Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెమ్మ .......... బుజ్జితల్లిని తన అన్నయ్యకు అందించి , చెల్లెళ్ళ నుండి స్లిప్పర్స్ అందుకుని వచ్చింది .
చెల్లెమ్మా ......... వద్దు వద్దు అంటున్నా , మోకాళ్లపై కూర్చుని నా దేవత పాదం అందుకుంది .
నాచాతీపై పెదాలతో గిలిగింతలుపెడుతున్న నా దేవత బయటకువచ్చి చెల్లెమ్మా .......... , నువ్వు శ్రీవారి ప్రాణం అని నెమ్మదిగా ప్రక్కకు చేర్చారు పాదాన్ని దేవత .
చెల్లెమ్మ : మా అన్నయ్య దేవత నాకూ దేవతతో సమానం - ఈ అదృష్టమైనా నాకు కలిగించండి please please వదినా అని పాదాన్ని అందుకుంది .
దేవత : స్వామీ .......... 
దేవత - భక్తురాలి మధ్యన మేమెందుకు ..........
దేవత : స్వామీ ......... అంటూ తియ్యనికోపంతో నా గుండెలపై కొడుతున్నారు .
చెల్లెమ్మ : నవ్వుకుని క్షణాలలో స్లిప్పర్స్ తొడిగి , goddess అయిపోయింది అని బుగ్గపై ముద్దుపెట్టి లేచింది .
దేవత : మీసంగతి రాత్రికి చెబుతాను అని నా బుగ్గను కొరికేసి లేచి , చెల్లెమ్మా ........ అంటూ ప్రేమతో కౌగిలించుకుని తనతోపాటువెళ్లి చెల్లెళ్లతో కూర్చుని చిరునవ్వులు చిందించారు . 
మొబైల్ మ్రోగడంతో చూస్తే సర్ .........
సర్ : మహేష్ ......... అంటూ మంత్రిగారి గురించి మొత్తం వివరించారు .
12 గంటలకు కొత్త బ్రాంచ్ దగ్గరకు చేరుకున్నాము .

రోడ్డుకు ఇరువైపులా - కాంపౌండ్ లోపల ఎక్కడ చూసినా వైట్ అండ్ వైట్ జనాలతో కిటకిటలాడుతుండటం చూసి ఆశ్చర్యపోయి , మంత్రిగారు కాదు కాదు మాజీ మంత్రిగారు తన నిజమైన కార్యకర్తలందరితోపాటు వచ్చారన్నమాట అని ఫ్రెండ్స్ కు దేవతకు అందరికీ చెప్పి కిందకుదిగాము . నాదేవత కంగారుపడి నా గుండెలపైకి చేరిపోయారు . 
నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి చేతివేళ్ళల్లో పెనవేశాను .

సర్ : మంత్రిగారూ .......... మహేష్ - బుజ్జాయిలు వచ్చారు అని చెప్పడంతో ,
వచ్చేసారా నా బుజ్జిదేవుళ్ళు అని ఆతృతగా కుటుంబం తోపాటు బయటకువచ్చారు . 
మంత్రిగారి భార్య : చెల్లెమ్మ దగ్గరికివెళ్లి , మా ఆయన గర్వాన్ని అణిచివేసి - పయనిస్తున్న చెడుదారి నుండి మంచివైపు నడిచేలా చేసిన బుజ్జిదేవుళ్ళు అని ఆప్యాయంగా బుగ్గలను స్పృశించి , ఒక్కసారి ఎత్తుకోవచ్చా అని ఆశతో అడిగారు.
చెల్లెమ్మ నావైపు చూసి , కళ్ళతో ok అనిచెప్పడంతో అందించారు .
మేడం తన గుండెలపై హత్తుకుని ఆఅహ్హ్ ........ ఎంత హాయిగా ఉంది , ఏమండీ - పిల్లలూ .......... తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఫీల్ కలుగుతోంది - బుజ్జితల్లీ......... ముద్దుపెట్టుకోవచ్చా అని అడిగారు . 
బుజ్జితల్లి : మీ ఇష్టం అమ్మా ..........
మేడం : అమ్మ ......... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బుజ్జితల్లీ అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . 
మంత్రి గారి పిల్లలు బిస్వాస్ ను ఎత్తుకుని , అవునమ్మా ......... మీరు చెప్పినది నిజమే అని ముద్దులుపెట్టి , నాన్నా ......... ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అన్నారుకదా అని అందించారు . 
మంత్రి గారు : నాకు జ్ఞానోదయం కలిగించిన బుజ్జిదేవుళ్ళు అని బిస్వాస్ బుగ్గపై ముద్దుపెట్టి , మహేష్ .......... ప్రారంభోత్సవ సమయం అయ్యింది లోపలికి రండి మీకోసమే ఎదురుచూస్తున్నాము అని స్వయంగా తన ఫంక్షన్ లా ఆహ్వానించడం చూసి ,
ఆనందించి , మురిసిపోతున్న దేవత కురులపై ముద్దుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకున్న మంత్రిగారు - మేడం వెనుకే లోపలికివెళ్లాము . 

