Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా ......... ఎయిర్పోర్ట్ నుండి గుడివరకూ ట్రాన్స్పోర్ట్ ...........
కృష్ణ : నువ్వేమీ కంగారుపడకు నీ చెల్లి నేను అర్రేంజ్ చేసేసాము , నీకోసం కూడా ప్రత్యేకంగా ఒక వెహికల్ . నెక్స్ట్ ఎక్కడికో చెబితే ఇలాంటి arrangements చేసేసుకుందాము .
లవ్ యు రా లవ్ యు చెల్లెమ్మా ...........

పైలట్ డ్రెస్ లోనే కాక్ పిట్ డోర్ దగ్గర నుండి అక్కయ్యను చూసాను . అక్కయ్య ముఖంలో ఒకవైపు కొద్దిసేపట్లో మొక్కు తీర్చుకోబోతున్నానన్న , చాలా సంవత్సరాల తరువాత మా ఊరికి దగ్గరగా వచ్చానన్న సంతోషం - మరొకవైపు తమ్ముడు లేకుండా వచ్చినందుకు బాధ , మా ఊరి వాళ్లేవారైనా చూస్తారేమోనన్న కంగారు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
అక్కయ్య బుజ్జిఅక్కయ్యతోపాటు లేచి మొక్కు తీర్చుకోవడానికి వైజాగ్ నుండి తీసుకొచ్చిన పూజసామాగ్రిని మరియు చిన్నప్పుడు అమ్మ అక్కయ్య నేను కృష్ణగాడు దిగిన ఫోటోని ప్రాణంలా అందుకొని కళ్ళల్లో చెమ్మతో గుండెలపై హత్తుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కళ్లపై చెరొక ముద్దుపెట్టి ఓదార్చింది .

మహి ఏంజెల్స్ వెళ్లి అమ్మా ......... పూజ సామాగ్రిని మేము పట్టుకుంటాము .
తల్లులూ .......... పర్లేదు మీ మావయ్య సంతోషం కోసం నేనే ..........
సరే అమ్మా కనీసం మీ బంగారు బుజ్జిచెల్లినైనా ...........
బుజ్జిఅక్కయ్య : అవును అక్కయ్యా ............ బరువుగా ఉన్నాను .
అక్కయ్య : లేదు లేదు ........ బుజ్జిచెల్లీ, తల్లులూ మీ మావయ్య స్థానంలో నా బుజ్జిచెల్లి ఉంది , ఇవ్వనంటే ఇవ్వను . ఎంత కష్టమైనా నా బుజ్జిచెల్లిని మరియు పూజ సామాగ్రిని స్వయంగా నేనే పట్టుకుని వస్తాను .
ఏంజెల్స్ : అలాగే అమ్మా జాగ్రత్త అని బుజ్జాయిల చేతులను అందుకుని ఫ్లైట్ దిగారు . 

రాథోడ్ : డార్లింగ్ వన్ మినిట్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నారు . మహేష్ ....... నువ్వు ఇలా రావడమే బెటర్ రా వెళదాము అని నవ్వుకుని శోభ మేడం తోపాటు వెనుకే వెళ్లారు . 
 అందరూ దిగాక పైలట్ డ్రెస్ లోనే ప్లేన్ దిగి వెనుకే వెళ్ళాను . ఎయిర్పోర్ట్ బయట 3 లగ్జరీ బస్ లు రెడీగా ఉన్నాయి . ఒకరు వచ్చి కృష్ణగాడి చేతులుకలిపై మాట్లాడాడు. అతడే నాదగ్గరకువచ్చి మీ వెహికల్ సర్ అని చూయించి కీస్ అందించాడు .

కృష్ణ : పెద్దమ్మా ......... , మీరు కోరినట్లుగానే గుడికి మరియు విజయవాడలో వెళ్లాలన్నచోటుకు ప్రయాణించడానికి అని బస్ ల వైపు చూయించాడు . 
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో వాసంతి - తల్లులూ .......... అని మూడు బస్ లలోకి చేరిపోయారు . 
మహి - ఏంజెల్స్ : చివరి బస్ లో ఎక్కడానికి వచ్చినట్లు వచ్చి నాదగ్గరకు వచ్చారు.
నో అంటే నో .......... దర్శనం చేసుకుని వచ్చేన్తవరకూ మీరెవరో నేనెవరో అని పంపించి , వాళ్ళ తియ్యని కోపాన్ని చూసి నవ్వుకున్నాను .

