Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నెక్స్ట్ డే ఉదయం మధుర మీనాక్షి అమ్మవారి గుడికి చేరుకున్నాము . గుడికి నాలుగువైపులా ఒకేలా ఉన్న అత్యద్భుతమైన శిల్ప కళతో ఓకేవిధంగా ఉన్న గోపురాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాము . ఏ గోపురం ద్వారం గుండా అయితే వెళ్ళామో అక్కడికే తిరిగి వచ్చేలా ప్రతి గోపురానికీ ఒక్కో గుర్తుఉండటం తెలుసుకున్నాము . 
అమ్మవారిని ప్రార్థిస్తూ లోపలికివెళ్లి దర్శించుకున్నారు అక్కయ్య . ఒక్కొక్క అమ్మవారిని పూజించి బయటకువచ్చిన అక్కయ్యలో ఆనందం అంతకంతకూ రెట్టింపు అవుతూనే ఉంది . మధ్యాహ్నం వరకూ మీనాక్షి అమ్మవారి సన్నిధిలోనే ఉండి అక్కడి నుండి నేరుగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . చీరలను అన్నింటినీ ప్లేన్ లోకి మార్చేశారు . రాథోడ్ ........ పైలట్ డ్రెస్ తీసుకురావడంతో బస్ లోనే మార్చుకుని దర్జాగా ప్లేన్ ఎక్కి అక్కయ్య ముందే తెలియకుండా కాక్ పిట్ లోకి చేరిపోయాను . అక్కయ్య వెనకున్న ఏంజెల్స్ నవ్వు ఆగడం లేదు .

రాథోడ్ ..........నెక్స్ట్ kolkata .
రాథోడ్ : sure మహేష్ ........... అని ఆ రోజు నైట్ kolkata చేరుకుని నెక్స్ట్ రోజు కలకత్తా కాళీ అమ్మను మరుసటి రోజు వారణాసి చేరుకుని కాశీ విశాలాక్షి అమ్మవారిని , మరుసటి రోజు ముంబై చేరుకుని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అక్కయ్య మొక్కుని తీర్చుకున్నారు . 

అక్కయ్య : పెద్దమ్మా ......... ఎవ్వరూ తీర్చలేని కోరికను తీర్చారు అని కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి ......... , చెప్పానుకదా నీ కోరికను తీర్చినది వేరొకరు ఉన్నారు - అతి త్వరలోనే కలుసుకోబోతున్నావులే ఈ లవ్ యు అన్నింటినీ ఆ ప్రాణమైనవాడికి చెప్పు అని ఓదార్చి , తల్లీ ......... ఇప్పుడు సంతోషమేనా అని అడిగారు .
అక్కయ్య : మీతో కాబట్టి చెబుతున్నాను పెద్దమ్మా , మరొక్క చిన్న కోరిక మిగిలిపోయింది తీరుస్తారా .........
పెద్దమ్మ : లవ్ టు లవ్ టు తల్లీ ......... , అంతకంటే అదృష్టమా అని అక్కయ్యకు తెలియకుండా నాకు కాల్ చేశారు .
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా అదీ అదీ అని చెప్పారు . 
పెద్దమ్మ : అలాగే తల్లీ ......... నీ సంతోషమే మా సంతోషం ఇప్పుడే తిరుపతి బయలుదేరుదాము .

తప్పకుండా తప్పకుండా వెళ్లాల్సిందే నీ సంతోషమే మా సంతోషం అని ప్రాణంలా హత్తుకుని ఇప్పుడే తిరుపతి బయలుదేరుదాము . అందరి దగ్గరకూ వెళ్లి తల్లులూ .......... ఇప్పటికే ఇంటికి దూరంగా చాలారోజులు ఉన్నాము , మీ వాసంతి తిరుమల స్వామివారిని కూడా దర్శించుకోవాలని ఆశపడుతున్నారు . 
అంటీ వాళ్ళు : దేశమంతా తిరిగి మన తిరుమల ఏడు కొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకోకుంటే ఎలా అని ఆనందపడ్డారు . 
పెద్దమ్మ : బుజ్జాయిలూ మీరేమంటారు .
బుజ్జాయిలు : యాహూ ......... తిరుపతి లడ్డు అంటే మాకు ప్రాణం . ఆ లడ్డు తినడం కోసం మా అమ్మతోపాటు తిరుపతి వెళ్లి మొక్కి మరీ ప్రసాదం తింటాము అని బదులిచ్చారు .
అక్కయ్య : లవ్ యు బుజ్జితల్లులూ ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ , లవ్ యు అక్కయ్యలూ చెల్లెళ్ళూ ......... అని కౌగిలించుకున్నారు .

