Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
రేయ్ మామా ......... నాదేవతను - చాలామంది అమ్మాయిలను వాడి బారినుండి రక్షించడంలో సెక్యూరిటీ అధికారి విశ్వ సర్ సహాయం మరువలేనిది . కాబట్టి శరణాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సర్ ను పిలవాలనుకుంటున్నాను .
రవి : అయితే మొదట అక్కడికే వెళదామురా , సమయం లేదు .
అవునురా ......... ఉదయమే ఆహ్వానించాల్సింది . పిల్లలు బాధలో ఉండటం చూసి మరిచిపోయాను - సర్ అర్థం చేసుకుంటారని ఆశిద్దాము అని బస్ ఎక్కి సెక్యూరిటీ అధికారి కమిషనర్ ఆఫీస్ కు పోనివ్వమనిచెప్పాను . 
15 నిమిషాలలో చేరుకుని , బుజ్జాయిలూ తమ్ముళ్లూ .......... మన శరణాలయం ప్రారంభోత్సవానికి సెక్యూరిటీ అధికారి సర్ విశ్వ గారిని అందరమూ కలిసి వెళ్లి ఆహ్వానిద్దాము .
అలాగే డాడీ - అన్నయ్యా ......... అంటూ మాతోపాటు కిందకుదిగారు . 

ఆశ్చర్యం ......... విశ్వ సర్ మాకోసం బయటే ఎదురుచూస్తున్నట్లు మహేష్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు . 
Hi కీర్తి - hi బిస్వాస్ .......... మిమ్మల్ని కలవాలని చాలారోజుల నుండీ ఎదురుచూస్తున్నాను . నా పేరు విశ్వ సిటీ సెక్యూరిటీ అధికారి మరియు మీ డాడీ ఫ్రెండ్ అండ్ ఫ్యాన్ .......... , సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా మీ డాడీకి ఋణపడిఉంటాము - మా గౌరవాన్ని దేశం నలుమూలలా తెలిసేలా చేశారు - అయ్యో ........ ఇక్కడే మాట్లాడేస్తున్నాను మహేష్ - పిల్లలూ ......... లోపలిరండి . నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడానికే కదా వచ్చినది - మీ మేడం పిల్లలు అప్పుడే రెడీ అయిపోతున్నారు ఇంటిలో ........
ఆశ్చర్యంతో సర్ ........ మీరు మాకోసం బయటే , చీఫ్ గెస్ట్ ....... మీకెలా ........
సర్ : sorry మహేష్ .......... మనం ఎంతమంది రౌడీలను పట్టుకున్నా పుట్టుకొస్తూనే ఉంటారు . వారివలన నీకు ఏమాత్రం హాని కలగకూడదు అని నీకు , కావ్య మేడం గారికి , కీర్తి బిస్వాస్ లకు సీక్రెట్ గా సెక్యూరిటీ అర్రేంజ్ చేసాను . ఆ గోవర్ధన్ వాడి చెంచాలు నిన్ను టచ్ చెయ్యడానికే భయపడతారని నాకు తెలుసు అయినా నా సంతృప్తికోసం ఉంచాను . సో ......... మొత్తం నాకు తెలిసిపోతుంది . 
థాంక్యూ sooooo మచ్ సర్ ........... 
సర్ : ఇప్పుడు కాదు మహేష్ , ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక ఒక్క missed కాల్ ఇచ్చినా సంతోషంగా వస్తాను - ఉదయం నుండీ ఈ దేవుడి పిల్లలకోసం నీ ఆరాటం నేను తెలుసుకుంటూనే ఉన్నాను . ఆ అనాధ శరణాలయం జోలికి ఎవ్వరూ రాకుండా మా సెక్యూరిటీ ఆఫీసర్ల వంతు మేము చేస్తాము please come in అని లోపలికి పిలుచుకునివెళ్లారు .

