Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మొదటి బస్ లో అమ్మాయిల ఒడిలో కూర్చిని నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న బుజ్జాయిలకు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . 
మొబైల్ తీసి సర్ కు కాల్ చేసి ఆఫీస్ కు రానందుకు sorry చెప్పాను . రాకపోవడానికి కారణం జరిగినదంతా వివరించాను .
సర్ : sooooo sorry మహేష్ ........ మేమేమైనా సహాయం చేయగలమా ? , ఇప్పుడే అక్కడకు వస్తున్నాను అని బాధపడ్డారు .
సర్ ....... everything is fine అని " అమ్మ - నాన్న అనాధ శరణాలయం " గురించి చెప్పాను .
సర్ : సంతోషంతో i know i know మహేష్ .......... కీర్తి - బిస్వాస్ ........ అందరి బుజ్జిదేవతలు . నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మహేష్ ......... , నేను వెంటనే మిమ్మల్ని కలవాలి ...........
సర్ .......... ఒక సహాయం కావాలి . కలవాలా ......... చెప్పండి సర్ ఇప్పుడే వచ్చేస్తాము .
సర్ : ముందు సహాయం అన్నావుకదా అదిచెప్పు .
సర్ .......... సాయంత్రమే శరణాలయం ప్రారంభోత్సవం చెయ్యాలని ఆశపడుతున్నాము .
సర్ : అర్థమైంది మహేష్ .......... అమ్మ - నాన్న శరణాలయాన్ని అందంగా తీర్చిదిద్దాలి అంతేకదా , మన డ్యూటీ అదేకదా మహేష్ మాకు వదిలెయ్యి - జస్ట్ అడ్రస్ చెప్పు అంతే .........
థాంక్యూ so so sooooo మచ్ సర్ ...........
సర్ : నో నో నో మహేష్ , దానికి బదులుగా నువ్వు - బుజ్జాయిలు మాకు పెద్ద సహాయాన్ని చెయ్యాలి .
చెప్పండి సర్ .......... ఏమైనా చేస్తాము - ఎంత కష్టమైనా చేస్తాను .
సర్ : కష్టమైనది కాదు మహేష్ ఇష్టమైనదే , సాయంత్రం ఫంక్షన్ తరువాత చెబుతాను . Got to go ........ అమ్మనాన్న శరణాలయం దగ్గరికి will meet there bye .

రేయ్ కృష్ణా ........ వార్డెన్ సూరితోపాటువెళ్లి సగం డబ్బుతో " అమ్మానాన్న శరణాలయాన్ని " పూర్తి లగ్జరీయస్ గా మార్చాలి . తమ్ముళ్లూ చెల్లెళ్ళు ........ తాము అనాధలు అనే బాధ జీవితంలో కలగకూడదు అలా మార్చేయ్యాలి . ఫర్నీచర్ - బెడ్స్ - సోఫాస్ - ప్రతీ రూంలో హాల్లో AC - టీవీ కంప్యూటర్స్ లాప్స్ ........ అన్నీ అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులను సెట్ చెయ్యాలి . పిల్లలు ......... ఏమాత్రం శ్రమించకుండా తాము కోరుకున్న లక్ష్యాలను సాధించేలా అన్నీ వసతులనూ అర్రేంజ్ చెయ్యాలి . పిల్లలు కోరుకున్న ఫుడ్ వండటానికి వంట మనుషులు - అన్నీ పనులనూ చెయ్యడానికి పనివాళ్ళు 24/7 ఉండాలి . వాళ్ళు కేవలం వాళ్ళ aims గురించే ఆలోచించాలి కష్టపడాలి - స్కూల్స్ కు వెళ్ళాలి అనిచెప్పాను .
కృష్ణ : అర్థమైందిరా మామా , సర్ ను కలిసి ఎంతమంది పనివాళ్ళు దొరికితే అంతమంది సహాయంతో సాయంత్రం లోపు మనం చిన్నప్పుడు ఎలా ఉండాలని కలలుకన్నామో అలా మార్చేస్తాను . అప్పటివరకూ పిల్లలు ..........
