Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#39
కృష్ణ : రేయ్ మామా .......... 

 బాధపడుతూనే ఇందులో నీతప్పు - మీ అమ్మవారి తప్పు లేదు లేరా ........... నేను కోరినది ఒకసారి కలవాలని - తాకాలని ఆ రెండు కోరికలూ తీరిపోయాయి అని ఏడుస్తూ - నవ్వుతూ - బాధపడుతూ చెప్పాను .
ముగ్గురూ : రేయ్ మామా ............ 
లేదురా ......... ఇక జీవితంలో అమ్మాయిలను ఇష్టపడను . ఇక కష్టం పైననే ఆధారపడతాను . ఎవరో వచ్చి ఏదో వరాలిస్తారన్నది అపద్దo . ఇక నా జీవితంలో చదువు కష్టానికి తప్ప అమ్మాయిలకు చోటులేదు అని అప్పటి వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఏడుస్తున్నాను .
కృష్ణ : రేయ్ మామా .......... అమ్మాయిలకు చోటులేదు అంటున్నావంటే , అంటీలతో ఆ ఆ ........... అని ఆటపట్టించారు . 
 వాడిమాటలకు సూరి , రవిలతోపాటు ఒక్కసారిగా నేనుకూడా నవ్వేసాను . 
కృష్ణ : హమ్మయ్యా ......... నవ్వావా అని ముగ్గురూ హత్తుకుని , అంటీలు ఫసక్ అన్నమాట అని నవ్వించారు . రేయ్ మామా ఆకలేస్తోంది తిందాము రారా ......
రేయ్ .......... ఈ ఒక్కరోజైనా కాస్త బాధపడనివ్వండి . మీరువెళ్లి తినండి .
ముగ్గురూ : నాప్రక్కనే కూర్చుని , నువ్వు బాధపడుతుంటే వెళ్లి ఎలా తింటామురా , తింటే కలిసి తిందాము లేకపోతే పస్తులుందాము అంతే . నేను ఒకటి చెబుతాను ఆవేశం బాధతో కాకుండా వివేకంతో ఆలోచించు . రేయ్ మామా ......... నీదేవత తప్పు ఏమాత్రం లేదురా - తప్పంతా మనది . నువ్వు వెళ్లి ఆరాధిస్తున్నాను అని చెప్పాక పెళ్లిచేసుకుని ఉంటే అప్పుడు నువ్వు బాధపడాలి . నీదేవత ఊటీలో ఉందన్నప్పుడు మనం ఎలాగైనా చివరికి నడుచుకుంటూ అయినా వెళ్లి నీ హృదయంలో ఎంత పూజిస్తున్నావో చెప్పి ఉంటే బాగుండేది . అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారురా ........... , నీదేవత నిజంగా దేవతేరా ........ అతిథులకంటే ముందు మనకు భోజనం పంపించారు . 
రేయ్ నువ్వెన్ని చెప్పినా ఇక నా జీవితంలో ఇక అమ్మాయిలు అనేమాట లేదురా .......
కృష్ణ : మరి మన క్లాస్ లో నిన్ను ఒరకంటితో చూసే అమ్మాయిల సంగతి . 
రేయ్ నీయబ్బా ......... అమ్మాయిలు లేరు అంతే .
సూరి : రేయ్ కృష్ణ .......... నువ్వుచెప్పినట్లు స్త్రీలు అనట్లేదు కేవలం అమ్మాయిలు అంటున్నాడు అంటే అంటీలు ......... అని రాగం తీసాడు . 
కృష్ణ : నవ్వుకుని , వద్దులేరా ఇక అమ్మాయిలే వద్దు . రాత్రివరకూ మనం బ్రతికి ఉండాలంటే తినాలికదరా .......... కావాలంటే తిన్నాక నీఇష్టం ఎంతసేపయినా బాధపడు .
మీకోసం తింటానురా ............ మనకు బాధలు కష్టాలు కొత్తవేమీ కాదుకదా , కానీ ఇది మరింత బాధిస్తోంది అంతే అని లేచివెళ్లి తిన్నాము .

