Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్య : అమ్మలూ ...........ఎయిర్పోర్ట్ కు వచ్చామంటే తమ్ముళ్లు ఎక్కడున్నారో అర్థమైంది . అమ్మకూడా ఉండి ఉంటే ........... అని కళ్ళల్లో చెమ్మతో సునీతమ్మ గుండెలపై చేరారు .
సునీతమ్మ : నవ్వుకుని , అక్కయ్య బుగ్గలను అందుకుని , తల్లీ ......... అక్కయ్య మనసు ఏమిటో నీ తమ్ముడికి తెలియదా ? .
అక్కయ్య : అంటే అమ్మ ...........
సునీతమ్మ : ఎంతో శ్రమించి , స్వయంగా మన govt అమ్మను దుబాయ్ నుండి ఇండియాకు తీసుకొచ్చేలా చేశారు - మా స్నేహితురాలు ల్యాండ్ అయిన తరువాతనే మా దేవత ఎక్కడుందో చెప్పాడు మా బుజ్జిదేవుడు .
అక్కయ్య : అంటే ............
సునీతమ్మ : అక్కయ్య వైజాగ్ లో ఉందని కొద్దిరోజుల ముందే నీ ముద్దుల తమ్ముడికి తెలుసు అని అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అక్కయ్య : తమ్ముడూ .......... అంటూ చెమ్మను సంతోషంగా మార్చుకుని లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ గుండెలపై చేతిని వేసుకుని పరవశించిపోయారు . తమ్ముడూ ......... మాటిచ్చినట్లుగా నీకు నా సర్వస్వాన్ని అర్పించలేకపోయాను - అందుకే నిన్ను - అమ్మను ఒకసారి చూసి మీకు శాశ్వతంగా దూరమైపోతాను అని కన్నీళ్లను అమ్మలకు కనిపించకుండా వెంటనే తుడుచుకుని లోలోపలే అంతులేని బాధను .............

కృష్ణగాడు పర్మిషన్ తీసుకున్నట్లు సెక్యురిటి బస్ లన్నింటినీ నేరుగా బ్యాక్ వే ద్వారా రన్ వే దగ్గరికి పోనిచ్చారు . 
అక్కయ్య : అందరితోపాటు కిందకుదిగి , అమ్మలూ ......... అదే ఫ్లైట్ అని పెద్దమ్మ వైపు చూసారు . 
మరొక అపద్ధం చెప్పలేక తల్లులూ ......... త్వరగా లగేజీ లోపల ఉంచి ఎక్కండి - మీ అమ్మ తన తమ్ముళ్ల గుబడెలపైకి చేరాలి అని నిమిషాల్లో అందరూ ఫ్లైట్ లో సెటిల్ అయిపోయారు . 
అక్కయ్య ........... బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని సునీతమ్మ కాంచనమ్మ సీట్ల మధ్యలో కూర్చుని ఎప్పుడెప్పుడు తమ్ముళ్లను చూస్తానా అని ఆతృత ఉత్సాహం హుషారు అంతులేని ఆనందంతో తనలోతాను చిలిపి ముసిముసినవ్వులు నవ్వుకోవడం చూసి ,
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యను కవ్వించాలి  అని , అమ్మలూ ........ తమ్ముళ్లు ఒక మోస్తారు అందంగానైనా ఉంటారా అని వాళ్ళవైపు కన్నుకొట్టి , ఎందుకంటే మా అక్కయ్య మీ తల్లి అందానికే దేవతలా ఉంటుంది అని పెదాలపై ప్చ్ ........ అని ముద్దుపెట్టారు . 
అమ్మలు : బుజ్జితల్లీ ......... మొదట చూసి మాకే ఏంటి ఇలా ఉన్నాడు అనిపించింది - పొట్టిగా నల్లగా బక్కగా ......... గట్టిగా గాలి విసిరితే ఎగిరిపోయేలా ఉండటం చూసి మాకే బాధవేసింది - ఇన్ని సంవత్సరాలూ ఎక్కడో హైద్రాబాద్ లో కూలీ పని చేసుకుని ఎలాగోలా నెట్టుకొచ్చాడు . చిన్నప్పుడు బుజ్జిదేవుడిలా ప్రాణంలా చూసుకున్నామా ఇప్పుడైతే చూడటానికే అసహ్యం ............ మేమైతే దూరం నుండే పలకరించాము - నీ తమ్ముడు వైజాగ్ రాకపోవడానికి కూడా ఇదీ ఒక కారణం .
అంతే అక్కయ్య కన్నీళ్ళతో మరొకవైపు కోపంతో అమ్మలను కొట్టబోయి లవ్ యు లవ్ యు అమ్మలూ ........... తమ్ముళ్లు ఎలా ఉన్నా నా ప్రాణం కంటే ఎక్కువ - తప్పంతా నాది ఆ శిక్ష నాకు పడాలి - తమ్ముళ్లూ ......... క్షమించండి క్షమాపణకు కూడా అర్హత లేనిదాన్ని అని బుజ్జిఅక్కయ్యను హత్తుకుని విలవిలలాడిపోయారు . 
అమ్మలూ : తల్లీ తల్లీ ........ కొట్టొచ్చు కదరా , 
అక్కయ్య : లవ్ యు అమ్మలూ ........... , తమ్ముళ్లను అలా అనగానే నన్ను నేను మరిచిపోయాను .
సునీతమ్మ : లవ్ యు తల్లీ ........... మళ్లీ బుజ్జిదేవుడిలా మార్చుకుందాములే అని ఓదార్చారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా .......... , ఇదంతా మా అందమైన అక్కయ్యకు అందమైన సర్ప్రైజ్ అందించడానికే అని ప్రాణంలా హత్తుకుని పెదాలపై చిరునవ్వు వచ్చేవరకూ ముద్దులవర్షం కురిపించారు . 

