Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
స్వాతి , ప్రసన్నా మేడం , పెద్దమ్మా ......... నేను వైజాగ్ వస్తున్నట్లు చెల్లి కృష్ణకు మీ అన్నయ్య కృష్ణకు కాల్ చెయ్యొద్దు సర్ప్రైజ్ ఇస్తాను అనిచెప్పాను .
లవ్లీ లవ్లీ .......... మహేష్ అని మురిసిపోయారు .
సర్ ఇంటికి చేరుకుని లోపలకు అడుగుపెట్టగానే ఘుమఘుమలు ముక్కుని తాకడంతో , నేరుగా వంట గదిలోకి వెళ్ళిపోయి ఆ ........ అని నోటిని తెరిచాను . నీకోసమే మహేష్ అంటూ వేడి వేడి లెగ్ పీస్ తినిపించారు .
Soooo yummy .......... అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాదించాను .

పిన్నిగారు నవ్వుకుని అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైకి షిఫ్ట్ చేశారు .
చంద్ర , రమేష్ my boss జానకి అని శివరాం గారు , my boss భువనేశ్వరి అని నారాయణ గారు .......... శ్రీమతి గారు చంద్ర , రమేష్ మనకు ఆత్మీయులైన ఇందు ఇందు ఇండస్ట్రీస్ నుండి మహేష్ కోసం వచ్చారు .
ఇన్ని సంవత్సరాలకు ......... చాలా సంతోషం బాబు , మేడం గారు ఎలా ఉన్నారు అని అడిగారు . 
నమస్తే మేడం ......... మేడం ప్రాణమైన వాళ్లంతా ఒక్కదగ్గరికి చేరారు . మేడం ను మేము అమ్మమ్మా అని పిలుస్తాము , ఇక ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి .
అంటే చెల్లి ఇందు ..........
తల్లిదగ్గరికే చేరారు మేడం .......
సర్ వాళ్ళు , మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో గుడ్ న్యూస్ చెప్పారు . అయ్యో అందరినీ నిలబెట్టే మాట్లాడిస్తున్నాను కూర్చోండి అని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ స్వాతి ప్రసన్నా అందరూ వడ్డించారు . 
మేడం , పిన్ని గారు ......... soooo tasty , మహేష్ ఆకలిగా ఉండటం వలన అలా అనిపిస్తోంది , మా అక్కయ్య చేసి ఉంటే ఇంకా రుచిగా ఉండేవి అని పెద్దమ్మ భుజాలపై వాలారు మేడం వాళ్ళు .
తృప్తిగా తినేసి నిద్రపోకుండా సర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉదయం 2 గంటలకు బాధపడుతున్న స్వాతి ప్రసన్నాల దగ్గరికివెళ్లి వెళ్ళొస్తాను అని ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . 

బుజ్జిఅక్కయ్య కోసం తీసుకెళ్తున్న టాయ్స్ బాక్స్ ను సబ్మిట్ చేసి చెక్ ఇన్ అయ్యాము. సమయానికి ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . 
మహేష్ గారు .........
చంద్ర ......... మహేష్ అని పిలు , ఫ్రెండ్స్ అని చేతులుకలిపాను .
నవ్వుకుని మహేష్ ......... నువ్వు ఇక్కడ ఎలానో వైజాగ్ లో మా బావ ...... ఇంతకీ మా ప్రాణం కంటే మాకు ఎక్కువైన మా బావ పేరు చెప్పలేదు కదూ , మీకోసం మమ్మల్ని పంపించిన మా బావ పేరు కూడా మహేష్ ........, మీలానే అందరూ సంతోషన్గా ఉండాలని నా అనుకున్నవాళ్లకు ఎంత దూరమైనా వెళతారు . 
మరొక విషయం .......... మా బావ చెల్లి పేరు కృష్ణవేణి తను ప్రాణంలా ప్రేమిస్తున్నది మీ ఫ్రెండ్ లానే , మా బావ ఫ్రెండ్ కృష్ణని .......... మీకు కృష్ణ - కృష్ణవేణి ఎంత ప్రాణమో మా బావకు వాళ్లంటే అంత ప్రాణం . ఇంకా మీకు మా బావకు చాలా పోలికలు ఉన్నాయి ఒకసారి మీరిద్దరూ కలిసారంటే మీకే అర్థమౌతుంది కాసేపు రెస్ట్ తీసుకోండి అనిచెప్పాడు .
అయితే వెంటనే కలవాలని ఉంది చంద్ర ........
ఇప్పుడు మీరు ఒక కుటుంబాన్ని ఎలాగైతే కాపాడటానికి ఇంత దూరం వస్తున్నారో , అలాగే మా బావ నిన్న ఒక కుటుంబం కోసం మీలానే మంచినీళ్లు కూడా తాగకుండా వాళ్ళలో సంతోషాన్ని నింపడానికి వెళ్ళాడు . అన్నీ అనుకూలిస్తే ఎయిర్పోర్ట్ లోనే మీట్ అవ్వొచ్చు అనిచెప్పి , sorry రెస్ట్ తీసుకోండి అని సైలెంట్ అయిపోయాడు .