పూజారిగారు మంత్రాలతో పూజ జరిపించి రిబ్బన్ కట్ చెయ్యడానికి మాజీ మంత్రిగారిని ఆహ్వానించారు .
మంత్రిగారు : మా చేతులతో కాదు పూజారిగారూ అని సర్ కొడుకు - కూతుర్లను పిలిచి బుజ్జాయిలను ఇద్దరికీ అందించి కానివ్వండి పూజారి గారూ అన్నారు .
అంతే కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగిపోయింది . 
చెల్లి - తమ్ముడు ......... ఆనందబాస్పాలతో పొంగిపోతున్న సర్ వైపు చూసారు .  
సర్ వాళ్ళు గుండెలపై చేతినివేసుకోవడంతో , సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , కీర్తితల్లితో కట్ చేయించి ప్రాణంలా హత్తుకున్నారు .
చప్పట్లు - కేకలతో సంబరంలా మారిపోయింది .

మంత్రిగారు ......... మైకు అందుకుని ముందుగా సర్ వాళ్లకు all the best చెప్పారు - ఇలాగే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించారు . మా ఆవిడ చెప్పినట్లు ఈ బుజ్జిదేవతలు ......... డబ్బు శాశ్వతం కాదు - మనుషులు మంచితనం శాశ్వతం అని నాకు తెలియజేసారు . ఇప్పటివరకూ సంపాదించిన డబ్బు మొత్తం మా బుజ్జిదేవతల పేరున కార్యకర్తల కుటుంబాల బాగోగులకు ఖర్చుపెడతాను అని మాటిస్తున్నాను - PA .......... మన కార్యకర్తల సమస్యలన్నీ తెలుసుకో వాళ్ళ పిల్లలు డబ్బున్నవాళ్ళతోపాటు పెద్దపెద్ద స్కూల్స్ కాలేజ్ లలో చదవాలి - కార్యకర్తల పెదాలపై చిరునవ్వులు చిగురించేలా అన్నీ అన్నీ చేద్దాము .
మంత్రిగారి నినాదాలతో దద్దరిల్లిపోయింది .

అంతలో PA మొబైల్ రింగ్ అయ్యింది . చూసి సర్ సర్ ........ హై కమాండ్ అని స్పీకర్ on చేశారు .
హై కమాండ్ : ఏంటయ్యా .......... చూస్తుంటే కొత్తపార్టీ పెట్టేలా ఉన్నారు - అక్కడంతా జన ప్రభంజనంలా ఉంది . కార్యకర్తలకోసం కృషిచేసే నాయకుడిని ఎలా వదులుకుంటాము - జరిగినదంతా తెలుసుకున్నాము - రెండు గంటల్లో భారీ చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా మారిన మంత్రులతోపాటు ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ కు వచ్చెయ్యండి - వద్దు వద్దు మేమే స్వయంగా వచ్చి తీసుకెళతాము అక్కడికే వస్తున్నాము అని చెప్పారు .
అప్పుడే ఎలా తెలిసింది అనిచూస్తే చుట్టూ మీడియా కవర్ చేస్తోంది . 