సర్ : పిల్లలూ ......... ఇవన్నీ మీకోసమే ఎంజాయ్ అని చెప్పారు . 
పొడవాటి టేబుల్ పై కూల్ డ్రింక్స్ , కేక్స్ , ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు ఉన్నాయి . పిల్లలంతా నావైపు చూసారు . 
ఈ క్షణం నుండీ మీకు నేను ఎంతో సర్ కూడా అంతే go on అని చెప్పాను .
అందరూ : థాంక్యూ సర్ , థాంక్యూ సెక్యూరిటీ అధికారి సర్ ......... అని అందుకుని తిన్నారు . 
సర్ ఆనందం చూసి , సర్ ........ వీడు నా చిన్ననాటి స్నేహితుడు రవి .
సర్ : hi రవి , i am విశ్వ .........
సర్ ........ అంతా మీకు తెలుసు 7 గంటలకు ఫంక్షన్ , ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆనందపరచండి - మేడం పిల్లలను పిలుచుకుని రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము .
సర్ : లవ్ టు మహేష్ .......... అంతటి అదృష్టాన్ని కాదు కాదు పుణ్యాన్ని కలిగిస్తున్నావు నేనే నీకు థాంక్స్ చెప్పాలి అని కౌగిలించుకున్నారు . 
థాంక్యూ sooooo మచ్ సర్ ............ 
సర్ : పిల్లల చివరి షాపింగ్ మిగిలిపోయింది అనుకుంటాను ఇక్కడ సమయాన్ని వృధా చెయ్యకండి వెళ్ళండి అని లిస్ట్ జిరాక్స్ చూయించారు . 
సర్ .............
సర్ : నవ్వుకుని , మాల్ దగ్గర బస్ దిగగానే fax వచ్చేసింది . సెక్యూరిటీ ఆపగానే నేనే స్వయంగా బయలుదేరిపోయాను కానీ నిమిషంలో సెల్యూట్ చేసి లోపలికి ఆహ్వానించేలా చేశారు . గుడ్ ...........
మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము సర్ అని చేతులుకలిపి బస్ లో two వీలర్ షోరూం చేరుకున్నాము . 

బుజ్జాయిలకు బుజ్జి బుజ్జి అందమైన సైకిల్స్ ను బుజ్జాయిలు - చిన్న తమ్ముళ్లూ చెల్లెమ్మలకు......... స్పోర్ట్స్ , లేడీ బర్డ్ సైకిల్స్ - పెద్ద తమ్ముళ్లకు వాళ్లకు ఇష్టమైన బైక్స్ - చెల్లెళ్లకు ఇష్టమైన స్కూటీ లను సెలెక్ట్ చేసాము . 
సర్ ......... ప్రస్తుతానికి ఆర్డర్ చేసినన్ని లేవు రెండు గంటలలో అడ్రస్ ఇస్తే డెలివరీ చేసేస్తాము అనిచెప్పారు . 
OK ......... అని మొత్తం బిల్ పే చేసేసి 7 గంటలకల్లా శరణాలయం దగ్గర డెలివరీ ఇవ్వమని నెలనెలా మీరే వచ్చి సర్వీస్ చెక్ చెయ్యాలని ఆ అమౌంట్ కూడా పే చేసేసాము .
ఆఫీస్ రూమ్ నుండి బయటకురాగానే అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ బుజ్జాయిలను ఎత్తుకునే ఆనందబాస్పాలతో హత్తుకున్నారు .
చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ .......... నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే , మీ ఈ పెదాలపై చిరునవ్వులకు ఆనందబాస్పాలకు ఐదుగురు కారణం .

