Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
పెద్దమ్మా దేవ .......... మేడం దగ్గరకు వెళ్ళాలి అనిచెప్పాను . 
వెహికల్ వేగంగా కదిలింది . 
పెద్దమ్మ : శ్రీవారూ .......... ఇకనుండీ నాదేవత అని ప్రేమతో పిలవవచ్చుకదా ........
ఆ మధురమైన పిలుపు పిలవమని మేడం మనసారా అడగాలని ఉంది పెద్దమ్మా ..........
పెద్దమ్మ : సరే సరే .......... మీ చిలిపి కోరికలు మీఇష్టం అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . నీ దేవత నిన్ను స్వామీ అని పిలవాలి - నీ బుజ్జాయిలు నిన్ను ........ ok ok wait చేస్తాను . అందులోనూ మాధుర్యం ఉందని తెలియజేసారు శ్రీవారూ ........... లవ్ యు అని నా బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జాయిలను ప్రాణంలా జోకొట్టారు . 

20 నిమిషాలలో అపార్ట్మెంట్ చేరుకున్నాము . బుజ్జాయిలకు చల్లదనం తాకకుండా వెచ్చని దుప్పటి కప్పి గుండెలపై హత్తుకునే కిందకుదిగాను .
మెయిన్ గేట్ దగ్గర  - మా బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు . నన్నుచూసి నాదగ్గరకువచ్చి సెల్యూట్ చేసి మేడం గారికి త్రెట్ ఉందని , విశ్వ సర్ ......... అపార్ట్మెంట్ మొత్తం మరియు 8th ఫ్లోర్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు సర్ అనిచెప్పారు .
థాంక్యూ soooooo మచ్ సర్ అని నా బుజ్జాయిల బుగ్గలపై వెచ్చని ముద్దులుపెట్టాను .
మ్మ్మ్ మ్మ్మ్ ......... అంటూ మరింత చుట్టేయ్యడం తెలిసి ఆనందించాను .

బిల్డింగ్ లోపలికివెళ్లబోతుంటే అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ 8 మంది అమ్మాయిలు నాదగ్గరికివచ్చారు . 
Yes ........ అంటూ ఒక అమ్మాయిని గుర్తుపట్టి చెల్లెమ్మా ......... అని కంగారుపడుతున్నాను .
చెల్లెమ్మ : అవునన్నయ్యా ........ , మీరేమీ కంగారుపడకండి - మిమ్మల్ని నేను అక్కడే నా ముసుగు తియ్యగానే గుర్తుపట్టాను ( రోజూ ........ బుజ్జాయిలను ఎత్తుకుని చిరునవ్వు పంచుతూ ఎత్తుకునివెళ్లడం రావడం చూసాను )  - మీ మనసులోని ఉద్దేశ్యం మాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది - ఒక రాక్షసుడు చేసిన తప్పుకు కావ్య అక్కయ్యను - అభం శుభం తెలియని బుజ్జాయిలను దూరం పెట్టడం మాదే తప్పు - ఈ విషయం మావాళ్లకు ఎవ్వరికీ చెప్పలేదు - మీరు న్యూస్ లో చెప్పినట్లుగానే అపార్ట్మెంట్ లోని అందరూ అనుకుంటున్నారు - మొత్తం అపార్ట్మెంట్ వాళ్లంతా కావ్య అక్కయ్య దగ్గరే ఉన్నారు - మేము తాము చేసినది తప్పు అని క్షమించమని కోరి ఆప్యాయంగా ప్రేమతో పలకరించారు - మొదట ఏమీ తెలియని అక్కయ్య ఆశ్చర్యపోయారు విషయం తెలుసుకుని న్యూస్ చూసి ఆనందబాస్పాలతో అందరినీ మన్నించి చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు - మా పేరెంట్స్ మొబైల్స్ లో వీడియో కూడా తీసాము అన్నయ్యా ........... - మీరు ఇంకా రాలేదని తెలిసి కిందనే వేచి చూస్తున్నాము - అన్నయ్యా ......... కావ్య అక్కయ్యను ఇక ఎవ్వరూ బాధపెట్టరు - బుజ్జాయిలతో కలపడానికి నిద్రపోతున్న తమ తమ పిల్లలను లేపి మరీ పిలుచుకునివచ్చారు - ముందు మీరు వీడియో చూడండి అని వెచ్చని దుప్పటిలో హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిలను అన్నయ్యా ........ మేము అంటూ ప్రేమతో ఎత్తుకున్నారు .