ఇక్కడ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు చూసి నా కళ్ళల్లోనుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి మావయ్యా మావయ్యా .......... మీరు నల్లగా ...... పొట్టిగా అంటే ఇప్పుడున్న హైట్ లో సగం - బక్కగా అంటే ......... అని నవ్వుకుని గిలిగింతలుపెట్టి wow......... అమ్మ మిమ్మల్ని చూడగానే వెంటనే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతారు నన్ను ప్రాణంలా చుట్టేశారు . 
లవ్ యు ఏంజెల్స్ అని ముసిముసినవ్వులతో ముద్దులుపెట్టాను .
ఫ్లైట్ విజయవాడలో ల్యాండ్ అవుతోంది అన్న అనౌన్స్మెంట్ 5 నిమిషాలలో ల్యాండ్ అవడం - అక్కడ రాథోడ్ అదే సమయానికి టేకాఫ్ చెయ్యడం ఒకేసారి జరిగాయి .
ఏంజెల్స్ : మావయ్యా - అమ్మమ్మా ........... మరొక రెండు గంటలలో ఇప్పుడు 5 గంటలు అంటే 7 గంటలలోపు ........... జీవితం లోనే the best moment ఆస్వాదించబోతున్నాము యాహూ యాహూ ........... అంటూ కేరింతలతో అమ్మమ్మా ........... ఊరిలో అడుగుపెట్టే అదృష్టం ఇప్పటికి లభించింది ఎలా ఉంటుందో చెప్పండి అని వెళ్లి చుట్టేశారు .

అమ్మమ్మ .......... స్వాతి - బుజ్జిఅమ్మ చేతులను అందుకుని ఊరి గురించి చెబుతూ కిందకుదిగి బయటకు నడిచారు .
చెల్లి : శ్రీవారూ - అన్నయ్యా ......... లగేజీ తీసుకుని రండి అని ఆర్డర్ వేసి వాడి పెదాలపై ముద్దుపెట్టి చిలిపినవ్వులతో వెళ్లి స్వప్న చేతిని చుట్టేసింది .
ఇద్దరమూ లగేజీ తీసుకుని అమ్మ వాళ్ళ వెనుకే ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . 

