Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బయట లైట్స్ వేసి ఛార్ట్స్ , పెన్సిల్ , స్కెచెస్ మరియు స్టాండింగ్ స్టాండ్ తీసుకుని బయటకువచ్చి అన్నీ arrange చేసి అక్కయ్య ఫోటో ప్రక్కనే పెట్టుకుని ఉమ్మా ........ లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని ముద్దుపెట్టాను . చెల్లీ వాడు వెనుకే ఉన్నట్లు నవ్వుకుని నేనుకూడా లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి అక్కడే చదువుకుంటున్నారు .

 టెంపుల్ మొత్తం డ్రా చేసి నాకు అర్థమైనవన్నీ గుర్తిస్తూ 100 ఇయర్స్ ముందే టెక్నాలజీ లేకున్నా అద్భుతమైన సృష్టికి , కళలకు మైమరచి ఆ ఇంజినీర్లకు హ్యాట్సాఫ్ చేసి పర్ఫెక్ట్ అని మొబైల్లో పిక్ తీసి ఇదేవిషయాన్ని సర్ కు మెయిల్ చేసి , లాప్టాప్ అందుకొని గోల్కొండ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అందరమూ ఒకేసారి నిద్రపోయాము .



తరువాతి రోజు 9 గంటలవరకూ అక్కయ్యను గాలించి ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి ముగ్గురమూ బయలుదేరి కాలేజ్ దగ్గర వదిలేసి , మొబైల్లో gps ద్వారా గోల్కొండ వైపు పోనిచ్చాను . దారిలో నాకు ఇంటరెస్ట్ అనిపించిన మాల్స్ , హోటల్స్ , అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ ను మొబైల్లో ఫోటోలు తీస్తూ గోల్కొండ చేరుకున్నాను . నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకున్నాను . 

All the best ........... మహేష్ అని టెంపరరీ ID కార్డ్ ఇచ్చారు . అంతలో రమేష్ వచ్చి sorry మహేష్ నిన్న రావడం కుదరలేదు 5 మినిట్స్ అని లోపలకువెళ్లి Id కార్డ్ తోపాటు రావడంతో ఇద్దరమూ ఫస్ట్ టాప్ చేరుకుని పెద్ద గోడపై నిలబడి చుట్టూ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి , రమేష్ అప్పటి ఆర్కిటెక్ట్ ఇప్పుడు చేయలేకపోతున్నారు అని సాయంత్రం వరకూ ఒక చివర నుండి ముందుకువెళుతూ గొప్పతనాన్ని , అక్కడక్కడా కొన్ని తప్పులనూ గుర్తించాము . 

క్లోజింగ్ సమయానికి బయటకువచ్చి ok రమేష్ రేపు కలుద్దాము అని ఇంటికి చేరుకున్నాను . 



అన్నయ్యా .......  టైర్డ్ అయినట్లున్నారు ఫ్రెష్ అయ్యిరండి మ్యాగీ చేసిస్తాను అని వచ్చేటప్పటికి కాఫీ మ్యాగీ చేతిలో పట్టుకుని రెడీగా ఉంది . నేను వచ్చేన్తవరకూ కూడా ఆగకుండా నోట్లో ఇంత తురుక్కుని tasty రా మామా ........ , డార్లింగ్ మీ అన్నయ్యకు తిని......పించు అని చెప్పాడు . 

ఇద్దరమూ నవ్వుకుని తిని , నిన్నలానే పూర్తయినంతవరకూ చార్ట్ ప్రిపేర్ చేసాను . 

కార్తీక ఉత్సాహంతో పైకివచ్చి అక్కయ్యా .......... అమ్మా నాన్న రేపు ఉదయమే 5 గంటలకు బెంగళూరు వెళుతున్నారు పెళ్లికి ఉదయమే వాళ్ళను ఎయిర్పోర్ట్ లో వదిలేసి మనం ఫోర్ట్ కు కారులో వెళ్లొచ్చు అని సంతోషంతో చెప్పింది . 