Sorry sorry .......... బుజ్జాయిలూ , మేమంతా చేసినది చాలా చాలా తప్పు - అన్నయ్య వలన మా తప్పు తెలిసింది - మీరు ఒప్పుకుంటే ఇక నుండీ మిమ్మల్ని అపార్ట్మెంట్స్ మొత్తం ఆప్యాయంగా , ప్రేమతో , ప్రాణంలా చూసుకుంటారు - మీ ప్రాణమైన కావ్యఅమ్మను దేవతలా చూసుకుంటారు - మమ్మల్ని క్షమించాము అని మమ్మల్ని హత్తుకుని చెబితే మేము చాలా చాలా హ్యాపీ ..........
బుజ్జాయిలు నిద్రలోనే ఎత్తుకున్న చెల్లెళ్లను హత్తుకోవడంతో , ఇంత బంగారు బుజ్జాయిలను ఏడిపించాము sorry sorry అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా ముద్దులుపెట్టారు .

నా బుజ్జాయిలు ......... చెల్లెళ్ళ గుండెలపై గువ్వపిల్లల్లా నిద్రపోవడం చూసి ఆనందించాను . చెల్లి అందించిన మొబైల్లోని వీడియోని ప్లే చేసాను . అపార్ట్మెంట్ లోని వారంతా వందలమంది పిల్లలతో సహా మేడం ఇంటికి చేరుకుని పశ్చాత్తాపంతో కాలింగ్ బెల్ నొక్కడానికి కూడా తమ తప్పు గుర్తుకువచ్చి వెనకడుగువేశారు . ఇంతదాకా వచ్చి మన కావ్యను ........ అని నొక్కారు .
సాయంత్రం నుండి కూడా ఏడుస్తూనే ఉన్నట్లు ఎర్రని కళ్ళతో బుగ్గలపై కన్నీటి ధారల గుర్తులతో బయటకు రావడం చూసి నా కళ్లల్లో కన్నీరు చేరాయి .
కావ్య - చెల్లీ ........... మమ్మల్ని క్షమించు అని ఏకంగా పాదాలను తాకబోతే , ఆశ్చర్యంతో లేపారు . 
మీ వలన మా బిడ్డలు సేఫ్ గా ఇంటికివచ్చారు - మీరుణం మా జీవితాంతం తీర్చుకోలేనిది - మిమ్మల్ని పిల్లలను చాలా చాలా బాధపెట్టాము - అందుకే మా పిల్లలను కూడా పిలుచుకునివచ్చాము - మీ బుజ్జాయిలతో ఆడుకునే అదృష్టాన్ని ప్రసాధించండి అని రెండుచేతులతో నమస్కరించారు . 

అన్నయ్యా ......... ఇక్కడే మీ ఉద్దేశ్యం ఏంటో మాకు తెలిసింది - కావ్య అక్కయ్య ఏమీ తెలియనట్లు కంగారుపడుతుంటే లోపలికి పిలుచుకొనివెళ్లి టీవీ on చేసి చూయించాము - మీరు మమ్మల్ని వందల మంది రాక్షసుల నుండి సేవ్ చేశారని జరిగినదంతా వివరించాము - అక్కయ్య ఎంత ఆనందించారో మీరే చూడండి .
మేడం స్వచ్ఛమైన ఆనందాన్ని నవ్వుని చూసి హృదయం పులకించింది . పెద్దమ్మా పెద్దమ్మా .......... 
నా మొబైల్ కు మెసేజ్ వచ్చింది , తీసి చూస్తే అపార్ట్మెంట్ వాసులతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో పంపించారు - శ్రీవారూ ......... తమరు మొబైల్లో చూస్తే నేను లైవ్ లో చూస్తున్నామండీ , లవ్ యు .............
చిరునవ్వులు చిందిస్తున్న మేడం కు ఉమ్మా ........ అంటూ ముద్దుపెట్టబోయి ఆగిపోయాను .
మెసేజ్ సౌండ్ - శ్రీవారూ ........ మొబైల్లో ఏంటి నేరుగా వచ్చి పెడితే నీ దేవత ఏమైనా కాదంటుందా ...........
