Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అర గంటలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు కారుని ఆపాను . 
కీర్తి : చూసి అన్నయ్యా ......... అమ్మవారిదగ్గరికే తీసుకొచ్చారా ? , లవ్ యు లవ్ యు లవ్ యు ఉదయం అమ్మ చెప్పింది మీ అన్నయ్యకు చెప్పి వైజాగ్ అమ్మవారి దర్శనం చేసుకోండి అని . అమ్మ అనుక్షణం ప్రార్థించేది అమ్మవారినే అని సంతోషంతో నన్ను గట్టిగా కౌగిలించుకుంది .
పెద్దమ్మ : అమ్మవారిదగ్గరకు వచ్చామా .......... , తల్లీ క్షమించు క్షమించు అని నా షర్ట్ సరిచేసి ముందుగానే చెప్పొచ్చుకదా అని నీళ్ల బాటిల్ అందుకుని ముందు నాపై బుజ్జాయిలపై తనపై నీటిని చిలకరించి కళ్ళుమూసుకుని ప్రార్థించి పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లిని ఎత్తుకుని ఇప్పుడు పదండి అని కిందకుదిగాము .

గుడి పచ్చని తోరణాలతో పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉండటం చూసి సంతోషించాము . 
బుజ్జాయిలు : అన్నయ్యా - పెద్దమ్మా ......... ఈరోజేమైనా పండగనా ? 
పెద్దమ్మ : పండగే కదా తల్లీ .......... మా బుజ్జాయిల పుట్టినరోజు పండగ - కావ్యతల్లి పుట్టినరోజు పండగ - హీరో గారి పుట్టినరోజు పండగ .............
బుజ్జాయిలు : మా ప్రాణమైన పెద్దమ్మ పుట్టినరోజు పండగ ..........
 పెద్దమ్మ : అవునవును అని ముద్దుచేసి నవ్వుకుని , మనకోసమే అమ్మవారు స్వాగతం పలకడం కోసం ఇలా ........... వెళదామా బుజ్జితల్లీ అని ప్రాణంలా హత్తుకుని లోపలికి నడిచారు . వెనుకే మురిసిపోతూ వెళ్ళాను . 

లోపలంతా సందడి సందడిగా ఉంది . అందరూ ఫ్యామిలీలతో వచ్చి భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తున్నారు మరొకవైపు వంటలు చేస్తున్నారు . చాలామంది పిల్లలు ఆడుకోవడం చూసి బుజ్జాయిలు ఆనందిస్తుంటే , ముద్దులుపెట్టి వెళ్లి అక్కడ వదిలాము . పిల్లలు బుజ్జాయిల చేతులను అందుకుని వాళ్ళల్లో కలుపుకుని ఆడుకోవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు అన్నయ్యా - పెద్దమ్మా ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తున్నారు . 
ఉమ్మా ఉమ్మా ........... లవ్ యు తల్లీ - లవ్ యు బిస్వాస్ అని నా చేతివేళ్ళతో పెనవేసింది పెద్దమ్మ .
నేను బుజ్జాయిలకు లవ్ .......... అంటూనే షాక్ కొట్టినట్లు , బుజ్జాయిలవైపు చూసి ఎంజాయ్ చేస్తున్న పెద్దమ్మవైపు చూస్తూ ఉండిపోయాను . 
పెద్దమ్మ : హీరో నన్ను తరువాత ఎంతసేపయినా చూడొచ్చు . బుజ్జాయిలు పిలుస్తున్నారు చూడమని చెప్పడంతో , 
నవ్వుకుని బుజ్జాయిల ఆనందాన్ని చూసి మురిసిపోయాను . 

