Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
10 ఓవర్స్ కు మరొక వికెట్ నష్టపోకుండా 95 చేరుకుంది . ఒక్కొక్క ఓవర్ కు మా సైడ్ సపోర్టర్స్ పెరుగుతూ వస్తున్నారు . 12th ఓవర్ లో రాథోడ్ థర్డ్ బాల్ slow టాస్ వెయ్యడం పాయింట్ లో ఫోర్ కొడదామని బ్యాట్ ను కట్ చేసాడు . రోడ్స్ లా కుడివైపుకు డైవ్ వేసి సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ పట్టడం చూసి వాళ్ళ స్టాండ్ అవాక్కై పిన్ డ్రాప్ సైలెంట్ అవ్వడం - మా స్టాండ్ లేచిమరీ ఔట్ ఔట్ అంటూ ............ సంతోషంతో మా ఏరియా మొత్తం వినిపించేలా కేకలువేశారు .
బుజ్జిఅమ్మ - మహి - లావణ్యవాళ్ళు .......... సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని చప్పట్లు కొట్టారు . 
నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ మురళి క్రీజ్ లోకి రావడం రావడమే మిగతా మూడు బాల్స్ కు రెండు సిక్సలు కొట్టాడు . ఎక్కడా టెన్షన్ పడకుండా వీక్ బ్యాడ్ బాల్స్ అన్నింటినీ బౌండరీకు తరలిస్తున్నాడు . మా స్టాండ్ సైలెంట్ అవ్వడం - వాళ్ళ స్టాండ్ ఉత్సాహంతో కేకలు అరుపులు వెయ్యడం మొదలెట్టారు . 
బ్యాట్స్ మ్యాన్ : థాంక్యూ sooooo మచ్ కోచ్ , కొత్త కిట్స్ సూపర్ గా ఉన్నాయి అని బ్యాట్స్ పైకెత్తి చూయించాడు . 
15 ఓవర్లు ముగిసే సమయానికి అనూహ్యంగా మళ్లీ స్కోర్ పరుగులుపెట్టడంతో 165 / 4 చేరుకుంది . 
మా కెప్టెన్ లో మళ్లీ నిరాశ ........... టైం ఔట్

16th ఓవర్ వేసిన అల్ రౌండర్ కెప్టెన్ 15 పరుగులు - 17th ఓవర్లో గణేష్ చివరి ఓవర్ వెయ్యడం ఏకంగా 21 పరుగులు - 18th ఓవర్ మళ్లీ కెప్టెన్ 17 పరుగులు టోటల్ గా 18 ఓవర్లు ముగిసే సమయానికి 218 /4 , క్రీజ్ లో ఉన్న ఇద్దరు బ్యాట్స్ మ్యాన్ హాఫ్ సెంచరీ లతో ఎగిరెగిరి ఎంజాయ్ చేస్తుండటం , మా కెప్టెన్ వొళ్ళంతా చెమటతో తలపట్టుకోవడం చూసి కామెంటరీలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు . కెప్టెన్ .......... make it 250 260 ......... అని సంతోషంతో కేకలువేస్తున్నారు . మన గ్రౌండ్ చరిత్రలో ఇదే ఇప్పటివరకూ హైయెస్ట్ స్కోర్ .......... యాహూ ......... అని గెంతులేస్తున్నారు . మా స్టాండ్ లో పూర్తి నిరాశతో రెండు ఓవర్లే కదా చూసి వెళ్లిపోదాము ఈ సంవత్సరం కూడా గ్రౌండ్ వాళ్లదే మరింత ఘోర పరాభవం అని తలలు దించుకున్నారు .

లావణ్య కళ్ళల్లో చెమ్మతో చెల్లెమ్మకు కాల్ చేసి విషయం చెప్పింది .
Wow .......... సూపర్ స్కోర్ , తల్లీ ......... మా ఆయన బాల్ అందుకుంటారు చూడు ..........

కెప్టెన్ : అన్నయ్యలూ ......... అందరి ఓవర్స్ అయిపోయాయి . చాలా స్కోర్ వచ్చేసింది .
కృష్ణ : కెప్టెన్ ......... ODI లా 300 expect చేసాము చాలా తక్కువ కొట్టారు . రేయ్ మామా ...........
నో నో నో .......... నా గురువు కూడా తమరే ముందు మీరు తరువాతే అని ఛాతీలు గుద్దుకుని వెళ్లి ఫీల్డింగ్ నిలబడ్డాము . 
కృష్ణగాడు వాడికి కావాల్సినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేసుకున్నాడు . 

