Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
కృష్ణవేణి : అన్నయ్యా .......... మేము - కాలింగ్ బెల్ కూడా మేమే కొట్టాలి , మా వదినను మేమే పరిచయం చూసుకుంటాము అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ టు చెల్లెళ్ళూ .......... అని వెనుకకు వచ్చాను .
సరయు : వెనుక కాదు అన్నయ్యా , ఇక్కడ గోడ వెనుకాల దాక్కోండి - మా వదిన మిమ్మల్ని చూస్తే మమ్మల్ని కనీసం చూడనైనా చూస్తారో లేదో .
కీర్తి తల్లి : నిజమే అంటీ ......... , మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా పట్టించుకోరు అని నవ్వుకున్నారు .
పెదాలపై చిరునవ్వుతో డోర్ ప్రక్కన నిలబడ్డాను .
మా మంచి అన్నయ్య , మీ బ్లడ్ అంతా ఒక్కటేనా హీరోస్ అని వాళ్ళ లవర్స్ వైపు కన్నుకొట్టారు చెల్లెళ్ళు . ముగ్గురూ ఒకేసారి కాలింగ్ బెల్ నొక్కి త్వరగా త్వరగా ...... అంటూ ఆతృతతో డోర్ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు .

లోపల : మొదటి కాలింగ్ బెల్ వినిపించగానే , ఇంటిలోని ఇష్టమైన ఫోటోలను - కప్ బోర్డ్ లోని కొత్తబట్టలను చెల్లెళ్లతోపాటు సర్దుతున్న దేవత డోర్ తెరవడానికి రూమ్ నుండి హాల్ లోకివచ్చారు .
చెల్లెళ్ళు : అక్కయ్యా .......... మేము ఉన్నాముకదా , మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమని అన్నయ్య చెప్పలేదా ఉండండి అని డోర్ తెరవడానికి అడుగులువేశారు .
అంతలో మరొకసారి కాలింగ్ బెల్ మ్రోగడంతో చెల్లెళ్ళూ ......... ఎవరో ఏమో అని కంగారుపడుతూనే ముందుకువచ్చారు . 
అక్కయ్యా - చెల్లెళ్ళూ ......... అని వాదులాడుతూనే చిరునవ్వులు చిందిస్తూ అందరూ కలిసి డోర్ తెరిచారు .

లోపల చెల్లెళ్ళు : ఆయ్ ............ బుజ్జాయిలు ఉమ్మా ఉమ్మా ......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
నాదేవత మాత్రం నాకోసం కళ్ళతోనే స్కాన్ చేస్తున్నారు .
పట్టుచీరలో చిరునవ్వులు చిందిస్తూ దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్న నాదేవతను చూసి బయట చెల్లెళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు .
కీర్తి : అంటీ ........ అమ్మను చూసి ఫ్లాట్ అయిపోయారా ? అని చెవులలో గుసగుసలాడి ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళు తేరుకుని wow లవ్లీ బ్యూటిఫుల్ .......... బహుశా దేవలోకంలో దేవతలు ఇలానే ఉంటారేమో అని బుజ్జాయిలను లోపలి చెల్లెళ్లకు అందించి వదిన వదిన వదిన ......... కాదు కాదు దేవత అంటూ అడుగు ముందుకువేసి కౌగిలించుకోవచ్చా .......... ఆగలేకపోతున్నాము తరువాత కావాలంటే తిట్టండి కొట్టండి అని ఇష్టంతో మూడువైపుల నుండీ కౌగిలించుకున్నారు . 
బుజ్జాయిలు : అమ్మను చూడగానే మమ్మల్ని మరిచిపోయారు కదూ ..........
కృష్ణవేణి : లవ్ యు బుజ్జాయిలూ .......... , ఒక్కసారిగా దేవతను చూడగానే ప్రపంచాన్నే మరిచిపోయాము . ముద్దులు పెట్ట ........... పెట్టకుండా ఉండలేకపోతున్నాము అని నాదేవత బుగ్గలను ముద్దులతో ముంచెత్తారు .