ఉదయం 5 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
బయటకు రాగానే మహేష్ ........ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బావే వచ్చాడు అని పిలుచుకునివెళ్లాడు .
బావ ........ మహేష్ , మహేష్ ....... బావ అనేంతలో ,
ఆపి ........ మహేష్ కదా తెలిసిపోతోంది అని చేతులు కలిపాను .
వైజాగ్ మహేష్ ఆశ్చర్యపోతుంటే , చంద్ర మీ గురించి మొత్తం చెప్పాడు . మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని సంతోషంతో చెప్పాను .
నేను కూడా మహేష్ ........ మాకోసం వైజాగ్ వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ , ఎందుకో మిమ్మల్ని ఒకసారి కౌగిలించుకోవాలని ..........
కమాన్ మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకున్నాను .

సంతోషంతో మురిసిపోయి మీకు సంతోషం అయితే మా ఇంటికి పిలుచుకునివేళతాము కాదు అంటే హోటల్ ......... అనిచెప్పాడు వైజాగ్ మహేష్ .
Sooooo థాంక్స్ , మా చెల్లీ వాళ్ళ ఇల్లు ఉంది అనిచెప్పాను . కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడానికి పనిచూసుకుని ఇప్పుడే వెళదాము అనిచెప్పాను . మీ పేరు మహేష్ - నా పేరు మహేష్ , మీ ప్రాణమిత్రుడి పేరు కృష్ణ - నా ప్రాణమిత్రుడి పేరు కృష్ణ , మీ ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి - నా ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి ............ అని చెప్పాను .
మహేష్ ......... మీకు ........ఎలా .......
బావోయ్ ........ నేనే అని చంద్ర కాలర్ ఎగరేశాడు . 
ఇదొక అద్భుతం మహేష్ ......... అని ఆశ్చర్యపోతున్నాడు వైజాగ్ మహేష్ .

మహేష్ .......... అక్కడ నా చెల్లి ఇంట్లో మా బుజ్జిఅక్కయ్య వెయిటింగ్ , ముందుగా నేను ఏమిచెయ్యాలో అక్కడకు తీసుకెళ్లండి అనిచెప్పాను .
మహేష్ ......... ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు కాస్త రెస్ట్ తీసుకుని ........
నాకు అలవాటే మహేష్ ......... ఫస్ట్ వర్క్ దగ్గరకువెళ్లి ఆ వెంటనే మీకు ఇష్టమైతే మీ ఇంటికివెళ్లి , మా బుజ్జిఅక్కయ్య లేచేలోపు తన ముందు ఉండాలి గిఫ్ట్స్ తో ,........ , చంద్ర ..........
మహేష్ ......... రమేష్ తీసుకొచ్చేస్తున్నాడు అనిచెప్పాడు .
మహేష్ ......... మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అని , welcome to బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అని బయటకు దారి చూపించి , బాక్స్ కారుపై ఉంచుకుని మాట్లాడుతూ బిల్డింగ్ తీసుకెళ్లారు .
లోపలికివెళ్లి మొత్తం చూసి పర్ఫెక్ట్ ఫర్ ఫ్యాషన్ వరల్డ్ అని వైజాగ్ మహేష్ , చంద్ర , రమేష్ సహాయంతో డేటా సేకరించి రేపటిలోపు మోడరన్ స్వర్గంలా ఉండే ప్లాన్ మీముందు ఉంచుతాను అనిచెప్పాను .
Thats it ..........
అంతే చంద్ర .......... 
గ్రేట్ మహేష్ అర గంటలో wow ..........
వైజాగ్ మహేష్ సంతోషించి , మహేష్ ఇంటికి వెళదామా అని పిలుచుకొనివెళ్లారు .