ఇంతలో ముత్తైదువులంతా వచ్చి ఆడుకుంటున్న బుజ్జాయిల చుట్టూ చేరి అమ్మవారిని ప్రార్థిస్తూ చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ పెద్దమ్మను కూడా ఆహ్వానించడంతో , నా భుజం పై తియ్యని ముద్దుపెట్టి జతకలిసి అమ్మవారు కోరికలు తీర్చడానికి దివి నుండి దిగివచ్చేలా అత్యంత అద్భుతంగా నాట్యం చెయ్యడం చూసి చూస్తున్నవాళ్ళంతా మైమరిచిపోయాము . పెద్దమ్మ బుజ్జాయిల చేతులను అందుకుని వాళ్ళలానే నృత్యం చెయ్యడం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదు .
వాళ్ళ నృత్యం మనసును పులకరించేలా చేసింది . చూస్తుంటే వాళ్లంతా ఇక్కడివాళ్ళలా అనిపించక అన్నయ్యలూ ......... ఎక్కడ నుండి వచ్చారు అని అడిగాను.
వైజాగ్ కు ఉత్తరం వైపు ఉన్న అడవుల్లో ఉంటాము బాబు .......... , ఈరోజు మాకు పవిత్రమైన రోజు ప్రతీ సంవత్సరం మా కులదైవమైన అమ్మవారిని ఇలానే ప్రార్ధిస్తాము. మేము ఏ కోరికలూ కోరము బాబు మానవులందరి కోరికలనూ సమయానికి తీర్చే అమ్మ ఆనందించేలా సాయంత్రం వరకూ మా నృత్యాలు చేసి మేమూ ఆనందించి అడవిలోకి వెళ్లిపోతాము . అడవిలో పెరిగే ఫలాలన్నీ నైవేధ్యంగా - అడవిలో పెరిగిన వాటితోనే వంటలు చేసి ప్రసాదంలా స్వీకరిస్తాము . మేమంతా ఒకే కుటుంబం .
వాళ్ళ మాటలకు మనసు పులకించిపోయింది . కోరికలు కోరడం కాదు అమ్మవారినే తమ నృత్యాలు ఆటపాటలతో మైమరిచిపోయేలా చేస్తున్నారు . చాలా సంతోషం అన్నయ్యలూ ........... ఈరోజు మేమూ మీతో కలవచ్చా ............ మా బుజ్జాయిలకు అమ్మవారు అంటే చాలా ఇష్టం - వాళ్ళ పుట్టినరోజు కావడంతో వచ్చాము కాదనకండి మిమ్మల్ని ఇబ్బందిపెట్టము . 
బాబూ ........... చాలా సంతోషం . అప్పటి నుండీ చూస్తున్నాము మీ పిల్లల వలన ఈ పర్వదినానికే కళ వచ్చింది - వాళ్ళ చిరునవ్వులు మా అందరినీ మరింత పులకించిపోయేలా చేస్తున్నాయి . తప్పకుండా తప్పకుండా ఉండవచ్చు మా ఆతిధ్యం స్వీకరించి అమ్మవారికి మీవంతు ఆనందం పంచితే అంతకంటే అదృష్టం ఏముంటుంది అనిచెప్పివెళ్లారు . 

కొన్ని నిమిషాల తరువాత ఒక్కసారిగా మహిళలు అమ్మాయిలు పిల్లలు అందరూ బుజ్జాయిలు - పెద్దమ్మ చుట్టూ చేరి అన్నిరకాల పళ్ళు పూలతో అందంగా కేక్ లా రెడీ చేసినట్లు బుజ్జాయిల ముందు ఉంచి , తల్లులూ ............ మీ వలన ఈ సంబరానికి మరింత ఉత్సాహం వచ్చింది . మీ పుట్టినరోజు కదా ........... ఈ రోజు పుట్టారంటే అమ్మకు చాలా ప్రీతిప్రదమైనవారు బుజ్జి అమ్మలు అన్నమాట - మీరిద్దరూ ఆనందిస్తే అమ్మ ఆనందించినట్లే పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ బాబు ........... అని అందరూ విష్ చేశారు . పిల్లలు అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అడవిలో తయారుచేసుకున్న ఆట వస్తువులను కానుకలుగా ఇచ్చారు . 
బుజ్జాయిలు నావైపు చూసారు . లవ్ యు .......... పెద్దమ్మ అని సైగచేసాను .