మిగతా సగం డబ్బును ఖర్చుచేసివస్తామురా అని ఏమిచెయ్యబోతున్నానో చెప్పాను .
కృష్ణ - సూరి : సూపర్ రా మామా , సాయంత్రం మన డ్రీమ్ శరణాలయం దగ్గర కలుద్దాము - అందరినీ గ్రాండ్ గా ఆహ్వానిస్తాము అని కౌగిలించుకుని వార్డెన్ తోపాటు ముగ్గురూ కారులో వెళ్లారు . 

లవ్ యు రా అనిచెప్పి , రవితోపాటు బ్యాగ్స్ అందుకుని బస్ ఎక్కి షాపింగ్ మాల్ కు పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాను . పిల్లలను నవ్విస్తూ ఎంజాయ్ చేస్తున్న బుజ్జాయిలకు సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ వదిలి ఎదురుగా కూర్చున్నాము .
కీర్తి : డాడీ ....... ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము . శరణాలయం కేనా .........
లేదు బంగారూ .......... , మీ అన్నయ్యలూ అక్కయ్యల బట్టలు వస్తువులన్నీ అక్కడే ఉండిపోయాయి కాబట్టి వారికి అవసరమైన వస్తువులను - బుక్స్ బ్యాగ్స్ - సంవత్సరానికి సరిపడే కొత్తబట్టలు - వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవడానికి ట్రంక్స్ మరియు స్కూల్ కు వెళ్ళడానికి అందరికీ సైకిల్స్ కొనబోతున్నాము .
పిల్లలందరి సంతోషం చూసి అంతులేని ఆనందంతో బుజ్జాయిలు పరుగునవచ్చి లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
లవ్ యు బుజ్జాయిలూ .......... , వాటన్నింటినీ మీరే సెలెక్ట్ చెయ్యాలి - మీ అన్నయ్యలకు అక్కయ్యలకు బుజ్జి ఫ్రెండ్స్ కు ఇంకా ఏమేమి కావాలో అన్నింటినీ కొనివ్వాలి . 
లవ్ టు డాడీ ......... అని మళ్ళీ ముద్దులుపెట్టి , అక్కయ్యలూ అన్నయ్యలూ ......... మనకెమేమి కావాలో లిస్ట్ రెడీ చెయ్యాలి . వాటితోపాటు ఇష్టమైనవి కూడా ఉంటే ఇందులో రాయండి అని నా జేబులోని వైట్ పేపర్ - పెన్ అందించి వాళ్ళ ఒడిలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు . అదిగో ఆ బ్యాగులలో ఉన్న డబ్బంతా మనకోసమే కాబట్టి మోహమాటపడకుండా అన్నింటినీ లిస్ట్ లో చేర్చండి - వెనుక మూడు బస్ లలో ఉన్న వారికోసం కూడా - అప్పుడే మేము హ్యాపీ , డాడీ అంకుల్ వాళ్ళు కూడా హ్యాపీ ..........
లవ్ యు బుజ్జాయిలూ .......... అని నేను రవిగాడు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించాము .
పిల్లలు : అన్నయ్యా .......... 
తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ......... మీ బుజ్జిఫ్రెండ్స్ చెప్పినవన్నీ మరియు మీకు కావాల్సినవి ఇష్టమైనవి అన్నింటినీ బస్ ఆగేలోపు లిస్ట్ రెడీ చెయ్యాలి లేకపోతే ఈ అన్నయ్యలు బాధపడతాము . ఈ డబ్బు అంతా మీకోసమే - మన అమ్మవారి అనుగ్రహం అని బ్యాగ్స్ ఓపెన్ చేసి చూయించాను . మీ సంతోషమే మా సంతోషం please please ...........
అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ బుజ్జాయిలను ఎత్తుకుని లేచివచ్చి కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నారు .
