Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కారుని సిటీలోకి పోనిచ్చి సరిగ్గా 5 గంటలకు షాపింగ్ మాల్ ముందు పార్క్ చేసి లోపలికి పిలుచుకొనివెళ్లారు . రాధ మీరు లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళండి , ఏమేమి అవసరమో అన్నీ తీసుకో అనిచెప్పారు సర్ , 

విశ్వ నేనుచూసుకుంటాను మీరు వెళ్ళండి , పిల్లలను కూడా పిలుచుకునివెళ్లు అని వెళ్లారు . 

జెంట్స్ సెక్షన్ చేరుకుని మహేష్ , కృష్ణ మీకోసమే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి పిల్లలకు కిడ్స్ సెక్షన్ లో కొనిచ్చి వచ్చేస్తాను . బాబు అన్నీ చూపించు అనిచెప్పారు . 



OK సర్ అని చూపిస్తుంటే , సర్ బాధపడతారేమోనని సర్ వచ్చేలోపు ఇద్దరమూ ఒక్కొక్క డ్రెస్ సెలెక్ట్ చేసి కూర్చున్నాము . 

Wow మహేష్ , కృష్ణ ........... అప్పుడే అయిపోయిందా , గుడ్ ఎన్ని సెలెక్ట్ చేశారు అని అడిగారు . 

సర్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు సర్ . 

What బాబు నీకేమి చెప్పాను అన్నీ చూపించమని చెప్పాను కదా ..........

సర్ వాళ్లే చాలు ............

One మినిట్ అని కాల్ చేసి రాధ అక్కడి పరిస్థితి ఏంటి ..........ఇక్కడ అని వివరించారు . 

ఇక్కడ కూడా same విశ్వ ...........

స్పీకర్ on చెయ్యి , మహేష్ , కృష్ణ , కృష్ణవేణి మినిమం 20 డ్రెస్ లకు తగ్గకూడదు అదే మీకు వేస్తున్న శిక్ష , రాధ ఆ సంగతి చూడు .............

లవ్ యు విశ్వ ........ అని ఫోన్లోనే ముద్దుపెట్టింది మేడం . 

బాబు వాళ్ళను పట్టించుకోకు అన్ని కొత్త మోడల్ డ్రెస్సెస్ చూపించు..........మహేష్ , రాము మీ అన్నయ్యలు సిగ్గుపడుతున్నట్లున్నారు , మీరు సెలెక్ట్ చెయ్యండి అనిచెప్పడం ఆలస్యం , 

ఇక చూసుకో dad అంటూ అప్పటికే సెలెక్ట్ చేసిన డ్రెస్ లెంగ్త్ చూసి ఏకంగా ఇద్దరూ టేబుల్ పైకెక్కి కూర్చుని అన్నీ అవీ ఇవీ అన్నీ చూపించండి అని స్టార్ట్ చేశారు . 

 మేము సెలెక్ట్ చేసుకున్న  డ్రెస్ ఇద్దరికీ అందించి వెళ్లి చేంజ్ చేసుకునిరండి అని ట్రయల్ రూమ్ కు పంపించారు .

సర్ ............

ఇక రేపు ఉదయం వరకూ మీరు నేను చెప్పినట్లుగా వినాలి అని ఉద్వేగంతో ఇద్దరినీ కౌగిలించుకుని , please నేనేమి చెబితే అధిచెయ్యాలి వెళ్ళండి . 

థాంక్యూ సర్ అని కన్నీళ్లను తుడుచుకుని ట్రయల్ రూమ్ కు వెళ్లి చేంజ్ చేసుకునివచ్చాము . 



దాదాపు 9 సంవత్సరాల తరువాత కొత్తబట్టలు వేసుకున్నందుకు ఒకరినొకరము సంతోషంతో చూసుకుని సర్ దగ్గరికి వచ్చాము . 

పర్ఫెక్ట్ మహేష్ , కృష్ణ ............అని ఆనందిస్తుంటే ,

సర్ కు అదేవిషయం ఉద్వేగంతో చెప్పి థాంక్స్ చెబుతూనే ఉన్నాము . 

మహేష్ .........అని కన్నీళ్లను తుడుచుకుని , ముందు ఆ థాంక్స్ లు వదిలెయ్యండి అని , మహేష్ రాము ఎన్ని సెలెక్ట్ చేశారు . 