ఆరోజు నుండి కావ్య మేడం ఫోటోలు తాకింది లేదు ఇంటిదగ్గరకువెళ్లింది లేదు - కావ్య మేడం ఆరోజే తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు . నెక్స్ట్ రోజు ఉదయం పేపర్లో మ్యారేజ్ గురించి రావడంతో ఆరోజు నుండి పేపర్ చదవడం మానేసాను - లోపల వార్డెన్ రూంలో న్యూస్ లో కూడా మిస్ వైజాగ్ మ్యారేజ్ అని వస్తుండటం తెలిసి న్యూస్ చూడటం కూడా మానేసాను . ఆరోజు నుండి నుండి ఉదయం స్టడీస్ ఆ వెంటనే స్కూల్ సాయంత్రం రాగానే వర్క్ తొ రోజులు గడిచిపోయాయి . ప్రతిరోజూ కావ్య మేడం గుర్తుకువచ్చి ముగ్గురికీ తెలియనివ్వకుండా బాధపడేవాడిని - హృదయమంతా నింపుకున్నాను కదా .......... అంత త్వరగా మరోచిపోవడం కుదరదు .

 ఇక సర్ వాళ్ళు రోజురోజుకూ కొత్త కొత్త ఈవెంట్లతో మంచి పేరుని సంపాదిస్తున్నారు.
10th క్లాస్ లో నలుగురమూ స్టేట్ ర్యాంక్ లతో పాస్ అయ్యాము .
వార్డెన్ - సర్ వాళ్ళు అభినందించారు . ప్రతిభ అవార్డ్స్ కూడా వచ్చాయి .
 నెక్స్ట్ ఇంటర్లో కూడా నలుగురమూ govt కాలేజ్ లో MPC తీసుకున్నాము . చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నా - ముగ్గురూ జోళ్ళుకారుస్తూ అమ్మాయిల వెంట పడినా నేనుమాత్రం పట్టించుకునేవాడిని కాదు .
ముగ్గురూ : రేయ్ మామా .......... క్లాస్ లో అంతమంది నీకు లైన్ వేస్తున్నా పట్టించుకోవెంటి రా , తెలిసీ తెలియని వయసులో ఏదో జరిగిపోయింది మరిచిపోరా ఎంజాయ్ చెయ్యరా .......... అన్నా , నేను పట్టించుకునేవాడిని కాదు .
ఇంటర్ కూడా టాప్ లో నిలిచాము . సంవత్సరానికోకసారిమా స్థాయిలు - మా సాలరీ లు పెరుగుతూనేలకు 15 వేల వరకూ తీసుకుంటున్నాము . ఆఫీస్ ను ఒకసారి మీడియం నెక్స్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ లోకి మార్చడం జరిగింది . సిటీలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోంది . డబ్బుని వెళ్లి వార్డెన్ కు ఇచ్చేవాళ్ళము అలా ఆరోజు ,

 వార్డెన్ : మహేష్ .......... ఎక్కడెక్కడి నుండో సెక్యూరిటీ ఆఫీసర్లు అనాధలైన బుజ్జాయిలను వదిలి వెళుతున్నారు కాబట్టి ........
అర్థమైంది వార్డెన్ వారం రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్లిపోతాము అని ఉద్వేగానికి లోనౌతుంటే , 
వార్డెన్ కౌగిలించుకుని కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించండి - మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాను అని మాడబ్బు వెనక్కు ఇవ్వబోయారు .
వార్డెన్ .......... ఇప్పటి నుండి మేము జీవితంలో ఏమి సంపాదించినా మా ప్రాణమైన ఈ శరణాలయం కు 50% ఇస్తాము అని సగం మాత్రమే తీసుకున్నాము . 

ఇంటర్ హాలిడేస్ కాబట్టి ఉదయమే ఆఫీస్ కు వెళ్ళాము . 
సర్ : మహేష్ .......... వార్డెన్ కాల్ చేశారు . శరణాలయం నుండి బయటకు వచ్చే సమయం అయ్యింది అనిచెప్పారు . ఎక్కడో ఎందుకు మన బిల్డింగ్ పైననే రూమ్ ఉందికదా అక్కడ ఉండొచ్చు . మీరు ok అంటే కావాల్సినవన్నీ arrange చేయిస్తాము . 
సర్ ......... అడగకముందే వరం ఇస్తే కాదనగలమా అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాము . 
సర్ : మహేష్ ఇందులో మా స్వార్థ్యం కూడా ఉంది . మీరు 24/7 ఆఫీస్ లోనే ఉంటే మరింత లక్కీ మాకు , వెళ్ళండి వర్క్ చూసుకోండి సాయంత్రం లోపు నేను క్లీన్ చేయిస్తాను , వెంకట్ అన్నయ్యను పిలిచి కనీస అవసరాలు ఉండేలా మార్చేయ్యాలి అని డబ్బుని ఇచ్చారు . 
అధిచూసి చాలా ఆనందించాము . 