అమ్మో ........ కన్నీళ్లే , ఇకనుండీ కేవలం ఆనందబాస్పాలు మాత్రమే వికసించాలి అని ఆప్యాయంగా హత్తుకుని తమ్ముడూ గిరి లిస్ట్ రాయి అని అందించాను .
అందరూ కన్నీళ్లను తుడుచుకుని , ఇప్పటివరకూ వేటికోసమైతే ఇబ్బందిపడ్డారో వాటన్నింటినీ అందరికోసం చెప్పారు . పేపర్ మొత్తం నిండిపోవడం - బస్ కూడా షాపింగ్ మాల్ ముందు ఆగడంతో చూసి లవ్ యు తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ .........రండి షాపింగ్ మాల్ నే మన శరణాలయానికి కాదు కాదు ఇంటికి తీసుకెళదాము అనిచెప్పి కిందకుదిగాము . రవితోపాటువెళ్లి మూడు బస్ లలోని అందరినీ పిలుచుకునివచ్చాము .

బుజ్జాయిలు ఉత్సాహంతో అన్నయ్యలూ - అక్కయ్యలూ ......... రండి మనం లోపలికివెళదాము , మీ అన్నయ్యలు వెనుకే వస్తారులే అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి ఎంటర్ అవుతుంటే , 
సెక్యూరిటీ ఆపి పిల్లలూ .......... మిమ్మల్ని లోపలకు పంపించలేము - చూడండి ఎలా ఉన్నారో ఒక్కరయినా మంచి డ్రెస్ వేసుకున్నారా ? - మిమ్మల్ని లోపలకు పంపిస్తే మీ మట్టిచేతులతో అన్నింటినీ తాకి మలినం చేస్తారు .
ఆ మాటలకు బుజ్జాయిలకు కోపం వచ్చి చివరి బస్ లోని వాళ్ళను దించుతున్న మాకు వినిపించేలా డాడీ - అంకుల్ ........ అని కోపంతో కేకలువేసి , పిల్లలను లోపలకు పంపించము అని రూల్ ఏమైనా పెట్టారా , అన్నయ్యలూ అక్కయ్యలూ ......... ఎలా లోపలికి పోనివ్వరో చూద్దాము అని సెక్యూరిటీనే బుజ్జిగా దబాయించారు - చుట్టూ పిల్లలందరూ మొదట బాధపడినా బుజ్జాయిల మాటలకు సంతోషించి సెక్యూరిటీ వైపు ఒక అడుగువేశారు అంతే , 
సర్ సర్ ......... అంటూ లోపలికి ఇద్దరు పరిగెత్తారు .

బుజ్జాయిలూ ......... అంటూ నేను - రవి ఇద్దరమూ పిల్లలతోపాటు వడివడిగా చేరుకున్నాము . 
అంతలో సూట్ వేసుకున్నవ్యక్తి విషయం తెలుసుకున్నట్లు కోపంతో వచ్చి , సెక్యూరిటీ .......... ఇలాంటి పిల్లలను లోపలికివదిలితే ఇంకేమైనా ఉందా మన మాల్ మొత్తం స్లమ్ అయిపోతుంది తోసేయ్యండి తోసేయ్యండి - ఒక్కరుకూడా ఒక్కటీ కొనే ఫేస్ లా కనిపించడం లేదు - బట్టలు , బొమ్మలు .......... లోపల ఉన్నవాటినన్నింటినీ టచ్ చేసి చెడగొడతారు - రెండే రెండు నిమిషాల్లో ఒక్కరూ ఉండకూడదు మారాం చేస్తే తోసేయ్యండి .

రేయ్ మామా ......... విన్నావా తోసేస్తారట , టచ్ చెయ్యమను నెక్స్ట్ మినిట్ వొళ్ళంతా కట్లతో హాస్పిటల్లో పడతారు . అంతే సెక్యూరిటీ మరొక అడుగువెయ్యలేదు . 