Dad ఇదిగో ఇది 20th .............అయిపోయింది అని బదులిచ్చారు . 

మరొక 5 సెలెక్ట్ చెయ్యమని చెప్పారు . 

లవ్ యు dad .........., అన్నా ఇప్పుడు ఇటువైపు ఉన్నవి చూపించండి .

కాల్ చేసి రాధ ఇక్కడ కౌంట్ 25 కు పెరిగింది . 

హలో శ్రీవారు 25 దాటి 30 ఇక్కడ అని బదులివ్వడంతో లవ్ యు శ్రీమతి , నాన్నా మహేష్ మీ అమ్మ అక్కడ మీకంటే స్పీడ్ గా 30 దగ్గరకు వెళుతున్నారు . 

అర్థమైంది dad ...........

సర్ ...........

చెప్పాను కదా మహేష్ ఉదయం వరకూ మీ బాస్ నేను అని ఇన్నర్ సెక్షన్ దగ్గరకువెళ్లి మాఇద్దరినీ చూపించి , బ్రాండ్ 10 జతలు ఇవ్వండి అనిచెప్పి వెళ్లి మూడు పెద్ద పెద్ద కొత్త ట్రాలీలతో వచ్చారు . 



పిల్లల సెలక్షన్ అతిపోయాక గంటకు మేడం , మేడం వెనుక నుండి చెల్లీ రెడ్ లెహంగాలో కృష్ణగాడికి కన్నుకొట్టి దేవకన్యలా ముందుకు రావడం చూసి కృష్ణగాడు ఫ్లాట్ అయిపోయి ఒక్కసారిగా వెనక్కు పడిపోతుంటే , చివరి క్షణంలో సర్ తోపాటు ఒకేసారి చూసి నేలకు సెంటీమీటర్ల పైన పట్టుకున్నాము . లేకపోతే దెబ్బలు తగిలేవే .........

చెల్లితోపాటు అందరమూ నవ్వుతోంటే ,

రేయ్ మామా .......... నాకు సిగ్గేస్తోంది రా , ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడురా ......., నాకోసం దేవకన్య అంటూ పరవశించిపోతున్నాడు .

మాదగ్గరకు వచ్చి రేయ్ నన్ను చూడరా అంటే సిగ్గుపడుతున్నావు అని నా మరొకవైపు హత్తుకొని ఎలా ఉన్నాను అని ఇద్దరివైపు చూసి అడిగింది . 

చెల్లీ ......... వాడు చెప్పే పరిస్థితుల్లో లేడు , చూశావు కదా ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే వీపు విమానం అయ్యేది . 

అన్నయ్యా .........మీరు చెప్పండి . 

దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నావు చెల్లీ , అక్కయ్యను గుర్తుచేశావురా...........అని ప్రాణం లా నుదుటిపై ముద్దుపెట్టాను . 

రేయ్ కృష్ణ ........ నేను కూడా అదే చెబుదామనుకున్నాను . 

లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ............అని సడెన్ గా నన్ను హత్తుకునే వాడి బుగ్గపై ముద్దుపెట్టి , ఇలా సిగ్గుపడుతోంటే కొరుక్కుని తినేయ్యాలని ఉందిరా నిన్ను లవ్ యు రా అని చెల్లి కూడా సిగ్గుతో నా గుండెలపై వాలిపోయింది . 



విశ్వ ..........కృష్ణ - కృష్ణవేణి ..........

అవును శ్రీమతి గారు . ఒకరంటే ఒకరికి ప్రాణం ...........

లవ్లీ లవ్లీ ........... ,

అమ్మా .......... అసలు మీది డాడీది లవ్ మ్యారేజేనా ........., వాళ్ళు లవ్ లో ఉన్నారని నాకు తొలిసారి చూసినప్పుడే అర్థమైపోయింది . 

నాక్కూడా ..........బుజ్జి నాన్నా అని విశ్వ సర్ నవ్వుతూ చెప్పారు . 

Sorry ......... అన్నట్లు ఫేస్ ఫీలింగ్ తో చెల్లి తలపై ప్రేమతో స్పృశించారు . 