అక్కయ్య కోరిక ప్రకారం తత్కాల్ లో అందరికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసాడు . మధ్యాహ్నం భోజనం చేసి ముంబై నుండి తిరుపతి చేరుకున్నాము . 
అక్కయ్య : పెద్దమ్మా ......... అప్పుడు సరిగ్గా ఇదేసమయానికి తిరుపతి చేరుకుని గోవిందరాజస్వామి సత్రంలో విశ్రాంతి తీసుకున్నాము . ఇప్పుడు కూడా .........
పెద్దమ్మ - అంటీ వాళ్ళు : సంతోషంగా తల్లీ ........, ఆ రోజు తమ్ముడిని ప్రసాదించు స్వామీ అని ఎలా అయితే దర్శనం చేసుకున్నావో అలానే దర్శించుకోవాలని ఆశపడుతున్నావని తెలుసు తల్లీ ........ అలాగే కానివ్వు , నీ వెనుక సంతోషంగా వస్తాము .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా , లవ్ యు అక్కయ్యలూ ......... అని పరవశించిపోయారు .

సత్రంలో ఫ్రెష్ అయ్యి బస్ లలో బయలుదేరాము . మధ్యలో చెల్లి మెడికల్ స్టోర్ దగ్గర ఆపించి మెడిసిన్ తీసుకుంది . 
అలిపిరి చేరుకునేసరికి నెమ్మదిగా చీకటి పడుతోంది . 
అక్కయ్య : బుజ్జాయిలూ .......... మీరు బస్ లోనే తిరుమలకు వెళ్లిపోండి . మైసూర్ లోలా కాదు ఏడుకొండలు ఎక్కాలి , మా బుజ్జాయిల బుజ్జి కాళ్ళు నొప్పి పుడతాయి .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా ......... , మా అమ్మలతోపాటు మెట్లు ఎక్కడమే మాకు ఇష్టం . మధ్యమధ్యలో జింకలు కనిపిస్తాయని స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు. Please please ........ అమ్మా మేమూ మీతోపాటు నడుస్తాము . మా బుజ్జికాళ్ళు నొప్పి పుడితే తగ్గించడానికి మీరు ఉన్నారు - డాక్టర్ కృష్ణ అమ్మ కూడా ఉన్నారు అని బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడటంతో ,
అందరూ నవ్వుకుని గుండెలపై హత్తుకుని మురిసిపోయారు .

విద్యుత్ కాంతుల వెలుగులో చల్లని వాతావరణంలో చుట్టూ అందరితోపాటు గోవింద నామస్మరణతో తొలి మెట్టుని మొక్కి ఎక్కడం మొదలెట్టారు అక్కయ్య .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ కిందకు దించండి నేనూ నడుస్తాను .
అక్కయ్య : నా బుజ్జిచెల్లిని ఎత్తుకునే ఏడుకొండలూ ఎక్కుతానని మొక్కుకున్నాను. మన తమ్ముడు కోసం మాకు ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిచెల్లిని సంతోషంగా గుండెలపై హత్తుకుని ఎక్కుతాను . పైనున్న స్వామినే నాకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు అని గోవింద గోవింద ........ మా తమ్ముళ్లూ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని భక్తితో ప్రార్థిస్తూ అందరితోపాటు ఉత్సాహంగా ఎక్కుతున్నారు . 
బుజ్జాయిలు మరింత ఉత్సాహంతో మెట్లకు రెండువైపులా జింకల కోసం చూస్తూ ఎక్కడం చూసి అందరూ నవ్వుకున్నాము .