ఉదయం 5 గంటలకు అంకుల్ పిలువగానే నాతోపాటు వస్తున్న కృష్ణగాన్ని ఆపి చెల్లెళ్ళకు తోడుగా ఎవరుంటారురా మూసుకుని ఇక్కడే ఉండు కావాలంటే మరికొద్దిసేపు దున్నపోతులా నిద్రపో అనిచెప్పి ఒక్కడినే వెళ్లి ఎయిర్పోర్ట్ లో వదిలేసివచ్చాను . వచ్చేలోపు అక్కయ్యను వెతకడానికి వెళ్లారని తెలిసి ఫ్రెష్ అయ్యాను . 10 గంటలకు నలుగురమూ కారులో వెనుక చెల్లిని అక్కడా ఇక్కడా తాకుతూ గిల్లుతూ ఎంజాయ్ చేస్తుంటే కార్తీకతోపాటు నవ్వుకుని ష్ ష్ ...... అంటూ మిర్రర్ వెనక్కు తిప్పేసాను .

రేయ్ ఘాడమైన ముద్దుఇస్తాను సైలెంట్ గా కూర్చో అని ముద్దుపెట్టి , లవ్ యు రా అంటూ వాడి గుండెలపై వాలిపోయింది .

ముద్దు అదిరిపోయింది కృష్ణ అని రెండు చేతులతో గట్టిగా చుట్టేసి డ్రైవర్ కాస్త AC పెంచవయ్యా .......... వొళ్ళంతా ఏదో అయిపోతోంది అని ఆర్డర్ వేసాడు .

సరే సర్ ..........

మా అన్నయ్యనే డ్రైవర్ అంటావా అని వాడి బుగ్గపై కొరికేసింది . 

లవ్ యు లవ్ యు డార్లింగ్ , అంటాను మళ్లీ అంటాను మళ్లీ కొరికేయ్యి i loved it అని ఏకమయ్యేలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించి పరవశించిపోతున్నాడు .



పార్కింగ్ లో నాకోసమే ఎదురుచూస్తున్న రమేష్ ను చేరుకుని hi hi అంటూ అందరినీ పరిచయం చేశాను .

Id కార్డ్స్ చూపించి అందరమూ నేరుగా లోపలికి వెళ్లిపోయాము . చెల్లెమ్మా ......... ఎక్కడికైనా వెళ్లే పర్మిషన్ మనదగ్గర ఉంది అని నా id కార్డ్ కృష్ణగాడికి అందించి ముగ్గురూ వెళ్లి ఫోర్ట్ మొత్తం చుట్టేయ్యండి మేము పనిచూసుకునివస్తాము అని చెరొకవైపు వెళ్లి మధ్యాహ్నం లోపు పూర్తిచేసి చెల్లివాళ్ళతో జాయిన్ అయ్యి లంచ్ చేసి సాయంత్రం వరకూ ఫోటోలు సెల్ఫీలతో పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేసి పూర్తిగా అలసిపోయినట్లు , అందరమూ ఫేమస్ హోటల్లో బిరియానీ తిని , రమేష్ కు మళ్లీ మరొకచోట కలుద్దాము అనిచెప్పి 9 గంటలకు ఇంటికిచేరుకున్నాము .

కాసేపు రెస్ట్ తీసుకుని గోల్కొండ ఫోర్ట్ మా రివ్యూ ని , సలహాలను సర్ కి పంపించి , అక్కయ్యా ........ ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎలాగైతే నన్ను గుంటూరు మొత్తం చూపించడానికి వెళ్ళాము కదా అలా అని అక్కయ్య ఆల్బమ్ తిరగేస్తూ అలసిపోయి నిద్రపోయాను .



తెల్లవారకముందే లేచి టైం కోసం మొబైల్ చూస్తే సర్ నుండి మెయిల్ .........వెల్డన్ మహేష్ , keep it up , నన్ను కూడా ఆలోచనలో పడేసింది నీ టోటల్ రివ్యూ , ఇలాగే ఇష్టంతో ముందుకువెల్లు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాను అని రిప్లై చదివి అప్పుడే స్నానం చేసివచ్చిన చెల్లికి చూపించాను . 

మా అన్నయ్య గురించి మాకు ఎప్పుడో తెలుసు అని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది .

గుడ్ మార్నింగ్ చెల్లీ అని వాడు ఫ్రెష్ అవ్వగానే బాత్రూమ్లోకి దూరిపోయాను . 