బుజ్జాయిలు : అమ్మలూ - అక్కయ్యలూ - స్నేహితులూ ............ మేము బుజ్జిదేవతలైతే - మా పెద్దమ్మ దేవత .......... పెద్దమ్మ పుట్టినరోజుకూడా ఈరోజే .
మేము ఎంత అదృష్టవంతులం అని పెద్దమ్మకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అడవి పట్టుతో తయారుచేసిన వస్త్రాలను పెద్దమ్మకు కానుకగా అందించి , ఇవి అమ్మవారికోసం కానుకలుగా తీసుకొచ్చాము . ఆ అమ్మవారే స్వయంగా దేవతా - బుజ్జిదేవతలుగా మీరూపంలో వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు అని దేవతలా చూసుకున్నారు . బుజ్జిదేవతలూ .......... మీరు కూడా అందుకోండి .
పెద్దమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నావైపు ఆరాధనతో చూస్తుంటే , అంతే ఆనందంతో బుజ్జాయిలూ ............ మిమ్మల్ని ఆ వస్త్రాలలో చూడాలి అని పెద్దమ్మ కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ చెప్పాను . 
పెద్దమ్మ : పెదాలపై అందమైన సిగ్గుతో అలాగే అని తలఊపారు . 

దేవతా - బుజ్జిదేవతలూ ............. ఆ గదిలోకివెళ్లండి అని చూయించారు . 
తియ్యని నవ్వులతో బుజ్జాయిల బుజ్జిచేతులను పట్టుకుని లోపలికివెళ్లి మార్చుకుని వచ్చారు . 
వాళ్లంతా చెప్పినట్లు దివి నుండి దిగివచ్చిన దేవతల్లా - బుజ్జిదేవతల్లా ఉండటం చూసి ప్రాణంలా అలా చూస్తూ ఉండిపోయాను . 

అందరూ : మా నమ్మకం వమ్ముకాలేదు , దేవత బుజ్జిదేవతల్లానే ఉన్నారు . మా దేవతలకు మా డిస్టినే తగిలేలా ఉందని ముగ్గురి కురులపై కాటుకరాసి , దేవత - బుజ్జిదేవతలూ .......... మా పళ్ళ కేక్ ఆస్వాదించేముందు మీ శ్రీవారితోపాటువెళ్లి అమ్మవారిని దర్శించుకుని రండి అని చెప్పారు .
అధికాదు .............
పెద్దమ్మ : ష్ .......... అని బుజ్జాయిలను ఎత్తుకునివచ్చి నాకు అందించి , నా జీవితంలో ఎన్నో కానుకలను చూసాను కానీ నా హీరో అందించిన ఈ కానుకను నా జీవితాంతం మరిచిపోను లవ్ యు అంటూ బుజ్జాయిలతోపాటు నన్నూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
ఫీల్ ను తనివితీరా ఆస్వాదించి , హమ్మయ్యా ........... మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది , మా దేవత పెద్దమ్మ కోరిన ఏ కోరికనూ తీర్చలేకపోయాను అని ఫీల్ అవుతున్నాను . 
పెద్దమ్మ : మరింత గట్టిగా కౌగిలించుకుని , చిన్న కోరిక కోరితే బ్యాంగ్ ఆస్వాదించేలా చేసావు మహేష్ ........... , అమ్మ దేవాలయం కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకోక తప్పదు.
అవునవును ............. 
బుజ్జాయిలు నవ్వుకుని మా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . 

