Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#9
ఈశ్వరుడిని ఉపాసన చేసినవానికి అన్ని ఐశ్వర్యాలూ చేకూరుతాయి.
అదే ఈశ్వరుడు తిరోధానం చేయగలిగినవాడు., అనగా భూమినే కాదు సర్వమునూ త్రిప్పి యధాతధంగా చేసేవాడు అని, అలాగే జీవి పుట్టి మాయలో తెలిమరలా ఈశ్వరుడిలో కలిసిపోగల్గాలి అదే తిరోధానం. అంటే మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. ఈ ఈతి బాధలు ఉండవు. 

బాధ ఎలా ఉంటుందంటే.....మా ఇంటి దగ్గర ఒక కుక్క పిల్ల ఈతలు తీసింది. దానికి పిల్లలు కలిగినా అవి చలికి తట్టుకోలేక చచ్చిపొయ్యాయి. ఆ కుక్క కన్నీళ్లు పెడుతూ ఆ పిల్ల కోసం దాన్ని తన మూతితో కదుపుతూ నోటా కరుచుకుని అటూ ఇటూ తిరుగుతోంది. దాన్ని చూస్తే....కళ్ళు ద్రవించిపోయ్యాయి. ఇప్పుడు కూడా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇది బాధ కానీ ఇదే మాయ;
మాయకి ఎవ్వడూ అతీతుడు కాదు.
ఈ తిరోధానాన్ని ఇచ్చే ఏకాదశ రూపాన్ని అనగా 11th రూపాన్ని రావణుడు పూజించలేదు. 
దానితో మోహాన్ని పొందాడు అలా అహంకారం పది తలలైంది.
ఆ అహంకారాన్ని సత్వగుణ ప్రధానుడైన శ్రీ రాముడు అణచవలసి వచ్చింది.
మొహాన్ని అణచడానికి సత్వ గుణమే ధనువు తమో, రజో గుణముల కతీతంగా సత్వ గుణము అంతకన్నా శుద్ధ సత్వగుణము కావాల్సి ఉంటుంది అందుకే సూర్య భగవానుని ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు ఉపదేశించారు. శుద్ధ సత్వ గుణము శ్రీ సూర్య నారాయణుడు. 
ఇక్కడ ఇంకో మాట ఉంది. సూర్యుని సదా అర్చించే అనగా త్రికాలములూ అర్చించే బ్రాహ్మణుడు రావణుడు అయిననూ మొహానికి తోడైన అహాన్ని అణచడానికి స్త్రీ మొహాన్ని జయించిన వాడు కావలసినది.
ఇక్కడ ఇంకో విశేషం ఉంది. స్త్రీని జయించడమంటే సెక్స్ లోనా, లేదా అసలు ఆడవాళ్ళని కోరుకోపోవడమేనా? 
కాదా...మరి ఏమిటి?
స్త్రీని చూసినా., ఒక మగవాడిని చూసినా, ఒక కుక్కనో, కోడినో చూసినా ఎటువంటి కామ ప్రకోపములు లేక, శమమూ, దమము కలిగిన గుణములు కలిగినవాడయి ఉండవలసినది.
ఇక్కడ ఇంకో విశేషం గుణములు లేని వాడా? ఉన్నవాడా? 
గుణం మాత్రం కోరికల నుండే పుడుతుంది కదా?!
మరి గుణ రహితుడు ఎవ్వడు. కీర్తి కాంక్ష లేనివాడు ఎవ్వడు. 
అంటే అమ్మాయిల అంగాంగాలతో ఆడుకున్ననూ వాటిలో ఎటువంటి ఆసక్తి లేని వాడు అందుకే భగవంతుడు శ్రీ కృష్ణ అవతారం ఎత్తాడు. వివాహమైననూ బ్రహ్మచారే........
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 01-02-2021, 01:33 AM



Users browsing this thread: 1 Guest(s)