బుజ్జిఅమ్మ : నాన్నా ........... తల్లులు మీకు తోడుగా రావడం లేదు గనుక నేను నీతోపాటే ఉంటాను  అని బస్ దిగి పరుగునవచ్చారు .
లవ్ యు అమ్మా .......... మీ తల్లులకు నాకంటే తమ డార్లింగ్స్ అంటేనే ఇష్టం అందుకే వెళ్లిపోతున్నారు .
అంతే నలుగురూ ఆగి మావయ్యా మావయ్యా ......... అంటూ వెనక్కువచ్చి ప్రేమతో గుండెలపై కొట్టారు . అమ్మ మొక్కు తీర్చుకుని ఇంటికి చేరనివ్వు అప్పుడు చెబుతాము నీ సంగతి అని తియ్యనికోపపు నవ్వులతో అక్కయ్య బస్ ఎక్కారు .
బుజ్జిఅమ్మతోపాటు కారులో కూర్చుని బస్సెస్ వెనుకే ఫాలో అయ్యాము . అర గంటలో రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ మీదుగా ఒకవైపు కొండ మరొకవైపు నదీప్రవాహాన్ని చూస్తూ దుర్గమ్మ గుడికి చేరుకున్నాము . 

మొబైల్ రింగ్ అవ్వడంతో స్టీరింగ్ వెనుక ఉంచిన మొబైల్ ను బుజ్జిఅమ్మ అందుకొని , నాన్నా స్వాతి తల్లి నుండి వీడియో కాల్ అని లిఫ్ట్ చేశారు. నాన్నా ....... మీ ముద్దుల అక్కయ్య - బుజ్జిఅక్కయ్య సంతోషం చూడండి . 
ఇన్నాళ్లకు తమ ఏకైక మొక్కు తీర్చుకోబోతున్నానన్న సంతోషం అక్కయ్య ముఖంలో కనిపిస్తోంది . అక్కయ్యను చూసి బుజ్జిఅక్కయ్య ఆనందంతో బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతోంది . ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను అన్నట్లు బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని పైకిలేచి పూజ సామాగ్రిని అందుకొని , మేడం వాళ్ళతోపాటు బస్ దిగారు . ఎవరైనా తమ ఊరివాళ్ళు గుర్తుపడతారేమోనని చీర కొంగును కప్పుకోబోయి , అమ్మవారి సన్నిధికి వచ్చాము ఇక భారమంతా అమ్మదే అనుకుని భక్తితో మాత్రమే అమ్మవారి దగ్గరికి అడుగులువేశారు . అడుగుడుకూ తమ్ముళ్లు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు . 

ఏంజెల్స్ : అమ్మ అమ్మా  ......... ఇక మావయ్యలకు మీ ప్రేమ మరియు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలే రక్ష ప్రక్కనే ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు అని చెరొక బుగ్గపై ఒకేసారి ముద్దులుపెట్టారు . అమ్మలూ - డార్లింగ్స్ - బుజ్జాయిలూ - అన్నయ్యలూ .......... రండి రండి అని అందరూ మొదట ఘాట్ దగ్గరకువెళ్లి పుణ్యస్నానామాచరించారు . 
అక్కయ్య : నడుమువరకూ నీళ్ళల్లోకి దిగి బుజ్జిచెల్లీ ......... మునుగుదామా ? . నీళ్లు చల్లగా ఉన్నాయి .
బుజ్జిఅక్కయ్య : తమ్ముళ్ల సంతోషం కోసం మా అక్కయ్య ఏమిచేస్తారో అవన్నీ మా అక్కయ్య సంతోషం కోసం నేనూ చేస్తాను అని చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టింది .
అక్కయ్య : మా బుజ్జిచెల్లికి నేను తమ్ముళ్లూ అంటే ప్రాణం అని , ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని , తమ్ముళ్లు నా బుజ్జిచెల్లి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని తలుచుకుని అందరితోపాటు మూడుసార్లు నదిలో మునిగి బుజ్జిచెల్లీ ......... అయిపోయింది అని వణుకుతూ ఒడ్డుకు చేరుకున్నారు . అక్కయ్య మునక చెందిన చోటకే వెళ్లి మా అక్కయ్య బుజ్జిఅక్కయ్య చల్లగా ఉండేలా చూడమని ప్రార్థించి మునిగాను .
అక్కయ్య మహి నుండి టవల్ అందుకొని బుజ్జిఅక్కయ్య తలను తుడిచారు . క్యూ లో నిలబడి దుర్గమ్మను తలుచుకుంటూనే సన్నిధికి చేరారు . వెనుకే కనిపించకుండా అడుగులువేశాను .

