Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#3
తొక్కలే మాటలు వంద కాకపొతే 2 వందలు చెబుతారు. అన్నీ నమ్ముతూ పొతే ఒక కాలు కావేరిలో ఇంకో కాలు తుంగభద్రలో పెట్టాలి.
ఉంగరాలకీ, జాతి రాళ్ళకీ, కనపడ్డ నల్ల రాళ్ళకీ మ్రొక్కుట సమస్యలు తీరిపోతాయా ఏంటి?
పూర్వజన్మలో ఎదో పాపం చేసామాట దానం ఇవ్వాలట. ఆ పంతులు గాడుతిండికి లేక వంద చెబుతడు. నేను ఇంట మంచిగున్నా....నన్ను చూసి ఎంత మంది అసూయ పడతా ఉంటరు. నాకు శని మహర్దశ వచ్చే తయానికి బట్ట నెత్తి వస్తదంట. గప్పటికీ నాకు 40+ వస్తాయి.., ఇంకేంది, గప్పటికీ బట్టనెత్తి వస్తే ఏమయితది.

ఛీ నియ్యమ్మ 40+ character ఆర్టిస్ట్  గూడ వస్తా  లేదు. ముసలోని వేషం తప్ప.

గురూ ధ్యానం చేస్తే.....నల్లగా అవుపడుతుంది ఎందుకట్లా 
నాకు తెల్లగానే అవుపడుతున్నదిరా....గదేమున్నది నువ్వు మల్ల మల్ల చెయ్యి నీకే ఎరికయితది.

గురూ ధ్యానం చేస్తే...ఇంద్ర ధనుస్సు లేక, kaleidoscopic కలర్స్ కనపడుతున్నాయి. ఎందుకట్లా?!
చెయ్యి మాట్లాడకు.
గురూ గారూ అనంతమైన నల్లని వలయాలు ఆ చివర సన్నని వెలుగు కనపడుతోంది దీనికి కారణం ఏమిటి? గురూ గురూ మాట్లాడు.
నేను నీ అంతర్వాణిని మాట్లాడుతున్నాను., నీవు మూలాధారమునూ, స్వాధిష్టానమునూ, మణిపూరమునూ చేరినావు. నీకు "ఐమ్" మంత్రమును ఉపదేశించుచున్నాను. 
క్రియా యోగమునకు నీవు అర్హుడవయినావు.

ధ్యానించుము. నీకు సందేహం కలిగినప్పుడు నేను ఇచ్చిన మంత్రమును సేవింపుము.

పరమేశ్వరా.......నా చిత్తములో ఉన్న అపూర్వమైన శక్తి ఏది, అది శక్తియా? లేక శివమా....ఆ శక్తిని నేనుచూడగలుగుతున్నాను.

శిష్యా, శిష్యా, శిష్యా 4 రోజులుగా ధ్యానంలోనే ఉన్నావ్....నిద్ర పొవట్లేదు కదా?! లే లే.

మన్నించండి గురుదేవా.......నిద్ర పట్టేసింది.

ఏం బాషరా అది నీకేదో అయ్యింది. 
ఏమో గురు నిద్ర పట్టేసింది ఏడున్నానో ఏమో.....(మాయ మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది) 
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 31-01-2021, 06:36 PM



Users browsing this thread: 1 Guest(s)