నాదేవత - లోపలి చెల్లెళ్ళు .......... ఆశ్చర్యపోయి , ఎవరు బుజ్జాయిలూ అని కళ్ళతోనే అడిగారు .
వదిన మేము మేమే పరిచయం చేసుకుంటాము . వీళ్ళు ముగ్గురూ కృష్ణ ..........
దేవత : సూరి - రవి .......... , వదినా అని ప్రాణంలా పిలుస్తున్నారు అంటే ముగ్గురి హృదయాలను కొల్లగొట్టిన దేవకన్యలు .
అందరితోపాటు నేనూ షాక్ ............
దేవత : మహేష్ ఫ్రెండ్స్ అని చేతిలోని ఫోటోలను మరియు డైరీ ని చూయించారు .
కృష్ణవేణి : మహేష్ .......... , వదిన వదినా ......... అలా కాదు మీరు ప్రేమతో పిలుస్తారే అలా please please please .
దేవత : అందమైన సిగ్గుతో నా దేవుడి ఫ్రెండ్స్ .
సరయు : ఊహూ .......... మరొక చిలిపి పలకరింపు కావాలి please please వదినా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మా శ్రీవారి ఫ్రెండ్స్ .
యే యే యే ........... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని అమాంతం నాదేవతను పైకెత్తి సంతోషాన్ని పంచుకున్నారు . 

నా పేరు కృష్ణవేణి - సరయు - రేవతి అని పరిచయం చేసుకుని , ముగ్గురూ దేవతతోపాటు డోర్ వైపు తిరిగి అన్నయ్యా అన్నయ్యా .......... అని పిలవడంతో , నా దేవత ముందుకువచ్చాను .
ఇద్దరమూ దూరమై నిమిషాలే అయినా యుగాలు గడిచినట్లు ఒకరినొకరం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం చూసి , 
wow how రొమాంటిక్ అని నాదేవత బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , వెళ్ళండి వదినా .......... పాపం అన్నయ్య మరొక్క క్షణం కూడా ఆగలేడు అని వాళ్ళ వాళ్ళ లవర్స్ చేతిని చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .

కళ్ళల్లో తియ్యని చెమ్మతో నా గుండెలపైకి చేరిపోయారు . విశ్వాన్ని గెలిచినంత సంతోషంతో నాదేవత బుగ్గలను అందుకుని కొద్దిసేపే కదా అయినది అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
దేవత : ఏమో నాకదంతా తెలియదు ఒక్కొక్క క్షణం ఒక యుగంలా గడిచింది అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
రేవతి : వదినా ........ అన్నయ్య ముద్దుపెట్టారు కదా మీరూ .........
దేవత అందమైన సిగ్గుతో నా బుగ్గపై ముద్దుపెట్టి , గుండెల్లో తలదాచుకున్నారు . అయ్యో ......... లవ్ యు లవ్ యు శ్రీవారూ , మీ ప్రాణస్నేహితులను పలకరించను కూడా పలకరించలేదు మీరైనా కొప్పుడొచ్చు కదా అని నన్ను వదిలి ఇంటిలోపలికి ఆహ్వానించారు .
ఫ్రెండ్స్ : ఇలా మిమ్మల్ని చూడటానికి మాకు ఇన్నాళ్ల సమయం పట్టింది . ఆ అదృష్టాన్ని మానుండి దూరం చెయ్యకండి - మీ దేవుడిని అలాగే కౌగిలించుకోవడం చూస్తూ ఎంతసేపైనా ఉండిపోతాము . వాడు మిమ్మల్ని ఎంతలా ఆరాధించాడో ఇక మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను - ఆ సంగతుల డైరీ మీ చేతులలో ఉంది . వీడు మిమ్మల్ని ఆరాధిస్తే మీరు ఏకంగా వాడి రక్తం పంచుకున్న బుజ్జాయిలతోసహా వాడి గుండెలపైకి చేరారు - అదృష్టవంతుడివిరా మామా ....... మన అమ్మవారు అనుగ్రహిస్తే ఇలానే ఉంటుందేమో అని వారి ఏంజెల్స్ నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టారు .
అవునురా ........ మన అమ్మవారు నాదేవతతోపాటు బుజ్జిదేవతలను కూడా ప్యాకేజీగా ఇచ్చారు అని అందరమూ సంతోషంగా నవ్వుకున్నాము . తియ్యదనంతో నవ్వుతున్న నాదేవత నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నాను .