అమ్మవారి దర్శనం జరుగగానే ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో సంతోషపు చెమ్మ చేరింది . అమ్మా .......... ఇన్నాళ్లకు మొక్కు తీర్చుకునే భాగ్యం కలిగించావా ? , నన్ను క్షమించు ఇంత ఆలస్యంగా వచ్చినందుకు - మీకు కోపం వస్తే ఆ కోపాన్ని నాపై నాపై మాత్రమే చూయించండి - నా తమ్ముళ్లు ఎక్కడున్నా ఆనందంగా ఉండేలా చూడు తల్లీ ........... , 
పెద్దమ్మ : తల్లీ వాసంతి తమ్ముళ్ల సంతోషం కోసం అభిషేకం చేయిద్దామా ? .
అక్కయ్య : అమ్మవారితోపాటు పెద్దమ్మకు కూడా నమస్కరించారు .
పెద్దమ్మ : తల్లీ ......... అని ఆపి , కృష్ణగాడి ద్వారా అభిషేఖం టికెట్ తెప్పించి పూజ జరిపించారు .

పూజారిగారు వచ్చి మీరు ఎవరికోసమైతే పూజ చేయించారో వారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు , త్వరలోనే వారిని కలుస్తారు అని అమ్మవారే స్వయంగా చెప్పినట్లుగా చెప్పి ప్రసాదం అందించారు .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిచెల్లీ .......... త్వరలోనే తమ్ముళ్లను కలుసుకోబోతున్నాము అని ప్రాణంలా హత్తుకున్నారు . అమ్మా ......... ఈ జన్మకు ఈ ఒక్క కోరిక చాలు అని తనివితీరా ప్రార్థించారు . 
అమ్మా .......... మా అక్కయ్య - బుజ్జిఅక్కయ్యల సంతోషం తప్ప ఇక దేనిపై మాకు ఆశ లేదు చల్లగా ఉండేలా దీవించు అని ప్రార్థిని వెనుకే బయటకువచ్చాము .

అక్కయ్య మాటల్లో వర్ణించలేని అనుభవాన్ని ఆస్వాధిస్తున్నారు . పెద్దమ్మవైపు అడుగులువేసి బుజ్జిఅక్కయ్యతోపాటు అమాంతం కౌగిలించుకున్నారు . పెద్దమ్మా ........... ఏమిచెప్పాలో కూడా మాటలు రావడం లేదు - మీకు జీవితా ..........
పెద్దమ్మ : తల్లీ ........... మేమే నీకు జీవితాంతం రుణపడి ఉంటాము . నీ వల్లనే కదా ఇంత మహాద్భాగ్యం కలిగింది అని ఆనందబాస్పాలను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అవును వాసంతి - అక్కయ్యా - చెల్లీ - అమ్మా .......... అని అందరూ సంతోషంతో ముగ్గురినీ హత్తుకున్నారు .