మాజీ ........ కాదు కాదు మంత్రిగారు షాక్ లో ఉండిపోవడం - కార్యకర్తల ఆనందానికి అవధులు లేనట్లు మంత్రిగారి నినాదాలతో - ప్రతీ ఇంటి టీవీలలో హైద్రాబాద్ మొత్తం దద్దరిల్లిపోయింది . 
మేడం ......... చెల్లెమ్మ - తమ్ముడు దగ్గరకువెళ్లి , అంతా మా బుజ్జిదేవుళ్ళ వల్లనే అని ముద్దులవర్షం కురిపించారు . ఏమండీ ఏమండీ ........
మంత్రిగారు : ఇంకా నమ్మలేనట్లు PA ను - సర్ ను కౌగిలించుకుని , గంటల్లో ఇక్కడ ఉన్న నన్ను ఎవరెస్టు అంత ఎత్తు చేర్చారు - ఇప్పుడు ఇంకా ఎక్కువ మంచిపనులు చేస్తాను కార్యకర్తలే నా ప్రాణం మీరుణం తీర్చుకోలేనిది అని నాలుగైదుమందిని కౌగిలించుకోవడం చూసి వాళ్ళ ఆనందానికి అవధులులేనట్లు నినాదాలతో హోరెత్తించారు . ఇంతకీ మా బుజ్జిదేవుళ్ళు బుజ్జిదేవుళ్ళు ఎక్కడ అని చెల్లెమ్మ - తమ్ముడి దగ్గరకువెళ్లి మరొక్కసారి ఎత్తుకోవాలని ఉంది తల్లీ ఇస్తారా ? .
చెల్లెమ్మ : సంతోషంగా సర్ - అమ్మా ........ అని బిస్వాస్ ను మంత్రిగారికి - కీర్తి తల్లిని మేడం కు ఇచ్చారు . ముద్దులుపెట్టి తమ పిల్లలకు అందించి కుటుంబం అంతా నాదగ్గరికివచ్చి , మహేష్ మహేష్ ......... మా బుజ్జిదేవుళ్ళ సమక్షంలో ప్రమాణస్వీకారం చెయ్యాలని ఉంది please please కాదనకండి .
నాదేవత వైపు చూస్తే ఆనందానికి అవధులు లేనట్లు మురిసిపోతున్నారు .

PA : సర్ సర్ ......... మీకు ఉన్నఫలంగా మళ్లీ మంత్రిపదవి ఇవ్వడానికి మరొక కారణం అని మొబైల్ లో న్యూస్ చూయించారు .
సౌత్ ఇండియా లో వేలాదిగా కిడ్నప్ కు గురి అయిన అమ్మాయిలను రక్షించిన మహేష్ .......... మంత్రిగారి వెనుక ఉండటం వల్లనే పదవి కోల్పోయిన గంటల్లోనే పెద్ద పదవి మళ్లీ ఆయన చెంతకు చేరడం జరిగిందని పార్టీ హై కమాండ్ చెప్పడం గమనార్హం .
మంత్రిగారు : మహేష్ ......... మీరంతా ఇక్కడ ఉంటారు అని అమాంతం కౌగిలించుకుని please please రావాలి అని బ్రతిమాలారు . 
మేడం : నాదేవత వైపు చూడటం చూసి , ఏమండీ ......... రిమోట్ మహేష్ దేవత చేతుల్లో ఉంది అని దేవతను ఒప్పించారు . 
మంత్రిగారు : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ . PA ........ నా నినాదాలు కాదు ఆడపడుచులను రక్షించిన దేవుడి - బుజ్జిదేవుళ్ళ నినాదాలు అని చెప్పారు .
కార్యకర్తలు మహేష్ - కీర్తి తల్లి - బిస్వాస్ అంటూ నినాదాలతో చుట్టేసి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు .

