Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఉదయం సాయంత్రం అక్కయ్యను సిటీ నలుమూలలా గాలిస్తూ , పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ , చెల్లి రోజురోజుకీ తన ప్రిపరేషన్ పెంచుకుంటూ పోతూ , 24/7 అక్కయ్య గురించే ఆలోచనలతో రాత్రిళ్ళు అక్కయ్యతో రొమాంటిక్ ఊహాలతో రోజులు వేగంగా గడిచిపోయాయి . చెల్లి మెడికల్ ఎంట్రన్స్ exam date రానే వచ్చింది . 

ఆరోజు ముగ్గురమూ రోజూలానే తెల్లవారకముందే లేచి తలస్నానం చేసి గుడికివెళ్లి అమ్మా చెల్లి బాగా ప్రిపేర్ అయ్యింది . ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి అని చెల్లిని ఒకదగ్గర కూర్చోబెట్టి ఇద్దరమూ మాత్రమే గుడిచుట్టూ ప్రదక్షణలు చేసాము.



అన్నయ్యా ........... ఆ అమ్మవారికి కాకా పట్టాల్సిన అవసరం లేదు . మీ చెల్లి గురించి నీకు తెలియదా అని నవ్వుతోంది .

దాని గురించి కాదు చెల్లెమ్మా ......... ఇంటి నుండి బయలుదేరి exam పూర్తయ్యి వచ్చేవరకూ ఎటువంటి అడ్డు కలగకూడదని అని రెండు నిమిషాలు చెల్లిప్రక్కనే కూర్చుని సంతోషంతో నవ్వేలా నవ్వించాము .

ఇంటికి చేరుకోగానే అంటీ ,చెల్లికోసం exam ముందు ఏమేమి తినాలో అన్నింటినీ రెడీ చేసి ఉంచింది . 

అన్నయ్యా , రేయ్ ............ ఈరోజు మాత్రం మీరిద్దరూ కలిసి నాకు తినిపించండి అని కోరడంతో , నవ్వుకుని ఇద్దరమూ తినిపించాము . రోజూ అలవాటుపడింది కాబట్టి చెల్లికూడా మా నోటికి అందించి అయ్యో ......... అని సిగ్గుపడుతూనే తినిపించి తినింది .

పైకివెళ్లి హాల్ టికెట్ తోపాటు కావాల్సినవన్నీ తీసుకుని , అక్కయ్య ఫోటో ముందుకువెళ్లి గుండెలపై చేతులువేసుకుని , అక్కయ్యా ....... నేనెవరో మీకు తెలియకపోయినా , గొప్ప స్థానానికి చేరుకోవాలి అని అన్నయ్యకు ప్రాణంలా చెప్పినమాటనే మేము ముగ్గురమూ దైవంగా భావిస్తున్నాను . ఆది సాధించడానికి తొలి అడుగు వెయ్యబోతున్నాను మీ ఆశీర్వాదాలు మాతోనే ఉంటాయని మాకు తెలుసు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా అని ఫోటోపై ప్రాణంలా ముద్దుపెట్టింది.

లవ్ యు రా , లవ్ యు చెల్లీ ......... అని ఇద్దరమూ చెల్లి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టాము . 

Wow ......... నా ప్రాణానికి ప్రాణమైన ముగ్గురూ ఒకేసారి ముద్దులతో కొండంత శక్తిని ఇచ్చారు అక్కయ్యా వెళ్లిస్తాను అని మా ఇద్దరి భుజాలపై చేతులువేయడంతో కిందవరకూ చిరునవ్వులు చిందిస్తూనే కిందకు ఎత్తుకునివచ్చేసాము .



అధిచూసి అంటీ , కార్తీక సంతోషంతో చప్పట్లు కొట్టి చెల్లిని కౌగిలించుకుని all the best చెప్పారు .

థాంక్స్ అంటీ ,కార్తీక .........అంటీ అంకుల్ ఎక్కడ అని చెల్లి అడిగింది .

ఇదిగో వచ్చేసాను కృష్ణ .......... all the best నువ్వనుకున్నది సాధిస్తావు అని దీవించారు . బాబు మహేష్ exam సెంటర్ చేరుకోవడానికి గంట పడుతుంది . బైకులో వెళితే నీ ప్రాణమైన చెల్లి కళ్ళల్లో దుమ్ము ధూళి పడొచ్చు ఇదిగో కారులో వెళ్ళండి అని కీస్ అందించారు .

కృష్ణగాడివైపు చూసాను .......... సడెన్ గా తలదించుకోవడంతో నవ్వుకుని అంకుల్ మా ఇద్దరికీ కారు నడపడం రాదు.

Shit shit ......... ఇదంతా నాతప్పే ఇన్నిరోజులనుండీ ఒక్కసారీ ఈ ఐడియా రాలేదు. రేపటి నుండి చెల్లి results వచ్చేన్తవరకూ ఖాళీనే కదా సాయంత్రం రాగానే నేను మీ ఇద్దరికీ నేర్పిస్తాను మీరు కృష్ణవేనికి , కార్తీకకు నేర్పించండి . ఈరోజుకు నేనే స్వయంగా exam సెంటర్ కు వదిలివస్తాను అన్నారు .

లవ్ యు soooo మచ్ dad నేనుకూడా అక్కయ్యతోపాటు వస్తాను అని కార్తీక చెల్లి చెయ్యి అందుకొని కారు దగ్గరకు పిలుచుకునివెళ్తోంటే మావైపు చూసింది .