ఫస్ట్ ........ మనం రోజూ పూజించే అమ్మవారు .
సెకండ్ ........ మీ బుక్స్ లో ఉండే పెదరాసిపెద్దమ్మ అని పెదాలపై తియ్యని నవ్వు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ......... అని ప్రేమతో పిలిస్తే చాలు .
థర్డ్ ........ నా దేవత నా సర్వస్వం అని సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలు :  అక్కయ్యలూ ........... డాడీ దేవత ఎవరో తెలుసా అమ్మ . మీకూ వెంటనే చూడాలని ఉంది కదూ , నెక్స్ట్ అక్కడికే వెళుతున్నాములే ........
అందరూ : లవ్ యు లవ్ యు కీర్తి - బిస్వాస్ .......... , అన్నయ్యా ........ తొందరగా తీసుకెళ్లండి అని ముద్దులుపెట్టారు .
ఇక చివరగా ఫోర్త్ ఫిఫ్త్ ఎవరో తెలుసుకదా ...........
అందరూ : బుజ్జిదేవతలు కీర్తి - బిస్వాస్ అని చుట్టూ తిప్పి సంతోషాన్ని పంచుకున్నారు . వెంటనే నాదేవతను చూడాలని బుజ్జాయిలను ఎత్తుకుని బస్ లోకి చేరిపోయారు .

పెదాలపై చిరునవ్వుతో మిగిలిన ఏకైక బ్యాగుతో బస్ ఎక్కి అపార్ట్మెంట్స్ కు పోనివ్వమనిచెప్పాను . 5:30 కి అపార్ట్మెంట్ మెయిన్ గేట్ చేరడం , సెక్యూరిటీ అన్న చూసి గేట్స్ పూర్తిగా తెరవడంతో నాలుగు బస్ లూ నేరుగా వెళ్లి ఫస్ట్ బిల్డింగ్ ముందు ఆగాయి . 
కీర్తి తల్లీ - బిస్వాస్ .......... వెళ్ళండి వెళ్లి అని సిగ్గుపడ్డాను . 
బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తూ వచ్చి లవ్ యు డాడీ అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . ఫ్రెండ్స్ - అక్కయ్యలూ - అన్నయ్యలూ .......... అమ్మ దగ్గరికి వెళదాము రండి , అదిగో బిల్డింగ్ మధ్య ఫ్లోర్ అని కిందకుదిగి పరుగున లోపలికివెళ్లారు . లిఫ్ట్ ద్వారా కష్టమని ఉత్సాహంతో స్టెప్స్ ద్వారానే పైకివెళ్లి ష్ ష్ ష్ .......... అని వాళ్ళ అక్కయ్యల గుండెలపైకి చేరి కాలింగ్ బెల్ నొక్కి , సర్ప్రైజ్ చెయ్యాలి అక్కయ్యలూ .......... మనం మాత్రం వెనుక దాచుకుందాము . 

లోపల : వదినా - అక్కయ్యా .......... అన్నయ్య - బుజ్జాయిలు వచ్చినట్లున్నారు . నాదేవత పెదాలపై మాధుర్యం పరిమళించడంతో అందరూ ప్రేమతో ఆటపట్టించారు . వెళ్ళండి వెళ్ళండి మీరే డోర్ తెరవండి , అన్నయ్య కూడా తన దేవతనే చూడాలని ఆశతో వచ్చి ఉండవచ్చు . 
దేవత : చెల్లెళ్ళూ ......... మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొట్టి , వాళ్ళ ఆర్డర్ ప్రకారమే డోర్ దగ్గరికివచ్చి అందమైన సిగ్గుతో డోర్ తెరిచారు . రియాక్షన్ చూడటానికి వెనుకే చెల్లెమ్మలూ - అపార్ట్మెంట్ చెల్లెళ్ళు చప్పుడుచెయ్యకుండా వచ్చారు .