బుజ్జిఅమ్మవైపు బాల్ చూయించి పరుగునవెళ్లి అపొజిట్ కెప్టెన్ కు వేసాడు . 19 వ ఓవర్ లోకూడా బాల్ ఔట్ స్వింగ్ చెయ్యడంతో ఎడ్జ్ తాకి నేరుగా స్లిప్ లో ఉన్న మా కెప్టెన్ చేతిలోకి వెళ్లడం - స్కోర్ గురించే బాధతో ఆలిచిస్తున్నట్లు - సడెన్ గా వచ్చిన బంతిని అందుకోలేక - అయ్యో .........అంటూ మరింత ఫీల్ అయ్యాడు . కెప్టెన్ కళ్ళల్లో ఏకంగా కన్నీళ్లు వచ్చేసాయి .
రెండు స్టాండ్స్ లోని వాళ్ళు ఉఫ్ఫ్ ......... అంటూ వాళ్ళల్లో ఆనందం - మావైవు నిరాశతో నిట్టూర్చారు .
కృష్ణగాడు వెళ్లి కెప్టెన్ దీనికే ఇలా ఫీల్ అయితే ఎలా అని కౌగిలించుకున్నాడు .
కెప్టెన్ : కెప్టెన్ క్యాచ్ అన్నయ్యా ......... సింపుల్ క్యాచ్ విడిచేసాను వాడు చూడు ఎలా నవ్వుతున్నాడో .
కృష్ణ : ok ok .......... రేయ్ మామా నువ్వు పాయింట్ లో - కెప్టెన్ నువ్వు మిడ్ ఆఫ్ అదే అపొజిట్ స్టాండ్ ముందు నిలబడు అని ప్రోత్సహించి పంపించాడు .

సెకండ్ బాల్ అంతకంటే వేసేటట్లు పరుగునవచ్చి వైడ్ గా స్లో బాల్ వెయ్యడం - బ్యాట్ ను ముందుకుచాపి కొట్టడంతో మిడ్ ఆఫ్ మీదుగా సిక్స్ వెళుతున్న బంతిని ఎగిరి సింగిల్ హ్యాండ్ తో పట్టుకుని నమ్మలేనట్లు చూసుకున్నాడు - సిక్స్ సిక్స్ ........ అని కేకలువేస్తున్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు - out out ........ అని మావాళ్ళు ఎంజాయ్ చేశారు ,
కెప్టెన్ : అన్నయ్యా .......... అంటూ పరుగునవచ్చి వాడిమీదకు జంప్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు . కెప్టెన్ వైపు చూసి బాల్ కు ముద్దుపెట్టాడు . 
అపొజిట్ కెప్టెన్ తలదించుకుని వెళ్ళిపోయాడు .

థర్డ్ బాల్ యార్కర్ వెయ్యడంతో మిడిల్ వికెట్ బోల్డ్ అయిపోయాడు . మా స్టాండ్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది . క్రీజ్ లో సెటిల్ అయిన ఇద్దరు బ్యాట్స్ మ్యాన్ వరుస బంతులకు ఔట్ అయిపోయారు .
హ్యాట్రిక్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ .......... అని మా వాళ్ళు కేకలువేస్తుంటే అవతలివైపు సైలెంట్ గా ఉండిపోయారు .
రేయ్ ......... సింగిల్ కూడా రాకపోయినా పర్లేదు ఔట్ మాత్రం అవ్వకు డిఫెన్స్ ఆడుకో అని బ్యాట్స్ టచ్ చేసుకుని రెడీ అయ్యారు .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... హ్యాట్రిక్ వికెట్ కావాలి అని వాడికి వినపడేలా కేకవేశారు.
వాళ్ళ ముందు నిలబడిన నేను వెనక్కుతిరిగి కోరినది ఎవరు ......... , మహీ - లావణ్య ......... రెడీ అయిపోండి అని బుజ్జిఅమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
తమ్ముళ్లు : అన్నయ్యా ......... మ్యాచ్ సంగతి ఏమో కానీ హ్యాట్రిక్ కావాలి అని కీపర్ రవి అందరినీ అలర్ట్ చేసాడు .
రన్నర్ : డిఫెన్స్ డిఫెన్స్ ........ అని సిగ్నల్ ఇస్తున్నాడు .

