Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
విశ్వ ఆ అధికారం నాకు లేదు . నాకే ఉండి ఉంటే వీళ్ళను ఎప్పుడో బయటకు పంపించేసేవాణ్ణి , వీళ్ళంటే నాకు కూడా అభిమానమే ...........

బావ మీరు జైలర్ మీరు అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు .

చెయ్యొచ్చు విశ్వ కానీ భవిష్యత్తులో నా స్థానంలో మరొకరు ఎవరైనా వస్తే మళ్లీ వీళ్లకు సమస్య రావచ్చు . ఇంతకంటే పెద్ద శిక్ష పడొచ్చు .

బావ అంతేనా ........ మీరేమీ చెయ్యలేరా , 

నా చేతిలో ఉంటే చేసేసేవాణ్ణి విశ్వ , వాళ్ళ అదృష్టం ఇంతే అని శిక్ష మొత్తం పూర్తిచేయ్యాల్సిందే . 



బావ ......... చివరగా అడుగుతున్నాను .

జైలర్ సర్ మౌనం...........

బావ హోమ్ మినిస్టర్ రేకమండేషన్ తీసుకొస్తే అప్పుడేమి చేస్తారు ...........

విశ్వ......... అంటూ జైలర్ గారు కాస్త కంగారుపడటం గమనించి , మీరు సూపర్ సర్ మీకు స్టేట్ హోమ్ మినిస్టర్ గారు తెలుసా ........ అని కృష్ణగాడు అడిగాడు .

అంతకంటే powerful కృష్ణ మా అక్కయ్య , ఇంటిలో మా అక్కయ్యనే మా బావకు జైలర్ ..........., అందుకే ఉదయం అనగా వచ్చి ఒకేసారి రాత్రికే ఇంటికివెళ్ళేది అని కృష్ణగాడి చెవిలో గుసగుసలాడాడు .

సర్ .......... ఇక్కడ జైల్లో సర్ అంటే ప్రతీ ఖైదీకి ఉచ్చ , ఎవరైనా హద్దుమీరితే గన్ తో కాళ్లకు కాల్చేస్తారు ........... ఇలా ఎంతమందిని హాస్పిటల్ పాలుచేసారో ఎవ్వరిని అడిగినా చెబుతారు .



బావ .......... ఇక్కడ మీ ఫాలోయింగ్ కేక , కానీ ఇంటిలో అక్కయ్యదే రాజ్యం , నేను చెప్పినట్లు చేస్తారా లేక అక్కయ్యకు కాల్ చెయ్యమంటారా........., కృష్ణ ఇంట్లో మీ సర్ మీద ఎన్ని పప్పు గిత్తిలు , ఎన్ని గరిటె లు విరిగాయో ......... నాలుగు గోడలు మరియు పిల్లలకు తప్ప ఎవ్వరికీ తెలియదు కదా బావ అని ఇద్దరికీ వినిపించేలా చెప్పడంతో , 

సర్ నుదుటిపై చెమటతో మరింత కంగారుపడటం చూసి కృష్ణగాడు లోలోపలే నవ్వుకుని , సర్ అలా ఎలా సర్ అని అడిగాడు . 

కృష్ణ నేనూ గమనించాను లవ్వా ...........

అవును సర్ అని చెల్లివైపు చూసి సిగ్గుపడ్డాడు . 

అయితే త్వరలోనే నీకూ పూర్తిగా అర్థమైపోతుందిలే , మన మగవాళ్లకు ఎవరైనా చెబితే ఈగో .........., కానీ పెళ్ళైన కొన్నిరోజులకే తెలుసుకున్నా అప్పటికే తమ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది . ఇక ఏమీ చేయలేక వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ , బయట మాత్రం గంభీరంగా ఉన్నట్లు నటిస్తాము . 