లవ్ యు తల్లీ - బిస్వాస్ .......... సిగ్గుతో లవ్ యు పెద్దమ్మా ......... మనవల్ల అందరూ వేచి చూసేలా చెయ్యడం భావ్యం కాదు , మీ ముగ్గురి పేరున మరియు మేడం పేరున పూజ చేయిద్దాము రండి . 
అంతే బుజ్జాయిలతోపాటు పెద్దమ్మ కూడా చెంపపై ప్రేమతో కొట్టారు . 
అధిచూసి ఎదురుగా ఉన్న అందరూ నవ్వుకున్నారు .
Ok ok ........... మన ఐదుగురి పేరునా ...........

కీర్తి : అమ్మలూ అమ్మలూ ........... మాకు వస్త్రాలు ఇచ్చారు మరీ ............
బుజ్జిదేవత కోరిక తీర్చడానికే మేంఉన్నాము ఏమోయ్ ..........
ఇదిగో తీసుకొచ్చాను లేవే అని కొత్తబట్టలు అందించారు . 
బుజ్జాయిలను పెద్దమ్మకు అందించి రెండే రెండు నిమిషాలు అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి గదిలోకి పరుగుతీసి మార్చుకుని వచ్చాను . 

అందరూ చూసి మాలో ఒకడివి అయిపోయావు బాబు .........అన్నారు .
బుజ్జాయిలు పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి సూపర్ సూపర్ అంటూ ముద్దులుపెట్టారు . 
పెద్దమ్మ దగ్గరికివెళ్లి నిలబడ్డాను . 
అందరూ ఆశ్చర్యపోయి , మిమ్మల్ని మావాళ్ళు కాదు అంటే ఎవ్వరూ నమ్మరు .
మీలో కలిసిపోవడం మాకు చాలా చాలా ఆనందం . దర్శనం చేసుకునివస్తాము మీ కాదు కాదు మన సంబరాన్ని అంబరాన్ని తాకిద్దాము అని సంతోషంతో అమ్మదగ్గరికివెళ్లి అందరిపేరునా పూజ చేయించి ప్రార్థించి తీర్థం ప్రసాదం పువ్వులు అందుకుని బయటకువచ్చాము . 

బుజ్జాయిలూ వెళ్ళండి అని పెద్దమ్మతోపాటు పంపించాము . పళ్ళ కేక్ అని మురిసిపోతుంటే కెమెరాలో బంధించాను . 
కేక్ తాకగానే పిల్లలు పెద్దవాళ్ళు శుభాకాంక్షలు తెలిపారు . ద్రాక్ష పండు అందుకుని పెద్దమ్మకు - పెద్దమ్మ బుజ్జాయిలకూ తినిపించుకున్నారు . బుజ్జాయిలు అందరికీ కేక్ లా పళ్ళు పంచి స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదించారు . నాదగ్గరికివచ్చి లవ్ యు అని తినిపించి సగం వాళ్ళు తిన్నారు . 
వాళ్ళు : అక్కయ్యా - చెల్లీ ......... బుజ్జిదేవతల్లా మీ శ్రీవారికి మీరూ తినిపించి సగం మీరూ తినండి సిగ్గుపడకండి అని నవ్వుకుని పండు అందించారు .
పెద్దమ్మ సిగ్గుపడుతూనే వచ్చి నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ అంతకంటే అదృష్టమా హీరో అని తినిపించి నేను కొరికిన చోటనే ప్రేమతో కొరకడం చూసి తియ్యని అనుభూతిని ఆస్వాదించాను .

వంటలు పూర్తవ్వడంతో మొదట అమ్మవారికి నైవేద్యం సమర్పించారు .