చిరునవ్వు నవ్వడంతో సంతోషంతో ఇద్దరూ వెనుక కూర్చున్నారు . కారు వెనుకే బుల్లెట్ లో ఇద్దరమూ బయలుదేరి exam సెంటర్ కు సరైన సమయంలో చేరుకున్నాము .



అప్పటికే అక్కడికి వందల్లో స్టూడెంట్స్ చేరుకుని తమ రూమ్ ఏదో చూసుకుని వేచి చూస్తున్నారు .

చెల్లి వాడితోపాటు వెళ్లి రూమ్ ఏదో తెలుసుకునివచ్చింది .

అక్కయ్యా ......... ప్రశాంతంగా కారులో కూర్చో అని కూర్చుని మీరు బాగా రాస్తారు మా అందరికీ తెలిసు అని ప్రేమతో హత్తుకొని బుగ్గపై ముద్దుపెట్టి నవ్వించింది .

10 నిమిషాల తరువాత బెల్ మ్రోగడంతో ఏమేమికావాలో అన్నీ ఉన్నాయో లేదో అందుకొని కారు దిగి అన్నయ్యా ....... అని గుండెలపై వాలింది .

All the best చెల్లీ ......... కూల్ గా రాసి వచ్చేయి అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .

తరువాత వాడిని గట్టిగా కౌగిలించుకుని వాడు all the బెస్ట్ చెప్పగానే పెదాలపై సడెన్ గా ముద్దుపెట్టేసి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా , కార్తీక అని తియ్యని నవ్వుతో చెప్పి లోపలికి వెళ్ళింది .

వాడు సిగ్గుపడుతోంటే ఒక దెబ్బవేసి , రేయ్ మామా ......... నువ్వు ఇవ్వాల్సిన ముద్దు ఇవ్వకపోవడంతో పాపం చెల్లే తీసేసుకుంది అనిచెప్పాను .

రేయ్ మామా ......... ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా ,

అంకుల్ నవ్వుతోంటే , అన్నయ్యా .......... ఇలాంటివి కూడా ఎవరైనా చెబుతారా , మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ముగ్గురమూ నవ్వుకున్నాము . 



స్టూడెంట్స్ అందరూ లోపలివెళ్లాక అంకుల్ కార్తీకతోపాటు మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి , మేము ఇక్కడే ఉండి చెల్లిని పిలుచుకునివస్తాము అనిచెప్పాము .

మహేష్ ......... exam అయిపోయేది ఎప్పుడు అంతలోపు వచ్చేస్తాను అనిచెప్పారు.

పర్లేదు అంకుల్ ఇక ఫ్రీనే కదా బైకులో వచ్చేస్తాము లెండి అని ఒప్పించి లవ్ యు అంకుల్ మీకు రోజురోజుకీ ఋణపడిపోతున్నాము .

మహేష్ మళ్లీ స్టార్ట్ చేశావా ........ నేను హార్ట్ exam అయ్యి వచ్చేన్తవరకూ నీతో మాట్లాడాను అని కారు ఎక్కారు .

Dad ........... ఎలాగో అన్నయ్య ఇక్కడ ఉంటాడు అనేకదా అని నవ్వుకుని అన్నయ్యా ........ బై మీరు వచ్చేలోపు బిరియానీ చికెన్ ఫ్రై చేసి ఉంచుతాము అనిచెప్పింది కార్తీక .

అంతే నోరూరిపోవడం చూసి నవ్వుకుని వెళ్లిపోయారు .



సుమారు 3 గంటలపాటు అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ తోపాటు మేముకూడా చెల్లి బాగా రాయాలని ఆశిస్తూ , ప్రార్థిస్తూ వేచి చూస్తున్నాము .

బెల్ కొట్టిన కొద్దిసేపటికి చెల్లి ఉత్సాహంతో బయటకు రావడం చూసి మామా - మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాము .

రేయ్ , అన్నయ్యా ............ అని చిరునవ్వులు చిందిస్తూ వచ్చి కౌగిలించుకున్న ఇద్దరినీ హత్తుకుంది .

చెల్లెమ్మా , రేయ్ ......... ఇక ఇంటికి వెళదామా అక్కడ ఇంటిలో బిరియానీ రెడీ అయ్యి ఉంటుంది అని లొట్టలేస్తూ చెప్పాము .

రేయ్ , అన్నయ్యా .......... అని ఇద్దరినీ కొట్టి కనీసం ఎలా రాశావు రా అనికూడా అడగకుండా బిరియానీ గురించి ఆలోచిస్తున్నారు అని తనుకూడా లొట్టలేస్తూ లోలోపలే నవ్వుకుంటోంది .

ఇంత సంతోషాన్ని కూడా అడగాలా చెల్లీ , కృష్ణ అని ఇద్దరమూ అమాంతం పైకెత్తేసాము .

చుట్టూ అందరూ మా సంతోషాన్ని చూసి నవ్వుతూ వెళ్లిపోతున్నారు .

అన్నయ్యా ......... పదండి మరీ అని చెప్పడంతో , కృష్ణగాడు స్టార్ట్ చేయగానే చెల్లిని మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము .

మాకోసం అంటీ , కార్తీక , అంకుల్ గేట్ దగ్గరే ఎదురుచూస్తూ మా సంతోషం చూసి , శ్రీమతి గారు నీ ప్రియమైన కూతురు డాక్టర్ కాబోతోంది అని సంతోషించి లోపలకు పిలుచుకొనివెళ్లారు .