నెక్స్ట్ రోజు ఉద్వేగవాతావరణంలో తమ్ముళ్లను బుజ్జాయిలను కౌగిలించుకుని మనం అప్పుడప్పుడూ కలుద్దాము అనిచెప్పి ట్రంక్ లతోపాటు ఆఫీస్ బిల్డింగ్ పైకి షిఫ్ట్ అయ్యాము . ఇంటికి అవసరమైనవన్నీ ఉండటం చూసి ఆనందించి రేయ్ సర్ వాళ్లకు మనం ఋణపడిపోయామురా అని సంతోషంతో మాట్లాడుకున్నాము . ఇంటర్ తరువాత ఏమిచెయ్యాలో చర్చలు మొదలయ్యాయి .

కృష్ణ : బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలిరా ......... అదేకదా మన డ్రీమ్ అని వాడు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు .
అవునురా ........... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైజాగ్ వదిలి వెళ్లిపోవాలి . 
కృష్ణ : 4 ఇయర్స్ పడుతుందిరా ........., ఏరా ఇప్పటికీ మరిచిపోలేదా .........
జీవితాంతం మరిచిపోలేనోమో రా ........... , అధివదిలెయ్యి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్రణాళిక చెయ్యాలి . ఎంసెట్ లో govt కాలేజ్ లో సీట్ సంపాదించాలి .nights Hardwork చెయ్యాలి అని హైఫై కొట్టుకుని కిందకువచ్చాము . 

 చిన్న సర్ వాళ్ళు ముగ్గురినీ ప్లానింగ్ రూంలోకి పిలిచారు . వెంకట్ అన్నయ్య నన్ను పెద్ద సర్ దగ్గరికి తీసుకెళ్లాడు .
సర్ : మహేష్ .......... ఇందాకే అంతా ok కదా అని తెలుసుకోవడానికి పైకివచ్చాను . మీ డ్రీమ్స్ విన్నాను . 
అవును సర్ కృష్ణ వాళ్లకు బెంగళూరులో జాబ్ చెయ్యాలని పేపర్లో - టీవీల్లో వాళ్ళ lifestyle తెలుసుకున్నప్పటి నుండి ఇష్టం అది మా 15 వ ఏడు అనుకుంటాను . నాకు కూడా వాళ్ళతోపాటు వెళ్లాలని అందరమూ ఒక్కదగ్గరే ఉండాలని ఉంది సర్ .
సర్ : all the best మహేష్ , కానీ నాకూ ఒక మాట ఇస్తావా మహేష్ ......... ,
సర్ ......... ఆర్డర్ వెయ్యండి సర్ మీ వలన ఎన్నో సంతోషాలను పొందాము , మీకోసం ఏమైనా చేస్తాము .
సర్ : మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టేంతవరకూ మా పరిస్థితి వేరు , పనిచేసేవాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి , మీరు అడుగుపెట్టబోతున్నారని తెలిసే మిస్ వైజాగ్ ఈవెంట్ మనకు లభించింది అనిమాత్రం 100% చెప్పగలను . మీరు ఈ కంపెనీకె లక్ , వేలల్లో రాబడి నుండి లక్షలకు చేరుకున్నాము - మావలన ఎన్నో కుటుంబాలు సంతోషన్గా ఉన్నాయి . మీరు మాతో ఉంటే కోట్లకు చేరుకుంటాము అని నేను విశ్వసిస్తున్నాను . మీరు వెళ్ళిపోతే మళ్లీ మొదటికి చేరుకుంటామెమో అని భయమేస్తోంది . 
సర్ ........... అలా ఎప్పటికీ జరగకూడదు . ఇప్పుడెలా ముగ్గురూ బెంగళూరు డ్రీమ్ లో జీవిస్తున్నారు . నేను నా జీవితంలో ఆశించినది ఎలాగో పొందలేకపోయాను - ఇప్పుడు నా ప్రాణమైన మిత్రులు ........... అని సతమతమవుతున్నాను . 
సర్ : మహేష్ .......... నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది . నలుగురూ ఉండాల్సిన అవసరం లేదు - మీలో ఒక్కరు ఉన్నా మా కాన్ఫిడెంట్ ఇప్పుడెలా ఉందో అలా ఉంటుంది please please please ........... నా కొడుకు స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు - నా కూతురికి పెద్దింటి సంబంధం చూసాను వాళ్లకూ పెద్దమొత్తంలో ఇవ్వాలి . ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అని బాధపడుతూ చెప్పారు . 
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 04:59 PM



Users browsing this thread: 30 Guest(s)