ఆవెంటనే అందరూ మాదగ్గరికివచ్చి దేవత - బుజ్జిదేవతలూ ............. కొద్దిసేపు కొద్దిసేపు మీ శ్రీవారిని - మీ నాన్నను వదిలి రండి మాకోసం మిమ్మల్ని విడగొట్టడం మాకు కూడా ఏమాత్రం ఇష్టంలేదు - ఒకరంటే మరొకరికి ఎంతప్రాణమో చూస్తుంటే మాకే అసూయ వేస్తోంది అంటూ పిలుచుకొనివెళ్లి తమ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు . అన్నయ్యలు తమ మధ్యన నన్ను కూర్చోబెట్టుకొని మొదట మాకు వడ్డించి తరువాత వాళ్ళు వడ్డించుకుని తినండి అని సంతోషంతో చెప్పారు . 
పెద్దమ్మ ప్రేమతో  బుజ్జాయిలకు తినిపించి తినడం చూసి అమ్మలంతా తమపిల్లలకు తినిపించి తిన్నారు .

బుజ్జాయిలు : అమ్మలూ .......... వంటలు చాలా చాలా బాగున్నాయి . 
బుజ్జితల్లీ .......... ప్రకృతి ప్రసాదించిన కూరగాయలతో వండినవి కదా అందుకే అంత రుచి . మన సిటీలో 75% కల్తీ అయిపోతోంది . 
కీర్తి : అయితే కడుపునిండా తింటాను ఆ ఆ ........ ఆమ్ ఆమ్ ........ అంటూ తినడం చూసి అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిన్నారు . 

కొద్దిసేపటి తరువాత ఒకవైపు వ్రతం మరొకవైపు భజనలు నృత్యాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు . ప్రతీ సందర్భంలో పెద్దమ్మ - బుజ్జాయిలను ముందు కూర్చోబెట్టుకున్నారు . బుజ్జాయిలు తమ కొత్త ఫ్రెండ్స్ తో దేవాలయం మొత్తం పరుగుకుతీస్తూ చిందులువేస్తూ మధ్యమధ్యలో అన్నయ్యలతో పూజలకోసం ఏర్పాట్లుచేస్తున్న నాదగ్గరికి - పూజలు చేస్తున్న పెద్దమ్మ దగ్గరకు చేరి ముద్దులుపెట్టి వెళుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు . 
సాయంత్రం 5 గంటలవరకూ ఎటువంటి అడ్డంకులూ లేకుండా పూజలు చేసుకుని , చీకటిపడేలోపు మా గూడెం చేరిపోవాలి బాబూ - మీ వలన ఈ సంవత్సరం అందరిలో ఏదో కొత్త ఉత్సాహంతో దిగ్విజయంగా మనసారా మా కులదైవాన్ని ప్రార్థించుకున్నాము - మా వలన కాదు కాదు మనవలన అమ్మ ఆనందించారని ఆశిద్దాము - మళ్లీ మేము ఇక్కడికి వచ్చేది సంవత్సరం తరువాతనే - మీకు వీలు కలిగితే మా గూడెం కు రండి మా బుజ్జిదేవతలలో మా కులదైవాన్ని చూసుకుని సేవించుకుంటాము .
పెద్దమ్మ .......... వాళ్ళందరినీ ఉద్వేగంతో కౌగిలించుకున్నారు . బుజ్జాయిలు పిల్లలు అయితే చాలా దగ్గరైనట్లు కళ్ళల్లో నీళ్ళు కార్చారు . ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన కానుకలను మా దగ్గరే జాగ్రత్తగా ఉంచుకుంటాము అని గుండెలపై హత్తుకున్నారు . 

బయటకువెళ్లి ఆఫీస్ లో బుజ్జాయిలకు అందించిన గిఫ్ట్స్ ను రెండుచేతులతో అంతెత్తున పట్టుకుని తీసుకొచ్చి బుజ్జాయిలూ ............ అని పిలిచాను .
పరుగునవచ్చి , మీ ముఖం కూడా కనిపించడం లేదు లవ్ యు లవ్ యు అని చెరొకకాలిని చుట్టేశారు . 
పెద్దమ్మ బుజ్జాయిలకు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తే - బుజ్జాయిలు తమ ఫ్రెండ్స్ కు అందించి మురిసిపోయారు . 
పిల్లలు : స్నేహితులూ ........... మీరు ఇచ్చిన ఈ కానుకలను కూడా జాగ్రత్తగా ఉంచుకుంటాము . మళ్లీ ఎప్పుడు కలుస్తామో అసలు కలవమో ............

