Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఉదయం తెల్లవారకముందే లేచి ఫ్రెష్ అయ్యి ఆరోజు మాత్రం అక్కయ్యను వెతకడానికి వెళ్లక , రేపటి నుండి చెల్లి డెలివరీ వరకూ నేనుమాత్రమే వెళ్లాలని నిర్ణయించుకుని ఫ్రెష్ అయ్యి బయటకువచ్చాను . చెల్లి అప్పటికే పూజ చేసి హారతి నా ముఖానికి అందించి నుదుటిపై బొట్టుపెట్టింది .

కాలింగ్ బెల్ మ్రోగడంతో కృష్ణగాడువెళ్లి డోర్ తెరిచాడు .

కృష్ణ ప్రక్కకు తప్పుకో అని తోసేసి అమ్మ , సునీతమ్మ , కృష్ణ అమ్మ , మేడం వాళ్ళు , అంటీ , కార్తీక ........... లోపలికివచ్చి నా బంగారుతల్లి అని ఒకరితరువాత మరొకరు కౌగిలించుకుంటుంటే చెల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .

వెనుకే పెద్దయ్యా , విశ్వ సర్ , జైలర్ సర్ , అంకుల్ వాళ్ళు ముగ్గురూ , అన్నయ్యా............. గంపలు గంపలు మామిడిపళ్ళు , చింతకాయలు ............స్వీట్స్ .......... fruits హాల్లో తెచ్చిపెడుతూనే ఉన్నారు .

చెల్లి అమాంతం మామిడికాయ తీసుకుని అమ్మా , అత్తయ్యా , అంటీ ......... రాత్రి నుండి ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అని తినడం చూసి అందరూ సంతోషంగా నవ్వి , అందుకే కదా తల్లీ ఇవన్నీ తీసుకొచ్చింది అని ముద్దులతో ముంచెత్తారు .



 కృష్ణ .......... సాయంత్రం మా తల్లికి పుట్టింటి తరుపున , మెట్టినింటి తరుపున శ్రీమంతం చెయ్యాలనుకుంటున్నాము .

రేయ్ ..........., 

తెలుసురా అని చెల్లిని వాడి గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణం లా ముద్దుపెట్టి , అమ్మా ...... వాడు ఎలా అంటే అలా వాడే మాకు అన్నీ అని చెల్లిని నా గుండెలపైకి చేర్చాడు .

కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అని , ఇంతవరకూ జరగని విధంగా ఘనంగా జరుపుదాము అమ్మలూ  పెద్దయ్యా .......... మన ఊరి అమ్మలను ముత్తైదువులను అందరినీ ఆహ్వానిద్దాము అనిచెప్పాను .

మహేష్ ........... అందరూ బస్ లో బయలుదేరిపోయారు ఏ క్షణమైనా ఇక్కడకు బస్ లలో చేరిపోతారు . మా వల్ల కాక మేమంతా ఫ్లైట్ లో వచ్చేసాము . Govt ఆఫీసర్స్ సెంట్రల్ సెక్యూరిటీ అధికారి ఉండటం వలన ఇవన్నీ తీసుకురాగలిగాము . ఇంకా బస్ లో ఈ ఇల్లు కూడా సరిపోనన్ని వస్తున్నాయి మా బంగారుతల్లికోసం అని అమ్మలు చెప్పడంతో , చెల్లి ఆనందానికి అవధులు లేనట్లు సిగ్గుపడుతూ కార్తీక దగ్గరకువెళ్లి కడుపుని తాకి ఎన్నో నెల అని అడిగింది . 

5  వ నెల అక్కయ్యా ........... 

చాలా సంతోషం అని బావగారితో మాట్లాడుతున్న నా దగ్గరకు పిలుచుకొనివచ్చింది .

అంటీ .......... చెల్లెలిద్దరికీ ఒకేసారి శ్రీమంతం జరిపిద్దాము అనిచెప్పాను .

చల్లగా ఉండు మహేష్ అని అంటీ , అంకుల్ దీవించారు .



రేయ్ మామా ........... సంబరం అంబరాన్ని దాటాలి . కింద అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్ మరియు ఫుడ్ ఏర్పాట్లు నువ్వుచూసుకో , decoration సంగతి అతిథుల సంగతి నేను చూసుకుంటాను అని మొదట గోపి అన్నకు కాల్ చేసి వదినకు కాల్ చేయగానే ఇంటికి వచ్చేసారు . గోపి అన్న కృష్ణకు పెద్దయ్యా వాళ్లకు సహాయం చేస్తున్నాడు .

