Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#38
కృష్ణ : రేయ్ మామా .......... రేపు ............
Ok రా .......... సండే నాదేవతను చూస్తాను . నెలరోజులు ఆగాను మరొక్కరోజు ఆగనా ......... , ఇక నా దేవత ఇక్కడే ఉండబోతోంది కదరా .......... సండే నుండి రోజూ వచ్చి చూస్తాను . రేపు బిగ్గెస్ట్ ఈవెంట్ మరియు మనకోసం మనం అడగకముందే సర్ వాళ్ళు మానవాళ్ళందరికీ ఫుడ్ రెడీ చేస్తున్నారు . మిగిలినది ఇస్తాను అనలేదు . సర్ మంచివారురా , మనల్ని లక్ అన్నారు ఆయన నమ్మకాన్ని వమ్ముచేయ్యకూడదు పదండి అని శరణాలయo చేరుకుని , అమ్మవారి ముందే వార్డెన్ కు సాలరీ అని మొత్తం డబ్బు ఇచ్చేసాము . 
వార్డెన్ : మహేష్ ......... సగం అయినా మీరు ఉంచుకోండి . మీకిప్పుడు 16 సంవత్సరాలు 18 ఏళ్లకు శరణాలయం నుండి వెళ్ళిపోతారు , అప్పుడు అవసరమౌతుంది అనిచెప్పారు . 
అది రూల్ కదా .......... వార్డెన్ అప్పటి సంగతి అప్పుడు చూద్దాము లేండి , కష్టాన్ని నమ్ముకున్నాము ఎక్కడైనా బ్రతికేస్తాము . జీవితంలో అన్ని బాధలను కష్టాలను ఇక్కడే అనుభవించాము , మాకు తెలిసి ఇంతకంటే ఉండవు . మావెంట అమ్మవారు ఉండనే ఉన్నారు అని ప్రార్థించాము . అప్పటివరకూ మీరే మాకు అన్నీ అనిచెప్పి ఆటస్థలంలోకివెళ్లి ఆడుకుని భోజనం చేసి 10 గంటలవరకూ చదువుకుని , చంద్రుడితో నా దేవత గురించి మాట్లాడుతూ .......... రేపు మీ ఆకాశ మార్గాననే నాదేవత వస్తున్నారు . జాగ్రత్తలన్నీ మీరే చూసుకోవాలి అని ఫోటోలను చూస్తూ చూస్తూనే నిద్రపోయాను .

రేయ్ రేయ్ మామా ........... 
సడెన్ గా లేచి కూర్చుని నాదేవత ఫోటోని కళ్ళుతెరిచి చూసి పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ goddess ఈరోజు మన బ్యూటిఫుల్ వైజాగ్ లో అడుగుపెట్టబోతున్నారు - మరింత అందాన్ని తీసుకురాబోతున్నారు అని సిగ్గుతో మురిసిపోతున్నాను . 
మూడువైపులా ముగ్గురూ తియ్యని కోపంతో కన్నార్పకుండా నావైపే చూస్తుండటం చూసి నవ్వుకుని , గుడ్ మార్నింగ్ రా ......... సమయం ఎంత అని అడిగాను .
సూరి : 4 గంటలు రా ............ 
రేయ్ మామా గంటలో సర్ ముందు ఉండాలిరా అని నాదేవతను గుండెలపై హత్తుకుని , ఫోటోలన్నింటినీ బాక్స్ లో ఉంచేసి , ఒక్కనిమిషం లో వస్తానురా అని లోపలికి పరిగెత్తి నా ట్రంక్ లో ఉంచేసి లాక్ చేసాను . బట్టలన్నీ విప్పేసి టవల్ చుట్టుకొని బావిదగ్గరకు చేరి నలుగురమూ below టెంపరేచర్ లో ఉన్న నీటితోనే వణుకుతూ హుషారుగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి , అమ్మవారిదగ్గరకువెళ్లి ప్రార్థించి , వార్డెన్ కు మధ్యాహ్నం పెళ్లి బోజనంతో వస్తామనిచెప్పి హుషారుగా బయలుదేరాము . 

మాటిచ్చినట్లుగానే అందరికంటే ముందు ఆఫీస్ చేరుకున్నాము . మేము చేరుకున్న 15 నిమిషాలకు మా తోటి వర్కర్స్ వచ్చి యూనిఫార్మ్ లోకి మారి ఏమేమి అవసరమో అన్నింటినీ వెహికల్లోకి మారుస్తున్నారు . మేము కూడా మారిపోయి సహాయం చేసాము . 
కొద్దిసేపటితరువాత సర్ వాళ్ళువచ్చి మహేష్ ......... ఫస్ట్ మీరే వచ్చారట - ఇక ఈరోజు లాక్కంతా మనవైపే - ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ............. నీ సర్ప్రైజ్ ను కలవబోతున్నావు కాబట్టి మీ నలుగురూ యూనిఫార్మ్ వేసుకునే అవసరం లేదు . మీకోసం కొత్తబట్టలు తీసుకొచ్చాము లోపలికివెళ్లి వేసుకుని రెడీ అవ్వండి అని అందించారు . 

