Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కదంబం
#18
Photo 
ఈనాడు Dt:2018 Dec 10 Wrote:శతమానం భవతి - 94 ఏళ్ల నిఘంటు డాక్టర్‌!

తేదీల ప్రకారం అయితే ఆయన వయసు... 94  పలకరించి మాటకలిపితే మాత్రం... 30 దాటదేమో అనిపిస్తుంది!
అబ్బే అంతా అతిశయోక్తి అంటారా? అయితే ఇది చదవండి... డాక్టర్‌ ఓరుగంటి ఆంజనేయ రావు రాసిన వైద్య నిఘంటవుని
చదవకుండా ఏ తెలుగు వైద్యవిద్యార్థీ క్యాంపస్‌ దాటరనేది వాస్తవం. ఇప్పటికే 6 వైద్య నిఘంటువులు... 25 ఇతర పుస్తకాలు
రాసిన ఆయన  94 సంవత్సరాల వయసులోనూ మరో క్రతువులో పాలుపంచుకుంటున్నారు. తెలుగు భాషకు మణిదీపమనదగ్గ
మహానిఘంటువు రూపకల్పన కోసం రోజుకి 12 గంటలు కష్టపడుతున్నారు...

[Image: sJYbT3u.jpg][Image: evIjZCB.jpg]
ముఖం మీద చెరిగిపోని చిరునవ్వుతో, నిరాండబరమైన వ్యక్తిత్వంతో నిరంతరం జీవితాన్ని ప్రేమించే వ్యక్తులు కొందరు ఉంటారు.
అలాంటివాళ్లని చూస్తే వాళ్ల వయసు గుర్తుకురాదు సరికదా మనలో అంతవరకూ గూడుకట్టుకున్న నైరాశ్యం కూడా పోయి ఏదో
చేయాలనే హుషారు పుడుతుంది. ప్రొఫెసర్‌, డాక్టర్‌ ఓరుగంటి ఆంజనేయ రావుని చూసినా మనకి అదే భావన కలుగుతుంది.
వైద్యుడిగా కెరీర్‌ని మొదలుపెట్టి తన సేవలతో తెలుగు రాష్ట్రాలని మొత్తం చుట్టేసి... రిటైర్‌ అయిన తర్వాత కూడా పాతికేళ్లపాటు
ఉచితంగా సేవలందించిన గొప్ప వైద్యుడాయన. ‘మీరు డాక్టర్‌ కదా.. నిఘంటువు, భాష వంటి పదాలు మిమ్మల్ని ఎలా
ఆకట్టుకున్నాయి?’ అని అడిగితే ఇలా చెప్పడం మొదలుపెట్టారు.
‘నేను డాక్టర్‌నే. నేనెళ్లిన ప్రతిచోటా మనుషులని మాత్రమే కాదు వాళ్ల భాషలని, యాసలని కూడా ప్రేమించడం మొదలుపెట్టాను.
నేను పుట్టింది విజయవాడలో. అప్పటికి మనకింకా స్వాతంత్య్రం రాలేదు. దాంతో మా బడుల్లో పూర్తిగా ఆంగ్లబోధనే జరిగేది.
అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మూడు వైద్య విశ్వవిద్యాలయాలు ఉంటే నాకు ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో చదువుకునే అవకాశం
వచ్చింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసి ఎంపికయ్యాను. ఓ పక్కన ఉద్యోగం చేస్తూనే మరో పక్క క్షయవ్యాధి
నిర్మూలనకు ప్రత్యేకంగా ఎండీ చదివాను. ఉద్యోగరీత్యా కరీంనగర్‌, అనంతగిరి, వరంగల్‌, తిరుపతి, హైదరాబాద్‌లలో పనిచేసిన
తర్వాత ఆయా ప్రాంతాల ప్రజలు, వాళ్ల భాషలు కూడా నాకు క్షుణ్ణంగా పరిచయం అయ్యాయి. అలా తిరగడమే నాకు తర్వాతి
కాలంలో నిఘంటువు రాయడానికి కావాల్సిన ముడిపదార్థాన్ని అందించింది అంటూ వివరించారు రావు.

అయితే రావు 50,000 పదాలతో ఉన్న వైద్యనిఘంటువు, ఎన్‌సైక్లోపీడియాని రాయడానికి మరో బలమైన కారణం కూడా ఉందట.

