Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అన్నయ్యా .......... మళ్లీ ఒంటరి అయిపోయాము . నాకు తెలిసి ఇక్కడ ఉండటం బాగుండదు అని చెల్లి చెప్పింది .

అవునురా మామా ......... నీ చెల్లి చెప్పినది కరెక్ట్ , ఇప్పుడు ఈ ఇల్లు అంకుల్ వాళ్ళది కాదు వేరే ఎక్కడికైనా వెళ్లిపోదాము .

అన్నయ్యా ......... డబ్బు లేదని తెలుసు అని తన నగలను తీసుకొచ్చింది .

చెల్లెమ్మా .......... అని కళ్ళల్లో నీళ్లతో ముగ్గురమూ హత్తుకుని , నా ప్రాణాలు ఉండగా అలా ఇప్పటికీ చెయ్యను అని ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టాను .

రేయ్ మామా .......... అయితే మా రింగ్స్ తాకట్టుపెడదామురా , డబ్బు ఉన్నప్పుడు విడిపించుకుందాము నువ్వేమీ మాట్లాడకు అని మా ఇద్దరి చేతులనూ పట్టుకుని గోల్డ్ ఫైనాన్స్ కు వెళ్లి రేయ్ కృష్ణ నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పాడు .

లవ్ యు రా అని రింగ్ తీసి ఇచ్చింది . వెళ్లి తాకట్టుపెట్టి నాచేతిలో డబ్బులు ఉంచాడు .



రేయ్ మామా .......... ఇంకేమీ ఆలోచించకు అని ఇద్దరూ చేతిని చుట్టేశారు .

వెంటనే గోపి అన్నకు కాల్ చేసి ఒక చిన్న ఇల్లు కావాలి , రెంట్ తక్కువగా ఉండాలి  అని అడిగాను . 

మహేష్ సాయంత్రం లోపు చక్కని ఇల్లు సెట్ చేస్తాను అని ఒకదగ్గరికి రమ్మని చెప్పాడు .

సిటీకి చాలా దూరంలో ఒక చిన్న ఇంటిని చూపించాడు . మహేష్ అర్జెంట్ అన్నారు లేకపోతే .......... కొన్నిరోజుల్లో మరొక కొత్త ఇంటిని చూద్దాము . సరుకులైతే నన్ను నమ్ముతారు కానీ ఇల్లులకు నన్ను నమ్మడం లేదు అని బాధతో చెప్పాడు .

గోపి అన్నా ......... మాకు సరిపోతుంది . రెంట్ కూడా కంఫర్ట్ లో ఉంది రేపు ఉదయమే షిఫ్ట్ అయిపోతాము అని ఓనర్ తో మాట్లాడి అడ్వాన్స్ , రెంట్ ఇచ్చేసి మిగిలిన కొద్దిడబ్బుతో ఇంటికి వెళుతోంటే ,

మహేష్ ........... షిఫ్టింగ్ సంగతి నాకు వదిలెయ్యి , 

అన్నా .......... మహేష్ మీ పరిస్థితి అర్థమౌతోంది , ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ......... అని చేతులు కలిపి మూదు ఇల్లుల తరువాత ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి , భార్యకు పిల్లలకు పరిచయం చేసి విషయం చెప్పాడు .



చాలా సంతోషం బాబు అని కాఫీ ఇచ్చారు .

మహేష్ ఉదయమే షిఫ్ట్ చేసేద్దాము అని హత్తుకున్నారు .

ఇంటికి చేరుకుని చెల్లీ చిన్న ఇల్లు అనిచెప్పాను .

అన్నయ్యా .......... మీతోపాటు పూరి గుడిసెలో ఉన్నాకూడా నాకు ఆనందమే , అమ్మావాళ్లకు తెలిసి బాధపడకుండా చూసుకోవాలి అని చెప్పింది .

లవ్ యు చెల్లీ .......... నిన్ను బాధపెడతామేమో ఆ క్షణం , మేము బ్రతి..........

అన్నయ్యా , రేయ్ ........ అంటూ మాఇద్దరి నోళ్ళను మూసి మాఇద్దరినీ హత్తుకుంది .



తరువాతి రోజు ఉదయం గోపి అన్న వెహికల్ తీసుకురాగానే , గోపి అన్నా పెద్ద వెహికల్ ...........

