Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
  9గంటలకు అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ కలవరిస్తూ బెడ్ పై స్పృశించి అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ సడెన్ గా లేచికూర్చుని , చుట్టూ రూమ్ మొత్తం అపార్ట్మెంట్ బుజ్జాయిలు పిల్లలు ఉండటం చూసి ఆశ్చర్యంతో కదలకుండా ఉండిపోయారు . 
అక్కయ్యలూ - అంటీ ........... మా బుజ్జి ఫ్రెండ్స్ నిద్రలేచారు అంటూ నలుగురు పరుగున వెళ్లారు . 
అందరినీ ఒకేసారి అదికూడా తమ చుట్టూ చూసి బుజ్జాయిలకు సంతోషం పట్టలేక వెక్కిళ్ళు వచ్చేసాయి .
అక్కయ్యలూ - అంటీ ......... వాటర్ వాటర్ అంటూ మరొక నలుగురు పరిగెత్తారు . 

చెల్లెళ్ళు ........ నీళ్లతో పరుగునవచ్చి బుజ్జితల్లీ - బిస్వాస్ ......... అంటూ ప్రాణంలా హత్తుకుని తాగించి , మీరు చూస్తున్నది నిజమే , మీతో ఆడుకోవడానికి నాలుగు బిల్డింగ్స్ లోని అందరూ తమ పిల్లలను మీదగ్గరికి సంతోషంతో పంపించారు - ఇక అందరూ మీతోనే ఆడుకుంటారు - మీకోసం తెల్లవారుఘామున నుండీ ఇష్టంతో మీరెప్పుడు లేస్తారా అని ఇక్కడే ఎదురుచూస్తూ ఉన్నారు .
కీర్తి - బిస్వాస్ - చెల్లీ - తమ్ముడూ .......... మమ్మల్ని క్షమించండి - మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుండీ మనమంతా కలిసి సంతోషంతో ఆడుకుందాము - మీతో వెళ్లి ఆడుకోండి అని అర్ధరాత్రి నిద్రపోతున్న మాపై నీళ్లుచల్లి మరీ జరజరా లాక్కునివచ్చారు అమ్మావాళ్ళు - మీరు మాతో ఆడుకుంటేనే మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకుంటారంట లేకపోతే బయటే ..........
బుజ్జాయిలిద్దరూ ............ సంతోషంతో బుజ్జిబుజ్జినవ్వులు నవ్వారు .
కీర్తి - బిస్వాస్ ........ నవ్వారు అని సంతోషంతో బుజ్జాయిలు - పిల్లలందరూ ......... ఒక్కొక్క గిఫ్ట్ అందించి మురిసిపోయారు . 

చెల్లెళ్ళు : సంతోషించి , చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జాయిల నుదుటిపై - బుగ్గలపై - కురులపై .......... ప్రేమతో ముద్దులుపెట్టారు . అక్కయ్యా అక్కయ్యా ......... ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నారు లోపలికి రండి .
మేడం : లోపలికివస్తే కొడతారు చెల్లెళ్ళూ ...........
బుజ్జాయిలు : అక్కయ్యలూ .......... అన్నయ్య వల్లనే కదా ఇదంతా .........
చెల్లెళ్ళు : అవునన్నట్లు మళ్లీ ముద్దుల వర్షం కురిపించారు . మీ సంతోషం కోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తారు .
బుజ్జాయిలు : అన్నయ్య ఎక్కడ , రాత్రి అన్నయ్య దగ్గర ఉన్నాము కదా ఇక్కడికి ఎలావచ్చాము . అమ్మ ఎత్తుకుని వచ్చిందా అని కోపంతో రూమ్ బయటకువెళ్లి మేడం గుండెలపై కొట్టి బుగ్గలను కొరికేశారు . హాల్ మొత్తం ఉన్న అపార్ట్మెంట్ అమ్మలు సంతోషంతో నవ్వుతుండటం చూసి , ఇంతమంది తమ ఇంటిలోనా మరియు తమ తల్లి స్వచ్ఛమైన సంతోషాన్ని చూసి కళ్ళల్లో చెమ్మతో అమ్మా ........... అన్నయ్య వల్లనే కదా అంటూ గుండెలపైకి చేరిపోయారు .
మేడం : అవును తల్లీ - నాన్నా ........... అని ఆనందబాస్పాలతో చెప్పారు .