ఇక ఆరోజు నుండి ఉదయం హిస్టారికల్ , లేటెస్ట్ బిల్డింగ్స్ కు వెళ్లి రోజురోజుకూ కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటూ , నెట్ నుండి గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకుంటూ రోజులు వేగంగా గడిచిపోయాయి .

చెల్లి ఫస్ట్ ఇయర్ exams అవ్వడం యూనివర్సిటీ టాప్ రావడం , ముందు వెళ్లి అక్కయ్యకు చెబుతోంటే విని సంతోషం పట్టలేక చెల్లిని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పేసాము . 

అంటీ same డైలాగ్ తో నా తల్లి గిరించి నాకు తెలుసు అందుకే ఉదయమే స్వీట్స్ చేసేసాను అని తినిపించడంతో అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .



కొన్నిరోజులకు ఒకేసారి పది వేల , 15 వేలు , 20 వేలు .........5 వేలు , 10 వేలు ...... ఇలా నా అకౌంట్లోకి 10 నిమిషాలపాటు అమౌంట్స్ పెడుతూనే ఉన్నాయి చెక్ చేస్తే ఊరిజనమందరూ పంపిస్తున్నారు . పెద్దయ్యకు కాల్ చేసేంతలో పెద్దయ్యే కాల్ చేసి మహేష్ ......... వరుస మూడు పంటలతో బ్యాంక్ రుణాలను మొత్తం తీర్చేసాను . ఇక మిగిలిన లాభం మొత్తం మీ అవసరాలకోసం పంపించాము సంతోషంతో అనిచెప్పారు.

పెద్దయ్యా ......... చాలా సంతోషం . కానీ అవసరమైనప్పుడు నేనే అడుగుతాను కదా అప్పటివరకూ లాభాలను జాగ్రత్తగా సేవ్ చేసుకోండి , మీకు మళ్లీ ముందులాంటి పరిస్థితులు రాకూడదు అని ఎవరి అమౌంట్ వారికి పంపించేసాను . 

అలా పంట చేతికొచ్చిన ప్రతిసారీ మొత్తం లాభాన్ని మాకు పంపించడం , నేను వెంటనే వెనక్కు పంపించడం మాకు అలవాటైపోయింది . 



చెల్లి స్టీడీస్ లో మరింత బిజీ అవ్వడం , కృష్ణగాడు IPS కోసం సామాజిక పరిస్థితులను అధ్యయనం చెయ్యడం , నేను ప్రతి బిల్డింగ్ రివ్యూ సర్ కు పంపిస్తూ రోజూ ఏదో ఒక కొత్తదనాన్ని తెలుసుకోవడంతో బిజీ బిజీ అయిపోయాము . నా ఊహాలతో కొత్తవాటిని ఆవిష్కరిస్తూ సర్ మన్ననలు పొందుతూ , కలవమని చెప్పడంతో అప్పుడప్పుడూ కలుస్తూ డిస్కస్ చేసేవాళ్ళము . రెండవ సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వడం ....... చెల్లి ఆ సంవత్సరం కూడా టాప్ వచ్చింది . చివరి ప్రాజెక్ట్ పూర్తిచేయ్యడంతో నా కోర్స్ పూర్తయ్యి సర్టిఫికెట్ చేతికి రావడం , సర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని జాబ్స్ వేటలో పడ్డాను . మాదగ్గర ఉన్న డబ్బంతా అయిపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యినా ముందుకు నడిచాము . తప్పని పరిస్థితుల్లో అంకుల్ కు కాల్ చేసి కాస్త అమౌంట్ తీసుకున్నాను . 

మహేష్ ఎంత అవసరం అయినా మోహమాటపడకుండా అడగమని లక్ష రూపాయలు పంపించారు . 

మరుక్షణమే అంకుల్ పైకివచ్చి మహేష్ నా ఇజ్జత్ మొత్తం పోయింది వాడు కాల్ చేసి మహేష్ కు డబ్బు అవసరం నువ్వేమి చేస్తున్నావురా అని బండ బూతులు తిట్టాడు.

ఇంకొక్కసారి ఇలా జరిగితే బాగుండదు చెబుతున్నాను . ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో , మీరు సెటిల్ అయ్యాక వడ్డీతోపాటు ఇవ్వొచ్చులే అని నవ్వుతూ చెప్పారు .