వరుసగా సెక్యూరిటీ అధికారి వెహికల్స్ వెనుకే ప్రభుత్వ వాహనాలు రావడం - అందులోనుండి పార్టీ అధికారి లోపలికివచ్చారు . మంత్రిగారి చేతిని కలిపి కౌగిలించుకుని ఈ కార్యకర్తలు మరియు కార్యకర్తలు ఎత్తి సంబరాలు చేసుకుంటున్న అదిగో ఆ హీరో మహేష్ వల్లనే మళ్లీ నీ దగ్గరకే మంత్రిపదవి వచ్చింది కంగ్రాట్స్ .......... సమయం లేదు వెళ్ళాలి అన్నారు . 
హలో మహేష్ .......... అంటూ మంత్రిగారితోపాటు పార్టీ అధికారి నాదగ్గరికివచ్చి , ఎంతోమంది కుటుంబాలలో సంతోషాలను నింపినందుకు నా మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చేతులుకలిపారు . రాజకీయాలలో చేరే ఇష్టం ఉంటే చెప్పు పెద్దలసభ ద్వారా నేరుగా మంత్రిపదవి ..........
నాదేవత - బుజ్జాయిలవైపు చూసి సర్ సర్ సర్ ......... జీవితం ఇప్పుడిప్పుడే సాఫీగా వెళుతోంది , అది వదిలెయ్యండి ప్రమాణస్వీకారానికిఆలస్యం అవుతుందేమో ..........
Yes yes yes .......... గవర్నర్ గారిని wait చేయించకూడదు - భారీ చిన్న తరహా పరిశ్రమల మంత్రిగారూ ......... shall we go అన్నారు .
మంత్రిగారు : మహేష్ ......... బుజ్జాయిలను , మా పిల్లలు మా కారులో తీసుకెళ్లే అదృష్టం ఇవ్వు అని అడిగారు .
దేవతవైపు చూసి , అలాగే సర్ అని దేవత దగ్గరకువెళ్లి ఫ్రెండ్స్ చెల్లెమ్మలు చెల్లి సర్ వాళ్ళు అందరమూ వెనుకే బస్ లో ఆ వెనుక లారీలలో కార్యకర్తలు రాజ్ భవన్ చేరుకున్నాము .

పార్టీ అధికారి మరియు మంత్రి గారు స్వయంగా వచ్చి కార్యకర్తలను సైలెంట్ గా ఉండాలని చెప్పి మా అందరినీ లోపలికి పిలుచుకునివెళ్లారు . 
ప్రమాణస్వీకారం చెయ్యబోవు మంత్రులు తమ తమ ఫ్యామిలీలతోపాటు ముందువరుసలలో కూర్చుని ఉండటం చూసి , మంత్రిగారు మేడం పిల్లలతోపాటు మా అదృష్ట బుజ్జిదేవుళ్ళు అంటూ బుజ్జాయిలతోపాటు సంతోషంగా వెళ్లి కూర్చున్నారు .
ప్రమాణస్వీకారం చెయ్యబోవు మంత్రులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుని , బుజ్జిదేవుళ్ళూ........ మీవల్లనే మళ్లీ ఇక్కడ అడుగుపెట్టగలిగాను - మిమ్మల్ని నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను అని అంతులేని ఆనందంతో గర్వపడుతున్నారు . 
మేమంతా ఫస్ట్ టైం రాజ్ భవన్ ప్రమాణ స్వీకారోత్సవ హాల్ లో అడుగుపెట్టిన ఆనందంలో కూర్చున్నాము . నా దేవత నాచేతిని చుట్టేసి ఆరాధనతో నావైపే చూస్తూ పరవశించిపోతున్నారు .
నన్ను ఎప్పుడైనా చూడొచ్చు అక్కడ చూడండి goddess అని పెనవేసిన చేతిపై ముద్దుపెట్టాను . 
దేవత : దేవతకు తన దేవుడిని చూడటమే ఇష్టం ప్రాణం అని నా భుజం పై చేరిపోయి అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు .

కొద్దిసేపటి తరువాత గవర్నర్ గారు రావడం మొదటగా మంత్రిగారినే ప్రమాణం చెయ్యడానికి ఆహ్వానించడంతో భార్య - పిల్లలు - బుజ్జాయిలను సంతోషంతో కౌగిలించుకుని , అందరితోపాటు మా వైపు ఆనందబాస్పాలతో అభివాదం చేసి , స్టేజిమీదకు వెళ్లారు . 
గవర్నర్ గారికి పార్టీ అధికారికి నమస్కరించి మైకు దగ్గరకువెళ్లి ప్రమాణస్వీకారం బుజ్జిదేవుళ్ల మరియు కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేసి చెయ్యడంతో హాల్ మొత్తం లేచి చప్పట్లతో అభినందనలు తెలిపారు . గవర్నర్ నుండి మంత్రి పదవి కాగితాన్ని అందుకునివచ్చి బుజ్జాయిలకు ఇవ్వడం చూసి మా ఆనందం రెట్టింపయ్యింది . 
మంత్రిగారితోపాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం అయిన తరువాత లంచ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ , నేను ....... నా బుజ్జిదేవుళ్ళు కార్యకర్తలతో ప్రారంభోత్సవ ఫంక్షన్ లో తింటామని పార్టీ అధికారికి చెప్పారు . 
ఆ అదృష్టం మాకూ కలిగించండి అని బయటకువచ్చారు . 
లైవ్ మొత్తం తమ తమ మొబైల్స్ లో చూసినట్లు ప్రతీ కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారికి - బుజ్జాయిలకు జయ జయ నినాదాలు చేస్తూనే ఫంక్షన్ చేరుకున్నాము .

అందరూ వచ్చినందుకు సర్ వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు భోజన ఏర్పాట్లు ఘనంగా చేశారు . 4 గంటలకు అందరూ భోజనాలు చెయ్యడంతో మంత్రిగారు సర్ వాళ్లదగ్గరకువచ్చి ఎటువంటి సహాయం కావాలన్నా నేరుగా వచ్చెయ్యండి - ఇక మహేష్ .......... మా బుజ్జిదేవుళ్లను తీసుకుని నైట్ డిన్నర్ కు ఇంటికివస్తే మరింత అదృష్టవంతులమవుతాము . 
మన్నించండి సర్ .......... మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళాలి , మళ్లీ హైద్రాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము డిన్నర్ ఏమిటి ఏకంగా టిఫిన్ లంచ్ డిన్నర్ చేసి వెళతాము . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , శ్రీమతి గారూ - పిల్లలూ ......... మన బుజ్జిదేవుళ్ళతో ఫోటోలు తీసుకున్నారా లేదా ? .
పిల్లలు : బోలెడన్ని నాన్నగారూ ........... ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలా పెద్ద ఫోటో చేయించాలి . 
లవ్ టు లవ్ టు PA ......... గంటలో ఫోటో ఉండాలి . 
Yes sir ........... 
 మేడం - పిల్లలు : బుజ్జాయిలను వెహికల్స్ వరకూ ఎత్తుకునివెళ్లి , బుజ్జిదేవుళ్ళూ ........ మనం ఫోన్ టచ్ లో ఉందాము - మీరు వైజాగ్ చేరేలోపు బోలెడన్ని గిఫ్ట్స్ ఇంటి ముందు స్వాగతం పలుకుతాయి అని ప్రాణమైన ముద్దులుపెట్టి కళ్ళల్లో చెమ్మతో చెల్లికి - తమ్ముడికి అందించి కనిపించేంత దూరం వరకూ టాటా చేస్తూ వెళ్లిపోయారు .