నా ఫ్రెండ్ ది మహేష్ ధీంట్లో అయితే ఒకేసారి షిఫ్ట్ చెయ్యొచ్చు అని అడిగి తీసుకొచ్చాను అని ఒక్కొక్కటే అన్నింటినీ మార్చేస్తున్నాము .

ఇంతలో కార్తీక మావయ్య గారు వచ్చారు . 

అంకుల్ ఎలా ఉన్నారు అని గౌరవించాము.

వెళ్లిపోతున్నారా , హమ్మయ్యా ........ మీకెలా చెప్పడం అని తెగ ఆలోచించాను . మీరే వెళ్లిపోతున్నారు మంచిది . మొత్తం కూల్చేసి అపార్ట్మెంట్స్ లేపాలని కాంట్రాక్టర్ తోపాటు వచ్చాను . బుల్లెట్ కూడా మా వియ్యంకుడి గారిదే అనివిన్నాను . 

అవును అంకుల్ అని కృష్ణగాడు పైకివెళ్లి కీస్ తీసుకొచ్చి అందించాడు .

మేము షిఫ్ట్ చేసేంతవరకూ అక్కడే ఉండి ఇంటికి , గేట్ కు లాక్ వేసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోయారు .



చెల్లెమ్మా ......... మన గౌరవాన్ని కాపాడావు తల్లీ అని ఇద్దరినీ వెహికల్లో కూర్చోబెట్టి వెనుక స్కూటీలో ఫాలో అయ్యాను .

అక్కడ గోపి అన్న వైఫ్ మరియు పిల్లలు కూడా మాకు సహాయం చేసారు .

అన్నయ్యా ........ ఇంతకంటేనా నాకు బాగా నచ్చింది , అంటీ కూడా క్లోజ్ అయిపోయారు . మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు అని సంతోషించింది .

ఇద్దరమూ గుండెల నుండి నవ్వలేకపోయాము . రేయ్ మామా సాయంత్రం లోపు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటానురా .......... కొన్ని రోజులు జాబ్ స్టడీస్ అడ్జస్ట్ చేసుకుంటానురా అని సాయంత్రం అడ్వాన్సుతో పాటు ఇంటికి సరుకులు తీసుకువచ్చాడు .



నెక్స్ట్ పదిరోజులు నిద్రలేకుండా , రోజుకు రెండు మూడు ఆఫీస్ లు తిరుగుతూనే ఉన్నాను . అయినా ఎక్కడికి వెళ్లినా మా ఆఫీస్ reputation పోతుంది నీలాంటి వాణ్ణి తీసుకుంటే అని నా టాలెంట్ టెస్ట్ కూడా చెయ్యకుండా నో అంటున్నారు .



సడెన్ గా ఒకరోజు కార్తీక మరియు బావగారు చెల్లి కాలేజ్ దగ్గరకువచ్చి , అక్కయ్యా ఉదయం రాగానే చూసాము ఇంటిదగ్గర లేరు . సిస్టర్ అంకుల్ కు చెప్పాము కదా మీరు అక్కడే ఉండొచ్చని , ఎక్కడికి వెళ్లారు అని అడిగారు .

వెంటనే కృష్ణగాడిని , నన్ను పిలిపించి చెల్లీ కార్తీక ఇప్పుడున్న ఇల్లు మరింత బాగుంది . మా ముగ్గురికీ అందుబాటులో ఉంటుందని షిఫ్ట్ అయ్యాము అంతే , మీరు బాధపడకండి మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని చెల్లెల్లు కౌగిలించుకున్నారు . 

 నన్ను చీఫ్ డాక్టర్ గా తిరుపతి హాస్పిటల్ కు మార్చేశారు బావ సాయంత్రం వెళ్లిపోతున్నాము .

కంగ్రాట్స్ బావగారు అని మధ్యాహ్నం అందరూ హోటల్లో లంచ్ చేసి , సాయంత్రం ఎయిర్పోర్ట్ కు వెళ్లి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాము .



వాళ్ళు వెళ్లిపోగానే కార్తీకకు అపద్దo చెప్పాను అన్నయ్యా ........ అని బాధపడింది . ఏమని ఓదార్చాలో తెలియక గుండెలపై వాల్చుకుని ఇంటికి చేరుకున్నాము .

