Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
డైనింగ్ టేబుల్ పై బ్రెడ్ - కేక్స్ - pies - చికెన్ రోస్ట్ - బోయిల్డ్ హాఫ్ బోయిల్డ్ ఎగ్స్ - డ్రింక్స్ ఉండటం చూసి sam .......... చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి you are very lucky - థాంక్యూ soooo మచ్ sarah .......... వన్ మినిట్ అని అన్నింటినీ ఫోటో తీసి బుజ్జాయిలకు , మీ పెద్దమ్మ అందరూ లంచ్ చేశారా ? అని సెండ్ చేసాను .
బుజ్జాయిలు : లంచ్ ? , ok ok డాడీ అక్కడ ఇప్పుడు ...........  సాయంత్రం 5 గంటలకు తిన్నారా అని నోరూరించే లండన్ ఐటమ్స్ పంపిస్తారా ? , మా డాడీ తినలేదని పెద్దమ్మ తినలేదు .......... 
మరి మీరు ? .
బుజ్జాయిలు : మాకు ఆకలి వేయడంతో చికెన్ బిరియానీ కుమ్మేసాము మాకు ఇది డిన్నర్ టైం రాత్రి 10 గంటలు అయ్యింది  . మీరు పెళ్లికి ఎలాగో రావడం లేదు కదా మీకోసం మేమెందుకు పస్తులుండాలి అని నానమ్మతోపాటు కడుపునిండా తినేసాము . పాపం మీరు ఆలస్యం చెయ్యడం వలన పెద్దమ్మ తినకుండా ఉన్నారు . 
బుజ్జాయిలూ ........... please please మీ ప్రియమైన పెద్దమ్మకు నేను తింటున్నాను అనిచెప్పి తినిపించండి .
బుజ్జాయిలు : ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ తినిపిస్తాములే డాడీ లవ్ యు , మీ అన్నయ్యలు తూగుతూ ఇప్పుడు వచ్చారు - కొద్దిసేపట్లో గోవా ప్రయాణం - వాళ్ళను చూసి నానమ్మ బాధపడ్డారు , అమ్మలు అయితే రోజూలానే ఇదీ ఒకరోజు అని ..............
బాధతో బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ .......... మీ నానమ్మ - అమ్మలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి , హ్యాపీ జర్నీ ............. 
O ........ K ....... బై అని తియ్యనికోపంతో కట్ చేసేసారు . ఆ వెంటనే వదినమ్మకు నలుగురూ ప్రేమతో ముద్దలుకలిపి తినిపించి , అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్విస్తున్న ఫోటోలను పంపడంతో చూసి సంతోషించి లవ్ యు బుజ్జాయిలు అని బోలెడన్ని ముద్దులుపంపి , sam - sarah తోపాటు కలిసితిన్నాను .

లవర్స్ ను డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్ గా నా గదిలోకి చేరాను . బెడ్ పైకి చేరిపోయి జ్యూవెలరీ - ఫైల్ అందుకున్నాను . ఏంజెల్ ......... 6 నెలల తరువాత ఇండియాకు వెళుతున్నాను - నో నో నో .......... బుంగమూతి పెట్టుకోకు ఏంజెల్ పెళ్లికాగానే వచ్చేస్తాను కదా అని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
నా ఏంజెల్ కు కానుకగా బ్రిటన్ క్వీన్ కోసం డిజైన్ చేయించిన జ్యూవెలరీ తీసుకొచ్చాను అని ఫైల్ లోని ఛార్ట్స్ ఒక్కొక్కటే ప్రాణంలా తిరగేస్తూ చున్నీతో దాచేసుకున్న నా ఏంజెల్ మహి మెడలో మరింత అందం తెచ్చేలా అలంకరించాను.
మహీ .......... ఈ అమాయక ప్రేమికుడిని ఒక్కసారి ఓకేఒక్కసారి కరుణించాలనిపించడం లేదా .......... , నా గుండెల్లో గూడుకట్టుకున్న దేవకన్య సౌందర్యమైన కళ్ళను చూసి తరించాలని ఆశగా ఉంది అని ఫైల్ ను గుండెలపై హత్తుకుని , నా హృదయంలో గూడుకట్టుకున్న నా దేవకన్యతో మాట్లాడుతూ సమయాన్నే మరిచిపోయాను .

