Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఆనోటా ఈనోటా పై ఊరివాళ్లకు తెలియడంతో అందరూ ట్రాక్టర్లలో దిగిపోయారు . చైర్మన్ గారు లోపలికివచ్చి పెద్దయ్యలానే మాట్లాడటంతో వారిని కూడా ఒట్టు తో మౌనం చేసేసాము . మాది ప్రతిపక్ష పార్టీ అవ్వడం వలన నేను ప్రయత్నాలు మొదలుపెడితే వాళ్ళు ఇంకా కోపానికి గురయ్యి పిల్లలకు మరింత హాని కలుగుతుందని చాలా బాధపడ్డారు .

10 నిమిషాలకొకసారి తెల్లచొక్కాలవాళ్ళు ఊరిజనమంతా ఎప్పుడు వెళతారా అని స్టేషన్ చుట్టూ తిరుగుతూ , డబల్ జనం అవ్వడం చూసి వాళ్ళ సర్ కు ఫోన్ చేసి చెప్పారు . 



10 గంటలకు కానిస్టేబుల్ FIR అందుకొని ప్రత్యక్ష సాక్షి మల్లన్న పిల్లల ఇంటిప్రక్కనే నివసించేవారు ఇక్కడే ఉన్నారా లేక ఊళ్ళో ఉన్నారా అని అడిగారు .

మల్లన్నా ........... ,

ఇతడు కాదు కదా అని కానిస్టేబుల్ అనుమానంతో చూస్తున్నాడు .

నేనే సర్ పిల్లల ఇంటిప్రక్కన ఉన్న ఏకైక మల్లన్నను ,

పెద్దయ్యా ..........నాన్న .........అని గుర్తుచేసాను .

అవును సర్ ఇతడే ప్రత్యక్ష సాక్షి , మల్లన్న బాబు నాన్న తప్పించుకోవడానికి నీపేరు చెప్పాడు , ఏమడిగినా ఊ కొట్టు .

అలాగే పెద్దయ్యా ............,

Sir ఏమనిచెప్పాడు చూసి అని పెద్దయ్య అడగడంతో , 

సహాయం చేస్తున్నారు కాబట్టి మొత్తం చదివి వినిపించారు .

మల్లన్నా అది అలా ఫిక్స్ అయిపో అని చెప్పారు . 

11 గంటలకు  అందుబాటులో ఉన్న మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లతో కోర్ట్ కు బయలుదేరాము . 

ఊరి జనమంతా జీప్ ముందు , వెనుక మరియు రెండువైపులా ట్రాక్టర్లలో వెంటే రాసాగారు . 

కోర్ట్ ఆవరణ మొత్తం ట్రాక్టర్లతో , రెండు ఊళ్ల జనాలతో నిండిపోయింది . 

అన్నయ్య కోర్ట్ కు అమ్మను పిలుచుకునిరావడంతో చాలా ఆనందించాము . అమ్మను కలవడానికి పరిస్థితులు సహకరించలేదు .



MP లోపలికి వెళుతున్న మాకు అడ్డుపడి , వాహ్ ........SI ఏమి గేమ్ ఆడావు . లోపల ఆట నాదే విజయం నాదే , ఇదిగో మన స్టేట్ లోనే టాప్ మోస్ట్ లాయర్ , పిల్లలకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు . పిల్లలను ఎలాగోలా బెయిల్ మీద తీసుకొచ్చి ఖతం చేసేస్తాను అని నవ్వుతూ చెప్పారు . సాయంత్రం నా బావమరిది చితి ఆ చితి ప్రక్కనే పిల్లలవి అన్నారు . 



సర్ సర్ ...........అని వాళ్ళ మనుషులు ప్రక్కకు లాక్కెళ్లి స్టేషన్ లో మీరు చూసినది సగం జనాలనే , ఇక్కడ కోర్ట్ ఆవరణలో ఉన్నవాళ్ళంతా ఎవరనుకున్నారు . 

వాళ్ళ వాళ్ళ కేసుల కోసం వచ్చిన వేరు వేరు వాళ్ళు . 