సర్ .......... జీవితంలో ఫస్ట్ టైం కొత్తబట్టలు వేసుకోబోతున్నాము అని కళ్ళల్లో చెమ్మతో థాంక్స్ చెప్పబోతే ఆపి , 
సర్ : మహేష్ - కృష్ణ .......... అక్కడితో ఆగిపోండి . ఈ బట్టలు ఇచ్చినది మేము కాదు. మనం ఎవరి మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఈవెంట్ చేస్తున్నాము ఆ పెళ్లికూతురుగారు ఇచ్చారు . మీ నలుగురికే కాదు మీ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు . లంచ్ తోపాటు తీసుకువెళ్లండి అనిచెప్పారు . 
సర్ .......... అని ఆశ్చర్యపోయాము . 
సర్ : మిమ్మల్ని ఎంత హడావిడి ఉన్నా ఒకసారి ఆ మేడం దగ్గరకు తీసుకెళతాను అక్కడ థాంక్స్ చెప్పండి . కమాన్ కమాన్ .......... గంటలో మనం అక్కడ ఉండాలి అనిచెప్పడంతో బట్టలు అందుకొని లోపలికి పరుగునవెళ్ళాము .
కృష్ణ : రేయ్ మామా .......... వైజాగ్ లో మరొక దేవత కూడా ఉందిరా ..........
అవును అని కొత్తబట్టలను చూసి మురిసిపోయి ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వేసుకుని రెడీ అయ్యి పెద్ద వెహికల్లో కూర్చోబోతే , తమ్ముళ్లూ .......... అందులో కూర్చుంటే బట్టలకు దుమ్ము అంటుకుంటుంది - మేడం చూస్తే బాధపడొచ్చు. ఈరోజు మన కార్లలో వెళదాము రండి అనిచెప్పడంతో , 
సర్ వాళ్ళ మాటను కాదనలేక వెళ్లి కూర్చున్నాము . ఫస్ట్ టైం కొత్తబట్టలు - ఫస్ట్ టైం కారులో ప్రయాణం .......... నాదేవత అడుగుపెట్టబోతున్నారోజు ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఆస్వాదించబోతున్నామో అని నాలోనేనే ఆనందించాను . 

6 :30 కల్లా ......... ఏకంగా స్టేడియం నే పెళ్ళిమండపంలా మార్చేసిన దగ్గరకు చేరుకున్నాము . విద్యుత్ కాంతులు పూలతో అలంకరణ స్వాగతం పలకడం చూసి మరింత ఆనందించాము . 
సర్ : మహేష్ , కృష్ణ .......... ఈరోజు మీరు ఏమీ పనిచేయడానికి వీలు లేదు మా ప్రక్కనే మా అదృష్టంలా ఎంజాయ్ చెయ్యండి చాలు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని తమ వెంటనే ఉంచుకున్నారు . ఈ ఆనందంలో మరియు నాదేవత అడుగుపెట్టబోతుందన్న సంతోషంలో పెళ్లి ఎవరిది అనికూడా పట్టించుకోకుండా లోపలికివెళ్లి సర్ వాళ్ళతోపాటు తిరుగుతున్నాము . 
10 -11 గంటల మధ్యన ముహూర్తం  - ఫ్యామిలీలు గిఫ్ట్స్ తోపాటు వస్తూనే ఉన్నారు. ముందు పెళ్లికి ఇంతపెద్ద స్టేడియం ఎందుకు అనుకున్నాము . కానీ 9 గంటలకల్లా నిండిపోయింది . అన్నిరకాల టిఫిన్లు ఏర్పాటుచేశారు - సర్ వాళ్ళతోపాటు తృప్తిగా తిన్నాము . అన్నీ సర్ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు . 

 ముహూర్తం సమయానికి పంతులుగారు పెళ్ళిమంత్రాలు మొదలెట్టగానే మహేష్ ......... మరికిద్దిసేపట్లో నీ సర్ప్రైజ్ నలుగురూ పెళ్ళిమండపం దగ్గరే ఉండమని చెప్పారు , పెళ్ళికొడుకుని పిలవడంతో వచ్చి కూర్చున్నారు . 
కృష్ణ : రేయ్ మామా ......... పెళ్ళికొడుకు తిరుపతిలో సెక్యూరిటీ అధికారి అనిచెప్పాడు .
పెళ్ళికొడుకు వచ్చిన కొద్దిసేపటికి పెళ్లికూతుర్ని తీసుకునిరమ్మని చెప్పడంతో వచ్చారు.