లవ్ టు శ్రీమతిగారూ .......... కానీ , 
పెద్దమ్మ : నీ దేవతే మొదట ప్రేమతో పెట్టాలని తమరి చిలిపికోరిక అంటారు అంతేగా తథాస్తు ..........
నా కోరిక తీరుతుందా పెద్దమ్మా ...........
పెద్దమ్మ : ఆ తియ్యని కోరిక అతి తొందరగా తీరాలంటే , తమరు ఇప్పుడే పైకి రాకుండా వాడు ఉన్న హాస్పిటల్ కు వెళ్ళండి . 
వాడి దగ్గరికా ? , పెద్దమ్మా ......... వాడు అన్న మాటలకు వాడిని చూస్తే అక్కడే చంపేస్తాను . 
పెద్దమ్మ : ఒక్కరోజు ఆగండి శ్రీవారూ ..........., తమరిపై ఎంత ప్రేమ ....... వద్దులే తమరే తెలుసుకుంటారు అని ముద్దులు పంపించారు .
లవ్ యు పెద్దమ్మా .......... మీరు ఎలాచెబితే అలాచేస్తాను అని వీడియో మొత్తం చూసి , చెల్లెమ్మా ......... వీడియో నాకు పంపిస్తారా ..........అని అడిగాను .
చెల్లి : అన్నయ్యా అన్నయ్యా .......... 8 మంది 8 వైపుల నుండీ వీడియో తీసాము అన్నింటినీ పంపిస్తాము అని నా మొబైల్ అందుకుని పంపించారు . నా మొబైల్లో ఉన్న బుజ్జాయిల ఫోటోలను నా అనుమతి తీసుకుని పంపించుకుని స్క్రీన్ సేవ్ చేసుకుని చూయించారు .
చాలా సంతోషం చెల్లెళ్ళూ ........... ముఖ్యమైన పని ఉంది వెళ్ళాలి .
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా ......... ప్చ్ ప్చ్ ప్చ్........ అంటూ నిరాశతో మా బుజ్జాయిలను మాదగ్గరే ఉంచుకోవచ్చా ..........
చెల్లెళ్ళూ ............ ఒక్క క్షణం కూడా ..........
Sorry sorry అన్నయ్యా .......... ఎంత ప్రాణమో మాకు తెలుసు , మీరు ఇంటికివచ్చాక వచ్చి ఎత్తుకుంటాము అయితే , మిమ్మల్ని విడదీసి మరొక తప్పు చెయ్యము అని అందరూ ప్రేమతో ముద్దులుపెట్టి అందించారు . 
నా బుజ్జాయిలను అతీసున్నితంగా అందుకొని చెల్లెమ్మలూ .......... ఒక సహాయం - నేను వచ్చేన్తవరకూ మీ అక్కయ్యతో ఉండగలరా ........... ,
చెల్లెళ్ళు : మీరు చెప్పకపోయినా అక్కడే ఉంటాము - మేమేకాదు అమ్మలు కూడా అక్కడే - ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు మీరు భయపడాల్సిన అవసరమే లేదు .
థాంక్స్ చెల్లెమ్మలూ ......... అనిచెప్పి బుజ్జాయిలకు ముద్దులుపెడుతూ వెహికల్ ఎక్కగానే హాస్పిటల్ కు బయలుదేరింది.

సోఫాలో కూర్చుని నా బుజ్జాయిలను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ హృదయమంతా నింపుకుంటూ జోకొట్టాను . 
మొబైల్ అందుకొని విశ్వ సర్ కు కాల్ చేసి థాంక్స్ చెప్పాను .
విశ్వ సర్ : మహేష్ .......... మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా ఇక మన మధ్యన థాంక్స్ లు ఉండకూడదు - మేమే నీకు చాలా థాం .......... చెప్పాలి అని నవ్వుకున్నారు . మా వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్లు నీకు చాలా ఋణపడిపోయాము - కనీసం ఇలా అయినా తీర్చుకోకపోతే ఎలా .......... . మహేష్ ........ ఇంటికి చేరుకున్నావా అని అడిగారు . 
నో సర్ .......... హాస్పిటల్ కు వెళుతున్నాను .
