Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంటీ ఫుడ్ చాలా బాగుంది అని అంటీతోపాటు చెల్లి బయటకువచ్చింది . 

కృష్ణవేణి నువ్వుకూడా కూర్చో తల్లీ టీ చేసుకొస్తాను అని వంట గదిలోకి మళ్లీ వెళ్లారు.

 మా ఇద్దరిమధ్యన కూర్చుంది . చెల్లీ .......... షాపింగ్ వెళదామా ఏరా ........

లవ్ to అన్నయ్యా .......... కానీ అన్నీ ఉన్నాయికదా ఇంకేమి తీసుకోవాలి .

నా చెల్లి తన ప్రియుడి గుండెలపై పడుకోవడానికి మెత్తటి పరుపు కావాలా .........అని బదులివ్వగానే , 

సిగ్గుపడుతూ వాడివైపు చూసి కన్నుకొట్టి , పో అన్నయ్యా .......... అని లేచి చిలిపినవ్వుతో అంటీ నేనూ వస్తున్నాను అని వంట గదిలోకి తుర్రుమంది . 

ఇంకా ఏమేమి తీసుకోవాలో లిస్ట్ రాసుకుని మాట్లాడుతుంటే , 10 నిమిషాల్లో చెల్లి సిగ్గుపడుతూనే టీ తీసుకొచ్చి అందించి మళ్లీ తుర్రుమంది . 



టీ తాగి అంటీతోపాటు వచ్చింది . 

అంటీ .......... అంకుల్ ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారు . 

ఒకేసారి సాయంత్రం మహేష్ ........... ఏమిటి విషయం .

అదే అంటీ ఇంటి అడ్వాన్స్ , రెంట్ , ఉదయం లగేజీ ధింపున పనివాళ్ళ డబ్బు ........

మహేష్ ఆయనేమైనా అప్పుడే ఆడిగారా ........... రేపు ఎలాగో సండే కదా ఇంట్లోనే ఉంటారు తీరికగా మాట్లాడొచ్చు , ఇలా ఆడిగావని నేను చెబుతాలే మీరు షాపింగ్ వెళుతున్నట్లున్నారు వెళ్ళిరండి అనిచెప్పారు .

థాంక్స్ అంటీ ...........అని పైకివెళ్లి , చెల్లి ఫార్మల్ డ్రెస్ లోకి మారి రెడీ అయ్యాక లాక్ చేసి కిందకువచ్చి అంటీకి తెలిపి తాళాలు ఇవ్వబోతే ,

మహేష్ ఇక పై పోర్షన్ మీదే అని చిరునవ్వుతో బదులిచ్చి షాపింగ్ ఎంజాయ్ చెయ్యమని చెప్పారు . 



నిన్న ఇక్కడ కూడా వర్షం పడినట్లు వాతావరణం కూల్ గా ఉండటంతో చుట్టూ ఎమున్నాయో తెలుసుకోవడం కోసం అలా నడుచుకుంటూ వెళ్ళాము . దగ్గరలోనే మెయిన్ రోడ్ , బస్ స్టాప్ కనిపించింది . 

రేయ్ .......... ఇటా అటా ,

అన్నయ్యా .......... సిటీ బస్ ల లిస్ట్ మొత్తం ఇదిగో , ఎక్కేక్కడికి ఏ ఏ బస్ లలో వెళ్ళాలో పూర్తి లిస్ట్ అంటీ ఇచ్చారు . 

Wow .......... మా చెల్లి tooooooo ఇంటలిజెంట్ , లవ్ యు చెల్లీ అని అందుకొని చూసి ముందుగా షాపింగ్ మాల్ అని బస్ నెంబర్ చెబుతుండగానే , అన్నయ్యా .......... అదే నెంబర్ బస్ వచ్చేస్తోంది త్వరగా అని మా ఇద్దరి చేతులను అందుకొని బస్ స్టాండ్ వైపు అడుగులువేసి బస్ లో ఎక్కి కూర్చుని ముగ్గురమూ నవ్వుకున్నాము.



షాపింగ్ సెంటర్ కు టికెట్స్ తీసుకుని మొబైల్లో హైద్రాబాద్ రూట్ మ్యాప్ ట్రాకర్ on చేసాను . 