సర్ నటిస్తాము అంటున్నారు ........ మీరు కూడా , 

అవును కృష్ణ నేను మా బావ ముందు నుండీ బంధువులమే , బావ అక్కయ్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు , నేను బావ చెల్లెల్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను . ఇప్పుడు ఇద్దరూ వాళ్ళ కింద బానిసల్లా ............వద్దులే చెప్పుకుంటే కన్నీళ్లు ఆగవు అని బాధ ప్లస్ నవ్వుతో చెప్పారు .

కృష్ణగాడు ప్రక్కనే ఉన్న చెల్లివైపు చూస్తే , ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి అంతేమరి అంటూ ముసిముసినవ్వులతో కన్నుకొట్టింది .

అందుకే సర్ పల్లెటూళ్ళు దేశానికి ఆదర్శం అన్నది . మా ఊళ్ళో మా అమ్మ మా నాన్నతో మాట్లాడాలంటేనే ఎంత భయపడిపోతారో .......... భర్త అంటే దేవుడిలాగా ..........

ఊ ఊ.......... అని చెల్లి సైగలుచెయ్యడంతో , కృష్ణగాడు సైలెంట్ అయిపోయి తలదించేసుకున్నాడు . 

కృష్ణ ఇదే ఇదే ............మన రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉండటం అంటే , ఇక నీకు తోడుగా ఆ భగవంతుడే ఉంటాడు మాలాగా అని నవ్వుతూనే ఉన్నారు . 



బావ .........  చెప్పండి అక్కయ్యకు కాల్ చెయ్యమంటారా ...........

విశ్వ ........అంటూ మాకు దూరంగా వెళ్లి please please please ............వద్దు అంటూ చేతులుపట్టుకొని బ్రతిమిలాడుతుంటే , కానిస్టేబుల్ సర్ తోపాటు ముగ్గురమూ నవ్వుకున్నాము . 

బావ ......... ఏమైనా చేరి పిల్లలను బయటకు తీసుకువెళతాను అంతే , ఇంతకీ వాళ్ళ శిక్ష ఫైల్ ఎక్కడ అని అడిగారు . 

కానిస్టేబుల్ సర్ ను తెమ్మని ఆర్డర్ వేశారు . 

దుమ్ముపట్టిపోయిన ఫైల్ దుమ్ము దులిపి ఓపెన్ చేసి పేపర్స్ తిరగేసి , యాహూ దొరికింది బావ చూడు " సత్ప్రవర్తన " ......... ఆ పదాన్ని అండర్లైన్ చేశారు . 



విశ్వ .......... ఈ 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎప్పుడూ హద్దుమీరలేదు , రూల్స్ బ్రేక్ చెయ్యనేలేదు ఇకచూసుకో అని తన ఆఫీస్ లోకి పరుగున వెళ్లారు . 

మహేష్ , కృష్ణ ...........రండి అని ముగ్గురినీ పిలిచి రూమ్ లోకి పిలుచుకొనివెళ్లి , బావ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినా అది మంచికోసమే అయ్యేది , ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా పట్టించుకోను వాళ్ళు ముగ్గురినీ ఇప్పుడే బయటకు తీసుకువెళ్లిపోతాను .



జైలర్ సర్ సంతోషంతో ల్యాండ్ లైన్ నుండి కాల్ చేసి జడ్జి సర్ ........ అంటూ మొత్తం వివరించారు . 

స్పీకర్ on చెయ్యమని చెప్పినట్లు చేశారు . 

మహేష్ ...........ఈ విషయం మూడేళ్ళ క్రితం నాకు తెలిసినా .........క్షమించండి నేనే మీకు శిక్ష వేసింది కానీ రోజుకు వందల్లో కేసులు గుర్తుపెట్టుకోలేదు అని బాధపడి , జైలర్ గారు మీ బావమరిది విశ్వ అన్నారు కదూ ........ థాంక్యూ soooooo మచ్ విశ్వ .......... , నేనిప్పుడు ఢిల్లీ లో సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ జడ్జీల మీటింగ్ కు హాజరయ్యాను . ఇప్పుడే వైజాగ్ వచ్చేసి అటు నుండి ఉదయానికల్లా రాజమండ్రికి వచ్చేస్తాను . పిల్లలకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లెం లేకుండా నేను రిలీజ్ అయ్యేలా చేస్తాను , మహేష్ i am really really sorry ........... అనిచెప్పగానే , 

కానిస్టేబుల్ గారు సంతోషం పట్టలేక మహేష్ .........రిలీజ్ అయిపోయినట్లే అని గట్టిగా కేకలువేశారు . 