కాదు సర్ మొత్తం పిల్లలకోసం వచ్చిన రెండు ఊళ్ల జనాలు ఒక్కసారి మూడువైపులా చూడండి అని కోర్ట్ మెట్లు ఎక్కించి చూపించారు . సగం మంది జనాలు ఉన్నప్పుడే మనం ఏమీ పీకలేకపోయాము . ఒకసారి వాళ్ళను చూడండి మీరు బెయిల్ అనగానే వాళ్ళ ముఖంలో సంతోషం . బెయిల్ తో బయటకు రాగానే ఆ SI వాళ్లతరుపే కాబట్టి లోపలే వాళ్లకు అప్పజెప్పేస్తాడు . ఇక జనాలంతా పిల్లలకోసం ప్రాణాలిచ్చయినా సేఫ్ గా వాళ్ళ ఊరికి తీసుకెళ్లి 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు . 

మన టౌన్ కు వచ్చినప్పుడే మనం ఏమీ పీకలేకపోయాము , ఇక వాళ్ళ ఊరిలో అడుగు కూడా పెట్టలేము . త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇక మీఇష్టం ఆలోచించుకోండి అనిచెప్పారు . 

అవును సర్ పిల్లలకు శిక్ష వేయించడానికి నన్ను ఉన్నఫలంగా పిలిపించారు అనుకుంటే , మీరు బెయిల్ అనడంతో నేనే కాస్త నిరాశకు లోనయ్యాను అని లాయర్ చెప్పాడు . 

లాయర్ గారు పెళ్లి ఆగిపోయి నా పరువు మొత్తం పోయింది . బావమరిదిని చంపిన పిల్లకాయలను కూడా ఏమీ పీకలేకపోయాడు నీకు పదవి ఎందుకు అని నా వెనుక నవ్వుకుంటారు . నాకోపం కసి తీరేది ఎలాగా అని కోపంతో మాట్లాడుతోంటే ,



అందుకే కదా సర్ నేను ఉన్నది అని లాయర్ కన్నింగ్ స్మైల్ తో , నేను గుక్క తిప్పకుండా ప్రశ్నలు సంధించి వాళ్లే అమాయకమైన , పేదల కోసం పాటుపడుతున్న ఒక మంచి వ్యక్తిని అన్యాయంగా చంపేశారు అని వాళ్ళచేతే ఒప్పించి ఏకంగా ఉరిశిక్షను లేకపోతే వీలుకాకపోతే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను వెయిస్తాను.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు .........పిల్లలకు శిక్ష , మిమ్మల్ని ఎదురించిన పిల్లలంటే ప్రాణాలిచ్చే రెండు ఊళ్ల జనాలు 14 సంవత్సరాలపాటు పిల్లల గురించే ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు. 

వాహ్ ........లాయరో నీ బుర్రె బుర్రయ్యా .............అని సంతోషంతో కౌగిలించుకుని , రోజూ కూలీతో బ్రతికే కూలీ వెధవలు నన్నే ఎదిరిస్తారా.......... అందరికీ కలిపి ఒకే ఒక పెద్ద శిక్ష అని లోపలకు ఎంటర్ అయ్యారు .



పెద్దయ్యా ...........లోపల జడ్జి గారు మాకు ఎటువంటి శిక్ష వేసినా మీరు మౌనంగా ఉండాలి నేను చచ్చినంత ఒట్టు , ఏమాత్రం జడ్జి గారికి డౌబ్ట్ వచ్చినా సెక్యూరిటీ ఆఫీసర్లతో ఎంక్విరీ చేయించారంటే ............ లేదు లేదు అలా జరగకూడదు అని బాధపడుతూనే చెప్పాను . మీగురించి నాకు తెలుసు పెద్దయ్యా ......... మీమీద వేసుకోవడానికి కూడా వెనుకాడరని , నా వలన మీలాంటి మంచివారు శిక్ష అనుభవించకూడదు .

నువ్వు చెప్పినట్లే చేస్తాము బాబు అని కన్నీళ్ళతో రెండుచేతులతో నమస్కరించారు . 