మన షాపింగ్ అప్పుడే అయిపోలేదు .......... , బాబు అన్నింటికీ ఒకే బిల్ వేసి ఈ మూడు ట్రాలీలలో ఉంచండి అనిచెప్పడంతో తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్లారు .



సర్ కార్డ్ ద్వారా బిల్ పే చేసేసారు . 

సర్ ఇన్ని ఇప్పుడు ..........

మహేష్ ఇన్ని సంవత్సరాలు నా నెంబర్ గుర్తు ఉన్నా నాకు కాల్ చెయ్యనందుకు మీకు నేను విధిస్తున్న శిక్ష ఇది అంతే మాట్లాడకు ..........

Dad , అన్నయ్యకు గిఫ్ట్ ఇచ్చి శిక్ష అంటున్నారు అంటే ఇంకా బోలెడన్ని శిక్షలు ఉన్నాయన్నమాట , 

అవును మహేష్ ...........అంటూ లగేజీ ట్రాలీలను కారుపైన పెట్టించి , అటునుండి మొబైల్ షాప్ చేరుకున్నాము . 



మహేష్ ఇంటర్ పూర్తిచేశారు కదా మరియు నీ టాలెంట్ గురించి కూడా  బావ చెప్పారు . నెక్స్ట్ డిగ్రీ కాబట్టి లాప్టాప్ అవసరం .

సర్ ............అవసరం లేదు సర్ , ఇప్పటికే చాలా డబ్బు మాకోసం ఖర్చు చేశారు . 

మహేష్ ............ చెప్పాను కదా అనేంతలో , 

Dad నేను చెబుతాను . ఇప్పుడు బాస్ dad కాబట్టి అన్నయ్యా సైలెంట్ గా ఉండి శిక్ష అనుభవించాల్సిందే ...........

లవ్ యు కన్నా .......... అంటూ మేడం ప్రాణంలా ముద్దుపెట్టి , కన్నయ్యా ........ మేము మీ అన్నయ్యా , అక్కయ్యల కోసం మూడు లాప్టాప్ లు తీసుకురావడానికి ఎదురుగా ఉన్న షాప్ కు వెళతాము . మీఇద్దరూ దగ్గరుండి మీ అన్నయ్యలకు , అక్కయ్యకు ఇష్టమైన మొబైల్స్ సెలెక్ట్ చేసుకునేలా చూడండి , అమ్మ మొబైల్ మీదగ్గరే ఉంచండి అవసరమైతే కాల్ చెయ్యండి అని అందించి వెళ్తోంటే ,

మేడం .......... వద్దంటే వినరు కాబట్టి ఒకటి తీసుకోండి చాలు ముగ్గురమూ అడ్జస్ట్ చేసుకుంటాము అని చెల్లి చెప్పింది .

శ్రీవారు బాస్ మీరా వాళ్ళా ........., మీకే ఆర్డర్ వేస్తున్నారు అని మాట్లాడటంతో , అందరమూ నవ్వేసాము . 

కృష్ణ ......... మీ విశ్వ సర్ మాంచి ఊపులో ఉన్నారు , ఆపడం ఎవరివల్లా కాదు . 



అక్కయ్యా , అన్నయ్యలూ రండి అని పిల్లలు మా చేతులుపట్టుకొని లోపలికి పిలుచుకొనివెళ్లి మీకు నచ్చినవి సెలెక్ట్ చెయ్యండి అని ఇద్దరూ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుని గేమ్స్ ఆడుతున్నారు . 

రేయ్ మామా , చెల్లీ ........  సర్ ఇప్పటికే వేళల్లో ఖర్చు చేశారు  , ఖర్చు చేస్తున్నారు .

అవునన్నయ్యా .......... ఇప్పుడు మొబైల్స్ లాప్టాప్స్ అంటే లక్షల్లో అవుతుంది .

కాబట్టి ఏవైనా చిన్న మొబైల్స్ సెకండ్ హ్యాండ్ తీసుకుందాము అని సేల్స్ మ్యాన్ కు చెప్పాను . 

అతడు మావైపు కాస్త వింతగా చూసి ఒక బాక్స్ తెచ్చి ఏవి కావాలో తీసుకోండి అని వెళ్ళిపోయాడు . 