చెల్లి విండో ప్రక్కన కూర్చున్న కృష్ణగాణ్ణి మధ్యలోకి లాగేసి కూర్చుని వాడిచేతిని చుట్టేసి సిటీ బిల్డింగ్స్ చూస్తూ , అన్నయ్యా .......... ఇంతకు మించి అద్భుతాలను సృష్టించాలి అని కోరిక కోరింది . 

అక్కాచెల్లెళ్ళు తోడుగా ఉంటే ఎంతసేపు చెల్లీ , లవ్ యు sooooo మచ్ అని మాట్లాడుతూ చెల్లి సంతోషంతో చూపించినవాటిని చూస్తూ , అన్నయ్యా ........ అన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి అంటే మనం సిటీలోనే ఉంటున్నాము అనిచెప్పింది .



షాపింగ్ సెంటర్లో దిగి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసి ఆశ్చర్యపోయి , చెల్లి సెలెక్ట్ చేసిన మాల్ లోపలికి వెళ్ళాము . మాల్ మ్యాప్ అందుకొని నేరుగా బెడ్స్ సెక్షన్ కు చేరుకుని ఒక మాస్టర్ బెడ్ మరొక సింగిల్ బెడ్ , దిండ్లు , కొత్త దుప్పట్లు మరియు టవాళ్ళు తీసుకున్నాము . 

అన్నింటినీ కౌంటర్ కు పంపించి అక్కడి నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గరికి వెళ్లి చెల్లీ సెలెక్ట్ చేసిన టీవీ , ఫ్రిడ్జ్ , వాషింగ్ మెషీన్ , ఒక పెద్ద మరొక చిన్న కూలర్లు తీసుకుంటుంటే ...........

అన్నయ్యా ...........వాషింగ్ మెషీన్ ఎందుకు నాకు ఉతకటం అలవాటే అనిచెప్పింది.

చెల్లికి ఏకష్టం రానివ్వకుండా చూసుంటాను అని మొదట అక్కయ్యకు , మీ అత్తయ్యకు , సునీతమ్మకు మాటిచ్చాను . ఇన్నిరోజులు వేరు ఇక నుండి వేరు నా చెల్లి సున్నితమైన చేతులకు ఎలాంటి పని కలిగించను అనిబదులిచ్చాను .

కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అన్నయ్యా ........... అని గుండెలపై హత్తుకుంది . 

రేయ్ మామా ......... చెల్లికి నీ మనసులో ఇంకేమైనా ఇప్పించాలని ఉందా ........

అన్నీ నీ చెల్లికేనా .......... నాకేమీ లేవా అని బుంగమూతిపెట్టుకోవడంతో , 

ముద్దొచ్చేస్తున్నావురా అని జనాలు అటూ ఇటూ తిరుగుతున్నా దైర్యంగా వాడి బుగ్గను కొరికేసింది .

 స్స్స్......... అంటూ రుద్దుకుంటుంటే ఇద్దరమూ నవ్వుకుని , రేయ్ మాస్టర్ బెడ్ నీకోసం కాదా ఎందుకో తెలియదా , చల్లని కూలర్ నీకోసం కాదా.......... వద్దంటే చెప్పు క్యాన్సిల్ చేసేసి నీకేమి కావాలో తీసుకుందాము . చెల్లెమ్మా .......... పదా క్యాన్సిల్ చేద్దాము అని అడుగువెయ్యబోతుంటే , 

లవ్ యు లవ్ యు ........... అంటూ సిగ్గుపడుతూ మాఇద్దరినీ గట్టిగా కౌగిలించుకుని, లవ్ యు అంటేనే వధులుతాను అని ఎముకలు విరిగేలా చుట్టేయ్యడంతో ,

వెంటనే ఇద్దరమూ లవ్ యు రా , లవ్ యు రా అనడంతో వదిలాడు .

హమ్మయ్యా .......... అనుకుని ఊపిరిపీల్చుకుని ఇద్దరమూ చెరొకవైపు కొట్టి సంతోషంతో నవ్వుకున్నాము . అవసరమైనవి తీసుకున్నాము . అన్నయ్యా కూరగాయలు fruits మార్కెట్ కు వెళ్లి తీసుకుందాము అని చెల్లి చెప్పడంతో , కౌంటర్ చేరుకుని వరుసలో నిలబడి వీటినన్నింటినీ ఇంటికెలా తీసుకెళ్లడం అని ఆలోచిస్తుంటే,

సర్ ఇచ్చిన అమౌంట్ తో బిల్ పే చేయగానే ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది సర్ అనిచెప్పడంతో థాంక్యూ sooooo మచ్ బాస్ అన్నాను . 