పెద్దయ్యను ఇద్దరమూ కౌగిలించుకుని కేస్ గురించి లోపల పిలవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు మమ్మల్ని బోనులో నిలబెట్టారు . 



జడ్జి గారు మాఇద్దరినీ చూసి ఇంత చిన్న పిల్లలా హత్యచేసింది , నేను నమ్మలేకపోతున్నాను .

వీళ్ళు మీరనుకున్నంత అమాయకులు కాదు యూరానర్ ........... , ఊహ తెలిసినప్పటినుండి ఇరుగుపొరుగు పిల్లలను కొట్టడం , దారిన పోయేవాళ్లను రాళ్లతో కొట్టడం , స్కూల్లో చేర్పిస్తే తోటి పిల్లలతో ఎప్పుడూ గొడవలు , చివరికి టీచర్స్ ను కూడా తమ అల్లరితో అల్లరిపెట్టడం ...........ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని వేళ్లపై కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ ఊరిలో అని లాయర్ చెప్పాడు .



లేదు లేదు లేదు ............ అని మావాళ్ళంతా గట్టిగా కేకలువేస్తూ చెప్పారు . 

మీరేమీ చెప్పుకోవాలన్నా బోనులోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు సైలెన్స్ చేశారు .

మావాళ్ళు రాబోతుంటే ఎక్కడ ఎమోషనల్ అయ్యి నిండా వాళ్లపై వేసుకుంటారు అని చేతితో ఆపి , 

జడ్జి తాత ఆ లాయర్ గారు చెప్పినవన్నీ నిజం కాదు ఒక్క హత్య చెయ్యడం తప్ప , దానికి ఏ శిక్ష విధించినా సంతోషన్గా అనుభవిస్తాము అనిచెప్పి చేతులుకట్టుకుని నిలబడ్డాము . 

చూసారా జడ్జి గారు మీముందు ఎంత అహం వీళ్లకు , పిల్లలే కానీ పిడుగులు అని తన అనుభవంతో రకరకాల , ఊపిరాడని ప్రశ్నల వర్షం కురిపించి మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి అవును లేదు సమాధానాలను రాబట్టి జడ్జి గారిని సైతం నమ్మేట్లుగా భ్రమ కల్పించి , చివరగా యూరానర్ వీల్లేదు హత్య చేశారని ఒప్పుకున్నారు కాబట్టి ఇటువంటివాళ్ళు బ్రతికి ఉండటానికి ఏమాత్రం మంచిది కాదు , వెంటనే మరణశిక్ష విధించాల్సిందిగా కోర్ట్ వారిని సవివరంగా కోరుకుంటున్నాను అనిచెప్పి ఎంపీ వైపు కన్నింగ్ స్మైల్ తో చూసి కూర్చున్నారు . 

 చిన్న సైగ చేయగానే అవును అవును .........అని వాడి అనుచరులు మొత్తం గట్టిగా అరిచాను . 



సైలెంట్ సైలెంట్ అని పిల్లలూ మీతరుపున ఎవరైనా లాయర్ .........

లేరు తాత ..........

అయితే హత్య మీరే చేశారని ఒప్పుకుంటున్నారు . 

హత్య తప్ప లాయర్ గారు చెప్పినవన్నీ ఆబద్ధాలు అనిమాత్రం చెప్పదలుచుకున్నాము జడ్జి తాత . 

ఇంతలో SI గారు ఎక్కడ పిల్లలకు మరణశిక్ష విధిస్తారో అని బోనులోకివచ్చి పిల్లలు హత్య చేసినమాట వాస్తవమే జడ్జిగారు కానీ , వాళ్ళు చంపినది మాత్రం వందల్లో కేసులున్న ఒక పిచ్చి కుక్కని ,

యూరానర్ చనిపోయిన మంచి వ్యక్తిని పిచ్చికుక్క అని SI అనడం తనకు తగదు . 