అలాంటివన్నీ పట్టించుకునే స్థితిలో మేము ముగ్గురమూ లేము . నా అక్కయ్య లేని జీవితం .......... అని హృదయం చలించిపోతుంటే , అన్నయ్యా ........ అంటూ నా చేతిపై ముద్దుపెట్టి ఇక రేపటితో బయటకు అడుగుపెడుతున్నాను . హైద్రాబాద్ వెళ్ళిపోయి వీధివీధి వెతికి అక్కయ్యను చేరుకుందాము అని చెల్లి చెప్పడంతో , 

లవ్ యు చెల్లీ ........... అని కన్నీళ్లను తుడుచుకుని మూడు మొబైల్స్ సెలెక్ట్ చేసి , తమ్ముడూ అయిపోయింది అని పిలిచాము . 



గేమ్ మధ్యలోనే ఆపేసి వచ్చి ఏదీ మొబైల్ బాక్స్ లు ఎక్కడ అక్కయ్యా ........ అని అడిగారు . 

ఇదిగో ఇవే తమ్ముడూ అని కృష్ణగాడు మూడు పాత మొబైల్స్ చూపించాడు . 

ఇవి మొబైల్సా .......... అని వాటిని బాక్స్ లోకి వేసేసి , మొబైల్ అంటే ఇలాంటివి అని తన చేతిలోని స్మార్ట్ మొబైల్ చూపించి  ఉండండి నాన్నకు కాల్ చేస్తాను , మీకు బుద్ధిగా చెబితే వినరు అని కాల్ చేయగానే రాము కట్ చేసేసాడు .

రేయ్ ఈ విషయం చెబితే మీరిద్దరూ ఏమిచేస్తున్నారు , గేమ్స్ ఆడుతున్నాము కదూ అని తెలిసిపోతుంది . ఏదో చూసుకుంటాము అని పోటుగాళ్ల మాదిరి బయట మాట్లాడాము మన ఇజ్జత్ కే సవాల్ రా .......మనమే చూసుకోవాలి ఇక అని రంగంలోకి దిగి , 

అన్నా ......... మొబైల్స్ చూపించండి అనిచెప్పారు . 

అక్కడ బాక్స్ లో ఉన్నాయికదా చూసుకోండి అని వెటకారంగా మాట్లాడాడు . 

ఇలా కాదు అని ఇదిగో అన్నా మా అక్కయ్యకు ఐఫోన్ .........అనగానే , 

సర్ .......... అంటూ వచ్చి ఐఫోన్ లో ఏ మోడల్ సర్ అని అడిగాడు . 

ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ ...........

ఆ సమయానికి ఐఫోన్ 7s ట్రెండింగ్ లో ఉన్నట్లు కలర్స్ తెచ్చి చూపించాడు . 

గోల్డ్ , వైట్ , పింక్ ....... yes yes మా అందమైన దేవత లాంటి అక్కయ్యకు పింక్ పర్ఫెక్ట్ అని చెల్లి చెవిలో గుసగుసలాడి పింక్ సెలెక్ట్ చేశారు . 



ఇక మా అన్నయ్యలకోసం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ చూపించండి అని చెప్పారు .  అక్కయ్యా సెలెక్ట్ చెయ్యండి అని చెప్పారు . 

పిల్లలను ఇంకా షాక్ లోనే చూస్తున్న చెల్లి సరే సరే తమ్ముళ్లూ అని నవ్వుకుని ఒక్కొక్కటే చూస్తుంటే ,

అక్కయ్యా .......చిన్నవి కాదు పెద్దవి అంటూ చిన్నవన్నింటినీ ప్రక్కకు తీసేసారు . 

లవ్ యు తమ్ముళ్లూ........ అని కురులపై ప్రేమతో ముద్దులుపెట్టి రెండు 5.5 స్క్రీన్ స్మార్ట్ మొబైల్స్ సెలెక్ట్ చేసి తమ్ముళ్లూ ఇవి నాకు నచ్చాయి . 