బ్రదర్ దారిలో ఒకచోట ఆగి వేరే సామానులు తీసుకువెళ్ళొచ్చా అని అడిగాను .

నిజాయితీగా అడిగారు కాబట్టి కన్సిడర్ చేస్తున్నాము అని లగేజీ డ్రైవర్ ను పిలిచి వీళ్ళు ఎక్కడకు వెల్లమంటే అక్కడకు వెళ్ళండి అనిచెప్పారు . 



అన్నీ లోడ్ చేసిన తరువాత థాంక్స్ చెప్పేసి రేయ్ మామా ఇద్దరూ క్యాబ్ లో వెహికల్ వెనుకే రండి అనిచెప్పి క్యాబ్ ఆపి కూర్చోబెట్టి , నేను వెహికల్లో కూర్చుని , అన్నా నాపేరు మహేష్ మీపేరు

 గోపి తమ్ముడూ ..........., 

అన్నా .......... ఏమీ అనుకోకండి ఒకే ఒకచోటకు తీసుకెళ్లండి అటు నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోదాము అని రిక్వెస్ట్ చేసాను . 

తమ్ముడూ ........... నన్ను కూడా రిక్వెస్ట్ చేసావు చూడు , టచ్ చేసావు తమ్ముడూ ............. ఒకదగ్గర ఏంటి సాయంత్రం వరకూ కావాలంటే సిటీ మొత్తం చుట్టించు సంతోషంగా తీసుకెళతాను . అందరిలా మీరు లేనే లేరు .......... ఫ్రీ డెలివరీ అనగానే నేనేదో వాళ్ళ డ్రైవర్ లాగా అటు ఇటు అంటూ ఆర్డర్ వేస్తుంటారు . ఫస్ట్ టైం నా పనికి విలువనిచ్చారు తమ్ముడూ ............ మాల్లో డీజిల్ అయిపోయింది , టైర్ పంక్చర్ అయ్యింది అని ఏదో ఒకటి చెబుతాను . నేను చెబుతున్నాను తమ్ముడూ ఎక్కడికీ వెళ్ళాలో ఆర్డర్ వెయ్యి అని ఉత్సాహంతో చెప్పారు . 

థాంక్స్ గోపి అన్నా ..........అని చేతులు చాపాను .

తమ్ముడూ లగేజీ ఎత్తాను కదా కాస్త దుమ్ముపట్టింది . 

గోపి అన్నా ......... ఏమీ పర్లేదు అని చేతిని అందుకొని ఊపి , అన్నా ........సైకిల్ షాప్ ఆ వెంటనే two వీలర్ వెహికల్ షాప్ కు వెళ్ళండి అనిచెప్పాను .

ఇక చూసుకో తమ్ముడూ అని ఎక్కేక్కడ ఏమేమి ఉన్నాయో తెలియజేస్తూ 15 నిమిషాల తరువాత సైకిల్ షాప్ చేరుకున్నాము . 

చెల్లెమ్మా ........... రెండు సైకిళ్ళు సెలెక్ట్ చెయ్యి అనిచెప్పాను . 

రేయ్ ఎవరికిరా ..........

నీకు నాకు రా , రేపటి నుండి అక్కయ్యను వెతకాలి కదా.........

దానికి సైకిల్లే కరెక్ట్ రా ............ మరి నీ చెల్లికి అని అడిగాడు . 

బదులివ్వకుండా చెల్లెమ్మా ..........ఏవి నచ్చాయి అని అడిగాను . రెండు గేర్ సైకిళ్ళు సెలెక్ట్ చేసి లేడీస్ సైకిల్ మనసు దోచినట్లు ప్రేమతో తాకుతోంది .

లవ్ యు చెల్లీ ...........నా చెల్లి చేత సైకిల్ తొక్కించలేను అని మనసులో అనుకుని , పే చేసేసి సైకిళ్లను వెహికల్లోకి ఎత్తాను .