అంకుల్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇప్పించుకుంటాము అనిచెప్పాము .



మహేష్ మరొకవిషయం మీ చెల్లికి డాక్టర్ సంబంధం వచ్చింది వారంలో చూసుకోవడానికి వస్తున్నారు అంతా మీరే చూసుకోవాలని , ఈ పెళ్లి చేసేసి మా సొంత village కు వెళ్ళిపోయి నువ్వు చెప్పినట్లుగా ప్రశాంతంగా జీవించేస్తాము అని చెప్పారు .

అంతే ఆనందం పట్టలేక ముగ్గురమూ కిందకు పరిగెత్తి కాబోయే పెళ్లికూతురు ఎక్కడ అని అంటీ గుండెలపై సిగ్గుపడుతున్న కార్తీకను ఆటపట్టించాము .



పైకివచ్చి లాప్టాప్ అందుకొని అన్ని జాబ్స్ వెబ్సైట్ లలో నా resume ఉంచి కాల్స్ కోసం ఎదురుచూస్తున్నాను . నేరుగా ఆఫీస్ లకు కార్తీక పెళ్లిచూపులు తరువాత వెళ్లాలని నిర్ణయించుకున్నాను .

నెక్స్ట్ రోజు నుండే బెంగళూరు , ముంబై కంపెనీల నుండి కాల్స్ వచ్చాయి , హైద్రాబాద్ లో ఉండి వెతుకుతుంటేనే అక్కయ్య జాడ కనిపించడం లేదు ఇక సిటీ వదిలితే శాశ్వతంగా దూరమైపోతాను అని ఇగ్నోర్ చేసాను . 



కార్తీక పెళ్లిచూపుల ముందురోజు ఇల్లు కాంపౌండ్ అందంగా కనిపించాలని ముగ్గురమూ శుభ్రం చెయ్యడం చూసి అంటీ అంకుల్ ఆనందంతో పొంగిపోయి చేతులు కలిపారు .

అంకుల్ , మేమిద్దరమూ వాళ్లకోసం బయటే నిలబడి ఎదురుచూస్తూ వచ్చాక పెళ్ళికొడుకుని చూసి , కార్తీక you are lucky అని మనసులో అనుకుని సాదరంగా ఆహ్వానించాము . 

అంకుల్ మాఇద్దరినీ కొడుకులుగా పరిచయం చేసారు . 

బావగారు డాక్టర్ అనితెలిసి మరింత ఆనందించాము . అంకుల్ అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లి సంప్రదాయాల ప్రకారం ఆథిత్యాన్ని అందించారు .



పెళ్ళికొడుకు హీరోలా ఉన్నాడని లోపల రెడీచేస్తున్న చెల్లికి మెసేజ్ పంపాను .

కార్తీక ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇక్కడ ఆతృతతో ఎదురుచూస్తోంది అని మెసేజ్ వచ్చేన్తలో , అమ్మాయిని పిలిపించండి అని చెప్పడంతో ,

చెల్లీ , అంటీ పిలుచుకొనివచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టి , లోపలకువెళ్లి టీ తీసుకొచ్చి కార్తీక పెళ్ళికొడుకు వారి బంధువులకు అందించింది . కాసేపు మాటలా తరువాత పెళ్ళికొడుకు మాట్లాడాలి అనిచెప్పడంతో బయట పూల మొక్కల దగ్గరికి వెళ్ళమని అంకుల్ చెప్పారు .



కొన్ని నిమిషాలు మాట్లాడిన తరువాత , పెళ్ళికొడుకు మాత్రమే లోపలికివచ్చి బావలూ , సిస్టర్ అని మాముగ్గురినీ పిలిచారు .

ఆ పిలుపుకు సంతోషించి బయటకువెళ్లాము .

కార్తీక మా ముగ్గురినీ తన ప్రాణం అని పరిచయం చేసింది . బావగారు మీరు బావ అని పిలువగానే ఇక్కడ తాకింది అని సంతోషంతో మాటల్లో పడిపోయి చిరునవ్వులు చిందిస్తూనే , కార్తీక నువ్వు నాకు నచ్చావు I love you అని చెప్పేసారు .