బుజ్జాయిలు : అంటీ అంటీ ....... , అమ్మానాన్నలు ఒకరికౌగిలిలో మరొకరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అని నవ్వుకుని , చెల్లెళ్లను పరిచయం చేసి డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి , చెల్లెళ్ళు తెచ్చిన టిఫిన్ వడ్డించారు .
ఫ్రెండ్స్ - చెల్లెళ్ళు : రాత్రి కూడా తినలేదు లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... , ఈ ఆనందాన్ని చూసాముకదా ఇక తృప్తిగా తింటాము వడ్డించు వడ్డించు అని తిన్నారు .

చివరి రూంలో నా మొబైల్ రింగ్ అవ్వడంతో ఇద్దరమూ పెదాలపై చిరునవ్వులతో తేరుకున్నాము . లవ్ యు లవ్ యు goddess అని పెదాలపై ముద్దుపెట్టడం చూసి అందరూ సంతోషంతో నిట్టూర్పులు వదిలారు . 
కీర్తి తల్లి లోపలికి పరుగుతీసి నాన్నగారూ అనాధ శరణాలయం వార్డెన్ నుండి అనుకుంటాను అని లిఫ్ట్ చేసి నాకు అందించింది . 
నా గుండెలపై పెదాలను తాకించి అల్లుకుపోయిన నాదేవత చుట్టూ చేతినివేసి , వార్డెన్ ......... ఎలా ఉన్నారు . మీదగ్గరికే ............
వార్డెన్ : మహేష్ మహేష్ ......... అంటూ కంగారుపడుతున్నారు . 
వార్డెన్ ......... ఏమి జరిగింది , ఎందుకు ఏడుస్తున్నారు , పిల్లలు బాగున్నారు కదా అని కంగారుపడుతూ అడిగాను .
నాదేవత కూడా నన్ను వదిలి ఏమిటన్నట్లు కంగారుతో నా కళ్ళల్లోకే చూస్తున్నారు . బుజ్జాయిల కళ్ళల్లో కన్నీళ్ళతో నా పాదాలను చుట్టేశారు . చెల్లెళ్ల పెదాలపై చిరునవ్వు మాయమై నాదేవత చుట్టూ చేరారు . 
రేయ్ మామా మామా ......... ఏమైందిరా అని కంగారుపడుతూ అడిగారు .

వార్డెన్ చెబుతున్నది విని కళ్ళల్లో చెమ్మతో స్పీకర్ on చేసాను .
వార్డెన్ : మహేష్ ......... మన శరణాలయాన్ని పడగొట్టేస్తున్నారు - శరణాలయం స్థలంలో ఫ్యాబ్ సిటీ కట్టబోతున్నారు - పిల్లలంతా నిరాశ్రయులుగా ఏడుస్తూ రోడ్డుపై నిలబడ్డారు - ఎవరికి కాల్ చెయ్యాలో తెలియక నీకు కాల్ చేసాను . 
వార్డెన్ ......... మన శరణాలయాన్ని పడగొట్టడానికి ఎవరికి అధికారం ఉంది - మీరు చెప్పారుకదా ఒక మహానుభావుడు ఆ స్థలాన్ని శరణాలయానికి ఇచ్చేసారు అని .
వార్డెన్ : అవును మహేష్ , ఆ మహానుభావుడు బ్రతికి ఉన్నంతవరకూ ఎవరి కన్నూ శరణాలయం పై పడకుండా చూసుకున్నారు - కొన్నిరోజులక్రితం ఆయన స్వర్గస్థులయ్యారు ఇప్పుడు ఆయన మనవళ్లు వచ్చారు . 
వార్డెన్ .......... మా తాతయ్య అయినదానికీ కానిదానికీ ధానాలు చేసి ఉన్నదంతా ఊడ్చేశారు . ఇప్పుడు మాకు మిగిలినది ఈ విలువైన స్థలం ఒక్కటే - ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టలేదు మాకూ భార్య పిల్లలు ఉన్నారు దయచేసి అడ్డురాకండి అని పిల్లలను బయటకు పంపించేసి మొత్తం కూల్చేశారు . 