టక్ టక్ ......... మహేష్ మహేష్ ......... sam పిలుపులు వినిపించడంతో సమయం చూస్తే 9 గంటలు . 
మై లవ్లీ ఏంజెల్ మహీ .......... ఫ్లైట్ టైం గాట్ టు గో , నిన్ను నాతోపాటు తీసుకెళ్లలేను ఎందుకంటే అక్కడ ఉన్నన్నిరోజులు మన ఇద్దరి దేవతలూ - బుజ్జి దెయ్యాలతో మొత్తం టైం స్పెండ్ చెయ్యాలని ఆశపడుతున్నాను . నువ్వు కూడా ఉంటే నీతోనే నీ మాయలోనే ఉండిపోతాను ఏంజెల్ అని నవ్వుకున్నాను . లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఏంజెల్ రాగానే నా గుండెలపై ఊపిరాడనంతలా చుట్టేస్తాను అని ప్రాణంలా హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను . జ్యూవెలరీతోపాటు ఫైల్ ను నా లాకర్ లో జాగ్రత్తగా ఉంచాను . 15 మినిట్స్ sam  అనిచెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగులో రెండుజతల కొత్తబట్టలు ఉంచుకుని కావాల్సినవి తీసుకుని బయటకువచ్చాను .

అపార్ట్మెంట్ కీస్ sam చేతికి అందించి ఎంజాయ్ అన్నాను . Sarah సిగ్గుపడుతూ sam వెనుక దాచుకుంది . కిందకువచ్చి చూస్తే గిఫ్ట్స్ వెహికల్ కనిపించలేదు . కంగారుపడేంతలో ..........
Sam : మహేష్ .......... డోంట్ వర్రీ , గిఫ్ట్స్ అన్నీ ఆల్రెడీ నీ ఫ్లైట్ లోకి చేరిపోయాయి అనిచెప్పాడు . 
థాంక్స్ sam , ముగ్గురమూ కారులో ఫ్లైట్ సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ప్రయాణంలో జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ నా బ్యాగులో సర్దేసి ఉండటంతో బ్యాగు అందుకుని లోపలికివెళ్లాము . అప్పటికే ఫ్లైట్ అనౌన్సనెంట్ జరుగుతుండటంతో sam - sarah ను కౌగిలించుకుని చెక్ ఇన్ అయ్యాను . 
హ్యాపీ జర్నీ మహేష్ - ఎంజాయ్ ద మ్యారేజ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ కేకలువెయ్యడంతో నవ్వుకుని టన్నెల్ ద్వారా ఫ్లైట్లోకి చేరుకున్నాను . 
ఎయిర్ హోస్టెస్ ......... రేపు ఫ్రెష్ గా ఉండటం కోసం ఎటువంటి ఇబ్బందీ లేకుండా రెస్ట్ తీసుకోవడానికి బుక్ చేసుకున్న లగ్జరీ బిజినెస్ టికెట్ చూసి స్వయంగా నా సీట్లోకి చేర్చారు . థాంక్స్ చెప్పి బ్యాగుని జాగ్రత్తగా పైన ఉంచేసి కూర్చున్నాను . 5 నిమిషాలలో ఫ్లైట్ బయలుదేరింది .

బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........... మరికొద్దిగంటల్లో మీ ముందు ఉంటాను , ఈ ఆరు నెలలూ వీడియో కాల్లో మాట్లాడుతున్నా ఏదో వెలితి - బుజ్జాయిలను ఎత్తుకుని బుజ్జితల్లులను ప్రాణంలా గుండెలపై హత్తుకుంటే కలిగే ఆనందమే వేరు అని తియ్యదనంతో నవ్వుకుని , మొబైల్ లో బుజ్జాయిలు స్నిగ్ధ - రాము నామకరణోత్సవం లో తీసుకున్న గ్రూప్ ఫోటోవైపు చూస్తూ మురిసిపోతున్నాను . 
చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ - నాన్న , వదినమ్మ - ఇద్దరు వదినలు - బుజ్జాయిలకు చెరొకవైపు ప్రాణంలా ముద్దులుపెడుతున్న బుజ్జితల్లులు జాహ్నవి - వైష్ణవి ........... ఆ రోజు అంగరంగవైభవంతో జరిగిన ఫంక్షన్ ను తలుచుకుని పెదాలపై తియ్యదనం ఆగడం లేదు . 