యూరానర్ నిజమే అతడు ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసిన మూర్ఖుడు కావాలంటే ఈ ఫైల్ ను ఒకసారి చూడండి అని అందించారు . 



యూరానర్ అతడిపై అన్ని కేస్ లు ఉన్నా ఎందుకు ఒక్కసారైనా అరెస్ట్ చేసి కోర్ట్ లో సబ్మిట్ చెయ్యలేదో అడగండి .

Yes అలా ఎందుకు చెయ్యలేదు , ఇప్పుడే ఎందుకు అలా చనిపోయిన వ్యక్తిపై నిందలు వేస్తున్నారు . అంటే మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయలేదా ........ చెప్పండి .

పైనుండి ఒత్తిడి యూరానర్ ........... 

అలా చెప్పడానికి మీకు సిగ్గు అనిపించడం లేదూ ..........., చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది . ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా అతడిని అరెస్ట్ చెయ్యలేదంటే మీరు మీ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించలేదు . మీరు మీ డ్యూటీ అప్పుడే చేసి ఉంటే ఇలాంటి చిన్నపిల్లలు ఇప్పుడు బోనులో నిలబడేవాళ్ళు కాదు . చట్టానిది కూడా తప్పే మిమ్మల్ని ఇటువంటి తప్పు మళ్లీ చేయరాదు అని హెచ్చరిస్తూ.......... పిల్లలపై తీర్పుని లంచ్ సమయం అయ్యింది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నాను .



సెక్యూరిటీ ఆఫీసర్లు మాఇద్దరినీ సేఫ్ గా ఒక రూంలో ఉంచి , అవును పిల్లలూ జడ్జి గారు చెప్పినట్లు మాదే తప్పు . వాడిని పట్టుకుని అప్పుడే జైల్లో వేసి ఉంటే మీరు ఇక్కడకు రావాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. మా సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున మీఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాము అని పెద్దయ్యను పిలవడంతో , అమ్మని అంకుల్ ని పిలుచుకునివచ్చారు. 

అమ్మా ..........అంటూ ఇద్దరమూ గుండెలపై వాలిపోయి , ఏడుస్తున్న అమ్మ కన్నీళ్లను తుడిచి మాకేమీ భయం లేదమ్మా , మీరు బాధపడకండి అని నవ్వుతూ కన్నీళ్లను తుడిచాము .

మాఇద్దరి పెదాలపై చిరునవ్వుని చూసి , అవును మహేష్ , కృష్ణ మీ మనసులోని వాళ్ళను రక్షించేశారు అని పెద్దయ్య కౌగిలించుకుని జడ్జి గారు ఏశిక్ష వెయ్యబోతున్నారో అని బాధపడ్డారు . 

పెద్దయ్యా మహా అయితే ఉరిశిక్ష వేస్తారు . అక్కయ్యా లాంటి అమాయకులు ఎందరో వాడి బారిన పడకుండా కాపాడిన సంతోషంతో హాయిగా...........

బాబు మహేష్ మీకేమీ కాదు అని కాస్త భయపడుతూనే మమ్మల్ని కౌగిలించుకుని , అమ్మకు తను తెచ్చిన అన్నం తినిపించమని చెప్పారు . 

అమ్మ ఇద్దరినీ తన ఒడిలో కూర్చోబెట్టుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రేమతో తినిపించి ప్రాణంలా తన ఒడిలో కాసేపు పడుకోబెట్టుకొని జోకొట్టింది . 

అక్కయ్యను తలుచుకుంటూ కన్నీళ్లను కారుస్తూ కళ్ళుమూసుకున్నాను .



అంతలో కోర్ట్ స్టార్ట్ అయ్యే బెల్ మ్రోగడంతో మమ్మల్ని పిలుచుకునివేళ్ళడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అమ్మ ఒడిలో నిద్రపోతుండటం చూసి , కొన్ని నిమిషాలు ఆగి జడ్జిగారు వచ్చాక పెద్దయ్య సహాయంతో లేపి మమ్మల్ని పిలుచుకొనివెళ్లారు . మా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటూ వెళ్లారు .