లోపలికి అడుగుపెట్టగానే అమ్మమ్మా , అమ్మా , అత్తయ్యా , అక్కయ్యా , చెల్లీ , పిల్లలూ ........... అంటూ ఆప్యాయతలతో పిలుపుల కోలాహలం - ఒకరంటే మరొకరికి ప్రాణం అన్నట్లు నేను చేస్తాను నేను చేస్తాను అని తియ్యని కోపాలు , అలకలూ ........ చూసి మనసు పరవశించిపోయింది .
మహేష్ ......... రా అని వైజాగ్ మహేష్ ఆహ్వానించాడు .

బావోయ్ ........ నేనుచూసుకుంటాను అనిచెప్పి , మహేష్ ....... సోఫాలో అందరినీ ప్రాణంలా చూస్తూ అందరి సేవలతో మురిసిపోతున్నారే ఆమెనే మా బావ అమ్మమ్మ ఇందు ఇండస్ట్రీస్ అధిపతి అనిచెప్పాడు . 
వెంటనే వెళ్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాను . 
బంగారు , చంద్ర ఎవరు అని పైకిలేచారు .
చంద్ర మొత్తం వివరించాడు . చాలా సంవత్సరాలు అయ్యింది బాబు కూర్చో అని చెప్పింది .
మహేష్ ఒక్కనిమిషం కృష్ణను పిలుచుకొనివస్తాను అని పరిచయం చేశాడు . 
ఇక మహేష్ అయితే తన అమ్మ దగ్గర నుండి పిల్లల వరకూ అందరినీ పరిచయం చేసారు . 
లేచి అందరికీ నమస్కరించి అమాంతం వైజాగ్ మహేష్ ను కౌగిలించుకుని , నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మహేష్ ......... అంటూ కళ్ళల్లోని ఆనందబాస్పాలను తుడుచుకున్నాను .
ఒకరు కాఫీ తెచ్చి ఇచ్చారు . 
మహేష్ ....... she is కృష్ణవేణి - కృష్ణ ప్రేమ పక్షులు అని చంద్ర చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు .

చెల్లెమ్మా అంటూ ఇద్దరి భుజాలపై చేతులనువేసి , నాకు మీరు ఎలానో తనకూ asitis మీలానే మీ పేర్లతోనే ఫ్రెండ్ చెల్లి ఉంది . మిమ్మల్ని చూడటానికే వచ్చారు అని వైజాగ్ మహేష్ చెప్పారు .
Wow ........ అద్భుతం కదా అన్నయ్యా అని నమస్కరించి , వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని నన్ను అడిగారు .
ఇక్కడే వైజాగ్ లో ఉన్నారు , వీలుచూసుకుని పిలుచుకొనివస్తాను మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది ఒకేఒక్క సెల్ఫీ అనిఅడిగాను .
కృష్ణ పరుగునవెళ్లి రెండు సెల్ఫీ స్టిక్స్ తీసుకొచ్చారు .
మహేష్ ........ మాకు ఒకటి అని నవ్వి అందరూ ఒకదగ్గరకు చేరడంతో సెల్ఫీలు తీసుకున్నాము . 
మహేష్ , కృష్ణ , చంద్ర , రమేష్ .......... వెళ్ళొస్తాను అనిచెప్పాను .
బాబు .......... బ్రేక్ఫాస్ట్ చేసివెల్లు అని చాలామంది ఆహ్వానించారు . 
ఇంకా బ్రష్ కూడా చెయ్యలేదండీ , చెల్లీ మా బుజ్జిఅక్కయ్యతోపాటు వచ్చి ఏకంగా డిన్నర్ చేస్తాముకదా , మిమ్మల్ని కలవడం నా అదృష్టం అనిచెప్పి వైజాగ్ మహేష్ , చంద్రతోపాటు బయటకువచ్చాము . 