విశ్వ సర్ : మహేష్ .......... వాడికోసమా ? , 
తప్పలేదు సర్ , చెప్పానుకదా కొన్నిరోజులు అని , తరువాత వాడి సంగతి చూద్దాము.
విశ్వ సర్ : ఆ మాట కోసం ఎదురుచూస్తూ ఉంటాను మహేష్ .......... వాడిని ఊరికే వదిలేది లేదు .
తరువాత మీ ఇష్టం సర్ .......... నేనూ ఎంజాయ్ చేస్తాను అని కట్ చేసి చెల్లెళ్ళు పంపించిన వీడియో ఓపెన్ చేసాను - అక్కయ్యా - అక్కయ్యా .......... మీ కన్నీళ్లను చూస్తుంటే మీరు భోజనం కూడా చేసినట్లు లేరు అని ఫ్రిడ్జ్ నుండి ఒకరు fruits మరొకరు బ్రెడ్ జామ్ మరొకరు పాలు వేడిచేసుకునివచ్చి తినిపించడం చూసి థాంక్స్ చెల్లెళ్ళూ ........ అని తలుచుకుని ఆనందించాను . వీడియోస్ చూస్తూ హాస్పిటల్ చేరుకుని బుజ్జాయిలను లోపలికి పిలుచుకునివెళ్లడం ఇష్టం లేక పెద్దామ్మా ....... చూసుకోండి అనిచెప్పి లోపల బెడ్ పై పడుకోబెట్టి ఇద్దరి చేతులకు టెడ్డీ బేర్స్ అందించి ప్రాణమైన ముద్దులుపెట్టి లోపలకువెళ్ళాను . 
సర్ సర్ .......... అంటూ Z కేటగిరీ భద్రతలా చుట్టూ చేరారు . విశ్వ సర్ కు థాంక్స్ చెప్పి లోపలికి ICU దగ్గరికి చేరుకోగానే మీడియా నన్ను చుట్టుముట్టింది . ఆ వెంటనే అన్నయ్యా అన్నయ్యా ......... అన్న నా బుజ్జాయిల తియ్యని పిలుపు వినిపించడంతో , please please ....... అంటూ గుంపులోనుండి బయటకువచ్చాను .
అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ క్షణంలో నా గుండెలపైకి చేరి , మమ్మల్ని వదిలి వచ్చేస్తారా ........... అని తియ్యనికోపంతో గుండెలపై ప్రాణంలా కొట్టి విడిపోనంతలా హత్తుకున్నారు .
**************

నేను హాస్పిటల్ కు బయలుదేరగానే చెల్లెళ్ళు దేవ ........... మేడం దగ్గరికి చేరుకున్నారు . 
అక్కయ్యా అక్కయ్యా .......... కీర్తి - బిస్వాస్ ......... వాళ్ళ ప్రాణమైన అన్నయ్య గుండెలపై ఎలా నిద్రపోతున్నారో చూడండి అని మొబైల్ అందించారు - అక్కయ్యా .......... మేము కూడా ఎత్తుకున్నాము - ప్రేమతో పిలువగానే నిద్రలోనే మాదగ్గరికివచ్చారు - ముద్దులుపెట్టి పులకించిపోయాము . 
మేడం : చెల్లెళ్ళూ ........... చూస్తుంటే మన అపార్ట్మెంట్ లానే ........
చెల్లెళ్ళు : లానే ఏంటి అక్కయ్యా .......... , కిందనే అనిచెప్పడం ఆలస్యం ........
మేడం ఆనందబాస్పాలతో కిందకు పరుగుతీశారు - వెనుకే చెల్లెమ్మలూ - ఆ వెనుకే లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఫాలో అయ్యారు . 
మేడం ......... మాకోసం కాంపౌండ్ మొత్తం వెతికి , నిరాశతో చెల్లెమ్మలూ చెల్లెమ్మలూ........... ఎక్కడ ఎక్కడ అని అడిగారు . 
చెల్లెళ్ళు : అక్కయ్యా .......... ముఖ్యమైన పని ఉందని బుజ్జాయిలను గుండెలపై ప్రాణంలా జోకొడుతూ వెళ్లిపోయారు . మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకోండి అని వందసార్లకుపైనే చెప్పారు . 
ఒకవైపు సంతోషం - మరొకవైపు కనిపించలేదని బాధతో కళ్ళల్లో చెమ్మతో ఒక చెల్లిని కౌగిలించుకున్నారు . 