బిరియానీ ఘుమఘుమలు తెలియగానే ఇద్దరమూ పరుగునవెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చుని అంటీ ఆకలి అని దీనంగా ఆడిగాము .

అందరూ నవ్వుతూ చెల్లికి వడ్డించిన ప్లేట్ అందివ్వడంతో మాకు తినిపించి తరువాత అంటీతోపాటు చెల్లెళ్ళు తిన్నారు .



తరువాతి రోజు నుండి చెల్లి ఫ్రీ అవ్వడంతో అంటీకి సహాయం చేస్తూ , పార్ట్ టైం జాబ్ లలో ముగ్గురమూ కష్టపడ్డాము . అంకుల్ సాయంత్రం రాగానే మా అందరినీ కారులో ఎక్కించుకుని దగ్గరలోని గ్రౌండ్ కు తీసుకెళ్లి నేర్పించడం మొదలెట్టారు . సాయంత్రం క్రికెట్ ఆడుతుండటం చూసి నెక్స్ట్ ఆదివారం చెల్లీ గ్రౌండ్ కు వెళ్లిస్తాము జాగ్రత్త అని అంటీ కార్తీక దగ్గర వదిలాము .

ఆదివారం కాబట్టి గ్రౌండ్ మొత్తం నిండిపోయింది . నలువైపులా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆడేస్తున్నారు .



క్రికెట్ పై మక్కువ వలన మా వయసున్న వాళ్లదగ్గరికివెళ్లి మేము ఆడుతాము చివరన బ్యాటింగ్ బౌలింగ్ ఇచ్చినా పర్లేదు అని ఆడిగాము .

Sorry బ్రో ......... పెద్ద బెట్టింగ్ ఆడుతున్నాము వేరే వీధివాళ్ళతో సో .......కుదరదు అనిచెప్పడంతో ,

ఆలాగేనని కాస్త తక్కువ వయసున్న వాళ్లదగ్గరికి వెళితే అదే సమాధానం ఇవ్వడం అలా వయసు తగ్గించుకుంటూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది . ఒక చివరన 10 9 ఏళ్ల చిన్నపిల్లలు ఆడుతుండటం చూసి వెళ్లి పిల్లలూ మేమూ మీతో ఆడొచ్చా మీకు 10 నిమిషాలకొకసారి ఐస్ క్రీమ్ కొనిస్తాము అందరికీ అని ఆడిగాము . 

పై నుండి కిందవరకూ చూసి పిల్లలంతా గుమికూడి ఐస్ క్రీమ్ రా అంటూ లొట్టలేసుకుని , మీరు మాదగ్గరకు వచ్చారంటే క్రికెట్ ఆడటం రాదని అర్థమైంది , మిమ్మల్ని మా గ్రూప్ లో చేర్చుకుంటాము కానీ ఎలా ఆడాలో నేర్పిస్తాము అంతవరకూ మేము కొట్టిన బంతిని తీసుకురావాలి అదే ఫీల్డింగ్ మాత్రమే చెయ్యాలి అని ముద్దుముద్దుగా చెప్పారు .

మీరు ఒప్పుకున్నారు అదిచాలు మాకు అని ఐస్ క్రీమ్ బండిని పిలిచి అందరికీ కప్ ఐస్ క్రీమ్ కొనిచ్చాము . 

Wow థాంక్స్ అన్నయ్యలూ ......... ఇంతకూ మీ పేర్లు అని అడగడంతో ఒకరినొకరము పరిచయం చేసుకున్నాము .



Ok ఇప్పుడు టీం సెలక్షన్ , రేయ్ మీ ప్రక్కన వాళ్లిద్దరూ బాగా ఆడతారు కాబట్టి ఆడటం రాని అన్నయ్యలను మీవైపే తీసుకోవాలి అనగానే , ఎలా కుదురుతుంది రా అని కాసేపు సీరియస్ ఫైటింగ్ తరువాత ఇద్దరమూ ఫీల్డింగ్ టీం వైపు సెలెక్ట్ చేసుకున్నారు . 

ఫ్రెండ్స్ ........ మ్యాచ్ స్టార్ట్ చెయ్యబోయేముందు ఒక సెల్ఫీ అని చెప్పడంతో అందరూ చుట్టుచేరారు . కృష్ణగాడు సెల్ఫీ తీసి మన టీం రా అని చెల్లికి పంపించాడు .

లవ్లీ రా ........అని రిప్లై ఇచ్చింది .

ఫ్రెండ్స్ ......... ఒకరు లాంగ్ on మరొకరు లాంగ్ ఆఫ్ వెళ్ళండి అని చూపించారు .

రేయ్ మామా రేయ్ మామా ........ మనకు బ్యాటింగ్ రావాలంటే స్కోర్ ఎక్కువ ఉండాలి కాబట్టి అని ఒకేసారి ఇద్దరమూ నవ్వుకుని మావైపు వచ్చిన ప్రతీ బాల్ ను ఫోర్ పోయేలా మేమే తప్పులుచేస్తున్నాము .

ఫ్రెండ్స్ , ఫ్రెండ్స్ ......... స్కోర్ పెరిగిపోతోంది ఒక్క బాల్ అయినా పట్టుకోండి 10 రూపాయల బెట్ అని ఫోర్ వెళ్లిన ప్రతిసారీ అయ్యో అయ్యో అంటూ మమ్మల్ని ఫీల్డింగ్ నలువైపులా తిప్పేసారు . 