చెల్లి : రే ......... నో నో నో భక్తి భక్తి శ్రీవారూ , అన్నయ్యా ........ అక్కయ్య చివరి మెట్లు .
అవును చెల్లీ ..........
చెల్లి : మరేమీ పర్లేదు అన్నయ్యా .......... , కావాల్సిన మెడిసిన్ తీసుకున్నాను .
లవ్ యు చెల్లీ అని కురులపై ముద్దుపెట్టాను . నేను ....... బుజ్జిఅమ్మ చేతిని - వాడు బుజ్జిమహేష్ చేతిని పట్టుకుని వెనుకే ఎక్కాము .

అర్ధరాత్రి అవుతున్నా ఎక్కడా జింకలు కనిపించకపోవడంతో బుజ్జాయిలు నిరాశ చెందుతున్నారు . అమ్మా పెద్దమ్మా ......... అంటూ కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నారు.
బుజ్జాయిల కోరిక తీర్చాలి అన్నట్లు కొండపై వెలసిన దేవుడే అనుగ్రహించినట్లు వెలుగు ఎక్కువగా ఉన్న చోట అడవిలోనుండి బుజ్జాయిలను పిలుస్తున్నట్లు సౌండ్స్ చేస్తూ రావడం చూసిన బుజ్జిఅక్కయ్య , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... అంటూ వేలితో చూయించింది . 
అక్కయ్యావాళ్ళు ఆనందించి బుజ్జిచెల్లీ ......... నువ్వూ నీ ప్రియమైన ఫ్రెండ్స్ తోపాటు వెళ్లు అని ప్రాణమైన ముద్దుపెట్టి కిందకు దించారు .

ఈ సందర్భం కోసమే తమ్ముళ్లు కూరగాయలు తెచ్చినట్లు బుజ్జాయిలకు అందించారు .
లవ్ యు అన్నయ్యలూ ......... అని బుజ్జి బుజ్జి చేతులతో అందించి ఆనందిస్తుండటం చూసి అందరి ఆనందానికి అవధులు లేవు . ఏంజెల్స్ వీడియో ఫోటోలు తీసి సంతోషించారు .
బుజ్జాయిల తనివితీరేంతవరకూ అందరమూ కాసేపు రెస్ట్ తీసుకుని ఎక్కడం మొదలెట్టాము .

తెల్లవారుఘామున చివరి మెట్లు చేరుకున్నాము . చెల్లి - ఏంజెల్స్ ........ మా చేతులను గట్టిగా నలిపేస్తున్నారు . 
అక్కయ్య : చెల్లీ ........ అంటూ పిలిచి బుజ్జిఅక్కయ్యను అందించారు . 
చెల్లి : అక్కయ్య మొక్కుకు అడ్డుపడటం ఇష్టం లేక జాగ్రత్త అక్కయ్యా అని బుజ్జిఅక్కయ్యను స్వాతికి అందించి అక్కయ్య ప్రక్కనే మోకాళ్లపై కూర్చుంది . 
అక్కయ్య : చెల్లీ ........
చెల్లి : మీరు మీ అమ్మ తమ్ముళ్ల కోసం - నేను ....... మా అక్కయ్య తమ్ముళ్లు అమ్మకోసం ........ అని ప్రాణంలా కౌగిలించుకుంది .
అంతే నా ఏంజెల్స్ కళ్లల్లో చెమ్మ - కృష్ణ గాడి కళ్ళల్లో ఆనందబాస్పాలు చేరాయి .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా ........ అని కిందకు దిగి ఇద్దరికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి మధ్యలో నిలబడింది .

అక్కయ్య - చెల్లి పెదాలపై చిరునవ్వులతో మధ్యలో ఉన్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి మోకాళ్లపై ఒక్కొక్క మెట్టుని ఉత్సాహంతో ఎక్కుతున్నారు . ఒక్కొక్క మెట్టుకూ బుజ్జిఅక్కయ్య ........ అక్కయ్య చెల్లీ బుగ్గలపై ముద్దులుపెట్టడంతో , మరింత శక్తి వచ్చినట్లు నొప్పిని మరిచిపోయి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఏంజెల్స్ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతులను చుట్టేసి భుజాలపై తలలువాల్చి ఎక్కుతున్నారు . మిగతావాళ్ళంతా స్వామిని ప్రార్థిస్తూ ప్రక్కనే ఎక్కుతున్నారు . 