రమేష్ కు విషయం చెప్పి ఫ్యామిలీతోపాటు వచ్చెయ్యమని చెప్పాను . వాడు రాగానే  చైర్మన్స్ ఇంటికి చేరుకుని మేడం వాళ్ళను ఆహ్వానించాను . 

హలో ఏంటి చూస్తున్నారు మహేష్ వెనుకే వెళుతున్నాము , స్వయంగా మనమూ పనులుచేస్తున్నాము అని ఆర్డర్ వెయ్యడంతో , శ్రీమతి గారు తమరు ఎలా చెబితే అలా అని మావెంటే వచ్చేసారు .

మేనేజర్ కు కాల్ చేసి సాయంత్రం ఫ్యామిలీతోపాటు రమ్మని ఆహ్వానించాను .



మేడం వాళ్ళు చెల్లిని కలవడానికి పైకి , సర్ వాళ్ళు కృష్ణదగ్గరికివెళ్లి ఏదైనా పనిచెప్పు అని బ్రతిమిలాడటం చూసి చాలా సంతోషం వేసింది .

ఆ ......... కృష్ణ decoration కోసం ఎవరినీ పిలవలేదుకదా అని కాల్ చేసి మొత్తం అందరినీ పిలిపించి , స్వర్గం లా తయారుచెయ్యాలి అవసరమైతే మేము పనిచేస్తాము అని ఉత్సాహంతో చెప్పి , సోఫాలు కుర్చీలను సెట్ చెయ్యడంలో చేతులను కలిపారు.

సర్ ............ మీరు ..........

ఈరోజు మమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు , మీ మేడమ్స్ ఆర్డర్ ......... కిందకువచ్చి enquiry చేశారంటే మా పని అంతే నువ్వు వెళ్లి మిగతాపనులు చూసుకో అని ఉత్సాహంతో చెప్పారు .

ఇంతలో చెల్లి birthday నాటి క్యాటరింగ్స్ మేనేజర్ వచ్చి సంతోషంతో  చేతులుకలిపి చాలా కాలం తరువాత కలిసాము . గుర్తుపెట్టుకొని కాల్ చేసినందుకు థాంక్స్........... same ఆ రోజులానే కదా .........

సంవత్సరాలైనా మరిచిపోలేదా ..........

జీవితంలో అలాంటి మధురమైన జ్ఞాపకాలు కొన్నే ఉంటాయి . నా మనఃస్ఫూర్తిగా చేసాను ........ మీ ప్రేమలూ ఆప్యాయతలూ నన్ను ఆరోజు కట్టిపడేసాయి అనడంతో ,

థాంక్స్ అన్నా అని కౌగిలించుకుని ఈరోజు మాత్రం మూడుపూటలా అందరికీ ఓన్లీ వెజ్ అనిచెప్పాను .

ఏదీ అందరూ ఎక్కడ అని చుట్టూ చూస్తుండగానే బస్ లు ఒకటి తరువాత మరొకటి ఆగకుండా వస్తూ ఉండటం చూసి , చైర్మన్స్ మెయిన్ డోర్ దగ్గర నుండి - మేడం వాళ్ళు పైనుండి కన్నార్పకుండా చూస్తూ one two three ..........seven eight .........twelve thirteen .........ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నీ గుంటూరు బస్ లే ...........ఇంతమందా అని ఆశ్చర్యపోతున్నారు .



బస్ లలోనుండి బుట్టలతో దిగుతోంటే వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ అమ్మలూ ఎలా ఉన్నారు రండి అని ప్రేమలతో ఆహ్వానించాను . అమ్మానాళ్ళు కృష్ణగాడిని సంతోషంతో పలకరించి , అంతా చేసి ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు అని నవ్వుకుని, మా తల్లి ఎక్కడ అని అడిగారు .

రండి అమ్మా.......... అని మెట్లపై స్వయంగా పిలుచుకునివెళ్లాడు . పైన రెండు ఇల్లులు బయట స్పేస్ మొత్తం నిండిపోయింది  

ఊరిజనమంతా ........... కౌగిలింతలు , హైఫై ల తరువాత నలువైపులకూ వెళ్లి పనులలో సహాయం చెయ్యడం మొదలెట్టారు .