ఒకవైపు పూర్తయ్యేసరికి బ్యాటింగ్ టీం 8 ఓవర్లకు 70 పరుగులు చేశారు . మా కెప్టెన్ రేయ్ ఇక మనం ఒడిపోయినట్లే 8 ఓవర్లకు 40 కూడా కొడతామో లేదోనని మావైపు కోపంతో చూసి బెట్ ను ముందే ఇచ్చేసాడు .



అవతలివైపు ఇద్దరు పిల్లలు బౌలింగ్ సూపర్ గా వేస్తుండటంతో 4 ఓవర్లకు 20 రన్స్ చేసి అన్ని వికెట్స్ పడగొట్టేశారు . ఇక 4 ఓవర్లకు 51 కొట్టాల్సిన సమయంలో కృష్ణగాడు వెళ్ళాడు రన్నింగ్ వైపు . మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి చివరి బుజ్జి ఫ్రెండ్ కూడా ఔట్ అవ్వడంతో కృష్ణగాడు స్ట్రైకింగ్ వైపు నేను రన్నింగ్ వైపు నిలబడ్డాము .

రేయ్ కనీసం ప్రక్కన ఆడుతున్న అన్నయ్యల మ్యాచ్ అయినా చూద్దాము నెక్స్ట్ బంతికే బోల్డ్ అయిపోతాడు అని అందరూ అటువైపు తిరిగారు . ఫీల్డింగ్ టీం మొత్తం మాకు అతిదగ్గరలో వచ్చి రేయ్ కాస్త నెమ్మదిగా వెయ్యరా అని నవ్వుతున్నారు .

అప్పటికే 5 వికెట్లు తీసిన బౌలర్ కాస్త దగ్గరలోనే ఆగి బౌలింగ్ వేసాడు . 

దాదాపు 9 సంవత్సరాల కసి అన్నట్లు బలమంతా ఉపయోగించి ఫ్రంట్ వెళ్లి షాట్ కొట్టాడు అంతే గ్రౌండ్ బయట రోడ్ కు అవతలివైపు పడింది . 

బుజ్జి ఫ్రెండ్స్ అందరూ అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు . మా టీం mates ఔట్ అయిపోయారా నెక్స్ట్ మ్యాచ్ మాకీ అన్నయ్యలు వద్దు అని తిరిగి బాల్ కోసం రెండు పిచ్ ల అవతలివైపుకు పరుగుపెడుతున్న ఫీల్డర్ ను చూసి విషయం తెలుసుకుని నమ్మనట్లు నిలబడ్డారు . 

నెక్స్ట్ బంతి మరొకవైపు అంతే దూరంలో వెళ్ళిపడింది .

మా బుజ్జి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండిపోయారు . ఇద్దరమూ కలిసి మూడు ఓవర్లలోనే మ్యాచ్ పూర్తిచేసేసాము .

రేయ్ గెలిచేసాము అంటూ మా కెప్టెన్ పరుగునివెళ్లి బెట్టింగ్ డబ్బులు తీసుకొచ్చి sorry అన్నయ్యలూ ........ 

ఫ్రెండ్స్ అన్నారు .

Sorry ఫ్రెండ్స్ ........... అని తలదించుకున్నారు .

మాకు బ్యాటింగ్ ఇచ్చినందుకు మేమే మీకు థాంక్స్ చెప్పాలి అని రెండు టీమ్స్ ను పిలిచి మళ్లీ అందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పించి , అయిపోతే మళ్లీ తెప్పించండి అని అతనికి చెప్పాము .

థాంక్స్ అన్నయ్యా ....... అని అందరూ మమ్మల్ని హత్తుకొని , ఫ్రెండ్స్ ........ ప్రతి వారమూ అదిగో అక్కడ ఆడుతున్న అన్నయ్యలు మేము ఆ పిచ్ పై ముందువచ్చినా పిల్లనాయల్లారా ......... వెళ్లి ఆ మూలన ఆదుకోండి . మీకు ఈ పిచ్ కావాలంటే మాతో బెట్ ఆడి గెలవాలి అప్పుడు మీ ఇష్టం అని తోసేశారు . ఇప్పుడు మీరున్నారు కదా వెళ్లి సవాల్ చేయమా ......... అని అడిగారు .



మీకు ఏది ఇష్టమో అధిచేయ్యండి మీవెనుక మా కెప్టెన్ చెప్పినట్లు వింటాము అనిచెప్పాము .

మా కెప్టెన్ వెళ్లి పిచ్ కోసం ఛాలెంజ్ విసిరారు . 

బెట్ 200 అయితే రండి అని నవ్వుకుని పంపించారు .

కెప్టెన్ వచ్చి రేయ్ అందరి దగ్గర ఉన్న డబ్బంతా తియ్యండి అని రూపాయి రూపాయి తీసి 100 రూపాయలు సేకరించారు . ఇప్పుడెలా అని ఫీల్ అవుతోంటే నేను 50 , కృష్ణగాడు 50 కలిపాము .

యాహూ .......... థాంక్స్ అన్నయ్యలూ అని పరుగునవెళ్లి మ్యాచ్ సెట్ చేసుకునివచ్చాడు .



 టాస్ వేసి ఓడిపోవడంతో ఫ్రెండ్స్ ......... బౌలింగ్ 10 ఓవర్ల మ్యాచ్ అంటూ వచ్చాడు.

కెప్టెన్ ఎక్కడ ఫీల్డింగ్ చెయ్యాలి ..........

