Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లాండింగ్ సమయంలో కదళికలవలన అక్కయ్యకు మెలకువవచ్చింది . ఫ్లైట్ ఆగి ఉండటం చూసి బుజ్జిచెల్లీ ......... వైజాగ్ వచ్చేసాము ఆని హత్తుకుని లేచికూర్చుని విండో నుండి చూస్తే అక్కడక్కడా కన్నడలో రాసి ఉండటం " welcome to బెంగళూరు " అని చదివి ఆశ్చర్యంతో పెద్దమ్మవైపు చూసారు . అప్పటికే అందరూ కావాల్సిన లగేజీతో లేచి రెడీగా ఉన్నారు . పెద్దమ్మా ......... బెంగళూరుకు ఎందుకు? .
ఏంజెల్స్ - లావణ్య పద్మ వాళ్ళు ......... అక్కయ్యకు రెబడువైపులా ముందు మోకాళ్లపై కూర్చుని , అమ్మా .......... మైసూర్ చాముండీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతున్నాము .
అక్కయ్య సంతోషపు ఆశ్చర్యంతో పెద్దమ్మవైపు చూసారు .

ఏంజెల్స్ : మైసూర్ చాముండీ అమ్మవారు మాత్రమే కాదు అమ్మా , కంచి కామాక్షి - మధుర మీనాక్షి - కాశీ విశాలాక్షి - కలకత్తా కాళీ మాత - మహారాష్ట్ర మహాలక్ష్మీ ............. ఇలా దేశంలోని అమ్మవార్లందరి దర్శనం చేసుకోబోతున్నాము . మీ మనసులోని కోరిక కూడా అదేకదా ........... , మీరు చెప్పకపోయినా పెద్దమ్మ తెలుసుకున్నారులే ,
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో లవ్ యు పెద్దమ్మా .......... అని చేతిని అందుకుని ఆనందించారు . 
పెద్దమ్మ : ఉదయమూ ఇప్పుడూ ఓకేమాట మా వాసంతి తల్లి వల్లనే మా అందరికీ ఇంత గొప్ప అదృష్టం కలిగింది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను మరింత గట్టిగా హత్తుకుని , బుజ్జిచెల్లీ ......... దేశంలోని అమ్మవారందరి దగ్గర ఒకటే కోరిక తమ్ముళ్లు సంతోషంగా ఉండాలని సరేనా ............
బుజ్జిఅక్కయ్య : ఒక్క అమ్మవారిని దర్శించుకుంటేనే మా అక్కయ్య ఇంత ఆనందపడితే ఇక అమ్మవార్లందరినీ దర్శించుకున్న తరువాత ఇంకెంత ఆనందిస్తారో , నాకు మా అందరికీ వెంటనే చూడాలని ఉంది .
అందరూ : అవును అవును అవును ........... అని మనసారా తెలియజేసారు .
అక్కయ్య : పరవశించిపోయి లవ్ యు బుజ్జిచెల్లీ ........ అని సిగ్గుపడ్డారు .
పెద్దమ్మ : తల్లీ ......... మైసూర్ కు రోడ్ ద్వారా వెళ్ళాలి , ఓకేరోజులో ఇద్దరు అమ్మవార్లను దర్శించుకోబోతున్నాము కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాలి అని చెప్పడం ఆలస్యం ,
అక్కయ్య బుజ్జిఅక్కయ్యవైపు చూసి నవ్వుకుని మేము రెడీ అని లేచి నిలబడ్డారు .
మేమూ రెడీ మేమూ రెడీ అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ద్వారా బయటకు రాగానే బస్సెస్ రెడీగా ఉండటంతో ఎవరికి నచ్చిన బస్ లో వాళ్ళు చేరిపోయారు .
కృష్ణగాడు ........ చెల్లి ప్రక్కకు - రాథోడ్ ........ మేడం ప్రక్కకు మరియు తమ్ముళ్లు చివరి బస్ లో చేరిపోయారు .

బుజ్జిఅమ్మ కారుదగ్గర ఉన్న నాదగ్గరికివచ్చి నాన్నా ........ ప్రయాణం 2 -3 గంటలు పడుతుందని తెలిసింది . కాబట్టి నీకు బోర్ కొడుతుంది కాబట్టి .........
కాబట్టి ..........
కాబట్టి .......... అని చప్పట్లు కొట్టారు .
మధ్య బస్ లోనుండి ఏంజెల్స్ నలుగురూ ముసిముసినవ్వులతో కిందకుదిగి బుజ్జిఅమ్మ ప్రక్కనే నావైపు ప్రేమబాణాలు వేస్తూ నిలబడ్డారు .
నాన్నా ......... కారులో తోడుగా వస్తారు . 
అమ్మా ...........
Ok ok ......... తల్లులూ నో హగ్స్ నో కిస్సెస్ .
లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ......... అంటూ బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి బుద్ధిగావెళ్లి కారులో వెనుక కూర్చున్నారు .
అమ్మా ......... ముందుసీట్ ఖాళీనే కదా మీరూ ......... ,
నో నో నో ......... హత్తుకుని బై చెప్పి అక్కయ్య కూర్చున్న మొదటి బస్ ఎక్కి బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నారు .