విశ్వ ...... అంటూ జైలర్ గారు ఆనందంతో కౌగిలించుకొన్నారు . 



అన్నయ్యా , రేయ్ మామా .......... అంటూ అక్కయ్యను చేరుకోవడానికి తొలి అడుగు పడిందని ఆనందబాస్పాలతో మురిసిపోతున్న నన్ను చెరొకవైపు హత్తుకుని అంతులేని ఆనందంతో పొంగిపోతున్నారు . 

విశ్వ సర్ కు రెండుచేతులతో నమస్కరించాను .

మహేష్ .......... అంటూ దగ్గరికివచ్చి ఆపి , అమాంతం కౌగిలించుకుని తప్పంతా నాది, మీరు జైల్ కు వచ్చిన మొదటిరోజే నేను ఇలా రావాల్సింది .

మన్నించండి అలా ఎప్పటికీ జరిగి ఉండకూడదు అని చెల్లివైపు ప్రాణంలా చూస్తూ చెప్పాను . 

అన్నయ్యా .......... నాకొసమే కదా , లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అని కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది . 

నువ్వు లేని జీవితం మాకెందుకు చెల్లీ ......... , ఇక నిన్నూ అక్కయ్యనూ కలపడమే నా ఏకైక గోల్ అని కృష్ణగాడిని కూడా ఉద్వేగంతో హత్తుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను . 

విశ్వ సర్ కన్నీళ్లను తుడుచుకుని మహేష్ ఇక్కడ ఇక్కడ ఉంటావు అని హృదయాన్ని చూపించి , బావ ఇక వీళ్ళను జైల్లో ఒక్కనిమిషం కూడా ఉంచలేను , మన ఇంటికి తీసుకువెళతాను అనిచెప్పారు . 

నేను కాదంటే నువ్వు వధులుతావా .........హోమ్ మినిస్టర్ అని నన్నే భయపెడతావు , వెళ్ళండి నేను చూసుకుంటాను అని సైగ చేశారు .



సర్ జైలర్ మేడం పర్మిషన్ తీసుకోవాలి . 

Yes మహేష్ రండి నేనూ వస్తాను అని నలుగురమూ లేడీస్ జైల్ చేరుకుని బయట వేచిచూస్తుంటే , చెల్లి సంతోషంతో పరుగునవెళ్లి కొద్దిసేపటితరువాత మేడం తోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు .

మహేష్ , కృష్ణ .......... నా బంగారు తల్లి మీరు వచ్చాకే నవ్వడం చూసాను , అది రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గలేదు . వెళ్ళిరండి మిగతా విషయాలు ఉదయం మాట్లాడదాము అని సంతోషంతో చెప్పడంతో , అమ్మా జాగ్రత్త అని గుండెలపై వాలి నుదుటిపై ప్రాణమైన ముద్దుని అందుకొని వచ్చి కృష్ణగాడి చేతివేళ్ళతో పెనవేసింది , మేడం కు థాంక్స్ చెప్పి సంతోషంతో బయటకు అడుగులువేశాము .

విశ్వ సర్ తన కారులో మమ్మల్ని పిలుచుకునివెళుతూ క్షమించు మహేష్ ఈ తొమ్మిదేళ్లూ నేను నార్త్ జోన్ రైల్వే లో పనిచేయడం వలన అక్కడే ఉండిపోయాను . 

