Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#19
మహా కవి కాళిదాసు సినిమా చూసే ఉంటారు అందులో ఉజ్జయినీ కాళీమాత అనుగ్రహంతో కాళీదాసుడు గొప్ప కవి అయినాడు.
తెనాలి రామలింగనికి కూడా కాళీ అనుగ్రహం లభించింది. 
మన సంస్కృతిలో త్రిశక్తులకు మూల దేవతలు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి 
ఈ మహాకాళి ఎవరు ఆ మాత ఎలా అనుగ్రహిస్తుంది. ఈవిడ ఎవరు? ఎవరు ఈ తల్లి?.
గౌరి అనగా ఎవ్వరు? మరి ఈ కాళి ఎవరు?
గౌరవర్ణంలో ఉండే తల్లి గౌరి ఆ అమ్మయే భగవంతుడైన శంకరుని పత్ని, ఆమెనే మనము రోజూ కొలుస్తూ ఉంటాము. 
ఆవిడని సగుణ రూపంలో కాక లింగంలో ఒక భాగంగా కొలుస్తూ ఉంటాము. పానవట్టం లో ఉమామహేశ్వరులు కొలువు తీరి ఉంటారు. అయితే లింగం పరమేశరుడు అయితే పానవట్టం గౌరి. ఈ పుణ్యదంపతులనే మనం అభిషేకిస్తూ ఉంటాం.
సంకల్పంలో గౌరీశంకర దేవతాభ్యోనమోన్నమః అంటూ చెబుతుంటామే.................ఆ పరమేశ్వరుడు 
మరి కాళి ఈవిడ ఎవ్వరు? నల్లని శరీరం కలది.
నల్లని కేశాలు., కపాల మాల, వెయ్యి చేతులు, వెయ్యి తలలు, వెయ్యి నాలుకలు., వెయ్యి కన్నులు., 
ఇక్కడ వెయ్యి కన్నులు అంటే ఇంకో మాట ఉంది. సహస్ర శీర్షా పురుష: సహస్రాక్ష, సహస్రపాధ్  అన్న పురుష సూక్తంలో 
పరమాత్మకు సహస్ర శిరస్సులు ఉంటే ఒకో శిరస్సుకూ ఎన్ని కన్నులు ఉంటాయి అన్న మీమాంస వస్తే 2000 కన్నులుండాలి కదా మరి సహస్రాక్ష అంటూ ఎలా?
పరమాత్మకు జ్ఞాన చక్షువులు సహస్రం.
ఆయన అగ్నిలో అగ్ని, ఆదిత్యులలో ఆదిత్యుడు అలాంటి అగ్నికి కన్నులూ, నాలుకలూ అనేకం.
ఇక ఆ తల్లి మహాకాళి., శరత్ కాలంలో మనల్ని అనుగ్రహించడానికి మూలమంత్రంలో ఉంటుంది.
శరత్ కాలంలో వచ్చే నవరాత్రులని శరన్నవరాత్రులు అనడం ఆనవాయితీ.....
అయితే మూలాల నక్షత్రంలో పంచమి నాడు., పూజించే అమ్మ సరస్వతి యొక్క మూలమంత్రంలో మహా ఉండదు.
కానీ దసరా నాడు పూజించే మంత్రంలో ముగ్గురూ త్రిశక్తి స్వరూపములు ఆ ముగ్గురమ్మలూ మహాకాళీ, మహాలక్ష్మీ మహాసరస్వతి.
వీరి ముగ్గురికీ ఒకే మూల మంత్రం ఉన్నది. అది అందరికీ విధితమే 
నా తల్లి శారదా మాత సదా నన్ను రక్షించును గాక నా వల్ల తప్పు జరగకుండా చూచునుగాక, 
నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు.

ఈ మాసంలో ఎవ్వరినీ నిందించరాదు అంటూ ధర్మం చెబుతోంది. కానీ మనసు ఊరుకోవట్లేదు.
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 21-02-2021, 10:21 PM



Users browsing this thread: 1 Guest(s)