జానకమ్మా .......... ఎన్ని సంవత్సరాలకు ఈ అదృష్టం - మీ రాక కోసం మన ఊరు ఊపిరిబిగిపెట్టుకుని వేచిచూస్తోంది అని పెద్దయ్య సంతోషంతో పలకరించారు .
ఏంజెల్స్ - చెల్లి సంతోషించి కళ్ళల్లో చెమ్మతో అదురుతున్న అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించారు .
వెనుక ఉన్న అన్నయ్యలు పరుగునవచ్చి కౌగిలించుకుని లగేజీ అందుకున్నారు . తమ్ముళ్లూ .......... ఎలా ఉన్నారు అని కృష్ణగాడి అన్నయ్య ఉద్వేగానికి లోనవ్వడం చూసి sorry sorry అన్నయ్యా అని కౌగిలించుకున్నాము .
అన్నయ్య : తమ్ముళ్లూ ......... మీరు sorry చెప్పడం ఏమిటి , ఇక నుండీ రోజూ సంబరాలే అని ముగ్గురమూ ఒకేసారి సంతోషంతో గట్టిగా కేకలువేసి ఆనందాన్ని పంచుకున్నాము .
పెద్దయ్యా .......... అంటూ వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాము . 
మహేష్ - కృష్ణా .......... అంటూ ఆనందబాస్పాలతో హత్తుకుని గర్వపడుతున్నారు.
పెద్దయ్యా - అన్నయ్యలూ ........... అమ్మ - చెల్లి - అక్కయ్య మరియు నా ఏంజెల్స్ చివరగా బుజ్జిఅమ్మ అని పరిచయం చేశాను .
పెద్దయ్య : సంతోషించి చల్లగా ఉండండి తల్లులూ అని దీవించారు . 
ఏంజెల్స్ : థాంక్స్ పెద్దయ్యా .......... అని చిరునవ్వులు చిందించారు . పెద్దయ్యా ........ అమ్మమ్మ మన ఊరి గురించి చెప్పారు వెంటనే చూడాలని ఉంది . 
పెద్దయ్య : చాలా సంతోషం తల్లులూ .......... , కానీ జానకమ్మా అప్పటి ఊరు వేరు ఇప్పుడు వేరు మీరే స్వయంగా చూడండి అని కార్ల వైపు చూసారు .
అంతే అటువైపు నుండీ ఇటువైపు వరకూ నిలబడిన కార్స్ డోర్స్ ఒకేసారి ఓపెన్ అయ్యాయి .

అమ్మ - చెల్లి - బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ ......... అవాక్కై అలా చూస్తుండిపోయారు - పెద్దయ్యా .......... ఇన్ని కార్లు .
పెద్దయ్య : సంతోషించి , చెప్పానుకదా తల్లులూ ........... ఇప్పుడు వేరు అని , దీనికే ఇలా అయిపోతే చూడాల్సినవి చూసి ఆనందపడాల్సినవి చాలా ఉన్నాయి అని మావైపు గర్వపడుతూ చూసారు . మహేష్ - కృష్ణ ల వల్ల తల్లులూ ......... ఇంటికి ఒక కార్ , ఇంటి నుండి దగ్గరలోని పొలాలకు కార్లలోనే వెళతాము .
Wow ........ లవ్ యు నాన్నలూ - మావయ్యలూ అని మురిసిపోయారు . 
పెద్దయ్య : తల్లులూ .......... మీకు నచ్చిన కారులో కూర్చోండి , మనం వెళదాము మిగతా కార్లలో మా ఊరి దేవతను తీసుకొస్తారు అనిచెప్పారు .
ఏంజెల్స్ : థాంక్స్ పెద్దయ్యా ........... మేమంతా ఒకే కారులో , ఎందుకంటే మాకూ అమ్మమ్మతోనే ఉండాలని - మీ బుజ్జిదేవుళ్లకు అమ్మమ్మతోనే ఉండాలని .............
పెద్దయ్య : అందరూ ఒకే కారులో ..........
ఏంజెల్స్ : ఇరుకుఇరుకుగా ఒకరిపైమరొకరు కూర్చుంటాము పెద్దయ్యా ......... please please కీస్ ఇవ్వండి .
పెద్దయ్య : మీ ఇష్టం తల్లీ అని మావైపు కీస్ విసిరారు . ఇద్దరమూ ......... క్యాచ్ పట్టకుండా కిందకు వదిలేసాము . 
పరుగునవెళ్లి ఒకచేతితో బుజ్జిఅమ్మను ఎత్తుకుని మరొకచేతితో అమ్మ చేతిని అందుకునివెళ్లి ఢిల్లీలోలా బుజ్జిఅమ్మను ముందు కూర్చోబెట్టి , మేమంతా వెనుక ఇరుక్కుని కూర్చున్నాము - మహి , స్వాతి మాపై కూర్చున్నారు .
కృష్ణ : రేయ్ రేయ్ రేయ్ మోసం రా అంటూనే కిందపడిన కీస్ అందుకుని చెల్లితోపాటు కార్ దగ్గరికివచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు .
చెల్లి : అమ్మా - అన్నయ్యా .......... నేనెక్కడ కూర్చోవాలి . 
ఏంజెల్స్ : అమ్మా ........ మీ శ్రీవారి ఒడిలో ,
చెల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లులూ అంటూ వాడి ఒడిలో కూర్చుని , బుంగమూతి పెట్టుకున్న వాడి పెదాలపై గట్టిగా ముద్దుపెట్టడంతో , ఉత్సాహం వచ్చినట్లు మిర్రర్ లో ఏంజెల్స్ కు లవ్ యు చెప్పి పోనిచ్చాడు . 
మా ముందు రేంజ్ రోవర్లో పెద్దయ్య - వెనుక బోలెరోలో అన్నయ్య ప్రొటెక్షన్ లో  గుంటూరు చేరుకున్నాము . 
రేయ్ మామా ......... కాలేజ్ మీదుగా ఊరికి వెళ్ళమని చెప్పాను . బుజ్జిఅమ్మా - ఏంజెల్స్ .......... అక్కయ్య కాలేజ్ అని చూయించాను .
ఏంజెల్స్ : అంటే ప్రక్కనే ఉన్న స్కూల్ మావయ్యది అంటూ సంతోషంతో కారులో నుండే కాలేజ్ - స్కూల్ వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించారు .
15 నిమిషాలలో గుంటూరు మీదుగా ఊరు వెళ్లే రోడ్ లోకి పోనిచ్చాడు .