అదో కరదీపిక...
ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా రిటైర్‌ అయిన తర్వాత రావు సౌదీఅరేబియా ప్రభుత్వం నుంచి ఆ దేశంలో క్షయవ్యాధిని
రూపుమాపడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ‘అలా ఆహ్వానం అందుకుని అక్కడకు వెళ్లిన వారిలో వివిధ దేశాలకు చెందిన
గొప్పగొప్ప వైద్య నిపుణులు కూడా ఉన్నారు. వారితోపాటు నాకూ గుర్తింపు రావడం సంతోషించదగ్గ విషయమే. అక్కడి ప్రజలు
ఎక్కువగా అరబిక్‌లోనే మాట్లాడేవారు. నాకు అరబ్‌ రాకపోయినా భాషాపరంగా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అందుకు కారణం ఉర్దూ
మాట్లాడే తెలంగాణ ప్రజల మధ్య నేను పనిచేయడమే. మన సంస్కృతంలానే అరబిక్‌ కూడా చాలా భాషలకు తల్లిభాష. సౌదీ నుంచి
వచ్చిన తర్వాత నీల్‌కమల్‌ ప్రచురణ సంస్థకు చెందిన ఒకాయన వైద్యపదాలకు సంబంధించి  ఒక నిఘంటువు ఉంటే బాగుంటుందని
నాతో అన్నారు. ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగులో చదువుకున్న గ్రామీణ వైద్యవిద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్లంలో వెల్లువెత్తే వైద్యపదాలని
అర్థం చేసుకోవడం అంతతేలికైన విషయం కాదు. దాంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో వైద్యనిఘంటువుని రూపొందించడం మొదలుపెట్టాను.
అలా సుమారు యాభైవేలపదాలతో కూడిన వైద్యశాస్త్ర నిఘంటువుని తయారుచేశా’ అంటూ వివరించారు రావు.

అన్నట్టు ఈ వైద్య నిఘంటువు 18వ సారి పునర్ముద్రితమవుతోంది.

గొంతులో నాగుబాము....
వైద్య నిఘంటువు, ఎన్‌సైక్లోపీడియా అనగానే  ఇది కేవలం వైద్యులకు మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు. దీన్ని సామాన్యులకు,
వృత్తినిపుణులకు, విలేకరులకు కూడా ఉపయోగపడేలా రాశారు రావు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పుట్టకుండా చేసే కుటుంబ నియంత్రణ
శస్త్రచికిత్సని చిన్న ఆపరేషన్‌ అంటారు. గర్భసంచిని తొలగించడాన్ని పెద్ద ఆపరేషన్‌ అంటారు. అలాగే వ్యాధి ఉందని తెలిసినా డాక్టర్‌
దగ్గరకు రావడానికి చూపించే అలసత్వాన్ని ఉర్దూలో ‘మీఠాసా దర్ద్‌’ అంటారు. అలాని దానిని ‘స్వీట్‌పెయిన్‌’ అని ఆంగ్లంలోకి
అనువదించంలేం. అర్థం మారిపోతుంది. రాయలసీమ మాండలికంలో ఆయాసపడ్డాన్ని గసపోసుకోవడం అంటారు. అదే తెలంగాణలో
దమ్ము అంటారు. అలాగే డయేరియాకి కూడా వేర్వేరు మాండలికాల్లో దస్తులు అనీ పైఖానా అని ఇలా వేర్వేరు పదాలు ఉంటాయి.
అలాగే ఆస్త్మాతో బాధపడుతున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ గొంతులో నాగుబాము
ఆడుతున్నట్టుగా ఉంది సార్‌ అన్నాడు. మరొకావిడ ఉబ్బసంతో బాధపడుతూ గుండెలో చేటతో చెరిగినట్టుగా ఉందండీ అంది.
 
ఇవేమి శాస్త్రీయమైన పదాలు కాదు. వాడుక భాష. అంటే ఒక రోగి దృష్టిలో రోగలక్షణాలు ఇలానే ఉంటాయి. వాటిని వైద్యుడు అర్థం
చేసుకున్నప్పుడే సరైన వైద్యం అందించగలడు. రోగికి, వైద్యునికి మధ్య భాష అవరోధం కాకూడదు కదా అనిపించింది. ఇవన్నీ ఒక
వైద్యుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోగిభాష పూర్తిగా అర్థమయితేనే వైద్యుడు సరైన వైద్యం అందించగలడని
నాకు బలంగా అనిపించింది. అందుకే వేర్వేరు మాండలికాల్లో ఉండే పదాలని కూడా జోడించి ఎన్‌సైక్లోపీడియాని రాశా అనే రావుగారు
పదాలకు యథాతథంగా కాకుండా చక్కని అనువాదాన్ని ఎంచుకున్నారు. సర్జికల్‌ టూల్స్‌ అంటే మేలుచేసే కత్తి, ఆపరేషన్‌ మార్క్స్‌కి
వైద్యుని సంతకం, క్యుటికిల్స్‌ అంటే గోరుఅంచు వంటివన్నమాట. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ వైద్యనిఘంటువుని అందించే పనిలో ఉన్నారాయన.

నిఘంటువులు మాత్రమేకాకుండా శాస్త్రవేత్తలకు సంబంధించిన, ఊబకాయం వంటి వ్యాధులకు సంబంధించి కూడా పుస్తకాలని అందించారు.
ప్రస్తుతం రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు మహానిఘంటువు నిర్మాణ బృందంలో ఆయన   కృషి చేస్తున్నారు.

ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే ఆయన చెప్పిన త్రిసూత్రావళి...

మితి హాయి... అతి హాని
జీవితంలో ఏదైనా మితంగానే ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో...  
50 ఏళ్ల వయసు నుంచి ఈ సూత్రాన్ని నా జీవితానికి ఆపాదించుకున్నాను.
ఎంత రుచిగా ఉన్నా తక్కువగానే తినడం నా అలవాటు.

