Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్యకు శాశ్వతంగా దూరమైనట్లు పీడకల రావడంతో సడెన్ గా మేల్కొని ముఖమంతా చెమటతో ఊపిరాడనట్లు అనిపించడంతో ఊసల దగ్గరికివచ్చి , దీర్ఘమైన శ్వాసను పీల్చి వదులుతూ అక్కయ్య ప్రేమతో ఇచ్చిన వాచ్ లో సమయం చూస్తే ఉదయం 5 గంటలు . పైన ఆకాశంలో చందమామ నిండుగా కనిపిస్తుంటే అందులో అక్కయ్య చిరునవ్వుని కన్నార్పకుండా చూసుకుంటూ నిలబడిపోయాను .

కొద్దిసేపటి తరువాత కృష్ణగాడు కూడా వచ్చి నిలబడ్డాడు . 

రేయ్ కృష్ణ ఆ చందమామలో అక్కయ్య కనిపిస్తోందిరా అని చూపించాను . 

అవునురా నీకోసమే ఆ చందమామ ఇటువైపు వచ్చాడు . అక్కయ్య కూడా చందమామను చూస్తోంటే , మీరు ఒకరినొకరు చూసుకున్నట్లేరా అని చెప్పడంతో ,

నిజమారా ...........అని మాటల్లో చెప్పలేని సంతోషంతో తెల్లవారేంతవరకూ అలా చూస్తుండిపోయాము . 



అలా తెల్లవారిందో లేదో నలువైపులా నుండి అరుపులు , శబ్దాలు ఆపకుండా వినిపిస్తూనే ఉన్నాయి . 

కానిస్టేబుల్ వచ్చి లాకప్ తెరిచి అందరూ వెళుతున్నారే అక్కడకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అవ్వండి జైలర్ గారు పిలుస్తున్నారు అనిచెప్పాడు . 

అందరినీ చూస్తూ భయపడుతూ ఒకరినొకరు తోసుకుంటూ ఇద్దరమూ వదలకుండా చేతినిపట్టుకొని వెళ్లి మా పని మేము చూసుకుని బయటకువచ్చాము . 

దూరం నుండి కానిస్టేబుల్ పిలవడంతో చేరుకోగానే జైలర్ గదికి తీసుకెళ్లారు . 



మహేష్ , కృష్ణ ...........ఇక ఈరోజు నుండి మీ జైలు జీవితం మొదలు . ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకూ స్కూల్ , మీ అదృష్టం ఏమిటంటే టిఫిన్ , భోజనం అక్కడే పిల్లలకోసం కాబట్టి కాస్త మంచిగా వండుతారు . అక్కడే తినెయ్యండి.

రాత్రికి మాత్రం ఈ నెరగాళ్లతోనే తినాలి మీరు తినలేరు కాబట్టి ఉదయం , మధ్యాహ్నమే కాస్త ఎక్కువ తినండి సరేనా , కానిస్టేబుల్ స్వయంగా నువ్వే పిలుచుకొనివెళ్లి అన్నీ arrange చేసి స్కూల్లో చేర్పించు అనిచెప్పడంతో , 

రండి అని ఒక రూంలోకి పిలుచుకొనివెళ్లి మీకు సరిపోయే కొన్ని జతల బట్టలను తీసుకోండి అనిచెప్పడంతో , చాలా వాటిలోనుండి తీసుకున్నాము .

మార్చుకోండి అనిచెప్పడంతో మార్చుకున్నాము . 

ఇక నుండి మీ బట్టలను మీరే శుభ్రం చేసుకోవాలి అనిచెప్పి చాలామంది మాలాంటి పిల్లలతోపాటు నడిపించుకుంటూ వెళ్లి రెండు దారులూ కలిసేచోటకు చేరుకున్నాము . ఒక దారి గుండా అమ్మాయిలు వస్తున్నారు . 

సర్ వాళ్ళు మీలాగే నేరం చేసి వచ్చినవాళ్ళు అబ్బాయిలకు , అమ్మాయిలకు ఒకే స్కూల్ ఇక్కడ అదిగో కాంపౌండ్ కంచె లోపల కనిపిస్తోంది చూడు అదే స్కూల్ అని చూపించారు . 