చెల్లెళ్ళు : ఎలా ఓదార్చాలో తెలియక , అక్కయ్యా .......... చలి ఎక్కువగా ఉంది లోపలికివెళదాము మిమ్మల్ని ఇలా నిలబెట్టామని అన్నయ్యకు తెలిస్తే బాధపడతారు అని పిలుచుకొనివెళ్లారు .
అదే సమయానికి టీవీలో బుజ్జాయిలు అన్నయ్యా అన్నయ్యా ......... అని పిలవడం - నేను ఎత్తుకోగానే కొట్టడం - లవ్ యు లవ్ యు ........... హాస్పిటల్లోకి వద్దని అక్కడే పడుకోబెట్టాను తల్లీ - బిస్వాస్ ......... లవ్ యు లవ్ యు ......... అంటూ ఎత్తుకునే ముద్దుచేస్తూ గుంజీలు తియ్యబోతే ఆపి , లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ ప్రాణంలా హత్తుకోవడం చూసి కళ్ళల్లో చెమ్మతోనే మేడం తియ్యదనంతో నవ్వుకున్నారు . టీవీకి అతిదగ్గరగావెళ్లి ముద్దులు కురిపించారు - చిరునవ్వులు చిందిస్తూనే చెల్లెళ్ళూ .......... నాకు వెంటనే అక్కడికి వెళ్లాలని ఉంది అలానే అలానే ........... అంటూ టీవీ వైపు చూస్తుండటం చూసి , 
అక్కయ్యా .......... టీవీ కూడా తీసుకెళ్లాలని ఉందికదూ అని ముసిముసినవ్వులు నవ్వుకుని , మొబైల్లో లైవ్ పెట్టి మేడం కు అందించి , అక్కయ్యా ........ రండి వెళదాము అన్నారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ చెల్లెళ్ళూ ......... అని అందరూ కిందకువచ్చి రౌడీలా కార్లలో హాస్పిటల్ కు బయలుదేరారు . 
మేడం ......... మొబైల్లో మా ముగ్గురినీ చూస్తూ సంతోషంతో మైమరిచిపోతున్నారు .

చుట్టూ చెల్లెళ్ళు వెనుక లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లతో నా దే ........ మేడం లోపలికివచ్చారు . నిమిషం ముందు మీడియా బయటకువెళ్లిపోవడం మేడం మాదగ్గరకు రావడం చూసి ఆశ్చర్యపోయి అంతా పెద్దమ్మ మాయ అని సంతోషించాను .
కంగారుపడుతూ మరింత దగ్గరికి రావడం చూసి బుజ్జాయిలకోసమేమోనని అందించబోయాను .
మేడం తియ్యనికోపంతో చూసి మహేష్ గారూ ....... ఈ రక్తం అని ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో అడిగారు . 
చెల్లెళ్ళు : అక్కయ్యా అక్కయ్యా ........... అది అన్నయ్య రక్తం కాదు - అన్నయ్య కొట్టిన దెబ్బలకు వందమంది రౌడీలు చిందించిన రక్తం - అన్నయ్యకు చిన్న దెబ్బకూడా తగలలేదు మీరు బాధపడకండి . 
ఆక్షణం మేడం కళ్ళల్లో కనిపించిన ఫీల్ వాహ్ ......... హృదయం పులకించిపోయింది .

గాడె .......... మేడం ........ వాడి ....... సర్ కు కూడా ఏమీకాలేదు బాధపడకండి ....... అనేంతలో నా చెంపపై దెబ్బ ..........
షాక్ లో ఉండిపోయాను .
మేడం : కళ్ళల్లో చెమ్మతో నేను వచ్చినది వాడి ......... అంటూ ధారలా కన్నీళ్లను కారుస్తూ చెల్లి గుండెలపైకి చేరిపోయారు . 

చెల్లికి మేడం కౌగిలిలోని వైబ్రేషన్స్ అర్థమై , అన్నయ్యా .......... అని చిరుకోపంతో గిల్లేసి , మా అక్కయ్య మనసు ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారు .
ఆ మాటలకు వొళ్ళంతా తియ్యదనంతో జలదరించింది . 