సంవత్సరాల నుండి వెతికినా అక్కయ్య జాడ లేదు , ఇప్పుడు జాబ్ దొరకడం లేదు అని ఆరోజు నిద్రపోకుండా హైద్రాబాద్ బిజినెస్ పోర్టల్ ఓపెన్ చెసి స్క్రోల్ చేస్తూనే చేస్తూనే అక్కయ్యను తలుచుకుని కళ్ళుమూసుకున్నాను . 

బాధ ఎక్కువ అవుతోందే తప్ప తగ్గడం లేదు అని లాప్టాప్ షట్ డౌన్ చెయ్యబోతూ ఒక న్యూస్ చూసి ఆగిపోయి క్లిక్ కొట్టాను .



వేలకోట్ల నష్టాల్లో కూరుకుపోయిన టాప్ కంపెనీ అని హెడ్లైన్ ........ ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ , గ్రౌండ్స్ .......... నిర్మించి వెలుగు వెలిగిన construction కంపెనీ దివాళా స్థితికి చేరువలో ఉంది . కంపెనీ నిలబడాలంటే govt పేదల కోసం నిర్మించబోతున్న 3500 కోట్ల ప్రాజెక్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని ఇప్పుడు టాప్ 10 కంపెనీ లతో పోటీపడుతోంది . ఆ కంపెనీ ఆశలన్నింటినీ తన చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన భరద్వాజ్ మీదనే పెట్టుకోవడం గమనార్హం . 

 కంపెనీ సాలరీ లు తగ్గించేయ్యడంతో జాబ్ వదిలి వెళ్లిపోయిన వారి స్థానాలను భర్తీ చెయ్యడానికి  భరద్వాజ్ కు కొంతమంది అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ కావాలని యాడ్ ఉండటం చూసి వెంటనే అప్లై చేసి , ఎంత తక్కువ ఇచ్చినా పర్లేదు జాయిన్ అయిపోవాలి అని ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని నిద్రకూడా పోకుండా , అక్కయ్యా ......... నా అడుగు అక్కడ నుండేనా అని ఫోటోని గుండెలపై హత్తుకుని గోడకు ఆనుకుని అలాగే నిద్రపోయాను .



చెల్లి వచ్చి అన్నయ్యా , అన్నయ్యా ......... సరిగ్గా పడుకోవచ్చు కదా అనిచెప్పింది . 

చెల్లీ టైం .......... 5 గంటలు అన్నయ్యా ........., 

చెల్లెమ్మా అప్పుడే రెడీ అయిపోయావు , లవ్ యు చెల్లీ మంచి కిక్కిచ్చావు ముఖ్యమైన పని మీద వెళుతున్నాను . ఎదురు రావాలి అనిచెప్పాను .

నేను వచ్చేలోపు చెల్లి టిఫిన్ కూడా రెడీ చేసేసింది .

తినిపించి all the best అన్నయ్యా .......... అంటూ ఎదురువచ్చింది , కావాల్సిన వాటిని తీసుకుని అక్కయ్య వైపు లవ్ యు అనిచూసి సిటీ బస్ లో ఆఫీస్ చేరుకునేసరికి 10 గంటలు అయ్యింది .



నాలాంటి నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు . అందులో రమేష్ కూడా కినిపించాడు .

తన పరిస్థితి కూడా నాలానే అని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాము .

ఆఫీస్ చూస్తే చాలా పెద్దది . ఈ ప్రాజెక్ట్ కానీ రాలేదంటే ఆఫీస్ లోని మొత్తం స్టాఫ్ రోడ్డున , చైర్మన్స్ ఇద్దరికీ ఉరే గతి అని మాట్లాడుకుంటుంటే విన్నాము . 

అవును మహేష్ ఈ కంపెనీని మొత్తం బ్యాంకు ఆక్రమించేస్తుంది . మరుసటి క్షణం నుండి ఇక్కడ ఈ ఆఫీస్ ఉందని కూడా ఎవ్వరికీ తెలియదు . Govt ప్రాజెక్ట్ మొత్తం సంపాదించాను అని ఫైల్ చూపించాడు .

ఆఫీస్ లోని స్టాఫ్ మొత్తం హడావిడిగా తిరుగుతోంది . ఎక్కువ సమయం లేకపోవడం వలన ఇంటర్వ్యూ కూడా చెయ్యకుండా ఫస్ట్ వచ్చిన కొంతమందిని తీసేసుకుని అయిపోయింది వెళ్ళమని చెప్పారు .