నా ఎనిమిదేళ్ల కొడుకు మనం తొలిసారి కలిసినప్పటి నీవయసు , ఎందుకో ఏమో తెలియదు నేను మిమ్మల్ని కలవడం కోసమేనేమో నాన్న నేను పుట్టినప్పటి నుండి మన సొంత ఊరిని చూడలేదు వెళదాము నాన్న అని మొన్న కొరగానే , లీవ్ తీసుకుని ట్రైన్ లో వచ్చేసాను , మిమ్మల్ని కలుసుకోగలిగాను . ఇంటికి వెళ్ళగానే లవ్ యు రా అంటూ గట్టిగా హత్తుకొని ప్రాణమైన ముద్దుపెట్టాలి వాడికి . 



సర్ ఏది జరిగినా మన మంచికోసమే అనుకోవాలి . ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు , మీరు ఫీల్ అవ్వకండి . ఇంతకీ బాబు పేరు చెప్పలేదు అని ముగ్గురమూ ఒకేసారి అడిగి నవ్వుకున్నాము . 

ఇంకెవరి పేరు పెట్టి ఉంటాను కృష్ణా ......... గెస్ చెయ్యండి అని సంతోషన్గా చెప్పారు . 

ఇద్దరమూ ఆలోచిస్తుంటే , సర్ మా అన్నయ్య పేరే కదా మహేష్ ........ అని చెల్లి టకామని చెప్పేసింది . 

You are right ..........అమ్మా , మహేష్ తప్ప ఇంకెవరి పేరు పెడతాను . ఆరోజు ట్రైన్ లో జరిగింది అప్పట్లో లవ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాణ్ణి మొత్తం చెప్పాను . అప్పటి నుండీ నిన్ను కలవాలని చాలా ఆశపడుతోంది .  

నాకు అప్పుడే ట్రాన్స్ఫర్ అవ్వడంతో కూడర్లలేదు .  కొన్ని నెలల తరువాత మా పెళ్లి ఫిక్స్ అవ్వడం , పెళ్లికి మహేష్ ను ఆహ్వానించరా అని తనే ఆర్డర్ వేయడంతో , పెళ్ళిపత్రికలు తీసుకుని మీరు దిగిన గుంటూరు మొత్తం మీకోసం వెతికాను లాభం లేకపోయింది . ఇద్దరమూ చాలా బాధపడ్డాము . అందుకే మహేష్ పేరుని బాబుకు పెడదామని తనే ముందు అడగడం , ఇలాగైనా నిన్ను రోజూ తలుచుకోవచ్చు అని గ్రాండ్ గా ఫంక్షన్ జరిపించి మహేష్ అని నామకరణం చేసాము . మహేష్ పేరు పెట్టిన క్షణం నుండీ వాడు నీలానే , నీ అంత ఎనర్జీతో ఉండటం చూసి చాలా ఆనందించేవాళ్ళము అని కారుని ఆపి రండి మీ మేడం , బుజ్జి మహేష్ మరియు మీ జైలర్ సర్ హోమ్ మినిస్టర్ వాళ్ళ పిల్లలను కలుద్దురుగానీ అంటూ రెండంతస్థుల పెద్ద ఇంటిలోపలికి పిలుచుకొనివెళ్లబోతోంటే , 

 జైల్ నుండి సరాసరి ఇంటిలోకి వెళ్లాడమా అంటూ ముగ్గురమూ గుమ్మం దగ్గరే ఆగిపోయి తలదించుకున్నాము .

మహేష్ డోంట్ ఎవర్ థింక్ అబౌట్ ఇట్ లోపలికి రండి, రాధా ............ ఎవరొచ్చారో చూడు అంటూ కేక వేశారు . 



సర్ మేడం వాళ్ళు .............

ఏంటి విశ్వ అంత సంతోషంతో పిలిచావు అని మేడం , మరొకరు మరియు ఇద్దరు పిల్లలు వచ్చారు . 

రాధ ఎవరో చెప్పుకో చూద్దాము అని మావైపు అమితమైన సంతోషంతో చూపించారు.

విశ్వ నువ్వు ఇంత సంతోషంగా అన్నావంటే ఖచ్చితంగా మహేషే అయ్యుంటాడు .......... , మహేషే కదా .........మరి ఎందుకు బయటే నిలబెట్టావు విశ్వ ........