18.4 : కృష్ణగాడు పరుగునవచ్చి స్ట్రెయిట్ గా లైన్ లో యార్కర్ వెయ్యడం మిడిల్ వికెట్ లో ప్యాడ్స్ కు తగలగానే , వికెట్ అంటూ అంపైర్ ను చూడకుండానే వాడు సంతోషంతో నాదగ్గరికివచ్చి ఇద్దరమూ ఎగిరి ఛాతీలు గుద్దుకున్నాము .
రవి ఏకంగా అంపైర్ దగ్గరకువెళ్లి hows that hows that ......... అని అరుస్తున్నాడు . 
అంపైర్ : yes yes ......... అంటూ తలఊపి ఫింగర్ పైకెత్తారు .
అన్నయ్యా అన్నయ్యా .......... హ్యాట్రిక్ అంటూ పరుగునవచ్చి వాడిని పైకెత్తి సంబరాలు చేసుకున్నారు . 
అటువైపు నిరుత్సాహం - మావైపు మరింత ఉత్సాహం .......... బుజ్జిఅమ్మ అయితే లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించారు . 
బుజ్జిఅమ్మ కోరిక తీర్చినందుకు వాడి ఆనందానికి అవధులు లేవు .

లావణ్య వెంటనే చెల్లికి కాల్ చేసి అమ్మా ......... హ్యాట్రిక్ అని సంతోషంతో చెప్పడం ........... , 
అక్కయ్య ......... స్పీకర్లో విని ఆనందించి , ప్చ్ ......... చూడలేకపోయాము - నావలన నా బుజ్జిచెల్లికూడా వాళ్ళ నాన్న సంతోషాన్ని చూడలేకపోయింది .
బుజ్జిఅక్కయ్య : ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు అక్కయ్యా ......... , మీరు ఊ అంటే .........
అక్కయ్య : తియ్యని నవ్వుతో ఊ ........ అనడం .
బుజ్జిఅక్కయ్య : మల్లీశ్వరి - రాజేశ్వరి ......... అని కేకవేయ్యడం .
రెడీ బుజ్జితల్లీ అని అన్నీ కార్స్ ను స్టార్ట్ చెయ్యడంతో అక్కయ్య ....... బుజ్జిఅక్కయ్యతోపాటు లేచి , అక్కాచెల్లెళ్ళూ - తల్లులూ - బుజ్జాయిలూ ........ మీరు రావడం లేదా అని వడివడిగా వెళ్లి మొదటి కారులో కూర్చున్నారు . 
మేము మేము ......... అంటూ బుజ్జాయిలను ఎత్తుకుని కార్లలో చేరిపోయి బయలుదేరారు .

18.5 : నో రన్ .........
18.6 : సింగిల్ మాత్రమే ఇచ్చాడు . అప్పటికి స్కోర్ 219 / 7 .
కెప్టెన్ ....... కృష్ణగాడి దగ్గరకువెళ్లి అన్నయ్యా .......... తొలి ఓవర్ వేసి ఉంటే ఇంత స్కోర్ వచ్చేది కాదు కదా అని ఫీల్ అవుతూ చెప్పాడు .
కృష్ణ : అలా గెలిస్తే కిక్కు ఏముంటుంది కెప్టెన్ , చూడు స్కోర్ ఎంత ఊపుని ఇస్తోందో , ఇలా గెలిస్తేనే కదా మీరంటే ఏంటో తెలిసేది .
కెప్టెన్ : మీరెలా చెబితే అలా అన్నయ్యా .......... , అన్నయ్యా ........ అన్నయ్య కూడా బౌలింగ్ వేస్తారా ? .
కృష్ణ : వేస్తారా ఏంటి కెప్టెన్ ఇచ్చి చూడు నాకంటే బాగా వేస్తాడు . 
కెప్టెన్ : కృనాల్ అన్నయ్యా ........ ఫైనల్ ఓవర్ అంటూ బాల్ నావైపు విసిరాడు .