అంతే ఆశతో వచ్చిన అందరూ నిరుత్సాహంతో వెళ్లిపోయారు . మా ఇద్దరమూ తెరుకోవడానికి కాస్త సమయమే పట్టింది .

అదిగో మహేష్ ఆయనే మేనేజర్ ...........

సర్ ఇంటర్వ్యూ అని పిలిచి ఇలా చెయ్యడం అని బాధతో ఆడిగాము .

Sorry బ్రదర్స్ ........... ఇప్పుడు కంపెనీ పరిస్థితులు వేరు అర్థం చేసుకొండి . మా జాబ్స్ కూడా గారంటీ లేదు ఈ ప్రాజెక్టు రాకపోతే అని మాకంటే ఎక్కువ బాధపడుతూ వెళ్లిపోయారు . 



అక్కయ్య చూపించిన దారి , ఇలా కానే కాకూడదు అని అక్కడే స్టెప్స్ సై కూర్చుని ఆలోచనలో పడ్డాను .

రమేష్ ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ అని అందుకుని చూసి , ప్లేస్ ఎక్కడో తెలుసా అని అడిగాను .

సిటీ ఔట్ స్కర్ట్స్ లో మహేష్ .......... నాకు చూపిస్తావా అని అడిగాను . 

పదా అంటూ బస్ లో రెండు గంటలపాటు ట్రాఫిక్ దాటుకుని చేరుకున్నాము . బస్ లో ఫైల్ మొత్తం స్టడీ చేసాను . వారంలో ప్రాజెక్ట్స్ ప్లాన్ మరియు అమౌంట్ కోట్ govt తెలపాలి.

అప్పటికే చాలా కంపెనీలు ప్రాజెక్ట్ సాధించడం కోసం govt కు ఎంత కోట్ చెయ్యాలో అంచనా వేయడం కోసం కొలతలు తీసుకుంటున్నారు . అందులో మాతో మాట్లాడిన మేనేజర్ కూడా తమ వర్కర్స్ తో అదేపనిలో ఉన్నారు .

రమేష్ ........... మొత్తం సైట్ కొలతలు కావాలి అని అంత ఎండలో ఇద్దరమే రెండేళ్లపాటు నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి ఆరోజు సాయంత్రం వరకూ మరియు నెక్స్ట్ రోజు కూడా ప్లేస్ లో కష్టపడ్డాము.

భరద్వాజ్ కోసం చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తామని ఆశ చూపిస్తున్నా , నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఈ కంపెనీ వల్లనే , ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వదిలి రాలేను అని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి .



రమేష్ ఈ 4 రోజులు మనకు ముఖ్యమైనవి , మనం ఇందులో లాభపడటానికి ఏమీలేదు . నా అంతరాత్మ మా అక్కయ్య దారిని చూపిస్తుంది అని నమ్మకంతో చేస్తున్నాను . నువ్వు నాతోపాటు ఉంటావా అని అడిగాను .

మహేష్ .......... ఇన్ని నెలలు జాబ్ లేకుండా ఉన్నాను . ఇష్టంతో ఏదో సాధిద్దామని ఇటువైపు అడుగులు వేసాను . కనీసం కొద్దిగైనా ఎటువంటి లాభం ఆశించకుండా మన ఎఫర్ట్ పెడదాము . పోతే ఆ రోజులతోపాటు మరొక వారం రోజులు అని చేతులు కలిపి ఇంటిపైకి చేరుకుని చిన్న డేరా కట్టుకుని ఛార్ట్స్ సెట్ చేసి ఛార్ట్స్ స్టార్టింగ్ లో VK రాసి అక్కయ్యను తలుచుకుంటూ నాలుగు రోజులపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా కిందకు దిగకుండా ఇద్దరమూ కలిసి ప్లాన్స్ గీస్తూ చివరికి ఒక ప్లాన్ రెడీ చేసి చెల్లి నుదుటిపై అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి, govt టెండర్ ఆఫీస్ కు సరైన సమయానికి చేరుకున్నాము .



ఒక్కొక్క కంపెనీ తమ మేనేజర్ మరియు ఆర్టిటెక్ట్ తోపాటు వెళ్లి ప్లాన్ మరియు టెండర్ బాక్స్ లో వేస్తున్నారు .