లాయర్ , SI గారి వేడి వేడి మాటలా తరువాత , చివరగా లాయర్ ఉరిశిక్ష వేయాలని, SI గారు రెండుచేతులనూ జోడించి మేము చేసిన తప్పు వలన చిన్నపిల్లలు .......... ఉరిశిక్ష కాకుండా ఏ శిక్ష వేసినా సమ్మతమే , ఆ శిక్షను కూడా ఈ టౌన్ లో అనుభవించేలా కాకుండా ఇక్కడికి దూరంగా పిల్లలను ఉంచేలా చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలను చంపడానికి ఉదయం నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు ముందే తెలిపాము అని పెద్దయ్యవైపు చూస్తూ వెళ్లి ప్రక్కన నిలబడ్డారు . 



ఇరు వాదోపవాదాలు విన్న తరువాత హత్య చేశారని పిల్లలే ఒప్పుకున్నారు . చిన్న శిక్ష విధిస్తే ఇదే అదునుగా చూసుకుని పిల్లలు నేరాలు చేయటానికి ముందుకురావచ్చు . అందుకనే పిల్లలకు 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపేలా , వారి ప్రవర్తనను బట్టి శిక్ష తగ్గించేలా మరియు SI గారి ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలోకి తీసుకుని పిల్లలను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచాలి . పిల్లలను జైల్ స్కూల్లో చేర్పించాలని తీర్పు ఇస్తున్నాను అని సంతకం చేశారు . 



అమ్మా , పెద్దయ్య , రెండు ఊళ్ల జనాల కళ్ళల్లో ధారలా కారిపోతున్న కన్నీళ్లు ........, ఉరిశిక్ష పడకపోయినా 14 సంవత్సరాలు అని సంతోషంతో వాళ్ళు కౌగిలించుకుని రండిరా ............. బావమరిదిని డప్పు వాయిద్యాలతో తీసుకెళ్లి చితి కానిద్దాము అని వెళ్లిపోయారు . 

సెక్యూరిటీ ఆఫీసర్లు మమ్మల్ని బయటకు తీసుకురాగానే చైర్మన్ గారు హైకోర్టు కు వెళదాము అనిచెప్పారు .

పెద్దయ్యా .........అంకుల్ కు చెప్పి అటువంటి ప్రయత్నాలు ఏమాత్రం చెయ్యకుండా చూడండి . దీనిని ఇంతటితో వదిలెయ్యండి అని మేము చిరునవ్వులు చిందిస్తుండటం చూసి పెద్దయ్య కన్నీళ్ళతో భారమైన హృదయంతో హత్తుకున్నారు . 

పెద్దయ్యా ............ ఎలా వచ్చానో అలా వెళ్లిపోతున్నాను . సంవత్సరానికి మూడు పంటలు పండించి ఏటా అమ్మవారి జాతర జరిపించి మీరు సంతోషన్గా ఉండాలి అదే నా కోరిక అనిచెప్పాను . 14 సంవత్సరాలే మరియు మా ప్రవర్తన గురించి తెలుసుకదా అంతకు ముందే వచ్చేస్తాము అని చిరునవ్వుతో , నాకు వీడున్నాడు వీడికి నేనున్నాను ఇంకేమి కావాలి అని చెప్పాను . 

నువ్వు లేని ఊరిని ఊహించలేము మహేష్ , నువ్వు జైల్లో ఉంటే మేమెలా సంతోషంగా ఉండగలం . ఇది మాతప్పుకాబట్టి మేము కూడా అనుభవిస్తాము . అవును మహేష్ మేము అనుభవిస్తాము , మిమ్మల్ని రక్షించుకోలేని మా జీవితాలు వ్యర్థం , నువ్వు మళ్లీ వచ్చేన్తవరకూ మేముకూడా జైలు జీవితం ఎలా ఉంటుందో అలాగే గడపుతాము .......... గడపుతాము అని అందరూ ప్రతిజ్ఞ చేశారు . 

పెద్దయ్యా .......... 