ఫంక్షన్ అని నలుగురు అన్నయ్యలకు నెలరోజుల ముందుగానే మరియు ఆ నెలరోజుల్లో ప్రతీరోజూ అందరమూ పదేపదే గుర్తుచేసినా , నలుగురిలో ఒక్కరు కనీసం బుజ్జాయిల నాన్నకూడా ఫంక్షన్ కు అందుబాటులో లేకపోయారు - రెండు రోజుల ముందు వెళ్లినవారి జడనే లేదు - ఫంక్షన్ తెల్లవారుజామున నుండీ వందల కాల్స్ చేసినా కనీసం లిఫ్ట్ కూడా చెయ్యకుండా ఫంక్షన్ జరిగిన రెండురోజులకు ఒకరి తరువాత మరొకరువచ్చి ఫంక్షన్ ఎలాజరిగింది అని కనీసం ఒక మాటైనా అడగకుండా వాళ్లకు కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్లిపోవడం చూసి అమ్మ మొదలుకుని బుజ్జాయిలవరకూ బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ నుండి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి - నేనేమైనా చెబుదామంటే చిన్నప్పటి నుండీ నలుగురు అన్నయ్యలకు నేనంటే అంతులేని కోపం - కన్నీళ్లను తుడుచుకుని అందరి సంతోషాలను చూస్తూ ముద్దులవర్షం కురిపించాను . 

ముందుగా చెప్పినట్లుగానే నాన్నగారు వైజాగ్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ మాన్ , తరతరాల నుండి వచ్చిన బిజినెస్ లను నాన్న గారు అమ్మ సహాయంతో మరింత ముందుకు తీసుకెళ్లారు - అమెరికాలో కూడా బిజినెస్ expansion చేసి తిరుగులేనిస్థాయికి చేర్చారు . ఈ ఘనత లో అమ్మ గొప్పతనం సగం పైనే అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ మురిసిపోతుంటారు - నాన్న గారి ఆనందంలోనే అమ్మ సంతోషాన్ని ఆస్వాదిస్తూ పరవశించిపోయేవారు .
తరతరాలుగా వచ్చినట్లుగానే నాన్నగారు కూడా తన నుండి మాకు బిజినెస్ లు అప్పగించాలని మా ఐదుగురినీ చిన్నప్పటి నుండీ మా బిజినెస్ ల గురించీ కంపెనీల గురించి చెబుతూ పెంచారు - మాలా డిగ్రీతో ఆగిపోకుండా మీరు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో MBA ఆపై స్టడీస్ పూర్తిచేసి మన స్థాయిని మరింత పెంచేలా చెయ్యాలని ఆశపడ్డారు . 
అన్నయ్యలకయితే తరతరాలుగా కూర్చుని తిరగని ఆస్తి ఉండి కూడా ఇంకా చదువుకోవడం ఏమిటి అని స్కూల్ కే వెళ్ళేవాళ్ళు కాదు . అంతలోనే చెడు సావాసాల వలన మొదట పెద్దన్నయ్య ఆ తరువాత నలుగురూ ఒక్కొక్కరుగా పెద్దన్నయ్యనే ఫాలో అయ్యారు . ప్రతీరోజూ స్కూల్ నుండి కంప్లైంట్స్ - సమాజం నుండి కంప్లైంట్స్ , సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా చాలాసార్లు involve అవ్వాల్సివచ్చింది - అమ్మానాన్నల పలుకుబడి వలన సెక్యూరిటీ ఆఫీసర్లు సెల్యూట్ చేసి వెళ్లిపోయేవారు - అమ్మానాన్నలు బాధపడని రోజంటూ లేదు .