బస్సెస్ బయలుదేరడంతో వెంటనే కారులో కూర్చుని స్టార్ట్ చేసాను . కదిలేలోపు వెనుక నువ్వు నువ్వు ......... అంటూ వాదులాట గుసగుసలు తరువాత స్వప్న ముందుసీట్లోకి వచ్చి కూర్చుంది . 
డిస్టన్స్ అన్నట్లు లుక్ ఇచ్చాను .
స్వప్న : నిన్ను హత్తుకోవాలని కాదులే హీరో అని తియ్యనికోపంతో మొబైల్ ను స్టీరింగ్ ప్రక్కన కదలకుండా సెట్ చేసింది .
చూస్తే మేడమ్ తోపాటు అక్కయ్య - వెనుక సీట్లో పెద్దమ్మ ప్రక్కనే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తున్న బుజ్జిఅమ్మ - ఆ వెనుక బుజ్జాయిలు . అందరూ చిరునవ్వులు చిందిస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న లైవ్ విజువల్స్ ........
పెదాలపై చిరునవ్వుతో స్వప్న బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ స్వప్న లవ్ యు లవ్ యు అని బుగ్గపై మళ్లీ మళ్లీ ముద్దుపెట్టాను .
స్వప్న : పరవశించిపోయి , మావయ్యా ......... అక్కయ్యలు చెల్లి అందరి ప్లాన్ ఇది .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఏంజెల్స్ అని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా .......... చాలు చాలు బస్ లు వెళ్లిపోతున్నాయి.
లవ్ యు ఏంజెల్స్ , మొబైల్ స్క్రీన్ పై ఉమ్మా ఉమ్మా ........ అంటూ అక్కయ్యకు - బుజ్జిఅక్కయ్యకు చేతితో ముద్దులుపెట్టి చివరి బస్ వెనుకే పోనిచ్చాను . 
సిటీ ట్రాఫిక్ దాటి బెంగళూరు - మైసూర్ హైవే చేరుకునేసరికి గంటపట్టింది . ఇక అక్కడ నుండి బస్ డ్రైవర్స్ పరుగులుపెట్టించారు . బెంగళూరు మాత్రమే కాదు బెంగళూరు నుండి మైసూర్ చేరుకునేంతవరకూ రోడ్ కు ఇరువైపులా పచ్చదనమే , కావేరీ జలాల వలన పంటలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి . 
పెద్దమ్మ : తల్లీ ........ తెలుసు అయినా అడుగుతున్నాను మధ్యలో ఎక్కడైనా భోజనం చేద్దామా ? .
అక్కయ్య : పెద్దమ్మా ........ నా వలన , బుజ్జాయిలకు ఆకలి వేస్తూ ఉంటుంది ఎక్కడైనా ఆపండి .
బుజ్జాయిలు వచ్చి అమ్మా అమ్మా .......... ఉదయం మీరు తినకుండా మాకు మాత్రమే తినిపించారు . ఇప్పుడుమాత్రం అలా కుదరనే కుదరదు అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే మేమూ తినేది , మాకేమీ ఆకలిగా లేదు కడుపునిండా తున్నాములే ..........
అక్కయ్య : బుజ్జితల్లులూ ...........
బుజ్జాయిలు : పెద్దమ్మా ......... బస్ ఎక్కడా ఆగకూడదు , మా అమ్మ దర్శించుకున్న తరువాతనే అందరమూ కలిసి తిందాము అంతే అని కూర్చున్నారు.
బుజ్జిఅక్కయ్య : లవ్ యు my ఫ్రెండ్స్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
బుజ్జాయిల మాటలు విన్నట్లు మొదటి బస్ డ్రైవర్ మరింతవేగం పెంచడం వెంటనే మిగతా రెండు బస్ లు వేగం పెరగడంతో , మన బుజ్జాయిలు బంగారం అని ఏంజెల్స్ తోపాటు స్క్రీన్ పై ముద్దులుపెట్టి నవ్వుకుని అంతేవేగం అందుకుని 4: 30 కి మైసూర్ చేరుకున్నాము . 

అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను గుండెలపైకి అందుకుని , పెద్దమ్మా - అక్కయ్యలూ ........... చాముండీబెట్ట కాలినడకన చేరుకుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను . 
మేడమ్స్ - పెద్దమ్మ : మాకూ ఆ అదృష్టమే కావాలి . కావాలంటే బుజ్జాయిలను బస్ లో కొండపైకి పంపిద్దాము . 
బుజ్జాయిలు : అమ్మలూ ......... మేమేమీ పసికందులు కాదు . కొండ ఎంత పెద్దదైనా సరే మీతోపాటే ఎక్కుతాము . 
బుజ్జిఅక్కయ్య : నేను కూడా అక్కయ్య చేతివేలుని పట్టుకుని ఎక్కుతాను . తమ్ముళ్లు - నేను సంతోషంగా ఉండాలని మీరు - మీరు తమ్ముళ్లు ఆనందంగా వుండాలని నేను మొక్కు తీర్చుకుంటాము .
పెద్దమ్మ : ఆనందించి సరే అయితే అందరమూ మెట్ల మార్గంగానే వెళదాము . ఒకవేళ బుజ్జాయిల వలన కాకపోతే మనం ఎత్తుకుని నడుద్దాము . 
బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు .
పెద్దమ్మ : ఆనందించి డ్రైవర్ కు కాలినడక మార్గం దగ్గర వదలమని చెప్పారు .

ఏంజెల్స్ ............ మీ సంగతి ఏంటి , 
ఏంజెల్స్ : మా మావయ్య వాళ్ళ అక్కయ్యల సంతోషం కోసం - మేము మా అమ్మలు అమ్మమ్మ బుజ్జిమహేష్ ముద్దుల మావయ్య సంతోషం కోసం మెట్లమార్గమునే చాముండీ అమ్మవారిని దర్శించుకుంటాము అని నా బుగ్గలను గిల్లేసాను .
కోపంతో చూడటం చూసి , తమరు హగ్స్ కిస్సెస్ మాత్రమే వద్దన్నారు గిల్లడం మాఇష్టం అని మళ్ళీ గిల్లి నవ్వుకున్నారు . 5 గంటలకు కొండ పాదం దగ్గరకు చేరుకున్నాము . 
అక్కయ్య ...... బుజ్జిఅక్కయ్యను పెద్దమ్మ మనవరాలిని - పెద్దమ్మ బుజ్జిఅమ్మను మనవడిని - చెల్లి బుజ్జిమహేష్ ను - ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళు బుజ్జాయిల చేతులను ............ అందుకొని భక్తితో మెట్లు ఎక్కడం మొదలెట్టారు .
వెనుకే కృష్ణగాడు రాథోడ్ తమ్ముళ్లూ వాళ్ళ మధ్యలో దాక్కుని నేనూ ఎక్కడం మొదలెట్టాము .

మాట్లాడుకుంటూ చిరునవ్వులను చిందిస్తూ , బుజ్జాయిల ఉత్సాహానికి ముగ్ధులవుతూ , రెండువైపులా పచ్చని ప్రకృతిని , సూర్యాస్తమయపు కొండ అందాలను మరియు వెనుక ఎక్కడచూసినా పచ్చదనం నిండుకున్న మైసూర్ సిటీ సోయగాలను వీక్షిస్తూ మరింత ఉత్సాహంతో మెట్లు ఎక్కుతున్నాము . 
 సగం ఎక్కిన తరువాత కాస్త దూరంలో పెద్ద నంది విగ్రహం కనిపించడంతో అక్కయ్యలూ - అమ్మలూ ....... చూడండి అని పరుగున వెళుతున్నారు .
బుజ్జాయిలూ బుజ్జితల్లులూ .......... జాగ్రత్త జాగ్రత్త అని అందరూ వెనుకే వెళ్లారు .
బుజ్జాయిలందరూ .......... నందిని తాకి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఏంజెల్స్ తమ కెమెరాలలో బంధిస్తున్నారు . 
అక్కయ్య - చెల్లి - పెద్దమ్మ - మేడం వాళ్ళు ............ చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మెట్లు ఎక్కడం మొదలెట్టారు . సుమారు 1000 మెట్లను ఎటువంటి ఆయాసపడకుండా ఎక్కేసాము . పైకి చేరుకునేసరికి సూర్యుడు పూర్తిగా అస్తమించి నెమ్మదిగా చీకటి పడుతోంది . 