అమ్మా అమ్మా .......... అన్నయ్య దగ్గరికి వెళతాము అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి పరుగుబెట్టబోయి ఆగి వెనక్కుతిరిగి , ఫ్రెండ్స్ - అక్కయ్యలూ - అన్నయ్యలూ .......... రండి మన అన్నయ్య దగ్గరికివెళదాము అని పిలిచారు . 
అమ్మలూ ........... మేమంతా ఫ్రెండ్స్ అయిపోయాము అని బుజ్జాయిల చుట్టూ చేరారు . 
బుజ్జాయిలతోపాటు అందరి ఆనందాలకు అవధులే లేకపోయాయి . 
మేడం - అక్కయ్యలు : కీర్తి తల్లీ - బిస్వాస్ .......... మీ అన్నయ్యకోసం ప్రేమతో టిఫిన్ చేసాము .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా - లవ్ యు అక్కయ్యలూ ........... అని హాట్ బాక్స్ ప్లేట్స్ వాటర్ ............. అందుకుని పరుగున వచ్చి , డోర్ దగ్గర నుండే సోఫాలో పడుకుని ఉండటం చూసి ష్ ష్ ష్ ......... అంటూ అడుగులో అడుగువేసుకుంటూ లోపలికివచ్చారు . 

నిద్రలోనే బుజ్జితల్లీ - నాన్నా బిస్వాస్ ........... అని ప్రాణంలా పిలిచాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ......... అంటూ హాట్ బాక్స్ టేబుల్ పై ఉంచి నా గుండెలపైకి నిలువునా చేరిపోయి ఎలా తెలిసింది అని బుగ్గలను కొరికేశారు .
నా బుజ్జాయిల అడుగుల చప్పుడే నా గుండెచప్పుడు అని ప్రాణంలా నా గుండెలపైకి హత్తుకున్నాను . బుజ్జితల్లీ ........... ఘుమఘుమలు అంటూ లేచికూర్చుని పిల్లలను చూసి ఆశ్చర్యపోయాను . 
బుజ్జాయిలు : అన్నయ్యా .......... నా ఫ్రెండ్స్ అక్కయ్యలు అన్నయ్యలు - ఫ్రెండ్స్ ......... మా ప్రాణం అని పరిచయం చేసారు .
అందరూ : hi అన్నయ్యా hi అన్నయ్యా .......... 
Hi hi ............ అమ్మో ఇంతమంది ఫ్రెండ్స్ , ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు - నా బుజ్జితల్లి బిస్వాస్ కు మాత్రమే అని ముద్దులతో ముంచెత్తాను .

పిల్లలూ ......... టిఫిన్ చేసి ఆడుకుందురు రండి అని పిల్లల అమ్మలు పిలిచారు .
అందరూ : కీర్తి - బిస్వాస్ ........ ఇంటికివెళ్లివస్తాము అందరమూ కలిసి ఆడుకుందాము అనిచెప్పి టాటా చెప్పారు .
బుజ్జితల్లీ - బిస్వాస్ ........... ఫ్రెండ్స్ అయిపోయారు కదా - మీ ఫ్రెండ్స్ కు గిఫ్ట్స్ ఇవ్వాలికదా మరియు మీ బుజ్జి ఫ్రెండ్స్ ను కూడా పరిచయం చెయ్యాలికదా ............
బుజ్జాయిలు : అవును అన్నయ్యా ......... ఇవ్వాలి అని తలలు దించుకున్నారు .
నా బుజ్జాయిలు బంగారం అంటూ కురులపై ముద్దులుపెట్టి , అదిగో ఆ బాక్స్ లలో ఒకదానిలో పెద్ద పెద్ద చాక్లెట్ లు మరొకదానిలో బుజ్జి బుజ్జి టెడ్డి బేర్ లు ఉన్నాయి - మీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వండి అనిచెప్పాను .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా .......... అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవెళ్లి బాక్స్ లలో చూస్తే నిండుగా చాక్లెట్ లు టెడ్డి బేర్ లు ఉన్నాయి . ఫ్రెండ్స్ ......... అంటూ చాక్లెట్ లు టెడ్డి బేర్ లు అందించారు . ఒకటి తియ్యగానే వాటి ప్లేస్ లో మరొకటి ప్రత్యక్షము అయ్యింది - వందకుపైనే ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు .
lలవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని తలుచుకున్నాను .