లావణ్య : మహేష్ మనోజ్ సర్ .......... మీ హార్ట్స్ కమింగ్ ఒక్క 5 నిమిషాలు ఎలా అయినా ...........
వస్తున్నారా ......... అంటూ ఎగిరి గెంతులేసి , రేయ్ మామా కెప్టెన్ ........ అంటూ పరుగునవెళ్లి విషయం చెప్పాను . 
కెప్టెన్ : 5 నిమిషాలా .......... ఓవర్ రేట్ అయితే extraa రన్స్ అనేంతలో ,
 అపొజిట్ కెప్టెన్ ........ అంపైర్స్ నో నో ......... అన్నా బ్రతిమిలాడి అనుమతి తీసుకుని వాళ్ళ బ్యాట్స్ మ్యాన్ దగ్గర మాట్లాడుతున్నాడు . స్కోర్ కొండంత ఉంది ఆలౌట్ మాత్రం అవ్వకండి అని టెయిలెండర్స్ కు ఎలా ఆడాలో వివరిస్తున్నాడు . 

అంతలో వరుసగా కార్స్ వచ్చి ఆగడం మొదట అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ....... దిగడం చూసి రేయ్ మామా .......... అంటూ వాడి భుజాన్ని నొక్కేసాను .
కృష్ణ : అమ్మా ........ రేయ్ ......... నన్ను కాదు వికెట్లను నొక్కు . మన అమ్మవారే సరైన సమయానికి అక్కయ్యను తీసుకొచ్చారు - ఫినిష్ చెయ్యడానికి ఓవర్ మొత్తం తీసుకున్నావో నేనే చంపేస్తాను .
కెప్టెన్ : ఆలౌట్ ఆలౌట్ ........ అలౌట్ పక్కా అయితే అంటూ సంతోషంతో వెళ్లి నిలబడ్డాడు .

అమ్మలూ డార్లింగ్స్......... అంటూ మహి - లావణ్య వాళ్ళు వెళ్లి అక్కయ్యతోపాటు అందరినీ పిలుచుకునివచ్చి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు . అమ్మలూ ......... హ్యాట్రిక్ చూడండి అని మహి మొబైల్లో రికార్డ్ చేసినది చూయించారు . కృష్ణ అమ్మా .......... మీ శ్రీవారి బౌలింగ్ సూపర్ అని చెల్లిని కవ్వించారు . మీరు చెప్పినట్లే జరిగింది.
చెల్లీ : ఫైనల్ ఓవర్ అన్నయ్య ఎలా వేస్తారో చూడండి . సూపర్ సూపర్ ........ అంటూ వేళ్ళతో సైగలు చేశారు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........ బాగా వేస్తారా .
బుజ్జిఅక్కయ్య : మూడు వికెట్స్ ఉన్నాయికదా , మీరు ఎలా వికెట్ పడాలని కోరుకుంటే అలా తీస్తారు . ఫస్ట్ వికెట్ ఎలానో కోరుకోండి .

అక్కయ్య : బుజ్జిచెల్లీ  .......... , is it పాజిబుల్ ......... అని సిగ్గుపడ్డారు .
బుజ్జిచెల్లి : ఒకసారి try చెయ్యండి . జరిగితే నమ్మండి లేకపోతే లేదు .
అక్కయ్య : అధికాదు బుజ్జిచెల్లీ ......... , నువ్వు చెప్పినది జరగకపోతే నాకు బాధతో కన్నీళ్లు వచ్చేస్తాయి .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా .......... , please please please .........
అక్కయ్య : మా బుజ్జిచెల్లి కోసం , అమ్మా .......... జరిగేలా చూడు తల్లీ అని ప్రార్థించారు . అందమైన సిగ్గుతో ఫస్ట్ బాల్ బోల్డ్ అవ్వాలి .
అంతే అక్కయ్యను హత్తుకుని కూర్చున్న ఏంజెల్స్ - మహి - లావణ్య వాళ్ళతోపాటు బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మకూడా లేచి బౌల్డ్ బౌల్డ్ అని అరిచారు . చుట్టూ ఉన్న మావాళ్ళంతా కూడా లేచి బౌల్డ్ బౌల్డ్ ......... అని రెండు ఏరియా లు వినిపించేలా సౌండ్ పెంచారు . 