ఇంతలో జైల్ డ్రెస్ లో ఒకడు పరుగున వస్తున్న మా వయసు పాపను పట్టుకుని మీదపడబోయి అల్లరి చెయ్యబోతుంటే , కానిస్టేబుల్ పరుగునవెళ్లి వాడిని పట్టుకోబోతే జైల్లో వాడికి ఎలా వచ్చిందో ఏమో కత్తి తీసి బెదిరిస్తూ , పాప జుట్టు పట్టుకుని లాగేస్తున్నారు . 

పాప ఆపకుండా ఏడుస్తూ వదులు వదులు అని భయపడుతోంది. 

కానిస్టేబుల్ దూరంలోనే ఆగి రేయ్ కత్తి కింద పడేయ్ కత్తి కింద పడేయ్ అని మంచిగా చెబుతోంటే వాడు మరింత ఎక్కువచేస్తూ పాప బుగ్గపై నాలుకతో నాకాడు . 

అంతే ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని పరుగున వెనుకవైపు నుండి ఒకేసారి వాటిమీద దూకి , కృష్ణగాడు వాడిమీదకు ఎక్కి తలపై కొడుతోంటే , నేను కత్తిపట్టుకున్న చేతిని రెండుచేతులతో కదలనియ్యకుండా పట్టుకుని మోకాలిపై గట్టిగా కొట్టడంతో పాపను వదిలి నేలపై పడిపోగానే , 

కానిస్టేబుల్ వచ్చి వాడి మనికట్టుని బూటుతో తొక్కిపట్టి కత్తిని అందుకొని కొన్నిదెబ్బలు వేసి సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడంతో లాక్కుని వెళ్లిపోయారు ..

పాప ఏడుస్తూ స్కూల్ వైపు పరిగెత్తివెళ్లిపోయింది . 



వాడు పిల్లలను ఎడిపించే సైకో , స్నానం చేయడానికి వదిలి ఉంటారు తప్పించుకునివచ్చాడు . మీరుకూడా జాగ్రత్తగా ఉండాలి జైల్లో స్టాఫ్ సగం కంటే తక్కువ ఉన్నారు అనిచెప్పి , శభాష్ అంటూ స్కూల్ కు పిలుచుకొనివెళ్లి పేర్లు రాయించి వెళ్లి టిఫిన్ తిని బాగా చదువుకుని అందరితోపాటు సాయంత్రం వచ్చెయ్యండి అని వెళ్లిపోయారు .



రేయ్ నాకు వద్దు నువ్వు తినరా అనిచెప్పి ఎవ్వరూ లేనిచోట ఒంటరిగా వెళ్లి కూర్చున్నాను . 

రేయ్ రాత్రికూడా తినలేదు నేను తీసుకొస్తాను అని లైన్లో నిలబడ్డాడు . 

వెనుక నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్ అని వినిపించడంతో , కృష్ణగాడు వెనుకకు తిరిగిచూస్తే ఆ పాప , మీరిద్దరూ సమయానికి రాకపోయుంటే వాడు నన్నేమి చేసేవాడో అని భయపడుతూ చెప్పింది . 

మీకేమీ కాలేదు కదా ............

లేదు ...........మరొకసారి థాంక్స్ నా పేరు కృష్ణవేణి , 

నాపేరు కృష్ణ అని చెప్పాడు . 

థాంక్స్ కృష్ణ అని చెయ్యి అందివ్వడంతో , 

నవ్వి చేతిని కలిపాడు . 



కృష్ణ , నీ ఫ్రెండా ..........

అవును ప్రాణ స్నేహితుడు , ఒకరినివదిలి ఒకరము ఉండలేము . 

ఎందుకు మరి బాధపడుతున్నట్లుగా ఉన్నాడు . జైల్లో ఉన్నాడనా .........

లేదు కృష్ణవేణి , వాడికి చేతితో తినడానికి రాదు . ప్రతిరోజూ టిఫిన్ , లంచ్ , డిన్నర్ , స్నాక్స్ , ఐస్ క్రీమ్ ............ఇలా అన్నీ వాడంటే ప్రాణమిచ్చే అక్కయ్యా , అమ్మే తినిపించేవాళ్ళు ఇక ఇప్పటి నుండి ఎలాగో అంతుపట్టడం లేదు అనిచెప్పి రెండు ప్లేట్లలో వడ్డించుకొని వచ్చి , రేయ్ ఇక ఈరోజు నుండి మనమే తినాలిరా please నా బంగారం కదూ తినమని బ్రతిమాలాడు . 

ఎలా తినడమో కూడా మరిచిపోయానురా , అక్కయ్యే గుర్తుకొస్తుంది అని కన్నీళ్ళతో చెప్పాను . 