ఫ్రెండ్స్ అప్పుడు తెలియదు కాబట్టి అలా ,

మేము మా కెప్టెన్ ఎలా చెబితే అలా టీం లో అందరమూ సమానమే ఆర్డర్వెయ్యండి అని చెప్పాము .

థాంక్స్ ఫ్రెండ్స్ అని ఒకరిని మిడ్ on మరొకరిని మిడ్ ఆఫ్ పంపించారు .

మొదటి 6 ఓవర్లు బుజ్జి ఫ్రెండ్స్ బౌలింగ్ వేసి స్కోర్ ఓవర్ ఓవర్ కు పెరుగుతోంటే ఎదురెదురుగా ఉన్న ఇద్దరమూ చప్పట్లు కొడుతూ ఏమ్ పర్లేదు ఏమ్ పర్లేదు అని ఉత్సాహపరిచాము .

ఫ్రెండ్స్ 6 ఓవర్లకు 70 రన్స్ ఒక్క వికెట్ కూడా లేదు ఇప్పుడెలా మీకు బౌలింగ్ కూడా వచ్చా అని బాల్ అందించాడు మా కెప్టెన్ , నాకంటే వాడే సీనియర్ అని కృష్ణగాడి చేతికి బాల్ అందించాను .

వాడు ఫీల్డింగ్ సెట్ చేసుకుని మొదటి బంతికే బోల్డ్ చేసేసాడు . బుజ్జి ఫ్రెండ్స్ లో ఉత్సాహం అంతా ఇంతా కాదు . నెక్స్ట్ నెక్స్ట్ హ్యాట్రిక్ తీసేసాడు . పిల్లలు ఏకంగా చిందులు వేసేశారు . నెక్స్ట్ ఓవర్ నాకు అందించడంతో మరొక రెండు వికెట్స్ పడ్డాయి . మిగతా 4 ఓవర్లకు 15 రన్స్ మాత్రమే కొట్టి 8 వికెట్స్ కోల్పోయారు .



పిల్లలందరికీ మళ్లీ ఐస్ క్రీమ్స్ మరియు వాటర్ తెప్పించాము . ఫ్రెండ్స్ మొదట మీరే ఆడండి అని ఏ బ్యాట్ కావాలో అన్నింటినీ చూపించారు .

నో నో కెప్టెన్ మీరు ఆడండి మిగిలిన కొద్దిపరుగులు మాకు ఇవ్వండి అని బదులివ్వడంతో , 

థాంక్స్ చెప్పేసి బాగా ఆడే ఇద్దరిని మొదట పంపించాడు .

Same 6 ఓవర్లకు 32 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయారు . ఫ్రెండ్స్ 4 ఓవర్లకు చాలా రన్స్ కొట్టాలి మాకు బ్యాటింగ్ రాకపోయినా పర్లేదు పిచ్ మన సొంతం కావాలి please please అని బ్రతిమాలడంతో వెళ్లి 3.5 ఓవర్లలో ఫినిష్ చేసేసాము .

యే యే యే ........... అని పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చుట్టేసి కెప్టెన్ దగ్గరకువెళ్లి రేపటి ఆదివారం నుండి పిచ్ మాది అని కాలరేగరేసి చెప్పి బెట్ తీసుకొచ్చి అందరికీ పనిచేశారు .



ఫ్రెండ్ ......... నాకైతే సంతోషం లేదు అని ఒక బుజ్జి ఫ్రెండ్ అన్నాడు .

ఎందుకురా ........ మనం గెలిచాము కదా.......

రేయ్ అదిగో గ్రౌండ్ మధ్యలోనున్న పిచ్ మన సొంతమవ్వాలి , మనల్ని ఎన్నిసార్లు వాళ్ళ టీమ్ లో పిలుచుకుంటామని ఆ పిచ్ పై ఆడనిస్తామని ఉదయం నుండీ సాయంత్రం వరకూ ఎండలో ఫీల్డింగ్ చేయించి కనీసం పిచ్ పై అడుగుకూడా పెట్టనివ్వలేదు అని అందరిలో ఉద్రేకాన్ని రగిలించేశాడు .

అవును ఫ్రెండ్ మాకు ఐస్ క్రీమ్ వద్దు ఏమీ వద్దు మాకు ఆ పిచ్ ను గిఫ్ట్ గా ఇస్తారా అని అడిగారు . 

అంతలోనే ఒకడు రేయ్ అక్కడిదాకా పెద్ద బెట్ లేకుండా వెళ్లలేము . వాళ్ళు వేలల్లో ఆడతారు . వాళ్ళ ఈగో బయటకు తీస్తే బెట్ లేకుండానే పిచ్ బెట్ వేసి ఆడొచ్చు నాతో ఒక ఉపాయం ఉంది అని మా కెప్టెన్ ఇప్పుడు గెలిచిన వయసు వాళ్ళ కంటే కాస్త పెద్ద వయసున్న వాళ్ళతో 500 హండ్రెడ్ బెట్ కాసి వచ్చాడు . ఫ్రెండ్స్ మనది బ్యాటింగ్ ఓపెనింగ్ ఇద్దరిలో ఒకరు వెళుతున్నారు ఇది కెప్టెన్ గా నా ఆర్డర్ ఈ మ్యాచ్ గెలిచామంటే , మనమంటే ఏంటో తెలుస్తుంది . 

రేయ్ మామా నువ్వేళ్ళు ఓపెనింగ్ నేను అంతవరకూ పెద్ద పిచ్ లో వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తాను అన్నాడు .