రేయ్ - రేయ్ .......... ఎవరు వీళ్లంతా అని చైర్మన్స్ ఆశ్చర్యపోతుంటే , 

నేను చెబుతాను అని క్యాటరింగ్ మేనేజర్ మా మధ్య ఆప్యాయతలను , ప్రేమను  గర్వపడుతూ చెప్పి అలాగే సర్ మహేష్ , కృష్ణల కోసం ప్రాణాలివ్వడానికైనా రెడీ తియ్యడానికైనా రెడీ .......... ప్రాణంలా బుజ్జిదేవుడు అని పిలుచుకుంటారు వాళ్లంతా, bithday కోసమే గుంటూరు నుండి వచ్చారు ఇక ఇప్పుడు పెద్ద పండగ అపార్ట్మెంట్ మొత్తం సంబరాలతో దద్దరిల్లిపోయినా ఆశ్చర్యం లేదు . వెంటనే టిఫిన్ ఏర్పాట్లు మొదలెట్టాలి అని తమ స్టాఫ్ దగ్గరకువెళ్లి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 



కృష్ణగాడికి కాల్ చేసి అమ్మావాళ్ళతోపాటు వెళ్లి అపార్ట్మెంట్ లోని అన్ని ఇళ్లకూ వెళ్లి ఫంక్షన్ కు ఆహ్వానించమని చెప్పడంతో , అమ్మావాళ్ళు కుంకుమ భరణితో ప్రతి ఇంటికీ వెళ్లి గౌరవంతో ఆహ్వానించారు .



 పెద్దయ్యా , సర్ వాళ్లకు , అంకుల్ వాళ్లకు చైర్మన్స్ ను పరిచయం చేశాను . వాళ్లంతా ఒకదగ్గర కూర్చుని మాటల్లో పడిపోయి ఎంజాయ్ చేస్తున్నారు . టిఫిన్ అవ్వగానే అమ్మావాళ్లకు పైకి పంపిస్తూ అందరూ తిన్న తరువాత కింద అందరమూ తిన్నాము . 

ఒకవైపు decoration పనులు , మరొకవైపు వాళ్లకు మరియు పైన అమ్మావాళ్లకు వాళ్ళు కోరినవి నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నాము . కృష్ణగాడు అమ్మావాళ్లను షాపింగ్ తీసుకెళ్లి చెల్లెళ్ళకు పట్టుచీర కావాల్సిన నగలను తీసుకొచ్చారు . మధ్యాహ్నం భోజనాల తరువాత ఫంక్షన్ కోసం హడావిడి గంట గంటకూ పెరుగుతూనే ఉంది .

మేడం వాళ్ళు కిందకువచ్చి సర్ వాళ్ళను పిలిచి శివరాం మాకంటే ముందే మహేష్ ను ఊరంతా బుజ్జిదేవుడు అని ప్రాణంలా పిలుచుకుంటారు తెలుసా .......... , పైన ఉన్నవాళ్ళందరూ మహేష్ , కృష్ణ , కృష్ణవేణికి అమ్మలే ........., వాళ్ళ గురించి ఒక్కొక్కటీ వింటుంటే హృదయం ఎంత పరవశించిపోయిందో . అంతమంది అభిమానించే మహేష్ మన కంపెనీలో పనిచేస్తున్నాడంటే మనం చాలా అదృష్టవంతులం అని ఆనందంతో గర్వపడుతూ చెప్పారు .

మహేష్ చెల్లెళ్ళకు మన తరుపున విలువైన బహుమతి ఇవ్వాలి అని పట్టుచీరలు మరియు జ్యూవెలరీ తీసుకుని ఇంటికివెళ్లి రెడీ అయ్యి సాయంత్రం ఫంక్షన్ సమయానికి చేరుకున్నారు .



అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్ సర్ చెప్పినట్లుగా ఇంద్రలోకాన్ని తలపిస్తోంది . సర్ మేడం వాళ్ళను , మేనేజర్ ఫ్యామిలీని , రమేష్ ఫ్యామిలీని ఆహ్వానించి సోఫాలలో కూర్చోబెట్టాము . అపార్ట్మెంట్ గెస్ట్స్ ను గౌరవంతో ఆహ్వానించాము .

అమ్మావాళ్ళంతా తమ ఇంట్లో ఫంక్షన్ లా ఒక్కరూ కూర్చోకుండా పండుగలా శ్రీమంతాన్ని జరిపించేలా చెల్లెళ్లను పిలుచుకునివచ్చారు .