నేను తినకపోవడంతో వాడుకూడా తినకుండా ఉండిపోయాడు . 



ఇంతలో అన్నయ్యా ............ నాపేరు కృష్ణవేణి అని ప్లేటుతోపాటు వచ్చి మాప్రక్కనే కూర్చుంది . 

ఎవరా అని ఆశ్చర్యంతో కృష్ణగాడివైపు చూసి కన్నీళ్లను తుడుచుకున్నాను . 

అన్నయ్యా......... ఇంతకుముందు రక్షించినది నన్నే , నా పేరు కృష్ణవేణి . మీకు అభ్యంతరం లేకపోతే మీ ప్రాణమైన అక్కయ్యలాగా కాకపోయినా ప్రేమతో తినిపిస్తాను అనిచెప్పింది . 

మౌనంగా తలదించుకోవడం చూసి , తమ్ముడూ ...........ఆకలివేస్తోంది తినచ్చుకదా అని అక్కయ్య పిలిచినట్లే ప్రేమతో పిలవడంతో ,

నాకు తెలియకుండానే తలెత్తి నోరుతెరిచాను . 

నా ప్లేట్ అందుకొని తినిపించి , అన్నయ్యా ...........మీకు ఎలా తినిపించాలో నాకు ఇప్పుడు అర్థమైంది తమ్ముడూ తమ్ముడూ .........అని పిలుస్తూ ముద్ద తరువాత ముద్ద తినిపిస్తూ , 

ఆనందబాస్పాలతో తనవైపే చూస్తున్న కృష్ణగాడిని , కృష్ణా ...........హ్యాపీనా నీ ప్రాణ స్నేహితుడు తింటున్నాడు నువ్వుకూడా తిను అని చెప్పడంతో , ఆకలితో గబగబా తినేస్తూ ఫ్లాట్ అయిపోయినట్లు తననే చూస్తున్నాడు . 



తమ్ముడూ మొత్తం తినేశావు , నా ప్లేటులోనిది కూడా తినిపించనా అని అడిగింది . 

మిమ్మల్ని అక్కయ్యా అనిపిలవచ్చా ...........అని అడిగాను .

అన్నయ్యా ...........నేను మీకంటే ఒక సంవత్సరమైనా చిన్నదాన్ని , చెల్లెమ్మా అని పిలిస్తేనే అందం , మీకు మీ అక్కయ్య అంటే ఎంత ప్రాణమో కృష్ణ చెప్పాడు . ఆ స్థానాన్ని అక్కయ్యకే ఉంచుదాము అని చెప్పగానే , 

నాకళ్ళల్లో సంతోషంతో చెల్లి అని ఆప్యాయంగా పిలిచాను .

 హమ్మయ్యా ..........ఇన్నాళ్లకు ఒక అన్నయ్య , ఒక ఫ్రెండ్ నాజీవితంలోకి వచ్చారు . మనం ముగ్గురమూ ఒక జట్టు అని చేతిని ముందుకు చాపింది . 

అంతే కృష్ణగాడు మేము రెడీ అని చేతిని కలపబోతుంటే , 

కృష్ణ ముందు అన్నయ్య తరువాతే ఫ్రెండ్ అని వాడివైపు కన్నుకొట్టి నవ్వింది . 

అంతే వాడు గుండెలపై చేతినివేసుకొని వెనక్కు వాలిపోయాడు . 

నేను నవ్వుకుని లవ్ ..........థాంక్స్ చెల్లెమ్మా అని చేతిని కలిపాను . 

ఏమీ పర్లేదు మనం రోజూ స్కూల్లో కలుస్తాము కదా ........, థాంక్స్ చెల్లెమ్మా నుండి లవ్ యు చెల్లెమ్మలోకి మార్పు చెందడం ఎంతసేపు అని కృష్ణగాడి చేతిపై గిల్లి చెయ్యి కలపమని సైగచేసింది . 

Yes yes ............మనం ముగ్గురమూ ఒక జట్టు అని నా చేతిపై చేతినివేసి , థాంక్స్ కృష్ణవేణి వాడికి తినిపించినందుకు అని సంతోషంతో చెప్పాను . 

రేయ్ ........నువ్వుకూడా థాంక్స్ అని రేయ్ అన్నందుకు సిగ్గుపడి , కృష్ణ నువ్వుకూడా మార్పు చెందడానికి ఎక్కువ సమయం పట్టదులే అని ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటుంటే ముచ్చటేసింది . 