మేడం : బాధపడుతూనే వీడిని ఈ రాక్షసుడిని హీరోని చేయాలా .........., 
గాడె .......... మేడం ......... వాడిపై ప్రేమతో చెయ్యలేదు - మీ సంతోషం కోసం బుజ్జాయిలు వారి అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తో కలిసి సంతోషంతో ఆడుకోవడం కోసం చేసాను . ఇదిగో ఇలా మీ చెల్లెళ్ళు మీకోసం ఏమైనా చేసేలా చెయ్యడం కోసం చేసాను. 
మేడం నా కళ్ళల్లోకి ఆరాధనతో చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు .
మేడం : మహేష్ గారూ .......... ఏమిజరిగిందో చెల్లెళ్ళు మొత్తం వివరించారు . ఇలాంటి వాడిని హీరో చెయ్యనేరాదు . వాడు లేస్తే ఈ గౌరవం చాటున ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో - ఎంతమంది బలైపోతారో ........... , వాడు మమ్మల్ని అదే మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జాయిలను ఏమిచెయ్యబోతున్నాడో చెప్పే ఉంటాడు ....... మీకూ తెలిసే ఉంటుంది - చెల్లెమ్మలు కూడా నాదగ్గర ఆ విషయాన్ని దాచారు . నా కళ్ళల్లోకే చూసి చెప్పండి .
చెల్లెమ్మలు కన్నీళ్ళతో మేడం ను హత్తుకున్నారు .
మేడం కళ్ళల్లోకే చూస్తూ అపద్దo చెప్పలేక మేడం మేడం ........... అదీ అదీ అంటూ నా కలలోకూడా కన్నీళ్లు కారసాగాయి .
మేడం : నన్నూ - మీ బుజ్జాయిలను చంపేస్తాను అన్నాడు కదూ .......... మహేష్ గారూ ............
మేడం .........
అదే నిజం మహేష్ గారూ .......... , నిన్న మధ్యాహ్నం .......... వాడు బాత్రూంలో ఉండగా ఫోన్ ఎత్తకపోవడం వలన నెక్స్ట్ ల్యాండ్ లైన్ మ్రోగడంతో ఇద్దరమూ ఒకేసారి రూంలోని మరియు హాల్లోని ఫోన్ ఎత్తాము . వాడు మమ్మల్ని ఎలా చంపబోతున్నాడో చెప్పాడు . 
ఒక్కసారిగా నా కళ్లల్లో ధారలా కారుతున్న కన్నీళ్ళతో కోపంతో మేడం చెంప చెల్లుమనిపించబోయి మిల్లీమీటర్ దూరంలో ఆపేసి , అందుకేనా ........ బుజ్జాయిలను నాదగ్గరే ఉండమని చెప్పారు - మీరు లేకుండా బుజ్జాయిలు నే ........ ఎలా అంటూ అంతులేని బాధతో - ఆ ఊహకే భయంతో వణుకుతున్నాను - ఎంత అడిగాను ఒక్కమాటైనా చెప్పొచ్చుకదా అని కళ్ళతోనే వ్యక్తం చేసి తట్టుకోలేక మళ్లీ కొట్టబోయి ఆగిపోయాను .

మేడం : మరింత కోపంతో అర్థం కాని మరొక ఫీల్ తో చెల్లెళ్ళూ ......... వెళదాము పదండి అని ఇద్దరి చేతులను అందుకుని బయటకు నడిచారు . 
మేడం sorry .......... అన్నానో లేదో , బుజ్జాయిలు నిద్రలోనే నా చెంపలు చెళ్లుమనిపించారు . 
మిగిలిన చెల్లెమ్మలు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
మేడం మేడం ........... అంటూ వెనుకే బయటకువెళ్ళాను . 
మేడం కోపంతో .......... కారులో కూర్చోబోతే , చెల్లెళ్ళూ ........... ఈ వెహికల్లో మీ అక్కయ్యను పిలుచుకునివెళ్లండి అనిచెప్పాను . 
అక్కయ్యా .......... please please అంటూ క్యార వ్యాన్ లో ఎక్కేలా చేశారు .
మేడం ........... మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించడం తప్పే నన్ను మన్ని ..........
మళ్లీ చెంపలు చెళ్లుమన్నాయి .
చెల్లెళ్లతోపాటు మేడం కూడా నవ్వినట్లు అనిపించింది .