ఏంజెల్స్ .......... 20 నిమిషాలలో ఊరికి చెర్ ....... కుంటాము అని ఆశ్చర్యంతో రోడ్ వైపు అలా చూస్తుండిపోయాను .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... మట్టిరోడ్డు అన్నారు - ఇక్కడ చూస్తే హైవే లో వెళుతున్నట్లు ఉంది .
అమ్మ : అవును తల్లీ ........ 

కృష్ణగాడు : 10 నిమిషాల సాఫీ ప్రయాణం తరువాత అదిగో బుజ్జిఅమ్మా ........ ఊరి సింహ ద్వారం అక్కడ నుండీ మన ఊరి పొలాలే .........
బుజ్జిఅమ్మ : wow బ్యూటిఫుల్ నాన్నా .......... పచ్చదనంతో కలకళలాడిపోతున్నాయి అని సంతోషంతో చెల్లి బుగ్గపై ముద్దుపెట్టారు .

రేయ్ మామా ........... రోడ్లు - సింహ ద్వారం .........అని ఆశ్చర్యంగా అడిగాను .
సింహ ద్వారం చేరుకోగానే మావయ్యా మావయ్యా - నాన్నా నాన్నా ........ స్టాప్ స్టాప్ అని ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ సంతోషంతో కేకలువెయ్యడంతో స్టాప్ చేసాడు .
డోర్స్ తీసుకుని అమ్మతోపాటు అందరూ కిందకుదిగి అంతులేని ఆనందంతో ఒకరినొకరు చూసుకుని గెంతులువేస్తూ మురిసిపోతున్నారు . 
సింహ ద్వారం వైపు ఆశ్చర్యంతో చూస్తూ కిందకుదిగాను . 
ఎదురుగా అందరూ ఒకేసారి " వాసంతి ఆదర్శ గ్రామం " అని చదివి మావయ్యా ........... బ్యూటిఫుల్ అని నాదగ్గరికివచ్చి ముద్దులతో ముంచెత్తారు . 
చుట్టూ పొలాల పచ్చదనం - ప్రతీ పొలంలో అత్యాధునిక సేద్యం చెయ్యడానికి అవసరమైన పెద్ద పెద్ద యంత్రాలు , అక్కడక్కడా స్టోరేజ్ బిల్డింగ్స్ నేను ఎలా అయితే మార్చాలని డ్రా చేశానో అచ్చు అలానే ఉండటం ............

చెల్లెమ్మ వచ్చి అన్నయ్యా .......... మీరు ఎలా అయితే ఉండాలని ఆశపడ్డారో అలానే మారిపోయింది కదూ ......... , మీరు డ్రా చేసిన ప్లాన్స్ అన్నింటినీ - అవసరమైన డబ్బును పెద్దయ్యకు - అంకుల్ కు పంపించాడు . మీరు ప్రాణంలా పెట్టిన పేరే " వాసంతి ఆదర్శ గ్రామం " లవ్ యు అన్నయ్యా .......... 
నాకు కాదు చెల్లీ వాడికే చెప్పాలి . లవ్ యు రా మామా ......... అని కౌగిలించుకోబోయాను .
కృష్ణ : అబ్బాబ్బా .......... నేనేమి చేసానురా , సెక్యూరిటీ అధికారి అయ్యి కూడా నీకు తెలియకుండా దొంగతనం చేసి పంపించాను అంతే .
అంటే ......... ఊరిలో ,
కృష్ణ : పెద్దయ్య మాటలు వినిపించలేదా అని సంతోషంతో నన్ను చేతులతో బిగించిపట్టుకున్నాడు .
అందరమూ నవ్వుకుని , గుండెలపై చేతినివేసుకుని తియ్యదనంతో సింహ ద్వారం వైపు చూస్తున్నాము . 