మేము మాట్లాడకూడదు అని ఒట్టు వేశావు కదా , ఇప్పుడు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము . మా బుజ్జి దేవుడి జీవితమే మా జీవితం . ఆ భగవంతుడు వచ్చినా మా మాటను మార్చలేరు అని తెగేసి చెప్పేసారు .

పెద్దయ్యా .......... మీరు సంతోషన్గా ఉండాలి అదే నా కోరిక అని పెద్ద వెహికల్ రావడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కించుకుని రాజమండ్రి వైపు కదులడంతో , వెనుకే ట్రాక్టర్లతో ఫాలో అయ్యారు . 



రేయ్ మహేష్ ఇక అక్కయ్యపై ఎటువంటి నిందా ఉండదురా ..........,ఎక్కడ ఉన్నా సంతోషన్గా ఉంటారు . పెద్దయ్య కనిపెడతారని చెప్పారుకదా .........

అవునురా , పాపం మనల్ని చూడకుండా అక్కయ్య హృదయం తట్టుకోగలదో లేదో అని కన్నీళ్ళతో వాడి చేతిని పెనవేసి , అక్కయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాము . 

సాయంత్రం 7 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్ చేరుకున్నాము . 

SI గారు చివరిసారిగా పెద్దయ్యను కలవనిచ్చారు .

పెద్దయ్యా ............ఒక్కరోజు కనపడకపోతే సునీతక్క ఇంటికి వచ్చేస్తారు , ఈ విషయం ఎత్తిపరిస్థితులలోనూ తెలియనివ్వొద్దు . అక్కయ్యా , అమ్మలతోపాటు మేముకూడా రాత్రికిరాత్రే మీకే చెప్పకుండా వెళ్లిపోయామని నమ్మించండి .

మహేష్ ............

అవును పెద్దయ్యా ..........సునీతక్క మమ్మల్నే తలుచుకుంటూ రోజూ బాధపడుతూనే ఉంటారు . 

 నిజమే , అలా జరగకూడదు మహేష్ ..........

అందుకే పెద్దయ్యా ........, అలాగే ఇప్పటికే కాంచన , కవిత అక్కయ్యలకు తెలిసిపోయిఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఎట్టిపరిస్థితులలోనూ చెప్పొద్దు అని , నామీద ఒట్టు అనిచెప్పండి . మనం బాధపడుతూ సంతోషంతో ఉన్నవాళ్లను బాధపెట్టకూడదు అని ఎలాగోలా ఒప్పించండి . ఈరోజే వెళ్లి కలవండి అని బాధపడుతూనే చెప్పాను .

చీకటి పడింది జాగ్రత్తగా వెళ్లండి పెద్దయ్యా అని చెప్పడంతో , పిల్లలూ అని అమాంతం కౌగిలించుకుని మీరు జాగ్రత్త అని ఎలాచెప్పాలో తెలియక సతమతమైపోయారు . 

పెద్దయ్యా .......... లోపల జైలర్ నాకు చాలా క్లోజ్ వీళ్ళను చూసుకోమని మరీ మరీ చెబుతాను , ఇచ్చిన సమయం లోపల తీసుకెళ్లాలి అని పెద్ద గేట్ ఓపెన్ అవ్వడంతో అందరినీ చూస్తూ లోపలికి ఎంటర్ అయ్యాము.

కానిస్టేబుల్స్ వెహికల్ నుండి దించి మమ్మల్ని ముందువెళుతున్న SI గారి వెంట తీసుకెళుతున్నారు . 

బయట పరిస్థితులకు , లోపలి పరిస్థితులకు తేడా కానిస్టేబుల్ వివరిస్తుంటేనే భయంతో ఇద్దరమూ ఒకోకరినొకరము గట్టిగా చేతులను పట్టుకున్నాము . లాకప్ లలో నేరం చూసినవాళ్ళ కేకలువేస్తుంటే మరింత భయం వేసింది . 