స్కూల్ బెల్ కొట్టడంతో రండి వెళదాము అని లేవబోతుంటే , 

చెల్లెమ్మా నువ్వు ఇంకా తినలేదు . 

బెల్ కొట్టగానే వెళ్ళాలి లేకపోతే డ్రిల్ సర్ కొడతారు . 

ఏమీ పర్లేదు చెల్లి ముందు నెమ్మదిగా తిను మేము చూసుకుంటాము అని కూర్చోబెట్టాను . 

ఉమ్మా ...........లవ్ యు అన్నయ్యా , ఇక నాకు భయమే లేదు మీరుండగా అని తింటుంటే , కృష్ణగాడు చెల్లివైపే ముసిముసినవ్వులతో చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి కాస్త మనసు కుదుటపడింది . నావలన వాడు ఎన్ని కష్టాలు పడతాడో అన్న బాధ కూడా నెమ్మదిగా తగ్గుతోంది .



చెల్లి కడుపునిండా తిని చేతిని కడుక్కుని నీళ్లు తాగి అన్నయ్యా , కృష్ణ వెళదాము అని క్లాస్ వైపు వెళుతోంటే , డ్రిల్ సర్ ఆపి బెల్ కొట్టి 10 నిమిషాలు అయ్యింది ఇంతసేపు తింటున్నారా ........, చెయ్యి చాపండి అని చెప్పారు . 

Sorry సర్ అని నేను కృష్ణగాడు చెల్లి ముందుకువెళ్లి గట్టిగా ఒక్కొక్క దెబ్బ తిన్నాము.

ఏయ్ పాప నువ్వుకూడా అని చెప్పడంతో మా ముందుకువచ్చి చేతిని చాపింది . 

అలాంటి దెబ్బనే కొట్టబోతుంటే ఇద్దరమూ కళ్ళుమూసుకుని భయపడుతున్న చెల్లి చేతిపై మా అరచేతులను పెట్టడంతో మాకు తగిలింది .

సౌండ్ వచ్చినా చెల్లి చేతిపై దెబ్బ పడకపోవడంతో చూసి కళ్ళల్లో చెమ్మతో మావైపు ఆరాధనతో చూస్తోంది . 

రేయ్ ఏంట్రా మీరు చెయ్యిపెట్టారు ఏంటి విషయం ఫ్రెండ్షిప్పా........

అవును సర్ కావాలంటే మాకు మరొక దెబ్బ కొట్టండి అని చేతులను చాపాము . 

సర్ కోపంతో మరొక్క దెబ్బ ఇద్దరికీ వేసి మరెప్పుడూ ఇలా ఆలస్యం చేయకండి క్లాస్ కు వెళ్ళండి అని వదలడంతో , 

నొప్పికి చేతులను విదుల్చుకుంటూ చెల్లికి దారిని ఇచ్చాము . 

లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా అంటూ మా చేతులలో పెనవేసి వాడి చేతిపై ఏకంగా ముద్దుపెట్టింది . 

వాడు షాక్ లో కన్నార్పకుండా చెల్లివైపే చూస్తూ నడుస్తుంటే , నవ్వుకుని ముగ్గురమూ may i come in మేడం అని అడిగి వెళ్లి ముగ్గురమూ ఒకే బెంచ్ లో చెల్లి మా ఇద్దరి మధ్యన కూర్చుంది . 



వాడు కన్నార్పకుండా చెల్లివైపే చూస్తుంటే , నేను ఎక్కడికీ వెళ్ళను రా క్లాస్ అయిపోయాక నీ ఇష్టం ఇప్పుడు క్లాస్ విను అని ప్రేమతో చెప్పడంతో ,

సరే అని నవ్వుకుని బోర్డ్ వైపు తిరిగాడు . 

అక్కయ్య మాటలు " బాగా చదువుకోవాలి " గుర్తుకువచ్చి ఏకాగ్రతతో వింటున్నాను.

క్లాస్ మధ్యలో ఒకరు వచ్చి మహేష్ , కృష్ణ అనిపిలిచి , లేచి నిలబడిన మాదగ్గరికివచ్చి వచ్చి స్కూల్ డ్రెస్ మరియు బుక్స్ అందించి వెళ్ళిపోయాక క్లాస్ కంటిన్యూ అయ్యింది . 



క్లాస్ పూర్తవగానే కృష్ణగాడు చెల్లివైవు తిరిగి చూడటం స్టార్ట్ చేసాడు . 