చెల్లిపెదాలపై తియ్యని సిగ్గుతో చెల్లి గుండెలపై వాలిపోయింది .

కార్తీక మరి నీకు అని అడిగింది చెల్లి .........

చెల్లివైపు , మాఇద్దరివైపు చూసి మా ఆనందాన్ని చూసి నాక్కూడా అని చిన్నగా చెప్పి సిగ్గుపడుతోంది .

అంతే కృష్ణగాడు నన్ను చుట్టేసి బావగారు థాంక్స్ అని పైకివెళ్లి 1000 వాలా తీసుకొచ్చి బయట పరిచి అంటించేశాడు .

ఆ సౌండ్ కు అందరూ బయటకు రావడంతో , అంకుల్ ఇద్దరికీ ఒకరికొకరు నచ్చేశారు అని సంతోషంతో చెప్పాము .

నా తల్లే అని అంటీ వచ్చి కార్తీక నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .



ఇక లోపల అంకుల్ కట్న కానుకలు మాట్లాడటానికి మాఇద్దరినీ కూడా పిలిచి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .

మాకున్నదంతా మా చిట్టి తల్లికే ............

ఈ ఇల్లు కూడానా అని అడిగారు . 

మీరు కోరితే ఇదికూడా మా అల్లుడి పేరుమీద రాసిచ్చేస్తాను అని చెప్పగానే , 

మీతో సంబంధం మాకిష్టమే త్వరలోనే వచ్చి ఇల్లు చూసుకోండి ముహూర్తాలు పెట్టుకుందాము అని సంతోషంతో వెళ్లిపోయారు .

అంకుల్ .......... బావగారు డాక్టర్ well సెటిల్డ్ అని సంతోషంతో అందరికీ నచ్చేసాడు వెంటనే చకచకా పూర్తిచేసేయ్యండి లేకపోతే కార్తీక ఇలా సిగ్గుపడుతూనే ఉంటుంది అని ఆటపట్టించాము .



నెక్స్ట్ రోజు క్లాసిఫైడ్స్ చూసి ఫైల్ రెడీ చేసుకుని చెల్లి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అక్కయ్యను తలుచుకుని జాబ్ వేటకై బయలుదేరాను . నాకంటే ముందే చాలామంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు .

నన్ను పిలువగానే ఉత్సాహంతో లోపలికివెళ్ళాను . నా టాలెంట్ టెస్ట్ చెయ్యకముందే సర్టిఫికెట్స్ అడిగారు . సర్ ఒకసారి నా ప్లాన్స్ చూడమని ............

నెక్స్ట్ చూస్తాము అని సర్టిఫికెట్స్ ఫైల్ అందుకొని చూసి ఇంటర్ వరకూ జైల్లో చదివినట్లు అడిగి ముందూ వెనుకా ఆలోచించకుండా sorry you may go అని బయటకు చూపించారు . 

సర్ .......... ఒకసారి .........

జస్ట్ లీవ్ 9 ఇయర్స్ జైల్లో ఉన్నావంటే నీ కండక్ట్ ఎలాంటిదో మాకు అర్థమైపోయింది అని చెప్పడంతో , ఏమీమాట్లాడలేక బయటకు వచ్చేసాను .



అలా ఏ ఆఫీస్ కు వెళ్లినా ఆ ఒక్కటి ఎత్తిచూపిస్తూ బయటకు పంపించేస్తున్నారు . దాని గురించి నేను బాధపడను కాబట్టి మళ్లీ మళ్లీ try చేస్తూనే వెళ్ళాను .

ఒకరోజు బావగారి ఇంటిని చూడటానికి వెళ్ళాము . అంకుల్ వాళ్ళకంటే డబల్ ఉంది.

బయటనే మాకు నచ్చేసింది . అంకుల్ లానే ఆతిధ్యం ఇవ్వడంతో మంచివారేనని పంతులుగారిని పిలిపించి నిశ్చితార్థం మరియు పెళ్లిని ఫిక్స్ చేసి ఫారిన్ లో ఉన్న కార్తీక అక్కయ్యలు వాళ్ళ బంధువులను రమ్మని ఆహ్వానించారు . రాగానే కార్తీక అంటీ మమ్మల్ని అలా ఇలా అంత ఇంత అని పరిచయం చేసారు . నిశ్చితార్థానికి సునీతమ్మ అంకుల్ కూడా వచ్చారు . ఇంటిలోనే నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించి రెండువారాల్లో మంచి ముహూర్తం ఉంది ఏళ్లకోకసారి వచ్చే ముహూర్తం అని చెప్పడంతో సమయం సరిపోకున్నా రెండువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు .



అన్ని ఊర్లకూ కార్డ్స్ ఇవ్వడం కుదరదు కాబట్టి కాల్స్ , మెయిల్స్ ద్వారా పెళ్లికి ఆహ్వానించారు , మహేష్ మీరు కళ్యాణమండపం సంగతి పెళ్లికి అవసరమైనవన్నింటినీ చూసుకోండి అనిచెప్పారు . 

అలా ఆర్డర్ వెయ్యండి అంకుల్ మీరు ఏమీ టెన్షన్ పడకండి బావగారు సూపర్ కార్తీక హాయిగా ఉంటుంది అని ఒక్కొక్కటే అన్నింటినీ బుక్ చేసేసాము .

బంధువుల కోసం హోటల్స్ బుక్ చేసేసాము , ముత్తైదువులతో ఇల్లుమొత్తం కళకళలాడిపోతోంది . 

పెళ్లిరోజు రానే వచ్చింది . హడావిడిగా ఇత్సాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కళ్యాణం అంగరంగవైభవంతో జరిగింది .

అప్పగింతలప్పుడు కార్తీక కన్నీళ్లు చూసినా ........ అంకుల్ కళ్ళల్లో ఒకవిధంగా సంతోషం . 

బావగారు ప్రాణంలా చూసుకుంటారు కార్తీక అని ముగ్గురమూ ప్రాణంలా హత్తుకొని కారులో కూర్చోబెట్టి , బావగారు .......... 

మహేష్ , కృష్ణ .......... మీ చెల్లి వెంట కన్నీరు రాకుండా చూసుకుంటాను . రేపు ఉదయమే హనీమూన్ కు పారిస్ వెళుతున్నాము . అత్తామావయ్యలను ఎయిర్పోర్ట్ కు తీసుకురమ్మని చెప్పడంతో ,

లవ్ యు బావగారు అని సంతోషంతో ఇద్దరమూ చెరొకవైపు హత్తుకొని చెల్లి ప్రక్కనే కూర్చోబెట్టి , చెల్లీ ఎంజాయ్ the హనీమూన్ అని చెప్పాము.

పో అన్నయ్యా ........ అని బావగారి గుండెల్లో తలదాచుకుంది .



కారు వెళ్ళిపోయాక అంటీ కన్నీళ్ళతో బాధపడుతుంటే చెల్లీ , కార్తీక అక్కయ్యలు ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు .

ఉదయం బావగారు కొరినట్లుగానే అంకుల్ అంటీని కార్తీక అక్కయ్యలను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాను .

అక్కడ సంతోషాల తరువాత వెళ్లిపోయారు .

ఆరోజు సాయంత్రమే dad మీ అల్లుళ్లకు ఫుల్ వర్క్ వెళ్ళాలి అని వెళ్లిపోయారు .

పెళ్లి హడావిడి అయిపోవడంతో అంకుల్ ప్రశాంతంగా కాంపౌండ్ లోని చెట్టు కింద కూర్చుని మమ్మల్ని పిలిచి మహేష్ .......... వారంలో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మేముకూడా గుంటూరు వెళ్లిపోతాము అని చెప్పారు .

మీ పిల్లల కోసం అలుపు లేకుండా కష్టపడ్డారు ఇక హాయిగా ఉండండి అంకుల్ all the best ఫర్ న్యూ ఇన్నింగ్స్ ........... అనిచెప్పాము .



మేము వెళ్లిపోయినా అల్లుడు గారు మీరు ఇక్కడే ఉండవచ్చు అనిచెప్పారు ఏమీ పర్లేదు డబ్బు అవసరం అయితే ఒక్క కాల్ చెయ్యండి అని వారంలో మొత్తం పూర్తిచేసుకుని ఉద్వేగాల నడుమ వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:27 AM



Users browsing this thread: Kacha, 2 Guest(s)