సూట్ వ్యక్తి : చూడండి మాల్ కు చాలామంది వస్తారు - ఇలాంటి మాసిపోయిన బట్టలతో ఉన్న పిల్లలను చూస్తే మా బిజినెస్ పాడవుతుంది . మీరు తీసుకునే ఒక్క డ్రెస్ షాపింగ్ కోసం మేము అంత బిజినెస్ వదులుకోలేము దయచేసి పిల్లలందరినీ తీసుకెళ్లిపోండి .
మీరే కాదులే ప్రసత సమాజంలో చాలామంది ఇలానే ఆలోచిస్తున్నారు . బిజినెస్ ............ 
రవి : రేయ్ మామా .........నువ్వేమి చెప్పబోతున్నావో నాకు అర్థమైంది నాకు వదిలెయ్యి . సూట్ వ్యక్తి గారూ ......... మీరు మాల్ కు ఏమవుతారు .
సూట్ వ్యక్తి : మేనేజర్ ..........
రవి : మేనేజర్ గారూ ......... అంటూ ధీర్ఘం తియ్యడంతో పిల్లలందరూ నవ్వుకున్నారు . వాడు నవ్వుకుని మేనేజర్ ........ ఈరోజు వద్దులే ఇంకా మాల్ ఇప్పుడే తెరిచి ఉంటారు , నిన్న మొత్తం మీ బిజినెస్ ఎంత జరిగింది .
మేనేజర్ : 5 lakhs అని గర్వపడుతూ చెప్పాడు .
అంతేనా అన్నట్లు బుజ్జాయిలు నవ్వుకున్నారు .
రవి : నవ్వుతూనే బుజ్జాయిలను ఎత్తుకుని , ఒక్కరోజుకు 5 లక్షలు అంటే వారానికి 35 lakha అంతేకదా .........
మేనేజర్ : అంతే ..........
రవి : మేము అదే అదే మీరు తోసేయ్యాలనుకున్న పిల్లలు ఈరోజు ఒక్కరోజే దానికి మూడింతలు అంటే కోటి రూపాయలపైనే షాపింగ్ చేయబోతున్నారు - నేను మాటలు ఆపేలోపు సెక్యూరిటీతోపాటు నువ్వుకూడా మా పిల్లలందరికీ సెల్యూట్ చేసి లోపలికి వదిలితే నీకే మంచిది లేకపోతే సిటీలో నీ ఒక్క షాపింగ్ మాల్ మాత్రమే లేదు ............
నలుగురు తమ్ముళ్ళువెళ్లి బస్ లోనుండి బ్యాగ్స్ తీసుకొచ్చి మేనేజర్ ముందు ఉంచారు .
బిజినెస్ మనిషి కదా బ్యాగులోపల ఎమున్నాయో స్కాన్ చేసినట్లు వెలిగిపోతున్న కళ్ళతో సెల్యూట్ చేసి please please welcome సర్ పిల్లలూ అని వేసుకోవడం చూసి , సెక్యూరిటీ అందరూ సెల్యూట్ చేస్తూనే దర్జాగా దారి వదిలారు .
పిల్లలందరూ సంతోషంతో థాంక్స్ లవ్ యు అన్నయ్యలూ .......... అని చిందులువేసారు . బుజ్జాయిలు ....... రవిగాడి బుగ్గలపై ముద్దులుపెట్టి లవ్ యు డాడీ అని మురిసిపోయారు .
రవి : తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ......... మీఇష్టం షాపింగ్ మాల్ మొత్తం షాపింగ్ చెయ్యాలి . బుజ్జితల్లీ - బిస్వాస్ .......... మీరే దగ్గరుండి ఒక్కరూ కూడా మోహమాటపడకుండా షాపింగ్ చేసేలా చూడాలి . గుర్తుందికదా మీ డాడీ చెప్పినట్లు సంవత్సరానికి సరిపడే .............
బుజ్జాయిలు : ఇక మాకు వదిలెయ్యండి అంకుల్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , కిందకుదిగారు . వాళ్ళ అక్కయ్యల చేతులను అందుకొని లోపలికి బుజ్జిబుజ్జిపరుగులుతీశారు . 