అందరూ సంతోషంతో అందుకుని థాంక్స్ కీర్తి - బిస్వాస్ ......... అని అపార్ట్మెంట్స్ మొత్తం వినిపించేలా కేకలువేశారు . 
బుజ్జాయిలు : అంతులేని ఆనందంతో , ఫ్రెండ్స్ ......... ఇక మన బుజ్జి ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తాను అని అక్వేరియంలోని చేపలను చూయించింది . వాటి ఆనందం తారాస్థాయికి చేరినట్లు ఎగిరెగిరి గెంతులేసాయి .
చేపలను పలకరించి బుజ్జాయిలను కౌగిలించుకుని పిల్లలందరూ వెళ్లిపోయారు .
బుజ్జాయిలు : బై బై ........ ఫ్రెండ్స్ , అన్నయ్యా అన్నయ్యా ......... చూసారా ? 
అవును బుజ్జితల్లీ - నాన్నా .......... మరి మీరంటే అంత ప్రాణం వాటికి అని ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు బుజ్జిబుజ్జినవ్వులతో చేపలను స్పృశించి పలకరించారు . ఆకలేస్తోందా ........... మాకు కూడా అని ఫుడ్ వేసి ఆనందించారు .

బుజ్జితల్లీ - బిస్వాస్ ......... ఆకలేస్తోందా , నాకు కూడా .......... 
మన ఆకలి గురించి అమ్మకు - అక్కయ్యలకు బాగా తెలుసు అన్నయ్యా ......... అందుకే అని హాట్ బాక్స్ వైపు చూయించారు .
బుజ్జితల్లీ .......... నేనింకా బ్రష్ చెయ్యలేదు - అంత ఓపిక కూడా లేదు క్లోజ్ లో ఉన్న హాట్ బాక్స్ నుండే ఘుమఘుమలు అధిరిపోతున్నాయి ఇక ఓపెన్ చేస్తే అని పెదాలను తడుముకున్నాను .
బుజ్జాయిలు :  : అన్నయ్యా - అన్నయ్యా .......... మీకు ఒక విషయం చెబుతాము - మేముకూడా బ్రష్ చెయ్యలేదు - బ్రష్ చేయాలన్నా శక్తిలేదు . ఎవ్వరూ చూడటం లేదు కాబట్టి ముందు తినేసి తరువాత బ్రష్ చేద్దాము .
వద్దు బుజ్జితల్లీ ......... మీ అమ్మకు తెలిస్తే నన్ను కొడతారు . ఇప్పటికే రెండు చెంప దెబ్బలు పడ్డాయి అని దీనంగా చెప్పాను . 
బుజ్జితల్లి : ఎవరు అన్నయ్యా .......... అమ్మ మిమ్మల్ని కొట్టారా ? , అదికూడా రెండుసార్లు . ప్చ్ ......... మేము చూడలేకపోయాము - మీరంటే ఎంత ప్రాణం అయితే కొడతారు - ఇంతవరకూ మమ్మల్ని కూడా కొట్టనేలేదు - మిమ్మల్ని కొట్టారంటే అమ్మకు మాకంటే మీరంటేనే ఎక్కువ ప్రాణం అన్నమాట - ఇప్పుడు బ్రష్ చెయ్యకుండా తిని అన్నయ్యే బ్రష్ చెయ్యకుండా తినొచ్చు అని తినిపించేశారు అమ్మా ........ అని అపద్దo చెబుతాము - అప్పుడు అంతులేని ప్రేమతో ప్రాణంలా ఎలా కొడతారో చూడాలని ఉంది అని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .

బుజ్జితల్లీ ........... ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు .
బుజ్జాయిలు నవ్వుకుని అమ్మ వచ్చాక పూర్తిగా అర్థమౌతిందిలే అన్నయ్యా ......... , అమ్మా ఆకలి అన్నయ్యా ....... ఆకలి - తినిపిస్తారా లేక మీ బుగ్గలను కొరుక్కుని తినేయ్యమంటారా ? 
తియ్యదనంతో నవ్వుకుని ముద్దుచేస్తూ వాష్ బేసిన్ దగ్గరకువెళ్లి చేతులు కడుక్కున్నాను - అన్నయ్యా అన్నయ్యా ......... మేముకూడా అని వొంగి కడుక్కున్నారు . కుమ్మేద్దాము రండి అని సోఫాలో కూర్చున్నాము . కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక హాట్ బాక్స్ ఓపెన్ చేసి ఆఅహ్హ్ .......... నా దేవత వంట అని మురిసిపోయాను .
బుజ్జితల్లి ప్లేట్ లో వడ్డించుకుంది . నేను........ బుజ్జాయిలకు - బుజ్జాయిలు ...... నాకు తినిపించుకుని మ్మ్మ్మ్మ్.......... సూపర్ అని నవ్వుకున్నాము . 