OK అని కెప్టెన్ తోపాటు ఓపెనింగ్ వెళ్ళాను. వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవతలివైపు వికెట్స్ పడుతున్నా సిక్స్ లు ఫోర్లతో 5 ఓవర్లకు 50 కొట్టాము . ఇక నెక్స్ట్ కృష్ణగాడు వచ్చాడు . ఇద్దరమూ కలిసి10 ఓవర్లకు 130 కొట్టాము .



బౌలింగ్ బాధ్యతలు కూడా మాకే ఇవ్వడంతో 9 ఓవర్లలో 88 పరుగులు అల్ ఔట్ అయిపోయారు .

రేయ్ పిల్లకాయలతో ఒడిపోయామురా ....... 500 బెట్ రా .........

అంటే ఆ పిల్లలతో 1000 రూపాయలు ఉందా అని పెద్ద పిచ్ వాడు ఫీల్డింగ్ చేస్తూ విని పరుగునవెళ్లి రేయ్ మామా 10 బీర్లు సులభంగా గెలిచే అవకాశం రా ఆ పిల్లనాయాళ్లతో 1000 రూపాయలు ఉన్నాయిరా ...........అని చెప్పాడు .



మా కెప్టెన్ ప్లాన్ అమలుచెయ్యకుండానే ఆ కెప్టెన్ వచ్చి ఈ వేస్ట్ నాయాళ్లతో రెండు మ్యాచ్ లు గెలవడం కాదు మాతో ఆది గెలవండి 1000 కి రెండు వేలు ఇస్తాము అన్నారు .

మాకు డబ్బు అవసరం లేదు ........... మీరు గెలిస్తే 1000 రూపాయలు మరియు ప్రతీవారం మీరు ఇక్కడ ఫీల్డింగ్ చేయమంటే అక్కడ చేస్తాము . కూల్ వాటర్ తెచ్చిస్తాము . మీ బ్యాట్లు పట్టుకుని సాయంత్రం వరకూ కూర్చుంటాము . కానీ ఒకవేళ మేము గెలిస్తే ఎటువంటి డబ్బు ఇవ్వనక్కరలేదు మేము గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే పిచ్ మాకు సొంతం చేసి వెళ్లిపోవాలి . మేము వచ్చేన్తవరకూ మీరు ముందుగానే వచ్చి ఎవ్వరూ ఆడకుండా రెడీ చేసి ఉంచాలి . మేము మీతో మ్యాచ్ కు రెడీ అని పిచ్ పై 1000 రూపాయలు ఉంచి వచ్చేశాడు మా కెప్టెన్ . 

డన్ అని బదులిచ్చాడు . మిమ్మల్ని మేము నమ్మము గ్రౌండ్ లో ఉన్న అందరినీ పిలిచి మన బెట్ సంగతి వివరించండి అని సవాల్ విసరడంతో అలాగే చేసాడు వాళ్ళ కెప్టెన్. ఇదేదో ఇంటరెస్ట్ గా ఉందని గ్రౌండ్ లోనివారంతా మా మ్యాచ్ చూడటానికి ఉత్సాహం చూపించారు.



ఇంతలో చెల్లెమ్మ కాల్ ......... రేయ్ రెండు గంటలు అయ్యింది . లంచ్ కు రారా ....... గ్రౌండ్ లోనే ఉండిపోతారా .........

సమయం చూసి పిల్లలూ ఫ్రెండ్స్ మీకు ఆకలి వెయ్యడం లేదా అని అడిగాడు .

మాకు ఆ పిచ్ లంచ్ కావాలి ఇంకేమీ వద్దు .

రేయ్ ఎవర్రా ..........

చెల్లికి ఉదయం నుండీ జరిగినది వివరించాడు .

OK నాకు ఏమిచెయ్యాలో తెలుసు ఎంజాయ్ the గేమ్ అని , ఎలాగైనా పిల్లలకు పిచ్ కానుకు ఇవ్వాలి అని నాతోకూడా మాట్లాడింది.



రేయ్ మామా.......... వాళ్ళ క్రికెట్ చూసి గెలవడం చాలా కష్టమే అనుకున్నాను . కానీ పిల్లలు డబ్బువద్దు అని ఇప్పుడు నీ చెల్లిదాకా వెళ్ళిపోయింది కాబట్టి గెలవాల్సిందే రా లేకపోతే రాత్రికి నాకు ముద్దులు ఉండవురా .......... అని చెవిలో గుసగుసలాడాడు .

నవ్వుకుని మన కెప్టెన్ ఉండగా మనకెందుకురా భయం ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడదాము , ఎన్ని రన్స్ కొట్టమంటే అన్ని కొడదాము అని అందరమూ కెప్టెన్ చుట్టూ చేరాము .



ఫ్రెండ్స్ నాకు భయమేస్తోంది . ఎందుకు కెప్టెన్ ఇదికూడా ఇప్పుడు రెండు మ్యాచ్లలో ఒకటి అనుకోండి . వాళ్ళల్లో కొన్ని మైనస్ లు గమనించాను . చాలామందికి కోపం ఎక్కువ . అలాంటప్పుడు మనం ఏమిచెయ్యాలో తెలుసా ........

వాళ్ళు మరింత కోప్పడేలా చెయ్యాలి .......... మీరు వాళ్ళ వికెట్ పడిన ప్రతిసారీ , మనం ఫోర్ కొట్టినా ప్రతిసారీ ఓవర్ యాక్టింగ్ రెస్పాన్స్ ఇవ్వండి ఇక తరువాత జరుగబోయేది చూడండి . కెప్టెన్ మీరు రెడీ కదా వెళ్లి టాస్ వేసి రండి అని చప్పట్లతో పంపించాము .