చెల్లెమ్మ : బుజ్జాయిలూ ......... ఫంక్షన్ డబల్ సక్సెస్ అని ముద్దులుపెడుతూ లోపలికివెళ్లారు . 
వాళ్ళతోపాటు సంతోషంతో వెనుకకు తిరుగగానే సర్ వాళ్ళు నలుగురూ అంతే సంతోషంతో నన్ను కౌగిలించుకుని , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ......... కోరుకున్నది ఒక్క కోరిక తీరినది రెండు కోరికలు .
బుజ్జాయిల ద్వారా మరియు నా తల్లి ద్వారా ......... ఈ జీవితానికి ఈ సంతోషం చాలు - మీకోసం ఏమిచెయ్యమంటావు మహేష్ ......... 
సర్ .......... అన్నీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడం కంటే ఏమీ లేనప్పుడు సహాయం చెయ్యడం దైవత్వంతో సమానం - మీరు మాకు చేసినది వెలకట్టలేనిది మా జీవితాంతం మీకు ఋణపడిఉంటాము అని సంతోషంతో లోపలికివచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , ఫ్లైట్ సమయానికి గంట ముందు మళ్లీ వైజాగ్ లో కలుద్దాము సర్ అన్నాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకునే , అన్నయ్యా ......... ఎయిర్పోర్ట్ వరకూ నేనూ వస్తాను .
లవ్ టు చెల్లెమ్మా ......... కానీ నిన్నటి నుండీ ఫంక్షన్ హడావిడిలో తీరిక ఉండదు - ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి . మళ్లీ మీ ఆయనతో వైజాగ్ వచ్చినప్పుడు బుజ్జితల్లిని ఇంటికే తీసుకొస్తాను .
చెల్లెమ్మ : అంతేనా అన్నయ్యా .......... మీరెలా చెబితే అలా అని బుజ్జాయిలను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ బస్ వరకూవచ్చి , చెల్లెళ్లకు అందించి హ్యాపీ జర్నీ వదినా అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
దేవత : లవ్ యు చెల్లీ ......... మనం మళ్లీ కలిసినప్పుడు పండగ చేసుకుందాములే అని నవ్వించి బస్ ఎక్కాము . 
 ట్రాఫిక్ ఎక్కడా లేకపోవడంతో అర గంటలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 5:30 కు బెంగళూరు ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరుగగానే అందరి కళ్ళల్లో చెమ్మ - రేయ్ మామా .......... వీలైనంత త్వరగా లీవ్ చూసుకుని రావాలి అని ఉద్వేగపు కౌగిలింతలతో బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తి ఒక్కొక్కరూ ఒక్కొక్క బుజ్జి టెడ్డి బేర్స్ అందించారు .
అమ్మలూ .......... మిమ్మల్ని చూడాలనుకున్న ప్రతీసారీ ఈ టెడ్డి బేర్స్ చూస్తాను - నాన్నగారూ .......... తొందరగా వెళ్లి మా హైట్ ఉన్న టెడ్డి బేర్స్ తీసుకురండి అని ఆర్డర్ వెయ్యడం - కృష్ణగాడితోపాటు ఎయిర్పోర్ట్ షాప్స్ నుండి నిమిషాల్లో తీసుకురావడం - అమ్మలూ ......... అంటూ బుజ్జాయిలు అందివ్వడంతో ......
ముగ్గురు చెల్లెమ్మలూ ......... మోకాళ్ళపై కూర్చుని మా బుజ్జాయిలను వీటిలో చూసుకుంటాము - ఆఫీస్ కు కూడా తీసుకెళతాము అని గుండెలపై ప్రాణంలా హత్తుకుని వదల్లేక వదల్లేక లోపలికి వెళ్లారు . 

మా ఫ్లైట్ కు ఇంకా 20 నిమిషాల సమయం ఉండటంతో బుజ్జాయిలు బుజ్జి టెడ్డి బేర్స్ హత్తుకుని - దేవత ....... కళ్ళల్లో చెమ్మతో కుర్చీలలో కూర్చున్నారు . 
వారి తియ్యనిబాధను తగ్గించడం ఇష్టం లేక ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి ప్రక్కనే కూర్చున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-01-2021, 10:23 AM



Users browsing this thread: 5 Guest(s)