పట్టుచీరలోని నాదేవతను చూసి అమ్మవారు తమకోసమే తమ సంతోషం కోసమే ఒక దేవతను భువిపైకి పంపించారేమో అన్నట్లు అలా చూస్తూ ఉండిపోయారు . 
సుమారు రెండువందలకు పైనే ఉన్న అందరినీ చూసి నాదేవత పెదాలపై చిరునవ్వుతో , ఒక అందమైన ఫీల్ తో పిల్లలూ .......... ఎవరుకావాలి అని అడిగారు . 
దేవతను చూసి పారవశ్యంలో మైమరిచిపోయినట్లు కన్నార్పకుండా తియ్యని ఫీల్ తో చూస్తున్న అందరినీ చూసి మరింత ఆనందంతో , మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లులూ బుజ్జితల్లులూ ........... ఎవరుమీరు ఎవరు కావాలి అని ఇద్దరి బుజ్జిచేతులను అందుకున్నారు .
దేవత చేతిస్పర్శ స్పృశించినట్లు స్పృహలోకొచ్చి , మీరే కావాలి అమ్మా - మీకోసమే కేవలం మిమ్మల్ని చూడటానికే వచ్చాము అమ్మా అంటూ బుజ్జిబుజ్జిమాటలతో బుజ్జాయిలందరూ నా కాదు కాదు తమ దేవత గుండెలపైకి చేరారు . 
అక్కయ్యా అక్కయ్యా .......... మిమ్మల్ని చూడటానికే వచ్చాము , మిమ్మల్ని చూస్తుంటే అమ్మను చూస్తున్నట్లుగానే ఉంది అని మోకాళ్లపై కూర్చుని బుజ్జి పిల్లలతోపాటు హత్తుకున్నారు . 

బుజ్జితల్లుల అమ్మా ........ అన్న మధురాతి మధురమైన పిలుపుకు - అక్కయ్యా ....... అన్న తియ్యని పిలుపుకు నా దేవత ఆనందబాస్పాలతో పరవసించిపోతోంది. 
 ఇంతమంది అమ్మ అక్కయ్య ........... అని , చెల్లెమ్మలూ చెల్లెళ్ళూ ......... అని అంతులేని ఆనందంతో పిలిచి మురిసిపోతున్నారు . చెల్లెమ్మలూ చెల్లెళ్ళు కూడా కళ్ళల్లో ఆనందపు చెమ్మతో కూర్చుని హత్తుకున్నారు .
బుజ్జాయిలు : యే యే యే .......... అమ్మా అమ్మా అంటూ సంతోషంతో చప్పట్లుకొడుతున్నారు . 
దేవత : వర్ణించలేని మధురానిభూతితో లవ్ యు బుజ్జితల్లీ బిస్వాస్ ....... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
బుజ్జాయిలు : క్యాచ్ పట్టి నవ్వుకుని , అమ్మా అమ్మా ......... మాకు కాదు మీ శ్రీవారికి ఇవ్వండి . 
బుజ్జితల్లులు : అవును అమ్మా , ఇంటిదగ్గర మీరంటే ప్రాణమిచ్చే దేవతలాంటి అమ్మ ఉన్నారు అని పిలుచుకునివచ్చారు . 
లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లులూ  .......... అని ముద్దులుపెట్టి , చుట్టూ చూసారు .
కీర్తి : అమ్మోయ్ .......... ఎంతచూసినా లాభం లేదు , కింద ఉన్నారు . పైకివస్తే ఆలస్యం అవుతుందని తెలిసే అక్కడే ఆగిపోయారు - ఫంక్షన్ తరువాత మీఇష్టం ............. అని చెల్లెళ్లతోపాటు నవ్వుకున్నారు . 
దేవత : బుజ్జితల్లీ ......... అని అందమైన సిగ్గుపడటం చూసి చెల్లెమ్మలు గిలిగింతలుపెట్టారు . 
బుజ్జాయిలు : అమ్మా , అంటీ ......... మిమ్మల్ని వదిలితే రోజంతా నా ఫ్రెండ్స్ ను కౌగిలించుకుంటారు . మనకంటే ముందు చీఫ్ గెస్ట్ వస్తే బాగోదు . 
దేవత - చెల్లెళ్ళు : లవ్ యు తల్లీ ........ , అని ఒక్కొక్కరూ ఒక్కక్క బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికి ఆహ్వానించారు .
కీర్తి తల్లి : వెనుక నుండే ఫ్రెండ్స్ ........ లోపల మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు . అమ్మా .......... చూయించు అని గట్టిగా చెప్పింది . 
దేవత నవ్వుకుని , చేపల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి ఫుడ్ చేతికి అందించారు .
బుజ్జిబుజ్జిచేతులతో చేపలకు వేశారు . ఇంతమంది ఫ్రెండ్స్ అని వాటి ఆనందానికి అవధులు లేనట్లు పైపైకి ఎగురుతున్నాయి . బుజ్జాయిలు ........ అక్వేరియం దగ్గరికివచ్చి బుజ్జిచేపలూ ......... ఇకనుండీ మనమంతా ఫ్రెండ్స్ అని పేరుపేరునా పరిచయం చేసింది . ఇల్లు అంతా చిరునవ్వులతో సందడి సందడిగా ఉండటం చూసి దేవత పులకించిపోయారు . బుజ్జితల్లిని ఎత్తుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో చూస్తే ఏమీ లేకపోవడం చూసి బాధపడ్డారు . 
పెద్దమ్మ : తల్లీ కావ్య ......... నేను లేనూ అని దేవత నుదుటిపై ముద్దు స్పృశించింది.
దేవత : లవ్ యు పెద్దమ్మా ......... అని బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి హాల్లోకి వచ్చిచూస్తే అందరి చుట్టూ ఇష్టమైన స్నాక్స్ ఉండటం చూసి బుజ్జితల్లులూ చెల్లెళ్ళూ .......... తినండి .
అందరూ : అమ్మా - అక్కయ్యా ......... అన్నయ్య బుజ్జాయిల వలన కడుపులో ఖాళీనే లేదు . అయినా కూడా మా అమ్మ - అక్కయ్య ప్రేమతో అందించిన వాటిని కాదనము అని తిన్నారు . 