4 గంటల సమయంలో మోకాళ్లపై చివరి మెట్టుకూడా ఎక్కేసి బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతుల సహాయంతో లేచి నిలబడి దేవుడికి మొక్కి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి అందరూ హమ్మయ్యా అనుకున్నారు . వాసంతి - కృష్ణ ....... నొప్పిగా ఉందా ? , ఏవీ నువ్వు తెచ్చిన మెడిసిన్ అని అడిగారు .
అక్కయ్య - చెల్లి నవ్వుకుని బుజ్జిఅక్కయ్యను ఒక్కొక్క చేతితో ఎత్తుకుని , మా బుజ్జిచెల్లి - తల్లి ముద్దులతోనే మందు రాసింది కదా అని ముద్దులతో ముంచెత్తారు.

అమ్మలూ ......... అంటూ ఏంజెల్స్ ఇద్దరి గుండెలపై చేరిపోయి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని సంతోషం పట్టలేక బుగ్గలను కొరికేశారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి సూర్యోదయం కంటే ముందే దేవుడిని దర్శించుకుంటుందాము . తొలి కోరికలు త్వరగా తీరుతాయి . 
అక్కయ్య : అవును నిజమే పెద్దమ్మా .......... తమ్ముడు కావాలని కూడా ఇదే సమయంలోనే కోరిక కోరుకున్నాను అని గోవింద నామస్మరణలతో గుడిలోపలికివెళ్లి స్వామివారిని దర్శించుకుని తమ్ముళ్లు అమ్మ మరియు నా బుజ్జిచెల్లి సంతోషంగా ఉండాలని ప్రార్థించారు . స్వామీ ......... జీవితంలో తొలి కోరికను తీర్చారు మళ్లీ ఇప్పుడే కోరుతున్నాను తమ్ముళ్లను ఒక్కసారి ఒకే ఒక్కసారి చూయించు అని కళ్ళల్లో చెమ్మతో ప్రార్థించి బయటకువచ్చి బుజ్జాయిలకు ఇష్టమైన స్వామివారి లడ్డూలను కోరినన్ని తీసుకున్నారు .

సాయంత్రం వరకూ ఆకాశ గంగ , కపిల తీర్థం , మ్యూజియం , స్వామి నేషనల్ పార్క్ .......... దర్శించి కిందకు దిగి రైల్వే స్టేషన్ చేరుకున్నాము . సేమ్ ప్లాట్ ఫార్మ్ - సేమ్ ట్రైన్ చూడగానే అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు ధారలా కారిపోతున్నాయి . 
తమ్ముడూ తమ్ముడూ ......... అని తలుచుకుంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని సేమ్ ప్లేస్ లో కూర్చున్నారు . 
బుజ్జిఅక్కయ్య ముద్దులతో ఓదారుస్తున్నారు .
అక్కయ్య బాధను చూసి తట్టుకోలేక కృష్ణగాడితోపాటు వెళ్లి నిజం చెప్పేయాలనుకున్నాము .