మహేష్ ........ మీ కుటుంబం లా కాకపోయినా నాకూ ఒక చిన్న కుటుంబం ఉండేది 17 ఏళ్ల క్రితం విడిపోయాము . వాళ్లకోసం ......... అంటూ కళ్ళల్లో చెమ్మతో బాధపడుతుంటే , 
వైజాగ్ మహేష్ , చంద్ర కౌగిలించుకుని మహేష్ ....... నీ బాధను అర్థం చేసుకోగలము అతి తొందరలోనే నువ్వు నీ కుటుంబాన్ని చేరుకుంటావు అని చెప్పారు .
అదేనిజమైతే ఈ జీవితానికి ఇంకేమీ వద్దు , sorry ........ నా బాధను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాను .
మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా మహేష్ ......... ఫ్రెండ్స్ అర్థం ఒకరి బాధను మరొకరు పంచుకుని సహాయం చేసుకోవడమే అని చెప్పారు . 
థాంక్స్ మహేష్ , చంద్ర ........ మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతోంది వెళదామా అని చెల్లి ఇంటికి చేరుకున్నాము .
లగేజీ దించి మహేష్ , చంద్ర లోపలికి రండి అని ఆహ్వానించాను . 
మహేష్ ......... ఒక చిన్న సమస్య వలన రెండురోజులు కాలేజ్ కు వెళ్ళలేదు సో ......... వెళ్ళాలి , ఇల్లు తెలుసుకదా సాయంత్రం మీరు ఆహ్వానించకున్నా తప్పకుండా వస్తాను ..........అని వైజాగ్ మహేష్ నవ్వుతూ అన్నాడు .
ఇదికూడా మీ ఇల్లే ఎప్పుడైనా రావచ్చు ........
అయితే తరువాత కలుద్దాము మహేష్ అని కారు డోర్ తెరిచి మళ్లీ వెనక్కువచ్చి మహేష్ ........ అంటూ అమాంతం కౌగిలించుకుని , మేము చెబుతున్నాము కదా మీ కుటుంబం అతి త్వరలోనే కలుస్తారు అనిచెప్పి వెళ్లిపోయారు .

థాంక్స్ మహేష్ ........ అని మనసులో అనుకుని పెద్ద బాక్స్ ను తలపై మోసుకుని గేట్ తీసుకుని లోపలికివెళ్ళాను .
మెయిన్ డోర్ తెరుచుకోవడం , మా బుజ్జిఅక్కయ్య బయటకువచ్చి నన్నుచూసి అంతులేని ఆనందంతో నోటివెంట మాటరానట్లు షాక్ లో అలానిలబడిపోయింది .
సర్ప్రైజ్ అంటూ బాక్స్ కిందపెట్టివెళ్లి అమాంతం ఎత్తుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దుల వర్షం కురిపించాను . 
తమ్ముడూ ......... అని ముద్దొచ్చే కోపంతో గుండెలపై ప్రేమతో కొట్టి గట్టిగా నామెడను చుట్టేసింది .
లవ్ యు అక్కయ్యా .......... వారం వారం రావాల్సింది కానీ తమరే కదా నేను హైద్రాబాద్ వచ్చేలోపు అక్కయ్యను చూడాలి అనిచెప్పింది . అందుకే మా బుజ్జిఅక్కయ్య కోరిక తీర్చడం కోసం నిద్రాహారాలు మానుకుని హైదరాబాద్ వెతుకున్నకొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది .
నేను అలా అన్నాకూడా రావాలి ........ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి లవ్ యు తమ్ముడూ అని గట్టిగా హత్తుకుంది .

మీకోసం మా బుజ్జాయి కోసం స్వాతి మేడం , ప్రసన్నా మేడం , పెద్దమ్మా , సర్ వాళ్ళు బోలెడన్ని బొమ్మలు పంపించారు అని బాక్స్ వైపు చూపించాము .
నోటికి తన బుజ్జి బుజ్జి చేతులను అడ్డుపెట్టి బాక్స్ మొత్తం అని సంతోషంతో ఆశ్చర్యపోతుంటే మురిసిపోయి , లోపలివేళదామా బొమ్మలన్నీ చూడొచ్చు అనిచెప్పాను .
ష్ ష్ ష్ ......... తమ్ముడూ లోపల లోపల లోపల ....... అని బుజ్జిఅక్కయ్య నవ్వుతోంది .
ఏమిటి అక్కయ్యా అని కళ్ళతో సైగచేసాను .
లోపల వంట గదిలో నాన్న వంట చేస్తున్న అమ్మను వెనుక నుండి కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నారు . రోజూ ఇదే వరస అది చూడలేకే బయటకు వచ్చేస్తూ నా తమ్ముడిని చూసింది అని నవ్వుతూ చెప్పింది .
అంటే లోపల మా బుజ్జిఅక్కయ్యకు మరొక బుజ్జి తమ్ముడిని పుట్టించడానికి ప్లాన్ చేసేస్తున్నారన్నమాట , డిస్టర్బ్ చేయకూడదు అయితే ఇక్కడే కూర్చుందామా అనిఅడిగాను .
తమ్ముడూ పైన కూడా మనదే .........
అయితే అక్కడ ఫ్రెష్ అవుదాము అని బ్యాగుని భుజంపై , బాక్స్ ను దారిన వెళుతున్న ఒకరి సహాయంతో తలపై ఉంచుకుని ,మా బుజ్జిఅక్కయ్యకు అప్పుడే చాలావిషయాలు తెలిసిపోయాయి , మాటలు కూడా బోలెడన్ని మాట్లాడేస్తోంది అని ముద్దులుపెడుతూ పైకివెళ్లి , బుజ్జిఅక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టి బాక్స్ దించి ఓపెన్ చేసి ఎంజాయ్ అక్కయ్యా ......... ఇలా వెళ్లి అలా ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అని టవల్ బట్టలు అందుకొని స్నానం చేసి బట్టలువేసుకునివచ్చాను .