అనుకోని కారణాలతో 14 సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పటికే 9 సంవత్సరాలు అనుభావించారు , బావగారికోసం జైల్ కు వెళ్ళినప్పుడు చూసి వెంటనే పిలుచుకునివచ్చాను . వాళ్ళు లోపలికి వస్తే మీరేమైనా బాధపడతారేమోనని బయటే ఉండిపోయారు .



అదిగో నువ్వు సంవత్సరాలుగా చూడాలని ఎదురుచూస్తున్న మహేష్ , తన ప్రాణ మిత్రుడు కృష్ణ , ప్రాణమైన చెల్లెలు కృష్ణవేణి.

విశ్వ మహేష్ ను చూస్తున్నందుకు సంతోషించాలా , 9 సంవత్సరాలు జైలులో శిక్షను అనుభవించినందు బాధపడాలా ......... మహేష్ , కృష్ణ , కృష్ణవేణి లోపలకు రండి అని కళ్ళల్లో చెమ్మతో చెల్లి చేతిని అందుకుంది .

మేడం ........అంటూ నావైపు చూసింది . 

చెల్లీ నువ్వొక్కటే లోపలికివెల్లు , మేడం మేము మర్డర్ చేసాము అని తలదించుకున్నాము . 

మహేష్ ......... ఖచ్చితంగా నువ్వు ప్రాణమిచ్చే వాళ్లకోసమే అయ్యుంటుంది అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పడంతో , 

కళ్ళల్లో చెమ్మతో మేడం వైపు చూసాను . 

నిజమే కదా ........, నిజం కాకపోయినా పర్లేదు ముందు లోపలికి రండి అని చెల్లి చేతిని లాగింది . 

వెళ్లు చెల్లి అని సైగ చేసి ముగ్గురమూ లోపలికివెళ్లాము . 

వదినా ............

మహేష్ అంటే నువ్వేనా బాబు , మావారు కూడా అప్పుడప్పుడూ మీగురించి ఆలోచిస్తూ బాధపడేవారు , రండి సోఫాలో కూర్చోండి అని ఆహ్వానించారు . 

పిల్లలూ రండి అని పిలిచి మహేష్ వీడి పేరు కూడా మహేషే , నీపేరు పెట్టుకున్నాము . పిల్లలూ అన్నయ్యా , అక్కయ్యను ప్రాణంలా చూసుకోవాలి అని ముద్దుపెట్టి చెప్పారు.

అలాగే అమ్మా hi మహేష్ అన్నయ్యా ........., hi అన్నయ్యా , అక్కయ్యా ........ మీ పేర్లు తెలియదు కదా అందుకే అలాపిలిచాను , ఏమీ ఫీల్ అవ్వకండి అని ముద్దుముద్దుగా మాట్లాడటంతో , 

ముగ్గురమూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని hi మహేష్ అని పలకరించాము .

మహేష్ , నిన్ను కౌగిలించుకోవచ్చా ............ ఆ పేరంటే మా ఇద్దరికీ ప్రాణం అని చెల్లెమ్మ కోరడం ఆలస్యం , 

అలాగే అక్కయ్యా అంటూ వెళ్లి చెల్లి గుండెలపై వాలిపోయాడు .

నా పేరు కృష్ణవేణి మీ మహేష్ అన్నయ్య ప్రియమైన చెల్లిని , వీడు ....... అని నవ్వుకుని ఈయన కృష్ణ మీ మహేష్ అన్నయ్య ప్రాణ మిత్రుడు . స్నేహం కోసం ప్రాణాళిస్తారు . 

గ్రేట్ అక్కయ్యా ........., నేనూ అలాంటి ఫ్రెండ్ కోసమే ఆశతో ఎదురుచూస్తున్నాను , దొరుకుతాడా .......... 

నీ పేరులోనే ఆ మహత్యం ఉంది తమ్ముడూ ........., అతిత్వరలోనే నీకు కృష్ణలాంటి ప్రాణమిత్రుడు నీ చెంతకు చేరుతాడు . 

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అక్కయ్యా ............

