాళ్ళు.
ప్రణవి మనుకొండ. మంచి తెలుగుతనం కనిపిస్తూ ఎంత అందం ఉందో చూడండి.
మరొక వైపు మనం మాట్లాడుకున్నట్టు అందాన్ని నాశనం చేసుకుంటున్న బాపతులో ఒక ఉదాహరణ.
అమ్మాయి పేరు అనిఖా సురేంద్రన్. పైన కనిపిస్తున్న రెండు ఫోటోలలో వయసు తేడా 1 సంవత్సరం. ఇంతా చేసి తన వయసు 20 కూడా కాదు. ఇకా మిగిలింది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
చూద్దాం తరువాతి తరం ఐనా ఈ తరం చేస్తున్న తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటుందేమో.
ఇక్కడ పెట్టిన బొమ్మలు ఏవీ నావి కాదు, ఎవరికైనా సమస్య ఉంటే తీసివేయగలరు.
ధన్యవాదాలు .
- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800