ఆ ఆనందాలను కృష్ణగాడితోపాటు చూస్తూ మురిసిపోయాము . గుంపులో మొబైల్ రింగ్ అవ్వడంతో పద్మ అమ్మగారు హలో హలో .......... వినిపించడం లేదు ఒక్క నిమిషం శ్రీవారూ అని కాస్త దూరం వెళ్లి మాట్లాడారు . మహీ తల్లీ మహీ తల్లీ ....... ఎక్కడ ఎక్కడ అని పరుగునవచ్చి అమాంతం కౌగిలించుకుని నెలలుగా వేచిచూస్తున్న ప్రాజెక్టు మనకే దక్కింది - చాలా చాలా సంతోషంగా ఉంది అని థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ తల్లీ కేవలం కేవలం నీ వల్లనే - పద్మ ........ మీ నాన్నగారు ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్న ప్రాజెక్టు మన సొంతం అయ్యింది . మహీ తల్లీ ఆ ప్రాజెక్టు కోసం పెద్ద పెద్ద వాళ్ళు , పలుకుబడి ఉన్నవాళ్లు వందల్లో పోటీపడ్డారు . మా మహి తల్లి అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చింది - అక్కడ ప్రాజెక్టు లభించింది అని అంతులేని ఆనందంతో కౌగిలించుకున్నారు . 
మహి : మా వలన కాదు అమ్మా , నాకు తెలియదా మా అమ్మావాళ్ళు ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో , మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తుంది ఆ అమ్మ అని దుర్గమ్మ వైపు చూయించింది . 
పద్మ అమ్మ : ఏది ఏమైనా మా మహి మరియు వాసంతి మొక్కు వల్లనే కదా ఇక్కడకు వచ్చినది . ఇన్ని నెలలుగా రానిది ఈ రోజు వచ్చింది కాబట్టి అమ్మవారితోపాటు మీ వల్ల కూడా అని అక్కయ్యను కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు .
పద్మ : మనసారా ఆనందించి , అమ్మలూ .......... ఆకలి దంచేస్తోంది మొదట అమ్మవారి ప్రసాదం ఆ వెంటనే ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ కుమ్మేయ్యాలి అని చెప్పడంతో అందరూ నవ్వుకుని గుడి ప్రాంగణంలో ఒక చోట కూర్చుని అమ్మవారి ప్రసాదాన్ని తిన్నారు . కాసేపు ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో సెదతీరి 12 గంటలకు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లోకి చేరుకున్నాము .
పద్మ : అమ్మా ......... నావల్లనే కదా తొందరగా వచ్చేసాము లేకపోతే మరికొంతసేపు భక్తితో ఉండేవారు .
అక్కయ్య : మనసారా దర్శించుకున్నాను తల్లీ .......... అని నుదుటిపై ముద్దుపెట్టారు . పెద్దమ్మా .......... ఇక ఏ కోరికా లేదు ఇంటికి తీసుకెళ్లిపోండి , ఇక ఆ అమ్మవారు కరుణించేంతవరకూ నా బుజ్జిచెల్లిలో తమ్ముళ్ల సంతోషాన్ని చూసుకుంటూ వేచిచూస్తాను అని ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకున్నారు . తల్లులూ ......... మొదట నా బుజ్జిచెల్లికి వడ్డించండి అని ప్లేట్ అందుకుని తినిపించారు . 
బుజ్జిఅక్కయ్య : ముందు మా అక్కయ్యకు అని పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకుని బుజ్జిచేతితో తినిపించి తిన్నది .
ఏంజెల్స్ - లావణ్యవాళ్ళు అందరికీ వడ్డించి కాక్ పిట్ లో దాచుకున్న నాకు మరియు రాథోడ్ కు టిఫిన్ తీసుకొచ్చారు .
అక్కయ్య ......... బుజ్జిఅక్కయ్యకు తినిపించి వారూ తిని , బుజ్జిచెల్లీ - అక్కయ్యలూ.......... ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఆనందం కలుగుతోంది . 
పెద్దమ్మ : ఇక తమ్ముళ్లు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అని నమ్మకం తల్లీ , రాత్రంతా తమ్ముళ్ల గురించే ఆలోచిస్తూ నిద్రకూడాపోలేదు హాయిగా రెస్ట్ తీసుకో తల్లీ ...........
అక్కయ్య : అంతులేని ఆనందంతో తమ్ముళ్లు సంతోషంగా ఉంటారు కదా పెద్దమ్మా ......... , అధితప్ప నాకు ఏ కోరికా లేదు అని బుజ్జిఅక్కయ్యను గుండెలపై జోకొడుతూ పెద్దమ్మ ఒడిలో వాలారు . బుజ్జిచెల్లీ .......... గంటలో మన ఇంటికి చేరిపోతాము అని ముద్దులుపెడుతూనే కళ్ళుమూసుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-12-2020, 06:00 PM



Users browsing this thread: 39 Guest(s)