SI గారు జైలర్ దగ్గరకు చేరుకుని రేయ్ రేయ్ ......... అన్నంత క్లోజ్ గా కౌగిలించుకుని , కేస్ గురించి చెప్పానుకదా ఈ పిల్లలే మహేష్ , కృష్ణ జాగ్రత్తగా చూసుకోవాలి అనిచెప్పాను . 

సరే రా ఇక నాకు వదిలేయ్ అని సంతకం పెట్టించుకున్నారు . 

ఆకలి వేస్తోందా .........తింటారా అని SI గారు అడిగారు . ఇద్దరమూ లేదు అని బదులిచ్చాము . మహేష్ , కృష్ణ ......... నేను వెళ్లిపోవాలి ఏమైనా తినాలని ఆశగా ఉంటే చెప్పండి తెప్పిస్తాను రేపటి నుండి జైల్లో పుట్టినదే తినాలి అని అడిగారు . 

సర్ ఇప్పటివరకూ ఎవ్వరూ చెయ్యని సహాయం చేస్తూ వచ్చారు . మమ్మల్ని హాంతకులుగా మీరు ఏమాత్రం చూడలేదు అదిచాలు సర్ మీ మేలుని ఎప్పటికీ మరిచిపోము అని చేతులెత్తి నమస్కరించాము . మమ్మల్ని ఆప్యాయంగా కౌగిలించుకుని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి . వాళ్ళవల్ల ఎటునుండైనా ఆపద రావచ్చు . మీరు ఉన్నది పాపం పుణ్యం తెలియని నేరగాళ్ల మధ్యన అని జాగ్రత్తలు చెప్పి నీళ్లు తాగమని అందించి మాగురించే కొద్దిసేపు జైలర్ గారితో మాట్లాడి , వెళతాను మహేష్ , కృష్ణ రేపు ఉదయం జైల్ స్కూల్లో చేర్పిస్తారు బాగా చదువుకోండి అని చెప్పి వెళ్లిపోయారు . 

జైలర్ గారు మరొకసారి మా పేర్లను తలుచుకొని జైల్లోని కానిస్టేబుల్ ను పిలిచి శుభ్రన్గా ఉన్న లాకప్ లో ఉంచమని చెప్పి పంపారు .



మమ్మల్ని లోపల వేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు . వెళ్లి గోడకు ఆనుకుని కూర్చుని ఈ సమయంలో అక్కయ్య ఏమిచేస్తోందో , కన్నీళ్ళతో ఎంత బాధపడుతోందో , నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలదా అని కన్నీళ్ళతో బాధపడుతోంటే , కృష్ణగాడు నాప్రక్కనే కూర్చుని రేయ్ మహేష్ నువ్వు ఏడుస్తుంటే నా కళ్లల్లో నీళ్లు వస్తున్నాయిరా ............., అక్కయ్య కోసం అడుగు ముందుకువేశాము ఇక వెనుతిరిగిచూడకూడదు రా , నువ్వు ఇక్కడ ఏడిస్తే అక్కయ్య మరింత బాధపడుతూ ఉంటుంది అనిచెప్పడంతో కన్నీళ్లను తుడుచుకుని హత్తుకొని వదిలి గోడకు ఆనుకుని కూర్చున్నాము . 

నా బాదని తగ్గించడం కోసం రేయ్ మహేష్ ........... తిరుపతిలో అక్కయ్యను ఎలా కలిసావో ఇప్పటికీ నాకు తెలియదు please చెప్పరా అని అడిగాడు . 

అంతే నా పెదాలపై చిరునవ్వు చిగురించడంతో , హమ్మయ్యా ........అనుకుని చెప్పరా please చెప్పరా అని అడిగాడు .

అక్కయ్యా , అమ్మావాళ్ళు దర్శనం చేసుకుని రైల్వేస్టేషన్ లో అడుగుపెట్టడం దగ్గర నుండి మొదలెట్టి చెబుతూ చెబుతూనే , రాత్రి నిద్రలేక ఉదయం నుండి తీరికలేక ఒకరి భుజంపై మరొకరము నిద్రపోయాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-04-2020, 05:51 AM



Users browsing this thread: 62 Guest(s)