అమ్మానాన్నలను అలాచూడగానే బుజ్జాయిగా ఉన్నప్పుడే నాకూ బాదవేసేది , ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అమ్మానాన్నలు సంతోషం - గర్వపడేలా ప్రవర్తించాలని , స్కూల్ కు చేరిన మొదటిరోజునుండీ బుద్ధిగా చదువుకునేవాన్ని , స్కూల్ - బయట అందరి ప్రశంసలు పొందేవాడిని , తొలిసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మానాన్నలకు అందించినపుడు వాళ్ళు పొందిన సంతోషాన్ని జీవితాంతం మరిచిపోను - నన్ను అమాంతం ఎత్తుకుని వాళ్లపై కూర్చోబెట్టుకుని ముద్దులవర్షం కురిపించి మురిసిపోయారు - నేను అడగకముందే బోలెడన్ని బొమ్మలు కొనిచ్చేవారు - నన్ను చూయించి గర్వపడుతూ అన్నయ్యలకు మంచిగా ఉండాలని బాగా చదువుకోవాలని పదే పదే చెప్పి , అన్నయ్యలు వినకపోగా నాపై రోజురోజుకూ కోపాన్ని పెంచుకున్నారు మరింత చెడు మార్గాలవైపుకు వయసుతోపాటు మార్చలేనంతలా ఎదిగిపోయారు - అయినాకూడా ఎప్పుడూ అమ్మానాన్నలు అన్నయ్యలపై కోప్పడలేదు , కొడుకులపై వాళ్లకున్న ప్రేమ అలాంటిది - బంధువుల సలహా ప్రకారం పెళ్లిచేస్తే మారుతారని దేవతలను ఇంటికి కోడళ్లుగా తీసుకువచ్చారు .
మా అందరిలో పెద్దన్నయ్య వయసు ఎక్కువ , పెద్దన్నయ్య పుట్టిన తరువాత బిజినెస్ ఒడిదుడుకులకు లోనవ్వడంతో అమ్మానాన్నలు సుమారు పదేళ్ళపాటు పిల్లల్ని కనలేదు - రాత్రీపగలూ కష్టపడి ఇక మళ్లీ అలాంటి రోజులు రాకుండా ఎవరెస్టు చేరిపోయారు . 
పెద్దన్నయ్య పెళ్లినాటికి రెండవ అన్నయ్య 12th క్లాస్ , మూడవ అన్నయ్య 8th క్లాస్ , చివరి అన్నయ్య 5th ............
పెద్దన్నయ్య పెళ్లి తరువాత కూడా ఏమాత్రం మారనేలేదు , వదినమ్మకు పిల్లలు పట్టరు అన్న విషయం తెలిసిన తరువాత బయటివాళ్లే కాదు అన్నయ్య కూడా పెదాలతో పలకను మాటలతో బాధపెట్టేవాడు - హింసించేవాడు . 
ఇక మిగిలిన అన్నయ్యలంతా పెద్దన్నయ్యనే మార్గదర్శకంగా తీసుకుని రోజూ బార్లలో తాగడమే కాకుండా పొట్లాటలతో తూగుతూ ఇంటికి చేరి వదినలను బాధపెట్టేవారు . 
అమ్మ అయితే బిజినెస్ అంతటినీ నాన్నగారికి అప్పగించేసి కోడళ్లను కూతుర్లుగా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ వస్తున్నారు .
నాన్నగారు అయితే కోడళ్ళూ ........... మీరు అడుగుపెడితే బాగుపడతారని మీ జీవితాలను నాశనం చేసినందుకు నన్ను క్షమించండి అని రెండుచేతులూ జోడించారు .
ఇది మా మెట్టినిల్లు కాదు మావయ్యగారూ పుట్టినిల్లు , మా అమ్మ ప్రేమ చాలు అని అమ్మ కౌగిలిలోకి చేరారు . రెండవ వదినకు జాహ్నవి - వైష్ణవి , మూడవ వదినకు స్నిగ్ధ - రాము పుట్టాక అందరి ప్రపంచం వాళ్లే అయ్యారు . పెద్ద వదినను వదినమ్మ అని నేను - అమ్మ అని బుజ్జితల్లులు బుజ్జాయిలు ......... పిలిచి ఆ బాధకూడా లేకుండా చేసాము .
*************

ఎయిర్ హోస్టెస్ ఫుడ్ తీసుకునిరావడంతో , కన్నీళ్లను తుడుచుకున్నాను . నో థాంక్స్ చెప్పి పంపించేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ........... అందరి దేవతవు నువ్వే అని మొబైల్లోని అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను . 
బుజ్జితల్లులు - బుజ్జాయిల అల్లరిని , ప్రేమను మొబైల్లోని ఫోటోలు వీడియోస్ లో చూస్తూ చూస్తూనే అలసిపోయినట్లు నిద్రలోకిజారుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-03-2021, 10:26 AM



Users browsing this thread: 6 Guest(s)