అన్నయ్యా , రేయ్ మామా ........ అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చావు అని అడిగారు . మా బుజ్జిఅక్కయ్యకు బుజ్జితమ్ముడిని ఇచ్చే పనిలో ఉన్నారుగా అప్పుడు , ఆ విషయం మా బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ఇంట్లోకి కూడా అడుగుపెట్టనీకుండా ఇక్కడకు పిలుచుకొనివచ్చింది .
అన్నయ్యా ....... అని వాడి చేతిని గిల్లేసి , ఎలా ఉన్నారు ఏదో కల అని స్వాతి కాల్ చేసింది . 
అక్కడికే వెళ్ళాలి , చెల్లీ ఆకలేస్తోంది తినేసి ఆ సమస్యను తీర్చి , రాత్రికి ఒక ప్లాన్ వెయ్యాలి వేసి , మనమంటే ఇష్టపడే పెద్ద కుటుంబాన్ని కలిసి ఎల్లుండి మా బుజ్జిఅక్కయ్యతోపాటు అందరమూ హైద్రాబాద్ వెళ్లిపోవడమే అని సంతోషంతో చెప్పాను .

రేయ్ మామా ......... నిన్న రాత్రి మెసేజ్ వచ్చింది . మరికొన్నిరోజులు extend చేశారు అని తలదించుకొని చెప్పాడు .
ఏంట్రా ......... , కృష్ణా .......అని నేనూ చెల్లి ఆడిగాము .
మరికొన్నిరోజు......... 
అంతే బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిఅక్కయ్య పరుగునవచ్చి నా కాలిని చుట్టేసింది.
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకొని , రేయ్ నెలరోజులు అన్నావు అయిపోయింది . ఇక మావల్ల కాదు . నావల్ల కూడా కాదు తమ్ముడూ ........, 
రేయ్ మామా , కృష్ణా ......... నాకు తెలియదా , ఇక్కడి పని పూర్తవగానే మీరు హైద్రాబాద్ వెళ్ళండి డ్యూటీ పూర్తిచేసుకుని నేనెవస్తాను అనిచెప్పాడు .
ఇలా అన్నావు బాగుంది . లేకపోతే అయిపోయేవాడివి అని అందరమూ నవ్వుకున్నాము .
అన్నయ్యా ......... నా చేతులతో తినిపిస్తాను రా అని కిందకు పిలుచుకునివేలుతూ , బుజ్జిఅక్కయ్యకోసం ఇన్ని బొమ్మలా ........, అక్కడ ఎయిర్పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వలేదు చెల్లీ లేకపోతే షాప్ మొత్తం తీసుకొచ్చేవాన్ని అని బుజ్జిఅక్కయ్య నవ్వుని చూసి ఎంజాయ్ చేస్తూ , స్వాతి ప్రసన్నా కూడా వస్తామని చెప్పారు . చిన్న పని లండన్ వెళ్లారు అని వివరించాను .
నెలరోజుల తరువాత చెల్లీ , బుజ్జిఅక్కయ్య చేతులతో తింటుంటే కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . బుజ్జిఅక్కయ్య చెల్లి చీరకొంగు అందుకొని తుడిచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి తనూ తినింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-06-2020, 05:52 AM



Users browsing this thread: 3 Guest(s)