బుజ్జితల్లి : అన్నయ్యా ........... ఇంటి నిండా అక్కయ్యలు అంటీ వాళ్ళు , అమ్మ ఆనందానికైతే అవధులే లేవు అంత ఆనందంతో ఉన్నారు . అమ్మ అలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు . లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ........... అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో ముద్దకలిపి పెడుతున్న చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . మేమంటే ఎందుకు అన్నయ్యా ......... అంత ప్రాణం - ఇప్పటివరకూ మానుండి ఏమీ ఆశించకుండా ...........
ఇందులో నా స్వార్థం కూడా ఉంది బుజ్జితల్లీ ........... , దేవ ...... మేడం ........ మీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మ పెదాలపై మీరు కోరుకున్న ఆనందం నవ్వు చూడాలని - ఆ పెదాలపై ఆ పెదాలపై .......... అని సిగ్గుపడి బుజ్జితల్లి ఒడిలో తలదాచుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా .......... మీ ప్రియమైన బుజ్జాయిలదగ్గర సిగ్గుపడుతున్నారా , చెప్పండి చెప్పండి అని బుగ్గపై ముద్దులుపెట్టారు . 
 లేచి కూర్చుని మెలికలు తిరిగిపోతూ బుజ్జితల్లీ - బిస్వాస్ ......... ఆ చిరునవ్వులు చిందిస్తున్న మీ అమ్మ పెదాలపై అనేంతలో .............
అన్నయ్యా అన్నయ్యా ........... అని కేకలు వినిపించడంతో బయటకువెళ్ళాను .
ఒంటిపై నిలువెల్లా కట్లతో వచ్చిన గోవర్ధన్ గాడు - నా ఇంటిలోకి ఇంతమందిని ఎందుకు రానిచ్చావని  దేవ .......... మేడం ను కొట్టబోతుంటే , రేయ్ ....... అన్నాను .
అంతే వాడు నన్నుచూసి అంత దూరం వెళ్లి భయంతో బిక్కుబిక్కుమంటున్నాడు .
చెల్లెళ్ళు అయితే గట్టిగా నవ్వేశారు . వాళ్ళతోపాటు మేడం కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
రేయ్ ......... స్త్రీలు - అమ్మాయిలు మనకు దేవతలూ - దేవకన్యలతో సమానం . వారిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలికానీ నీలా మృగం లా హింసించకూడదు .

వాడు భయపడుతూనే లోపలికివెళ్లి కొన్ని క్షణాల తరువాత కోపంతో వచ్చి , నా డబ్బు నా డబ్బు అన్నాడు .
దేవత : ఇంకెక్కడ డబ్బు , ఉదయం IT వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయారురా ........... ఎన్ని పాపాలు చేసి సంపాదించావు చివరికి ఇలా వెళ్ళిపోయింది .
వాడు :  నన్ను రా ........ అంటావా అని మళ్ళీ కొట్టబోతే ఈ సారి మేడం స్వయంగా చేతిని పట్టుకుని వాడిని వెనక్కు తిప్పి పట్టుకుంది .
వాడు నొప్పితో విలవిలలాడిపోయి గింజుకుంటూ బ్రతిమాలడంతో వదిలారు .
అధిచూసి నేనూ - బుజ్జాయిలు - చెల్లెళ్ళు షాక్ లో అలా నిలబడిపోయాము . 
 వాడు : నన్నే కొడతావా ........ అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందే నీకు ........
మేడం నావైపు ఆరాధనతో చూసి నవ్వుకున్నారు .

వాడు చేతిని విదిలించుకుని , ఈ డబ్బు పోతేనేమి నీపేరుమీద ఉన్న ఆ ఇంటిని అమ్మేస్తే పాతిక కోట్లు వస్తాయి మరియు ఇప్పుడు నన్ను వైజాగ్ మొత్తం మారిపోయాను అనుకుంటున్నారు - ఈ మంచితనపు ముసుగులో మరొక పాతిక కోట్లు అవలీలగా దోచుకుంటాను .

 
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 09-12-2020, 11:17 AM



Users browsing this thread: rk031423, 26 Guest(s)