చెల్లి వెనుకకు తిరిగి తిరిగి చూస్తూనే , నా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అన్నట్లు వెళ్లి క్యాబులో కూర్చుంది . 



అక్కడ నుండి 5 నిమిషాలలో two వీలర్ షాప్ చేరుకున్నాము . 

ముగ్గురమూ వెళ్లి చెల్లీ ......... నీకోసం నీకిష్టమైన స్కూటీ తీసుకోమని చెప్పాను . 

అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో అన్నయ్యా .......... అంటూ గుండెలపై వాలిపోయింది . 

మా ప్రాణం చేత సైకిల్ ఎలా తొక్కిస్తాము చెల్లీ ............ కాలు నేలపై ఉంచనీకుండా చూసుకుంటాము చెల్లీ , నీ మనసుకు నచ్చినది తీసుకో అని చెప్పాను .

ఊహూ .......... మీఇద్దరికీ ఏది నచ్చితే అదే నాకు ప్రాణం , మీరే సెలెక్ట్ చెయ్యండి అనిచెప్పింది .



ఉన్న కొన్ని మోడల్స్ లో కలర్స్ చూస్తూ ముందుకువెళుతూ మధ్యమధ్యలో చెల్లి కళ్ళవైపు ఓర కంటితో గమనిస్తూ తియ్యని నవ్వుతో ముందుకు అడుగులువేస్తున్నాము .

రెడ్ స్కూటీపై మనసుపడటం వెంటనే చెల్లివైపు ఓర కంటితో చూస్తే , చెల్లి ని అదే స్కూటీ గెలిచినట్లు వెలిగిపోతున్న కళ్ళతో చూస్తుండటం గమనించి , ఇద్దరమూ ఆటపట్టించాలని కళ్లతో సైగచేసి , స్కూటీని దాటి ముందుకువెళ్లిపోయి చెల్లిని గమనించాము . 

నా ప్రాణాలకు నచ్చలేదా అయితే నాకు వద్దు అని ఆ స్కూటీవైపు కన్నెత్తిచూడకుండా అడుగులువేస్తోంటే , ఇద్దరమూ పొంగిపోయి వెనక్కు తిరిగి ఇద్దరమూ ఒక్కొక్క చేతిని అందుకొని చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టి , మాకు నీ ప్రక్కనే ఉన్న రెడ్ స్కూటీ  చాలా అంటే చాలా నచ్చింది చెల్లీ .......... నీకు కూడా కదూ , మాకోసం ........ అంటుండగానే ,

లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా .......... అని ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని మురిసిపోయింది . 

ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చెల్లి పేరుమీద స్కూటీ కొన్నాము . ఇన్సూరెన్స్ మొదలుకుని అన్ని ఫార్మాలిటీస్ పూర్తవగానే , రేయ్ మామా ఇక క్యాబ్ అవసరం లేదురా అని సిగ్గుపడుతూ చెప్పాడు .

బయట ఆకాశం వైపు తొంగి చూస్తుంటే ,

రేయ్ మామా ............ ఎండ లేదులేరా , నీ చెల్లిని జాగ్రత్తగా వెహికల్ వెనుకే ఎక్కించుకునివస్తాను అనిచెప్పాడు . 



రేయ్ మామా .......... ఇంతవరకూ స్కూటీ సింగిల్ గా కూడా తొలలేదు ఎలారా నీమాటలు నమ్మడం . 

అంతేలేరా ......... నీ చెల్లిపై ప్రేమ నామీద నమ్మకాన్ని డామినేట్ చేస్తోందన్నమాట , ఇదేమీ గేర్ బండి కాదుకాదరా  సరే ఏమిచేస్తాం కావాలంటే ఒక రౌండ్ వేస్తాను చూడరా , చిన్నప్పుడు అక్కయ్యలు నడిపేటప్పుడు చూసినది ఇప్పటికీ గుర్తు ఉందిరా  నమ్మరా ............, రేయ్ కృష్ణ నువ్వైనా చెప్పరా ...........

అన్నయ్య నమ్మితేనే ఇదే ఫైనల్ అని ముసిముసినవ్వులతో నాచేతిని చుట్టేసి వాడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . 

