Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#4
శ్రీ దత్త స్తవం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | 
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧ ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||


శ్రీ దత్తుడు ఆత్రేయస గోత్రం వాడు మహాన్ ఆత్మ కలిగినవాడు ఆయన వరములు గుప్పించడంలో వరదుడు; భక్తులయందు తండ్రివలే వాత్సాలయము కలిగినవాడు.
ప్రపన్న ఆర్తిని హరించి రక్షించేవాడు; ఆయనకు నమస్కారం. ఆయన స్మర్తృ గామి అనగా మన స్మృతి పథంలోకి ఆయన రాగానే మన ముందుకు వచ్చేస్తాడు. అంతటి కృపా సముద్రుడు.
దీనులకు బంధువు, కృప చూపడంలో చాలా ఉన్నతుడు. సర్వ కారణములకు కారణం అనగా అన్ని మూలములకు ఆయనే మూలం.
సర్వ రక్షాకరం అయినా ఆ స్వామిని స్మరిస్తున్నాను ఎందుకంటే ఆయన స్మృతి పథంలోకి రాగానే మన ముందుకు వస్తాడు కాబట్టి.
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||

శరణాగతి అన్న నామం శ్రీ రామునికి ఉంది. దీనులను, ఆర్తి అన్న వారి, పరితపించే పరాయణులని రక్షించేవాడు.
నారాయణుడు అనగా మనకు ఉన్న బంధములన్నీ తుడిచేసేవాడు అనగా మాయ నుండీ రక్షించే విభుడు, అటువంటి వానిని స్మరిద్దాం ఎందుకంటే స్మరించగానే వచ్చేవాడు ఆయనే కాబట్టి. 
అనర్థాలు సర్వం హరించేవాడు దివ్యుడు. సర్వ అమంగళములను మంగళం చేయువాడు.
సర్వ అనారోగ్య, బాధలూ హరించే ఆ దేవునికి వందనము. ఆయనని స్మరిద్దాం.

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||

బ్రహ్మలకు హితమైనవాడు, ధర్మతత్వమును తెలిసినవాడు, భక్తుల కీర్తి తత్వములను తెలిసినవాడు.
భక్తుల అభీషములను నెరవేర్చేవాడు, ఆయనకు వందనం.
పాపాలను శోషింపచేసేవాడు, జ్ఞానతేజస్సుకు దీపం వంటి వాడు.
తాపములను ప్రశమనం చేసేవాడు ఆయనకు వందనములు.

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ ||

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||

అన్ని రోగములనూ శమింపచేసేవాడు, అన్ని పీడలను నివారించేవాడు 
విపత్తులో ఉన్నవారిని ఉద్దరించేవాడు; ఆయనకు వందనములు, ఆయనను స్మరిద్దాం.
జన్మ, సంసార బంధనములను చిన్నం చేసేవాడు ఆయనకు నమస్కారం. ఆయనను స్మరిద్దాం 
ఆయనే  ధరించిన  ఈశ్వరుడు ఆయనకు వందనం. ఆయనను స్మరిద్దాం 

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||

ఇతి శ్రీ దత్తస్తవమ్ |
జయము, లాభమూ, యశ: అనగా కీర్తి కోరు వారిని ఉద్ధరించే వాడు ఆయన స్తవం 
భోగము, మోక్షము, ప్రసాదిస్తుంది. శ్రద్ధతో మళ్ళీ చదివితే సుకృతములు కలుగుతాయి.
ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్తవము. సర్వ శుభములనూ చేకూరుస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 31-01-2021, 06:44 PM



Users browsing this thread: 1 Guest(s)