బ్యాగులను అందుకోబోతుంటే , సెక్యూరిటీ అని కేకవేశాడు . సర్ sorry సర్ ........ మీరు రండి అని ఆహ్వానించాడు . వెనుకే సెక్యూరిటీ బ్యాగులను తీసుకునివచ్చారు .

రీసెంట్ గా బుజ్జాయిలను పిలుచుకునిరావడం వలన , మొత్తం తెలిసినట్లు తమ్ముళ్లను బాయ్స్ సెక్షన్ కు - చెల్లెళ్లను గర్ల్స్ సెక్షన్ కు పంపించి - వాళ్ళ బుజ్జి ఫ్రెండ్స్ ను స్వయంగా కిడ్స్ సెక్షన్ కు తీసుకెళ్లారు . మేడమ్స్ .......... అందరికీ సెపరేట్ సెపరేట్ గా వాళ్లకు ఇష్టమైనవి సంవత్సరానికి సరిపడేలా అన్నిరకాల డ్రెస్ లను చూయించండి - ఇక్కడ లేకపోతే వెంటనే తెప్పించండి . మా బుజ్జిఫ్రెండ్స్ , అన్నయ్యలు , అక్కయ్యలు చాలు అంటారు అయినాకూడా మీరే ప్రేమతో ఒప్పించాలి అని మూడు ప్లేస్ ల దగ్గరికివెళ్లి మళ్లీ మళ్లీ చెప్పారు . OK నా డాడీ - అంకుల్ .............
లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము . 
బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళ ప్రియమైన అక్కయ్యల దగ్గరికివెళ్లి , అక్కయ్యలూ ......... సెలెక్ట్ చేసుకున్న కొత్తడ్రెస్ తోపాటువెళ్లి అదిగో అక్కడ ఉన్న ట్రయల్ రూమ్స్ లలో చేంజ్ చేసుకునిరండి అనిచెప్పి పంపించారు . తమ బుజ్జిఫ్రెండ్స్ ను అయితే స్వయంగా పిలుచుకునివెళ్లారు .
చెల్లెళ్ళు - తమ్ముళ్లు ......... గ్రూప్ గ్రూప్ లుగా వెళ్లడం చూసి , మేనేజర్ వచ్చి మూడు పెద్ద సేఫ్టీ రూమ్స్ చూయించడంతో నిమిషాల్లో అందరూ కొత్త డ్రెస్ లోకి మారిపోయి ఏంజెల్స్ లా బయటకువచ్చారు .
ఇప్పుడు ok నా మేనేజర్ గారూ అని కీర్తి తల్లి అడిగింది .
Sorry sorry ......... అంటూ తలదించుకున్నారు .
సూపర్ బుజ్జితల్లీ - బిస్వాస్ ........ అంటూ సంతోషంతో గట్టిగా విజిల్స్ వేశాము . 
బుజ్జాయిలు : అన్నయ్యలూ - అక్కయ్యలూ - ఫ్రెండ్స్ .......... ఒక్కనిమిషం కూడా మీరు రెస్ట్  తీసుకోవడానికి లేదు మనం ఇంకా చాలా షాపింగ్ చెయ్యాలి , కావాలంటే రేపు మొత్తం రెస్ట్ తీసుకుందాము .
బుజ్జాయిల బుజ్జిబుజ్జిమాటలకు మాకు నవ్వు ఆగడం లేదు . 
బుజ్జాయిలు : డాడీ - అంకుల్ ........ అలా నుంచోబోతే వచ్చి హెల్ప్ చెయ్యొచ్చుగా అని ఆర్డర్ వేశారు .