పిల్లలూ ............ తప్పకుండా మీ స్నేహితులను మన గూడెం కు తీసుకొస్తాను . 
అందరూ సంతోషంతో కేరింతలువేసి కౌగిలించుకుని బై బై చెప్పుకుని ఎద్దుల బండ్లలో వెళ్లిపోయారు . 
బుజ్జాయిలు నామీదకు ఎక్కి వాళ్ళు కనుచూపుమేర వెళ్లేంతవరకూ చూసి లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా .......... అంటూ ముద్దులతో ముంచెత్తారు . గుడిలోకి ఎంటర్ అయినప్పుడు అన్నయ్యా అని పిలిచారు - మళ్లీ పిలిచింది ఇప్పుడే ........... వాళ్ళు ఉన్నంతవరకూ అన్నయ్యా ........ అని ఒక్కసారీ పిలవకపోవడం ఆశ్చర్యం వేసినా బాగుంది అని మురిసిపోయాను . 

 నలుగురమూ ......... అమ్మవారిని చివరిసారిగా ప్రార్థించి , కారుదగ్గరకువెళ్లి డోర్ తెరిచాను .
పెద్దమ్మ : నా బంగారుబుజ్జితల్లీ అని గుండెలపై ప్రాణంలా హత్తుకుని నీ బుజ్జిఅన్నయ్యతోపాటు మామూలుగా ఎంజాయ్ చెయ్యలేదు మేము చూసాములే లవ్ యు లవ్ యు అంటూ ముద్దుచేస్తూ కూర్చున్నారు . 
కీర్తి : అవును పెద్దమ్మా .......... సరైన సమయానికి గుడికి తీసుకొచ్చారు లవ్ యు లవ్ యు ..............
పెద్దమ్మ : ఈ ముద్దులన్నీ మీ అన్నయ్యకే చెందాలి అని నావైపు ఆరాధనతో చూస్తున్నారు . 

పెద్దమ్మ చీరకొంగుని అందించి నెమ్మదిగా డోర్ వేసి అటువైపుకువచ్చి కూర్చుని , పెద్దమ్మా .......... లోపల ..........
నా చేతిని చుట్టేసి చేతితో నా నోటిని మూసేసి బుగ్గపై తియ్యని ముద్దులుపెట్టి , ఇప్పుడేమి మాట్లాడకు సమయం కూడా లేదు ఇంకా రెండు కోరికలు మిగిలిపోయాయి .
పెద్దమ్మా ............ ఆ కోరికలను తీర్చడానికి ఇదే పర్ఫెక్ట్ సమయం అని స్టార్ట్ చేసి పోనిచ్చాను . 
పెద్దమ్మ : హీరో ............ అమ్మవారి గుడిలో ఉన్న ప్రతీక్షణం ఎంత సంతోషించానో - ఎంత పరవశించిపోయానో మాటల్లో చెప్పలేను - నిన్ను ఇలానే జీవితాంతం కౌగిలించుకుని ఉండిపోవాలని ఉంది . 
మీ ఇష్టం పెద్దమ్మా ............ 
అలా అంటున్నావు కానీ ఒకముద్దుకూడా పెట్టడం లేదు అని గుసగుసలాడారు .
పెద్దమ్మా ........... ఏమైనా మాట్లాడారా ? 
అవసరమైనవి మాత్రం నీకు వినపడవు అని నా భుజం పై ప్రేమతో కొరికెయ్యడం చూసి కీర్తి తల్లి సంతోషంతో నవ్వుకుంది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 07-10-2020, 11:06 AM



Users browsing this thread: 1 Guest(s)