ఈ క్షణం నుండి మహేష్ పేరుతో ఒక అన్నయ్య , ఇప్పుడు ఈ ముద్దుల తమ్ముడు . తమ్ముడూ నీ బుగ్గపై ముద్దుపెట్టొచ్చా ............

అక్కయ్యా ............ అమ్మ చెప్పింది కదా మిమ్మల్ని ప్రాణంలా చూసుకోవాలని , మీరు ఎన్ని రోజులు ఉంటే అన్నిరోజులు నేను , వాడు రాము రారా అనిపిలిచి పరిచయం చేసి , మేము మీ బానిసలం మీఇష్టం ఎలాగైనా వాడుకోండి అని బుగ్గను చెల్లి కి అందించాడు . 

అందరూ సంతోషంతో నవ్వుతోంటే ,

విశ్వ సర్ ......... నిజమే మా అన్నయ్యే , ఆ పేరులోనే మ్యాజిక్ ఉంది అని పిల్లలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది . 



ఇంతలో మేడం వాళ్ళు లోపల నుండి స్నాక్స్ , జ్యూస్ , కేక్ , ఐస్ క్రీమ్ ...........ఇలా అన్నీ ఒకటి తరువాత ఒకటి తెచ్చి మా ముందు ఉంచుతూనే ఉన్నారు . 

సర్ ఇవన్నీ ............. మీరు చూపిస్తున్న అభిమానం చాలు అనిచెప్పాము . 

అక్కయ్యా , అన్నయ్యా .......... ఇవన్నీ అంటే మాకు చాలా చాలా ఇష్టం , చాలా ఆకాలేస్తోంది  

కన్నా మహేష్ , రాము ..............

Wait wait mom మీకు ప్రతీది ఆత్రమే ,

తమ్ముళ్లూ తీసుకోండి ......... అన్నీ మీకోసమే అని చెల్లి అందించింది .

చాలా అంటే చాలా ఆకలిగా ఉంది అక్కయ్యా , ఎంతంటే మరు నిమిషంలో తినకపోతే కడుపు నొప్పి వచ్చినా వచ్చేస్తుంది . 

అయితే వెంటనే తినాలి తమ్ముళ్లూ .............అని కంగారుపడుతూ అందించింది .



అక్కయ్యా .......... మీరు తింటేనే మేము తినేది .

అంతే విశ్వ సర్ మరియు మేడం లిద్దరూ చప్పట్లు కొట్టి , లవ్ యు లవ్ యు కన్నయ్యలూ..........., ఊరికే అపార్థం చేసుకున్నాము అంటూ చేతులను చెవులపై వేసుకుని దీనంగా ముఖం పెట్టి లవ్ యు చెప్పారు . 

అక్కయ్యా ......... ఇదిగో ఇక్కడ నొప్పి నెమ్మదిగా స్టార్ట్ అవుతోంది , స్స్స్.......... అనగానే ముగ్గురమూ చేతుల్లోకి తీసుకున్నాము . 



తమ్ముళ్లూ మీరూ తీసుకోండి .

నాకు తినడం రాదు అక్కయ్యా ......... తినిపించాలి . మూడు పూటలూ అమ్మనే తినిపిస్తుంది . 

అన్నయ్యా , రేయ్ ..........అంటూ ఇద్దరూ నావైపు సంతోషంతో చూసారు . 

కృష్ణ .........మహేష్ కూడా అంతేనా , ఇప్పుడు అర్థమయ్యింది ఈ అలవాటు ఎక్కడ నుండి వచ్చిందో ..........అని మేడం సంతోషించింది .

అన్నయ్యా .......... మీకు కూడా తినడం రాదా , యాహూ .......... అమ్మా ఇంత వయసొచ్చింది తినడం రాదు అని తియ్యగా కొప్పాడతారు .

లవ్ యు కన్నా .........., ఇక ఇప్పటి నుండి నీకు పెళ్ళాం వచ్చేన్తవరకూ నేనే తినిపిస్తాను . ఎందుకంటే ఆ తరువాత నీ పెళ్ళాం తినిపిస్తుంది కదా అని చెప్పడంతో , తమ్ముడి ముఖం చూసి అందరమూ నవ్వుకున్నాము . 