ఫ్రెండ్స్ టాస్ ఓడిపోయాను sorry మనది ఫీల్డింగ్ ..........

రేయ్ మొదటి మ్యాచ్ గుర్తుచేసుకోండి గెలుపు మనదే అని బుజ్జి ఫ్రెండ్స్ మా చేతులు అందుకొని గుమికూడి పిచ్ మనది అని గ్రౌండ్ మొత్తం వినిపించేలా కేకలు వేశాము .



వాళ్ళ కెప్టెన్ అందరినీ రమ్మని పిలిచాడు . రేయ్ మామా పిల్లకాయలు రా ఇంతే అని వేలితో సైగచేసి నవ్వుకుని గర్వానికి పోయారు .

సరేరా అని నవ్వుకుని కెప్టెన్ స్వయంగా ఓపెనింగ్ వచ్చాడు .

రేయ్ మామా ........ అంటూ వాడి మైనస్ లు చెప్పి , తొలి ఓవర్లోనే వాళ్ళ కెప్టెన్ ను ఫసక్ చేసామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పిచ్ లో కలిపేయ్యొచ్చు అని బంతిని అందించాడు .

వాడు చెప్పినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేసాను . తొలి బాల్ కే చాలా ఫ్రంట్ వచ్చి సిక్స్ కొట్టాడు .

పిల్లలంతా నిరాశతో కృష్ణగాడు మాత్రం గుడ్ రా మామా అని కృష్ణగాడు కీపింగ్ వచ్చాడు . నెక్స్ట్ సమ్మె బాల్ కాస్త స్లో వెయ్యగానే ఫ్రంట్ రావడం బాల్ మిస్ అవ్వడం కృష్ణగాడు పెదాలపై చిరునవ్వుతో బైల్స్ అంతెత్తుకు ఎగిరిపడేలా స్టంప్ చేసి how is that అని లెగ్ అంపైర్ వైపు అడిగాడు . ఔట్ అని వేలు చూపించగానే గ్రౌండ్ మొత్తం షాక్ రేయ్ మన సెహ్వాగ్ నే ఔట్ చేసేసారు అదికూడా రెండో బంతికే ........ ఇక మా బుజ్జి ఫ్రెండ్స్ అయితే అంతులేని ఉత్సాహంతో ఎగిరెగిరి చేతులు కొట్టుకుని థాంక్స్ అన్నయ్యా , sorry ఫ్రెండ్ ఇక మీరు ఫోర్ ఇచ్చినా సిక్స్ ఇచ్చినా ఇదిగో ఇందుకోసమేనని అర్థమై అయ్యింది అని ఎంజాయ్ చేశారు .

అందరూ బ్యాటింగ్ టీం వైపు తిరిగి పిచ్ మాది , ఇప్పటికైనా సీరియస్ గా ఆడండి మేము పిల్లలము కాదు పిడుగులం మా శక్తి ఇదిగో అని నలుగురు ఫ్రెండ్స్ మా చేతి కండలను చూపించి వ్రేలాడారు .

నెక్స్ట్ batsman మేము అనుకున్నట్లుగానే కోపంతో వచ్చాడు .

కృష్ణగాడు ......... ఎలావెయ్యాలో చెవిలో చెప్పి అందుకు ఆపోజిట్ గా సైగలు చేసాడు.

వాడు చూసి నవ్వుకుని నెక్స్ట్ బంతికే పాయింట్ లో ఉన్న మా కెప్టెన్ కు క్యాచ్ ఇచ్చేసాడు . అద్భుతమైన డైవ్ తో క్యాచ్ పట్టేసాడు .

అందరూ వెళ్లి మా కెప్టెన్ ను పైకెత్తేశారు. కిందకు దించి రేయ్ మీ నాన్నరా అనగానే భయంతో వెళ్లి నాన్న నాన్న తరువాత ఎలాగైనా కొట్టండి ఇదొక్క మ్యాచ్ అని చేతులుకట్టుకుని కళ్ళల్లో నీళ్లతో అడిగాడు .

ఫ్రెండ్ మ్యాచ్ ఆగుపోయింది . వాళ్ళ నాన్నకు క్రికెట్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు . వాడు డైవ్ వేసినప్పుడు చేతికి గాయం అయ్యిందికూడా ఇక అంతే అనేంతలో ........

అమాంతం ఎత్తుకుని ముద్దుపెట్టి , నువ్వు క్యాచ్ పట్టినప్పుడు గ్రౌండ్ మొత్తం అభినందించింది . నన్ను క్షమించు రాము ......... నీఇష్టాన్ని ఇన్నిరోజులూ అడ్డుపడుతూ వస్తున్నాను అని చేతితో మోచేతిపై గాయాన్ని తుడిచి కర్చీఫ్ తీసి కట్టు కట్టి వేళకు వెళ్లి హ్యాపీగా ఆడు నేనుకూడా చూస్తాను అని నుదుటిపై ముద్దుపెట్టాడు.



రేయ్ మామా ......... గెలుపు మనదే అని వాళ్ళు ఎగురుతోంటే , ఇలా గెలిచేవాళ్లను ఏమంటారో నాకు తెలియదు . అన్నయ్యలూ మీకేమయినా తెలుసా అని గ్రౌండ్ చుట్టూ ఆసక్తితో తిలకిస్తున్న అందరినీ గట్టిగా అడిగాడు . 