బుజ్జిఅక్కయ్య వదిన గారికి సైగ చెయ్యడం - వదిన ద్వారా అన్నయ్య - అన్నయ్య ద్వారా లాంగ్ on లో ఉన్న కృష్ణగాడు తెలుసుకుని పరుగునవచ్చి రేయ్ మామా .......... ఇదీ విషయం . 
ఇద్దరమూ ......... సంతోషంతో చేతులుకలిపాము . ఎలా వెయ్యాలి గురువుగారూ అని అడిగాను . 
పిచ్ బౌన్స్ గురించి తెలిపి ......... స్ట్రెయిట్ మిడిల్ వికెట్ మాత్రమే చూస్తూ వెయ్యమన్నాడు . లాంగ్ on లో రాథోడ్ ను పంపించి మిడ్ on దగ్గరకువెళ్లి చెల్లికి - బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాడు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు dad , అంతా ok కదా .........
కృష్ణ : డబల్ ok అన్నట్లు రెండు చేతులను పైకెత్తి విక్టరీ చూయించాడు .
లవ్ యు గురువుగారూ అని డిస్టెన్స్ తగ్గించాను . అక్కయ్య వైపు ప్రాణంలా చూసి అమ్మవారిని తలుచుకుని నేరుగా మిడిల్ వికెట్ మాత్రమే చూస్తూ పరుగునవెళ్లి శక్తికొలది లైన్ లో లెంగ్త్ బాల్ వేసాను . కొద్దిగా inswing అవ్వడం బ్యాట్ ఎడ్జ్ తగిలి మిడిల్ వికెట్ అంతదూరం ఎగిరిపడింది . వెంటనే అక్కయ్యవైపు చూసి గురువుగారూ ......... అంటూ పరుగునవెళ్లి దూరం నుండే వాడి మీదకు జంప్ చేసాను  . 
అక్కయ్య షాక్ చెందినట్లు కదలకుండా ఉండిపోయారు . 
అక్కయ్యా - అమ్మా ........... అంటూ సంతోషంతో బుగ్గలపై ముద్దులుపెట్టడంతో తేరుకుని , బుజ్జిచెల్లీ ......... అంటూ గట్టిగా హత్తుకుని ముద్దులవర్షం కురిపించడం చూసి మురిసిపోయాము . 
తమ్ముళ్లు : అన్నయ్యా ........ సూపర్ అంటూ మమ్మల్ని చుట్టేశారు . 
కామెంటరీ : చెప్పినట్లుగానే బౌల్డ్ ..........

బుజ్జిచెల్లి : మా అక్కయ్య మాటే వేదం అని నేను చూస్తుండగానే పెదాలపై ముద్దుపెట్టి, అక్కయ్యా ....... నెక్స్ట్ బాల్ ..........
అక్కయ్య : నెక్స్ట్ బాల్ ఏమిజరగాలో నా తల్లి స్వప్న చెబుతుంది .
స్వప్న : లేదు లేదు లేదు .......... మా అమ్మనే చెప్పాలి మా అమ్మనే చెప్పాలి .
అక్కయ్య : మరింత సిగ్గుపడి క్యాచ్ - అదికూడా నా బుజ్జిచెల్లి dad అందుకోవాలి .
అందరూ : క్యాచ్ క్యాచ్ క్యాచ్ .......... క్యాచ్ బై కృనాల్ సర్ , క్యాచ్ బై కృనాల్ సర్ .............

రేయ్ మామా ............. గురువుగారూ ......
షార్ట్ పిచ్ కొద్దిగా లెగ్ సైడ్ వెయ్యరా ......... , ప్రాణాలైనా వదిలేస్తాను కానీ అక్కయ్య కోరికను తీరుద్దాము . అలాగే వాడి మూవ్ మెంట్ కూడా చూసుకో ...........
అంపైర్ నుండి బాల్ అందుకుని ఒరిజినల్ పొజిషన్ నుండి పరుగునవచ్చి , వాడు ఆఫ్ సైడ్ కదులడంతో నేనూ కాస్త ఆఫ్ సైడ్ షార్ట్ పిచ్ వేసాను . 
వాడు బ్యాట్ ను పూర్తిగా పైకెత్తి బలంతో కొట్టాడు . కిలోమీటర్ దూరం పైకి లేచి కృష్ణగాడివైపు వెళ్ళింది . చూస్తుంటే బౌండరీ దాటిపోయేలా ఉంది . సెంటీమీటర్ దూరంలో ఎగిరి క్యాచ్ అందుకుని ల్యాండ్ అయ్యి కదలకుండా ఉండిపోయాడు .
అపొజిట్ వాళ్ళు సిక్స్ సిక్స్ .......... అని అరుస్తున్నారు .
లెగ్ అంపైర్ కృష్ణగాడి కాలువైపే చూస్తూ పరుగునవెళ్లి ఔట్ అని చూయించడంతో , మావాళ్ళ అరుపులకు అడ్డు లేకుండా పోయింది . 