అన్నాచెల్లెళ్ళు ఏకమైపోయారు అన్నమాట , ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని స్కూటీని బయటకు తీసుకెళ్లి ఎక్కి స్టార్ట్ చేసి ముందు కాస్త తడబడినా జనాలమధ్యన సునాయాసంగా కంట్రోల్ చేస్తూ వచ్చి , ఏంట్రా మామా ......... నీ చెల్లిని జాగ్రత్తగా తీసుకొస్తానని ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు .

వెంటనే క్యాబ్ దగ్గరకువెళ్లి ఫేర్ ఇచ్చేసి పంపించెయ్యడం చూసి , లవ్ యు రా మామా ............. అని స్కూటీపైనే ఎంజాయ్ చేస్తున్నాడు . 

చెల్లీ అని చెయ్యి అందుకొని ఒక సైడ్ కు కూర్చోబెట్టి , వాణ్ణి గట్టిగా పట్టుకో ఎంజాయ్ రా మామా అని కన్నుకొట్టాను .

లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ......... అని పట్టరాని ఆనందంలో నాకు ముద్దులు కురిపిస్తుంటే , నాకు కాదురా చెల్లికి ........ అని నవ్వుకుంటూ sorry అన్నా ఆలస్యం అయ్యింది అన్నాను .

తమ్ముడూ సాయంత్రం వరకూ పిచ్చపిచ్చగా వాడుకో ఏమీ అనుకోను , నెక్స్ట్ ఎక్కడికి అని అడిగారు .



అన్నా .......... వెజిటబుల్ మార్కెట్ ..........

దూరమే అయినా వెళదాము అని కాస్త ముందుకువెళ్లి మళ్ళీ వెనక్కు తిప్పారు .

గోపి అన్నా దూరం అయితే ..........

తమ్ముడూ నువ్వు అలకూర్చొ నేను తీసుకెళతాను అని టీఫిక్ దాటుకుంటూ పోనిచ్చారు . 

మిర్రర్ లో , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ఇద్దరి ఆనందానికి మురిసిపోతూ అర గంట తరువాత మార్కెట్ చేరుకున్నాము . 

స్కూటీని వెహికల్ ప్రక్కనే పార్క్ చేసి లోపలకువెళ్లి , అన్నయ్యా ......... ఫ్రిడ్జ్ ఉందికాబట్టి వారానికి అవసరమైనవి తీసుకుందాము , మీరు వెళ్లి fruits తీసుకోండి . అన్నీ రెండు రెండుగా తీసుకో ఒకటి అంటీవాళ్లకు ఇద్దాము అనిచెప్పింది .

లవ్లీ ఐడియా చెల్లీ , రేయ్ ప్రక్కనే ఉండు అనిచెప్పాను .

రేయ్ మామా గోడకు బల్లిలా నీ చెల్లిని అతుక్కుపోతాను .

రేయ్ పోలిక చండాలంగా ఉంది కాస్త రొమాంటిక్ గా try చేయరా ......... అని తలపై ప్రేమతో కొట్టి వెళ్ళాను .

15 నిమిషాలలో రెండు రెండు చేతులతో పట్టుకుని బయటకువచ్చి , ఎదురుగా జనరల్ స్టోర్ కనిపించడంతో వెళ్లి రైస్ ప్యాకెట్ మరియు వారానికి ఒక్కొక్క టిఫిన్ కోసం atta , రావ , మ్యాగీ ప్యాకేట్స్ .......... ఇలా అన్నీ సెలెక్ట్ చేస్తుంటే , అన్నయ్యా నువ్వు సూపర్ నాకే ఐడియా రాలేదు . రేయ్ అలా ఊరికే వెనుక రావడం కాదు . రోజువారీ ఏమేమి అవసరమో ఆలోచించు అని చిలిపినవ్వుతో చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . 

ఇక చూసుకో అని మాకంటే ముందు ముందు వెళ్లి కూల్ డ్రింక్స్ , జాం , కెచప్స్ .......... ట్రాలీ లోకి చేరుస్తుంటే నవ్వుకుని , పే చేసి అన్నింటినీ వెహికల్లో ఉంచాను .

తమ్ముడూ నెక్స్ట్ .........

థాంక్స్ అన్నయ్యా ........ 2 దాటింది ఇక స్ట్రెయిట్ ఇంటికి అని అడ్రస్ చెప్పాను . ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో ఇంటికి చేరుకునేసరికి 3:30 అయ్యింది .