వార్డెన్ ......... మనం కోర్ట్ కు వెళదాము .
వార్డెన్ : ఫలితం లేదు మహేష్ , మనదగ్గర లేని పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి . మనదగ్గర అన్నాకూడా వాళ్ళకే ఇచ్చేసేవాడిని - ఇన్ని సంవత్సరాలు పిల్లలు ఉండటానికి ఆశ్రయం కల్పించినవారే అడ్డుపడకండి అని వేడుకున్నారు అని బాధపడుతూ చెప్పారు . మహేష్ ......... ఏమిచెయ్యాలో నాకు అంతుపట్టడం లేదు పిల్లలంతా కట్టుబట్టలతో ఎండలో నిలబడి ఏడుస్తున్నారు .
వార్డెన్ ......... మీరు కంగారుపడకండి నిమిషాలలో అక్కడ ఉంటాము . పిల్లలు జాగ్రత్త . మనకు ఆ అమ్మవారే దారి చూయిస్తారు .

దేవత : స్వామీ ......... తొందరగా వెళ్ళండి . ఈ డబ్బుతో ఇక జీవితంలో పిల్లలు రోడ్డుపైకి రాకుండా చెయ్యండి - " అమ్మ నాన్న అనాధ శరణాలయం " ప్రతీ దేవుడి బిడ్డకూ ఆశ్రయం కల్పించేలా మార్చేయ్యండి అనిచెప్పారు . స్వర్గంలో ఉన్న అమ్మా నాన్నలు చాలా సంతోషిస్తారు .
లవ్ యు goddess ........... అని ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టి , చెల్లెమ్మలూ ........ జాగ్రత్త , బుజ్జాయిలూ లెట్స్ గో అని కన్నీళ్లను తుడిచి ఎత్తుకున్నాను - రేయ్ ......... అదిగో మనీ బ్యాగ్స్ వాటికి మోక్షము కలిగే సమయం ఆసన్నమైనది తీసుకురండి అని బయలుదేరాము .

రేయ్ కృష్ణా అని కీస్ వాడివైపు విసిరి , బుజ్జాయిలను ఎత్తుకుని ముందుసీట్లో కూర్చున్నాను . వెనుక సూరి రవి కూర్చున్నారు .
బుజ్జాయిలు : ఇంకా కంగారుపడుతూనే నా షర్ట్ ను చిరిగిపోయేలా పట్టుకుని , కృష్ణ అంకుల్ త్వరగా పోనివ్వండి అనిచెప్పారు . 
కృష్ణ : అలాగే బుజ్జాయిలూ అని గేట్ దాటగానే రోడ్డులో వేగంగా పోనిచ్చాడు .
బుజ్జాయిలను ముద్దులతో ఓదార్చి , మొబైల్ తీసి ట్రావెల్స్ కు కాల్ చేసి వెంటనే నాలుగు బస్ లను శరణాలయం అడ్రస్ కు పంపించమనిచెప్పాను .

15 నిమిషాలలో శరణాలయం చేరుకున్నాము . అప్పటికే జేసీబీ లు పూర్తిగా శరణాలయాన్ని నేలమట్టం చేసేసాయి . బుజ్జాయిల కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు - ఎదురుగా పిల్లలందరూ ఏడుస్తుండటం చూసి హృదయం చలించిపోయింది . బుజ్జాయిలూ .......... మీ అన్నయ్యలు అక్కయ్యలు ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లండి అని కార్ దిగి కిందకుదించాము . బుజ్జాయిలిద్దరూ ఏడుస్తూనే పరుగునవెళ్లారు . 
కీర్తి - బిస్వాస్ ........ అంటూ పిల్లలు ఏడుస్తూ ఎత్తుకున్నారు . 