లవ్ టు లవ్ టు బుజ్జాయిలూ .......... అని పరుగుతీసి , తమ్ముడితో ఉన్న లిస్ట్ చూసి అందరికీ స్కూల్ కు వెళ్ళడానికి ఏమేమి అవసరమోతాయో బుక్స్ , పెన్స్ , పెన్సిల్స్ , జామెట్రీ , బ్యాగ్స్ ........... అన్నింటినీ విడివిడిగా బాక్స్ లలో ప్యాక్ చేయించాము . లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటే షాపింగ్ చేసాము . మాల్లో ఉన్న పిజ్జా హట్ చేరుకుని సుమారు 200 మంది పిల్లలకు మెనూలోని ఐటమ్స్ అన్నింటినీ లంచ్ కోసం రెడీ చేయించండి అని ఆర్డర్ చేసాము. 

మధ్యాహ్నం 12 గంటలకల్లా .......... పిల్లల డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ స్కూల్ డ్రెస్సెస్ షాపింగ్ అవ్వడంతో , సంతోషంతో కేకలువేసి బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తారు . 
బుజ్జాయిలు : అక్కయ్యాలూ ........ అప్పుడే అయిపోలేదు రండి అని షాపింగ్ డ్రెస్సెస్ ను కౌంటర్ కు పంపించి , టాయ్స్ సెక్షన్ కు తీసుకెళ్లారు . వాళ్ళ అక్కయ్యలకు వాళ్ళ సైజ్ కు తగ్గ ఇష్టమైన టెడ్డి బేర్స్ - బుజ్జి ఫ్రెండ్స్ కు బుజ్జి టెడ్డి బేర్స్ - వాళ్ళ అన్నయ్యలకు ఇష్టమైన బొమ్మలను షాపింగ్ చేశారు . అందరూ ....... వాళ్ళకిష్టమైన బొమ్మలను చిరునవ్వులు చిందిస్తూ హృదయాలకు హత్తుకుని లవ్ యు కీర్తి - బిస్వాస్ ........ అనిచెప్పడంతో - బుజ్జాయిల ఆనందాలకు అవధులు లేకుండా పోయి పరుగునవచ్చి మాగుండెలపై చేరిపోయి లవ్ యు లవ్ యు డాడీ - అంకుల్ ......... అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . అక్కయ్యలూ ........ నెక్స్ట్ .......... నో నో నో ........ ఆకలేస్తోంది , అక్కయ్యలూ అన్నయ్యలూ లంచ్ చేద్దామా .........
పిల్లలందరూ ఆకలిగా ఉన్నట్లు ఒక్కసారిగా వాళ్ళ కళ్ళల్లో చెమ్మచేరింది . అధిచూసి బుజ్జాయిల కళ్ళల్లో చెమ్మచేరి కిందకుదిగివెళ్లి అక్కయ్యలూ - అన్నయ్యలూ - ఫ్రెండ్స్ ........ మోహమాటపడొద్దని డాడీ - అంకుల్ ముందే చెప్పారుకదా అని హత్తుకున్నారు .
బుజ్జితల్లీ ......... తప్పు మాదే షాపింగ్ గురించి ఆలోచించాము కానీ అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , బుజ్జాయిలూ ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ అని అందరినీ పిజ్జా హట్ కు తీసుకెళ్లి , వరుసగా మెనూ కార్డ్ లోనివన్నింటినీ తీసుకురండి అనిచెప్పాము . గంట ముందే ఆర్డర్ చెయ్యడం వలన ఒవేన్ నుండి వేడివేడిగా అన్నిరకాల పిజ్జా - అన్ని రకాల బర్గర్ సాండ్ విచ్ , కోక్స్ , ఫింగర్ చిప్స్ తోపాటు అన్నిరకాల స్నాక్స్ ........... పిల్లలందరికీ సర్వ్ చేశారు .
అన్నింటినీ కొత్తగా ఇష్టంగా చూసి బుజ్జాయిలకు లవ్ యు చెప్పి టేస్ట్ చేసి ఇష్టంతో తిన్నారు డ్రింక్స్ తాగారు . డాడీ - అంకుల్ ......... మీకు అని బుజ్జాయిలు తీసుకొచ్చి అందించి మేము మా ఫ్రెండ్స్ తోపాటు తింటాము అని చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు . పిల్లలందరూ తృప్తిగా తిని పెదాలపై చిరునవ్వులతో బుజ్జాయిలకు ముద్దులతో సంతోషాన్ని పంచుకున్నారు . 