బుజ్జిఅక్కయ్య : లవ్ యు dad .......... అక్కయ్యా - అమ్మా .......... అంటూ సంతోషం పట్టలేక కొరికేశారు . 
స్స్స్ స్స్స్ ......... అంటూ చేతులనూ - బుగ్గలనూ రుద్దుకోవడం చూసి నవ్వుకున్నాము . 

బుజ్జిఅక్కయ్య : నెక్స్ట్ హ్యాట్రిక్ కదా అక్కయ్యా ...........
అక్కయ్య : అధికాదు బుజ్జిచెల్లీ , మీ dad సింగిల్ ఇచ్చారు కదా ...........
బుజ్జిఅక్కయ్య : లేచి సింగిల్ సింగిల్ .......... అంతే చుట్టూ అందరూ లేచి సింగిల్ సింగిల్ .......... 
అవతలివైపు కామెంటరీలో హమ్మయ్యా ......... వికెట్ అనలేదు అన్న మాటలు వినిపించడంతో మావైపు నవ్వు ఆగలేదు . 
కెప్టెన్ వెంటనే మైకు అందుకొని సిక్స్ సిక్స్ సిక్స్ ........... స్టేడియం మొత్తం అటువైపు సిక్స్ అని - మావైపు సింగిల్ .......... అని హోరెత్తింది .
ఇంట్రెస్టింగ్ అంటూ అంపైర్స్ నవ్వుకున్నారు .

కెప్టెన్ : కమాన్ గయ్స్ కమాన్ సింగిల్ మాత్రమే అని అందరినీ రింగ్ లోపలికి ఫీల్డింగ్ సెట్ చేసాడు .
కృష్ణ : సూపర్ కెప్టెన్ ...........
రేయ్ గురువుగా ........... 
అదికూడా చెప్పాలారా మామా .......... స్లో యార్కర్ అని చెప్పి పిచ్ ప్రక్కనే నిలబడ్డాడు . 
స్లో యార్కర్ వెయ్యడం వాడు కష్టపడి టచ్ చేసి పరుగుపెట్టడం - కృష్ణగాడికి బాల్ దొరికిన రన్ ఔట్ చెయ్యకుండా బ్యాట్స్ మ్యాన్ తోపాటు పరిగెత్తడం చూసి స్టేడియం మొత్తం నవ్వులు పూసాయి . 

అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... లవ్ యు టెస్ట్ చెయ్యడం కోసం ఇలాచేసి తప్పుచేసాను . హ్యాట్రిక్ మిస్ అయ్యింది .
బుజ్జిఅక్కయ్య - ఏంజెల్స్ : అక్కయ్యా - అమ్మా ......... చూడండి మీ కోరికవలన అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మా అమ్మ బంగారం అని ముద్దులుపెట్టి బుజ్జిఅక్కయ్యతోపాటు గట్టిగా హత్తుకుని , నెక్స్ట్ ఏమిటమ్మా ..........
అక్కయ్య : బౌలర్ బౌల్ చేసి తనే క్యాచ్ పట్టాలి .
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమ్మా ........... అని అందరూ లేచి కాట్ అండ్ బౌల్డ్ , కాట్ అండ్ బౌల్డ్  ............ అని చప్పట్లతో చెప్పారు .
కామెంటరీ : అయిపోయింది ఆలౌట్ ......... అక్కడ ఏమిచెబుతారో అదే జరిగితీరుతుంది . మ్యాచ్ స్టార్ట్ అప్పుడే ఇలా స్టార్ట్ చేసి ఉంటే హాఫ్ సెంచరీ కూడా దాటేవాళ్ళం కాదేమో ..........