ఒక్కొక్కరూ ఒక్కొక్క సమాధానం ఇస్తూ నవ్వుతూ కేరింతలు వేస్తూ మాకు చప్పట్లతో సపోర్ట్ ఇచ్చారు . అందులో మా కెప్టెన్ నాన్నగారు కూడా ఉండటం చూసి తన ఆనందానికి అవధులు లేవు .



అన్నయ్యా ...........నెక్స్ట్ ఓవర్ నేను వెయ్యనా అని అడిగారు . 

నువ్వు మా కెప్టెన్ నీ ఇష్టం , నీకిష్టమొచ్చినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేసుకో అని నెక్స్ట్ ఎవరొచ్చారో చూసి వాడిలో కోపాన్ని మరింత పెంచేలా చేసి అందరమూ నవ్వుకుని , కృష్ణగాడు ఎలా వెయ్యాలో చెప్పాడు .

మొదటి బాల్ ఫోర్ , రెండో బాల్ సిక్స్ ఇచ్చాడు .

ఏమీ పర్లేదు కెప్టెన్ you can do it .......... మీ నాన్న చూస్తున్నారని కాదు . మీ టీం గెలుపు కోసం పిచ్ కోసం వెయ్యమని ఎలా వెయ్యాలో చెప్పి రేయ్ మామా లాంగ్ on అని వాడు మిడ్ ఆఫ్ వెళ్ళాడు .

కృష్ణగాడు దూరం నుండి సైగ చేయగానే కెప్టెన్ రైట్ రైట్ సైడ్ అని batsman కు వినపడేలా అరిచాను . వాడు కృష్ణగాడు చెప్పినట్లుగానే లెగ్ సైడ్ కదులుతుంటే ఆఫ్ సైడ్ వైడ్ గా బంతిని విసిరాడు . వొంగి బలమంతా తీసుకుని కొట్టాడు . మిడ్ ఆఫ్ లో కృష్ణగాడు ఎగిరి పట్టుకుని కెప్టెన్ ......... అంటూ పరుగునవచ్చి అమాంతం పైకెత్తేశాడు . గ్రౌండ్ మొత్తం వాళ్ళ నాన్నతోపాటు సంతోషంతో కేరింతలు వేస్తున్నారు .

నెక్స్ట్ కూడా కృష్ణగాడు చెప్పినట్లే వేయడంతో ఏకంగా మిడిల్ వికెట్ బౌల్డ్ అయిపోయాడు . 



అలా వాళ్ళ వీక్ నెస్ మీద దెబ్బకొడుతూ పిల్లలతోపాటు డైవ్ ల మీద డైవ్ లు వేస్తూ 10 ఓవర్లకు కేవలం 60 రన్స్ మాత్రమే ఇచ్చి 7 వికెట్స్ పడగొట్టడం అందరికీ నిజంగా షాక్ .......... ఓవర్లు అప్పుడే అయిపోయాయా అని బ్యాటింగ్ వాళ్ళు కూడా షాక్ చెందారు .

మధ్యాహ్నం భోజనానికి రాలేదని ప్రతి పిల్లాడి తండ్రి కోపంతో వచ్చి వాళ్ళ పిల్లల టాలెంట్ ను మరియు పెద్దపెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుండటం చూసి ఆనందబాస్పాలతో కూల్ అయిపోయి సపోర్ట్ చేస్తున్నట్లు ఒకవైపు అయిపోయాక తెలిసింది .

పిల్లలు భయం భయంగా ......... వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్లారు .  

లవ్ యు కన్నా , బుజ్జి అంటూ ఎత్తుకుని ముద్దుచేయ్యడంతో వాళ్ళ ఆనందానికి అంతేలేకుండా పోయింది .



ఒక దగ్గర అంకుల్ కారు కనిపించడంతో వెళితే కారులోనుండే సూపర్ అన్నయ్యా ......... పిల్లలతో wow అని చెల్లెళ్ళిద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు . అంకుల్ అని పిలవడంతో చప్పట్లు కొడుతూ వచ్చారు . మీరు బాగా ఆడతారని , కృష్ణ కూడా చూడాలని కోరడంతో వచ్చేసాము . మీకు మరియు పిల్లలకు ఎనర్జీ ఫుడ్ , ఫ్రూట్ డ్రింక్స్ , కూల్ డ్రింక్స్ తెచ్చేసాము అని కారు వెనుక నిండిపోయిన బాక్స్ లను చూపించారు .

హలో my dear ఫ్రెండ్స్ అని పిలిచాము . వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు . సమయం లేకపోవడంతో చకచకా వడ్డించి అందరికీ అందించాము . 

థాంక్స్ అన్న......... ఫ్రెండ్స్ అని ఆకలితో ఉన్నట్లు ఒకటా రెండా ఏకంగా నాల్గవ మ్యాచ్ .......... కుమ్మేసి ఫ్రూట్ జ్యూస్ తాగి ఒక్కొక్క కూల్ డ్రింక్ చేతిలో పట్టుకున్నారు .

బాబు ......... మీరెవరో తెలియదు చాలా చాలా థాంక్స్ చెప్పారు .



చెల్లెళ్ళూ ఎండ ఎక్కువగా ఉంది కారులోనుండే చూడండి అని మేము కూర్చునే ప్రక్కనే కారుని పార్క్ చేశారు అంకుల్ .

రేయ్ మామా తక్కువ స్కోర్ కానీ బౌలింగ్ బాగుంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:25 AM



Users browsing this thread: 2 Guest(s)