పైన బస్ స్టాండ్ ప్రక్కనే ఉన్న పెద్ద మహిసాసుర విగ్రహం చూసి బుజ్జాయిలు భయంతో అమ్మా అక్కయ్యా ......... అంటూ గట్టిగా పట్టేసుకున్నారు . 
అందరూ నవ్వుకుని విగ్రహం గురించి వివరించి బుజ్జాయిల భయం పోగొట్టడంతో ముందు ముందు నడిచారు . 
అక్కడి నుండి చాముండీ అమ్మవారి గోపురం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంతో వెలిగిపోతుండటం చూసి అటువైపు అడుగులు వాటంతట అవే పడ్డాయి . పూజ సామాగ్రిని గుడి బయట తీసుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ క్యూ లో లోపలికివెళ్లాము . 

అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చాముండీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు . అక్కయ్య ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని పూజ జరిపించారు పెద్దమ్మ . అమ్మవారి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తనివితీరా ప్రార్థించి ప్రసాదం తింటూ సన్నిధిలోనే కూర్చున్నారు . అక్కయ్యల ఆనందాన్ని చూస్తూ అందరికీ సమయమే తెలియరాలేదు . 9 గంటలకు మరొకసారి దర్శనం చేసుకుని బయటకు నడిచారు .
కృష్ణగాడు తమ్ముళ్లూ వెళ్లి చాముండీ అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చారు .

గుడికి వెళ్ళేటప్పుడు దారికి ఇరువైపులా ఉన్న బొమ్మల దుకాణాలు చూసినట్లు అమ్మలూ - అక్కయ్యలూ .......... అని నేరుగా అక్కడికే తీసుకెళ్లారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ......... మీ ఇష్టం ఎన్ని నచ్చితే అన్నీ తీసేసుకోండి . తల్లులూ , మహీ స్వాతి లావణ్య పద్మ .......... మీకు ఇష్టమైనవి కూడా ఉన్నాయి చూడండి . గాజులు హారాలు ............
అంటీ , ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు పెద్దమ్మా .......... 
బుజ్జిఅక్కయ్య ........... అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ఇప్పుడే వస్తాను అనిచెప్పి , మహి స్వాతితోపాటు కాస్త దూరంలో ఉన్న నాదగ్గరకువచ్చారు . వాళ్ళను గమనించకుండా దుకాణం వైపు చూస్తుండటం చూసి , తమ్ముడూ ........ ఆ గాజులూ హారం అక్కయ్యకు బాగుంటుంది కదూ ..........
ఏదో ట్రాన్స్ లో అవును అని ప్రక్కన చూస్తే ఏంజెల్స్ - బుజ్జిఅక్కయ్య ............, నవ్వుకుని ఎన్ని గంటలయ్యింది మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను . 
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని , తమ్ముడూ ........... ఉదయం నుండీ అక్కయ్య అమ్మవారు మరియు నీ నామస్మరణలోనే మునిగిపోయారు . ఇప్పుడుకానీ తమ్ముడిగా కనిపిస్తే కొరుక్కుని తినేస్తారేమో అని నవ్వుకున్నాము .
ఏంజెల్స్ : మావయ్యా ......... ఇవేకదా అని చూయించారు . 
అవును మహీ స్వాతి అని ఇద్దరి కురులపై ముద్దులుపెట్టాను .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... ఇవి అక్కయ్య అలంకరించుకుంటే చూడాలని ఉందా ? .
అవునవును అన్నట్లు ఆతృతతో తలఊపాను .
బుజ్జిఅక్కయ్య నా బుగ్గను కొరికేసి స్వాతి గుండెలపైకి చేరిపోయి అక్కయ్య దగ్గరకువెళ్లారు . అందరూ ఒకరికొకరు సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం చూసి పెద్దమ్మతోపాటు ఆనందిస్తున్న అక్కయ్య గుండెలపైకి చేరిపోయి హారాన్ని మెడలో వేసింది . మహి స్వాతిలనుండి గాజులు అందుకుని చేతికి వేసింది .
అక్కయ్య : లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... చాలా చాలా బాగున్నాయి అని ముద్దుపెట్టి , బుజ్జిఅక్కయ్యకు కూడా సెలెక్ట్ చేసినట్లు మరింత అందంగా అలంకరించారు . 
అక్కయ్య - బుజ్జిఅక్కయ్యను చూసి మురిసిపోతుండటం చూసి బుజ్జిఅక్కయ్య ఏంజెల్స్ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అంటీవాళ్ళు పే చేయబోతే ఆపి మొత్తం పెద్దమ్మ పే చేసి బుజ్జాయిల ఆనందాన్ని చూస్తూ బస్ ఎక్కారు . బస్ డ్రైవర్ కార్ కూడా తీసుకొచ్చినట్లు కీస్ ఇవ్వడంతో ఏంజెల్స్ తోపాటు కూర్చుని కిందకు చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 06:01 PM



Users browsing this thread: 6 Guest(s)