చెల్లి అందంగా నవ్వుతూ కృష్ణ నేనేదో మాట వరుసకు అన్నాను . 

నేను సీరియస్ తీసుకున్నాను అని కన్నార్పకుండా చూస్తున్నాడు . 

నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే బోర్డ్ వైపు తిరగడం చూసి , ఉమ్మా ......... గుడ్ బాయ్ అని నవ్వుకుంది చెల్లి ,

మళ్లీ క్లాస్ పూర్తవగానే చెల్లివైపు తిరిగి చూడసాగాడు . 

మొదలెట్టావా ............కానివ్వు నీఇష్టం . అలా మధ్యాహ్నం వరకూ అదే వరస .



లంచ్ బెల్ మ్రోగడంతో వాడు చెల్లిని చూస్తూనే , ముగ్గురమూ లైన్లో నిలబడి ముందు వాడు మా ఇద్దరి మధ్యలో చెల్లి , వాడి వంతు వచ్చేన్తవరకూ చెల్లిని వెనక్కు తిరిగి తిరిగి చూడటం చూసి , 

నవ్వుకుని అన్నయ్యా ..........కృష్ణకు పిచ్చిపెట్టినట్లుంది . 

అవును కృష్ణవేణి నీ పిచ్చే పట్టింది నాకు , ఇక జీవితాంతం పోదు అని బదులివ్వడంతో ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము . 



ముగ్గురమూ ప్లేటులో భోజనం తీసుకుని ఒకదగ్గర కూర్చుని , తమ్ముడూ తినిపించనా అని అందమైన నవ్వుతో చెప్పడం , అక్కయ్యే గుర్తువచ్చి కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఆ........ అని నోరు తెరువడంతో తినిపించి తానూ తింటుంటే , చెల్లి నా ఎంగిలి ...........

మా అన్నయ్య ఇక్కడ ఉంటాడు అని వేళ్ళను పూర్తిగా నోటిలోకి తీసుకుని తిని మరింత రుచిగా ఉంది అన్నయ్యా .........

చెల్లి అక్కయ్య కూడా ఇలాగే చెప్పేది . 

అన్నయ్యా ............ మన అక్కయ్య పేరు చెప్పలేదు . 

గుండెలపై చేతినివేసుకొని వాసంతి అని ప్రాణంలా చెప్పాను . 

Loveliest పేరు అన్నయ్యా ............వాసంతి అక్కయ్య 

తొలిముద్ద అని ప్రేమతో నోటిదగ్గరకు ముద్ద తీసుకురావడంతో , కళ్ళల్లో చెమ్మతో చెల్లినే ప్రాణంలా చూస్తూ తిన్నాను .

రెండవ ముద్ద , మూడవ ముద్ద ............అని నవ్విస్తూ ప్రేమను పంచుతూ తినిపిస్తోంటే , 

వాడితోపాటు అక్కయ్య నాకు కూడా తినిపించేది కృష్ణవేణి అని కృష్ణగాడు ఆశతో మావైపు చూస్తూ , చెప్పరా ............

అన్నయ్యా ...........,

నవ్వుకుని అవును చెల్లి , ఇద్దరినీ ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టుకొని నవ్విస్తూ ప్రాణంలా తినిపించేది . 

చెల్లి తియ్యదనంతో నవ్వుకుని , రేయ్ కృష్ణ రా మరి నాదగ్గరికి అని పిలవడం ఆలస్యం వచ్చికూర్చుని ,

కృష్ణవేణి నువ్వు రేయ్ అని పిలిచిన ప్రతిసారీ ఇక్కడ సురుక్కుమంటోంది .

నొప్పిగా ఉందా అయితే పిలవడం ఆపేయ్యనా అని వాడి గుండెపై స్పృశిస్తూ అడిగింది . 

వాడు తియ్యని కోపంతో అలా అర్థమయ్యిందా అని చూస్తుంటే , ఇద్దరమూ నవ్వుకుని రేయ్ అని మళ్ళీ పిలవడంతో , తన గుండెలపై ఉన్న చెల్లి చేతిపై చేతినివేసి  మైమరిచిపోయాడు . 

ఇలాంటివన్నీ మన చిన్నవయసులోనే కాదు తరువాత అని అందమైన నవ్వుతో వాడికి కన్నుకొట్టి , ఇదిగో మీ అక్కయ్య ముద్ద అని ప్రేమతో తినిపించింది . 