బుజ్జాయిలు అయితే నిమిషం నిమిషానికీ గడియారం వైపే చూడటం చూసి దేవత నవ్వుకున్నారు . పెద్దమ్మా ......... మన బుజ్జితల్లులు బుజ్జి పట్టు పరికిణీలలో - చెల్లెళ్ళు .......... పట్టు లంగావోణీలలో , తమ్ముళ్లు .......... జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ లలోకి ఫ్రెష్ అయ్యి మారిపోవాలి అని కళ్ళుమూసుకుని ప్రార్థించారు .
కళ్ళుతెరిచిచూస్తే దేవత కోరినట్లుగానే కాకుండా చెల్లెమ్మలతోపాటు తనుకూడా కొత్త పట్టుచీరలలోకి మారిపోవడం చూసి , పెదాలపై చిరునవ్వుతో లవ్ యు పెద్దమ్మా అని తలుచుకుని , బుజ్జాయిలవైపు కళ్ళెగరేశారు .
బుజ్జాయిలు : సూపర్ అంటూ చేతివేళ్ళతో చూయించి , లవ్ యు అమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

దేవత : కృష్ణ - సరయు - రేవతి - చెల్లెమ్మలూ .......... 
రెడీ అక్కయ్యా కాదు కాదు దేవతా ........ అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
దేవత : సిగ్గుపడి ,  బుజ్జితల్లులూ - చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ........... కింద మీ అన్నయ్య వెయిటింగ్ - ఇక్కడ మీ బుజ్జిఫ్రెండ్స్ బుజ్జాయిల ఆత్రం అని నవ్వుకుని , వెళదామా అన్నారు .
వెళదాము అమ్మా - అక్కయ్యా ......... అని బుజ్జాయిలను ఎత్తుకుని అందరూ దేవత చెల్లెమ్మల చుట్టూ చేరి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు . 