ముగ్గురమూ చకచకా అన్నింటినీ పైకి షిఫ్ట్ చేసాము . చెల్లి కూరగాయలు , fruits బ్యాగులను పైకి మార్చింది . 

అన్నయ్యా .......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని కౌగిలుంచుకుని డబ్బు ఇవ్వబోతే , తమ్ముడూ ఆ డబ్బు తీసుకుంటే మన మధ్య ఏర్పడిన బంధానికి వెలకట్టినట్లు అవుతుంది అని వారించి , ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి అని నెంబర్ ఇచ్చి వెహికల్ ఎక్కుతూ , తమ్ముడూ .......... టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషీన్ సెట్ చెయ్యాలికదా నాకు experiance ఉంది డెలివరీకి వెళ్లి నేనే ఫిక్స్ చేసేది అనిచెప్పారు .

అన్నయ్యా ........ instructions ఉంటాయి కదా మేము చేస్తాము , ఇప్పటికే మీకు ఆలస్యం అయ్యింది వెళ్ళండి అనిచెప్పాను . 

తమ్ముడూ DTH పైన సెట్ చెయ్యాలి కాస్త కష్టం అదొక్కటే సెట్ చేసి వెళతాను అని సంతోషంతో చెప్పడంతో , టీవీ ఓపెన్ గోడకు బిగించి అన్నయ్య dth తో పైకివెళ్లి 15 నిమిషాలలో కిందకువచ్చి వైర్లు టీవీకి కనెక్ట్ చేయగానే బొమ్మ రావడంతో యాహూ .........అని కేరింతలతో ఎంజాయ్ చేసాము . 

సరే మహేష్ సెట్ చెయ్యడంలో ఇబ్బంది కలిగితే కాల్ చెయ్యండి , installation కూడా ఫ్రీ నేను ఇక్కడే ఉంటే డబ్బు తీస్తారు బై అని చెప్పారు . 

అన్నయ్యా ......... కనీసం కూల్ డ్రింక్ తాగండి అని కృష్ణగాడు బాటిల్ ఇచ్చాడు . థాంక్స్ చెప్పి బయలుదేరారు .



అన్నయ్యా .......... fruits ఫ్రెష్ గా ఉండగానే అంటీకి ఇచ్చేసివచ్చి మ్యాగీ చేస్తాను అని ఒక ఫ్రూట్ బ్యాగుతీసుకుని కిందకువెళ్లింది . 

రేయ్ కూరగాయలు బయట ఎక్కువసేపు ఉంచరాదు ముందు ఫ్రిడ్జ్ సెట్ చేద్దాము ఓపెన్ చేయరా అని తెరిచి వంట గదిలో ఒక మూలను ఉంచి పిన్ ఉంచి on చేసి కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచి , నెక్స్ట్ కూలర్ ఓపెన్ చేసి ఒకటి బెడ్రూం లో చిన్నదాన్ని హాల్లో ఉంచి నీళ్లుపోసి on చేయగానే చల్లగా గాలి తగలడంతో , చల్లగా ఉంది అన్నయ్యా ..........అని చెల్లి పాత్రలతోపాటు వచ్చింది .

అన్నయ్యా .......... అంటీ మనకోసం కూడా వండారని ఇచ్చారు . మీరు సెట్ చేస్తూ ఉండండి నేను తినిపిస్తాను అని వంట గదిలోకివెళ్లి , wow అప్పుడే ఫ్రిడ్జ్ సెట్ చేసేసారు అని సంతోషంతో ప్లేటులో వడ్డించుకొనివచ్చి , బాత్రూం ప్రక్కనే వాషింగ్ మెషీన్ సెట్ చేస్తుంటే అన్నయ్యా , రేయ్ ......... అంటూ ప్రేమతో తినిపించి తానూ తినింది .



అన్నయ్యా ......... ఒక్కరోజు ఖర్చు 3 లక్షల దాకా అయ్యింది . టీవీ తీసుకోకపోయినా బాగుండేది . 

చెల్లీ , కృష్ణా ........... అని ఇద్దరమూ తలదించుకొని , నీ ప్రాణమైన ఇద్దరికీ క్రికెట్ అంటే ప్రాణం , దాదాపు 9 సంవత్సరాలు చూడలేదు , ఆడలేదు అందుకే .........

