Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#8
శ్రీ దత్త స్వామి చిన్న వయసులో తండ్రి అత్రి మహర్షి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిపోవడానికి కూడా భలే కారణం వెతుక్కున్నాడు. 
సహజంగా గాయత్రి ఉపదేశంలో వటువుని భిక్షాటనకు పంపిస్తారు. ఆ బిక్షతోనే వేదం, వేదాంగములను నేర్చుకోమని, ఇదే అదును అనుకోని స్వామి బిక్ష ఎత్తుకోవడానికి వెళ్ళిపోయాడు. భలే చిలిపివాడు కదా....

ఆయన ఎంత గొప్పవాడంటే.....ఆయన తత్వాన్ని అర్ధం చేసుకోవడం వల్ల కానిది అందుకే ఆయనను అందరూ అనుసరించేవారు. ఆయన తపస్సును చెయ్యడానికి ఈ ఎవ్వరికీ కనిపించకుండా ఉండటానికి నీళ్ళలోతుల్లో తపమాచరించేవాడుట...కానీ శిష్యులు ఆయన కోసం అలానే నది ఒడ్డున కూర్చునే వారుట. దాంతో ఆయన కనపడకుండా ఉండటానికి వెళ్లి ఔదుంబర వృక్షం (మేడి చెట్టు) మొదట్లో దాచుకున్నాడుట. 
ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. 
ఆయన ఎప్పుడూ ఆనంద రూపుడే 
ఆనందం ఎలా ఉంటుంది? (తొక్కలో కొశ్చన్లు ఎందిరాబాయ్)
ఆనందం ఆనందం లానే ఉంటుంది ఇంకెలా ఉంటుంది?
మరి చిదానందం అంటే ఏమిటి?
బ్రహ్మానందం అంటే ఏమిటి?
బ్రహ్మానందం అంటే స్టార్ బ్రహ్మానందం 
చిదానందం అంటే పోస్ట్ మాన్ పేరు ఇంకేంటి?

అదీ నిజమేలే.........
చిత్తంలో ఒరిగే లేక ఒదిగే ఆనందం.
చిత్తం కల్లోలంలో లేకపోతె దానిని చిత్త శాంతి అంటారు చిట్టా కాదు.
మరి బుద్ధి అనగా నేమిటి? బుద్ధికీ చిత్తానికి గల భేదం ఏమిటి?
బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఇన్ని కొశ్చన్లు వెయ్యడంటారా?! బుడ్డి కాదండీ బుద్ది
బుద్ది అనగా తెలివి అనగా తెలివి తేటలు 
ఆ అనుభవాల్లోని విచక్షణయే శివుడు ఆ చోటే చిత్తం.

మీరు ఏ పనైనా చెయ్యలేననుకున్నారు అనుకోండి లేదా పని చెయ్యలేక గుంజాటన పడుతూ ఉంటె రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుని శరీరమంతా నిమ్పుకోండి. అప్పుడు మీ గాలి ప్రయాణిస్తూ గుండె కవాటాలని తాకి కిడ్నీలూ గర్భ కుహరాల్లోకి వెళ్లి వెన్ను పాములో ప్రాణవాయువుని రక్తంలో నింపుకొని ముఖంలోకి రక్తం ప్రవహించి చెవుల వెనుక నరాల్లోకి ప్రయాణించి మళ్ళీ గుండె కవాటాల్లో దమనుల్లోకి చేరుతుంది. 
ఆ సమయంలో నీ బుద్ది చేసే నిర్ణయం యొక్క జడ్జిమెంట్ చిత్తం అవుతుంది. అనగా ఆ ప్రదేశం ఒక కైలాసమే........
మన బాధ చట్టంలో కొలువు తీరితే..........మనిషి పిరికితనానికి బానిస అవుతాడు. ఆ పిరికి తనానికి రూపమే మద్యం, మగువ, అది ఒక వాగాబొందఁ 
అందుకే ఆనందం అనేది నీ సొంతం చేసుకో చిన్న పిల్ల వాడు నవ్వుతాడే...ఏ కష్టమూ వాని మనసుకు చేరాడు అదే చిట్టా శాంతి ఆ చిట్టా శాంతి సదా ఉండాలి చిన్నతనమైనా పెద్దరికమైనా....
అదే చిదానందం.
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 01-02-2021, 01:12 AM



Users browsing this thread: 1 Guest(s)