పెద్దయ్య - అన్నయ్య : మహేష్ - కృష్ణ ......... మిమ్మల్ని ఇష్టపడే రెండు ఊర్లు ఇప్పుడు ఒకే ఊరిగా కలిసిపోయాయి . ఒక్కటే గ్రామం దేవత " వాసంతి ఆదర్శగ్రామం " అని గర్వపడుతూ చెప్పారు . మహేష్ .......... నువ్వు డ్రా చేసినట్లుగానే మన అమ్మవారి దేవాలయం - రెండు ఊళ్ళల్లో ఒక్కొక్క అత్యాధునికమైన హాస్పిటల్ - స్కూల్స్ - ఫంక్షన్ హాల్స్ .......... చెప్పడం కాదు మీరే స్వయంగా చూద్దురుగానీ రండి .
సంతోషం పట్టలేక రేయ్ మామా .......... అంటూ ఎత్తబోయి వీలుకాక అన్నయ్యను పిలిచాను .
అందరూ సంతోషంతో నవ్వడం చూసి , లవ్ యు రా మామా అంటూ ఎత్తి సంతోషాన్ని పంచుకున్నాము . 
అమ్మ ఆనందబాస్పాలతో మా బుగ్గలపై ప్రాణంలా స్పృశించి మురిసిపోతున్నారు . అమ్మమ్మా .......... అంటూ అమ్మను హత్తుకుని , మావయ్యలూ ......... అమ్మ మీ నుదుటిపై ప్రతీసారీ ముద్దులుపెట్టడం కష్టమైపోతోంది కాబట్టి మీరే .........
లవ్ టు లవ్ టు అంటూ వొంగి అమ్మ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టాము .
లవ్ యు నాన్నలూ ........... గర్వపడేలా చేశారు అని మా గుండెలపైకి చేరారు . 

అన్నయ్య : తమ్ముళ్లూ .......... సింహ ద్వారం దగ్గర నుండీ మీ ప్రాణమైన అక్కయ్యకు ఘనస్వాగతం పలికేలా అన్నీ ఏర్పాట్లూ చేసాము . చీకటి పడగానే తెలుస్తుంది .
అన్నయ్య చెప్పినట్లుగానే సింహ ద్వారం మరియు అక్కడ నుండీ అల్లంత దూరంలో కనిపిస్తున్న గ్రామం వరకూ లైట్స్ - డెకరేషన్ సెట్ చేసి ఉండటం చూసి , లవ్ యు అన్నయ్యా ........ అంటూ అమాంతం పైకెత్తి తిప్పాము .

అమ్మా అమ్మా ........... ఇక్కడి నుండీ పొలాల అందాలను చూస్తూ నడవాలని ఉంది . 
అమ్మ : నా మనసులోని కోరికనే చెప్పారు అని చిరునవ్వు నవ్వడంతో యాహూ ......... అంటూ కేకలువేశారు . 
ఇద్దరమూ సైగలు చేసుకుని అమ్మ - చెల్లి - ఏంజెల్స్ తోపాటు నడుస్తున్న బుజ్జిఅమ్మను అమాంతం ఎత్తుకుని మా భుజాలపై కూర్చోబెట్టుకుని ఒక్కొక్క చేతిని పట్టుకుని గ్రామం వైపు నడిచాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ .......... అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి , మా ఊరిలో అడుగుపెడుతున్నాము అని నాలుగు దిక్కులకూ వినిపించేలా కేకవేశారు . 
అవును మా ఊరు మా ఊరి పేరు " వాసంతి ఆదర్శగ్రామం " అని బుజ్జిఅమ్మతోపాటు సంతోషంతో కేకలువేసి చిరునవ్వులు చిందిస్తూ గ్రామంలోకి అడుగుపెట్టాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:31 PM



Users browsing this thread: Shiva@123, 71 Guest(s)