కోపంతో వెళ్లి మేడం బుగ్గపై కొరికేసివచ్చి , మహేష్ అన్నయ్యా ........ మీరు నా అంత వయసులోనే నాన్నకు ప్రమోషన్ వచ్చేలా చేశారట కదా , థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా .......... మిమ్మల్ని కౌగిలించుకుని మీపై కూర్చోవాలని ఉంది .

తమ్ముడూ ............ నీఇష్టమే మాఇష్టం కానీ జై ......... డ్రెస్ సరిగ్గా ఉతుక్కోలేదు స్మెల్ వస్తుంది . నన్ను మన్నించు తమ్ముడూ ....... అని తలదించుకున్నాను . 

నాకు తెలుసు అన్నయ్యా జైల్లోనే కదా , మా అన్నయ్య ఎలా ఉన్నా నాకిష్టమే అని గట్టిగా కౌగిలించుకోవడంతో , కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి విశ్వ సర్ , మేడం వైపు చూసాను . 

వాళ్ళ కళ్ళల్లోకూడా చెమ్మతో go on అని సైగచెయ్యడంతో , థాంక్స్ తమ్ముడూ నిన్ను నువ్వు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోము అని మనసారా హత్తుకున్నాను .

లవ్ యు అన్నయ్యా ......... అని నా ఊతపదాన్ని పలకడంతో , చెల్లి మురిసిపోయింది . 

తమ్ముడు నాపై కూర్చుని , అక్కయ్యా ........ మీరుమాత్రమే తినడం కాదు అన్నయ్యకు కూడా నాలాగే చేతితో తినడం రాదు కదా ఐస్ క్రీమ్ తినిపించండి అని ఆర్డర్ వేసాడు . 

లవ్ యు తమ్ముడూ అని వేరే స్పూన్ అందుకోబోతుంటే , ఊహూ ........ అన్నయ్యకు ఎలా తినిపించేవారో అలాగే తినిపించండి అనిచెప్పడంతో , చెల్లీ మేడం వైపు చూసి ఆనందబాస్పాలతో తినిపించమని చెబితే తినిపించింది . 

ఇప్పుడు అన్నయ్యకు ............

తమ్ముడూ నాకు సిగ్గేస్తోంది అని చెవిలో గుసగుసలాడాను . 

 నవ్వుకుని అమ్మా , నాన్న మీరంతా వెనక్కుతిరగండి అనిచెప్పాడు . 

వెనుతిరగడంతో అక్కయ్యా .........కానివ్వండి .

లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని ఐస్ క్రీమ్ స్నాక్స్ తిన్నాము .



రాధ రెడీ అవ్వు బయటకు వెళుతున్నాము .

అక్కడికే కదా .......... లవ్ యు sooooo మచ్ విశ్వ అని సంతోషంతో గుండెలపై వాలి 15 నిమిషాలలో రెడీ అయ్యి వచ్చారు . 

వదినా ........ ఇంకా రెడీ అవ్వలేదా ........

మీరు వెళ్ళండి మన ప్రియమైన గెస్ట్స్ కోసం ఘుమఘుమలాడే అన్ని వంటలూ చేస్తాను అనిబదులిచ్చారు . 

లవ్ యు లవ్ యు soooooo మచ్ వదినా ...........

అక్కా .......... నాన్ వెజ్ పంపిస్తాను అధిరిపోవాలి అని విశ్వ సర్ చెప్పి , మహేష్ , కృష్ణ రండి వెళదాము అని పిల్లలతోపాటు బయటకువచ్చి , కారులో ముగ్గురమూ వెనుక పిల్లలు మాపై కూర్చుంటాము అని కూర్చున్నారు . విశ్వ సర్ మేడం ముందుకూర్చుని కారుని పోనిచ్చారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:44 AM



Users browsing this thread: 55 Guest(s)