సిటీలో no 1 కంపెనీని టెండర్ వేయడానికి పిలిచారు . అంతే ఆ కంపెనీ చైర్మన్ , మేనేజర్ సైగ చేయగానే భరద్వాజ్ లేచి వాళ్లదగ్గరకు వెళ్ళిపోయాడు . 

భరద్వాజ్ ......... అంటూ మాతో మాట్లాడిన మేనేజర్ తన చేతిలోని ఛార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఖాళీ , చుట్టూ ఉన్నవాళ్ళంతా నవ్వుకున్నారు .

మేనేజర్ .......... they offerred 25 crores ఎవరైనా రిజెక్ట్ చేయగలరా ........., నామీద ఆధారపడిన మీరు నాకు సాలరీ ఇస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ మీకు వస్తే ok రాకపోతే నా పీరైస్థితి కూడా మీలానే , మీరు ఎంతకు టెండర్ వెయ్యబోతున్నారో కూడా చెప్పేసాను దానికి ఒక్కరూపాయి తక్కువ మేము వేస్తున్నాము అని పొగరుతో నవ్వుతూ చెప్పి వాళ్ళతోపాటు వెళ్లి టెండర్ వెయ్యబోయారు .



అది చూసి దివాళా తియ్యబోతున్న చైర్మన్లలో ఒకరికి హార్ట్ అటాక్ రావడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లిపోయారు .

భరద్వాజ్ ......... ఎంతో మంది వీధిన పడతారు నీ నిర్ణయం వలన మరొక్కసారి ఆలోచించు అని మేనేజర్ గారు ప్రాధేయపడుతోంటే , 

నన్ను కూడా ఇలా అడుక్కోమంటారు , అయినా ఇప్పుడు నా మేనేజర్ మీరు కాదు అని గర్వంతో తోసేసి టెండర్ వేశారు .

మరొక చైర్మన్ కళ్ళల్లో కన్నీళ్ళతో తలదించుకుని వెళ్లిపోయారు . 

సర్ సర్ ......... ఏదో ఒక మార్గం ఉంటుంది మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఒకసారి మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పారు .

మేనేజర్ .......... అని ఏదో చెప్పబోయి ఆగి కారులో వెళ్లిపోయారు .



అయిపోయింది ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్న ఇద్దరిలో ఒకరికి హార్ట్ అటాక్, మరొకరు ఆవేశంతో బాధలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అని ఎండలో స్టెప్స్ పై కూలబడి పైకి దేవుడివైపు చూస్తున్నారు .

లోపల ఆ కంపెనీ వారిని పిలుస్తోంటే , ఇంకెక్కడ వస్తారు అని అందరూ నవ్వుకుంటున్నారు .

మేనేజర్ గారు ఏమీ చేయలేకపోయారు , దేవుడా వాళ్లకు ఏమీకాకుండా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటే , 



ఇద్దరమూ వెళ్లి మేనేజర్ గారు రెండు నిమిషాలు మేము చెప్పేది వినండి అని లేపి చెట్టుకిందకు తీసుకువెళ్లాము . లోపల మాత్రం పిలుస్తూనే ఉన్నారు . ఇక కేవలం 15 నిమిషాలు మాత్రమే టెండర్ల ప్రక్రియ అన్నట్లు అలారం కూడా మ్రోగింది .

మేనేజర్ గారు ఇప్పుడు పరిచయాలు కూడా అనవసరం .......... మిమ్మల్ని బాధపెట్టాలని కాదు . మీకు ఇప్పుడు వేరే సొల్యూషన్ లేదు కాబట్టి మీరు మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము ఒక ప్లాన్ రెడీ చెసాము ఎలా అన్నది చెప్పే సమయం కూడా లేదు . మీరు ఎంతకు అమౌంట్ వెయ్యబోతున్నారో వాళ్ళు ఒక్క రూపాయి తగ్గించారు . ఇప్పుడు మనకు వాళ్ళు ఎంతకు వెయ్యబోతున్నారో తెలుసు కాబట్టి ...........

మనం ఒకే ఒక్క రూపాయి తగ్గించి వెయ్యొచ్చు అని మేనేజర్ గారు ఆలోచనలో పడ్డారు .