చురుకు నడక
ఆరోగ్యానికి తినే ఆహారం ఎంత ముఖ్యమో, చేసే వ్యాయామం కూడా అంతే ముఖ్యం.
రోజూ క్రమం తప్పకుండా నడవడం నా అలవాటు.
వేగంగా నడవడం వల్ల శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి.
శారీరక, మానసిక దృఢత్వాన్నిస్తాయి.

కష్టంగా కాదు... ఇష్టంగా ఉండండి
విజ్ఞానం ఒక గని. దాన్ని సాధించాలి.
మనిషి సంపాదించిన డబ్బుతో తృప్తి పడాలి తప్ప నేర్చుకున్న జ్ఞానంతో కాదు.
జ్ఞానాభివృద్థి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది.
ఆ ఆనందం ఆరోగ్యానికి కారణమవుతుంది.
Like Reply


Messages In This Thread
కదంబం - by Vikatakavi02 - 28-11-2018, 12:04 AM
RE: కదంబం - by Vikatakavi02 - 29-11-2018, 02:41 PM
పొగడ దండలు - by Vikatakavi02 - 29-11-2018, 02:56 PM
RE: పొగడ దండలు - by Yuvak - 03-01-2019, 07:34 AM
RE: కదంబం - by Vikatakavi02 - 29-11-2018, 04:00 PM
RE: కదంబం - by Rajkumar1 - 29-11-2018, 07:09 PM
RE: కదంబం - by ~rp - 29-11-2018, 07:17 PM
RE: కదంబం - by Vikatakavi02 - 30-11-2018, 06:10 PM
RE: కదంబం - by ~rp - 01-12-2018, 04:32 PM
RE: కదంబం - by Vikatakavi02 - 02-12-2018, 10:01 PM
RE: కదంబం - by ~rp - 02-12-2018, 10:15 PM
RE: కదంబం - by Vikatakavi02 - 02-12-2018, 10:28 PM
RE: కదంబం - by Vikatakavi02 - 05-12-2018, 08:06 PM
RE: కదంబం - by Vikatakavi02 - 09-12-2018, 10:28 AM
RE: కదంబం - by ~rp - 09-12-2018, 11:08 AM
RE: కదంబం - by Vikatakavi02 - 09-12-2018, 11:38 AM
RE: కదంబం - by ~rp - 09-12-2018, 05:50 PM
RE: కదంబం - by ~rp - 10-12-2018, 04:58 PM
RE: కదంబం - by ~rp - 16-12-2018, 08:01 PM
RE: కదంబం - by Vikatakavi02 - 16-12-2018, 08:21 PM
RE: కదంబం - by Yuvak - 03-01-2019, 07:46 AM
RE: కదంబం - by ~rp - 16-12-2018, 09:52 PM
RE: కదంబం - by Vikatakavi02 - 23-12-2018, 07:39 AM
RE: కదంబం - by Vikatakavi02 - 28-12-2018, 09:51 PM
RE: కదంబం - by ~rp - 28-12-2018, 10:36 PM
RE: కదంబం - by Vikatakavi02 - 29-12-2018, 04:28 PM
RE: కదంబం - by ~rp - 29-12-2018, 06:15 PM
RE: కదంబం - by Vikatakavi02 - 29-12-2018, 08:18 PM
RE: కదంబం - by Vikatakavi02 - 03-01-2019, 07:25 AM
RE: కదంబం - by Yuvak - 03-01-2019, 07:58 AM
RE: కదంబం - by Vikatakavi02 - 13-01-2019, 11:33 AM
RE: కదంబం - by Vikatakavi02 - 17-01-2019, 12:16 PM
RE: కదంబం - by Vikatakavi02 - 21-01-2019, 10:43 PM
RE: కదంబం - by Trikon rak - 21-01-2019, 10:48 PM
RE: కదంబం - by Vikatakavi02 - 29-01-2019, 11:58 PM
RE: కదంబం - by Vikatakavi02 - 07-02-2019, 07:33 AM
RE: కదంబం - by Vikatakavi02 - 27-04-2019, 08:39 PM
RE: కదంబం - by Vikatakavi02 - 30-04-2019, 03:44 PM
RE: కదంబం - by Vikatakavi02 - 11-06-2019, 08:27 PM
RE: కదంబం - by Vikatakavi02 - 18-06-2019, 09:04 PM
RE: కదంబం - by Vikatakavi02 - 26-06-2019, 11:41 PM
RE: కదంబం - by Vikatakavi02 - 13-07-2019, 09:56 AM
RE: కదంబం - by Vikatakavi02 - 10-02-2020, 12:14 PM
RE: కదంబం - by Vikatakavi02 - 10-02-2020, 12:16 PM
RE: కదంబం - by Vikatakavi02 - 15-02-2020, 02:10 PM
RE: కదంబం - by Vikatakavi02 - 15-02-2020, 02:13 PM
RE: కదంబం - by Vikatakavi02 - 15-02-2020, 02:15 PM
RE: కదంబం - by Vikatakavi02 - 15-02-2020, 02:16 PM



Users browsing this thread: 1 Guest(s)