కీర్తి : డాడీ ....... ఇక్కడ అయిపోయాయి , మళ్లీ .......... అనేంతలో వాళ్ళ అక్కయ్యలు నోటిని వేలితో ఆపి చాలు చాలు బుజ్జితల్లీ ......... చూడు కడుపు నిండిపోయాయి అని చూయించడంతో నవ్వుకుని , డాడీ .......... కొద్దిసేపటి తరువాత షాపింగ్ లో ఉండగా ఐస్ క్రీమ్స్ , కేక్స్ , చాక్లెట్ లు ......... బోలెడన్ని తెప్పించండి .
లవ్ యు బంగారూ .............

చెల్లెళ్ళు - తమ్ముళ్లూ : కీర్తి - బిస్వాస్ ......... ఫుల్ గా తినేసాము , నడవడం కూడా వల్ల కావడం లేదు .
బుజ్జాయిలు : నవ్వుకుని అక్కయ్యలూ .......... మీరు మాల్ లోని కుర్చీలలో కూర్చుని ఆర్డర్ వెయ్యండి - మేము డాడీ అంకుల్ మీకిష్టమైనవన్నీ షాపింగ్ చేస్తాము అని చేతులను పట్టుకుని నడిపించారు . డాడీ - అంకుల్ ........ లిస్ట్ ప్రకారం నెక్స్ట్ స్కూల్ కు వేసుకెళ్లడానికి షూస్ - రన్నింగ్ షూస్ - డైలీ use స్లిప్పర్స్ ...........
Yes yes ......... బుజ్జితల్లీ , అదిగో అటువైపు కూర్చునే షాపింగ్ చెయ్యవచ్చు అని పిజ్జా హట్ బిల్ పే చేసేసి , foot wear సెక్షన్ కు తీసుకెళ్లాము . అక్కయ్యలూ ........... డిస్ప్లే లోకూడా ఉన్నాయి మీఇష్టం మీకిష్టమైనవి తీసుకోండి . చాలా చాలా costly నే చూయించండి అని సేల్స్ బాయ్స్ కు చెప్పారు . నెక్స్ట్ రెండు గంటలలో లిస్ట్ లోనివన్నింటినీ షాపింగ్ చేసేసి , డాడీ - అంకుల్ finished .......... అంటూ సంతోషాన్ని పంచుకున్నారు .
ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఒక్కొక్క పర్వతంలా ఉండటం చూసి మాల్ కు వచ్చేపోయేవాళ్ళంతా ఆశ్చర్యపోతుండటం చూసి అందరమూ ఎంజాయ్ చేసాము.

మేనేజర్ అయితే ఇలాంటి షాపింగ్ తన మాల్ హిస్టరీలో చూడనట్లు అంతులేని ఆనందంతో మాదగ్గరికివచ్చి , పిల్లలూ .......... మీతో అలా ప్రవర్తించకూడదు I am really really sorry - సర్ ......... చెప్పినట్లుగానే షాపింగ్ చేశారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . అడ్రస్ చెబితే వెంటనే డెలివరీ చేస్తాము అనిచెప్పారు. 
 " అమ్మా నాన్న అనాధ శరణాలయం " అని అడ్రస్ ఇచ్చాను .
మేనేజర్ : అనాధ పిల్లలకోసం ........ సెల్యూట్ సర్ .
అనాధలు కాదు మా తమ్ముళ్లు - చెల్లెళ్ళు .......... మా ప్రాణం అని సాలిడ్ క్యాష్ పే చేసి 4 గంటలకు బయటకువచ్చాము . అంతలో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ - కేక్స్ ........... డెలివరీ రావడంతో తింటూ బస్ ఎక్కారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 31-12-2020, 06:22 PM



Users browsing this thread: 25 Guest(s)