 సంతోషంతో నవ్వుతూ పెళ్లికూతురుగా నాదేవత నడుచుకుంటూ రావడం చూసి కొన్ని క్షణాలపాటు చుట్టూ ఏమిజరుగుతుందో తెలియడం లేదు . 
కృష్ణ : నా చేతిని అందుకొని రేయ్ మామా .......... అని బాధతో పిలువగానే ,కళ్ళల్లో ధారలా కన్నీళ్లు వచ్చేసాయి . 
సర్ : మహేష్ మహేష్ .......... ఎక్కడ ఉన్నావు రా ముందుకు అని పిలవడంతో , 
కన్నీళ్లను తుడుచుకుని సర్ అని ముందుకువెళ్లాను .
సర్ : మహేష్ ......... షాక్ అయ్యావుకదా , నువ్వు నీ లక్కీ నోటితో మిస్ వైజాగ్ కిరీటాన్ని దక్కేలా చేసిన కావ్య గారి పెళ్లి . మీ డ్రెస్ లు - భోజనం ఆమెనే arrange చేసినది . మీరెవరో తెలియకపోయినా అనాధలు అని ఇష్టంతో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు . ఫోటోలు దిగేటప్పుడు కలిసేలా చేస్తాను అన్నారు .
అవును సర్ నిజంగా షాక్ అయ్యాను.ఇలాంటి సర్ప్రైజ్ అని ఊహించలేదు అని క్షణక్షణానికి కన్నీళ్లు వాటంతట కారిపోతుంటే తుడుచుకుంటూ మాట్లాడాను . 

పెళ్లికూతురు పీఠలపై కూర్చోగానే బంధువులంతా చుట్టుముట్టడంతో నాదేవత కనుమరుగైపోయింది . అవును నిజమే నా హృదయాన్ని బాధకు గురిచేసి వెళ్లిపోతోంది అని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఉన్నా ......... , సర్ కు మాట రాకూడదు అని గుండెలనుండి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుని అక్కడ నుండి చివరికువచ్చేసాను . 
కృష్ణ : సర్ పాస్ అని వేలు చూపించాడు .
 సర్ : తొందరగా వచ్చెయ్యండి .
అలాగే సర్ అని బాధతో నాదగ్గరికివచ్చి , ఆ వయసులో ఏమిమాట్లాడాలో ఎలా ఓదార్చాలో తెలియక ప్రక్కనే బాధపడుతూ నిలబడ్డారు . 
క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి . కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . ఒక గంట తరువాత మహేష్ , కృష్ణ ........ అంటూ వెంకట్ అన్న వచ్చారు . వెంటనే అందరమూ కన్నీళ్లను తుడుచుకున్నాము . 
వెంకట్ : మహేష్ ......... సర్ పిలుస్తున్నారు . ఇంత జనంలో కూడా మిమ్మల్ని కలవడానికి కావ్య మేడం ఒప్పుకున్నారు రండి త్వరగా .........

సర్ : రండి అని స్టేజీమీదకు పిలుచుకొనివెళ్లి , మేడం ......... మీరు సహాయం చేసినది ఈ పిల్లలకే అని పరిచయం చేసారు . 
నాదేవత ........ ఈ క్షణంతో నా హృదయాన్ని గాయపరిచిన కావ్య మేడం : hi hi అని చేతులు అందించారు . 
నేను మాత్రమే తాకాను . నా ఫ్రెండ్స్ ముగ్గురూ .......... రెండుచేతులతో నమస్కరించి ఫోటో కోసం నిలబడ్డారు . 
మేడం నన్ను ప్రక్కనే రమ్మని బాబూ ......... నన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని నా భుజం చుట్టూ చేతినివేశారు .
నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు , అలాగే ఫోటోలు దిగి భారమైన అడుగులువేస్తూ కిందకువచ్చాము . 

సర్ : మహేష్ .........  కావ్య మేడం తన పెళ్లికి వచ్చిన అతిథులకంటే మీకే ఫస్ట్ పెళ్ళిభోజనం పంపించమన్నారు . ఎన్నిరకాల వంటలు చేశారో అన్నీరకాలనూ మరియు మీ శరణాలయంలోని పిల్లలందరకూ కొత్తబట్టలను పెద్ద వెహికల్లో ఉంచాము . వెళ్లి అందరికీ పంచి తృప్తిగా భోజనం చేసి ఈరోజు సంతోషంగా గడపండి అని పర్సులోని డబ్బుని మా జేబులలో ఉంచి బయటవరకూ వచ్చి వదిలారు . 
థాంక్స్ సర్ అనిచెప్పి వెహికల్లో కూర్చున్నాము . 20 నిమిషాలలో చేరుకుని కిందకుదిగి అన్నీ లోపలకు మార్చడంలో సహాయం చేసి , పిల్లలందరి ఆనందాన్ని చూసి నవ్వుకుని లోపలకువెళ్లి బట్టలను మార్చి విసిరేసి నా బట్టలు వేసుకుని అందరికీ దూరంగా వెళ్లి కూర్చున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 04:58 PM



Users browsing this thread: 5 Guest(s)