మేడం ........... బుజ్జాయిలు అని అందివ్వబోయాను .
మేడం : కోపంతో చూసి , నేనేమీ ఇక్కడికి మీ బుజ్జాయిలకోసం రాలేదు - లేచాక మా అన్నయ్య నుండి నిద్రలో ఎత్తుకుని వచ్చేసారా అని నన్ను కొట్టిద్దామని అనుకుంటున్నారా .......... , చెల్లెమ్మలూ .......... వాడు ఆ దుర్మార్గుడు ఉన్న ప్లేస్ లో ఒక్క క్షణం కూడా ఉండలేను పదండి వెళదాము .
చెల్లెళ్ళూ ..........ఏమైనా తప్పుచేశానా ? 
చెల్లి : చాలా చాలా పెద్ద తప్పు అన్నయ్యా ......... , మా అక్కయ్య మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి త్వరగా - ఆలస్యం అయ్యేకొద్దీ అక్కయ్య బాధ పెరుగుతూనే ఉంటుంది .
ఆడవారి మాటలకు అర్థాలు వేరు అని ఊరికే అనలేదు మహానుభావులు - చెల్లెళ్ళూ .......... నిన్న ఉదయం నుండీ బుజ్జాయిలు అమ్మ ప్రేమను పొందలేదు అని అందించాను .
చెల్లెళ్ళు : యాహూ .......... అంటూ కేకలువేసి , అంతకంటే అదృష్టమా అన్నయ్యా ......... అంటూ లోపల ఉన్నవాళ్ళుకూడా వచ్చి పోటీపడి ఒకరినొకరు తోసుకుని ప్రాణంలా ఎత్తుకున్నారు . 
దే ......... మేడం నే చూస్తూ , చెల్లెళ్ళూ ........ డ్రైవర్ నేరుగా అపార్టెంట్ తీసుకెళతారు జాగ్రత్త అన్నాను .
కోపంతో మేడం ముఖాన్ని అటువైపు తిప్పుకున్నారు . నాకైతే ఏమీ అర్థం కాలేదు - దేవతను బాధపెట్టానా ఎలా కొట్టబోయాను అని నన్ను నేను తిట్టుకున్నాను - అసలు నాకు ఏ అధికారం ఉంది అని లెంపలేసుకున్నాను .
సరే అన్నయ్యా ............ తొందరగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వెళుతున్నాము అని లోపల కూర్చున్నారు . 
పెద్దమ్మా ......... ఇంటికి అని మనసులో తలుచుకోగానే వెహికల్ కదిలింది . వెహికల్ విండో నుండి ఎవరో చూసినట్లు అనిపించి చూస్తే వెంటనే లోపలికి వెళ్లిపోయారు . సెక్యూరిటీ అధికారి వెహికల్ వెనుకే ఫాలో అయ్యింది . నిన్న రాత్రి ఊరిబయట గ్యారేజ్ దగ్గర వదిలిన కారు నాముందువచ్చి ఆగడంతో లవ్ యు పెద్దమ్మా ........ అని తలుచుకుని వెనుకే పోనిచ్చాను - అందరమూ అపార్ట్మెంట్ చేరుకునేసరికి ఉదయం 5 గంటలు అయ్యింది .బుజ్జాయిలను ఎత్తుకున్న చెల్లెమ్మలతోపాటు మేడం లోపలికివెళ్లారు . ఎందుకో తెలియదు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లినట్లు నా మనసుకు అనిపించి చూస్తే అలాంటిదేమీ లేకపోవడంతో నిరాశచెంది , వెనుకే పైకివెళ్ళాను . మేడంతోపాటు చెల్లెళ్ళు కూడా ఇంట్లోకి వెళ్లిపోవడంతో తన్నుకొస్తున్న బాధతో నన్ను నేను తిట్టుకుంటూ వెళ్లి సోఫాలో వాలిపోయాను . అలసిపోయినట్లు చెమ్మతో కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . 
శ్రీవారూ .......... ఏది జరిగినా అంతా మన మంచికే హాయిగా రెస్ట్ తీసుకోండి అని పెద్దమ్మ గుసగుసలు ముద్దులు స్పృశించడంతో సోఫాలోనే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 09-12-2020, 10:42 AM



Users browsing this thread: 2 Guest(s)