మా వైపు చూస్తుంటే చివరి 5 నిమిషాలు మాత్రమే అని గంటలు కూడా మ్రోగిస్తున్నారు . ప్లాన్ చూసే సమయం కూడా లేకపోవడంతో , ఆ దేవుడిపై భారం వేసి వెళ్లిపోతున్నాను అని అసిస్టెంట్ ను పిలిచి లాప్టాప్ లో అమౌంట్ కోట్ మార్పించేసి govt ఆఫీస్ లొనే ప్రింటౌట్ తీయించి , మనకు వస్తుందో రాదో తరువాత పరువు నిలబెట్టారు బ్రదర్స్ అంటూ కాస్త సంతోషంతో మా ఇద్దరినీ కౌగిలించుకుని పరుగున లోపలికి వెళ్లి కొన్ని క్షణాల ముందు టెండర్ వేసి అందరి నోళ్ళూ మూయించారు .

రమేష్ మన పని అయిపోయింది వెళదాము పదా అని మాటల్లో చెప్పలేని ఆనందంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... అని గుండెలపై చేతినివేసుకున్నాను .

మహేష్ టెండర్ ......... కనీసం మన పేర్లు కూడా వాళ్లకు తెలియవు , ఒకవేళ మనదే ......... అని చిన్నగా గుసగుసలాడి , అనౌన్స్మెంట్ వరకూ ఉందాము అని చెప్పాడు.

రమేష్ మనం ఇక్కడిదాకే వచ్చాము ......... మన కష్టం మనం పడ్డాము , ఇక అంతా మా ఊరి అమ్మవారు చూసుకుంటారు అని సంతోషంతో భుజం చుట్టూ చేతినివేశాను.

నువ్వు ఎలా చెబితే అలా మహేష్ అని ఉత్సాహంతో బస్ లో ఇంటికి బయలుదేరాము .



మేనేజర్ బయటకువచ్చిచూసి ఎక్కడా కనిపించకపోవడంతో లోపలకు వెళ్లి టెండర్ అనౌన్స్మెంట్ సమయం కోసం ఎదురుచూస్తూ , దేవుడా మా చైర్మన్లకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకో అని ప్రార్థిస్తున్నాడు .

సుమారు 4 గంటల తరువాత GHMC చైర్మన్ గారు బయటకువచ్చి టెండర్ ******* construction కంపెనీకు కేటాయించినట్లు అనౌన్సమెంట్ చేసి వారిని లోపలికి రావాల్సిందిగా కోరారు .

అంతే మేనేజర్ గారు కొన్ని క్షణాలపాటు షాక్ లోకి వెళ్లిపోయారు . 

టాప్ 10 కంపెనీలు మరింత షాక్ లో తలదించుకుని వెళ్లిపోయారు .

సర్ ముందు చైర్మన్ గారికి అని అసిస్టెంట్ గుర్తుచేయ్యగానే ఇద్దరూ ఒక్కొక్కరికి కాల్ చేశారు . 

హాస్పిటల్లో ఉన్న చైర్మన్ వైఫ్ ఎత్తి విషయం తెలుసుకుని రెస్ట్ తీసుకుంటున్న వారికి తెలియజేసారు . 

డాక్టర్ i am fine నేను వెళ్ళాలి వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి అనిచెప్పారు.

మరొక చైర్మన్ మొబైల్  రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో , అసిస్టెంట్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళమని , ఇంటి ల్యాండ్ లైన్ కు కాల్ చేశారు .

పనివాళ్ళు ఎత్తడంతో భయంతో తడబడుతూ వెంటనే సర్ దగ్గరకువెల్లు ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చిందని చెప్పు తొందరగా వెళ్ళు మీ సర్ అపాయంలో ఉన్నారు అని చెప్పడంతో , చైర్మన్ గారి రూమ్ వైపు పరిగెత్తి తలుపు కొట్టినా తెర్వకపోవడంతో , వెంటనే తలుపు బద్దలు కొట్టి బెడ్ పై నురగతో కదలకుండా పడి ఉన్న చైర్మన్ ను ఎత్తుకుని కిందకు రావడం చూసి ఆయన వైఫ్ కంగారుతో కారు వెనక్కు తీసుకురావడంతో దగ్గరలోని హాస్పిటల్ కు పిలుచుకునివెళ్లారు ........... to be continued..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:27 AM



Users browsing this thread: 26 Guest(s)