జేసీబీ .......... అమ్మవారి విగ్రహం మరియు చెట్టుని కూల్చబోతుంటే , నలుగురమూ .......... పరుగునవెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకోగానే , పురాతనమైన వృక్షం బాధపడుతున్నట్లు సౌండ్స్ చేస్తూ నేలకొరిగింది . నలుగురమూ ........... బరువైన విగ్రహాన్ని భక్తితో ఎత్తుకుని బయటకువచ్చి కారులో జాగ్రత్తగా ఉంచాము . 
కళ్ళముందే జీవితం అనుకున్న శరణాలయం నేలమట్టం అవ్వడం చూస్తున్న వార్డెన్ బాధను ఎవ్వరూ అంచనా వెయ్యలేరు .
నలుగురమూ ........... దగ్గరకువెళ్లి వార్డెన్ మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా మాకు తెలియడం లేదు - మీరు మన అనాధ శరణాలయం సాధించడం కోసం ఎంత దూరమైనా వెళదాము అనిచెప్పిఉంటే ..........
వార్డెన్ : వద్దు మహేష్ - కృష్ణ , మనం వాళ్లకు ఎంతగానో ఋణపడిపోయాము . వాళ్లే మనల్ని అర్థించారు - ఎలా లేదని చెప్పగలము . ఇప్పుడు నా ఆలోచన అంతా పిల్లల గురించే కట్టుబట్టలతో ఇలా నిరాశ్రయులుగా మిగిలిపోయారు - అయినా కూడా నేనేమీ చెయ్యలేకపోతున్నాను .
వార్డెన్ .......... మేము లేము అనుకున్నారా ? . మన అనాధ శరణాలయం హ్యాపీగా ఉంటేనే మేము మనం హ్యాపీగా ఉండగలం . మనం భక్తితో పూజించే అమ్మవారి అనుగ్రహమేమో ఉదయమే మన బుజ్జాయిల వంశపారంపర్యంగా వస్తున్న బిల్డింగ్ ను " అమ్మ - నాన్న అనాధ శరణాలయం " పేరుమీద మార్పించేశారు - బుజ్జాయిలూ .......... డాకుమెంట్స్ ను వార్డెన్ కు అందివ్వండి అనిచెప్పాను .

బుజ్జాయిలు : అన్నయ్యలూ - అక్కయ్యలూ .......... ఒక్క నిమిషం అని ఎత్తుకున్నవారి కన్నీళ్లను తుడిచి కిందకుదిగి , సూరి అందించిన పత్రాలను వార్డెన్ కు అందించారు . 
వార్డెన్ : షాక్ లోనే బుజ్జాయిల నుండి డాకుమెంట్స్ అందుకుని చూసి , మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుని థాంక్స్ చెప్పారు . పిల్లలూ ........... మీ ప్రియమైన కీర్తి - బిస్వాస్ ......... తమ పెద్ద బిల్డింగ్ ను అనాధ శరణాలయంలా మార్చేశారు . పేరు విన్నారు కదా ..........
పిల్లలు : " అమ్మ - నాన్న అనాధ శరణాలయం " అని కన్నీళ్లను తుడుచుకుని సంతోషంతో వచ్చి మోకాళ్లపై కూర్చుని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టారు . 
అంతలో బస్సెస్ రావడంతో , అన్నయ్యలూ - అక్కయ్యలూ .......... ఆ బస్సెస్ లోనే మనం అక్కడికి వెళ్లబోతున్నాము రండి రండి అని చేతులను అందుకుని బస్ లలోకి తీసుకెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 31-12-2020, 06:22 PM



Users browsing this thread: 2 Guest(s)