అలా అయితే నా జీవితాంతం ఎదురుచూడమన్నా చూస్తాను అని బదులిచ్చాడు . 

చెల్లి , కృష్ణ నువ్వుకూడా తిను అని ఇద్దరమూ ఓకేసారిచెప్పి , ముగ్గురమూ సంతోషంగా నవ్వుకున్నాము . 



వాడు నన్నే చూస్తూ కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకున్నాడు .

ఏమైంది రా ..........అని చెల్లి వాడి చేతిని అందుకొని అడిగింది . 

వాడు ఇక జీవితంలో నవ్వడు అనుకున్నాను , ఒకే ఒక్కరోజులో నవ్వించావు నవ్విస్తూనే ఉన్నావు . లవ్ ...........థాంక్యూ థాంక్యూ sooooo మచ్ కృష్ణవేణి అని ఆ అని నోరుతెరిచాడు . 

ముగ్గురమూ మూడు ప్లేట్లలోని అన్నం తినేసాము . అన్నయ్యా , రేయ్ కృష్ణ రాత్రికి అక్కడ ఫుడ్ అంతగా బాగోదు ఇప్పుడే మరింత తినండి ఎలాగోలా నేను తీసుకొస్తాను కదా అనివెళ్లి ఏకంగా రెండు ప్లేట్ల నిండా తీసుకొచ్చింది . 

ఇద్దరమూ చెల్లివైపు ప్రాణంలా చూస్తోంటే , ప్రేమతో నోటికి అందించింది .

చెల్లి నువ్వు కూడా తిను అని చెప్పాము . 

మీరిద్దరూ తింటే నేను తిన్నట్లే అన్నయ్యా ..........తినండి అని తినిపించింది . 

చెల్లి , కృష్ణ అంటూ ఇద్దరమూ ప్రాణంలా తనవైపు చూస్తోంటే , 

అన్నయ్యా ........మీరు బాధపడకండి , మా జైలర్ గారికి నేనంటే స్పెషల్ తన ఇంటి నుండి తెచ్చుకున్న భోజనాన్ని ప్రతి రోజూ రాత్రికి నాతో షేర్ చేసుకుంటారు అనిచెప్పింది . 



చెల్లి ఇంతకీ ఇక్కడికి ఎలావచ్చావు అని తింటూనే అడిగాను . 

నాకూ తెలియదు అన్నయ్యా .......... నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను . ఇక్కడే జైల్లో పుట్టాను అని కొందరంటుంటే విన్నాను . జైలర్ గారు నన్ను బాగా చూసుకుంటారు . అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటి నుండి స్వీట్స్ , చికెన్ తీసుకొస్తారు నాకోసం , నాకొసమే ప్రత్యేకమైన చిన్నగదిని కూడా ఇచ్చారు . 

చాలు చెల్లి నీ ఆనందంతో కడుపు నిండిపోయింది అని చెల్లి ఆనందాన్ని అలా చూస్తుండిపోయాను . 

చెల్లి మేము ఇక్కడికి ఎలావచ్చామో తెలుసుకోవాలని లేదా ........

అన్నయ్యా ..........మీరు చెప్పినా , చెప్పకపోయినా మీరిద్దరూ ఇక్కడే ఉంటారు అని గుండెలపై చేతినివేసుకొని చెప్పింది .



మేము ఒక మృగాన్ని హత్య చేసాము అనిచెప్పాము .

చెల్లి ఏమాత్రం భయపడకుండా మా చేతులను అందుకొని , ఖచ్చితంగా అక్కయ్యను కాపాడే పరిస్థితులలోనే ఆ హత్యను చేసిఉంటారు . అలాంటి అక్కయ్య కోసం హత్య ఏంటి ప్రాణాలైనా ఇచ్చేయ్యొచ్చు అని మాట్లాడుతోంటే ,

ఇద్దరమూ చెల్లివైపు అలా ప్రాణంలాచూస్తూ లవ్ యు చెల్లెమ్మా , లవ్ యు కృష్ణ అని తన చేతులను పెనవేసి ఆనందించాము . 

యే యే యే ............మా అన్నయ్య , వీడు అని కృష్ణగాడివైపు కన్నుకొట్టి లవ్ యు అన్నారు ......... ఈరోజు నా జీవితంలోనే మరిచిపోలేని రోజు అని ఎంజాయ్ చేస్తుంటే, చూసి పరవశించిపోయాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-04-2020, 05:52 AM



Users browsing this thread: 57 Guest(s)