కృష్ణగాడు వెళ్లి రేయ్ మామా డెక్ పై గట్టిగా కొట్టు హిప్ పైభాగం వరకూ మాత్రమే బౌన్స్ అవ్వాలి . తమ్ముళ్లూ .......... మీ దగ్గరకు వచ్చినా .......
చెప్పాలా అన్నయ్యా .............
నవ్వుకుని కుమ్మేయ్ మామా అని హైఫై కొట్టి వెళ్ళాడు . గురువుగారు చెప్పినట్లుగానే లెంగ్త్ బాల్ కాస్త బౌన్స్ అయ్యేలా కుక్కాను . హారిజాంటల్ బ్యాట్ పైన ఎడ్జ్ పై తగలడంతో నా ముందే పైకి లేవడం పెదాలపై చిరునవ్వుతో పట్టుకోగానే , రేయ్ మామా - అన్నయ్యా .......... అంటూ వచ్చి అమాంతం పైకెత్తేసి సంబరాలు చేసుకున్నారు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... అంటూ ప్రాణంలా హత్తుకుని లేచి అందరితోపాటు సంతోషంతో చప్పట్లు కొట్టారు . 

19.4 ఓవర్స్ 220 ఆలౌట్ .......... గెలవడానికి 221 పరుగులు కావాలి . ప్రతీ సంవత్సరం లానే సెంచరీ కే ఆలౌట్ అయిపోతారేమో ఉన్నదే 8 మంది అని నవ్వుకున్నారు . వన్ hour లంచ్ టైం తిరిగి మ్యాచ్ రెండు గంటలకు ప్రారంభం . 

బుజ్జిఅమ్మ - మహి - ఏంజెల్స్ కు పరుగునవచ్చి నన్ను చుట్టేసి ముద్దులతో ముంచెత్తాలని ఉన్నా ఆగిపోయి నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తున్నారు .
గుండెలపై చేతినివేసుకుని లవ్ యు లవ్ యు ఏంజెల్స్ .......... మీ కౌగిలిని ముద్దులను ఫీల్ అవుతున్నాను అని కళ్ళతోనే సైగలుచెయ్యడంతో పులకించిపోయి అక్కయ్యను చుట్టేశారు . 
కృష్ణ : రేయ్ మామా .......... నీ చెల్లి కాలింగ్ అంటూ వెళ్లి ప్రక్కనే కూర్చున్నాడు .
చెల్లి : లవ్ యు శ్రీవారూ .......... అని చేతిని చుట్టేసి చీరతో చెమటను తుడుస్తూ , మీ హ్యాట్రిక్ వినగానే అక్కయ్య చాలా చాలా ఆనందించారు . మీరు రారా అని మన బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఏకంగా కారులో కూర్చున్నారు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... తమ్ముడి దగ్గరకు వెళ్ళిరానా ? .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ .......... అని నుదుటిపై ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : ఒక్క నిమిషమే అక్కయ్యా ........ ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వచ్చారు . ఎండలో ఉన్న నన్ను చేతిని అందుకుని అక్కయ్య ముందు కూర్చోబెట్టి , కర్చీఫ్ లేదే ఇప్పుడెలా అని బుజ్జి బుగ్గలతో నా ముఖంపైన పట్టిన చెమటను తుడిచారు . 
మహి ఏంజెల్స్ ......... అక్కయ్యకు కనిపించకుండా సూపర్ అంటూ బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా .......... బౌలింగ్ బాగా వేశానా అని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
బుజ్జిఅక్కయ్య : సూపర్ తమ్ముడూ ......... ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఎంజాయ్ చేసాము - అక్కయ్య కూడా అని సైగలుచేశారు .
అంతులేని ఆనందంతో పరవశించిపోయి , అంతా అదిగో అక్కడ కూర్చున్నాడే వాడి వల్లనే ............ మా గురువుగారు .
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని నా బుగ్గపై ఉమ్మా ........ అంటూ ముద్దుపెట్టి లేచి అక్కయ్యా ......... మరొక్క నిమిషం అంతే అని పరుగునవెళ్లి వాడి గుండెలపైకి చేరిపోయి ముద్దులుపెట్టి , అక్కయ్య ఒడిలో చేరిపోబోయి ఒక్క క్షణం అక్కయ్యా ......... తమ్ముడి చెమట అని ముఖం కడుక్కున్నారు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ అని చీర కొంగుతో తుడిచి ఆకలేస్తోందా ఇంటికివెళదామా అని అడిగారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:26 AM



Users browsing this thread: 5 Guest(s)