టీవీ మీకోసం తీసుకున్నారా .........., ఏదో నాకోసం తీసుకున్నారని పొంగిపోయాను మిమ్మల్నీ అంటూ చెరొక దెబ్బ ప్రేమతో కొట్టి లవ్ యు అన్నయ్యా ........, నాకు కూడా క్రికెట్ గురించి తెలియజేయ్యండి నేనూ మీతోపాటు చూస్తాను అనగానే ,

నాకళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్ళతో చెల్లెమ్మా ..........అంటూ అమాంతం గుండెలపై హత్తుకొని ఉద్వేగానికి లోనయ్యాను .

కృష్ణా .......... same to same ఇలానే అక్కయ్య కూడా అడిగి క్రికెట్ గురించి తెలుసుకుని మాతోపాటు ఎంజాయ్ చేసేవారు . Four సిక్స్ లు పడ్డ ప్రతీసారీ మమ్మల్ని ముద్దులతో ముంచెత్తి కేరింతలు వేసేవాళ్ళము . 

అన్నయ్యా ........ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడుందో అలాగే ఎంజాయ్ చేద్దాము అని నా కన్నీళ్లను తుడిచి చెప్పింది . 

లవ్ యు sooooo మచ్ చెల్లీ ........ అని నుదుటిపై ముద్దుపెట్టి , రేయ్ వాషింగ్ మెషీన్ instructions చదివావా .......... నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ , చూస్తూ మొత్తం సెట్ చేసేసరికి 6 గంటలు అయ్యింది . ఇక నేను మిగతావి arrange చేస్తాను. నువ్వు part time jobs సెర్చ్ చెయ్యమనిచెప్పాను . 



రేయ్ మామా .......... నిన్న ట్రావెలింగ్ లోనే చూసాను రా , work from home opportunities చాలానే ఉన్నాయిరా ........., మన విశ్వ సర్ నిజంగా దేవుడే రా మామా , లాప్టాప్ చేతిలో ఉంటే ఆన్లైన్ లోనే గంటకు 300 నుండి 500 దాకా earn చెయ్యొచ్చురా ........., బయటకు కూడా వెల్లనవసరం లేదురా ..........సింపుల్ data entry jobs .

Wow ......... మామా నువ్వు కేక రా వెంటనే మన ఇద్దరికోసం అప్లై చేయరా అనిచెప్పాను .

అన్నయ్యా .......... బయట అయితే నేనే వద్దు అనేదాన్ని , కానీ ఇంట్లోనే కదా వంట చెయ్యడం పూర్తవగానే ఖాళీ సో నేనుకూడా ...........



చెల్లెమ్మా .......... అమ్మకోరిక డాక్టర్ అవ్వాలని , మెడికల్ ఎంట్రన్స్ కు రెండు నెలలు మాత్రమే ఉంది . నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వు వంట కూడా మేమే చేస్తాముగా ......, ఏరా .........

అంతేరా ......... యూట్యూబ్ ఓపెన్ చేశారంటే ప్రపంచంలోని వంటలన్నీ నీ చెల్లి ముందు ఉంచేయమూ ..........

రేయ్ , అన్నయ్యా .......... అంటూ కళ్ళల్లో చెమ్మతో అమ్మను తలుచుకుని ఎమోషనల్ అవుతోంటే , ముగ్గురమూ హత్తుకొని నా చెల్లిని డాక్టర్ గా చూడాలి దానికోసం మేము 24/7 కష్టపడతాము .



కళ్ళల్లో నీళ్లతోనే మరి అక్కయ్య కోరిక అయిన మీ గోల్ , వాడి సెక్యూరిటీ అధికారి గోల్ ..........

చెల్లీ .......... IPS కావాలంటే డిగ్రీ పూర్తిచేయాలి , వాడి ఇంటర్ మార్క్స్ చూసి ఏ కాలేజ్ అయినా కళ్ళకు అద్దుకుని సీట్ ఇచ్చేస్తారు ఏరా .........

అంతే మామా ......... అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టాడు . 