అందరినీ ఆహ్వానిస్తున్న నన్ను గోపి అన్న పిలవడంతో వెళితే చెల్లెళ్ళిద్దరూ ఆనందబాస్పాలతో చేతిలో అక్కయ్య ఫొటోతో లవ్ యు అన్నయ్యా ......... ఇంతమంది ప్రాణమైన వాళ్ళమధ్యన అని పాదాలను తాకబోతుంటే ఆపి గుండెలపై హత్తుకొని , లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై ముద్దులుపెడుతోంటే , అందరూ లేచిమరీ సంతోషంతో చప్పట్లు కొట్టారు . ఫోటోగ్రఫర్లు వాళ్లపని వాళ్ళు చేసుకుపోతున్నారు .

అమ్మలూ ........... అన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి అని ఆనందబాస్పాలను తుడుచుకుని చెప్పాను .

 మీ అన్నయ్య ఎక్కడికీ వెళ్ళడు అని సంతోషంతో అమ్మావాళ్ళు చెల్లెళ్లను పిలుచుకొనివెళ్లి శ్రీమంతం కోసం తెప్పించిన అందమైన సోఫాలలో కూర్చోబెట్టారు , అక్కయ్య ఫోటోని తమదగ్గరే ఉంచుకుని మొదట మా అక్కయ్య ఆశీర్వాదం అని కోరడంతో , సునీతమ్మ కృష్ణ అమ్మ వెళ్లి అక్కయ్య తరుపున పసుపు కుంకుమ అక్షింతలు చల్లడంతో , ఉద్వేగంతో పరవశించిపోతున్న నన్ను చూసి చెల్లెళ్ళు మురిసిపోయారు .

తరువాత కృష్ణగాడు , బావలతో ......... చెల్లెళ్ళకు పసుపు కుంకుమ రాయించి , అమ్మల దగ్గర నుండి ఊరిలోని అమ్మావాళ్ళంతా పసుపు కుంకుమ రాసి పండంటి బిడ్డలు జన్మించాలని ఆశీర్వదించి గిఫ్ట్స్ అందించారు .



కృష్ణగాడు మేడం వాళ్ళ దగ్గరకువెళ్లి పిలుచుకునివచ్చాడు .

కృష్ణవేణి , కార్తీక ........... ఏ అమ్మాయికీ సొంతం కానీ ఆశీర్వాదాలు మీకు లభించాయి , మీ అన్నయ్య .......... మీ ప్రక్కన ఉండటమే మీ అదృష్టం . పండంటి అందమైన బిడ్డలు పుట్టాలి మీకు అని పసుపు కుంకుమ రాసి పట్టుచీరలు , నగలు అందించారు .

థాంక్స్ మేడం అని లేచిమరీ కౌగిలించుకొన్నారు .

మహేష్ , కృష్ణ ........ మీ బావను కూడా పిలుచుకురమ్మని చెప్పారు .

సర్ వాళ్ళు కింద నుండే మేము అని సైగచేశారు .

నో నో ......... మేము మాత్రమే కావాలంటే తరువాత మీరువచ్చి ఫోటో దిగండి అనిచెప్పి నవ్వుకున్నారు .

 మా అందరితో ఒక ఫోటో మరియు వీలైనంత మంది అమ్మలతో ఒక ఫోటో తీసుకుని సంతోషంతో వెళ్లి కూర్చున్నారు .

తరువాత అపార్ట్మెంట్ గెస్ట్స్ వరుసగా వచ్చి పరిచయం చేసుకుని , మమ్మల్ని కూడా ఈ పండుగకు ఆహ్వానించినందుకు థాంక్స్ అని ఆశీర్వదించి అక్షింతలు వేసి సంతోషంతో వెళ్లి కూర్చున్నారు .



తరువాత చైర్మన్స్ , మేనేజర్ , పెద్దయ్యా , సర్ , అంకుల్ వాళ్ళు మొదలుకుని అందరూ చెల్లెళ్లను ఆశీర్వదించి వెళ్లారు .

తల్లులూ .......... ఇక మిగిలింది ఎవరు అనగానే , చెల్లెళ్లతోపాటు అమ్మావాళ్ళు ఊరిజనమంతా అన్నయ్య ,మహేష్ , అన్నయ్యా , మహేష్ మహేష్ ........... అంటూ అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయేలా కేకలమధ్యన నవ్వుతూ కృష్ణగాడిని , బావను కూడా పిలుచుకొనివెళ్లి అమ్మావాళ్ళు చెప్పినట్లు పసుపు కుంకుమ అక్షింతలు వేసాను .

అన్నయ్యా ........అంటూ లేచి హత్తుకోబోతుంటే , అమ్మావాళ్ళు ఆపి గిఫ్ట్ గిఫ్ట్ ......... అని సంతోషంతో కేకలువేశారు .