Wow సూపర్ గా ఉన్నాయి అక్కయ్యా ......... , అన్నయ్యలూ మీకు నచ్చాయా ....., అయినా కృష్ణవేణి అక్కయ్య ఏది సెలెక్ట్ చేసినా మీకు పిచ్చి అని మాకు తెలియదా అని సంతోషిస్తుంటే , 



పిల్లలూ ......... మీ అన్నయ్యలూ , అక్కయ్య సెలెక్ట్ చేశారా అని విశ్వ సర్ లోపలికివస్తూ అడిగారు . 

ఇదిగొండి dad అని మూడు మొబైల్స్ చూపించారు .

లవ్లీ లవ్లీ ......... ఇంకా నేనొచ్చి కోప్పడీ ఇప్పించాలని అనుకున్నాను . 

Dad ......... కొద్దిసేపటి ముందు వచ్చి ఉంటే అదే జరిగేదే , కానీ మెమెందుకు ఉన్నది అని కాలర్ ఎగరేసి గర్వపడుతూ చెప్పి , లవ్ యు రా రాము అని చెవిలో గుసగుసలాడి హత్తుకున్నాడు .



బాబు మూడు మొబైల్స్ లో సిమ్స్ వేసేయ్ అని సర్ చెప్పారు .

ప్రూఫ్ అడగడంతో , సర్ ID కార్డ్ చూపించగానే sorry సర్ అని , మొబైల్స్ బాక్సస్ ఓపెన్ చెయ్యమని మాకే అందించి , చెల్లి తమ్ముళ్లూ ఉత్సాహంతో తీసి లవ్ యు తమ్ముళ్లూ మీ సెలక్షన్ సూపర్ అని మళ్ళీ ముద్దులుపెట్టింది . 

షాప్ అతడు చకచకా సిమ్ లు వేసి ఏకంగా ఆక్టివేట్ చేసి అందించాడు . 

 సర్ థాంక్స్ చెప్పి బిల్ రెడీ చెయ్యమని , మూడు లాప్టాప్ లు తెరిచి చూపించారు . 

సర్ చూస్తుంటే costly గా ఉన్నాయి మేము తీసుకో..........

మహేష్ ప్రతీదానికీ ఇలా అన్నావంటే నాకు కోపం ఎక్కువ కొట్టేస్తాను . 

అవునవును అన్నయ్యా ..........అని తమ్ముళ్లు గట్టిగా నవ్వడంతో అందరమూ నవ్వేసాము .



బిల్ పే చేసి రాధ ఇంకేమి కావాలి డిగ్రీ వెళ్లబోవు పిల్లలకు అని సర్ అడిగారు . 

చాలాకావాలి శ్రీవారు .........

మేడం ........ please please ఇక ఇంటికి వెళ్లిపోదాము ఆకలి వేస్తోంది అని చెల్లి ఊరికే చెప్పింది . 

విశ్వ .......... ఇప్పటికి చాలు , నువ్వు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నావో ఆ డబ్బుని ఇచ్చెయ్ , వాళ్లకు కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు . 

గుడ్ ఐడియా రాధ .......... అని కొత్త మొబైల్స్ నుండి తమ ఇద్దరి మొబైల్స్ కు కాల్స్ ఇచ్చి , ఇక మీరు ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది . అవి మా నెంబర్లు అని సేవ్ చేసి మాకు మొబైల్స్ అందించారు . 

వణుకుతున్న చేతులతో అందుకోగానే ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేసాయి . 

మహేష్ ......... రేపు ఉదయమే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది . మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ మీ క్షేమం కోరుకునే మేము ఉన్నామని మరిచిపోకండి . డబ్బు శాశ్వతం కాదు నాకు మీరే ముఖ్యం , నేను సెంట్రల్ govt సెక్యూరిటీ అధికారి ని డబ్బుకు లోటు ఉండదు , నీవలన ప్రమోషన్ వచ్చిందని నేను స్వార్థంతో ఇలా చెయ్యడం లేదు , నేను కానిస్టేబుల్ గా ఉన్నాకూడా ఇలానే చేసేవాణ్ణి , మీకోసం ఏమైనా చేస్తాను మోహమాటపడకుండా అడగండి . మీరు ఎక్కడ ఉన్నా సంతోషన్గా ఉండాలి మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ఉద్వేగంతో కౌగిలించుకొన్నారు . 

కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ sooooo మచ్ సర్ అని కౌగిలించుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:44 AM



Users browsing this thread: 57 Guest(s)