చుట్టూ పట్టువస్త్రాలలో బుజ్జిదేవతలు - పట్టుచీరలలో దేవకన్యల్లాంటి చెల్లెళ్ళ మధ్యన పట్టుచీరలో దివి నుండి దిగివచ్చిన దేవతలా అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి , హృదయంపై చేతినివేసుకుని కన్నార్పకుండా ప్రాణంలా అలా చూస్తుండిపోయాను .
నా చూపుల బాణం నాదేవతను తాకినట్లు , నావైపు అంతే ప్రాణంలా అందమైన సిగ్గుపడుతూ వచ్చి లవ్ యు అంటూ పెదాలను కదిల్చి కన్నుకొట్టారు .
అంతే ఫ్లాట్ అయిపోయి రవిగాడిపై పడిపోవడం చూసి చిలిపినవ్వుతో బుజ్జితల్లులతోపాటు బస్ ఎక్కారు . 

కీర్తి : డాడీ ........ కంట్రోల్ కంట్రోల్ , 
చెల్లి నుండి నా బంగారుతల్లిని ఎత్తుకుని విండో ప్రక్కన కూర్చున్న నాదేవతవైపు కోరికతో చూస్తూనే కీర్తి తల్లి బుగ్గను కొరికేసాను .
ముత్యాలు రాలుతున్నాయా అనేంతలా నవ్వుకుని , వారి ఒడిలోని బుజ్జితల్లి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ .......... అంటూ నా బంగారుతల్లిని ప్రాణంలా గుండెలపై హత్తుకుని ఆనందించాను .

కీర్తి : స్స్స్  స్స్స్ ........ అంటూ బుగ్గను రుద్దుకుని , నాన్నా ......... నొప్పి .
నాదేవత మైకంలో ఉన్నట్లు నాదేవతనే చూస్తూ , అవునా .......... తల్లీ అని చేతిపై రుద్దడం చూసి , నాబుజ్జితల్లి తియ్యనికోపంతో నా బుగ్గను కొరికేసింది . 
స్స్స్ .......... బుజ్జితల్లీ ,
కీర్తి : నాన్నా .......... నొప్పి బుగ్గపై , చేతిపై కాదు .
నవ్వుకుని , లవ్ యు లవ్ యు తల్లీ ......... అని కొరికినచోట ప్రాణమైన ముద్దులుపెట్టాను .
కీర్తి : లవ్ యు టూ డాడీ , డాడీ ......... మీ డ్రెస్ సూపర్ - అంకుల్ మీది కూడా .
అదే నాకూ అర్థం కావడం లేదు బంగారూ , సడెన్ గా ఈ డ్రెస్ లలోకి మారిపోయాము . కానీ భలే ఉన్నాయి . 
కీర్తి : నవ్వుకుని , ఇదంతా మీ దేవత వల్లనే అని జరిగినదంతా చెప్పారు . 
అవునా అంటూ నాదేవతవైపు చూసి నా తల్లి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
అపార్ట్మెంట్ చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా .......... సైట్ కొట్టింది చాలు - మీ శ్రీమతి గారంటే మీకు ప్రాణం అని మా అందరికీ తెలుసు - మీ దేవత మాయలో పడి ఫంక్షన్ గురించి మరిచిపోయినట్లున్నారు . 
నో నో నో ......... చెల్లెమ్మలూ , రేయ్ మామా రారా అని నాదేవత బస్ ఎక్కాము . డ్రైవర్ శరణాలయం కు పోనివ్వు అని అడ్రస్ చెప్పాను . తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్న నాదేవతనే చూస్తూ లవ్లీ సారీ అని సైగచేసాను - లవ్ యు శ్రీవారూ అని పెదాలను కదల్చడం చూసి పులకించి నా బంగారుతల్లి ముద్దులను ఆస్వాదిస్తూ చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 31-12-2020, 06:23 PM



Users browsing this thread: 23 Guest(s)