Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#89
హలో మహేష్ గారు మీయొక్క కొత్త రచన కు నా హృదయపూర్వక అభినందనలు.

నేను శతవిధాలా ప్రయత్నించారు మీ ఈ కొత్త కథను కొన్ని రోజులు చదవకుండా నన్ను నేను నిగ్రహించుకోవడనికి
కానీ అది నా వల్ల సాధ్యపడలేదు ఎందుకనగా మీరు మా యొక్క ప్రియమైన మనసైన రచయిత మీ రచనలు చదవకుండా ఉండటం అంటే అది అసాధ్యమనే చెప్పాలి.

ముందుగా మీ రచనల ద్వారా సమాజానికి కొన్ని ముఖ్య విషయాలు తెలియ చేయాలని మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను

మీ రచనలను బట్టి నాకు అర్థమైన విషయం మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మీరు అదృష్టం మరియు ఉచిత ఆశ కంటే వ్యక్తి కష్టాన్ని బాగా నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను.
మీరు మీ ప్రతి రచనలలో అనాధాశ్రమం లు మరియు వృద్ధాశ్రమాల గురించి చెబుతున్నారు దీనిని బట్టి మీరు ప్రతి ఒక్కరిని తోచిన మరియు సాధ్యమైన సహకారాన్ని అటువంటి పేదవాళ్ళకి అందించాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నాను (మీ అంత కాకపోయినా నేను నా చేతనయిన ఒక చిరు సహాయాన్ని ఒక ఆశ్రమానికి అందిస్తున్నాము)

మీరు మీ రచనల ద్వారా సమాజాన్ని మరియు స్త్రీలను గౌరవించాలి అని సూచిస్తున్నారు ఇది నిజంగా అభినందనీయం

మీరు మీ యొక్క రచనల ద్వారా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా కష్టపడి ఎదగాలని సూచిస్తున్నారు. మన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు అది మనకి ఎలాగైనా సహాయపడుతుందని మీరు పదే పదే గుర్తు చేస్తున్నారు.

మహేష్ గారు మీరు నాకు నచ్చిన అతిముఖ్యమైన గుణం మీరు మీ రచనలను తెలుగులో అందిస్తున్నారు. తెలుగు నాకు చాలా ఇష్టమైన మరియు నా మాతృభాష నేను నా మాతృభాషలో రచనలను చదవటం చాలా ఇష్టపడతాను. కారణం మనము ఏ భాషలో చదివిన చివరికి మన మాతృభాషలో అర్థం కోసమే వెతుక్కుంటాం అందువలన ఇతర భాషలను గౌరవించి అవసరమైన విధంగా నేర్చుకోవాలని మరియు మాతృభాషను రక్షించుకోవాలని ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతం మన గవర్నమెంటు మన ముందు తరాల కి మన ఈ మాతృభాష అయిన తెలుగును దూరం చేయాలనే చూస్తుంది అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.

ఇక్కడ మనం అందరం మన మాతృభాష వలనే కలుసుకున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

ఇతర రచనలు కంటే నాకు మీ రచనలు కొంచం ప్రత్యేకం. ఇతర రచనల ద్వారా కొన్ని క్షణాల క్షణికానందం ని మాత్రమే పొందుతాను కానీ మీ రచనల ద్వారా ఆనందం మరియు మన సంతృప్తి కలుగుతాయి.

మీ కథ నన్ను చదువు సమయంలో నన్ను నేను ఆ సందర్భం యొక్క పాత్రలు ఊహించుకున్నాను. తద్వారా ఆ యొక్క సందర్భంలో ని ఆనందము బాధ మరియు ప్రేమ ప్రతి ఒక్క కోణాన్ని మనసారా ఆస్వాదిస్తాను.

రచన మనిషి యొక్క స్వభావాన్ని మరియు సమాజాన్ని మార్చగలదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను

మీరు సమాజాన్ని ఆలోచింపజేసే గొప్ప పుస్తకం రాయాలని మరియు ఆ పుస్తకం ప్రచురణ అవ్వాలని తద్వారా ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలను రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

మీరు మా మనసు కవి , మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీయొక్క ఈ మూడో రచన కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఒక చిన్న గమనిక మీరు ప్రతివారం ఇక్కడ ఒక అప్డేట్ తో పాటు బుధవారం మిగిలిన రెండు కథలు అప్డేట్స్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క మూడో కథ వలన మీరు మిగిలిన రెండు కథల్లో మరొక వారం అధిక సమయాన్ని తీసుకోవద్దని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను

మీరు మా విన్నపాన్ని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను

మీకు వీలైతే మీయొక్క అప్డేట్స్ విధానాన్ని మాకు తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను
Thanks

Your's P.R.K  (మంచి లక్షణాలున్న అబ్బాయి) happy  horseride
[+] 5 users Like asiademouser's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by asiademouser - 10-09-2020, 08:02 PM



Users browsing this thread: 23 Guest(s)