నిన్న ట్రావెలింగ్ లోనే చూసాను సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ కోర్స్ ఉందని , ప్రతీ సంవత్సరం 30 సీట్లకు గాను 5 , 10 కంటే ఎక్కువ మంది choose చేసుకోవడం లేదు కాబట్టి మీ అన్నయ్యకు కూడా సీట్ దొరికినట్లే , మనం హైదరాబాద్ వస్తామని ముందే తెలిసేకదా ........ నీ ఎంట్రన్స్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నది . సో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఏఏ బుక్స్ కావాలో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వు , దొరకని వాటిని సిటీకి వెళ్లి తీసుకొద్దాము ........... అమ్మకోరిక తీర్చడమే నీ , మా గోల్ అని నుదుటిపై ముద్దుపెట్టి సిటీ అంతా తిరిగి అలసిపోయావు వెళ్లి ఫ్రెష్ అవ్వు చెల్లీ , తరువాత మేము అవుతాము అని కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చి నవ్వించి పంపించాము.



రేయ్ మామా ......... రిప్లై వచ్చేసిందిరా , టైం సెలెక్ట్ చేసుకోమని మనకే ఛాయిస్ ఇచ్చారు . రేపటి నుండి వర్క్ .........

లవ్ యు రా మామా .......... ఫ్రెష్ అయ్యి , ముగ్గురమూ సాఫీగా కూర్చుని చర్చిద్దాము అనిబదులిచ్చాను.



చెల్లి రాగానే , కృష్ణగాడు వెళ్ళాడు . ఆ నెక్స్ట్ నేను బాత్రూమ్లోకి వెళుతూ చెల్లీ వచ్చేలోపు స్ట్రాంగ్ కాఫీ అనిచెప్పి , తలస్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తూ చెల్లెమ్మా కాఫ్...........అంటూనే , ఎదురుగా గోడపై సునీతక్క , కాంచన అక్క ఇద్దరూ చెరొకవైపు నుండి నా బుగ్గలపై , అక్కయ్య వెనుక నుండి ప్రాణంలా నా తలపై  ముద్దులుపెడుతూ మురిసిపోతున్న హాఫ్ ఫోటో ఫ్రేమ్ ను పెదాలపై అంతులేని ఆనందంతో అందుకొని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .



అన్నయ్యా......... అంటూ నాచేతిని చుట్టేసి ముగ్గురు దేవతలు బుజ్జి దేవుడిని , అదే మా బుజ్జి అన్నయ్యను ప్రాణంలా ముద్దులుపెడుతూ ఎంత పరవశించిపోతున్నారో .............

చెల్లీ ........ ఫోటో అని ఆనందబాస్పాలతో తడబడుతున్న మాటతో అడిగాను .

అన్నయ్యా ......... ఈ ఫోటోను మరియు ఒక ఆల్బమ్ కూడా సునీతమ్మను అడిగి తీసుకొచ్చాను . సునీతక్క పెళ్లి అయ్యేంతవరకూ వీటినే చూస్తూ రోజూ చాలా చాలా బాధపడేవారంట . ఇలాంటివే same to same మరొకటి తయారుచేయించి ఆస్ట్రేలియా తీసుకెళ్లారట , అమ్మ నాకు కూడా కావాలని కొరితేనూ.......



లవ్ యు సో సో sooooooo మచ్ చెల్లీ........... ఆల్బమ్ చూసావా అని అడిగాను .

లేదు అన్నయ్యా ......... మీరు వచ్చాక ముగ్గురమూ కూర్చుని ఒక్కొక్క ఫోటో సంతోషమైన సన్నివేశాలను వివరిస్తే , విని తరించాలని ఉంది అన్నయ్యా ....... అని కోరిక కోరడంతో...........

అంతకన్నా అదృష్టమా చెల్లీ అని ఫోటోని గుండెలపై హత్తుకొని మైమరిచిపోతోంటే , 

కృష్ణగాడి ద్వారా సింగిల్ బెడ్ గోడ ముందువేసి లైట్స్ అన్నింటినీ on చేసి ఆనుకుని కూర్చున్నాము . 

చెల్లి మూడు కప్పులలో కాఫీ తీసుకొచ్చి మాకు అందించి నాకు మరొకవైపు కూర్చుని త్వరగా అన్నయ్యా ......... అంటూ ఆల్బమ్ చేతికి అందించింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:48 AM



Users browsing this thread: 41 Guest(s)