మా ప్రాణమైన అన్నయ్యే మాకు విలువైన గిఫ్ట్ అంటూ వచ్చి నా గుండెలపై వాలిపోయారు .

జానకి మేడం వచ్చి మహేష్ గిఫ్ట్స్ పట్టుకో అని మాకు ఇచ్చావు కదా అని రెండు రింగ్ బాక్సస్ అందించారు . 

థాంక్స్ మేడం అనిచెప్పి చెల్లీ అని అందించాను . 

లవ్ యు soooooo మచ్ అన్నయ్యా .........., మాకు తెలియదా ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు . అయినా చెప్పాము కదా మా ప్రాణమైన అన్నయ్యే మాకు ఈ ప్రపంచంలోనే పెద్ద గిఫ్ట్ అని ప్రాణంలా హత్తుకున్నారు .

కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని లవ్ యు sooooo మచ్ చెల్లీ , కార్తీక అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు పెట్టాను . అప్పటికే సమయం 10 గంటలు అవ్వడంతో చెల్లెళ్లను అమ్మావాళ్లదగ్గరికి పంపించి భోజనం ఏర్పాట్లు చూసుకున్నాము. అంతా పూర్తయ్యేటప్పటికి ఒంటి గంట అయ్యింది . 

తల్లీ ..........మేము తోడుగా ఉండాలా అని అమ్మావాళ్ళు అడిగారు .

అమ్మలూ.......... ప్రాణంలా చూసుకునేవాళ్ళు ఇద్దరు ఉన్నారు , కాల్ చేస్తే వాలిపోయే వదిన ఉన్నారు మీరేమీ కంగారుపడకండి అని బదులిచ్చింది .

సరే తల్లీ వెళ్ళొస్తాము అని అందరూ బస్ లోనే కార్తీక , బావగారు మాత్రం ఫ్లైట్ లో బయలుదేరారు . మహేష్ ......... రేపు ....... 12 దాటింది కదా ఈరోజే ఆఫీస్ కు రానక్కరలేదు మరియు ప్రతిరోజూ కూడా మీరు ఆఫీస్ కు రానవసరం లేదు చెల్లిని జాగ్రత్తగా చూసుకో ఆలస్యం అయ్యింది వెళ్ళొస్తాము అని చైర్మన్స్ , జీవితంలో ఒక మెమొరబుల్ రోజు ఇచ్చావు మహేష్ అని మేడం వాళ్ళు ఏకంగా గట్టిగా కౌగిలించుకుని పెదాలపై చిరునవ్వుతో వెళ్లిపోయారు . డ్రైవర్ అందరినీ ఇంటికి తీసుకెళ్లు ఇక్కడ ఇంకా చాలా పని ఉంది మొత్తం శుభ్రం చేయాలి అని రమేష్ తన ఫ్యామిలీని కారులో పంపించాడు .



ఇక చివరగా మేము ముగ్గురం , రమేష్ , గోపి అన్న ఫ్యామిలీ మిగిలింది . పిల్లలు సోఫాలలోనే నిద్రపోవడంతో , 

రేయ్ మామా ......... చెల్లిని పైకి పిలుచుకునివెళ్లు , గోపి అన్నా మీరు కూడా అనిచెప్పాను . 

అన్నయ్యా , మహేష్ ......... పైకివెళ్లినా మాకు నిద్ర రాదు ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటాము అని మరొక్కమాటకూడా వినకుండా వెళ్లి సోఫాలలో కూర్చున్నారు . 

పనివాళ్ళతోపాటు మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించి క్యాటరింగ్ అమౌంట్ పే చేసేసి థాంక్స్ అన్నా............ టిఫిన్ లంచ్ డిన్నర్ చాలా బాగుంది అని కౌగిలించుకుని , మొత్తం పూర్తయ్యాక పిల్లలను నేను రమేష్ ఎత్తుకుని పైకివచ్చి రమేష్ ఇంట్లో పడుకోబెట్టి గుడ్ నైట్ చెప్పి నేను రమేష్ నా రూంలో పడుకున్నాము . 

చెల్లి అక్కయ్య ఫోటోను తమ బెడ్రూం టేబుల్ పై ఉంచి నాకు పుట్టబోయే బిడ్డ మీ అంత అందంగా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి నవ్వుకుని ఉమ్మా ......... అంటూ ముద్దుపెట్టి పడుకుని వాడి చేతులను వెనుక నుండి పొత్తికడుపుపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టి హాయిగా నిద్రపొయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 06:01 AM



Users browsing this thread: Kacha, 6 Guest(s)