ఇంతలో అప్పట్లో మా వయసు ఉన్న ఒక తమ్ముడు ఇడ్లీ వడ అంటూ అమ్ముకుంటూ రావడం చూసి , అక్కయ్య తన కన్నీళ్లను తుడుచుకుని బాబూ అని ఆప్యాయంగా పిలిచారు . ఆ పిల్లవాడిని ప్రక్కనే కూర్చోబెట్టుకొని పేరు మరియు తన కుటుంబం గురించి తెలుసుకుని నవ్వుతూ పలకరించారు . బాబూ ......... స్కూల్ కు వెళ్లి చదువుకోవచ్చు కదా అన్నారు .
పిల్లాడు : నాకూ ఇష్టమే అండీ , అందుకే నేను పనిచేస్తూ నా చెల్లిని చదివించుకుంటున్నాను అని చిన్న మొబైల్లో అమ్మ చెల్లి అని చూయించాడు .
అక్కయ్యలు చలించిపోయి బుజ్జిచెల్లీ ........ వీటన్నింటినీ మనమే కొనుక్కుందామా అని అడిగారు . 
బుజ్జిఅక్కయ్య : అవును అక్కయ్యా , ఆ డబ్బుతో తన చెల్లితోపాటు ఈ అన్నయ్య కూడా చదువుకోవాలి . 
అక్కయ్య .......... కన్నీళ్ళతో మౌనంగా ఉండిపోయారు .

కృష్ణగాడు ........ పెద్దమ్మకు అమౌంట్ అందించడంతో , పెద్దమ్మ పరుగునవెళ్లి అక్కయ్య చేతిలో డబ్బు ఉంచారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ ఇప్పుడు కొనండి ఒక్కొక్క పొట్లం లక్ష రూపాయలు .
పిల్లాడు : ఒక్క పొట్లం 20 రూపాయలు మాత్రమే అండీ .
బుజ్జిఅక్కయ్య : అన్నయ్యా ......... ఇంట్లో ఉన్న మా బుజ్జిఅక్కయ్యతోపాటు మీరూ చదువుకోవాలి . మా అక్కయ్య కోరిక తీరాలి అని 10 పొట్లాలకు 10 లక్షలను అక్కయ్య చేతులమీదుగా ఇప్పించింది .
అంతే అక్కయ్య ఉద్వేగానికి లోనై బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని బాబూ ........ చెల్లితోపాటు బాగా చదువుకో అని ఆనందబాస్పాలను తుడుచుకున్నారు .
పెద్దమ్మ ఒక పేపర్ పై నెంబర్ రాసిచ్చి ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యమని చెప్పారు .

పిల్లాడు : బాగా చదువుకుంటాను అండీ ......... , మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను , ఈ ఫోన్ నెంబర్ నా గుండెల్లో ఉండిపోతుంది అని ముగ్గురికీ దండం పెట్టాడు . 
ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చేన్తవరకూ అక్కయ్యలు చిరునవ్వులు చిందిస్తూ పిల్లాడితో సరదాగా గడిపారు . 
అక్కయ్యలు : బాబూ వెళ్ళొస్తాము జాగ్రత్త ఇక ఇంటికివెల్లు అని కవర్లో డబ్బు జాగ్రత్తగా ఉంచారు .
పిల్లాడు : మీరు వెళ్లేంతవరకూ ఉంటాను అండీ అని చెప్పడంతో ,
అక్కయ్యలు ఆనందించి వెళ్ళొస్తాము , నీ నెంబర్ ఉందిలే అని అందరితోపాటు ట్రైన్ ఎక్కి టాటా చేశారు . 

బుజ్జిచెల్లీ .......... ఎందుకో ఇప్పుడు మనసు తేలికగా ఉంది లవ్ యు చెల్లీ - లవ్ యు పెద్దమ్మా .......... అని కౌగిలించుకుని చూస్తే సేమ్ నెంబర్ గల బెర్త్ , పెద్దమ్మా .......... ఇక్కడే ఇక్కడే తమ్ముడిని కలిశాను అని కూర్చుని ఆ మధురమైన స్మృతులను బుజ్జిఅక్కయ్య పెద్దమ్మతో షేర్ చేసుకుంటూ ఒకవైపు సంతోషం మరొకవైపు బాధతో ప్రయాణం సాగించారు . 
ఉదయం 2 గంటలకు అక్కయ్య హృదయం వేగంగా కొట్టుకోవడం తెలిసి బుజ్జిఅక్కయ్య.......... అక్కయ్య కళ్ళల్లోకి చూసింది . 
అవును బుజ్జిచెల్లీ ......... మన ప్రాణమైన ఊరు కదా , గుంటూరు లో ట్రైన్ ఆగింది. ఇక మిగిలిన కోరిక ఒక్కటే తమ్ముళ్లతో కలిసి మన కులదైవం అమ్మవారిని దర్శించుకోవడం - బుజ్జిచెల్లీ ........ వెళితే తమ్ముళ్లతోనే అని గట్టిగా హత్తుకుని కన్నీళ్లను కారుస్తూనే నిద్రలోకి జారుకున్నారు . 10 గంటలకు ట్రైన్ వైజాగ్ చేరుకుంది .

అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తనవలన ఎవ్వరూ బాధపడకూడదని కన్నీళ్లను తుడుచుకున్నారు . బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కిందకుదిగి అక్కయ్యలూ - శోభ ......... మన ఇంటికి వెళదాము రండి అని బయటకువచ్చారు. అప్పటికే వదినలు కార్లు తీసుకునిరావడంతో ఇంటికి చేరుకున్నాము . 
అప్పటికే రాథోడ్ పట్టుచీరలన్నింటినీ అన్నయ్యల సహాయంతో ఎయిర్పోర్ట్ నుండి ఇంటిపైకి చేర్చి ఉండటం చూసి అందరూ సంతోషంతో పైకివెళ్లి చూస్తున్నారు . అక్కయ్య కూడా మేడం వాళ్ళతోపాటు బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పైకివెళ్లారు .

బుజ్జిఅమ్మ : తల్లీ ........కృష్ణ , కాస్త కడుపు నొప్పివేస్తోంది అని చెప్పడంతో , ఇంటిలోపలికి పిలుచుకొనివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టారు . 
తల్లీ ....... నొప్పినొప్పి .
చెల్లి : ఎక్కడ బుజ్జిఅమ్మా అని అడిగి చూసి , సంతోషంతో మా బంగారు బుజ్జిఅమ్మ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువగా ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ....... ఇప్పుడే వస్తాను . వద్దులే ఇక్కడే ఉంటాను అని చేతిని ప్రాణంలా పట్టుకుని , అక్కయ్యా అక్కయ్యా పెద్దమ్మా .......... అని కేకలు వేసింది .

పైనున్న అక్కయ్య పెద్దమ్మ మేడం అంటీవాళ్ళు - బయట కార్ల దగ్గర ఉన్న మేము కంగారుపడుతూ వెనుకే లోపలికివెళ్లాము .
అక్కయ్య : చెల్లీ ఏమయ్యింది అని కంగారుపడుతూ అడిగారు .
చెల్లి : అక్కయ్యా .......... అంటూ చెవిలో చెప్పడం . 
అక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తి ఆనందించారు . 
చెల్లి ....... పెద్దమ్మ ఏంజెల్స్ కు చెవులలో చెప్పడం - వాళ్ళు అందరికీ చెప్పడంతో అక్కడంతా చిరునవ్వులు చిగురించి బుజ్జిఅమ్మ చుట్టూ చేరిపోయారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి ........ , ఇక అన్నీ శుభ శూచికలే ఇదే నిదర్శనం . ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంది అని సంతోషంతో కౌగిలించుకున్నారు .

ఇద్దరమూ ........ ఏమీ అర్థం కానట్లు కంగారుపడుతుండటం చూసి చెల్లి నవ్వుతూ వచ్చి , శ్రీవారూ - అన్నయ్యా .......... మన బుజ్జిఅమ్మ పుష్పవతి అయ్యారు . అమ్మకు హాఫ్ సారీ ఫంక్షన్ జరిపించే అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి అని మా ఇద్దరి చేతులనూ చుట్టేసి ఆనందాన్ని పంచుకుంది . 
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - ఏంజెల్స్ ........ ముద్దులలో మునిగితేలుతున్న బుజ్జిఅమ్మ మావైపు తియ్యని నవ్వులతో చూడటం చూసి హృదయం పరవశించిపోయింది .
చెల్లి : శ్రీవారూ - అన్నయ్యా ......... మన బుజ్జిఅమ్మ ఫంక్షన్ ఎలా జరిపిస్తారో మీ ఇష్టం ..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 06:05 PM



Users browsing this thread: 12 Guest(s)